నాట్స్కు ఎప్పుడూ నా మద్దతు ఉంటుంది: పురందేశ్వరి | NATS invites Purandeswari for America telugu sambaralu | Sakshi
Sakshi News home page

నాట్స్కు ఎప్పుడూ నా మద్దతు ఉంటుంది: పురందేశ్వరి

Published Sat, Apr 29 2017 10:28 AM | Last Updated on Tue, Sep 5 2017 9:59 AM

నాట్స్కు ఎప్పుడూ నా మద్దతు ఉంటుంది: పురందేశ్వరి

నాట్స్కు ఎప్పుడూ నా మద్దతు ఉంటుంది: పురందేశ్వరి

సంబరాలకు రావాలని దగ్గుబాటి కుటుంబానికి నాట్స్ ఆహ్వానం
హైదరాబాద్: అమెరికా తెలుగు సంబరాలకు సమయం దగ్గరపడుతున్న వేళ(జూన్ 30 నుంచి జులై 2 వరకు).. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తెలుగురాష్ట్రాల్లో ఆహ్వానాల ప్రక్రియను వేగవంతం చేసింది. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరిని కలిసిన నాట్స్ బృందం సంబరాలకు రావాలంటూ ఆహ్వానాన్ని అందించింది. పురందేశ్వరితో పాటు ఆమె భర్త.. సీనియర్ రాజకీయ నాయకులు దగ్గుబాటి వెంకటేశ్వరరావును కూడా సంబరాలకు ఆహ్వానించింది.

నాట్స్తో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా దగ్గుబాటి పురందేశ్వరి గుర్తు చేసుకున్నారు. నాట్స్ చేసే సేవా కార్యక్రమాలకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు.  నాట్స్ ఆహ్వానాలను అందించిన వారిలో నాట్స్ అధ్యక్షుడు మోహనకృష్ణ మన్నవ, నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ రవి అచంట తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement