ముస్లిం మహిళా చైతన్య కెరటం | opinion on muslim women meeting by mallepally laxmaiah | Sakshi
Sakshi News home page

ముస్లిం మహిళా చైతన్య కెరటం

Published Thu, Oct 27 2016 12:48 AM | Last Updated on Tue, Oct 16 2018 5:59 PM

ముస్లిం మహిళా జమాత్‌ సమావేశంలో దావూద్‌ షరీఫా ఖానమ్‌ (కుడిపక్క వెనుకకు తిరిగి కూర్చున్నవారు) - Sakshi

ముస్లిం మహిళా జమాత్‌ సమావేశంలో దావూద్‌ షరీఫా ఖానమ్‌ (కుడిపక్క వెనుకకు తిరిగి కూర్చున్నవారు)

పురుషులు నిర్వహిస్తున్న జమాత్‌లను ఖురాన్‌ నిజ స్ఫూర్తితో నిర్వహించకపోవడం వల్లనే మహిళా జమాత్‌లు అవసరమయ్యాయని షరీఫా అభిప్రాయం.

కొత్త కోణం
పురుషులు నిర్వహిస్తున్న జమాత్‌లను ఖురాన్‌ నిజ స్ఫూర్తితో నిర్వహించకపోవడం వల్లనే మహిళా జమాత్‌లు అవసరమయ్యాయని షరీఫా అభిప్రాయం. ప్రవక్త కాలంలో మహిళలకు మసీదులలో ప్రవేశం ఉండేదని, ప్రవక్తే స్వయంగా అందరికీ సందేహ నివృత్తి చేసే వారని ఆమె అన్నారు. అటువంటి ఇస్లాంను కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని ఆమె భావన. షరీఫా నేతృత్వంలోని ‘స్టెప్స్‌’ ప్రత్యేక మహిళా జమాత్‌లను నిర్వహిస్తూనే, దేశంలోని తొలి మహిళా మసీదు నిర్మాణానికి పూనుకుంది.

అక్కడ మా గురించే మాట్లాడతారు. కానీ అక్కడ మేం ఉండం. చర్చలన్నీ మా చుట్టూతే సుడులు తిరుగుతుంటాయి. కానీ మేం అగుపించం. మా గురించే తీర్పులుంటాయి. తప్పులకు శిక్షలూ, క్షమాపణలూ ఉంటాయి. కానీ ఆ కనుచూపు మేరలోనైనా మేముండే అవకాశమేలేదు. కనీసం మా దుఃఖాన్నో, సంతోషాన్నో, ఆవేదననో, ఆక్రందననో వినిగలిగే వారుంటే... మేమిది అసలు ఆలోచించి ఉండేవారం కామేమో. మా ప్రమేయమే లేకుండా, మా పైన, మా గురించి, మా చుట్టూ సాగుతోన్న న్యాయాన్యాయ నిర్ధారణను, తీర్పులను మేం తిరగరాయాలనుకున్నాం. మా రాతలను మేమే సరిదిద్దు      కోవాలనుకున్నాం. అప్పుడప్పుడే  మేల్కొన్న మా మస్తిష్కాలకు పనిచెప్పాం. మేం కూడా ఉండడం కాకుండా మేం మాత్రమే ఉండే మా జమాత్‌లను (సభలను) మా శక్తియుక్తులతో నిర్మించుకున్నాం. 13 ఏళ్ళ క్రితం మేం నిర్మిం చిన మా ఆశల సౌధం మా ముస్లిం మహిళలకు భరోసానిచ్చింది. మాకు న్యాయం జరుగుతుందన్న ఆశకు అంకురార్పణ చేసింది. ఇప్పుడు మాది తమిళనాడులోనే కాదు, దేశంలోనే తొట్టతొలి మహిళా జమాత్‌. ఈ మాట లన్నది మహిళా జమాత్‌ (మహిళా సభ) ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఓ సాధారణ మహిళ దావూద్‌ షరీఫా ఖానమ్‌.

ముస్లిం మహిళ సంఘటిత శక్తికి నిలువుటద్దం
తమిళనాడు పుదుకొట్టయ్‌ జిల్లా కేంద్రంలోని ఒక పేద కుటుంబంలో జన్మిం చిన ఆమె, చదివింది పదవ తరగతే. 1987లో ఆమె ఒక జాతీయ మహిళా సదస్సుకు హాజరయ్యారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన వివిధ వర్గా లకు చెందిన మహిళలు తమ బాధల, అవమానాల,  వివక్షల, ఆంక్షల గాథ లను  విని ఆమె నివ్వెరపోయారు. మహిళలుగా తాము ఎంత అమాయ కంగా, అజ్ఞానంతో ఉన్నామో అవగతమయ్యింది. అదేసమయంలో దేశ వ్యాప్తంగా  ఊపందుకుంటున్న సాక్షరతా ఉద్యమ కార్యకర్తగా షరీఫా చేరారు. ఆమె ముఖ్యంగా ముస్లిం మహిళలను అక్షరాస్యులను చేయడానికి ప్రత్యేక శిబిరాలను నిర్వహించారు. అలా నిత్యం కలుసుకునే ముస్లిం మహిళలు తమ బాధలను ఒకరితో ఒకరు పంచుకునే వారు. ఆ క్రమంలోనే షరీఫా ముస్లిం మహిళల హక్కుల కోసం 2003లో ‘స్టెప్స్‌’ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ముస్లిం మహిళలకు సామాజిక అంశాలపైన, తమ హక్కుల పైన అవగాహన కలిగించడంపైన, వారి ముఖ్య సమస్యలపైన స్టెప్స్‌ దృష్టిని కేంద్రీకరిం చింది. నిరక్షరాస్యత ముస్లిం మహిళలను మరింతగా వివక్షకు గురిచేస్తున్నదని గుర్తించింది. అందుకే ముస్లిం మహిళలను వారి హక్కులపై చైతన్యవంతం చేయడానికి దీర్ఘకాలిక కార్యక్రమాన్ని చేపట్టింది.

దీంతో పలు గ్రామాలు, పట్టణాల నుంచి ఎంతో మంది ముస్లిం స్త్రీలు వివిధ సమస్యలపై స్టెప్స్‌ని సంప్రదించడం మొదలైంది. అందులో మూడు తలాక్‌లు (ట్రిపుల్‌ తలాక్‌), వరకట్నం, మెహర్‌ (కన్యాశుల్కం), గృహ హింస, లైంగిక హింసలకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా ఉండేవి. అయితే ఈ సమస్యలను పరిష్కరించే కృషిలో మసీదుల నిర్వహణ కోసం ఏర్పడిన జమా™Œ లకు, స్టెప్స్‌కు మధ్య విభేదాలు తలెత్తేవి. ముస్లిం మహిళపై అత్యాచారాలకు, హింసకు సంబంధించిన పోలీసు కేసుల విషయంలో కూడా జమాత్‌లు జోక్యం చేసుకోవడాన్ని ఆ ముస్లిం మహిళా సంస్థ జీర్ణించుకోలేక  పోయింది. ముస్లిం జమాత్‌లే ఆ విషయాలను చూసుకుంటాయని పోలీసులు స్టెప్స్‌ కార్యకర్తలకు తేల్చి చెప్పేవారు. దీంతో ప్రత్యేకంగా మహిళా జమాత్‌ లను ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదన్న ఆలోచన స్టెప్స్‌లో మొదలైంది. మసీదుల జమాత్‌లలో మహిళలకు నిజమైన ప్రాతినిధ్యం, భాగస్వామ్యం లేనందువల్లనే ముస్లిం మహిళలు న్యాయానికి నోచుకోవడం లేదనే నిర్ధార ణకు వచ్చారు. అది కార్యరూపం దాల్చడం వల్లనే నేడు తమిళనాడులోని పది జిల్లాల్లో మహిళా జమాత్‌లు చురుగ్గా పనిచేస్తున్నాయి. దాదాపు పదిహేను వేల మంది సభ్యులతో ముస్లిం మహిళా జమాత్‌లు ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణో ద్యమాన్ని చేపట్టాయి. ప్రతి పట్టణంలో, జిల్లాలో ప్రత్యేక సమాఖ్యలు ఏర్పాట వుతున్నాయి. స్థానిక మహిళా సమస్యల విషయంలో ఆయా జిల్లాల కమి టీలు పరిష్కారం కోసం ప్రయత్నిస్తాయి. విధాన నిర్ణయాలను చేసేది మాత్రం పుదుకొట్టయ్‌లోని ప్రధాన కేంద్రమే.

బెదిరింపులకు బెదరదు
మహిళా జమాత్‌లు మూడు స్థాయిలలో పనిచేస్తాయి. ఒకటి గ్రామ, పట్టణ, నగర స్థాయి.  రెండు, జిల్లా స్థాయి. మూడు, రాష్ట్ర స్థాయి. రాష్ట్ర స్థాయిలో సెమినార్‌లు, సదస్సులు నిర్వహించి, కార్యర్తలకు అవగాహన కలి గిస్తారు. మంత్రులు, ఉన్నతాధికారులకు తమ సమస్యలపైన నివేదికలు అందజేస్తారు. స్థానిక స్థాయిలో సాధారణ, ముస్లిం మహిళలను చైతన్య వంతం చేయడానికి వీధి సమావేశాలు నిర్వహిస్తారు. చిన్న చిన్న కరపత్రాల ద్వారా వారిలో అవగాహనను పెంచడానికి కృషి చేస్తారు. ఈ సంస్థ ‘ఉమెన్స్‌ జమాత్‌’ అనే పత్రికను కూడా నడుపుతోంది. ఏటా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ట్రిపుల్‌ తలాక్, వరకట్న నిషేధం, మెహర్, ఖులా (మహిళలు విడాకుల కోసం చెల్లించాల్సిన శుల్కం) తదితర అంశాలపై ప్రభుత్వానికి, వక్ఫ్‌ బోర్డ్, ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌ లాంటి ముస్లిం సంస్థలకు విజ్ఞప్తులను అందజేస్తారు. వాటికి ఆయా సంస్థల స్పందనను డిమాండ్‌ చేస్తారు. ఈ మహిళా జమాత్‌ల నిర్మాణంలో శ్రామిక మహిళల పాత్ర ఎక్కువ కావడం విశేషం. విద్యకన్నా విజ్ఞతకే వారు ప్రాధాన్యాన్నిస్తారు. ఆశయ సాధన కోసం అంకిత భావంతో పనిచేసే తెగువా, చైతన్యమే అర్హత.
ఈ ఉద్యమ ప్రస్థానాన్ని దీపా ధన్‌రాజ్‌ రెండేళ్ల నిర్విరామ కృషితో డాక్యు మెంటరీగా చిత్రీకరించారు. ముస్లిం మహిళలెదుర్కొంటున్న సమస్యల సజీవ చిత్రాలను అందులో పొందుపరచారు. మహిళా జమాత్‌ అనుసరిస్తున్న ఎత్తు గడలను చాలా చక్కగా చిత్రీకరించారు. అత్తగారింట్లో వేధింపులకు గురైన ఒక మహిళ హత్య కేసులో అసలు దోషి అత్తగారేనని ముస్లిం మహిళా జమాత్‌ బయటపెట్టిన తీరు గమనార్హం. పురుషుల ఆధిపత్యంలోని జమాత్‌ సహజం గానే ఈ కేసులో అత్తగారి కుటుంబాన్ని రక్షించడానికి ప్రయత్నించింది. అయితే మహిళా జమాత్‌ మగవారి ఆధిపత్యంలోని జమాత్‌తో విభేదించిందే తప్ప వారి పట్ల విద్వేషాన్ని ప్రదర్శించలేదు, ఘర్షణాత్మక వైఖరి చేపట్టలేదు. స్టెప్స్‌ ఆధ్వర్యంలోని మహిళా జమాత్‌ కార్యకర్తలు హత్యకు గురైన మహిళ కుటుంబానికి న్యాయం చేయాలని, దోషులను శిక్షించడానికి సహకరించాలని జమాత్‌ను కోరారు. వారు ససేమిరా అందుకంగీకరించకపోవడంతో మహిళా జమాత్‌ మరింత పట్టుదలతో ముందుకు సాగింది. అలా మొత్తంగా తమిళనా డులోని వందలాది గ్రామాల్లో మహిళా జమాత్‌ ముస్లిం మహిళల హృదయా లను గెలుచుకుంది.

ఖురాన్‌ అసలు స్ఫూర్తే మార్గదర్శిగా...   
ప్రధానంగా దక్షిణ తమిళనాడులో ఈ ఉద్యమం ముస్లిం మహిళలకు ఎంతో ధైర్యాన్ని,  భరోసాను కలిగించింది. స్త్రీలకు సంబంధించిన కేసులన్నీ మహిళా జమాత్‌లను వెతుక్కుంటూ రావడమే అందుకు నిదర్శనం. మహిళా జమా త్‌ల వారం వారం సమావేశాల్లో తక్షణ సమస్యలతో పాటూ ఖురాన్, షరి యత్‌ లాంటి ముఖ్య విషయాలపై కూడా లోతైన చర్చలు జరుగుతాయి. మహిళా జమాత్‌లు ఖురాన్‌ నిజమైన స్ఫూర్తితో పని చేయడం అవసరమని భావిస్తున్నాయి. పురుషులు నిర్వహిస్తున్న జమాత్‌లను ఖురాన్‌ అసలు స్ఫూర్తితో నిర్వహించకపోవడం వల్లనే మహిళా జమాత్‌లు అవసరమయ్యా యని షరీఫా అభిప్రాయం. ఇస్లాం వ్యవస్థాపకులు మహ్మద్‌ ప్రవక్త సమ యంలో మహిళలకు మసీదులలో ప్రవేశం ఉండేదని, అక్కడికి వచ్చిన వారం దరి సందేహాలకు ప్రవక్త స్వయంగా సందేహ నివృత్తి చేసేవారని షరీఫా అభిప్రాయం. ప్రవక్త భార్య ఆయీషా ముస్లిం మహిళలందరికీ ఆదర్శమని, అటువంటి సాంప్రదాయం కలిగిన ఇస్లాంను కొంత మంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని షరీఫా పేర్కొన్నారు. ప్రత్యేక మహిళా జమాత్‌లను నిర్వహిస్తూనే, రెండోవైపు మహిళా
మసీదులను నిర్మించడానికి ఈ సంస్థ పూనుకుంది. పుదుకొట్టయ్‌లో మహిళల మసీదు నిర్మాణం కోసం షరీఫా తన సొంత డబ్బుతో భూమిని కొని సంస్థకు అందజేశారు. దేశంలోని మొట్టమొదటి మహిళా మసీదు నిర్మాణ పనులు దాదాపు 75 శాతం పూర్తయ్యాయి.

దేశవ్యాప్తంగా విస్తరించాలి
ఈ ఉద్యమ నిర్మాణంలో షరీఫా ఆమె సహచరిణులు ఎదుర్కొన్న ఇబ్బం దులు అన్నీ ఇన్నీ కావు. గిట్టనివారు వారి కుటుంబాలలో కలతలను సృష్టించ డంతో పాటు, వ్యక్తిగత దుష్ప్రచారానికి దిగారు. ప్రాణాలతో విడిచిపెట్టమని బెదిరింపులకు కూడా గురయ్యారు.  అయినా ముస్లిం మహిళలు వెనుకడుగు వేయలేదు. కొందరు ప్రజాస్వామికవాదులు, ప్రభుత్వాధికారులు, స్థానిక మీడియా ప్రతినిధులు వారికి సంపూర్ణ మద్దతునిచ్చారు. జాతీయ, అంత ర్జాతీయ స్థాయి సంస్థలు సైతం వారికి  దన్నుగా నిలిచాయి. అన్ని అడ్డం కులనూ అధిగమించే ఆత్మసై్థర్యం వారిలో పెంపొందడానికి ఇది కూడా కార ణమే. నేడు దేశంలోని ఒక చిన్న ప్రాంతానికి పరిమితమైన ఈ ఉద్యమం భవిష్యత్తులో ముస్లిం సమాజంలో సంస్కరణలకు పునాది రాయి కాగలదు. మతంలోని మంచిని మిగుల్చుకొని, కాలానికి అనుగుణంగా మార్చుకోవా ల్సిన అంశాలను మార్చుకునే శక్తిగల సమాజ ఆవిర్భావానికి మహిళా జమాత్‌ ఉద్యమం ఒక ప్రేరణగా నిలుస్తోంది. ఈ ఉద్యమ ప్రభావం వల్ల ముస్లిం సమాజంలోని శ్రామిక వర్గం అనుకూలంగా స్పందిస్తోందని తెలుస్తోంది. మసీద్‌ జమాత్‌లు సైతం గతంలోవలే ఏకపక్షంగా గాక, కొంత హేతు బద్దంగా వ్యవహరిస్తుండటం విశేషం. తమిళనాడు తరహా ముస్లిం మహిళా జమాత్‌ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించడం అవసరం. ఇప్పటికే ఉత్తర భారతంలో కొందరు విద్యావంతులైన ముస్లిం మహిళలు ఈ దిశగా మేధో పరమైన చర్చలకు తెరతీసారు.  ప్రజాస్వామిక, సమన్యాయ వ్యవస్థ రూప కల్పనకు షరీఫా లాంటి మహిళల సాహసోపేత కార్యాచరణ మార్గనిర్దేశన కాగలదని ఆశిద్దాం.

వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య
మొబైల్ : 97055 66213

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement