కొత్త రాజకీయ వ్యవస్థ కావాలి | Prem Shankar Jha opinion on kashmir issue | Sakshi
Sakshi News home page

కొత్త రాజకీయ వ్యవస్థ కావాలి

Published Sat, May 6 2017 1:23 AM | Last Updated on Tue, Sep 5 2017 10:28 AM

శ్రీనగర్‌లోని ఓ ఆసుపత్రి నుంచి బయటకు వస్తున్న మహిళలు (ఫైల్‌ ఫొటో)

శ్రీనగర్‌లోని ఓ ఆసుపత్రి నుంచి బయటకు వస్తున్న మహిళలు (ఫైల్‌ ఫొటో)

కశ్మీర్‌ విలీన ఒప్పందం, 1952 ఢిల్లీ ఒప్పందాల ప్రాతిపదికపై కశ్మీర్‌కు, కేంద్రానికి మధ్య  సంబంధంపై తిరిగి ఒక ఒప్పందానికి రావడానికి సిద్ధమేనని కేంద్రం బహిరంగంగా చేసే ప్రకటనే అందుకు తగినది. అందువలన నేడు చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం కాగల కీలక సమస్య... జమ్మూ, లడక్‌ ప్రజల నుంచి ఏమీ లాగేసుకోకుండానే కశ్మీర్‌ను కశ్మీరీ లకు, కశ్మీరీలకు మాత్రమే అప్పగించే కశ్మీర్‌ ప్రభుత్వాన్ని అందించగల వ్యవస్థ ఆ రాష్ట్రానికి అవసరం. ఈ జటిల సమస్యను పరిష్కరించగలిగేది జమ్మూకశ్మీర్‌ ప్రజలే.

ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 22, 2016న ఒమర్‌ అబ్దుల్లా నేతృత్వంలో వచ్చిన కశ్మీరీ ప్రతినిధి బృందాన్ని కలుసుకున్నారు. ఆ సందర్భంగా ఆయన వారాల తరబడి కొనసాగుతున్న అశాంతికి స్వస్తి పలకాలంటే చర్చలు జరపడం ‘తప్పనిసరి’ అని నిర్ద్వంద్వంగా చెప్పారు.  ‘‘రాజ్యాంగం పరిధిలో ఈ సమస్యకు శాశ్వతమైన, సుస్థిరమైన పరిష్కారాన్ని కనుగొనడం అవ సరం’’ అని కూడా అన్నారు. ఈ అంశాన్ని 8 నెలలు అయిన తరువాత ఇన్నాళ్లకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మళ్లీ ప్రస్తావిస్తున్నారు. ఈ మాత్రం అంగీకారం అయినా ఎంత అయిష్టంతో తెలిపినదంటే అందులో చిత్తశుద్ధి ఉన్నదని విశ్వసిస్తున్నవారు స్వల్పం. పీడీపీ ప్రభుత్వాన్ని రద్దుచేసి, గవర్నర్‌ పాలనను విధించడం వల్ల ఉపయోగమేమీ లేదని, ప్రభుత్వం ముందుగా ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలతో చర్చలు జరపడానికి మాత్రమే తాను అంగీకరించగలిగాననీ, వేర్పాటువాదులతో చర్చలు ‘ఆ తర్వాత ఎప్పుడో’ జరగవచ్చునని జమ్ముకశ్మీర్‌ గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోరా చెప్పారు.

చర్చల ప్రతిపాదనలో చిత్తశుద్ది ఎంత?
షరతులతో కూడిన ఇలాంటి ప్రతిపాదనలో చిత్తశుద్ధి ఉన్నదని ప్రభుత్వం ఎలా అనుకుంటుంది? ప్రధాన స్రవంతి పార్టీలతో చర్చలు ఇప్పుడు సాధ్య మయ్యేట్టయితే, కశ్మీర్‌లోయలో కొంత ప్రశాంతత తిరిగి నెలకొన్న చలి కాలంలో అది ఎందుకు సాధ్యం కాలేదు? అక్టోబర్లో లోయలో పర్యటించి వచ్చిన బీజేపీకి చెందిన మాజీ విదేశాంగమంత్రి, ఆర్థిక మంత్రి యశ్వంత్‌సిం గ్‌ను కలుసుకోడానికి సైతం మోదీ ఎందుకు నిరాకరించారు? శ్రీనగర్, అనం త్‌నాగ్‌ ఉప ఎన్నికలను వాయిదా వేయమని దాదాపుగా దీనంగా అడుక్కుం టున్నట్టుగా మెహబూబా మఫ్తీ రాసినా మోదీ ఎందుకు పెడచెవిన పెట్టారు? శ్రీన గర్‌ నరమేధం జరిగిన వెంటనే మెహబూబా ఢిల్లీకి వచ్చి... కశ్మీర్‌ మరొక తిరుగుబాటులోకి దిగజారిపోయేలోగా ప్రభుత్వానికి చర్చలు జరపడానికి మహా అయితే రెండు లేదా మూడు నెలలే ఉంటాయని మోదీ, రాజ్‌నాథ్‌ సింగ్‌లు ఇద్దరినీ హెచ్చరించారు.

‘వేర్పాటువాదుల’తో ఎలాంటి చర్చలూ జరిపేది లేదని ఇద్దరూ ఆమె మాటను ఎందుకు కొట్టి పారేసినట్టు? ఇక చివరగా, కశ్మీర్‌ సమస్యపై బహుముఖ చర్చలకు ఏర్పాటు చేస్తామని టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ ప్రతిపాదిస్తే... అంతే మొరటుగా అది ద్వైపాక్షిక సమస్య మాత్రమేనని నొక్కి చెప్పలేదా? కశ్మీరీల ఆజాదీ కోరికను పాశవిక బలప్రయోగంతో అణిచిపారేయడమే తప్ప కశ్మీరీలకు నచ్చజెప్పగ లిగే కృషిని ఏమీ గత ఎనిమిది నెలలుగా మోదీ చేయలేదు. అసలు ఆయనకు ఆ ఉద్దేశమే లేదనేది స్పష్టంగా కనిపించే వాస్తవం. ఇక వారి కోరికను ఏదో ఒక మేరకు తీర్చడం గురించి చెప్పనవసరమే లేదు.

పీడీపీతో కూటమికి సంబం ధించిన ఎజెండాలో తాము చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని అది అనునిత్యమూ నిలబెట్టుకోలేకపోతూనే వచ్చింది. పైగా గత మూడేళ్ల మోదీ ప్రభుత్వ పాల నలో మొరటు మతతత్వవాదం ప్రబలింది. ఇవి రెండూ కలసి మోదీ ప్రభుత్వానికి అణచివేత తప్ప మరే పద్ధతిని ప్రయోగించే ఉద్దేశమే లేదనే నమ్మకాన్ని మరింతగా బలోపేతం చేశాయి. కశ్మీరీ ప్రజలు భారత యూని యన్‌లో భాగంగా తమ రాజకీయ అవకాశాలను పెంపొందింపజేసు కోవా లని పోరాడుతుండగా... బీజేపీ ప్రభుత్వం మిగతా భారతమం తటా రాజ కీయ అవకాశాలను పీల్చేస్తూ వస్తోంది. మంచీచెడు విచక్షణే లేకుండా ప్రతి సాధనాన్నీ ప్రయోగిస్తూ అది తన రాజకీయ ప్రత్యర్థులను నిరంతరాయంగా వేధిస్తోంది, బెదిరిస్తోంది.

లౌకికత్వాన్ని, చట్టబద్ధతను పునరుద్ధరించాలి
కశ్మీరీలు లౌకికతత్వ భారతంలో భాగంగా ఉండాలని 1947లో కోరు కున్నారు. శతాబ్దిలో దాదాపు ఏడు దశాబ్దాలుగా వారు భారత యూనియన్‌ ఆ అదర్శానికి కట్టుబడి ఉన్నదనే విషయాన్ని సందేహించలేదు. కానీ నేడు బహుత్వవాదం, లౌకికవాదాలపై ఆర్‌ఎస్‌ఆర్‌ఎస్, తన ముసుగు సంస్థ లతో ఒక క్రమపద్ధతిలో దాడులను ఎక్కుపెట్టిస్తుండటాన్ని వారు చూస్తు న్నారు. మరోపక్క వేగంగా ఉద్రిక్తంగా మారుతున్న దేశంలో మోదీ ఆదర్శ వాది పాత్రను పోషిస్తున్నారు. గోరక్షకులు తదితర నిఘా బృందాలు ముస్లిం కుటుంబాలు, ముస్లిం వృత్తులపై, వారి జీవనోపాధులపై దాడులను సాగించ  డాన్ని చూస్తున్నారు. బీజేపీ రాజకీయప్రత్యర్థులను తప్పుడు అరెస్టులు, అవమానాలు, చిత్రహింసలతో వేధించడానికి అనువుగా చట్టాన్ని, దర్యాప్తు క్రమాలను ఎటుబడితే అటు వంచడాన్ని వారు చూస్తున్నారు. ఈ దురాగతా లకు పాల్పడుతున్నవారిని స్వేచ్ఛగా వదిలేసి వారు మరింత అరాచకాన్ని సృష్టించడాన్ని అనుమతించడాన్ని కూడా వారు చూస్తున్నారు. ఇక వారు ఈ ప్రభుత్వం, ప్రత్యేకించి ప్రధాని ఇప్పుడు ఒకేసారిగా తమ తీరును పూర్తిగా తలకిందులు చేసి, కశ్మీరీ ముస్లింలతో కొత్త ఒప్పందం కోసం చర్చలు జరుపుతారని వారు నమ్మడం ఎలా సాధ్యం?

మోదీపై కశ్మీరీలలో ఏ ఒక్కరికీ ఏ కొద్ది మాత్రమూ నమ్మకం లేదనేది నగ్న సత్యం. చర్చలంటూ ఆయన చేస్తున్న వాగ్దానం కేవలం కాల విలంబన కోసమేనని వారిలో ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. అందువల్ల, కశ్మీర్‌లోని మతపరమైన బహుత్వవాదానికి భారత్‌ కట్టుబడి ఉన్నదనే నమ్మకాన్ని కలి గించడమే ప్రభుత్వ మొదటి కర్తవ్యం అవుతుంది.

కశ్మీర్‌లో కూడా చట్టబద్ధ పాలన నెలకొంటుందని కశ్మీరీలకు నమ్మకం కలగడం మొదలు కావాలంటే ముందుగా భారత్‌లో చట్టబద్ధ పాలన తిరిగి అమలు కావాలి. హిందూయిజం పేరిట సాగే ప్రతి నిఘా దురాగతాన్ని మోదీ ఖండించాలి, వాటికి పాల్పడ్డవారిపై చట్టపరంగా తీవ్ర చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించాలి. గోరక్షకులు, ‘లవ్‌జిహాద్‌’కు వ్యతిరేకులు, తదితరు లమని చెప్పుకుంటున్న వారిని శిక్షించడం అందుకు మంచి ప్రారంభం అవు తుంది. ఇక కశ్మీర్‌లో మొదట చేయాల్సిన పని, 2000 డిసెంబర్లో వాజపేయి చేసినట్టు ఏకపక్ష కాల్పుల విరమణను ప్రకటించాలి. దాన్ని అనుసరించి జైళ్లలో ఉన్న వందలాది మంది రాళ్లురువ్వేవా రుగా అరెస్టయిన యువకులను విడుదల చేసి, వారిపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలి.

అర్థవంతమైన చర్చలేవైనా జరగాలీ అంటే కావాల్సింది చర్చలలో పాల్గొనే భాగస్వామి, సుస్పష్టంగా నిర్వచించిన చర్చనీయాంశాలు తప్ప నిసరి. చర్చలకు భాగస్వామి దొరకడం తేలికేం కాదు. ఎందుకంటే 2014లో హురియత్‌ను బహిరంగంగా అవమా నించారు, ఆ తర్వాత వారితో మాట్లా డటానికే నిరాకరిస్తున్నారు, మోదీ దాదాపుగా వారిని ఈ సందర్భంగా ఏ విలువలేని వారుగా మార్చినంత పనిచేశారు. కౌమార్యపు యువత నేతృ త్వంలో గత ఏడాది జూలైలో జరిగిన తిరుగుబాటు సందర్భంగా అది స్పష్టమైంది. వారు తమ తల్లిదండ్రును ధిక్కరించడమే కాదు, అప్పు డప్పుడూ బెదిరించారు కూడా. ఇక హురియత్‌ నేతలు వెన్నెముకే లేని ముసలి సజ్జు అని బహిరంగంగా అవహేళన చేశారు. అంతేకాదు, ఈ పరిస్థితి ముగ్గురు ప్రధాన వేర్పాటువాద నేతలను ఒక్కటి చేసింది. తద్వారా మోదీ ప్రభుత్వం వారి నాయకత్వానికి లోయలో కొంత మేరకు నమ్మకాన్ని కలి గించింది.

చర్చల విషయంలో కేంద్రానికి నిజంగానే గట్టి పట్టింపు ఉంటే కశ్మీర్‌ ప్రజలకు చర్చల ద్వారా తాము చేసే వాగ్దానాలను వారిచేత నమ్మించగలిగిన వారికే చర్చలను పరిమితం చేయాలి. బాగా కేంద్రానికి లోబడినవారుగా పీడీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌లు ఎంతగా అప్రతిష్టపాలైనా వాటికి ఇంకా కొంత మద్దతు ఉంది. యూసుఫ్‌ తరిగమి, ఇంజనీర్‌ రషీద్‌ వంటి గౌరవనీయులైన వ్యక్తులూ ఉన్నారు. కశ్మీర్‌ ప్రజలు ఎవరు చెబితే వింటారో అలాంటి చర్చల భాగస్వామిని సృష్టించదలుచుకుంటే కేంద్రం వారందరితో మాట్లాడాలి. అయితే అది వేర్పాటువాదులకు వ్యతిరేకంగా ప్రధాన స్రవంతి పార్టీలను దారంగా ఉంచడం అనే పనిని ఎలాంటి పరిస్థితుల్లోనూ చేయరాదు. గత 21 ఏళ్లుగా ప్రతి ప్రభుత్వం చేసినది అదే. గతంలోలా తిరుగుబాటుతో ప్రభా వితంకాని ఇతర ప్రాంతాలు, బృందాల ప్రయోజనాలను విస్మరించడానికి వీల్లేదు. రాష్ట్రంలో ప్రయోజనాలున్న ప్రతి వర్గాన్ని, బృందంతోను ‘వేర్పాటు వాదు’లతో కూడా సంప్రదించాలి. వీరందరితో ఒకేసారి చర్చిస్తే వ్యర్థ ప్రసం గాలు తప్ప ఒరిగేదేమీ ఉండదు.

చర్చలు ఫలప్రదం కావాలంటే...
1990లలోని తిరుగుబాటు తొలిరోజుల నుంచి లాంఛనప్రాయంగానూ, దొడ్డిదారిన కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయినా ఇంతవరకూ సాధించేదేమీ లేదు. హురియత్‌ కీలక నేతలను, వారి సన్నిహిత బంధువులను హతమార్చి పాక్‌ ఆ సంస్థను భీతావహానికి గురిచేసింది, ప్రతి ఎన్నికలను వారు బహిష్కరించేట్టు చేసింది. ‘వేర్పాటువాదులు’ కేవలం ఏదో లెక్కలోకి రాని చిన్న గ్రూపేనని, పాక్‌ వారిని పెంచిపోషిస్తోందని, వారికంటూ సొంత బుర్రేమీ లేదని కేంద్రంలోని ప్రతి ప్రభుత్వాన్ని నమ్మించడానికి నేషనల్‌కాన్ఫ రెన్స్‌ ప్రయత్నించింది.

అందువల్ల కశ్మీరీ జాతీయవాదులు 1990ల తిరగుబాటు అంతమైనçప్ప టినుంచి ఇరకాటంలో పడ్డారు. కశ్మీర్లో ఏ ఒక్కరూ విస్మరించలేని వారితో కేంద్రమే చర్చలు జరపడానికే కేంద్రమే ముందుకు వస్తే తప్ప చర్చలకు అంగీకరించేవారెవరూ కశ్మీర్లో నేడు లేరు. కశ్మీర్‌ విలీన ఒప్పందం, 1952 ఢిల్లీ ఒప్పందాల ప్రాతిపదికపై కశ్మీర్‌తో కేంద్రానికి ఉన్న సంబంధంపై తిరిగి ఒప్పందానికి రావాడానికి సిద్ధమేనని కేంద్ర ప్రభుత్వం బహిరంగంగా చేసే ప్రకటన మాత్రమే అందుకు సరిపడుతుంది.

ఆ ఒప్పందాల ద్వారా కశ్మీర్‌ రక్షణ, విదేశాంగ విధానం, ఆర్థికవిధానం, సమాచార సంబంధాలు, మార్కెట్టు, విద్యావ్యవస్థలనే అంశాలపైనే భార త్‌లో వీలీనమైనంది. కాకపోతే ప్రభుత్వానికి సంబంధించిన వివరాల విషయంలో కశ్మీర్‌ స్వయంప్రతిపత్తిలో క్షీణత చోటుచేసుకుంది. పాలనాపరమైన శాసనా లతో లోయలో ఆచరణలో పోలీసు రాజ్యాన్ని విధిం^è డమే ఇందుకు ప్రధాన కారణం. అందువలన నేడు చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం కాగల కీలక సమస్య... జమ్మూ, లడక్‌ ప్రజల నుంచి ఏమీ లాగేసుకోకుండానే కశ్మీర్‌ను కశ్మీరీలకు, కశ్మీరీలకు మాత్రమే అప్పగించే కశ్మీర్‌ ప్రభుత్వాన్ని అందించగల వ్యవస్థ ఆ రాష్ట్రానికి అవసరం. lదీన్ని కేవలం జమ్మూకశ్మీర్‌ ప్రజలు మాత్రమే పరిష్కరించగలుగుతారు.

ప్రేమ్‌ శంకర్‌ ఝా
సీనియర్‌ పాత్రికేయుడు, రచయిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement