
బాలుడు విఘ్నేష్‌తో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్
సాక్షి, కాజీపేట: జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న విఘ్నేష్ శనివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశాడు. హ్యాపీ బర్త్ డే తాతయ్య అంటూ కేసీఆర్‌కు విషేష్ చెప్పాడు. బాలుడిని చూడగానే విఘ్నేష్ అంటూ కేసీఆర్ ఆప్యాయంగా అతడి భుజం తట్టాడు. షేక్ హ్యాండ్ ఇచ్చి.. ‘ఈ తాతయ్య నీ వెనుక ఉంటాడు.. అన్ని రకాల వైద్య చికిత్సలు చేయించి బతికించుకుంటా.. భయపడాల్సిన పనిలేదు.. అని ధైర్యం చెప్పారు.
అంతేకాకుండా అధికారులను పిలిచి.. ఖర్చుకు వెనుకాడకుండా విఘ్నేష్‌కు ఆర్థికసాయంతోపాటు వైద్యం అందించేలా చూడాలని ఆదేశించారు. చిన్నారిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని బాలుడి తల్లిదండ్రులు సరిత, సతీష్కు భరోసా ఇచ్చారు. సామాజికవేత్త చిలువురు శంకర్, బాలుడి నానమ్మ సక్కుబాయి తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment