ఉన్నత విద్య అభ్యసించే ఎస్సీ, ఎస్టీలకు ఉపకార వేతనాలు | Scholarships for SC / ST, which enrolls in higher education | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్య అభ్యసించే ఎస్సీ, ఎస్టీలకు ఉపకార వేతనాలు

Published Fri, Feb 9 2018 12:15 PM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

Scholarships for SC / ST, which enrolls in higher education - Sakshi

నిడమర్రు : ఉన్నత విద్యారంగంలో పలు కోర్సులు అభ్యసిస్తున్న ప్రతిభగల విద్యార్థులను అర్థికంగా ప్రోత్సహించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌(పీజీ) విద్యార్థులకు పలు రకాల ఉపకార వేతనాలు అందిస్తుంది. ఎస్సీ/ఎస్టీ విద్యార్థుల్లో ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో పీజీ స్థాయిలో చేరే విధంగా ప్రోత్సహించేందుకు ‘పీజీ స్కాలర్‌షిప్స్‌ ఫర్‌ ఎస్టీ, ఎస్సీ స్టూడెంట్స్‌ ఫర్‌ ఫ్రొఫెషనల్‌ కోర్సెస్‌’ అనే పేరుతో ఉపకార వేతనాలు యూజీసీ అందిస్తుంది. ఈ ఉపకార వేతనాల కోసం ఈ నెల 15వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.

ఉపకార వేతనం మొత్తం: రూ.50 వేలు (నెలకు రూ.5 వేల చొప్పున)
దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదీ: ఈ నెల 15

అర్హతలు ఇవి..
ఎస్సీ/ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన పీజీ స్థాయిలో విద్యా కోర్సులు చేస్తున్న విద్యార్థులు
వయోపరిమితి : పురుషులకు 45 ఏళ్లు, మహిళలకు 50 ఏళ్లు(  2018 జులై నాటికి )
స్కాలర్‌షిప్‌ వ్యవధి : రెండు/మూడేళ్లు (కోర్సు కాలాన్ని బట్టి)
మొదటి సెమిస్టర్‌లో 60 శాతం మార్కులు తçప్పనిసరిగా సాధించాల్సి ఉంటుంది.
సంబంధిత కోర్సుల్లో సెమిస్టర్‌ విధానంలో ఉపకార వేతనాలు అందిస్తారు. యూజీసీ నిర్దేశించిన విధంగా మార్కులు సాధిస్తేనే స్కాలర్‌షిప్‌ను కొనసాగిస్తారు. ఈ క్రమంలో రెండో సెమిస్టర్‌కు అర్హత పొందాలంటే మొదటి సెమిస్టర్‌లో 60 శాతం మార్కులు/తత్సమాన గ్రేడ్‌(జీసీఏ) సాధించాలి. ఇదే విధంగా మూడో సెమిస్టర్‌లో, నాలుగో సెమిస్టర్‌ కోసం మూడో సెమిస్టర్‌లో ప్రతిభ చూపించాల్సి ఉంటుంది. ప్రతి సెమిస్టర్‌లో సాధించిన మార్కుల ఆధారంగానే ఉపకార వేతనాన్ని కొనసాగిస్తారు. అలాగే కోర్సు మధ్యలో మానేయకుండా డిక్లరేషన్‌ సమర్పించాల్సి ఉంటుంది. ఏదైనా సెమిస్టర్‌లో ఉత్తీర్ణులు కాకపోతే స్కాలర్‌షిప్‌ను రద్దు చేస్తారు.

నగదు ఇలా..
ఉపకార వేతనం మొత్తాన్ని మెరిట్‌ ఆధారంగానే విద్యార్థి బ్యాంక్‌ ఖాతాలో జమచేస్తారు. మొదటి, రెండో, మూడో సెమిస్టర్‌లో ప్ర«థమ శ్రేణి మార్కులు/తత్సమాన జీపీఏ సాధించిన విద్యార్థులకు నెలకు రూ.5 వేలు ఉపకారవేతనంగా చెల్లిస్తారు. 60 శాతం కంటే మార్కులు వస్తే నెలకు రూ.1000 మాత్రమే స్కాలర్‌షిప్‌ రూపంలో చెల్లిస్తారు.
అనర్హులు
కేంద్ర ప్రభుత్వ కుల జాబితాలో బీసీ/ఓసీ సామాజిక వర్గాల విద్యార్థులు
ఎస్సీ/ఎస్టీ విద్యార్థులై కరస్పాండెట్‌ కోర్సులు, దూరవిద్య కోర్సులు చేస్తున్న విద్యార్థులు
వృత్తి విద్యా కోర్సుల్లో పీజీ చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థులకు మాత్రమే. ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అనర్హులు
సంబంధిత ప్రొఫెషనల్‌ డిగ్రీ రెండో సంవత్సరం (మూడో సెమిస్టర్‌)లో గేట్‌ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ఈ ఉపకారవేతనం అప్పటి నుంచి రద్దు చేస్తారు.

ఆన్‌లైన్‌లో ఇలా..
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉపకార వేతనాల పోర్టల్‌ https://scholarships.gov.in/ లాగిన్‌ అవ్వాలి. కనిపించే ముఖచిత్రంలో యూజీసీ స్కీమ్స్‌ కాలం క్లిక్‌ చేయాలి. అక్కడ పీజీ స్కాలర్‌షిప్స్‌ ఫర్‌ ఎస్సీ/ఎస్టీ స్డూడెంట్స్‌ ఫర్‌ ప్రొఫెషనల్‌ కోర్సెస్‌ వద్ద క్లిక్‌ చేయాలి.
లాగిన్‌ పక్కన న్యూ స్టూడెంట్స్‌ రిజిస్ట్రేషన్‌ వద్ద క్లిక్‌ చేయాలి. విద్యార్థి, కోర్సు, బ్యాంక్‌ ఖాతా సంఖ్య, మొబైల్‌ సంఖ్య, పుట్టిన తేదీ తదితర వివరాలు నమోదు చేసి ఈ నెల 15వ తేదీలోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement