
తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన 'ఆనంది' తెలుగు సినీ ప్రేక్షకులు బాగా పరిచయమే.

తెలుగులో బస్టాప్ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది

టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు దక్కని కారణంగా తమిళ్ ఇండస్ట్రీకి ఆమె షిఫ్ట్ అయిపోయింది.

తెలుగులో జాంబీ రెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్, ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చకుంది.

2014లో కోలీవుడ్‌లో దర్శకుడు వెట్రిమారన్ తీసిన పొరియాలన్ చిత్రం ఆమెకు అక్కడ మంచి గుర్తింపు తెచ్చింది.

తమిళ్ 'కాయల్' సినిమాతో ఉత్తమ నటిగా అక్కడ రాష్ట్ర అవార్డ్‌ను కూడా ఆనంది అందుకుంది

తమిళ సినిమాల్లో కో డైరెక్టర్‌గా పనిచేస్తున్న సోక్రటీస్‌తో ఆమె వివాహం 2021లో జరిగింది.

తమిళ్ మంగై సినిమా కోసం బోల్డ్‌గా నటించిన ఆనంది కోలీవుడ్‌లో సంచలనంగా మారింది.

కోలీవుడ్‌లో టాప్ హీరోయిన్స్‌కు ఉన్న క్రేజ్ మన 'ఆనంది'కి అక్కడ దక్కడం విశేషం.















