
టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ సతీమణి చారులతా రమేశ్ పుట్టినరోజు నేడు(అక్టోబరు 19)

ఈ సందర్భంగా సంజూ తన భార్యకు బర్త్‌డే విషెస్ తెలియజేశాడు

‘‘నా అందమైన ఇంపాక్ట్ ప్లేయర్’’ అంటూ క్రికెట్ పరిభాషలో చారులతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు

ఈ సందర్భంగా ఆమెతో దిగిన ఫొటోలను సంజూ షేర్ చేశాడు.

కేరళకు చెందిన సంజూ శాంసన్ 2018లో తన స్నేహితురాలు చారులతా రమేశ్‌ను పెళ్లాడాడు.

సంజూ ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌తో బిజీగా ఉన్నాడు

ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌లో తన తొలి సెంచరీ నమోదు చేశాడు











