Top Stories
ప్రధాన వార్తలు

వీరజవాన్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
శ్రీసత్యసాయి జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గోరంట్ల మండలం కల్లితండాలో పర్యటించారు. ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా జమ్ముకశ్మీర్‌లో శత్రుమూకలను తుదముట్టిస్తూ వీరమరణం పొందిన జవాన్ ముడావత్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు.మురళీనాయక్ అందరికీ స్ఫూర్తిదాయకం..పరామర్శ అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. దేశం కోసం పోరాడుతూ, మురళీనాయక్ వీరమరణం పొందారని.. మురళీ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉందన్నారు. మురళీనాయక్ అందరికీ స్ఫూర్తిదాయకం. మురళీ త్యాగానికి మనమంతా రుణపడి ఉంటాం. మురళీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. మురళీనాయక్ కుటుంబానికి వైఎస్సార్సీపీ తరఫున రూ.25 లక్షలు సాయం అందిస్తాం. మురళీ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’’ అని వైఎస్ జగన్ అన్నారు. ఉదయం బెంగళూరులోని నివాసం నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో చిక్కబళ్లాపురం, కొడికొండ చెక్‌పోస్టు, పాలసముద్రం, గుమ్మయ్యగారిపల్లి మీదుగా గంటలకు కల్లితండాకు చేరుకున్నారు. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిని పరామర్శించిన వైఎస్ జగన్.. అనంతరం తిరుగు పయనమయ్యారు.

వీర జవాన్ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం: వైఎస్ జగన్
శ్రీసత్యసాయి జిల్లా: వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ పార్టీ తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళవారం ఆయన వీరజవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వీర జవాను మురళీ నాయక్ జీవితం స్ఫూర్తి దాయకం అని.. ఆయన త్యాగానికి ప్రజలంతా రుణపడి ఉండాలన్నారు.జవాను చనిపోతే రూ. 50 లక్షల రూపాయలు ఇచ్చే సంప్రదాయం తమ ప్రభుత్వం ప్రారంభించిందని.. టీడీపీ కూటమి ప్రభుత్వం ఇదే విధానం కొనసాగిస్తోందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రూ. 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని వైఎస్ జగన్ తెలిపారు.

జమ్మూకశ్మీర్ ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. షోపియాన్ జిల్లాలో మంగళవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో లష్కరే తోయిబాకి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతయ్యారు. అయితే భద్రతా బలగాల కాల్పుల్లో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో.. ఒక ఉగ్రవాది పహల్గాం దాడి అనుమానిత ఉగ్రవాదేనన్న అనుమానం నెలకొంది. మరోవైపు, పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల గురించి సమాచారం అందించాలని ప్రజలను కోరుతూ పోలీసులు జమ్మూకశ్మీర్‌లోని షోపియన్ జిల్లా అంతటా పోస్టర్లను అతికించారు. ఈ పాకిస్తానీ ఉగ్రవాదుల గురించి నిర్ధిష్ట సమాచారం అందించిన వారికి రూ.20 లక్షల బహుమతి అందిస్తామని పోస్టర్లలో పేర్కొన్నారు.ఈ క్రమంలో ఉగ్రవాదులపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు షోపియాన్ జిల్లాలో మొహరించారు. తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ తనిఖీల్లో ఓ ప్రాంతంలో నక్కి ఉన్న ఉగ్రవాదులపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మరో ఇద్దరు ఉగ్రవాదుల కోసం వేటని ముమ్మరం చేశాయి. #BREAKING: J&K Police has pasted Posters across Shopian district of Jammu & Kashmir urging people to provide information of those terrorists involved in Pahalgam terror attack.Rs 20 lakh reward to the person who will provide any information about these Pakistani terrorists. pic.twitter.com/zjV7VUWtFb— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 13, 2025

అదంపూర్ ఎయిర్‌బేస్‌కు ప్రధాని మోదీ.. సైనికులతో ముచ్చట
పంజాబ్: అదంపూర్ ఎయిర్‌బేస్‌కు వెళ్లిన ప్రధాని మోదీ.. ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో ప్రధాని భేటీ అయ్యారు. ఆపరేషన్ సిందూర్‌లో ఎయిర్‌ఫోర్స్ కీలక పాత్రపై మోదీ హర్షం వ్యక్తంచేశారు. ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో ముచ్చటించి వారిని అభినందించారు. పాక్‌కు ఇండియా ఎయిర్‌ఫోర్స్ సత్తా చూపించారంటూ ప్రశంసలు కురిపించారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం ప్రధాని తొలిసారిగా నిన్న (సోమవారం) రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ పంజాబ్‌లో మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.పాక్‌పై మన సైనిక విజయాన్ని దేశంలోని ప్రతి తల్లికి, సోదరికి, కూతురికి అంకితం చేస్తున్నట్టు మోదీ నిన్న(సోమవారం) తన ప్రసంగంలో ప్రకటించారు. ఉగ్ర పోరులో మనతో కలిసి రావాల్సింది పోయి మనపైనే దాడులకు తెగబడింది. విచక్షణ కోల్పోయి మన సైనిక స్థావరాలతో పాటు విద్యా సంస్థలు, ప్రార్థనాలయాలు, ఇళ్లను కూడా లక్ష్యం చేసుకుందన్నారు. కానీ ఆ ప్రయత్నంలో ఘోరంగా విఫలమైంది...పాక్ డ్రోన్లు, క్షిపణులను మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎక్కడివక్కడ నేలకూల్చింది. మనం అంతటితో ఆగలేదు. వాళ్లు సరిహద్దులపై దాడి చేస్తే నేరుగా పాక్ గుండెకాయకే గురిపెట్టాం. ప్రధాన నగరాల్లోని వాళ్ల కీలక సైనిక, వైమానిక స్థావరాలన్నింటినీ నేలమట్టం చేశాం. పాక్ సైన్యానికి ఊహించలేనంత నష్టం మిగిల్చాం. ఆ క్రమంలో మన బలగాలు అంతులేని సామర్థ్యాన్ని, సంయమనాన్ని ఏకకాలంలో అద్భుత రీతిలో ప్రదర్శించాయి. మన దేశీయ ఆయుధ వ్యవస్థ తాలూకు పాటవాన్ని పూర్తిస్థాయిలో రుచిచూపాయి’’ అని ప్రధాని అన్నారు.

సుప్రీంకోర్టులో ఎంపీ మిథున్‌రెడ్డికి ఊరట
ఢిల్లీ: మద్యం విధానం కేసులో ఎంపీ మిథున్‌రెడ్డికి ఊరట లభించింది. ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. మరోసారి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా విచారణ జరపాలని హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. మెకానికల్ అరెస్టులు సరికాదని ఏపీ సీఐడీకి సుప్రీంకోర్టు హితవు పలికింది. హైకోర్టు నిర్ణయం తీసుకునేంతవరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.‘‘గత విచారణ సందర్భంగా ఈ కేసులో ఆధారాలను హైకోర్టు సరిగ్గా పరిశీలించలేదు. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు వివరాలను మరోసారి హైకోర్టు పరిశీలించాలి. దర్యాప్తు అధికారి సేకరించిన మెటీరియల్ హైకోర్టు చూడాలి. ఈ కేసులో పిటీషనర్ పాత్రకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం అందుబాటులో లేదు. అరెస్ట్‌కు సహేతుక కారణాలు చూపించాలి. మెకానికల్ అరెస్టులు సరికాదు. కేసు పెట్టిన వెంటనే అరెస్టు చేయాలని యోచన సరికాదు’’ అని సుప్రీంకోర్టు తెలిపింది.‘‘పార్లమెంట్ సభ్యుడి పరువు ప్రతిష్టలను పరిగణలోకి తీసుకోవాలి. తాజాగా మరోసారి పిటిషన్ హైకోర్టు విచారణ చేయాలి. ఏపీ హైకోర్టు తగిన అఫిడవిట్ దాఖలు చేయాలి. హైకోర్టు నిర్ణయం తీసుకునేంతవరకు మిథున్‌రెడ్డిని అరెస్టు చేయొద్దు’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అప్పుడు జన్మభూమి కమిటీలు... ఇప్పుడు పీ-4 సమన్వయకర్తలు!
పేదరిక నిర్మూలన కోసమే పీ-4 విధానం అన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాన్ని పార్టీ నేతల పదవీదాహాన్ని తీర్చేందుకు వాడేసుకుంటున్నారా? అవుననే అంటున్నారు ప్రజలు. కార్పొరేట్ సంస్థలు, ధనికులు రాష్ట్రంలోని పేదలను దత్తత తీసుకుని పేదరికం నుంచి బయటపడేయడమే పీ-4 అని చంద్రబాబు నాయుడు ఇటీవలి కాలంలో రాష్ట్రమంతా ఊదరగొట్టిన సంగతి తెలిసిందే. అదేదో గేమ్‌ఛేంజర్ అని... కొద్దిమంది ధనికులు కొంతమంది పేదలను దత్తత తీసుకుంటే పేదరికం ఎలా తగ్గుతుందన్న అనుమానం వ్యక్తం చేస్తే.. ‘‘మీకు తెలియదులే’’ అన్నట్టుగా వ్యవహరించారు చంద్రబాబు. ఈ పీ-4 విషయంలో తాజా సమాచారం మాత్రం ఆశ్చర్యంగానే ఉంది.ధనికుల అనాసక్తో ఇంకో కారణమో తెలియదు కానీ.. పీ-4 అమలుకు ఇప్పుడు కొత్త స్కీమ్‌ను ముందుకు తెచ్చారు. పేదలకూ.. ధనికులకు మధ్య వారధిగా ఓ సమన్వయ కర్తను నియమించనున్నామని అంటున్నారు. మంచిదేగా అనుకుంటున్నారేమో.. నియోజకవర్గానికి ఒకరు చొప్పున రాష్ట్రం మొత్తం 175 మందిని ఏర్పాటు చేయడమే కాదు.. వీరు ఒకొక్కరికి నెలకు రూ.60 వేల జీతమిస్తారట! అలాగని వీరి నియామకాలకు ఏదైనా నిర్దిష్ట విధానముందా అంటే అదీ లేదు! అంటే.. తెలుగుదేశం కూటమి నేతలు సిఫారసు చేసిన వారికే ఈ పదవి వస్తుందన్నమాట. పైగా ఇది ఉద్యోగమా? లేక ఓ హోదానా? ఉద్యోగి అయితే అతడికి ఇతర సదుపాయాలు కల్పించాలి మరి!నియోజకవర్గంతోపాటు అవసమైనప్పుడు జిల్లా కేంద్రం, రాష్ట్ర రాజధానికి వెళ్లి వచ్చేందుకు అవసరమైన ఖర్చులన్నమాట. ఇవన్నీ ఏ పద్దు కింద.. ఏ కార్యాలయానికి అనుంబంధంగా ఇస్తారు? అంతేకాకుండా... ఈ సమన్వయకర్త పని చేసేందుకు ఓ కార్యాలయం.. అతడికో సీటు ఏర్పాటూ తప్పనిసరి అవుతుంది! పోనీ సమన్వయకర్త అనేది ఒక హోదా అనుకున్నా.. ఆఫీసు, రవాణా ఖర్చుల్లాంటివి భరించక తప్పదు. వీటన్నింటికీ కేటాయింపులు కూడా లేకపోవడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఏడాదికి రూ.12 కోట్ల వ్యయానికి లెక్కలేమిటి అని ఎవరైనా అడిగితే ఏం చెబుతారు?పీ-4 సమన్వయ కర్తలు నియోజకవర్గ ప్రణాళిక తయారు చేసి, దాతృత్వ వ్యక్తులు, ప్రైవేటు రంగ సంస్థలను ఒప్పించి సమన్వయం చేస్తూ సమాజానికి మేలు చేయాలట. నిజానికి చంద్రబాబు ఈ కార్యక్రమం ఆరంభించినప్పుడు ఏపీలో ఉన్న ప్రముఖులు, ఆయా సంస్థలు పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో పేదలను దత్తత తీసుకుంటారన్నట్లుగా హోరెత్తించారు. ఇందుకోసం ఒక సర్వేని కూడా నిర్వహించి సుమారు 20 లక్షల కుటుంబాలను పేదల కింద నిర్ణయించారని వార్తలు వచ్చాయి. అయితే ఆయా కుటుంబంలో పిల్లల చదువులు, ఇతర అవసరాలు తీర్చేందుకు ఎంతమంది దాతలు ముందుకు వస్తారన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి.దీనికి తగ్గట్టుగానే ప్రభుత్వం ఏదో హడావుడి చేసినా, స్పందించింది చాలా కొద్దిమందేనని అనిపిస్తోంది. ప్రభుత్వం స్వయంగా పేదరికాన్ని వేలెత్తి చూపే విధంగా వ్యవహరించడం మంచిదేనా అన్న మీమాంస ఏర్పడింది. ఈ సమన్వయ కర్తలను కాంట్రాక్టు పద్దతిలో నియమించడం ద్వారా తమకు తోచిన వారిని నియమించుకోవచ్చని చెబుతున్నారు. ప్రభుత్వం పేదలను ఆదుకునే బాధ్యత ప్రైవేటు రంగానికి అప్పగించి చేతులు దులుపుకున్నట్లుగా ఉందీ వ్యవహారం. తాజాగా తెలుస్తున్నదేమిటంటే... పేదలను దత్తత తీసుకునే వారిని ఎంపిక చేయడం.. ఒప్పించడం అన్నీ గ్రామ పంచాయతీ కార్యదర్శుల బాధ్యతగా ప్రభుత్వం తీర్మానించింది. ఈ పని చేయకపోతే వారి జీతాల్లో కోతలూ ఉంటాయని ప్రభుత్వం హెచ్చరిస్తున్నట్లు సమాచారం. దీంతో మాకీ కొత్త తలనొప్పి ఏమిటని గ్రామ పంచాయతీ కార్యదర్శలు తలలు పట్టుకుంటున్నారు.సమన్వయకర్తలతోపాటు కన్సల్టెంట్ల పేరుతో మరింత మందిని నియమించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ‘వికసిత ఆంధ్ర విజన్’ పేరుతో ఏపీ రాష్ట్ర అభివృద్ది ప్రణాళిక కమిటీలో 71 మందిని కన్సల్టెంట్లుగా పెడుతున్నారు. ఇదే కాదు.రాష్ట్ర ఆదాయం పెంచడానికి ఎనిమిది నెలల కాలానికి రూ.3.28 కోట్లు చెల్లిస్తూ.. 11 మంది కన్సల్టెంట్లను నియమిస్తున్నారు. రాజధాని అభివృద్ది సంస్థ కోసం ఒకొక్కరికి రూ.లక్ష నుంచి రెండు లక్షల జీతాలతో మరో 68 మంది కన్సల్టెంట్లకూ ఓకే అంది ప్రభుత్వం. వీరు అమరావతి ఆర్థికాభివృద్దిలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలట. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణ పనుల పర్యవేక్షణ కోసం మరో కన్సల్టెన్నీ ఏజెన్సీకి రెండేళ్లలో ఇంకో రూ.22 కోట్లు వ్యయం చేయనున్నారు. చూడబోతే ప్రభుత్వాన్ని అంతా ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి పెట్టేలా ఉన్నారు.లక్షల మంది ఉద్యోగులు, యంత్రాంగం ఉన్న ఏపీ ప్రభుత్వం ఎందుకు ఈ నియమాకాలను చేపడుతోంది అంటే ఇదంతా పార్టీకి పని చేసిన వారి కోసమో, లేక కూటమి నేతలు తమ ఇష్టం వచ్చిన వారిని నియమించుకోవడానికో అన్న సమాధానం వస్తుంది. అసలు చంద్రబాబు పేరు వినగానే, ఆయనను చూడగానే ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు పెట్టుబడులు పెట్టడానికి, దానాలు చేయడానికి ముందుకు వస్తారని, అది ఆయన బ్రాండ్ గొప్పదనమని ప్రచారం చూసిన తెలుగుదేశం నేతలు, ఇప్పుడు ఆ బ్రాండ్ ఆశించిన స్థాయిలో ఉపయోగపడడం లేదని భావిస్తున్నారా? గత జగన్ ప్రభుత్వం ఏ నియామకం చేపట్టినా నానా రచ్చ, రచ్చగా రాసిన ఎల్లో మీడియా కాని, విమర్శలు చేసిన టీడీపీ, జనసేనలు కాని ఇప్పుడు వీటి గురించి ప్రజలకు వివరించడం లేదు. రహస్యంగా తమ పని తాము చేసుకుపోతూ ప్రజాధనాన్ని మంచినీటిలా ఖర్చు చేస్తున్నారు. ఇది ఏపీకి మేలు చేస్తుందా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

మనసును కదిలించే సైనికుడి రియల్ స్టోరీ..నటుడు మోహన్ లాల్ సైతం ఫిదా..!
జీవితం ఆనందంగా సాగుతుండగా ఊహించని విధంగా తలకిందులైపోతే..తేరుకోవడం అంత ఈజీ కాదు. ఒకవేళ్ల కోలుకున్న నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. కళ్లముందు కలలన్నీ కుప్పకూలిపోయి ఏం మిగిలలేదు అన్నట్లుగా ఉన్న పరిస్థితిని అధిగమించడం అంటే మాటలు కాదు. అందుకు ఎందో ధైర్యం కావాలి. అలాంటి సమయంలో స్థైర్యంగా నిలబడటం తోపాటు మనకు మద్ధతిచ్చే మంచి వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందడం మరింత గొప్ప విషయం. అలాంటి అసామాన్యమైన విజయాన్ని అందుకుని అందరికీ స్ఫూర్తిగా నిలిచారు ఈ సోల్జర్. అతడి జీవిత గాథ వింటుంటే..కళ్లు చెమ్మగిల్లుతాయి. మరీ ఆ గాథ ఏంటో చూద్దామా..!.హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత ఆర్మీకి చెందిన సైనికుడు తన కథను పంచుకోవడంతో నెట్టింట వైరల్‌గా మారింది. అఖిల్ బాల్యమంతా చాలా హాయిగా నవ్వుతూ..తుళ్లుతూ గడిచిపోయింది. ఏదో సాహసోపేతమైన కెరీర్‌ని అందుకోవాలనేది అతడి డ్రీమ్. ఆ నేపథ్యంలో నేవీలో చేరేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అన్ని విఫలమై ఏం చేద్దాం అని ఆలోచిస్తుండగా..సరిగ్గా అలాంటి తరుణంలో 2017లో తన గ్రామంలో భారీగా ఆర్మీ రిక్రూట్ర్యాలీ జరిగింది. అతను ఫిజికల్ పరీక్షల్లో 1,600 మీటర్ల ట్రయల్ రన్లో గెలుపొంది ఆర్మీలో చోటు దక్కించుకున్నాడు. తొలి పోస్టింగ్ పంజాబ్‌లో వచ్చింది. ఆర్మీ యూనిఫాంలో తల్లిదండ్రులు గర్వపడే స్థాయిలో ఉన్నాడు. అయితే 2021లో, హై-రిస్క్ బాటిల్ అబ్స్టాకిల్ కోర్స్ శిక్షణా సెషన్ అతడి జీవితాన్ని అంధకారంలోకి నెట్టేసింది. సరిగ్గా ఆ శిక్షణలో భాగంగా దూకుతుండగా తాడు తెగిపోయి..కింద పడిపోయాడు. అంతే ఆ తర్వాత కళ్లు తెరిచి చూసేటప్పటికి ఆస్పత్రి బెడ్‌పై ఉన్నాడు. అప్పుడే తెలిసింది..తాను ఇదివరకటిలా హాయిగా నడవలేనని..అంతే ఒక్కసారిగా అఖిల్‌కి కాలం స్థభించిపోయినట్లుగా అనిపించింది. ఆ ప్రమాదంలో అఖిల్ వెన్నెముకకు తీవ్ర గాయాలు కావడంతో కింద భాగం అంత చచ్చుబడిపోయింది. దీంతో అఖిల్ ఆ విషాద ఘటన నుంచి ఓ పట్టాన కోలుకోలేకపోయాడు. ఇక ఏముంది జీవితం అంత ముగిసిపోయిందనే నిరాశ నిస్ప్రుహల్లో కొట్టుకుపోతున్నాడు. సరిగ్గా ఆ సమయంలో తన మాదిరిగా అనుకోని ప్రమాదంలో చిక్కుకుని అంగవైకల్యంతో బాధపడిన కొందరు వ్యక్తులు, వారు సాధించిన విజయాల గురించి తెలుసుకున్నాడు. ఇక అప్పటి నుంచి నిరాశకు గుడ్‌బై చెప్పి నూతనోత్సాహంతో బతికే యత్నం చేశాడు. మొదటగా తన వైకల్యాన్ని పూర్తిగా అంగీకరించాడు. అప్పుడే అఖిల్ జీవితం అనుకోని విధంగా మలుపు తిరిగింది.అఖిల్ లవ్ చిగురించి అప్పుడే..అనుకోకుండా విధి అఖిల్ జీవితంలోకి ఓ అమ్మాయిని తీసుకొచ్చింది. అతడికి ఫేస్బుక్ ద్వారా "సోల్జర్ గర్ల్" అనే ప్రొఫెల్‌తో ఉన్న అఖిల అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అయితే ఆమెతో మాట్లాడేందు సంకోచించేవాడు అఖిల్. తన వైకల్యం గుర్తొచ్చి.. మాటలు కలపడానికి అంత ఆసక్తి చూపించేవాడు కాదు. అయితే ఆమె అతడిలోని వైకల్యాన్ని చూడలేదు. అలా ఇద్దరు మూడేళ్లు డేటింగ్ చేసి..2024 ఏప్రిల్‌లో వివాహం చేసుకున్నారు. ఆ క్షణం నుంచి అఖిల్‌కి అన్నివిధాల సపోర్ట్‌గా ఉన్న స్నేహతురాలు, భాగస్వామి అఖిలానే అయ్యింది. అంతేగాదు పారా-స్విమ్మింగ్ చేయమని అఖిల్‌ని ప్రోత్సహిస్తోంది కూడా. ఈ సోల్జర్ కథ మళయాళం నటుడు మోహన్‌లాల్ దృష్టిని సైతం ఆకర్షించింది. ఆయన కూడా ఆ సైనికుడు అఖిల్ ప్రేమకథకు ఫిధా అవ్వడమే గాక పూణేలో ఆ జంటకు కలిసి మరీ ప్రశంసించాడు. అంతేగాదు వారితో కలిసి దిగిన ఫోటోని కూడా నెటిజన్లతో షేర్ చేసుకున్నారు కూడా. నెటిజన్లు కూడా అలాంటి భాగస్వామిని పొందడం అఖిల్ అదృష్టం అంటూ ప్రశంసిస్తున్నారు. (చదవండి: Operation Sindoor: ఇండియన్ ఆర్మీ యూనిఫాం వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ ఇదే..!)

కోహ్లి, రోహిత్ వన్డే వరల్డ్‌కప్-2027 ఆడరు: టీమిండియా దిగ్గజం
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli), కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను ఉద్దేశించి భారత మాజీ సారథి సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇద్దరూ వన్డే వరల్డ్‌కప్-2027 ఆడే అవకాశం లేదని కుండబద్దలు కొట్టాడు. కాగా గత కొంతకాలంలో టెస్టుల్లో భారత జట్టు వైఫల్యం చెందుతున్న విషయం తెలిసిందే.ఇద్దరూ రిటైర్ అయ్యారుస్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో 3-0తో క్లీన్‌స్వీప్ కావడం సహా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2025ని 3-1తో కోల్పోయింది. ఈ రెండు సిరీస్‌లలో విఫలమైన నేపథ్యంలో తొలుత రోహిత్ శర్మ.. ఆ తర్వాత వారం తిరిగే లోపే కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు.యాభై ఓవర్ల ఫార్మాట్లో అతడే కెప్టెన్వీరిద్దరు ఇప్పటికే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ నుంచి కూడా వైదొలిగిన విషయం తెలిసిందే. ఇక తాను వన్డేల్లో కొనసాగుతానని రోహిత్ తెలపగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా యాభై ఓవర్ల ఫార్మాట్లో అతడే కెప్టెన్ అని స్పష్టం చేసింది.మరోవైపు.. కోహ్లి సోమవారం(మే 12) నాటి రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా టెస్టులకు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడే గానీ.. వన్డేల గురించి ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ టుడేతో మాట్లాడిన గావస్కర్.. కోహ్లి- రోహిత్ వరల్డ్‌కప్-2027 నాటికి జట్టులో ఉండే పరిస్థితి కనిపించడం లేదన్నాడు.కోహ్లి, రోహిత్ వన్డే వరల్డ్‌కప్-2027 ఆడరు‘‘వన్డే ఫార్మాట్లో వాళ్లిద్దరు అత్యద్భుతమైన ఆటగాళ్లు. అయితే, 2027 ప్రపంచకప్ నాటికి సెలక్షన్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేము. వాళ్లిద్దరు వరల్డ్‌కప్ జట్టులో ఉంటారో లేదో తెలియదు. అందుకు తగ్గట్లుగా వారి ప్రదర్శన కొనసాగుతుందా? అంటే అదీ తెలియదు.ఒకవేళ సెలక్షన్ కమిటీ వాళ్లపై నమ్మకం ఉంచితే ఇద్దరూ మరో ప్రపంచకప్ ఆడతారు. అయితే, నా అభిప్రాయం ప్రకారం.. కోహ్లి- రోహిత్ మరో వరల్డ్‌కప్ ఆడే అవకాశం లేదు.ఒకవేళ వాళ్లిద్దరు వచ్చే ఏడాది గనుక మంచి ఫామ్‌లో ఉంటే.. అది కూడా శతకాలు బాదితే... అప్పుడు దేవుడు కూడా వాళ్లను జట్టు నుంచి తప్పించలేడు! కానీ అదంతా జరుగుతుందో లేదో చూడాలి’’ అని గావస్కర్ తన అభిప్రాయం పంచుకున్నాడు. తిరుగులేని రికార్డులుకాగా వన్డేల్లో అత్యధికంగా మూడుసార్లు డబుల్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా రోహిత్ కొనసాగుతుంటే.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఈ ఫార్మాట్లో 51 శతకాలు బాది కోహ్లి ప్రపంచ రికార్డు సాధించాడు. తద్వారా దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ వన్డే సెంచరీల రికార్డును అతడు బద్దలు కొట్టాడు. కాగా ప్రస్తుతం రోహిత్ వయస్సు 38 ఏళ్లు కాగా.. కోహ్లికి 36 ఏళ్లు. ఈ ఇద్దరూ వరల్డ్‌కప్ నాటికి వరసగా 40, 38వ పడిలో అడుగుపెడతారు. ఫిట్నెస్ కాపాడుకుంటూ ఫామ్‌ను కొనసాగిస్తే వీరు 2027 టీమిండియా ప్రపంచకప్ జట్టులో ఉండటం ఖాయమే!చదవండి: కోహ్లి రిటైర్మెంట్పై బీసీసీఐ ట్వీట్.. మండిపడుతున్న అభిమానులు

ఎయిర్ ఫోర్స్ వన్... ఫ్రీ!.. అమెరికా అధ్యక్షుడికి ఖతార్ గిఫ్ట్?
జనానికి ‘ఫ్రీ’ అనే పదం వినపడినంత సొంపుగా మరొకటి చెవులకు సోకదు. ఫ్రీ అంటే ఫినైల్ తాగేవాడుంటాడని ప్రతీతి. ‘ఉచితం’ దేశాధ్యక్షులకూ బహు ప్రీతి. ఈ ఉచితం... ‘ఉచితమా’? సముచితమా? కాదా? అని ఆలోచించరు. అమెరికా అధ్యక్షుడూ ఇందుకు మినహాయింపు కాదు. ‘ఉచిత’ ఎయిర్ ఫోర్స్ వన్. ఖతారోడు ఫ్రీగా జంబోజెట్ ఇస్తాట్ట. అది సూపర్ లగ్జరీ ‘బోయింగ్ 747-8’ విమానం. ‘ప్యాలెస్ ఇన్ ద స్కై’ అంటున్నారు. ‘ఆకాశంలో ఎగిరే హర్మ్యం’గా అభివర్ణిస్తున్నారు. ప్రైవేటు బెడ్రూం సూట్, బోర్డు రూమ్స్, పాలరాయితో అలంకరించిన స్నానాలగదులు, గ్రాండ్ స్టెయిర్‌కేస్ వంటి ఫీచర్స్ అందులో ఆ విమానాన్ని ఖతార్ ఇస్తే ట్రంప్ తీసుకోవడమేనా? ఎవడో విసిరే బిస్కట్ కోసం అగ్రరాజ్యం అంతగా కక్కుర్తిపడుతోందా?అమెరికా అంతర్జాతీయ పేరు ప్రతిష్ఠలు కేవలం ‘విమానాల సేకరణ’ స్థాయికి దిగజారిందా? ఖతార్ రాజకుటుంబం ఇచ్చే బహుమతిని అమెరికా అధ్యక్షుడు పుచ్చుకోవడం అనైతికం, చట్ట విరుద్ధం అంటున్నారు విమర్శకులు. పైగా భద్రత పరంగా కూడా ప్రమాదకరమని విశ్లేషిస్తున్నారు. సొంత పార్టీ రిపబ్లికన్ల నుంచే వ్యతిరేకత వస్తోంది. ఆ విమానం ధర 400 మిలియన్ డాలర్లు. అంటే రూ.3,400 కోట్లు. అయితే ఖతార్ గిఫ్టుగా ఇచ్చే విమానంలో తాను తిరగబోనని చెబుతున్నారు ట్రంప్. గతంలో అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ వాడిన బోయింగ్ 707 విమానాన్ని సేవల నుంచి తప్పించి మ్యూజియంలో ఓ వస్తువుగా ప్రదర్శనకు పెట్టినట్టే... తన పదవీకాలం ముగిశాక భవిష్యత్తులో ‘ప్రెసిడెంట్ లైబ్రరీ’కి ఆ విమానాన్ని దానంగా ఇస్తామని అంటున్నారు ట్రంప్.అధ్యక్షుడిగా తన పదవీకాలం పూర్తవగానే అది ప్రెసిడెంట్ లైబ్రరీకి వెళ్లిపోతుందని ఆయన వివరించారు. ఇక అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విషయానికొస్తే.. అవి రెండు విమానాలు. దాదాపు 40 ఏళ్లుగా వాటిని అమెరికా వినియోగిస్తోంది. భద్రతపరంగా అవి మేలైనవి. కమ్యూనికేషన్ సామర్థ్యాలు, క్షిపణి దాడుల నుంచి కాచుకోవడం, గాల్లోనే ఇంధనం నింపుకోవడం వంటి ఫీచర్స్ వాటి సొంతం. అయితే ఆ పాత, డొక్కు విమానాలు అధ్యక్షుడికి నచ్చడం లేదు. వాటిని మార్చాలని ట్రంప్ ఉత్సాహపడుతున్నారు. బోయింగ్ కూడా అదే పనిలో నిమగ్నమైంది. రష్యాకు చెందిన ఓ విమానయాన సంస్థ కోసం బోయింగ్ గతంలో 747 విమానాలు తయారుచేసింది.బోయింగ్ నుంచి విమానాలు కొంటామన్న రష్యన్ విమానయాన సంస్థ ప్రస్తుతం ఉనికిలో లేదు. దీంతో ఆ 747 విమానాలకు బోయింగ్ మార్పుచేర్పులు చేస్తూ అదనపు సొబగులు అద్దుతోంది. కీలక సబ్ కాంట్రాక్టర్ దివాలా తీయడం, అర్హత గల సిబ్బంది కొరత కారణాల నేపథ్యంలో సుమారు దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ఈ ‘747 విమానాల మేకప్ తతంగం’ ఇంకొన్నాళ్లు పట్టేట్టుంది. ట్రంప్ ప్రస్తుత రెండో టర్మ్ ముగిసేలోపు ఆ విమానాలు సిద్ధమయ్యేట్టు లేవు. దీంతో దేశాధ్యక్షుడిలో అసహనం పెరిగిపోతోంది. కొందరు అరబ్ నేతలు ‘ఎయిర్ ఫోర్స్ వన్’ కంటే మెరుగైన విమానాల్లో ప్రయాణిస్తున్నారంటూ ట్రంప్ ఆత్మన్యూనతకు లోనవుతున్నారు. మధ్యప్రాచ్యంలో ఖతార్ గడ్డపై అమెరికాకు అతి పెద్ద సైనిక స్థావరం ఉంది.ప్రస్తుతం ట్రంప్ అటువైపే పర్యటనకు బయల్దేరారు. మే 13-16 తేదీల్లో ఆయన సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈల్లో పర్యటిస్తారు. కొసమెరుపు- ‘కాంగ్రెస్ (చట్టసభలు) అనుమతి లేకుండా ఫెడరల్ అధికారులు విదేశీ ప్రభుత్వాల నుంచి విలువైన వస్తువులు, లాభాలు/ప్రయోజనాలు పొందరాదు’ అని అమెరికా రాజ్యాంగం స్పష్టీకరిస్తోంది. మరి ‘ఖతార్ గిఫ్ట్’ అంశంలో ట్రంప్ ఏం చేస్తారో! అధ్యక్షుడైనా చట్టానికి అతీతం కాదు. విమానాన్ని అమెరికా అధ్యక్షుడికి బహుమతిగా ఇవ్వజూపడం వెనుక ఖతార్ ప్రయోజనాలు ఏం దాగున్నాయో!::జమ్ముల శ్రీకాంత్(Source: Huffpost, American Broadcasting Company news)

పడి లేచిన పసిడి ధరలు! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. నిన్నటి మార్కెట్ సెషన్లో భారీగా తగ్గిన బంగారం ధరలు ఈ రోజు తిరిగి స్వల్పంగా పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.87,650 (22 క్యారెట్స్), రూ.95,620 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.150, రూ.160 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.150, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.160 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.87,650 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.95,620 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.150 పెరిగి రూ.87,800కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.160 పెరిగి రూ.95,770 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగా కాకుండా మంగళవారం వెండి ధర(Silver Prices)లు తగ్గాయి. నిన్నటితో పోలిస్తే వెండి ధర కేజీపై రూ.1,000 తగ్గింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,09,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
కాలుష్య భూతంపై ‘వారుణాస్త్రం’!.. ఢిల్లీలో రూ. 3 కోట్లతో మేఘమథనం
తల్లిని పోగొట్టుకున్న రెండేళ్ల చిన్నారితో..ఎంత కష్టం : డెలివరీ ఏజెంట్ స్టోరీ
గిల్ వద్దు.. టీమిండియా కెప్టెన్‌గా అతడే సరైనోడు!
మనసును కదిలించే సైనికుడి రియల్ స్టోరీ..నటుడు మోహన్ లాల్ సైతం ఫిదా..!
ఏం కష్టం వచ్చిందో..?
ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్.. తెలుగులో నేరుగా రిలీజ్
‘వాడికి ఎందుకంత కొవ్వు’ .. టీడీపీ ఎమ్మెల్యే బెందాళం నోటి దురుసు వ్యాఖ్యలు
అదంపూర్ ఎయిర్‌బేస్‌కు ప్రధాని మోదీ.. సైనికులతో ముచ్చట
యాపిల్ యూజర్లకు కేంద్రం హెచ్చరికలు
నాటు తుపాకులతో వేటగాళ్లు హల్చల్
భారత సైన్యం వేతన వివరాలు ఇలా..
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త తెలుగు సినిమా
ఖరీదైన ఇల్లు కొన్న 'అనసూయ'.. గృహ ప్రవేశం ఫోటోలు చూశారా?
భార్య ప్రసవం కోసం వచ్చి
పాకిస్తాన్‌కు మా మద్దతు కొనసాగుతుంది
మృణాల్ ఠాకూర్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సుమంత్
యుద్ధమంటే బాలీవుడ్ సినిమా అనుకుంటున్నారా?.. ఆర్మీ మాజీ చీఫ్ సీరియస్
ముందుగానే నైరుతి రుతుపవనాలు
కెనరా బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త
16 ఏళ్ల యువకుడితో.. నా భార్య వెళ్ళిపోయింది సార్.!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
పవన్‌ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలి: దళిత సంఘాలు
తెలంగాణలో టెన్షన్.. బీజేపీ ఎంపీ ఈటల ఇంటి వద్ద ఉద్రిక్తత
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. ఊహలు నిజమవుతాయి
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి
కోహ్లి రిటైర్మెంట్పై బీసీసీఐ ట్వీట్.. మండిపడుతున్న అభిమానులు
భారత సైనికులకు సెల్యూట్: ప్రధాని మోదీ
భారీ ప్రాజెక్ట్.. 'మహావతార్: నరసింహ' గ్లింప్స్ విడుదల
డాక్టర్ బాబు నిరుపమ్ భార్య బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
పాక్‌పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ కీలక ప్రకటన
కాలుష్య భూతంపై ‘వారుణాస్త్రం’!.. ఢిల్లీలో రూ. 3 కోట్లతో మేఘమథనం
తల్లిని పోగొట్టుకున్న రెండేళ్ల చిన్నారితో..ఎంత కష్టం : డెలివరీ ఏజెంట్ స్టోరీ
గిల్ వద్దు.. టీమిండియా కెప్టెన్‌గా అతడే సరైనోడు!
మనసును కదిలించే సైనికుడి రియల్ స్టోరీ..నటుడు మోహన్ లాల్ సైతం ఫిదా..!
ఏం కష్టం వచ్చిందో..?
ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్.. తెలుగులో నేరుగా రిలీజ్
‘వాడికి ఎందుకంత కొవ్వు’ .. టీడీపీ ఎమ్మెల్యే బెందాళం నోటి దురుసు వ్యాఖ్యలు
అదంపూర్ ఎయిర్‌బేస్‌కు ప్రధాని మోదీ.. సైనికులతో ముచ్చట
యాపిల్ యూజర్లకు కేంద్రం హెచ్చరికలు
నాటు తుపాకులతో వేటగాళ్లు హల్చల్
భారత సైన్యం వేతన వివరాలు ఇలా..
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త తెలుగు సినిమా
భార్య ప్రసవం కోసం వచ్చి
పాకిస్తాన్‌కు మా మద్దతు కొనసాగుతుంది
మృణాల్ ఠాకూర్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సుమంత్
యుద్ధమంటే బాలీవుడ్ సినిమా అనుకుంటున్నారా?.. ఆర్మీ మాజీ చీఫ్ సీరియస్
ముందుగానే నైరుతి రుతుపవనాలు
16 ఏళ్ల యువకుడితో.. నా భార్య వెళ్ళిపోయింది సార్.!
కెనరా బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త
పవన్‌ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలి: దళిత సంఘాలు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
తెలంగాణలో టెన్షన్.. బీజేపీ ఎంపీ ఈటల ఇంటి వద్ద ఉద్రిక్తత
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. ఊహలు నిజమవుతాయి
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి
కోహ్లి రిటైర్మెంట్పై బీసీసీఐ ట్వీట్.. మండిపడుతున్న అభిమానులు
భారత సైనికులకు సెల్యూట్: ప్రధాని మోదీ
భారీ ప్రాజెక్ట్.. 'మహావతార్: నరసింహ' గ్లింప్స్ విడుదల
పాక్‌పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ కీలక ప్రకటన
మెగా కోడలిగా తొలి సినిమా.. లేటేస్ట్ అప్డేట్ వచ్చేసింది!
2040 నాటికి చంద్రుడిపై మన ముద్ర - మోదీ
సినిమా

డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఏ ఆఫీస్‌కు వెళ్లిన నాగార్జున
ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవడానికి వెళ్లారు. ఆయన ఆర్టీఏ కార్యాలయంలో ఫోటోలు దిగి, సంతకం చేసి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఆర్టీఏ సిబ్బందితో ఆయన సెల్ఫీలు దిగి వారితో కొంత సమయం పాటు సరదాగ మాట్లాడి వెళ్లిపోయారు.. నాగ్ వస్తున్న విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు కూడా ఆర్టీఏ కార్యాలయానికి చేరుకున్నారు. వారితో కూడా అయన ఫోటోలు దిగారు. తన డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిందని అందుకే రెన్యువల్ కోసం వచ్చానని ఆయన చెప్పారు.నాగార్జున సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కుబేర' సినిమాలో ఆయన చాలా కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్- లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ సినిమా 'కూలీ'లో కూడా నాగ్ చాలా ప్రాముఖ్యత ఉన్న రోల్లో కనిపించనున్నారు.

కేంద్రం అంటే బాలీవుడ్‌కు భయం.. అందుకే నోరెత్తరు: రచయిత
హిందీ చిత్ర పరిశ్రమ గురించి బాలీవుడ్ ప్రముఖ గేయ రచయిత జావేద్ అఖ్తర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అంటే బాలీవుడ్‌కు భయం అని ఆయన అన్నారు. అందుకే ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు సాహసం చేయరని ఆయన తెలిపారు. ఒకవేళ ఎవరైన తెగించి విమర్శలు చేస్తే.. దర్యాప్తు సంస్థల నుంచి వేధింపులు ఎదుర్కోవాల్సి ఉంటుందనే అభద్రతాభావం బాలీవుడ్ హీరోలలో ఉందని అభిప్రాయపడ్డారు. ఈడీ, సీబీఐ దాడుల భయమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా నిరోధిస్తుందని ఆయన అన్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ వేదికగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్‌తో జరిగిన చర్చ సందర్భంగా జావేద్ అఖ్తర్ ఈ వ్యాఖ్యలు చేశారు.'బాలీవుడ్ తారలు గొప్ప పేరు ప్రఖ్యాతులతో విలాసవంతమైన జీవితాల్ని గడుపుతారు. కానీ, ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే విషయాల్లో వారు కూడా సామాన్యుల తరహాలోనే ఆలోచిస్తారు. ఈ బడా హీరోలను వెనక నుంచి నడిపించేది మొత్తం పారిశ్రామికవేత్తలే. ఎట్టిపరిస్థితిల్లోనూ వారితో పోరాడేంత పెద్దవారు కాదు ఈ సినీ తారలు. ఈ క్రమంలోనే వారి వైఖరిపై పలుమార్లు విమర్శలు వచ్చాయి. అదే హాలీవుడ్ నటులు అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్భయంగా తమ భావాల్ని వ్యక్తం చేస్తారు. తాజాగా అమెరికన్ నటి మెర్లీ స్ట్రీప్ అక్కడి ప్రభుత్వాన్ని విమర్శించినా ఆమెకు ఎలాంటి వేధింపులు ఎదురుకాలేదు. అలాంటి వ్యాఖ్యలు ఇక్కడి ప్రభుత్వంపై చేస్తే ఈడీ, సీబీఐ దాడుల పేరుతో రంగంలోకి దిగుతారు. ఆ భయంతోనే బాలీవుడ్ చిత్రపరిశ్రమ ప్రభుత్వాన్ని ప్రశ్నించదు.' అని ఆయన జావేద్ అఖ్తర్ వ్యాఖ్యనించారు. అయితే, ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు తాను నిరంతరం సోషల్‌మీడియాలో ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నానని జావేద్ అన్నారు. ఓ పౌరుడిగా సమస్యలపై స్పందించడం తన ధర్మమని ఆయన పేర్కొన్నారు.జావేద్ అఖ్తర్ ప్రతిభా వంతమయిన కవి, వక్త, స్క్రీన్ ప్లే రచయిత. సూటిగా తన భావాల్ని ఎలాంటి వెరపూ, బెదురూ లేకుండా ప్రకటిస్తున్న సామాజిక గొంతుక ఆయనది. ఇవ్వాళ మన దేశంలో అత్యంత ప్రభావవంతమైన స్వతంత్ర లౌకిక స్వరం, జావేద్ అఖ్తర్. భావుకుడు, ప్రగతిశీల వాది అయిన జావేద్ అఖ్తర్ ఏడు తరాల సాహిత్య చైతన్యమున్న కుటుంబంలో జన్మించారు. తన కవిత్వం మత తత్వానికి, సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా రాశారు. జాతీయ సమైక్యత, స్త్రీల హక్కుల కోసం మాట్లా డారు, రాశారు. తప్పు దోవ పట్టిన యువతను ద్దేశించి జావేద్ రాసిన గీతాన్ని 1995లో కేంద్ర మానవ వనరుల శాఖ యువతకోసం ‘జాతీయ గీతం’గా ప్రకటించింది.

ఐపీఎల్లో నాకిష్టమైన జట్టు ఇదే: మీనాక్షీ
పంజాబీ బ్యూటీ మీనాక్షీ చౌదరి బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పొచ్చు. ఈమె సినిమాలతో పాటు రీసెంట్గా వైద్య విద్యను పూర్తి చేశారు. అదే విధంగా సిమ్మింగ్, బాడ్మింటన్ క్రీడాకారిణి కూడా. అంత కంటే పలు అందాల పోటీల్లో పాల్గొని రన్నర్‌గా నిలిచారు. చివరికి నటిగా స్థిరపడింది. తొలుత నటిగా బాలీవుడ్లో రంగప్రవేశం చేసినా, ఆ తరువాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. అలా 2020లో ఇచ్చట వాహనాలు నిలుపరాదు అనే చిత్రంలో నటించి గుర్తింపు పొందారు. అయితే హిట్ ది సెకండ్ కేస్ చిత్రం ఈ బ్యూటీకి తొలి విజయానందాన్నిచ్చింది. అంతే కోలీవుడ్ నుంచి కాలింగ్ వచ్చింది. అక్కడ విజయ్ ఆంటోనితో కలిసి కొలై చిత్రంలో నటించారు. అది ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, విజయ్‌కి జంటగా గోట్ చిత్రంలో నటించి బాగా పాపులర్ అయ్యారు. దుల్కర్ సల్మాన్‌కు జంటగా లక్కీభాస్కర్ చిత్రంలో నటించి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తెలుగులో సక్సెస్ బాటలో పయనిస్తున్నారు. తాజాగా ఈ అమ్మడి బాలీవుడ్ ఎంట్రీ షురూ అయ్యింది. ఇంతకు ముందు స్త్రీ, మిమీ తదితర హిట్ చిత్రాలను నిర్మించిన దినేశ్ విజయ్ తాజాగా నిర్మిస్తున్న చిత్రంలో మీనాక్షీ నాయకిగా నటించనున్నట్లు సమాచారం. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ ఇటీవల ఒక భేటీలో ఐపీఎల్ జట్లుల్లో మీకు నచ్చిన జట్టు ఏదని మీడియా అడిగిన ప్రశ్నకు తనకు ఐపీఎల్ జట్టులో ప్రత్యేకంగా నచ్చిన జట్లు అంటూ ఏమీ లేవన్నారు. అయితే ఎంఎస్.ధోని అంటే తనకు చాలా ఇష్టమన్నారు. ఆయన ఏ జట్టులో ఉంటే ఆ జట్టే తనకు నచ్చుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ధోని అంటే ఇష్టం ఏర్పడిన తరువాతనే తాను క్రికెట్ క్రీడను చూడడం మొదలెట్టానని ఈ 33 ఏళ్ల సుందరి చెప్పుకొచ్చారు.

తెలుగులో నా ఎంట్రీకి సరైన సినిమా ఇదే: డైరెక్టర్ కూతురు
‘‘నేను తమిళంలో చేసిన తొలి చిత్రం ‘విరుమన్’ని విజయ్ కనకమేడలగారు చూశారు. ఆ తర్వాత నాకు కాల్ చేసి, ‘భైరవం’ (bhairavam)సినిమా గురించి చెప్పారు. కథ నచ్చడంతో నేను ఈ ప్రాజెక్టులోకి వచ్చాను. తెలుగులో ఇది నా తొలి చిత్రం. టాలీవుడ్లో నా ఎంట్రీకి ‘భైరవం’ సరైన సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. మంచి సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రావడం సంతోషంగా ఉంది’’ అని అదితీ శంకర్ తెలిపారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా, అదితీ శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో పెన్ స్టూడియోస్‌పై జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది.ఈ సినిమా ద్వారా తెలుగుకి పరిచయమవుతున్న అదితీ శంకర్ విలేకరులతో మాట్లాడుతూ–‘‘మా నాన్నగారితో(డైరెక్టర్ శంకర్) కలిసి హైదరాబాద్, తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్స్‌కి వచ్చేదాన్ని. ఇప్పుడు నా సినిమాకి ఇక్కడికి వచ్చి షూటింగ్ చేయడం చూస్తే నా కల నిజం అయిందనిపిస్తోంది. నాన్నగారి ఇమేజ్‌ని ఒక గౌరవంగానే భావిస్తాను తప్ప ఎప్పుడూ ఒత్తిడిగా తీసుకోను. ‘భైరవం’లో బోల్డ్ అండ్ హానెస్ట్‌తోపాటు బబ్లీగా ఉండే క్యారెక్టర్లో కనిపిస్తాను. సాయి శ్రీనివాస్, మనోజ్, రోహిత్‌గార్లకు తమిళ్ మాట్లాడడం వస్తుంది. అందుకే ఈ ప్రయాణం చాలా సౌకర్యంగా అనిపించింది.సెట్స్‌లో షూటింగ్‌ని చాలా ఎంజాయ్ చేశాను. రాధామోహన్‌గారు చాలా మంచి వ్యక్తి. ప్రతిరోజు సెట్స్‌కి వచ్చేవారు. విజయ్ కనకమేడలగారు క్లారిటీ విజన్ ఉన్న డైరెక్టర్. శ్రీ చరణ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నాకు ఇష్టమైన తెలుగు చిత్రం ‘మగధీర’. నేను థియేటర్లో చూసిన తొలి తెలుగు సినిమా అది. అలా రాజమౌళి, రామ్ చరణ్‌గార్లకు నేను బిగ్ ఫ్యాన్‌గా మారిపోయాను. నాకు హిస్టారికల్, పీరియాడిక్ సినిమాలతోపాటు సవాల్‌తో కూడినపాత్రలు చేయాలని ఉంది’’ అని చెప్పారు.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

CA: ఇష్టం లేకపోతే వెళ్లొద్దులే!
ఐపీఎల్-2025 (IPL 2025) వాయిదా పడటంతో స్వదేశం చేరిన ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు అండగా నిలుస్తోంది. ఇష్టమైతేనే లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లకు వెళ్లాలని.. లేదంటే ఇక్కడే ఉండిపోవచ్చని క్రికెట్ ఆస్ట్రేలియా ( CA) సూచించిందని ఆ దేశ మీడియా కథనం వెలువరించింది.కాగా భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్-2025ని వారం పాటు వాయిదా వేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించిన ఆస్ట్రేలియన్ క్రికెటర్లంతా లీగ్ వాయిదా పడగానే స్వదేశానికి వెళ్లిపోయారు.వారు మాత్రం ఇక్కడేకోచింగ్ స్టాఫ్‌లో ఉన్న రికీ పాంటింగ్, బ్రాడ్ హాడిన్ తదితరులు మాత్రం భారత్‌లోనే ఉండిపోయారు. ప్రస్తుతం భారత్, పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో ఈనెల 17 నుంచి తిరిగి ఐపీఎల్‌ను ప్రారంభించాలని బీసీసీఐ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా విదేశీ క్రికెటర్లకు పిలిపించుకొని సిద్ధంగా ఉండాలని బోర్డు ఇదివరకే ఫ్రాంచైజీలకు తెలిపింది.అయితే ఆటగాళ్లంతా ఐపీఎల్ కోసం వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో సీఏ వారికి అండగా నిలవాలనుకుంటుందని ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ పత్రిక తమ కథనంలో పేర్కొంది. దాయాది దేశాల మధ్య నెలకొన్న యుద్ధవాతావరణ పరిస్థితులతో తమ ఆటగాళ్లంతా భయాందోళనకు గురయ్యారని అలాంటపుడు మళ్లీ ఐపీఎల్ కోసం వెళ్లమని క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పబోదని ఆ కథనంలో రాసింది.ఫైనల్‌కు సిద్ధమయ్యే క్రమంలోనే?నిజానికి తమ ఆటగాళ్లకు మే 25తో ముగిసే ఐపీఎల్ షెడ్యూల్ వరకే ఆడేందుకు సీఏ అనుమతిచ్చింది. ఇప్పుడు గనక వారు మళ్లీ వెళ్లాలంటే సీఏ నుంచి మరోసారి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) తీసుకోవాల్సి ఉంటుందని ఆ పత్రిక వెల్లడించింది. పైకి భయం అంటూ కారణాలు చెబుతున్నా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2025 ఫైనల్‌కు సిద్ధమయ్యే క్రమంలోనే ఆసీస్ క్రికెటర్లు ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఫ్రాంఛైజీలు ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది.ఐపీఎల్-2025లో వివిధ ఫ్రాంఛైజీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు👉సన్‌రైజర్స్ హైదరాబాద్: ప్యాట్ కమిన్స్, ట్రవిస్ హెడ్, ఆడం జంపా (గాయం కారణంగా ఇప్పటికే దూరం)👉రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: జోష్ హాజిల్‌వుడ్, టిమ్ డేవిడ్👉పంజాబ్ కింగ్స్: మార్కస్ స్టొయినిస్, గ్లెన్ మాక్స్వెల్ (రూల్డ్ అవుట్), మిచ్ ఓవెన్ (ఇంకా జట్టుతో చేరలేదు), జోష్ ఇంగ్లిస్, ఆరోన్ హార్డీ, జేవియర్ బార్ట్లెట్👉లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్👉కోల్‌కతా నైట్ రైడర్స్: స్పెన్సర్ జాన్సన్👉ఢిల్లీ క్యాపిటల్స్: మిచెల్ స్టార్క్, జేక్ ఫ్రేజర్-మెగర్క్👉చెన్నై సూపర్ కింగ్స్: నాథన్ ఎల్లిస్.

‘విరాట్’ పరుగుల పర్వాలు
‘నేను టెస్టు క్రికెట్‌ను రోజంతా ఒకే తరహా తీవ్రతతో ఆడాలని భావిస్తా. 88వ ఓవర్లో కూడా బ్యాటర్ షాట్ ఆడితే నేను సింగిల్ ఆపేందుకు అవసరమైతే డైవ్ కూడా చేస్తా. నా దృష్టిలో టెస్టు క్రికెట్ అంటే అదే’... ఇది విరాట్ కోహ్లికి టెస్టు ఫార్మాట్‌పై ఉన్న అభిమానాన్ని చూపిస్తోంది. ‘నేను నా మనసును, ఆత్మను కూడా టెస్టు క్రికెట్ కోసమే ఇచ్చా. ఈ ఫార్మాట్లో ఫిట్నెస్ కోసమే ఎన్నో త్యాగాలు చేశా’... 100 టెస్టులు పూర్తయిన సందర్భంగా అతను తన సంతృప్తిని ప్రదర్శించిన వ్యాఖ్య ఇది. ‘ఈ రోజంతా మనిద్దరమే బ్యాటింగ్ చేద్దాం.అవతలి జట్టులో ఒక్కొక్కడికి పగిలిపోవాలి’... ఇది మైదానంలో ప్రత్యర్థులపై అతను ప్రదర్శించిన దూకుడుకు ఒక చిన్న ట్రైలర్... టెస్టు క్రికెట్‌కు ఆదరణ తగ్గిపోతోందని అనిపించినప్పుడల్లా మైదానంలో కోహ్లిని చూస్తే అలాంటి భావనే కనిపించదు. అతను టెస్టుల్లో భారీగాపరుగులు మాత్రమే చేయలేదు. అతను ఎన్నో లెక్కలను కొత్తగా తిరగరాశాడు. సాంప్రదాయ ఫార్మాట్లో ఎన్నో సాంప్రదాయాలను బద్దలు కొట్టాడు. క్రమశిక్షణ, పట్టుదల, పోరాటపటిమ, ఫిట్నెస్, ఎక్కడా వెనక్కి తగ్గని తత్వం టెస్టుల్లోనే ఎక్కువగా బయట పడింది. కోహ్లిలాంటి టెస్టు క్రికెటర్ ఇకపై రాకపోవచ్చు. ఈ ఫార్మాట్లో అది ఎవరూ పూరించలేని లోటు. –సాక్షి క్రీడా విభాగం ‘భారత్ తరఫున ఆడుతున్న ఆ్రస్టేలియన్’... విరాట్ కోహ్లి దూకుడును ఆసీస్ గడ్డపై చూసిన తర్వాత విశ్లేషకులు ఇచ్చిన పేరు ఇది. మైదానంలో దూకుడు, ఢీ అంటే ఢీ అనే తత్వం, అటు బ్యాటర్‌గా, ఇటు కెపె్టన్‌గా అతని శైలి కోహ్లి ప్రత్యేకతను నిలబెట్టాయి. ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గను అన్నట్లుగా తెల్ల దుస్తుల్లో యుద్ధానికి సిద్ధమైన ఒక సైనికుడిలా అతను కనిపించేవాడు. 2014లో ఆస్ట్రేలియా గడ్డపై నాటి టాప్ పేసర్ మిచెల్ జాన్సన్‌తో అతను తలపడిన తీరును అభిమానులు ఎవరూ మర్చిపోలేరు.తన బౌలింగ్‌లో అద్భుతమైన కవర్ డ్రైవ్‌లు, పుల్ షాట్లతో కోహ్లి విరుచుకుపడుతుంటే జాన్సన్ మాటల యుద్ధానికి దిగగా, కోహ్లి ఎక్కడా తగ్గకుండా తాను అదే తరహాలో దీటుగా నిలబడ్డాడు. ఈ సిరీస్‌లో ఏకంగా 4 సెంచరీలతో 692 పరుగులు చేసిన అతను తన సత్తాను ప్రదర్శించాడు. అంతకుముందు దాదాపు మూడేళ్ల క్రితమే కోహ్లి దూకుడును ఆసీస్ చూసింది. 2011–12 టెస్టు సిరీస్‌లో భాగంగా జరిగిన పోరులో సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, గంభీర్వంటి స్టార్ బ్యాటర్లంతా విఫలం కాగా భారత్ నుంచి ఒకే ఒక సెంచరీ నమోదైంది. అది కోహ్లి బ్యాట్ నుంచి వచి్చంది. ఇది కోహ్లి కెరీర్లో ఎనిమిదో టెస్టు. రెండు టెస్టుల క్రితం సిడ్నీలో క్రమశిక్షణారాహిత్యంతో శిక్షకు గురైన కోహ్లి... ఈ మ్యాచ్‌లో తన దూకుడును పరుగులుగా మలచి కసి తీర్చుకున్నట్లుగా అనిపించింది. అలా మొదలై... వన్డేల్లో అరంగేట్రం చేసిన మూడేళ్ల తర్వాత గానీ కోహ్లి తొలి టెస్టు ఆడలేదు. సచిన్ గైర్హాజరులో అతనికి 2011లో వెస్టిండీస్ వెళ్లే అవకాశం లభించింది. అక్కడ పెద్దగా ఆకట్టుకోకపోయినా... ఆ తర్వాత ముంబైలో విండీస్‌తోనే రెండు ఇన్నింగ్స్‌లలో అర్ధ సెంచరీలు చేయడంతో కాస్త నిలదొక్కుకునే అవకాశం లభించింది. ఆ తర్వాత ఆ్రస్టేలియా సిరీస్ అవకాశం దక్కగా అడిలైడ్‌లో చేసిన సెంచరీతో కొత్త తరం ప్రతినిధిగా అతని ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత స్వదేశంలో నిలకడ కొనసాగగా... 2013 దక్షిణాఫ్రికా పర్యటనలో ప్రదర్శన కోహ్లి స్థాయిని పెంచింది. ఆపై కివీస్‌పై వెల్లింగ్టన్లో చేసిన శతకంతో అతని బ్యాటింగ్ విలువ అందరికీ కనిపించింది. ఇక్కడి వరకు కోహ్లి టెస్టు కెరీర్ సాఫీగా సాగిపోయింది. తొలి 24 టెస్టుల్లో 46.71 సగటుతో 1721 పరుగులు చేయగా అందులో 6 సెంచరీలు ఉన్నాయి. ఆ తర్వాత వచి్చంది ఇంగ్లండ్ పర్యటన. ఆరేళ్లు అద్భుతంగా... విరాట్ టెస్టు కెరీర్ అక్టోబర్ 2014 నుంచి డిసెంబర్ 2019 వరకు అత్యద్భుతంగా సాగింది. ఈ సమయంలో అతని కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనలు వచ్చాయి. అటు ఆటగాడిగా, ఇటు కెపె్టన్‌గా కూడా ఈ సమయంలో ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందుకున్నాడు. భారత అభిమానుల కోణంలో చూస్తే ఈ సమయంలో కోహ్లి అసలైన టెస్టు మజాను చూపించాడు. జట్టును తన బ్యాటింగ్‌తో బలమైన స్థితిలో నిలపడమే కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు అసాధారణ బ్యాటింగ్‌తో టెస్టులను ఎలా ఆడాలో అతను చేసి చూపించాడు.ఈ ఆరేళ్ల కాలంలో 55 టెస్టులు ఆడిన కోహ్లి ఏకంగా 63.65 సగటుతో 5347 పరుగులు సాధించాడు. ఇందులో 21 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ సమయంలో గణాంకాలు అతడిని నంబర్‌వన్ టెస్టు బ్యాటర్‌గా నిలిపాయి. ముఖ్యంగా ఒక 18 నెలలు అతని బ్యాటింగ్ శిఖరానికి చేరింది. కేవలం 34 ఇన్నింగ్స్‌ల వ్యవధిలో కోహ్లి ఏకంగా 6 డబుల్ సెంచరీలు నమోదు చేయడం విశేషం. 34 ఇన్నింగ్స్‌ల వ్యవధిలో చూస్తే ఒక్క బ్రాడ్‌మన్ (8) మాత్రమే అతనికంటే మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. కాస్త పదును తగ్గి... అసాధారణ బ్యాటింగ్ తర్వాత 2020 ఆరంభం నుంచి అతని టెస్టు బ్యాటింగ్‌లో పదును కాస్త నెమ్మదించింది. కోవిడ్ కారణంగా మ్యాచ్‌ల సంఖ్య తగ్గడంతో పాటు ఒకే తరహా జోరును కొనసాగించడంలో కోహ్లి విఫలమయ్యాడు. సెంచరీ మొహం చూసేందుకు మూడేన్నరేళ్లు పట్టాయి. 2021 ఇంగ్లండ్ పర్యటన కేవలం 2 అర్ధసెంచరీలతో నిరాశగా ముగియగా, 2023–24 దక్షిణాఫ్రికా పర్యటనలో కూడా అతని ముద్ర కనిపించలేదు. ఇటీవల ముగిసిన ఆ్రస్టేలియా సిరీస్‌లోనైతే పెర్త్ మినహా అతని బ్యాటింగ్ చూస్తే కెరీర్ ముగింపునకు వచి్చనట్లే అనిపించింది. జనవరి 2020 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఆడిన 39 టెస్టుల్లో కోహ్లి కేవలం 30.72 సగటుతో 2028 పరుగులు సాధించాడు. 3 శతకాలు మాత్రమే నమోదు చేయగలిగాడు. గత రెండేళ్లుగా అతని బ్యాటింగ్ సగటు 32.56 మాత్రమే. ఎలా చూసుకున్నా ఇది ఒక ప్రధాన బ్యాటర్‌కు సంబంధించి పేలవ ప్రదర్శనే. టెస్టు బ్యాటర్‌గా తన అత్యుత్తమ దశను ఎప్పుడో దాటిన కోహ్లి ఇప్పుడు కెరీర్‌ను హడావిడి లేకుండా ముగించాడు. పడి... పైకి లేచి... కోహ్లి వైఫల్యం గురించి చెప్పాలంటే అందరికీ గుర్తుకొచ్చేది 2014లో ఇంగ్లండ్‌లో జరిగిన ఐదు టెస్టుల సిరీస్. స్వింగ్‌కు అనుకూలించిన అక్కడి పరిస్థితుల్లో సరైన ఫుట్‌వర్క్ లేక ఒకే తరహాలో పదే పదే అవుట్ అవుతూ కోహ్లి అభిమానులను తీవ్రంగా నిరాశపర్చాడు. భారత నంబర్‌వన్ బ్యాటర్‌గా అక్కడ అడుగు పెట్టి అద్భుతాలు చేస్తాడనుకుంటే పూర్తిగా చేతులెత్తేశాడు. 10 ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 134 పరుగులతో ఘోరంగా విఫలం కావడమే కాదు... అప్పటి బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా రహస్యంగా గర్ల్‌ఫ్రెండ్ అనుష్క శర్మను టూర్‌కు తీసుకెళ్లి తీవ్ర విమర్శలపాలయ్యాడు.అయితే నాలుగేళ్లు తిరిగాయి... కోహ్లి ఆట మారింది. వ్యక్తిగా కూడా ఎంతో మారాడు. లోపాలను సరిదిద్దుకొని 2018లో మళ్లీ ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టాడు. ఏ బౌలర్‌నూ లెక్క చేయకుండా నాటి గాయాలూ మానేలా చెలరేగిపోయాడు. 2 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలతో ఏకంగా 593 పరుగులు సాధించి సిరీస్ టాపర్‌గా నిలిచాడు. ఇది కోహ్లిలోని పట్టుదలను, తాను విఫలమైన చోట మళ్లీ తానేంటో చూపించుకోవాలనే కసిని చూపించింది. ⇒ 4 భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో సచిన్ (15,921), ద్రవిడ్ (13,288), గావస్కర్ (10,122) తర్వాత నాలుగో స్థానంలో నిలిచిన కోహ్లి (9230)... అత్యధిక శతకాల జాబితాలో కూడా సచిన్ (51), ద్రవిడ్ (36), గావస్కర్ (34) తర్వాత 30 శతకాలతో నాలుగో స్థానంలోనే ఉన్నాడు. ⇒ 4 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన కెపె్టన్ల జాబితాలో గ్రేమ్ స్మిత్ (53), రికీ పాంటింగ్ (48), స్టీవ్ వా (41) తర్వాత కోహ్లి (40) నాలుగో స్థానంలో నిలిచాడు. ⇒ 7 కోహ్లి డబుల్ సెంచరీల సంఖ్య. ఓవరాల్ జాబితాలో బ్రాడ్‌మన్ (12; ఆస్ట్రేలియా), సంగక్కర (11; శ్రీలంక), లారా (9; వెస్టిండీస్) తర్వాత వాలీ హామండ్ (7; ఇంగ్లండ్), జయవర్ధనే (7; శ్రీలంక)లతో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు.

‘కష్టమే... కానీ సరైన నిర్ణయమే’
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లి తన మనసులో మాటకే కట్టుబడ్డాడు... టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవాలనుకున్న తన నిర్ణయంపై ఎలాంటి పునరాలోచన చేయలేదు... అతడిని ఒప్పించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. టెస్టుల నుంచి రిటైర్ అవుతున్నట్లు కోహ్లి సోమవారం అధికారికంగా ప్రకటించాడు. భారత టెస్టు క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా, సారథిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అతను 14 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ కోసం త్వరలోనే టీమ్‌ను సెలక్టర్లు ప్రకటించనున్న నేపథ్యంలో తన రిటైర్మెంట్ సమాచారాన్ని ముందుగానే బీసీసీఐకి తెలియజేయడం సరైందని విరాట్ భావించాడు. ఈ నిర్ణయం తీసుకోవడం కష్టంగానే అనిపిస్తున్నా అది సరైందేనని అతను పేర్కొన్నాడు. 2011 జూలైలో కింగ్స్టన్ వేదికగా వెస్టిండీస్‌తో తన తొలి టెస్టు ఆడిన కోహ్లి... 2025 జనవరిలో సిడ్నీలో ఆ్రస్టేలియాతో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. గత ఏడాది వరల్డ్ కప్ విజయం తర్వాత టి20 ఫార్మాట్ నుంచి రిటైర్ అయిన కోహ్లి ఇకపై వన్డేల్లోనే కొనసాగనున్నాడు. గత మంగళవారం రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించగా, ఆ్రస్టేలియా సిరీస్ మధ్యలోనే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తప్పుకోవడంతో తక్కువ వ్యవధిలో ముగ్గురు భారత సీనియర్లు ఈ ఫార్మాట్ నుంచి ని్రష్కమించినట్లయింది. ఎందుకీ వెనకడుగు? రోహిత్ టెస్టులకు గుడ్‌బై చెబితే పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు గానీ ఇప్పుడు కోహ్లి అనూహ్యంగా రిటైర్మెంట్ అనేశాడు. నిజానికి సవాళ్లను ఎదుర్కొనేందుకు కోహ్లి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కీలకమైన ఇంగ్లండ్ పర్యటన కోసం అతను కూడా సన్నద్ధమైనట్లు కనిపించింది. ఆస్ట్రేలియా టూర్ ముగిసిన తర్వాత ఐపీఎల్ ఆరంభానికి ముందు తన టెస్టు బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకునేందుకు ఎర్ర బంతితో సంజయ్ బంగర్ పర్యవేక్షణలో అతను తీవ్రంగా సాధన చేయడాన్ని బట్టి చూస్తే ఇప్పటికిప్పుడు టెస్టుల నుంచి తప్పుకోడని అర్థమైంది. అతని అద్భుతమైన ఫిట్నెస్ ఒక కారణం కాగా, ఇంగ్లండ్‌లో తన అనుభవంతో జట్టుకు మార్గదర్శిగా నిలిచే సత్తా అతనిలో ఉంది. రిటైర్మెంట్పై సరైన కారణంగా బయటికీ ఎవరికీ తెలియకపోయినా... వేర్వేరు కారణాలు అతడిని రిటైర్మెంట్ వైపు నడిపించాయి. తాను ఆశించినప్పుడు టెస్టు కెప్టెన్సీ మళ్లీ ఇవ్వకపోవడంతో నిరాశకు గురయ్యాడనని చెబుతున్నా... నాయకత్వం లేకపోతే ఆడలేనని చెప్పే తక్కువ స్థాయి కాదు అతనిది. జట్టు కోసం వంద శాతం శ్రమించే అతనికి ఇది పెద్ద విషయం కాదు. అయితే ప్రస్తుత స్థితిలో కొన్ని అంశాలు అతను తప్పుకోవడానికి కారణంగా కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్ సిరీస్‌తో కొత్తగా 2025–27 వరల్డ్ టెస్టు చాంపియన్íÙప్ సైకిల్ మళ్లీ మొదలవుతోంది. వచ్చే రెండేళ్ల పాటు కోహ్లి కొనసాగడం కష్టం కావచ్చు. యువ ఆటగాళ్లతో ప్రణాళికలు రూపొందించుకునే విధంగా తాను తప్పుకోవడమే సరైందని అతను భావించాడు. ఆ్రస్టేలియాతో తొలి టెస్టు సెంచరీ తర్వాత మిగతా 7 ఇన్నింగ్స్‌లు కలిపి 85 పరుగులే చేశాడు. ఇదే వైఫల్యం ఇంగ్లండ్‌లో కొనసాగితే మరింత చెడ్డపేరు రావచ్చు. ప్రస్తుత స్థితిలో మళ్లీ ఫామ్‌ను అందుకొని చెలరేగిపోగలననే నమ్మకం అతనిలో తగ్గినట్లుంది. బీసీసీఐ సూచనల మేరకు రంజీ ట్రోఫీ ఆడినా అక్కడా హిమాన్షు సాంగ్వాన్‌లాంటి సాధారణ బౌలర్ బంతికి క్లీన్‌బౌల్డ్ అయిన తీరు కూడా తన ఆటపై సందేహాలు రేకెత్తించి ఉంటుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కోరినట్లు ఇంగ్లండ్‌తో సిరీస్ వరకు ఆడినా కొత్తగా అతను సాధించేదేమీ ఉండదు. పైగా తీవ్ర ఒత్తిడి, అంచనాలు కూడా. రోహిత్ శర్మలాంటి బ్యాటర్ కూడా తప్పుకోవడంతో అందరి కళ్లూ ఇప్పుడు తన బ్యాటింగ్‌పైనే ఉంటాయి. అంత ఒత్తిడి అనవసరం అని అతను భావించి ఉంటాడు.టెస్టు క్రికెట్లో తొలిసారి బ్యాగీ బ్లూ ధరించి 14 ఏళ్లయింది. ఈ ఫార్మాట్ నాపై ఇంతగా ప్రభావం చూపిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. టెస్టు క్రికెట్ నన్ను పరీక్షించింది. తీర్చిదిద్దింది. జీవితానికి కావాల్సిన పాఠాలు నేర్పించింది. టెస్టులు ఆడటంలో వ్యక్తిగతంగా ఎంతో తృప్తి ఉంది. అందులోని తీవ్రత, సుదీర్ఘ రోజులు, కొన్ని కీలక క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోవడం కష్టంగా అనిపిస్తోంది. కానీ సరైన నిర్ణయమే. టెస్టు క్రికెట్‌కు నేను ఎంతో ఇచ్చాను. నేను ఆశించిన దానికంటే ఇది ఎక్కువ నాకు తిరిగి ఇచ్చింది. ఈ ఆటకు, నాతో కలిసి ఆడిన వారికి, అండగా నిలిచిన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నా టెస్టు కెరీర్ పూర్తి సంతృప్తితో ముగిస్తున్నా. #269 వీడ్కోలు. –వీడ్కోలు ప్రకటనలో విరాట్ కోహ్లి‘కెప్టేన్ ఫైర్’టీమిండియాను విదేశీ గడ్డపై కూడా వెన్నెముక ఉన్న జట్టుగా సౌరవ్ గంగూలీ నిలబెడితే ఎమ్మెస్ ధోని ‘కూల్ కెప్టేన్’గా జట్టును నడిపించి చూపించాడు. కానీ విరాట్ కోహ్లి అలాంటివాడు కాదు. అతను నాయకుడిగా ఒక రగులుతున్న అగ్నిపర్వతంలాంటివాడు. అప్పటి వరకు ఉన్న స్క్రిప్ట్‌ను తగలబెట్టిన అతను కొత్త నాయకత్వ లక్షణాలను రచించాడు. తన బౌలర్లు, ఫీల్డర్లనుంచి అతను వంద శాతంకు మించి ప్రదర్శనను ఆశించాడు. అందరికంటే ముందు తానే అది చేసి చూపించాడు. తన బౌలింగ్, ఫీల్డింగ్‌ను నమ్ముకొని ‘60 ఓవర్లు వీరికి నరకం కనిపించాలి’ అని లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌ను ఆడుకున్న తీరు మర్చిపోలేనిది.కోహ్లికి ముందు చూస్తే బ్యాటర్లయినా భారీ స్కోరుతో జట్టును గెలిపించాలి లేదా స్పిన్నర్లపై భారం ఉండేది. కానీ స్వదేశమైనా, విదేశీ పిచ్ అయినా పేసర్లను అద్భుతంగా వాడుకొని గెలిపించిన తీరు అసాధారణం. ఒక బ్యాటర్‌ను తగ్గించి అయినా అదనపు బౌలర్‌ను తీసుకొని ప్రత్యర్థిని ఆలౌట్ చేయడం, మ్యాచ్ గెలవడమే ముఖ్యంగా కోహ్లి వ్యూహరచన సాగింది. కోహ్లి కెప్టేన్సీలో పేస్ బౌలర్లు కేవలం 26 సగటుతో 591 వికెట్లు పడగొట్టారు. 80ల్లో వివ్ రిచర్డ్సన్ నాయకత్వంలో మాత్రమే పేసర్ల సగటు (22.89) ఇంతకంటే మెరుగ్గా ఉంది. 68 టెస్టుల్లో 40 మ్యాచ్‌లు గెలిపించి భారత అత్యుత్తమ కెప్టేన్‌గా అతను నిలిచాడు. ప్రతికూలతలను దాటి ఆ్రస్టేలియా గడ్డపై తొలి సారి టెస్టు సిరీస్ గెలిపించిన సారథిగా (2018–19) కోహ్లి చరిత్రలో నిలిచిపోయాడు. మరచిపోలేని కొన్ని ఇన్నింగ్స్ 115, 141 (అడిలైడ్, 2014): ధోని గైర్హాజరులో కెప్టెన్‌గా తొలి టెస్టు మ్యాచ్‌లో కోహ్లి అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం దక్కకుండా చేసిన అతను రెండో ఇన్నింగ్స్‌లో 364 పరుగుల లక్ష్య ఛేదనలో చివరి వరకు పోరాడాడు. 119, 96 (జొహన్నెస్‌బర్గ్, 2013): తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ సెంచరీతో భారత్‌కు ఆధిక్యం దక్కగా, రెండో ఇన్నింగ్స్ స్కోరుతో జట్టుకు గెలుపు అవకాశం సృష్టించాడు. 153 (సెంచూరియన్ 2018): కఠినమైన పిచ్‌పై 379 నిమిషాల పాటు పట్టుదలగా నిలబడి సాధించిన సెంచరీ. జట్టులో తర్వాతి అత్యుత్తమ స్కోరు 46 అంటే ఈ ఇన్నింగ్స్ విలువ అర్థమవుతుంది. 123 (పెర్త్, 2018): చేతి వేళ్లకు గాయాలు, హెల్మెట్‌కు దెబ్బలు, బ్యాటర్లంతా కుప్పకూలుతున్నారు. ఇలాంటి స్థితిలో అత్యుత్తమ పేస్, సీమ్ బౌలింగ్‌ను అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్‌పై ఎదుర్కొని చేసిన శతకం. ఇరు జట్లలో కలిపి ఇతర బ్యాటర్ల అత్యధిక స్కోరు 70 మాత్రమే. 254 నాటౌట్ (పుణే, 2019): కెరీర్లో అత్యధిక స్కోరు. స్వదేశంలో సఫారీ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ చేసిన డబుల్ సెంచరీలతో జట్టుకు విజయం. సచిన్ ‘100’ పదిలం!అంతర్జాతీయ క్రికెట్లో దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డు ఇక ఎప్పటికీ చెరిగిపోకపోవచ్చు. ఈ ఘనతను అధిగమించగల సత్తా ఉన్న ఒకే ఒక బ్యాటర్‌గా విరాట్ కోహ్లి కనిపించాడు. ఒక దశలో వరుస శతకాలు బాదుతున్న సమయంలో అతను చేరువగా వచ్చినట్లే అనిపించింది. ఆపై ఫామ్ కోల్పోయి కొంత కాలం సెంచరీ లేక విరాట్ కాస్త వెనుకబడ్డాడు. అయితే 2023 వన్డే వరల్డ్ కప్‌లో మూడు సెంచరీలు కొట్టిన కోహ్లి...ముంబైలోనే 50వ సెంచరీతో వన్డేల్లో సచిన్ అత్యధిక సెంచరీల రికార్డును సమం చేశాడు.ఆపై పెర్త్ టెస్టులో వంద బాదిన అతను... చాంపియన్స్ ట్రోఫీలో పాక్‌పై సెంచరీతో సచిన్ రికార్డును కూడా దాటాడు. దీంతో ఓవరాల్‌గా కోహ్లి సెంచరీల సంఖ్య 82కు చేరింది. కనీసం మరో రెండేళ్లు అటు టెస్టులు, ఇటు వన్డేలు ఆడి నిలకడైన ప్రదర్శన కనబరిస్తే 100 కష్టం కాదనిపించింది. కానీ ఇప్పుడు టెస్టులను కోహ్లి తప్పుకున్నాడు. తన ఫిట్నెస్, ఇష్టమైన ఫార్మాట్ దృష్ట్యా 2027 వన్డే వరల్డ్ కప్ కొనసాగి ఆపై రిటైర్ అయ్యే ఆలోచనతో కోహ్లి ఉండవచ్చు. ఆ మెగా టోరీ్నలోగా భారత్ వేర్వేరు జట్లతో మొత్తం 27 వన్డేలు ఆడాల్సి ఉంది. కోహ్లి వీటిల్లో ఎంత బాగా ఆడగలడనేది చెప్పలేం. ఎంత అద్భుతమైన ఫామ్, చెలరేగి ఆడినా సరే 27 వన్డేల్లో 18 సెంచరీలు దాదాపు అసాధ్యం! అలా చూస్తే సెంచరీల సెంచరీ రికార్డులు ఢోకా లేదు. నీ క్రికెట్ ప్రస్థానం ఎంతో మంది చిన్నారులు ఆటను ఎంచుకు⇒ నేందుకు స్ఫూర్తిగా నిలిచింది. నీ టెస్టు కెరీర్ నిజంగా చాలా అద్భుతంగా సాగింది. నువ్వు భారత క్రికెట్‌కు పరుగులు మాత్రమే ఇవ్వలేదు. కొత్తతరం వీరాభిమానులను, క్రికెటర్లను అందించావు. అభినందనలు. –సచిన్ టెండూల్కర్⇒ నువ్వు రిటైర్ అయ్యావంటే నమ్మలేకపోతున్నా. ఆధునిక క్రికెట్ దిగ్గజంగా, ఆటకు అసలైన రాయబారిగా నిలిచావు. మనం కలిసి పని చేసినప్పుడు ఎప్పటికీ మర్చిపోలేని ఎన్నో జ్ఞాపకాలను అందించావు. –రవిశాస్త్రి⇒ ఆధునిక క్రికెట్ యుగంలో టెస్టు ఫార్మాట్ కోసం అన్నీ ఇచి్చన అతి పెద్ద బ్రాండ్ కోహ్లి. టెస్టు క్రికెట్ అతనికి ఎంతో రుణపడి ఉంది. –సంజయ్ మంజ్రేకర్ ⇒ సింహంలాంటి పోరాటతత్వం ఉన్నవాడు. ఇకపై నీ లోటు కనిపిస్తుంది. –గౌతమ్ గంభీర్⇒ ‘నేను ఈ నిర్ణయాన్ని ఊహించలేదు. మరికొంత కాలం టెస్టులు ఆడగల సత్తా కోహ్లిలో ఉంది. అతనికి ఘనంగా మైదానంలో వీడ్కోలు దక్కాల్సింది. –అనిల్ కుంబ్లే

ఐపీఎల్ రీ షెడ్యూల్ ప్రకటన...
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలతో వాయిదా పడిన ఐపీఎల్ 18వ సీజన్లో మిగిలిన మ్యాచ్‌లను ఈ నెల 17 నుంచి తిరిగి నిర్వహించనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. కేంద్ర ప్రభుత్వం, పోలీసు సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, లీగ్ భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపిన బోర్డు మిగిలి పోయిన 17 మ్యాచ్‌ల్ని ఆరు వేదికలు బెంగళూరు, జైపూర్, న్యూఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్‌లలో నిర్వహిస్తామని ప్రకటించింది. మే 17 నుంచి 27 వరకు లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో రెండు ఆదివారాలు రాగా రెండేసి మ్యాచ్‌లు (డబుల్ హెడర్) నిర్వహిస్తారు. 29న తొలి క్వాలిఫయర్, 30న ఎలిమినేటర్, 1న రెండో క్వాలిఫయర్, 3న ఫైనల్‌తో ఈ సీజన్ ఐపీఎల్ ముగుస్తుంది. ‘ప్లేఆఫ్స్’ మ్యాచ్ వేదికల్ని తర్వాత ప్రకటిస్తారు. కాగా ఈ నెల 10న హైదరాబాద్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరగాల్సిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆఖరి పోరును 25వ తేదీన న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఈనెల 8న ధర్మశాలలో అర్ధాంతరంగా ఆగిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను 24న న్యూఢిల్లీలో మొదటి నుంచి నిర్వహిస్తారు.
బిజినెస్

క్విక్ కామర్స్ కంపెనీలో కీలక పెట్టుబడులు
న్యూఢిల్లీ: మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సహవ్యవస్థాపకులు మోతీలాల్ ఓస్వాల్, రామ్‌దేవ్ అగర్వాల్ తాజాగా క్విక్‌కామర్స్ కంపెనీ జెప్టోలో ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. విడిగా 5 కోట్ల డాలర్లు(రూ.424 కోట్లు) చొప్పున ఇన్వెస్ట్ చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సెకండరీ లావాదేవీ ద్వారా విదేశీ ఇన్వెస్టర్ల నుంచి వాటాలు కొనుగోలు చేసినట్లు వెల్లడించాయి. వీటి విలువ 10 కోట్ల డాలర్లు(రూ.848 కోట్లు)గా ఉంది.మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మరో 25 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. వెరసి పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఉన్న జెప్టో తాజా లావాదేవీ ద్వారా దేశీ యాజమాన్య వాటా పెంపువైపు సాగుతున్నట్లు తెలియజేశాయి. ప్రస్తుతం దేశీ యాజమాన్యానికి కంపెనీలో 42% వాటా ఉంది. ఇతర లావాదేవీల ద్వారా ఐపీవో కంటే ముందే వాటాను 50%కిపైగా పెంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: భారత సైన్యం వేతన వివరాలు ఇలా..2024 ఆగస్ట్‌లో సాధించిన 5 బిలియన్ డాలర్ల విలువలో లావాదేవీలు నమోదైనట్లు వెల్లడించాయి. కాగా.. మోతీలాల్ ఓస్వాల్ ఆధ్వర్యంలో ఎడిల్వీజ్, హీరో ఫిన్‌కార్ప్ తదితర సంస్థలు 25 కోట్ల డాలర్ల పెట్టుబడులను సమకూర్చనున్నట్లు సమచారం. తదుపరి దశలో భాగంగా 25 కోట్ల డాలర్ల పెట్టుబడికి జూన్‌లో తెరతీయనున్నట్లు తెలుస్తోంది.

పసిడికి అమ్మకాల సెగ
న్యూఢిల్లీ: పసిడి ఒకే రోజు భారీగా నష్టపోయింది. చైనా దిగుమతులపై విధించిన టారిఫ్‌లను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు అమెరికా ప్రకటించడంతో సురక్షిత సాధనమైన బంగారంలో అమ్మకాలు వెల్లువెత్తాయి. మరోవైపు భారత్–పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణపై అంగీకారం సైతం అమ్మకాలకు ఆజ్యం పోసింది. ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.3,400 నష్టపోయి రూ.96,550కు దిగొచ్చింది.ఇదీ చదవండి: భారత సైన్యం వేతన వివరాలు ఇలా..యూఎస్–చైనా మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతి సంకేతాలు వెలువడడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొంత చల్లబడడం బంగారం ధరల పతనానికి దారితీసినట్టు మెహతా ఈక్విటీస్ కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కళంత్రి తెలిపారు. వెండి కిలోకి రూ.200 నష్టపోయి రూ.99,700 స్థాయికి చేరింది. 2024 జూలై 23 తర్వాత ఒకే రోజు బంగారం ఎక్కువగా నష్టపోవడం ఇదే మొదటిసారి. చైనా ఉత్పత్తులపై 145% టారిఫ్‌లను 30%కి తగ్గించడానికి అమెరికా ఒప్పుకుంది. చైనా సైతం అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను 10%కి తగ్గించేందుకు ముందుకు వచ్చింది. రష్యా–ఉక్రెయిన్ మధ్య సంధి కుదరొచ్చన్న సంకేతాలతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు చల్లబడినట్టు ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ సీనియర్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు.

డెట్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వెల్లువ
న్యూఢిల్లీ: డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఏప్రిల్ నెలలో మంచి జోరు చూపించాయి. ఈ విభాగంలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఎక్కువ మంది ముందుకు వచ్చారు. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు, వాణిజ్య అనిశి్చతుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొంత రక్షణాత్మక ధోరణితో డెట్ విభాగం వైపు మొగ్గు చూపించినట్ట తెలుస్తోంది. ఫలితంగా ఏప్రిల్ నెలలో డెట్ మ్యూచువల్ ఫండ్స్ నికరంగా రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అంతకుముందు నెలలో (2025 మార్చిలో) ఇదే డెట్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.2.02 లక్షల కోట్లను ఉపసంహరించుకోవడం గమనార్హం. అంటే ఒక్క నెలలోనే ఇన్వెస్టర్ల ప్రాధాన్యంలో స్పష్టమైన మార్పు కనిపించింది. ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడంతో పెట్టుబడుల్లో మార్పులు–చేర్పులు కూడా ఇందుకు కారణమై ఉండొచ్చు. సంస్థాగత ఇన్వెస్టర్లు ముందస్తు పన్ను చెల్లింపులు, బ్యాలన్స్ షీట్ల సర్దుబాట్లు మార్చి నెలలో పెట్టుబడుల ఉపసంహరణకు కారణమై ఉండొచ్చని మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెచ్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహల్ మెస్రామ్ తెలిపారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి రూ.6,525 కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకోగా.. జనవరిలో రూ.1.28 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. లిక్విడ్ ఫండ్స్‌లోకే అధికం.. → డెట్‌లో లిక్విడ్ ఫండ్స్‌లోకి అత్యధికంగా ఏప్రిల్ నెలలో రూ.1.18 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. → ఓవర్‌నైట్ ఫండ్స్ రూ.23,900 కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్ రూ.31,507 కోట్ల చొప్పున పెట్టుబడులను ఆకర్షించాయి. → అల్ట్రా షార్ట్ ఫండ్స్‌లోకి రూ.26,734 కోట్లు, లో డ్యురేషన్ ఫండ్స్‌లోకి రూ.9,371 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. → గిల్ట్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.425 కోట్లను ఉపసంహరించుకున్నారు. క్రెడిట్ రిస్క్ ఫండ్స్ నుంచి రూ.302 కోట్లు, గిల్ట్ ఫండ్స్ నుంచి 39 కోట్లు చొప్పున బయటకు వెళ్లిపోయాయి. → మొత్తానికి ఏప్రిల్ నెలలో మ్యూచువల్ ఫండ్స్‌లోని అన్ని విభాగాల్లోకి కలిపి నికరంగా రూ.2.77 లక్షల కోట్ల పెట్టుబడులు వచి్చనట్టు యాంఫి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రూ.17.57 లక్షల కోట్ల నిర్వహణ ఆస్తులు ఏప్రిల్ చివరికి మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని డెట్ పెట్టుబడులు (ఏయూఎం) రూ.17.57 లక్షల కోట్లకు చేరాయి. అంతకుముందు మార్చి చివరికి డెట్ నిర్వహణ ఆస్తుల విలువ రూ.17.02 లక్షల కోట్లుగా ఉంది. ఇక డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్ల సంఖ్యలోనూ వృద్ధి కనిపించింది. ఏప్రిల్‌లో కొత్తగా 1.44 లక్షల ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) ప్రారంభమయ్యాయి. మొత్తం డెట్ ఫోలియోలు 79.36 లక్షలకు చేరాయి. డెట్‌లో మొత్తం 16 కేటగిరీలు ఉంటే అందులో 12 కేటగిరీల్లోకి నికరంగా పెట్టుబడులు వచ్చాయి. ‘‘ఏప్రిల్‌లో డెట్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు రాక పెరగడం అన్నది స్థిరాదాయ పథకాల పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న విశ్వసానికి నిదర్శనం’’అని మార్నింగ్ స్టార్ మెస్రామ్ తెలిపారు. లిక్విడ్ ఫండ్స్‌లోకి ఎక్కువ పెట్టుబడులు రావడం అన్నది స్వల్పకాల పెట్టుబడుల పట్ల ప్రాధాన్యాన్ని సూచిస్తున్నట్టు ఈక్విరస్ వెల్త్ ఎండీ అంకుర్ పంజ్ తెలిపారు.

డేటా సెంటర్లపై బిలియన్ డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: డిజిటల్ మౌలిక సదుపాయాల వ్యాపార కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా టెక్నో డిజిటల్ ఇన్ఫ్రా పేరిట సంస్థను ప్రారంభించినట్లు టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజినీరింగ్ కంపెనీ (టీఈఈసీఎల్) వెల్లడించింది. ఇది సుమారు 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో దేశవ్యాప్తంగా మొత్తం మీద 250 మెగావాట్ల సామర్థ్యంతో హైపర్‌స్కేల్, ఎడ్జ్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. చెన్నైలో 36 మెగావాట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్ (హెచ్‌డీసీ) కార్యకలాపాలను ప్రారంభించిన సందర్భంగా టీఈఈసీఎల్ ఈ విషయాలు పేర్కొంది. తదుపరి హెచ్డీసీలను కోల్‌కతా, నోయిడా ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. మరోవైపు, 23 రాష్ట్రాలవ్యాప్తంగా 102 నగరాల్లో ఎడ్జ్ డేటా సెంటర్లను నిర్మించేందుకు రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు టీఈఈసీఎల్ తెలిపింది. క్లౌడ్ మాధ్యమం ద్వారా పెద్ద కంపెనీలకు భారీ డేటా స్టోరేజీ, ప్రాసెసింగ్ సరీ్వసులు అందించేందుకు హెచ్డీసీలు ఉపయోగపడతాయి. యూజర్లకు సమీపంలో స్థానికంగా ఏర్పాటు చేసే చిన్న డేటా సెంటర్లను ఎడ్జ్ సెంటర్లుగా వ్యవహరిస్తారు.
ఫ్యామిలీ

వామ్మో..! రైలు 40 నిమిషాలు ఆలస్యమైతే ఇంతలానా..!
హైదరాబాద్ ముంబై వంటి మెట్రో నగరాల్లో ప్రజలు రాకపోకలకు లోకల్ రైళ్లపైనే ఆధారపడుతుంటారు. అది కామన్. అయితే ముంబై నగరంలోనో ఓ లేడీస్ స్పెషల్ ట్రైన్ కొద్ది నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు ఏ రేంజ్లో రద్దీగా ఉందో చూస్తే షాకవ్వుతారు. అది కూడా అమ్మాయిలే ఫుట్‌బోర్డుపై వేళ్లాడుతూ వెళ్తున్న విధానం చూస్తే నోటమాట రాదు. మరి అదెక్కడ జరిగిందో చదివేయండి మరీ..ముంబై మహానగరం అంతటా లక్షలాదిమంది ప్రయాణికులు ఈ లోకల్ రైళ్లపై ఆధారపడతారు. ఈ స్థానిక రైళ్లే ముంబైలోని వివిధ శివారు ప్రాంతాలను అనుసంధానించడంతో.. అక్కడ నివాసితులకు ఈజీగా రాకపోకలు సాగించడంలో కీలక పాత్రపోషించేది అవే. ఐతే అలాంటి ఓ రైలు మహిళతో ఫుల్ అయ్యి ఉన్నవీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. అదికూడా మహిళలే ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రయాణించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన ముంబై కళ్యాణ్ లేడీస్ స్పెషల్ లోకల్ రైలులో చోటుచేసుకుంది. అయితే ఆ రైలు 40 నిమిషాలు ఆలస్యంగా రావడంతో ఇంతలా హౌస్‌ఫుల్ అయ్యినట్లు సమాచారం. ఏకంగా మహిళలు కూడా ఏ మాత్రం భయపడకుండా ఫుట్‌బోర్డుపై ప్రయాణించడమే అత్యంత షాకింగ్ గురిచేసే విషయం. అందుకు సంబంధించిన వీడియోని ముంబౌ రైల్వే యూజర్స్ ఎక్స్ అకౌంట్ షేర్ చేసింది. అయితే నెటిజన్లు ఈ అసురక్షితమైన జర్నీలకంటే మరొక రైలు కోసం ఎదురుచూడటం మంచిదని పోస్ట్ చేయగా, మరికొందరు ఇలాంటి ప్రమాదకరమైన జర్నీలు తమ కుటుంబాలకు శాశ్వతాన్ని బాధను మిగులుస్తాయని హెచ్చరిస్తూ పోస్టులు పెట్టారు.#ViralVideo #CRFixLocalTrainDelays Today’s Ladies Special from Kalyan was delayed by 40 mins, forcing women to hang on the footboard—an unsafe and risky commute. Railways term this dangerous, yet delays continue. @AshwiniVaishnaw pls review delay data. @MumRail @rajtoday pic.twitter.com/vnhxTIyFD6— Mumbai Railway Users (@mumbairailusers) May 9, 2025 (చదవండి: ఆ హగ్ గుర్తొచ్చినప్పుడల్లా.. మనసు చివుక్కుమంటోంది! హృదయాన్ని కదిలించే పోస్ట్)

అది వీడ్కోలు అని తెలియక..! పాపం ఆ వ్యక్తి..
ఒక్కోసారి మన ఊహకే అందని విధంగా జరుగుతుంటాయి ఘటనలు. ఏదో పిడుగు అమాంతం పడ్డట్టుగా జీవితం పెద్ద కుదుపుకి గురవ్వుతుంది. ఆ ఘటన నుంచి తేరుకోవడానికే చాలా టైం పడుతుంది. పైగా అందులోంచి బయటపడతామని అనుకోం కూడా. అలాంటి పరిస్థితే ఎదురైంది ఢిల్లీకి చెందిన ఈ వ్యక్తికి. గుర్తొచ్చినప్పుడల్లా..ఎంత పొరపాటు చేశాను అనే గిల్టీ ఫీలింగ్ వెన్నాడుతుందంటూ భావోద్వేగంగా పోస్ట్ పెట్టాడు. అది ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌గా మారింది. లింక్డ్ఇన్లో ఢిల్లీకి చెందిన ప్రతాప్ సుతాన్ అనే వ్యక్తి గుండెల్ని మెలిపెట్టేలా ఓ పోస్ట్ పెట్టాడు. తన చివరి హగ్ గురించి మాట్లాడారు. ఆ రోజు ఆ ఆలింగనం చాలా సాధారణమైనది గానీ, ఇప్పుడు తలుచుకున్నప్పుడల్లా గుండె బరువెక్కిపోతుందని వాపోయాడు. అస్సలు అలా జరుగుతుంనదని ఎవ్వరూ ఊహించలేరు అంటూ తాను ఎదుర్కొన్ని విషాదకర అనుభవాన్ని పంచుకున్నారు. ఒకరోజు తన భార్యకి బాగోలేదని ఆస్ప్రతికి తీసుకువెళ్తున్నాను. ఇంతలో వెళ్లే ముందు ఎప్పటిలానే ఆమెకు ఏం కాదని ధైర్యం చెబుతూ హగ్ చేసుకుని మరీ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. చాలా నార్మల్‌గా హగ్ చేసుకున్నాడు. కానీ అదే తాను తన భార్యకిచ్చే చివరి హగ్ అని గ్రహించలేకపోతాడు. ఆ రోజు ఆస్పత్రికి వెళ్లడం.. పరిస్థితి విషమించడం, చనిపోవడం అన్ని క్షణాల్లో తన కళ్లముందే జరిపోయాయి. అయితే అది నేను చివరి వీడ్కోలు అని తెలియక చాలా సాదాసీదాగా నా భార్యను కౌగలించుకన్నా. అది కూడా ..కేవలం ఆమెకి అంతా బాగానే ఉంటుందని ఆశను కలిగించే ఉద్దేశ్యంతో హగ్ చేసుకున్నదే. కానీ తన భార్య మాత్రం అదే చివరిసారి అని గ్రహించే ఉంది కాబోలు..అంటూ భావోద్వేగంగా పోస్ట్ పెట్టారు. అంతేగాదు ఎన్నోసార్లు నా భార్యను హగ్‌చేసుకున్నా..కానీ ఏది గుర్తుకు రాదు..కానీ ఈ ఆలింగనం..చచ్చేంతవరకు అంటిపెట్టుకునేలా మోస్తున్నా అని బాధగా అన్నారు. ఆ ఘటన గుర్తొచ్చినప్పుడల్లా ప్రాణం పోతున్నంత బాధగా ఉంటుందన్నారు. మనకు సన్నిహితంగా ఉండే వ్యక్తులు లేదా మనం బాగా కనెక్ట్ అయ్యే వ్యక్తులు మిస్ అవ్వక ముందే ఒక్కసారి గాఢంగా హగ్ చేసుకోండని అన్నారు. అలాగే స్పర్శ శక్తిని గురించి కూడా వివరించారు. ప్రేమ లేదా కోల్పోయిన వాటి స్థితిస్థాపకతను వ్యక్తపరిచేదీ ఈ కౌగలింతేనని అన్నారు. అవి ఎలా ఉంటాయంటే..వృద్ధ తల్లిదండ్రులు తమ బిడ్డను దగ్గరకి తీసుకోవడం, తల్లి తన కొడుకును యుద్ధానికి బయలుదేరే ముందు ప్రేమగా హగ్‌చేసుకోవడం, ప్రేమికులు చాలా కాలం విడిపోయిన తర్వాత తిరిగి కలుసుకునేటప్పుడూ లేదా నిరాశ క్షణాల్లో నిశ్శబ్ద బలాన్ని అందించేలా వెన్నుతడుతున్నట్లుగా దగ్గరగా చేరదీసి హగ్ చేసుకోవడం వంటివని అన్నారు. చివరిగా తన భార్య తన నుంచి దూరమైపోతుందని తెలియక..హగ్ చేసుకున్న ఘటన జీవితాంత మర్చిపోలేనని, తాను ఉన్నంత వరకు మధురమైన జ్ఞాపకమే అని అన్నారు సుతాన్ పోస్ట్‌లో. అయితే నెటిజన్లుంతా చాలా మంచి పోస్ట్ పెట్టారు..ఒక కౌగిలింత జీవితాంతం భావోద్వేగాలను నిలుపుకోగలదని గుర్తుచేయడమేగాక, ముఖ్యమైన బంధాలకు ప్రాముఖ్యత ఇవ్వాలనేది హైలెట్ చేశారని ప్రశంసిస్తూ.. పోస్ట్‌లు పెట్టారు. (చదవండి: రోజూ బ్రేక్‌ఫాస్ట్‌గా బ్రెడ్ తింటున్నారా..? అంబానీ, సచిన్‌ల హెల్త్ కోచ్ షాకింగ్ విషయాలు)

ఆపరేషన్ సిందూర్ : 17 మంది బంగారు తల్లులు, అదో భావోద్వేగం!
టెర్రరిస్టులను మట్టుబెట్టేందుకు కేంద్రం ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య, ఆపరేషన్ సిందూర్ ఉగ్రమూకలకు చుక్కలు చూపింది. కోట్లాదిమంది భారతీయులకు ప్రేరణగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లోని ఒక మెడికల్ కాలేజీలో ఉత్సాహకరమైన పరిణామం చోటు చేసుకుంది.గత నెలలో పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకొనేందుకు పాకిస్తాన్‌పై భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఉత్సాహంతోనే తన బిడ్డలకు సిందూర్ పేరు పెట్టుకునేందుకు చాలామంది దంపతులు ముందుకొచ్చారు. మే 10 -11 తేదీలలో కుషినగర్ మెడికల్ కాలేజీలో రెండు రోజుల వ్యవధిలో జన్మించిన 17 మంది నవజాత బాలికలకు వారి కుటుంబ సభ్యులు సిందూర్ అని పేరు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్కే షాహి సోమవారం పిటిఐకి తెలియజేశారు.ఇది తమకు గర్వకారణమంటూ తల్లిదండ్రులను సంతోసం ప్రకటించారు. "పాకిస్తాన్‌కు తగిన సమాధానం ఇచ్చినందుకు" తాము ఈ నిర్ణయం తీసుకున్నామంటూ భారత సాయుధ దళాలను ప్రశంసించారు. "పహల్గామ్ దాడి తరువాత, భర్తలను కోల్పోయిన అనేక మంది వివాహిత మహిళల జీవితాలు నాశనమయ్యాయి. దానికి ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. దీనికి గర్విస్తున్నాజ ఇప్పుడు, సిందూర్ అనేది ఒక పదం కాదు, ఒక భావోద్వేగం. కాబట్టి మా కుమార్తెకు సిందూర్ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాము" ఇటీవల ఆడ శిశువుకు జన్మనిచ్చిన కుషినగర్ నివాసి అర్చన షాహి అన్నారు. ఆమె భర్త అజిత్ షాహి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 26 మంది అమాయకులను చంపినందుకు భారతదేశం ప్రతీకారం తీర్చుకున్నప్పటి నుండి, తన కోడలు కాజల్ గుప్తా తన నవజాత శిశువుకు సిందూర్ అని పేరు పెట్టాలని కోరుకుంటుందని పద్రౌనాకు చెందిన మదన్ గుప్తా అన్నారు.ఇదీ చదవండి: రూ. 2 లక్షలతో మొదలై రూ. 8,500 కోట్లకు, ఎవరీ ధీర"ఆ విధంగా, మేము ఈ ఆపరేషన్‌ను గుర్తుంచుకోవడమే కాకుండా ఈ రోజును పండగలా జరుపుకుంటాం" అని మిస్టర్ గుప్తా పిటిఐకి చెప్పారు. భతాహి బాబు గ్రామానికి చెందిన వ్యాసముని కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు, తమ నిర్ణయం తమ కుమార్తెలో ధైర్యాన్ని నింపుతుందని చెప్పాడు."నా కూతురు పెద్దయ్యాక, ఈ పదం అర్థాన్ని , పరమార్థాన్ని’ తెలుసుకుంటుంది. భారతమాత పట్ల విధేయత కలిగిన మహిళగా ఉంటుంది’’ అన్నారు. ఏప్రిల్ 22న దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక పట్టణం పహల్గామ్ సమీపంలోని బైసారన్ గడ్డి మైదానంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఇరవై ఆరు మంది మరణించగా, చాలామంది గాయపడ్డారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత-కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడానికి భారత సైన్యం మే 7న ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. ముఖ్యంగా మహిళా అధికారిణులు కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఈ ఆపరేషన్‌తో సంచలనం రేపడం విశేషం.ఇదీ చదవండి:138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో

ప్రత్యేక ఆకర్షణగా 103 దేశాల తాళజాతి వనం, ఎక్కడో తెలుసా?
ఓల్డ్‌మలక్‌పేట ఈ–సేవ వెనుక భాగంలో ఉన్న తాళజాతి వనం సందర్శకులను ఇట్టే ఆకర్షిస్తోంది. అక్కడ ఉండే చెట్లన్నీ పొట్టిగా, ఇంటి ఆవరణలో పెంచుకునేందుకు వీలుగా ఉంటాయి. 103 దేశాలకు చెందిన తాళజాతి చెట్లన్నీ ఒకే చోట ఏర్పాటు చేయడంతో ఆకర్షణతో పాటు ఆహ్లాదంగా ఉంటుంది. వీటితో పాటు వివిధ దేశాల్లోని సముద్ర తీర ప్రాంతాలలో పెరిగే మొక్కలు కూడా ఈ పార్కులో పెరుగుతున్నాయి. ఉదయం సాయంత్రం ఈ పార్కు సందర్శకులతో కిటకిటలాడుతోంది. వేసవిలో సందర్శకుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. బ్రెజిల్, జర్మని, ఆ్రస్టేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఈస్ట్ ఆసియా మొదలగు దేశాల నుంచి సేకరించిన వివిధ రకాల మొక్కలు ఈ పార్కులో జీవం పోసుకుంటున్నాయి. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సందర్శకులకు ప్రవేశం ఉంటుందని ప్రవేశం ఉచితమని అధికారులు పేర్కొంటున్నారు. – చాదర్‌ఘాట్ ఇదీ చదవండి: రూ. 2 లక్షలతో మొదలై రూ. 8,500 కోట్లకు, ఎవరీ ధీరతాళ జాతి మొక్కల ఉపయోగాలు:ఆహారం: తాళ జాతి మొక్కల నుండి మనం వివిధ రకాల ఆహారాన్ని తయారు చేయవచ్చు. ఉదాహరణకు, తాటి పండ్లను తినవచ్చు తాటి నూనెను తయారు చేయవచ్చు. తాళ జాతి మొక్కలు ఔషధ లక్షణాలను కలిగి ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో తాటి మొక్కలనుంచి తీసని కల్లునుఉపయోగిస్తారు.తాళ జాతి మొక్కలను వివిధ రకాలుగా వాడుకోవచ్చు, ఉదాహరణకు, తాటి కలపను ఉపయోగించి ఇల్లు కట్టవచ్చు. తాటి ఆకులతో ఇల్లు కట్టుకోవచ్చు. తాటి చాపలు , బుట్టలతోపాటు, అనేక రకాల అలకరణ వస్తువులను తయారు చేసుకోవచ్చు. మొదలనవి. పర్యావరణానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాతావరణాన్ని శుభ్రం చేయడంలో సహాయపడుతుంది , జీవరాసులకు నివాస స్థలాన్ని అందిస్తుంది.
ఫొటోలు
అంతర్జాతీయం

పాకిస్థాన్‌లో మరోసారి భారీ భూకంపం
పాకిస్థాన్‌లో ఇవాళ మధ్యాహ్నం మరోసారి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది. భూకంప తీవ్రత స్వల్పంగా ఉన్నప్పటికి పలు ప్రాంతాల్లో భారీగా ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. భూకంప కేంద్రం తజికిస్తాన్లోని అష్కాషెమ్కు పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ నుండి 34 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు ఎన్సీఎస్ తెలిపింది.కాగా, అంతకుముందు.. ఈ నెల 10న భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. 4.0 తీవ్రతతో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆందోళనకు గురైన పాకిస్థాన్ ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. తాజాగా, మరో భూకంపం రావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఎన్సీఎస్ నివేదిక ప్రకారం.. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉందని.. 29.67 డిగ్రీల ఉత్తర అక్షాంశం... 66.10 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద నమోదైంది.

పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి.. పలువురు పోలీసులు మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. దాయాది దేశం పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మృతి చెందినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. పాకిస్తాన్లో తాజాగా ఆత్మాహుతి దాడి ఘటన చోటుచేసుకుంది. ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్‌లో సోమవారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది. ఈ ఆత్మాహుతి దాడిలో ఇద్దరు పాకిస్తాన్ పోలీసులు మృతిచెందగా.. పలువురు గాయపడినట్టు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. An explosion near Ring Road, Mal Mandi in Peshawar, the capital of Khyber Pakhtunkhwa, leaves two dead and three injured. pic.twitter.com/oIwp31n0Sq— Aftab Mohmand (@AftabMohmand101) May 12, 2025

ట్రంప్ ఖతార్ పర్యటన.. భారీ బహుమతి రెడీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఖతార్ భారీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. విలాసవంతమైన 747-8 జంబో జెట్ విమానాన్ని ట్రంప్‌కు బహుమతిగా ఇవ్వనున్నట్లు సమాచారం. ట్రంప్ తన పర్యటనలో భాగంగా ఖతార్‌కు వచ్చినపుడు ఈ కానుకను ప్రకటించే అవకాశముంది. దీనిపై ఖతార్ ప్రభుత్వం అధికారికంగా ఇంకా స్పందించలేదు.వివరాల ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వారంలో మధ్యప్రాచ్య పర్యటనకు వెళ్లనున్నారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ట్రంప్.. ఖతార్ పాలక కుటుంబం నుంచి విలాసవంతమైన 747-8 జంబో జెట్ విమానాన్ని బహుమతిగా స్వీకరించనున్నట్లు సమాచారం. ట్రంప్ తన పర్యటనలో భాగంగా ఖతార్‌కు వచ్చినపుడు ఈ కానుకను ప్రకటించే అవకాశముంది. దీనిపై ఖతార్ ప్రభుత్వం అధికారికంగా ఇంకా స్పందించలేదు. ఒక విదేశీ ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద కానుకను అమెరికా అధ్యక్షుడు స్వీకరించడం, దాని చట్టబద్ధతపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.Qatar to Gift $400 Million Plane to President Trump:▪️According to ABC News, the Trump administration is set to accept a luxury Boeing 747-8 jumbo jet—valued at around $400 million—from the Qatari royal family.▪️The plane will serve as Air Force One for Trump until just… pic.twitter.com/d1H7OdyNmD— Beau Bannon🇺🇸 (@BeauBannon) May 11, 2025అయితే, విదేశీ ప్రభుత్వం నుండి ఇంత పెద్ద బహుమతిని అధ్యక్షుడు స్వీకరించడంపై విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అమెరికా రాజ్యాంగంలోని జీతాల నిబంధన, ఆర్టికల్ I, సెక్షన్ 9, క్లాజ్ 8, ప్రభుత్వ పదవిలో ఉన్న ఎవరైనా కాంగ్రెస్ అనుమతి లేకుండా ఏదైనా.. రాజు, యువరాజు లేదా విదేశీ రాష్ట్రం.. నుండి ఏదైనా బహుమతి, జీతం, కార్యాలయం లేదా బిరుదును స్వీకరించడాన్ని నిషేధిస్తుంది. ఈ నేపథ్యంలో, అమెరికా అధికారులు దీనికి అధ్యక్ష విమానానికి (ఎయిర్‌ఫోర్స్ వన్) తగ్గట్టుగా కొన్ని హంగులు సమకూర్చనున్నారు. 2029 జనవరిలో పదవీ విరమణ చేసేవరకు ఈ విమానాన్ని ట్రంప్ ‘ఎయిర్‌ఫోర్స్ వన్’కు కొత్త వెర్షనుగా ఉపయోగిస్తారు. సురక్షితమైన కమ్యూనికేషన్లు, ఇతర అవసరమైన సౌకర్యాలు జోడించాలని యోచిస్తున్నారు.

అవును.. మా యుద్ద విమానం ధ్వంసమైంది: పాక్ అధికారిక ప్రకటన
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. భారత ముప్పెట దాడి చేస్తూ పాకిస్తాన్‌కు చుక్కలు చూపించింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ యుద్ధ విమానంపై అటాక్ చేయడంతో అది ధ్వంసమైంది. ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తాన్ ఆర్మీకి చెందిన సీనియర్ అధికారి ఎట్టకేలకు అంగీకరించారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించారు.పాకిస్తాన్ సైన్యం, వైమానిక దళం, నావికాదళ సీనియర్ అధికారులు ఆదివారం అర్ధరాత్రి సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ.. ఇటీవల భారత్ జరిపిన దాడిలో పాకిస్తాన్ యుద్ధ విమానం ధ్వంసమైందని అధికారికంగా ప్రకటించారు. భారత్ దాడులను ఎదుర్కొనే క్రమంలో ఇలా జరిగిందన్నారు. అయితే నష్టం ఏ స్థాయిలో ఉందనే విషయంపై పూర్తి వివరాలు వెల్లడించలేదు. అయితే, భారత్-పాకిస్తాన్ మధ్య శనివారం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఈ ప్రకటన చేయడం గమనార్హం.ఇదే సమయంలో భారత పైలట్.. పాకిస్తాన్ సైన్యానికి పట్టుబడ్డారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చౌదరి స్పందించారు. ఇది ఫేక్ వార్త అని ఖండించారు. భారత్ పైలట్ ఎవరూ తమ ఆధీనంలో లేరని స్పష్టం చేశారు. అలాగే, భారత్ దాడులను తాము సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్టు చెప్పుకొచ్చారు. పాక్‌ను దెబ్బకొట్టాం..మరోవైపు.. ఆపరేషన్ సిందూర్‌లో భారత్ సాధించిన విజయాలను మన సైన్యం ఆదివారం వెల్లడించిన విషయం తెలిసిందే. పాక్ విమానాలను నేల కూల్చామని ఎయిర్ మార్షల్ ఎ.కె.భారతి తెలిపారు. అయితే, ఆ సంఖ్య ఎంత అన్నది ఆయన చెప్పలేదు. ‘‘మన సరిహద్దు లోపలికి పాక్ యుద్ధవిమానాలను రాకుండా నిరోధించాం. కాబట్టి వాటి శకలాలు మా దగ్గర లేవు. కాకపోతే కచ్చితంగా కొన్ని విమానాలను కూల్చాం’’ అని తెలిపారు.బ్రహ్మోస్ సూపర్ పవర్..ఇదిలా ఉండగా.. భారత్, పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో భారత్ తీసుకున్న ఓ కీలక నిర్ణయం శత్రువు వెన్నువిరిచేలా చేసింది. తన అమ్ముల పొదిలోని బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణులను వ్యూహాత్మకంగా వినియోగించడంతో.. అప్పటి వరకూ అణ్వాయుధాలున్నాయంటూ ప్రగల్బాలు పలికిన దాయాది దేశం వెన్నులో వణుకుపుట్టింది. మొత్తం పరిస్థితే మారిపోయింది. పాకిస్తాన్ అధికారిక రాజధాని ఇస్లామాబాద్ అయినా.. పాలన మొత్తం జరిగేది రావల్పిండి నుంచే. ఇక్కడ చక్లాలాలోని ఆ దేశ ఆర్మీ చీఫ్ కార్యాలయం నుంచే సైన్యానికి ఆదేశాలు వెళుతుంటాయి. శనివారం తెల్లవారుజామున భారత్ లక్ష్యంగా ఎంచుకున్న పాక్‌లోని కీలక ప్రాంతాల్లో రావల్పిండి సమీప నూర్ ఖాన్ వైమానిక స్థావరం అత్యంత ప్రధానమైనది. ఇక్కడ గగనతల రీఫ్యూయలర్ ట్యాంకర్ విమానాలు, భారీ రవాణా విమానాలు ఉన్నాయి. అప్పటికే పాకిస్థాన్ సైన్యం దిల్లీ లక్ష్యంగా ప్రయోగించిన ఫతాహ్-11 బాలిస్టిక్ క్షిపణులను భారత బలగాలు... గగనతల రక్షణ వ్యవస్థ ఎస్-400తో మధ్యలోనే పేల్చివేసింది. శుక్రవారం అర్ధరాత్రి శ్రీనగర్ నుంచి నలియా వరకు 26 లక్ష్యాలపైకి పాక్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించగా వాటన్నింటినీ భారత రక్షణ దళాలు సమర్థంగా అడ్డుకున్నాయని అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే.
జాతీయం

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి
వాషింగ్టన్: అమెరికాలోని లాంకాస్టర్ కౌంటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. ఒహియోలోని క్లీవ్‌లాండ్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు మృతి చెందినట్లు భారత కాన్సులేట్ వెల్లడించింది. ఈ ప్రమాదంలో మానవ్ పటేల్(20), సౌరవ్ ప్రభాకర్(23) మృతిచెందినట్లు ప్రకటిస్తూ కాన్సులేట్ సంతాపం వ్యక్తం చేస్తూ.. ట్వీట్ చేసింది.మే 10న లాంకాస్టర్ కౌంటీలోని పెన్సిల్వేనియా టర్న్‌పైక్ వద్ద వారి వాహనం చెట్టును ఢీకొట్టి.. ఆపై వంతెనను ఢీకొట్టిందని పెన్సిల్వేనియా పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో వాహనం ముందు సీటులో ఉన్న మరో వ్యక్తి గాయపడగా.. స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రభాకర్ వాహనాన్ని నడుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. Deeply saddened to learn about the unfortunate road accident in which two Indian students from Cleaveland State University, Manav Patel and Saurav Prabhakar lost their lives;Our thoughts and prayers are with their families during this difficult time. The Consulate is in touch…— India in New York (@IndiainNewYork) May 12, 2025

ప్రయాణికులకు అలెర్ట్.. ఆ నగరాలకు విమానాల రాకపోకలు బంద్!
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌తో భారత్- పాకిస్తాన్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాల కారణంగా కేంద్రం గగన తలంపై ఆంక్షలు విధించింది. అయితే, భద్రతా చర్యల దృష్ట్యా విమానాల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతాయని ఇండిగో,ఎయిరిండియా విమానయాన సంస్థలు ప్రకటించాయి. మే 13 నుంచి మే 17 అర్ధరాత్రి వరకు రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి.శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, రాజ్కోట్లకు రాకపోకలు నిర్వహించే ఇండిగో అన్ని విమానాలను శనివారం రాత్రి 11:59 గంటల వరకు రద్దు చేసింది. రద్దుతో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.ఎయిరిండియా మంగళవారం (మే 13) జమ్మూ, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్కోట్లకు విమానాల రాకపోకల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. తాజా పరిణామాలు, ప్రయాణికుల దృష్ట్యా మే 13న పైన పేర్కొన్న ప్రాంతాలకు విమానాల సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు ట్వీట్లో పేర్కొంది.#TravelAdvisoryIn view of the latest developments and keeping your safety in mind, flights to and from Jammu, Leh, Jodhpur, Amritsar, Bhuj, Jamnagar, Chandigarh and Rajkot are cancelled for Tuesday, 13th May.We are monitoring the situation and will keep you updated.For more…— Air India (@airindia) May 12, 2025

యుద్ధమంటే బాలీవుడ్ సినిమా కాదు
పుణె: యుద్ధం, పర్యవసానాలపై భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణె కీలక వ్యాఖ్యలు చేశారు. ‘యుద్ధమంటే సరదా కాదు, బాలీవుడ్ సినిమా అంతకంటే కాదు’అని పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధం నిలిచిపోవడంపై కొందరు చేస్తున్న విమర్శలకు ఆయనీ మేరకు బదులిచ్చారు. ఆదివారం పుణెలో జరిగిన ఒక కార్యక్రమంలో నరవణె మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌తోపాటు పీవోకేలోని ఉగ్ర శిబిరాలు, సైనిక మౌలిక వనరులపై భారత ఆర్మీ దాడులు, ఆ తర్వాత నాలుగు రోజులపాటు వైమానిక దాడులు, సరిహద్దుల్లో కాల్పులతో వారం పాటు దేశంలో ఉద్రిక్త పరిస్థితులు సాగాయని ఆయన తెలిపారు. ‘అనంతరం సైనిక దాడులకు పుల్‌స్టాప్ పెడుతున్నట్లు రెండు దేశాలు ప్రకటనలు చేశాయి. ఇది మిలిటరీ ఆపరేషన్‌కు విరామమే తప్ప, కాల్పుల విరమణ వంటిది మాత్రం కాదని మరోసారి నేను చెప్పాలనుకుంటున్నా. వచ్చే మరికొన్ని రోజుల్లో పరిణామాలు ఎలా మలుపులు తిరుగాయో మీరే చూడండి’అని ఆయన పేర్కొన్నారు. సైనిక దాడులను నిలిపివేయడం మంచిది కాదంటూ కొందరు చేస్తున్న వాదనపై మాట్లాడుతూ ‘యుద్ధంతో కలిగే వ్యయం అంకెలు, గణాంకాలను పరిశీలించండి. ఈ నష్టం మరీ ఎక్కువ కాకముందే, పూడ్చలేనంతగా మారడానికి ముందే యుద్ధాన్ని ఆపేయాలని తెలివైన వారెవరైనా అనుకుంటారు’అని చెప్పారు. దాడుల ద్వారా పాక్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలను మాత్రమే కాదు, వైమానిక స్థావరాల్లోని మౌలిక సౌకర్యాలకు సైతం తీవ్రంగా నష్టం కలిగించాం. వైఖరి మారకుంటే నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని పాక్ గ్రహించేలా చేయగలిగామని భావిస్తున్నాను. అందుకే పాక్ ఆర్మీ చేసేదిలేక కాల్పుల విరమణ కోసం మన ఆర్మీతో సంప్రదింపుల బేరానికి వచి్చంది’అని ఆర్మీ మాజీ చీఫ్ వివరించారు. రక్షణ వ్యయం కూడా పెట్టుబడే ‘అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇటువంటి దేశాలు రక్షణ కోసం ఎంత ఖర్చు చేయగలవు? రోజూ టీవీల్లో చూసే సమస్యల పరిష్కారానికి ఖర్చు చేయాలా? విద్య, ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రత, పారిశుధ్యం, ఇంకా ఇతర చాలా ముఖ్యమైన అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలా?అని ఆయన ప్రశ్నించారు. ‘మన బడ్జెట్లో రక్షణ రంగం వాటా 15 శాతం వరకు ఉంటోంది. ఇదీ ఒక రకమైన పెట్టుబడే. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇలాంటి బ్యాకప్ ప్లాన్ అవసరం. గతవారం ఆపరేషన్ సిందూర్‌తో అటువంటి ప్రణాళిక మనకు ఉందనే విషయం స్పష్టమైంది. రక్షణ బలగాలు సర్వ సన్నద్ధంగా, ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటే మనపై దాడి చేయాలనుకునే వాళ్లు ఒకట్రెండు సార్లు ఆలోచిస్తారు’అని ఆర్మీ మాజీ చీఫ్ నరవణె వివరించారు.యుద్ధం చివరి అస్త్రం ఆదేశాలొస్తే వెంటనే కదనరంగంలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్నానన్న నరవణె..ఈ విషయంలో తన మొట్ట మొదటి ప్రాధాన్యం దౌత్యానికే ఉంటుందన్నారు. ‘ఇతర దేశాలతో సమస్యలకు చర్చల ద్వారానే పరిష్కారం కనుగొనాలే తప్ప, యుద్ధానికి వెళ్లరాదు, హింస పరిష్కారం కాదు’అని కుండబద్దలు కొట్టారు. ‘యుద్ధం ఆషామాషీ కాదు. మన బాలీవుడ్ సినిమా కాదు. చాలా సీరియస్ వ్యవహారం. చిట్టచివరి అవకాశం లేక అస్త్రంగా మాత్రమే యుద్ధానికి దిగాల్సి ఉంటుంది. ఇది యుద్ధాల శకం కాదని మన ప్రధాని మోదీ చెప్పింది ఇందుకే. కొందరు మూర్ఖులు యుద్ధాన్ని మనపై రుద్దారు. యుద్ధంపై మనం ఉత్సాహం చూపరాదు’అని ఆయన అన్నారు.సామాజిక కోణం మరువరాదు యుద్ధంతో వాటిల్లే నష్టాల్లో సామాజికపరమైన కోణం కూడా ఉందన్న జనరల్ నరవణే..‘ఇతరత్రా నష్టాలతోపాటు యుద్ధంతో ప్రాణ నష్టం సైతం ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులను కోల్పోయే చిన్నారులుంటారు. ఇటువంటి నష్టాన్ని ఎవరూ పట్టించుకోరు. సన్నిహితులను కోల్పోయిన వారిని ఆ ఆవేదన జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. యుద్ధ దృశ్యాలను దగ్గర్నుంచి చూసేవారు పీటీఎస్డీ అనే మానసిక రుగ్మత బారినపడతారు. దీన్నుంచి బయటపడేందుకు కనీసం 20 ఏళ్లపాటు వీరికి చికిత్స కొనసాగించాల్సి ఉంటుంది’అని వివరించారు.

షెల్లింగ్ లేదు, కాల్పులు లేవు
జమ్మూ/శ్రీనగర్/చండీగఢ్: భారత్–పాకిస్తాన్ కాల్పుల విరమణ అనంతరం ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జమ్మూకశ్మీర్, నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు చాలా ప్రశాంతంగా ఉంది. 19 రోజుల్లో మొదటిసారిగా షెల్లింగ్, కాల్పులు జరగకుండా ఉన్నాయని ఆర్మీ తెలిపింది. ఏప్రిల్ 22న పహల్గాం దాడి తర్వాత కాల్పుల విరమణ ఉల్లంఘనలలో మొదటిసారి పూర్తిగా విరామం కనిపించింది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన కొన్ని గంటల తర్వాత, శనివారం రాత్రి, పాకిస్తాన్ జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు మీదుగా వరుస క్షిపణి, డ్రోన్ దాడులను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం మాత్రం ఎలాంటి హింసాత్మక ఘటనలు నమోదు కాలేదు. పూంచ్‌లోని సురాన్‌కోట్‌లో సాధారణ పరిస్థితులు తిరిగి నెలకొన్నాయి. పహల్గాం దాడి తరువాత ఏప్రిల్ 23 నుంచి మే 6 వరకు, నియంత్రణ రేఖ వెంబడి అనేక కాల్పుల ఘటనలు నమోదయ్యాయి. రెండు రోజుల కిందట సూరన్‌కోట్‌లో భారీ కాల్పులు జరిగాయి. దీనితో నివాసితులు భయాందోళనకు గురయ్యారు. దాడి తరువాత, నివాసితులు పట్టణం నుంచి పారిపోయారు. కొందరు సమీపంలోని కొండ గ్రామాలు మరియు బంకర్లలో ఆశ్రయం పొందారు. మరికొందరు జమ్మూలోని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. పరిస్థితి ఇప్పుడు మెరుగుపడటంతో, ప్రజలు త్వరలో పూంచ్‌లోని తమ ఇళ్లకు తిరిగి రావాలని ఆశిస్తున్నారు. శ్రీనగర్, పఠాన్‌కోట్, రాజౌరి, అఖ్నూర్, జమ్మూ, కుల్గాం, శ్రీ గంగానగర్, బుద్గాంలలో సాధారణ పరిస్థితికి అద్దం పడుతూ అనేక దృశ్యాలు ఆన్లైన్లో కనిపించాయి. సరిహద్దు ప్రాంతాలకే కాకుండా, చండీగఢ్‌తో సహా ఇతర ప్రాంతాల్లో ఆంక్షలు ఎత్తివేయడంతో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. రోజువారీ జీవితం తిరిగి ప్రారంభమైందని, పరిస్థితి ఇప్పుడు స్థిరంగా ఉందని చండీగఢ్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. దుకాణాలు, ఇతర వాణిజ్య సంస్థలు సాధారణ సమయాల ప్రకారం తెరిచి ఉండటానికి పోలీసులు అనుతించారు. అయితే పౌరులు ఎలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని డిప్యూటీ కమిషనర్ హెచ్చరించారు. పగటి పూట ఎలాంటి సమస్యలు లేవని, రాత్రి 7.30 గంటల తరువాత దుకాణాలు మూసివేస్తుండటంతో సాధారణ జనజీవనానికి ఇబ్బందేమీ లేదని, ప్రజల జీవనోపాధి కూడా ప్రభావితం కావడం లేదని జైసల్మేర్‌కు చెందిన ఓ వ్యక్తి వివరించారు.
ఎన్ఆర్ఐ

వైట్‌హౌస్‌లో కోనసీమ వాసికి కీలక బాధ్యత
ఐ.పోలవరం: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ కేంద్రంగా పనిచేసే సైబర్ సెక్యూరిటీ, మౌలిక సదుపాయాల భద్రతా సంస్థకు డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా తెలుగు వ్యక్తి డాక్టర్ గొట్టుముక్కల మధు (Gottumukkala Madhu) నియమితులయ్యారు. మధు తల్లిదండ్రులు గొట్టుముక్కల వెంకట సూర్య సత్యనారాయణరాజు (కొండరాజు), సత్యవాణి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం కేశనకుర్రు (Kesanakurru) గ్రామానికి చెందినవారు. మధు కాకినాడలో ఇంటర్ చదువుకొని ఏలూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఎంఎస్, ఎంబీఏ చేశారు. మోటోరోలా, శాంసంగ్ కంపెనీల్లో పనిచేశారు. ప్రస్తుతం అమెరికన్ సైబర్ సెక్యూరిటీ విభాగం (CISA)లో డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.చదవండి: అమరావతి ఐకానిక్.. అమాంతం పెరిగిన ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం

సలహా కమిటీ అడుగులు ముందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.యూఏఈలోని ఆల్‌కూజ్ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్ జిల్లా సోన్‌కు చెందిన ప్రేమ్‌సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్‌కు చెందిన స్వర్గం శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్ సలహా కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్‌లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది. బాధిత కుటుంబాలకు భరోసా యూఏఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్‌లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్ సత్యప్రసాద్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.చదవండి: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!శనివారం జరిగిన శ్రీనివాస్ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

టంపాలో నాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కోసం కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను టంపాలో నాట్స్ నిర్వహించింది. మొత్తం 12 వాలీబాల్ జట్లు, 5 మహిళా త్రోబాల్ జట్లు, 350 మందికిప గా తెలుగు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లతో తమ ప్రతిభను చాటేందుకు పోటీ పడ్డారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా రావడంతో క్రీడా ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. మహిళల త్రోబాల్ టోర్నమెంట్లో మొదటి బహుమతిని సన్‌షైనర్స్ జట్టు కైవసం చేసుకుంది. పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ ఛాంపియన్లుగా డైనమిక్ రచ్చ జట్టుగా నిలిచింది. టోర్నమెంట్ విజేతలకు బహుమతులు జూలై 4 నుండి 6 వరకు జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో బహుమతులు పంపిణి చేయనున్నారు. నాట్స్ కమ్యూనిటీ సేవల బృందం నుండి రంజిత్ పాలెంపాటి అవిశ్రాంత కృషి ఈ టోర్నమెంట్లు దిగ్విజయంగా జరగడంలో కీలక పాత్ర పోషించింది.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు. క్రీడాకారులు టోర్నమెంట్లో చూపిన క్రీడాస్ఫూర్తిని మల్లాది ప్రశంసించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాధవి యార్లగడ్డ, అపర్ణ కొడాలి, కార్తీక్ తుమ్మటి, శ్రీకాంత్ పాత్ర, శ్యామల, విజయ్ చిన్నం తదితరులు ఈ టోర్నమెంట్ల నిర్వహణకు తమ మద్దతును, సహకారాన్ని అందించారు. జూలైలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఇదే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను నాట్స్ టంపాలో నిర్వహించనుంది. నాట్స్ సంబరాల కమిటి, నాట్స్ క్రీడా కమిటీలు ఈ పోటీల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగనుంది. నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు విజేతలకు శుభాకాంక్షలు తెలియచేసారు. అందరూ టంపా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

NATS శాండియాగో లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
శాండియాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాలను ప్రారంభిస్తూ తెలుగు వారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే శాండియాగోలో నాట్స్ విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ శాండియాగో చాప్టర్ సమన్వయకర్తగా ప్రశాంతి ఊడిమూడి, మహిళా సాధికార సలహా మండలి సమన్వయకర్తగా హైమ గొల్లమూడికి బాధ్యతలు అప్పగించారు. శాండియాగో నాట్స్ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా కామ్య శిష్ట్లా, సోషల్ మీడియా సమన్వయ కర్త గా తేజస్వి కలశిపూడి, సేవా కార్యక్రమాల సమన్వయకర్త గా రామచంద్ర రాజు ఊడిమూడి, క్రీడా స్ఫూర్తి సమన్వయ కర్తగా సత్య హరిరామ్, ఆది మోపిదేవి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీరామనవమి నాడు శాండియాగో లో నాట్స్ విభాగం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని శాండియాగో నాట్స్ సమన్వయకర్త ప్రశాంతి ఊడిమూడి అన్నారు. శాండియాగో లో నాట్స్ తెలుగు వారికి శ్రీరామరక్షలా మారేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తనుష్ భగవత్ ,వీణ-ఋత్వ ఊడిమూడి గానామృతం, వయోలిన్‌తో ధ్రువ గౌరిశెట్టి ,పియానోతో విహాన్ మండపాక అందరిని అలరించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి,నాట్స్ సెక్రటరీ మధు బోడపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ మద్దినేని పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా లాస్ ఏంజెలెస్ చాప్టర్ నుండి నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి,జాతీయ మహిళా సాధికారత సమన్వయ కర్త రాజ్యలక్ష్మి చిలుకూరి,లాస్ ఏంజెలెస్ చాప్టర్ సమన్వయ కర్త మురళి ముద్దన, హెల్ప్ లైన్ సమన్వయ కర్త శంకర్ సింగం శెట్టి పాల్గొన్నారు. నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ఆధ్వర్యంలో నూతన చాప్టర్ సభ్యులను మనోహర్ మద్దినేని సభకు పరిచయం చేశారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శ్రీహరి మందాడి తమ అభినందనలు సందేశం ద్వారా పంపారు. భవిష్యత్తులో శాండియాగో నాట్స్ విభాగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి భరోసా ఇచ్చారు. అమెరికాలో తెలుగు సమాజ అభివృద్ధి దిశగా నాట్స్ జాతీయ వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందన్నారు. అమెరికాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి మదన్ పాములపాటి వివరించారు. శాండియాగో చాప్టర్ ఏర్పాటులో నాట్స్ జాతీయ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారే కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు. శాండియాగోలో ఇక నుంచి తెలుగువారికి నాట్స్ అండగా ఉందనే భరోసాను కల్పించే దిశగా శాండియాగో నాట్స్ సభ్యులు కృషి చేయాలని కోరారు.
క్రైమ్

ఏసీబీకి చిక్కిన సూర్యాపేట డీఎస్పీ, సీఐ
సూర్యాపేటటౌన్: సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, పట్టణ సీఐ వీరరాఘవులు ఏసీబీకి చిక్కారు. ఓ కేసులో రిమాండ్‌కు పంపించకుండా ఉండేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.25 లక్షలు డిమాండ్ చేసి.. రూ.16 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇద్దరూ ఆధారాలతో సహా ఏసీబీ అధికారులు సోమవారం పట్టుకున్నారు. రెండు గంటలకు పైగా చేసిన తనిఖీల్లో సరైన ఆధారాలు దొరకడంతో డీఎస్పీ, సీఐపై కేసు నమోదు చేసి మంగళవారం కోర్టులో హాజరు పర్చనున్నారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ జగదీశ్‌చందర్ తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేట పట్టణంలో ఓ స్కానింగ్ సెంటర్‌ను నడిపిస్తున్న వ్యక్తిపై గత నెలలో సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆయన్ను రిమాండ్‌కు తరలించకుండా ఉండాలంటే రూ. 25 లక్షలు ఇవ్వాలని సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, సీఐ వీరరాఘవులు డిమాండ్ చేశారు. తాను అంత పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చుకోలేనని చెప్పడంతో రూ.16 లక్షలైనా ఇవ్వాలంటూ ఆ వ్యక్తిపై ఒత్తిడి చేశారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక బాధితుడు ఈ నెల మొదటి వారంలో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అతను ఇచి్చన ఫిర్యాదును పరిశీలించి ఆధారాలు సేకరించారు. డీఎస్పీ, సీఐలపై గతంలోనూ పలు అవినీతి ఆరోపణలు ఉన్నట్టు తేలింది. కేసులో రిమాండ్ చేయకుండా ఉండటానికి, అతని స్కానింగ్ సెంటర్‌ను భవిష్యత్‌లో సక్రమంగా నడిపించడానికి డబ్బులు డిమాండ్ చేసినట్టు ఏసీబీ విచారణలో బట్టబయలైంది. పూర్తి ఆధారాలతో ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు చేశారు. ఈ సోదాల్లో డబ్బులు డిమాండ్ చేసినట్టు తేలడంతో డీఎస్పీ, సీఐలపై కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఏసీబీ అడిషనల్ ఎస్పీ కమలాకర్‌రెడ్డి, నల్లగొండ రేంజ్ ఏసీబీ టీం సభ్యులు పాల్గొన్నారు. లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫోన్ చేయండి ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ఏసీబీ ఉంటుందని, లంచం డిమాండ్ చేస్తే వెంటనే 1064కు కాల్ చేయాలని డీఎస్పీ జగదీశ్‌చందర్ తెలిపారు.

Ameerpet: స్నేహితుడి భార్యపై లైంగిక దాడికి యత్నం
అమీర్‌పేట(హైదరాబాద్): స్నేహితుడి భార్యపై కన్నేసిన ఓ కామాంధుడు భర్త ఇంట్లో లేని సమయంలో ఆమెపై లైంగిక దాడికి యత్నించిన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బల్కంపేటకు చెందిన మహిళ భర్త గతంలో ప్రైవేటు సంస్థలో పనిచేసేవాడు. అతడి స్నేహితుడైన పసుపులేటి వెంకట నరసింహారావు అలియాస్ పీవీ అనే వ్యక్తి అతడితో ఉద్యోగం మాన్పించి తన సొంత సంస్థ అయిన లోన్ వాలా డాట్ కామ్‌లో చేర్చుకున్నాడు. ఉద్యోగం ఇచ్చాననే సాకుతో తరచూ స్నేహితుడి ఇంటికి వెళ్లే వాడు. స్నేహితుడి భార్యపై కన్నేసిన అతను తన కోరిక తీర్చాలంటూ ఆమెను వేధిస్తున్నాడు. ఆమె ఫోన్‌కు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపేవాడు. బాధితురాలు ఈ విషయం భర్త దృష్టికి తీసుకెళ్లడంతో అతను పీవీ వద్ద పని మానేసి మరో సంస్థలో చేరాడు. ఆదివారం మధ్యాహ్నం స్నేహితుడు లేని సమయంలో ఇంట్లోకి చొరబడిన పీవీ ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. అతడి భారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. గర్భవతినని చెప్పినా వినిపించుకోకుండా లైంగిక దాడికి యత్నించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇష్టపడిన యువతి దక్కలేదని..
కూకట్పల్లి(హైదరాబాద్): తాను ఇష్టపడిన యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి ఆమె భర్తను దారుణంగా హత్య చేసిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా, అడవిపూడి గ్రామానికి చెందిన జగదీష్ అతడి సోదరుడు దుర్గా ప్రసాద్ కేపీహెచ్‌బీ కాలనీలోని సర్ధార్ పటేల్ నగర్లో నివాసం ఉంటున్నారు. వీరి సమీప బంధువు కాళ్ల వెంకటరమణ భగత్ సింగ్ నగర్లో ఉంటూ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. దుర్గా ప్రసాద్ భార్య, వెంకట రమణ భార్య అక్కా చెల్లెళ్లు కావటంతో మూడు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెంకట రమణ తరచూ దుర్గా ప్రసాద్, జగదీష్ ల వద్దకు వచ్చి వెళుతుండేవాడు. కాగా అదే గ్రామానికి చెందిన పవన్ ఎనిమిదేళ్ల క్రితం వెంకట రమణ భార్య శ్రావణి సంధ్యను వివాహం చేసుకునేందుకు ప్రయత్నించగా అతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆమెకు కాళ్ల వెంకటరమణతో వివాహం జరిపించారు. తనకు దక్కని శ్రావణి సంధ్య మరొకరిని పెళ్లి చేసుకోవడం జీర్ణించుకోలేని పవన్ అప్పటి నుంచి వారిపై కక్ష పెంచుకున్నాడు. పథకం ప్రకారం నగరానికి మకాం మార్చిన పవన్ కూడా కూకట్పల్లి ప్రాంతంలోనే ఉంటూ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శ్రావణి సంధ్యను వివాహం చేసుకున్న వెంకటరమణపై కక్ష పెంచుకున్న పవన్ అతడిని హత్య చేసేందుకు అతడి కదలికలపై నిఘా ఏర్పాటు చేశాడు. వెంకటరమణ తరచూ జగదీష్ ఇంటికి వస్తున్నట్లు గుర్తించిన పవన్ అదను కోసం ఎదురు చూస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం దీనిని పసిగట్టిన జగదీష్ తన ఇంటి ఎదుట నిలుచుని ఉన్న పవన్‌ను గుర్తించి ఇక్కడ ఎందుకు ఉన్నావని నిలదీయగా తన స్నేహితుల కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. వారం రోజుల క్రితం శ్రావణి సంధ్య, ఆమె సోదరి ఉమా మహేశ్వరితో కలిసి స్వగ్రామంలో పెళ్లికి వెళ్లింది. ఆదివారం రాత్రి వెంకటరమణ జగదీష్ ఇంటికి వచ్చినట్లు సమాచారం అందడంతో పవన్ తన స్నేహితులు మరో నలుగురితో కలిసి అక్కడికి వచ్చి మాటు వేశాడు. జగదీష్ ఇంటి గేటు స్కూటీని అడ్డు పెట్టి స్నేహితులతో కలిసి సిగరెట్ తాగుతూ ఉండటాన్ని గుర్తించిన జగదీష్ అతడిని నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పవన్ జగదీష్‌తో గొడవపడుతుండటాన్ని గుర్తించిన వెంకట రమణ బయటికి వచ్చి అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా పవన్ కత్తితో వెంకటరమణ చాతిలో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన వెంకటరమణ అక్కడికక్కడే కుప్పకూలడంతో పవన్, అతడి స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న డాక్టర్ సంజన సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని పరీక్షించగా వెంకటరమణ అప్పటికే మృతి చెందాడు. జగదీష్ ఫిర్యాదు మేరకు కేపీహెచ్‌బీ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రధాన నిందితుడు పవన్పరారీలో ఉన్నట్లు తెలిసింది.

బావమరుదులపై బల్లెంతో బావ దాడి
సీలేరు (అల్లూరి జిల్లా): ముగ్గురు బావమరుదులపై బావ బల్లెంతో దాడి చేయడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఘటన ఇది. అల్లూరి సీతారామరాజు జిల్లా, జీకే వీధి మండలం, సీలేరు మేజర్ పంచాయతీ, చింతపల్లి క్యాంపు గ్రామంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కిముడు కృష్ణ (36) కిముడు రాజు (40) కిముడు రాజు (25)అన్నదమ్ములు. వీరు ముగ్గురికీ వివాహాలు జరిగాయి. వీరికి నలుగురు, ముగ్గురు, ఇద్దరు చొప్పున పిల్లలున్నారు.బంధువు దినకార్యానికిగాను ఆదివారం చింతపల్లి క్యాంప్‌లో నివాసముంటున్న బావ వంతల గెన్ను ఇంటికి కుటుంబ సభ్యులతోసహా హాజరయ్యారు. బావ ఇంట్లోనే రాత్రి బస చేశారు. ఈ సమయంలో మద్యం తాగిన బావ తమ సోదరితో గొడవపడుతూ, కొడుతుండటంతో ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో మొదలైన గొడవ అర్ధరాత్రి దాటే వరకు జరుగుతూనే ఉంది.సుమారు ఒంటిగంట సమయంలో ఇంట్లో ఉన్న బల్లెంతో గెన్ను తన భార్య సోదరులను ఒకరి తర్వాత ఒకరిని కడుపులో పేగులు బయటికి వచ్చేలా పొడిచాడు. తరువాత బల్లెంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా, గాయాలతో ఉన్న రాజు అనే మరో బావ మరిదిని కుటుంబ సభ్యులు, స్థానికులు సీలేరు పీహెచ్‌సీకి తరలించి, మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తీసుకువెళ్లారు. పోలీసులు కేసు నమోదుచేసి, విచారణ జరుపుతున్నారు.నిందితునిపై ఇప్పటికే రెండు హత్య కేసులు నిందితుడు వంతల గెన్ను అత్యంత కిరాతకుడు. ఇతనిపై ఇప్పటికే రెండు హత్య కేసులు నమోదయ్యాయి. ఎనిమిదేళ్ల కిందట ఒడిశాలో ఒకరిని కిరాతకంగా నరికి చంపిన కేసులో జైలుకు వెళ్లాడు. తర్వాత సీలేరులో బంధువుల దగ్గరికి చేరాడు. నాలుగేళ్ల కిందట ఇదే గ్రామంలో వంతల గురువు అనే వ్యక్తిని గొడ్డలితో నరకగా కేసు నమోదై, జైలుకి వెళ్లొచ్చి ప్రస్తుతం చిన్నా చితకా పనులు చేస్తున్నాడు.