Top Stories
ప్రధాన వార్తలు
హెచ్ఎంపీవీ వైరస్‌పై తెలంగాణ సర్కార్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: HMPV (హ్యూమన్ మెటాఫ్యూమో వైరస్) వ్యాప్తిపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ తెలిపింది. భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. హెచ్ఎంపీవీ సోకితే జలుబు, దగ్గుతో పాటు ముక్కు మూసుకుపోవడం (శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారడం), ముక్కుకారడం, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని.. ఇది కొందరిలో ఊపిరితిత్తులను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉందని వైద్యారోగ్య హెచ్చరించింది.హెచ్ఎంపీవి వైరస్ కారణంగా తీవ్ర జ్వరం, చర్మంపై దద్దుర్లు (స్కిన్ ఇన్ఫెక్షన్) కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని.. జలుబు, దగ్గు, జ్వరం, చర్మ సమస్యలతో బాధపడేవారు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించింది. ఇమ్యూనిటీ సిస్టం బలహీనంగా వుండే చిన్నారులు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: HMPV Virus : ఆందోళన అవసరంలేదంటున్నభారత హెల్త్ ఏజెన్సీకరోనా మాదిరిగానే ఈ HMPV వైరస్ కూడా ఒకరి నుండి ఒకరికి సోకుతుంది. గాలి ద్వారా ఇది వ్యాపిస్తుంది. కాబట్టి కరోనా సమయంలో ఉపయోగించిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. అనారోగ్య సమస్యలతో రద్దీ ప్రాంతాలకు వెళ్లడంవల్ల ఇతరులు కూడా అనారోగ్యం బారినపడే అవకాశాలు ఉన్నాయని.. జన సామర్త్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిరిగితే HMPV వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదముందని.. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఏపీలో ప్రభుత్వ టీచర్లకు అందని జీతాలు
సాక్షి, విజయవాడ: ఏపీలో ప్రభుత్వ టీచర్ల (Government teachers)కు జీతాలు అందలేదు. 4వ తేదీ వచ్చిన కూడా ఉపాధ్యాయులకు చంద్రబాబు సర్కార్ (Chandrababu Govt) జీతాలు చెల్లించలేదు. ప్రతి నెలా 1వ తేదీన జీతాలు(Salaries) ఇస్తామని మేనిఫెస్టోలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రూ.5 వేల కోట్లు అప్పు తెచ్చి కూడా టీచర్లకి కూటమి ప్రభుత్వం జీతాలు చెల్లించలేదు. ప్రభుత్వ తీరుపై టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు చెల్లిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం. దాన్ని ఒక్క నెల ముచ్చటగా మార్చేసింది. తొలి నెల మినహా తర్వాత నెల నుంచి ఒకటో తేదీన ఉద్యోగులందరికీ జీతాలు, పెన్షనర్లు అందరికీ పెన్షన్లు జమ చేయడం లేదు. నూతన సంవత్సరంలోనూ నాలుగో తేదీ వచ్చినప్పటికీ వేతనాల కోసం సుమారు రెండు లక్షల మంది ఉపాధ్యాయులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఉపాధ్యాయులతోపాటు పలు శాఖల్లోని ఉద్యోగులకు ఈ నెల ఒకటో తేదీన వేతనాలు అందలేదు.ఇదీ చదవండి: ‘చంద్రబాబుగారూ.. ఇంత ద్రోహమా? ఇంతటి బరితెగింపా?’రెండో తేదీ కొంత మంది ఉద్యోగులకు వేతనాలను ప్రభుత్వం జమ చేయగా, అయితే 4వ తేదీ కూడా ఉపాధ్యాయులు ఎవరికీ జీతాలు అందలేదు. జీతాల కోసం ప్రతి నెలా ఎదురుచూపులు తప్పడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత నెల కూడా ఉపాధ్యాయులకు ఒకటో తేదీన వేతనాలు జమచేయలేదు. ప్రతి నెలా 6, 7 తేదీల వరకు జీతాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా ఇస్తామని.. గత ప్రభుత్వం ఏడాదికి రూ.10 వేలు ఇస్తే.. తమ ప్రభుత్వం ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సచివాలయంలో సీఎం మాట్లాడుతూ.. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.భూమిలేని వ్యవసాయ కుటుంబాలకూ ప్రతి ఏడాది రూ.12 వేలు ఇస్తామని రేవంత్ తెలిపారు. రేషన్‌కార్డు లేని వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించాం. జనవరి 26 నుంచి ఈ పథకాలన్నీ ప్రారంభం కాబోతున్నాయి. జనవరి 26కి ఒక ప్రత్యేకత ఉంది. అందుకే ఆరోజును మేం ఎంచుకున్నాం. రాళ్లు, రప్పలు, రోడ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిన భూములకు రైతు భరోసా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబడదు. గ్రామాల వారీగా రెవెన్యూ అధికారులు సమాచారం సేకరించి ప్రజలకు అన్నివిషయాలు వివరిస్తారు.’’ అని రేవంత్ చెప్పారు.కేబినెట్ కీలక నిర్ణయాలువ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసాప్రతి ఎకరాకు రూ.12 వేలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదంభూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా ఏటా రూ.12 వేలుసంక్రాంతి నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీరైతు భరోసాకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాగా నామకరణంజనవరి 26 నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీములుగు మున్సిపాలిటీకి కేబినెట్ ఆమోదంపంచాయతీ రాజ్‌లో 588 కారుణ్య నియామకాలకు ఆమోదం200 కొత్త గ్రామ పంచాయతీలకు కేబినెట్ ఆమోదంమరో 11 కొత్త మండలాలకు కేబినెట్ ఆమోదంఇదీ చదవండి: ఇకపై ప్రతి సోమవారం.. హైడ్రా కీలక నిర్ణయం
‘కేజ్రీవాల్.. అక్కడ నుంచి పారిపోరనే ఆశిస్తున్నా’
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly Elections) భాగంగా మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ తరఫున మాజీ ఎంపీ పర్వేష్ వర్మ(Parvesh Verma) పోటీకి సన్నద్ధమవుతున్నారు. ఈరోజు(శనివారం) బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో పర్వేష్ వర్మకు చోటు దక్కింది. కేజ్రీవాల్‌కు పోటీగా మాజీ ఎంపీ పర్వేష్ వర్మను పేరును ప్రకటించింది బీజేపీ.ఈ సందర్భంలో కేజ్రీవాల్(Arvind Kejriwal)పై తనదైన శైలిలో సెటైర్లు వేశారు పర్వేష్ వర్మ. తనను చూసి ఢిల్లీ సీటు నుంచి కేజ్రీవాల్ పారిపోడనే ఆశిస్తున్నా. తాను న్యూఢిల్లీలోని చాలా మంది ప్రజలకు ఉపాధి చూపించాలనుకుంటున్నా. అందుకోసం త్వరలో ఒక శిబిరాన్ని ఏర్పాటు చేస్తాను’ అని స్పష్టం చేశారు.కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో నివసించిన విలాసవంతమైన భవనం శీష్ మహల్. ఇది గత కొద్ది కాలంగా వార్తల్లో ప్రముఖంగా నిలుస్తోంది. దీనిపై ఇప్పటికే ప్రధాని మోదీ.. కేజ్రీవాల్‌పై ధ్వజమెత్తగా, తాజాగా పర్వేష్ వర్మ సైతం ఇదే అంశాన్ని లేవనెత్తారు.‘ఢిల్లీ ప్రజల తరఫున నేను కోరుతున్నది ఏమైనా ఉందంటే.. అది శీష్ మహల్ డోర్స్ ఓపెన్ చేయాలని అడుగుతున్నా. ఎందుకంటే అది ఢిల్లీ ప్రజల సొత్తు. అక్కడ ఏం జరిగింది అనేది ట్యాక్స్ పే చేస్తున్న ప్రజలు చూడాలి. దీనిపై ఢిల్లీ సీఎం అతిషికి లేఖ రాస్తున్నా’ అని పర్వేష్ పేర్కొన్నారు.ఇక బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో మరో మాజీ ఎంపీ రమేష్ బిధురి పేరును ప్రకటించారు. ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిపై రమేష్ బిధురి పోటీకి దిగుతున్నారు. బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో 29మందికి చోటు దక్కగా, మిగతా జాబితాను విడుదల చేయడానికి ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆప్ తన మొత్తం అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో కాస్త ముందంజంలో ఉంది.ఎవరీ పర్వేష్ వర్మ..!ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై పోటీకి దిగుతున్న క్రమంలో పర్వేష్ వర్మ ఎవరు అనే దానిపై చర్చ ,నడుస్తోంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే పర్వేష్ వర్మ. పదేళ్ల పాటు ఎంపీగా కొనసాగారు. 2014 నుంచి 2024 వరకూ వెస్ట్ ఢిల్లీ ఎంపీగా సేవలందించారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పర్వేస్ 5.78 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఢిల్లీ రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధిక మెజార్జీ కావడం విశేషం.ఇదీ చదవండి: నేను అద్దాల మేడ కట్టుకోలేదు
BGT: మూడు ఐపీఎల్ సీజన్లకు సరిపడా ఓవర్లు ఒక్కడే వేశాడు!
జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)... ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. దిగ్గజ క్రికెటర్ల నుంచి అభిమానుల వరకు అందరూ ఇదే మాట చెబుతారనడంలో సందేహం లేదు. గత కొన్నేళ్లుగా టీమిండియా పేస్ దళ నాయకుడిగా కొనసాగుతున్న బుమ్రా.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) 2024-25 సిరీస్‌లోనూ భారమంతా తానే మోస్తున్నాడు. గట్టెక్కించగలిగే వీరుడు బుమ్రాఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో సారథిగా భారత్‌కు భారీ విజయం అందించిన బుమ్రా.. సిడ్నీ టెస్టు సందర్భంగా మరోసారి సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులంతా బుమ్రా నామసర్మణ చేస్తున్నారు. ఆసీస్‌తో ఆఖరి టెస్టు గండాన్ని గట్టెక్కించగలిగే వీరుడు బుమ్రా మాత్రమే అని విశ్వసిస్తున్నారు. నిజానికి.. స్వదేశంలో జరిగే సిరీస్‌లలో టీమిండియా స్పిన్నర్లదే పైచేయి గా నిలుస్తుంది. కానీ విదేశీ గడ్డపై జరిగే సిరీస్‌లలో అక్కడి పిచ్‌లకు అనుగుణంగా పేస్ బౌలర్లు ప్రధాన పాత్ర వహిస్తారు. అయితే ఇక్కడే టీమిండియా మేనేజ్మెంట్ ముందు చూపుతూ వ్యవహరించడంలో విఫలమైందని చెప్పవచ్చు.షమీ ఉంటే బుమ్రాపై భారం తగ్గేదిఆస్ట్రేలియా వంటి ఎంతో ప్రాముఖ్యం గల సిరీస్ ముందుగా పేస్ బౌలర్లని పదును పెట్టడంలో బోర్డు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీకి గాయంతో దూరం కావడం భారత్ జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. షమీ ఎంతో అనుభవజ్ఞుడు. పైగా ఆస్ట్రేలియాలో గతంలో రాణించి తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు. షమీ అండగా ఉన్నట్లయితే బుమ్రా పై ఇంతటి ఒత్తిడి ఉండేది కాదన్నది వాస్తవం.గతంలో బుమ్రాతో పాటు భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ వంటి బౌలర్లు జట్టులో ఉన్నప్పుడు భారత్ పేస్ బౌలింగ్ పటిష్టంగా ఉండేది. మహమ్మద్ సిరాజ్ చాల కాలంగా జట్టులో ఉన్నప్పటికీ, నిలకడగా రాణించడం లో విఫలమయ్యాడనే చెప్పాలి.యువ బౌలర్లకు సరైన మార్గదర్శకత్వం ఏది?ఈ నేపధ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఎంతోమంది యువ బౌలర్లు రంగ ప్రవేశం చేస్తున్నప్పటికీ వారికి సరైన తర్ఫీదు ఇవ్వడంలోనూ.. సీనియర్ బౌలర్లు గాయాల బారిన పడకుండా వారిని సరైన విధంగా మేనేజ్ చేయడంలో భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు విఫలమైంది. ఐపీఎల్ పుణ్యమా అని భారత్ క్రికెట్‌కు ప్రస్తుతం పేస్ బౌలర్ల కొరత లేదు. కానీ ఉన్నవారికి సరైన తర్ఫీదు ఇచ్చి వారు అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో రాణించే విధంగా తీర్చిదిద్దడం కచ్చితంగా బోర్డుదే బాధ్యత. ఇటీవల కాలంలో ఉమ్రాన్ మాలిక్, మయాంక్ యాదవ్, నవదీప్ సైనీ, శార్దూల ఠాకూర్, అర్షదీప్ సింగ్, వరుణ్ ఆరోన్, టి నటరాజన్ వంటి అనేక మంది యువ బౌలర్లు ఐపీఎల్ క్రికెట్ లో రాణిస్తున్నారు. వారికి భారత్ క్రికెట్ జట్టు అవసరాలకి అనుగుణంగా సరైన రీతిలో తర్ఫీదు ఇస్తే బాగుంటుంది.వాళ్లకు అనుభవం తక్కువఇక తాజా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌కు బుమ్రా, సిరాజ్‌లతో పాటు ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా కూడా ఎంపికయ్యారు. అయితే, ఈ ముగ్గురూ అదనపు పేసర్లుగా అందుబాటులో ఉన్నప్పటికీ బుమ్రా, సిరాజ్‌లపైనే భారం పడింది. అయితే, సిరాజ్ నిలకడలేమి కారణంగా బుమ్రా ఒక్కడే బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది.నిజానికి.. బుమ్రా ఈ సిరీస్ లో సంచలనం సృష్టించాడు. ఒంటి చేత్తో తొలి టెస్టులో భారత జట్టుకి విజయం చేకూర్చాడు. ఈ సిరీస్‌లో ఇంతవరకు 12.64 సగటుతో 32 వికెట్లు పడగొట్టి, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పాడు.మూడు మార్లు ఐదు కన్నా ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు. 1977-78 ఆస్ట్రేలియా పర్యటనలో బిషన్ సింగ్ బేడీ 31 వికెట్ల రికార్డును బుమ్రా ఈ టెస్ట్ మ్యాచ్‌లో అధిగమించడం విశేషం. అయితే, ఆఖరిదైన సిడ్నీ టెస్టులో భాగంగా శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా బుమ్రా గాయపడ్డాడు. అయితే, మైదానం నుంచి నిష్క్రమించే ముందు బుమ్రా కీలకమైన ఆస్ట్రేలియన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ని అవుట్ చేయడం ద్వారా ఈ రికార్డు నెలకొల్పాడు.చివరి ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌పై అనిశ్చితి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG)లో జరుగుతున్న ఐదవ మరియు చివరి టెస్టులో రెండో రోజు ఆటలో అసౌకర్యానికి గురైన బుమ్రా మ్యాచ్ మధ్యలో వైదొలిగాడు. బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. మ్యాచ్ అనంతరం పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ మాట్లాడుతూ బుమ్రా పరిస్థితిపై వివరణ ఇచ్చాడు. బుమ్రా పరిస్థితిని భారత వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొన్నాడు. "జస్ప్రీత్ బుమ్రాకు వెన్నునొప్పి ఉంది. వైద్య బృందం అతడిని పర్యవేక్షిస్తోంది" అని వ్యాఖ్యానించాడు.3 ఐపీఎల్ సీజన్లకు సరిపడా ఓవర్లు వేశాడునిజానికి 2024 నుంచి ఇప్పటి దాకా(జనవరి 4) టెస్టుల్లో అత్యధిక బంతులు బౌల్ చేసింది బుమ్రానే. ఏకంగా 367 ఓవర్లు అంటే.. 2202 బాల్స్ వేసింది అతడే!.. ఈ విషయంలో బుమ్రా తర్వాతి స్థానంలో ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్(1852 బాల్స్) ఉన్నాడు.ఇక బుమ్రా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఇప్పటి వరకు 908 బంతులు వేశాడు. అంటే 151.2 ఓవర్లు అన్నమాట. ఇది ఐపీఎల్ మూడు సీజన్లలో ఒక బౌలర్ వేసే ఓవర్లకు దాదాపు సమానం. ఐపీఎల్లో 14 లీగ్ మ్యాచ్‌లు ఆడి.. ప్రతి మ్యాచ్‌లోనూ నాలుగు ఓవర్ల కోటాను బౌలర్ పూర్తి చేశాడంటే.. అతడి ఖాతాలో 168 ఓవర్లు జమవుతాయి. అదే.. 13 మ్యాచ్‌లు ఆడితే 156 ఓవర్లు. అదీ సంగతి. ఇంతటి భారం పడితే ఏ పేసర్ అయినా గాయపడకుండా ఉంటాడా? ఇందుకు బోర్డు బాధ్యత వహించనక్కర్లేదా?!చదవండి: నిజమైన నాయకుడు.. అసలైన లెజెండ్: సురేశ్ రైనా
‘చంద్రబాబుగారూ.. ఇంతటి బరితెగింపా?’
గుంటూరు, సాక్షి: హామీల అమలులో అలసత్వం.. నిర్లక్ష్యం.. ఎగవేత ధోరణి ప్రదర్శిస్తున్న కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ధ్వజమెత్తారు. తాజాగా తల్లికి వందనం ఎగవేత కూటమి సర్కార్‌ను నిలదీస్తూ ఎక్స్ ఖాతాలో ఆయన సుదీర్ఘంగా ఓ సందేశం ఉంచారు. ‘‘ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా? మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా తీసుకుంటారా? లక్షలమంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా?. అధికారంలోకి వస్తే తల్లికి వందనం అని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15వేలు చొప్పున ఇస్తామన్నారు, అధికారంలోకి రాగానే అంతకుముందు మేం ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని సైతం ఆపేశారు... వరుసగా కేబినెట్(Cabinet) సమావేశాలు జరుగుతున్నాయి కాని, తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదు. తీరా ఈ ఏడాదికి ఇవ్వమని కేబినెట్లో తేల్చిచెప్పేశారు. ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా పచ్చి దగా ఏమైనా ఉంటుందా?. చంద్రబాబుగారూ… ఎన్నికల వేళ మీరు, మీ కూటమి నాయకులు రాష్ట్రంలోని ప్రతిచోటా తల్లికి వందనంపై చేసిన ప్రచారం అంతా ఇంతాకాదు. ఇంటింటికీ తిరిగి కనిపించిన ప్రతి పిల్లాడినీ పట్టుకుని నీకు రూ.15వేలు, నీకు రూ.15వేలు, నీకు రూ.15వేలు అన్నారు. ఇద్దరుంటే రూ.30వేలు ఇస్తామన్నారు, ముగ్గురు ఉంటే రూ.45వేలు ఇస్తామన్నారు. నలుగురు ఉంటే రూ.60వేలు ఇస్తామన్నారు. ప్రజలకు మీరుచేసిన వాగ్దానం, మీరు చెప్పిన మాటలు ఆడియో, వీడియోల రూపంలో సాక్ష్యాధారాలుగా ప్రతిఒక్కరి సెల్ఫోన్లో ఉన్నాయి. వైఎస్సార్సీపీ(YSRCP) హయాంలో 44.48 లక్షల మంది తల్లులకు, దాదాపు 84 లక్షల మంది పిల్లలకు, రూ.26,067 కోట్లను మేము అందించి, అత్యంత విజయవంతంగా అమలుచేసిన అమ్మ ఒడిని ఆపేసినా, మీరు ఇస్తామన్న పథకం వస్తుందేమోనని బడికి వెళ్లే ఆ పిల్లలు, వారి తల్లులు ఈ 7-8నెలలుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. చివరకు వారి ఆశలపై నీళ్లు జల్లి, ఈ ఏడాది ఇవ్వమని నిస్సిగ్గుగా చెప్తున్నారు. ప్రజలకు ఒక మాట ఇచ్చి, దాన్ని నమ్మించి, వారి ద్వారా అధికారాన్ని తీసుకుని, ఇప్పుడు ఇవ్వలేమంటూ ఎలాంటి సంకోచంలేకుండా చెప్తున్నారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయింది చంద్రబాబుగారూ…?.. ఇక రైతు భరోసా(Rythu Bharosa) తీరు కూడా అలానే ఉంది. ఈ ఏడాది ఖరీఫ్, రబీ రెండు సీజన్లు అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారు. అదిగో, ఇదిగో అంటూ లీకులు ఇస్తున్నారు కాని, ఇప్పటివరకూ రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్కపైసా ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన ఆ ఏడాదే 2019 అక్టోబరులో ప్రారంభమై, అప్పటినుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం రూ.13,500 చొప్పున 53.58 లక్షల రైతుల చేతిలో, రూ.34,378కోట్లు మేము పెట్టాం. కేంద్రం ఇచ్చేది కాకుండా మీరు ఏడాదికి రూ.20వేలు ఇస్తామన్నారు. ఇప్పుడు ఖరీఫ్ అయిపోయిందీ, రబీకూడా అయిపోయింది. ఒక్కపైసా ఇవ్వలేదు. ఇన్ని కేబినెట్ మీటింగ్‌లు పెట్టుకున్నా… ఎప్పుడు ఇస్తామో చెప్పడంలేదు. ఇది రైతులను నిలువెల్లా మోసం చేయడం కాదా? రైతులకు పెట్టుబడి సహాయం లేదు, కనీస మద్దతు ధరా అందడంలేదు, ఉన్న ఉచిత పంటలబీమాను రద్దుచేశారు, ఆర్బీకేలను నిర్వీర్యంచేశారు. సంక్షోభంలో ఎవరైనా రైతులు దురదృష్టవశాత్తూ ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడంలేదుకదా, కనీసం పరామర్శకు కూడా నోచుకోవడం లేదు... ప్రతి పిల్లాడికి రూ.15వేలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే, అంతమందికీ అన్న తల్లికి వందనం అయినా మోసమే, రైతులకు పెట్టుబడి సాయంగా రూ.20వేలు ఇస్తామన్నదీ మోసమే, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ రూ.18వేలు అయినా మోసమే, నిరుద్యోగభృతి కింద ప్రతి పిల్లాడికీ రూ.36వేలు అయినా మోసమే, 50 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకూ రూ.48వేలు అయినా మోసమే, ఇంటింటికీ సేవలు అందిస్తూ మంచికి అర్థం చెప్పిన వాలంటీర్లకూ మీరు చేసింది మోసమే, ఈ మోసాలు అన్నింటికీ తోడు, మీ పాలనలో ప్రజలపై ఛార్జీలతో బాదుడే బాదుడు కనిపిస్తోంది. ప్రతి అడుగులోనూ స్కాంలే. ఇసుకను వదలడంలేదు, మద్యాన్ని వదలడంలేదు. చంద్రబాబుగారూ.. రోజులు గడుస్తున్నకొద్దీ, మీరు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటీ బయటకు వస్తూనే ఉన్నాయి. ఇవి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయి. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి, వారి గొంతుకై నిలుస్తుంది. ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాల అమలుకోసం వారి తరఫున నిలబడుతుంది’’ అని పేర్కొన్నారాయన. చదవండి👉: బలవంతంగా ఏపీ రాజకీయాలను అందులో ఇరికించారా?
మా అమ్మ ఎవర్నీ గాయపర్చలేదు, ఈ భారం మోయలేకున్నా!: పవిత్ర కూతురు
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ (Darshan), అతడి ప్రియురాలు పవిత్ర గౌడ (Pavithra Gowda) కొన్ని నెలలపాటు జైలు జీవితం గడిపారు. కొద్ది రోజుల క్రితమే ఇద్దరూ బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే ఆ సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటికీ వీరిద్దరిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. దీనిపై పవిత్ర గౌడ కూతురు ఖుషి గౌడ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఇలాంటి పోస్ట్ ఒకటి పెట్టాల్సి వస్తుందని నేను ఎన్నడూ అనుకోలేదు. కానీ మీ మాటలు మా మనసుకు గాయం చేస్తున్నాయి. దాన్ని అలాగే వదిలేయలేకపోతున్నాను.మీకేం తెలుసు?అర్థం పర్థం లేకుండా, మీకు మీరే అన్నీ నిర్ధారించేసుకుంటూ మా అమ్మ గురించి క్రూరంగా మాట్లాడుతున్నారు. అవి నా మనసును ఎంత బాధిస్తున్నాయో మీకేం తెలుసు? తను పడ్డ కష్టాలు, చేసిన త్యాగాలు మీకు తెలియదు. మీ సూటిపోటి మాటలపై తను నిశ్శబ్ధంలోనే పోరాటం చేస్తోంది. తన చుట్టూ ఉన్న ప్రపంచం కుప్పకూలిపోతుంటే కూడా ధైర్యంగా నిలబడింది. మా అమ్మే నా ప్రపంచం, బలం, ఇన్స్పిరేషన్. తను నాకు అమ్మ మాత్రమే కాదు నాన్న కూడా! నా జీవితంలో అన్ని పాత్రలు తనే పోషించింది. ఆవిడే నా సర్వస్వం.(చదవండి: గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు హీరోయిన్ డుమ్మా.. ఎందుకంటే?)అదే నన్నింకా బాధిస్తోంది!మా అమ్మ.. ప్రేమ, త్యాగానికి నిలువెత్తు నిదర్శనం. తన గురించి నేనెంత చెప్పినా తక్కువే! ఆవిడ గురించి తెలుసుకోకుండా తప్పుగా మాట్లాడటం అన్యాయం, దారుణం. నన్నింకా బాధిస్తుందేంటో తెలుసా? ఇప్పటికీ తనను ద్వేషిస్తున్నారు. తను అంత బాధ (జైలు జీవితం) అనుభవించినా కూడా ఇప్పటికీ తనను కాల్చుకు తింటున్నారు. నేను టీనేజర్‌ను. మీ అసహ్యకరమైన కామెంట్లు నన్నెంత బాధిస్తున్నాయో తెలుసా! మా అమ్మను దోషిగా నిలబెట్టారు. ఈ భారాన్ని నేను మోయలేకున్నాను.మా అమ్మ హీరోమా అమ్మ ఎప్పుడూ ఎవరినీ గాయపర్చలేదు. ఒక్కసారి కూడా తను ఎవర్నీ బాధపెట్టలేదు. పైగా తన సొంత ఖర్చులతో వేరేవారి బాగోగులు కూడా చూసుకునే మంచి మనిషి. అలాంటి తనపై మనసు లేని మనుషులు ఇంకా బురద చల్లాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. బాధగా ఉంది. తనకిలాంటి పరిస్థితి వచ్చినందుకు మరింత బాధగా ఉంది. మా అమ్మ ఉత్తమురాలు. ఏం జరిగినా నేను తన వెంటే ఉంటాను. దయచేసి ముందూవెనకా ఆలోచించి మాట్లాడండి. మా అమ్మ నాకు హీరో.. దాన్నెవరూ మార్చలేరు అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.అభిమాని హత్యకాగా పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపాడన్న కారణంతో కర్ణాటకకు చెందిన రేణుకాస్వామి (Renuka Swamy Murder Case)ని హీరో దర్శన్ చంపారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈమేరకు కొన్ని సాక్ష్యాలు సేకరించిన పోలీసులు గతేడాది జూలైలో దర్శన్, పవిత్రగౌడను అరెస్టు చేశారు. ఇటీవలే వీరు బెయిల్‌పై బయటకు వచ్చారు.చదవండి: టీవీలో నాన్నను చూసి మురిసిపోయిన క్లీంకార..వీడియో వైరల్
చిట్టినాయుడు కేసులకు భయపడం: కేటీఆర్
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆరు గ్యారెంటీల్లో అర గ్యారెంటీ మాత్రమే అమలైందని.. రేవంత్‌కు పరిపాలన చేతకావడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రైతు బంధుకు కొర్రీలు పెడుతున్నారన్న కేటీఆర్.. సీఎం రేవంత్‌రెడ్డిని కటింగ్ మాస్టర్‌గా అభివర్ణించారు. శనివారం.. సిరిసిల్ల బీఆర్ఎస్ కార్యాలయంలో ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటిలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, పుట్టమధు, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘రూ.2 లక్షల రుణమాఫీ అయ్యిందా? లేదా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి ఊరికి పోదామా అంటూ అసెంబ్లీలో అడిగితే సమాధానం లేదు. సర్వశిక్షా అభియాన్ వాళ్ల సమస్యను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామన్నాడు రేవంత్.. ఏమైంది?. కాంగ్రెస్ మాట తప్పిన ప్రభుత్వం. ఎప్పుడైనా నాట్లు పడేటప్పుడు పడాల్సిన రైతుబంధు.. ఓట్లు పడ్డప్పుడు వేసిన ఘనత కాంగ్రెస్‌ది. రైతు ప్రమాణ పత్రం రాయడమేంటి..?’’ అంటూ కేటీఆర్ నిలదీశారు.ఇదీ చదవండి: పదో ర్యాంకు వచ్చినా.. ఉద్యోగం ఇస్తలేరు..‘‘లక్షా 20 వేల కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశారు కేసీఆర్. రైతును బద్నాం చేసే మాట, దొంగగా చిత్రీకరించేలా ఏడు వేల కోట్ల రూపాయలు మళ్లించారని మాట్లాడిండు రేవంత్. రెండో పంట వేయని రైతులను తప్పుగా చిత్రీకరిస్తోంది రేవంత్ ప్రభుత్వం. టీచర్ అయితే రైతుబంధు కట్ అంటుండు రేవంత్. ఇప్పుడు సీఎం అంటే కటింగ్ మాస్టర్’’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.‘‘పర్రె మేడిగడ్డకు పడలే.. రేవంత్ పుర్రెకు పడ్డది. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కాంగ్రెసే ఏదో దొంగచాటుగా చేస్తోందనేది నా అనుమానం. స్థానిక సంస్థల ఎన్నికల సంవత్సరం కాబోతోంది ఈ ఏడాది. కాబట్టి ప్రేక్షకపాత్రకు పరిమితం కాకుండి. కేసులైనా భయపడకండి. చిట్టినాయుడు ఏం పీకలేడు. చిల్లర మిల్లర రాతలు రాయించేవారినీ వదిలిపెట్టం. బాక్సింగ్‌లో కిందపడ్డా నిలబడి కొట్లాడేటోడే వీరుడు. కాంగ్రెస్ 8, బీజేపీ 8 ఎంపీలైన్రు కానీ వచ్చింది గుండు సున్నా. కేసీఆర్ ఒక రోజు దేశంలో చక్రం తిప్పే రోజు ముందుంది..కాంగ్రెస్ నాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి 369 కోట్ల రెవెన్యూ మిగులుతో అప్పజెప్పితే.. మనం దిగిపోయేనాడు 5 వేల 564 కోట్ల మిగులుతో కాంగ్రెస్‌కు అప్పజెప్పాం. రెవెన్యూ మిగులు విషయంలో ముఖ్యమంత్రిదో మాట, ఉప ముఖ్యమంత్రిదో మాట. పదేళ్లలో 4 లక్షల 17 వేల కోట్లు మనం అప్పు చేస్తే.. కాంగ్రెస్ ఒక ఏడాదిలో 1 లక్షా 37 వేల కోట్ల అప్పుజేసింది. మేం చేసిన అప్పుల వల్ల జరిగిన అభివృద్ధి గురించి మేం చెప్తాం.. మీరు చెప్పగలరా?. హైడ్రా పేరిట పేదల పొట్ట కొట్టడం తప్ప ఏం చేసింది ఈ ప్రభుత్వం?. ఢిల్లీకి పంపుతున్నారు పైసలన్నీ. తెలంగాణా ఢిల్లీకి ఏటీఎం అయిపోయింది.కొడంగల్ భూములివ్వని కేసులో కూడా నన్ను ఇరికించే యత్నం చేశాడు. ఆరు కేసుల్లో ఎలా ఇరికిద్దామా అనే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వానిది. వాళ్లు కేసుల గురించి ఆలోచించని.. మనం రైతుల గురించి ఆలోచిద్దాం. త్వరలో సభ్యత్వ నమోదు ప్రారంభించి బూత్ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీలు వేసుకుందాం. రైతుభరోసాపై గ్రామాల్లో నాయకులంతా చర్చ పెట్టాలి. కోటి ఆరు లక్షల మంది నుంచి దరఖాస్తులు తీసుకుని ఏం చేసినట్టు?. మళ్ళీ ప్రమాణపత్రాలెందుకు?’’ అంటూ కేటీఆర్ విమర్శించారు.
TG: మరో ఘటన.. వాష్‌రూమ్‌లో వీడియో రికార్డింగ్..
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల టాయిలెట్లో అమ్మాయిల వీడియోలు చిత్రీకరించడం కలకలం రేపుతుంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఏబీవీపీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ కళాశాలలో పరీక్ష రాసేందుకు వచ్చిన నక్క సిద్ధార్థ అనే థర్డ్ ఇయర్ విద్యార్థి.. అమ్మాయిల టాయిలెట్ గోడపై సెల్ ఫోన్ నుంచి వీడియోలు చిత్రీకరించాడు దీన్ని గమనించిన ఓ విద్యార్థిని విషయాన్ని కళాశాల సిబ్బందికి తెలిపింది.వెంటనే ఆ ఫోను స్వాధీనం చేసుకున్న ప్రిన్సిపల్ షీ టీమ్స్‌కు సమాచారం ఇచ్చారు పరీక్ష పూర్తయిన ఆ విద్యార్థి తన సెల్ ఫోన్ చోరీకి గురైనట్టు ఫిర్యాదు చేయడం ఆశ్చర్యాన్ని గురిచేసింది అనుమానించిన ప్రిన్సిపల్ అతన్ని బయటకు వెళ్లకుండా అక్కడే ఉంచుకొని పోలీసులకు అప్పగించారు. అయితే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగితే తాము ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యార్థులు మాత్రం తమకు న్యాయం చేయాలని ఆ వీడియోలు ఏం రికార్డయిందనే అనే విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తనకు తెలిసిన వెంటనే సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించినట్టు చెప్తున్నారు. మొత్తంగా కళాశాల టాయిలెట్లలో జరిగిన వీడియో చిత్రీకరణ ఇప్పుడు సంచలనంగా మారింది.ఇదీ చదవండి: పోలీస్‌స్టేషన్‌లో మహిళతో నీచ కృత్యం.. డీఎస్పీ అరెస్ట్
కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు..!
ఐటీ రంగంలో దాదాపు 80 శాతం వరకు హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్ ప్రాంతాల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. అక్కడకు సుమారు 10 కిలోమీటర్ల పరిధిలో నివాసం ఉండాలంటే.. కోకాపేట ప్రాంతం చూసుకుంటే అక్కడ చదరపు అడుగు ధర దాదాపు రూ.12–14 వేల వరకు ఉంటోంది. మిగిలిన ప్రాంతాలన్నీ ఇప్పటికే బాగా రద్దీగా ఉంటున్నాయి. దాంతో ఇప్పుడు చాలామంది బాలానగర్ వైపు చూస్తున్నారు. - సాక్షి, సిటీబ్యూరోఒకప్పుడు బాలానగర్ అంటే పారిశ్రామికవాడ అని, భూగర్భ జలాలు కలుషితం అయ్యాయని, గాలి కూడా కాలుష్యంతో ఉంటుందని అనుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి అభిప్రాయాలు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నవి.. కేవలం నైఫర్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ), సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు మాత్రమే.ఒకప్పుడు ఇక్కడ ఉండే ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ (ఐడీపీఎల్) వంటి కంపెనీలు కొన్ని వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించినా, అది చాలాకాలం క్రితమే మూతపడింది. పైపెచ్చు, ఈ కంపెనీకి చెందిన 100 ఎకరాల భూముల్లో పచ్చదనం విస్తరించింది. ఇంతకుముందు బాలానగర్ దాటి చింతల్, గుండ్లపోచంపల్లి ప్రాంతాల వరకు గేటెడ్ కమ్యూనిటీలు విస్తరించాయి గానీ, బాలానగర్‌లో ఇంతకుముందు రాలేదు.లగ్జరీ నిర్మాణాలు షురూ.. ఇప్పుడిప్పుడే బాలానగర్ వైపు కూడా లగ్జరీ నిర్మాణాలు మొదలవుతున్నాయి. కోకాపేటతో సహా ఇతర ప్రాంతాల్లో లభించే సదుపాయాలన్నీ ఇక్కడ కూడా లభిస్తున్నాయి. కానీ, కోకాపేటలో చదరపు అడుగు దాదాపు రూ.12–14 వేలు ఉండగా, ఇక్కడ దాదాపు రూ.6 నుంచి రూ.7 వేలకే లభ్యమవుతున్నాయి. అంటే ఇంచుమించు కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.హైటెక్ సిటీకి బాలానగర్ ప్రాంతం కూడా దాదాపు 12–13 కిలో మీటర్ల దూరంలోనే ఉంది. అయితే, ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు వంటి మౌలిక సదుపాయాలు రావడంతో అర గంటలోపే బాలానగర్ నుంచి హైటెక్ సిటీకి చేరుకోవచ్చు. పైగా ఈ ప్రాంతంలో మంచి పెద్ద పెద్ద స్కూళ్లు, ఇంజినీరింగ్ కాలేజీలు కూడా ఇక్కడ ఉండటంతో పిల్లల చదువుల గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. మాల్స్, మల్టీప్లెక్సులు కూడా ఉండటంతో వినోదం, విహారానికి కూడా మంచి అవకాశాలున్నాయి.బాలానగర్ వైపు.. మాదాపూర్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో లగ్జరీ ఫ్లాట్లు కావాలంటే ఎంత లేదన్నా కనీసం రూ.6 నుంచి రూ.7 కోట్లకుపైగా పెట్టాలి. అదే బాలానగర్‌లో లగ్జరీ ఫ్లాటు అంటే దాదాపు 2 వేల చ.అ. విస్తీర్ణం ఉండే ఫ్లాటు అన్ని సౌకర్యాలతో కలిపి కూడా సుమారు రూ.కోటిన్నర– రెండు కోట్లలోపే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైటెక్ సిటీకి సమీపంలో ఇంత తక్కువ ధరలో, అన్ని సదుపాయాలు ఉన్న ప్రాంతంలో దొరకడం దాదాపు ఇంకెక్కడా లేదు. కాబట్టి, ఐటీ జనాలు క్రమంగా ఇప్పుడు బాలానగర్ వైపు చూస్తున్నారు. గతంలో వేర్వేరు ప్రాంతాల్లో పనిచేసినా, చివరకు హైదరాబాద్ వచ్చి స్థిరపడాలని అనుకుంటున్నవారు కూడా బాలానగర్ ప్రాంతం వైపు మొగ్గు చూపుతున్నారు.
తాగునీటి సమస్యకు ఫోన్‌కాల్ పరిష్కారం
రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
'మా అమ్మాయి నిప్పు'.. నటి బండారం బయటపెట్టిన సల్మాన్
వస్త్రాల ఎగుమతులు రూ.1.82 లక్షల కోట్లు
తండ్రైన టీమిండియా విధ్వంసకర ఆటగాడు
కలవరం సినిమా మొదలుపెట్టిన 'హిట్ లిస్ట్' హీరో
ఈ ఏడాది డిమాండ్ ఉండే ఏఐ మోడళ్లు
రెండు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ.. సౌతాఫ్రికా భారీ స్కోర్
ఇకపై ప్రతి సోమవారం.. హైడ్రా కీలక నిర్ణయం
బడ్జెట్‌కు ముందు వ్యవసాయ మంత్రులతో సమీక్ష
BGT: మూడు ఐపీఎల్ సీజన్లకు సరిపడా ఓవర్లు ఒక్కడే వేశాడు!
ఏకంగా 174 కిలోల బరువు తగ్గాడు, చివరకు..
బంగారం తగ్గిందండోయ్.. కొత్త ఏడాదిలో తొలిసారి..
IND Vs AUS: 'టెస్టు క్రికెట్ చరిత్రలోనే పంత్ ఒక అద్బుతం'
'దేవర'కు 100 రోజులు.. ఎన్ని కేంద్రాలు, ఎక్కడెక్కడ..?
వారెవ్వా!.. యశస్వి జైస్వాల్ ప్రపంచ రికార్డు
నూటికి ఒక్క తండ్రికి దక్కుతుందేమో ఇలాంటి అదృష్టం..!
కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు..!
87 లక్షల మందికి తల్లికి వందనం ఎగవేత
సినీ నటి సీత ఇంట్లో విషాదం
తాగునీటి సమస్యకు ఫోన్‌కాల్ పరిష్కారం
రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
'మా అమ్మాయి నిప్పు'.. నటి బండారం బయటపెట్టిన సల్మాన్
వస్త్రాల ఎగుమతులు రూ.1.82 లక్షల కోట్లు
తండ్రైన టీమిండియా విధ్వంసకర ఆటగాడు
కలవరం సినిమా మొదలుపెట్టిన 'హిట్ లిస్ట్' హీరో
ఈ ఏడాది డిమాండ్ ఉండే ఏఐ మోడళ్లు
రెండు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ.. సౌతాఫ్రికా భారీ స్కోర్
ఇకపై ప్రతి సోమవారం.. హైడ్రా కీలక నిర్ణయం
బడ్జెట్‌కు ముందు వ్యవసాయ మంత్రులతో సమీక్ష
BGT: మూడు ఐపీఎల్ సీజన్లకు సరిపడా ఓవర్లు ఒక్కడే వేశాడు!
ఏకంగా 174 కిలోల బరువు తగ్గాడు, చివరకు..
బంగారం తగ్గిందండోయ్.. కొత్త ఏడాదిలో తొలిసారి..
IND Vs AUS: 'టెస్టు క్రికెట్ చరిత్రలోనే పంత్ ఒక అద్బుతం'
'దేవర'కు 100 రోజులు.. ఎన్ని కేంద్రాలు, ఎక్కడెక్కడ..?
వారెవ్వా!.. యశస్వి జైస్వాల్ ప్రపంచ రికార్డు
నూటికి ఒక్క తండ్రికి దక్కుతుందేమో ఇలాంటి అదృష్టం..!
కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు..!
87 లక్షల మందికి తల్లికి వందనం ఎగవేత
సినీ నటి సీత ఇంట్లో విషాదం
సినిమా
మా అమ్మ ఎవర్నీ గాయపర్చలేదు, ఈ భారం మోయలేకున్నా!: పవిత్ర కూతురు
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ (Darshan), అతడి ప్రియురాలు పవిత్ర గౌడ (Pavithra Gowda) కొన్ని నెలలపాటు జైలు జీవితం గడిపారు. కొద్ది రోజుల క్రితమే ఇద్దరూ బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే ఆ సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటికీ వీరిద్దరిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. దీనిపై పవిత్ర గౌడ కూతురు ఖుషి గౌడ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఇలాంటి పోస్ట్ ఒకటి పెట్టాల్సి వస్తుందని నేను ఎన్నడూ అనుకోలేదు. కానీ మీ మాటలు మా మనసుకు గాయం చేస్తున్నాయి. దాన్ని అలాగే వదిలేయలేకపోతున్నాను.మీకేం తెలుసు?అర్థం పర్థం లేకుండా, మీకు మీరే అన్నీ నిర్ధారించేసుకుంటూ మా అమ్మ గురించి క్రూరంగా మాట్లాడుతున్నారు. అవి నా మనసును ఎంత బాధిస్తున్నాయో మీకేం తెలుసు? తను పడ్డ కష్టాలు, చేసిన త్యాగాలు మీకు తెలియదు. మీ సూటిపోటి మాటలపై తను నిశ్శబ్ధంలోనే పోరాటం చేస్తోంది. తన చుట్టూ ఉన్న ప్రపంచం కుప్పకూలిపోతుంటే కూడా ధైర్యంగా నిలబడింది. మా అమ్మే నా ప్రపంచం, బలం, ఇన్స్పిరేషన్. తను నాకు అమ్మ మాత్రమే కాదు నాన్న కూడా! నా జీవితంలో అన్ని పాత్రలు తనే పోషించింది. ఆవిడే నా సర్వస్వం.(చదవండి: గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు హీరోయిన్ డుమ్మా.. ఎందుకంటే?)అదే నన్నింకా బాధిస్తోంది!మా అమ్మ.. ప్రేమ, త్యాగానికి నిలువెత్తు నిదర్శనం. తన గురించి నేనెంత చెప్పినా తక్కువే! ఆవిడ గురించి తెలుసుకోకుండా తప్పుగా మాట్లాడటం అన్యాయం, దారుణం. నన్నింకా బాధిస్తుందేంటో తెలుసా? ఇప్పటికీ తనను ద్వేషిస్తున్నారు. తను అంత బాధ (జైలు జీవితం) అనుభవించినా కూడా ఇప్పటికీ తనను కాల్చుకు తింటున్నారు. నేను టీనేజర్‌ను. మీ అసహ్యకరమైన కామెంట్లు నన్నెంత బాధిస్తున్నాయో తెలుసా! మా అమ్మను దోషిగా నిలబెట్టారు. ఈ భారాన్ని నేను మోయలేకున్నాను.మా అమ్మ హీరోమా అమ్మ ఎప్పుడూ ఎవరినీ గాయపర్చలేదు. ఒక్కసారి కూడా తను ఎవర్నీ బాధపెట్టలేదు. పైగా తన సొంత ఖర్చులతో వేరేవారి బాగోగులు కూడా చూసుకునే మంచి మనిషి. అలాంటి తనపై మనసు లేని మనుషులు ఇంకా బురద చల్లాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. బాధగా ఉంది. తనకిలాంటి పరిస్థితి వచ్చినందుకు మరింత బాధగా ఉంది. మా అమ్మ ఉత్తమురాలు. ఏం జరిగినా నేను తన వెంటే ఉంటాను. దయచేసి ముందూవెనకా ఆలోచించి మాట్లాడండి. మా అమ్మ నాకు హీరో.. దాన్నెవరూ మార్చలేరు అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.అభిమాని హత్యకాగా పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపాడన్న కారణంతో కర్ణాటకకు చెందిన రేణుకాస్వామి (Renuka Swamy Murder Case)ని హీరో దర్శన్ చంపారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈమేరకు కొన్ని సాక్ష్యాలు సేకరించిన పోలీసులు గతేడాది జూలైలో దర్శన్, పవిత్రగౌడను అరెస్టు చేశారు. ఇటీవలే వీరు బెయిల్‌పై బయటకు వచ్చారు.చదవండి: టీవీలో నాన్నను చూసి మురిసిపోయిన క్లీంకార..వీడియో వైరల్
72 రోజుల్లోనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ పూర్తి.. నాలుగు నిమిషాలే వృథా!
సాధారణంగా ఏ డైరెక్టర్ అయినా రెండున్నర గంటల సినిమాను దాదాపు 3 గంటలకు పైగా నిడివితో షూట్ చేస్తాడు. ఎంత అనుభవం ఉన్న డైరెక్టర్ సినిమా అయినా సరే ఎడిటింగ్‌లో అరగంట సీన్స్ అయినా ఎగిరిపోతాయి. చాలా తక్కువ మంది మాత్రమే కావాల్సిన నిడివి మేరకు మాత్రం చిత్రీకరణ చేస్తారు. వారిలో పూరీ జగన్నాథ్, ఆర్జీవీ ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడా లిస్ట్‌లోకి అనిల్ రావిపూడి(Anil Ravipudi)ని కూడా ఎక్కించొచ్చు. ఎడిటింగ్‌కి అవకాశం లేకుండా ముందే లెక్కలు వేసుకొని సినిమాను కంప్లీట్ చేస్తున్నాడు. స్టార్ హీరో సినిమా అయినా సరే రెండు, మూడు నెలల కంటె ఎక్కువ సమయం తీసుకోవట్లేదు. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించాడు.నాలుగైదు నిమిషాలే వృథాసాధారణంగా స్టార్ హీరోలతో సినిమా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం ఏడాది సమయం అయినా పడుతుంది. రాజమౌళి లాంటి వాళ్లు అయితే మూడు ఏళ్లకు పైనే సమయం తీసుకుంటారు. కానీ అనిల్ రావిపూడి మాత్ర కేలవం 72 రోజుల్లో సినిమాను పూర్తి చేశాడు. అది కూడా స్టార్ హీరో సినిమా. అదే ‘సంక్రాంతికి వస్తున్నాం’((Sankranthiki Vasthunnam Movie). ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ప్రచార కార్యక్రమంలో భాగంగా అనిల్‌రావిపూడి మాట్లాడుతూ.. సినిమా మేకింగ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సినిమా షూటింగ్‌ని కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేశారట. అంతేకాదు ఐదారు నిమిషాల ఫుటేజ్ మాత్రమే వృథా అయిందట.‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం అనౌన్స్ చేసినప్పుడే ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించాం. తక్కువ సమయం షూటింగ్ ముగించుకోవాలనుకున్నాం. స్క్రిప్ట్ సమయంలోనే ఎడిటింగ్ చేసేశాం. ఫలానా సీన్ మూడు నిమిషాలు తీయాలనుకుంటే అంతే తీశాం. అందుకే 72 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. మొత్తం సినిమా దాదాపు 2.26 గంటల నివిడితో పూర్తయితే.. 2.22 గంటల నిడివితో సెన్సార్‌కు పంపాం. కేవలం ఐదారు నిమిషాలు మాత్రమే ఎడిట్ చేయాల్సి వచ్చింది. ఈ మూవీకి ఎంత బడ్జెట్ అవసరమో అంతకు ఏమాత్రం తగ్గకుండా తీశాం. క్వాలిటీ విషయంలోనూ అస్సలు రాజీపడలేదు’ అని అనిల్ రావిపూడి అన్నారు. సంక్రాంతి బరిలో..అనిల్ రావిపూడి దర్వకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేశ్(venkatesh) సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ నటించారు. సంక్రాంతికి కానుకగా.. జనవరి 14న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సంక్రాంతి బరిలో మరో రెండు బడా సినిమాలు కూడా విడుదల కానున్నాయి. అందులో ఒకటి రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది. ఇక బాలకృష్ణ-బాబీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ చిత్రం కూడా ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
గోవిందాను పెళ్లి చేసుకోవాల్సిందన్న హీరోయిన్.. నటుడి భార్య రియాక్షన్ ఇదే!
బాలీవుడ్ సీనియర్ జంట గోవింద (Govinda)- సునీత అహూజ పెళ్లి చేసుకుని నాలుగు దశాబ్దాలవుతోంది. 40 ఏళ్ల కాలంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. అవన్నీ అధిగమించుకుని ఇప్పటికీ అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటున్నారు. తాజాగా సునీత (Sunita Ahuja) ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.ఇప్పుడు కూడా తీసుకెళ్లమంటాహీరోయిన్ రవీనా టండన్ (Raveena Tandon) ఇప్పటికీ ఓ మాట అంటూ ఉంటుంది. గోవిందాను నాకంటే ముందే కలిసి ఉండాల్సిందని, అప్పుడు తనే పెళ్లి చేసుకునేదని చెప్తూ ఉంటుంది. అలా అన్నప్పుడల్లా ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. తనను తీసుకెళ్లిపో, అప్పుడు అతడి గురించి నీకు అర్థమవుతుందని సరదాగా బదులిస్తుంటాను అని చెప్పుకొచ్చింది.డజను సినిమాల్లోకాగా రవీనా- గోవింద.. దుల్జే రాజా, ఆంటీ నెం.1, బడే మియా చోటే మియా, సాండ్విచ్.. ఇలా దాదాపు డజను సినిమాల్లో కలిసి నటించారు. ఇటీవల అనుకోకుండా బుల్లెట్ తగిలి గోవింద గాయపడగా.. అప్పుడు రవీనా ఆస్పత్రికి వెళ్లి అతడిని పరామర్శించింది. గోవింద ప్రస్తుతం బాహె హాత్ కా ఖేల్, పింకీ డార్లింగ్, లెన్ డెన్: ఇట్స్ ఆల్ ఎబౌట్ బిజినెస్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.చదవండి: చిరంజీవితో ఫోటో దిగితే చాలనుకున్న 'దీప్తి'కి మెగా ప్రోత్సాహం
టీవీలో నాన్నను చూసి మురిసిపోయిన క్లీంకార..వీడియో వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన గారాలపట్టి క్లీంకార(Klin Kaara ) తొలిసారి టీవీలో నాన్నను చూసి మురిసిపోయింది. బుల్లితెరపై నాన్న కనిపించగానే ముద్దు ముద్దుగా మాట్లాడుతూ చరణ్ అలా చూస్తూ ఉండిపోయింది. దీనికి సంబంధించిన వీడియోని రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఎక్స్‌లో పోస్ట్ చేయగా..అది కాస్త వైరల్‌గా మారింది.వీడియోలో ఏముందంటే..?మెగా మనవరాలు క్లీంకార, ఉపాసన కలిసి ఇంట్లో టీవీలో రామ్‌చరణ్(Ram Charan) నటించిన ‘ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’డాక్యుమెంటరీ వీక్షిస్తున్నారు. ఈ సమయంలో తెరపై చరణ్ కనిపించగానే..క్లీంకార మురిసిపోయింది. నాన్నను చూపిస్తూ.. అలా ఉండిపోయింది. అంతేకాదు మా నాన్న అన్నట్లుగా సైగలు చేస్తూ.. హాయ్ చెప్పింది. తన తండ్రిని తొలిసారి బుల్లితెరపై చూసి క్లీంకార ఆనందం వ్యక్తం చేసిందంటూ ఉపాసన ట్వీట్ చేసింది.‘రామ్ చరణ్‌ని చూస్తుంటే గర్వంగా ఉంది. గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను’ అంటూ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. కాగా, ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రం గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియరా అద్వానీ హీరోయిన్గా నటించింది. దిల్ రాజు నిర్మాత. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఓటీటీలో ఆర్ఆర్ఆర్ డ్యాక్యుమెంటరీరాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటుతూ..ఆస్కార్ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా కోసం రాజమౌళి పడిన కష్టాన్ని తెలియజేస్తూ ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. ‘ఆర్ఆర్ఆర్-బిహైండ్ అండ్ బియాండ్’(RRR Behind and Beyond)పేరుతో రూపొందిన ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా మొత్తాన్ని ఎలా తీశారో రాజమౌళి వ్యాఖ్యానంతో పాటు టెక్నీషియన్స్ కామెంట్స్ కూడా ఈ డాక్యూమెంటరీలో ఉన్నాయి. Klinkaara excited to see her naana on TV for the first time. ❤️❤️❤️❤️❤️@AlwaysRamCharan sooo proud of u. Eagerly waiting for game changer. ❤️ pic.twitter.com/C8v9Qrv6FP— Upasana Konidela (@upasanakonidela) January 4, 2025
న్యూస్ పాడ్‌కాస్ట్
సుప్రీంకోర్టు రిఫర్ చేసిన కేసులో ఇంత నిర్లక్ష్యమా? మార్గదర్శి’ వ్యవహారంపై ఇంకెన్నాళ్లకు కౌంటర్లు దాఖలు చేస్తారు?
ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ సిక్స్ పథకాల్లో అన్నీ కోతలు, ఎగనామాలే... కూటమి సర్కారు తీరుపై మండిపడుతున్న ప్రజలు
అన్నదాతలకు అండగా కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు... డీఏపీపై వన్-టైమ్ స్పెషల్ ప్యాకేజీ పొడిగింపు
నయా సాల్.. నయా జోష్. ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ సంబరాలు
ఇస్రో పీఎస్ఎల్వీ ప్రయోగం విజయవంతం. కక్ష్యలోకి స్పాడెక్స్ జంట ఉపగ్రహాలు. జనవరి 7న డాకింగ్ ప్రక్రియ
ఆంధ్రప్రదేశ్ రైతులకు ఉచిత పంటల బీమాను దూరం చేసిన కూటమి సర్కారు... ప్రీమియం భారం భరించలేక రైతుల గగ్గోలు
ఫార్ములా-ఈ కార్ల రేసు కేసులో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌కు ఈడీ సమన్లు... వచ్చే నెల 7వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశం
ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు బిల్లుల బాదుడు, నయవంచక పాలనపై ఎగసిపడ్డ ప్రజాగ్రహం... వైఎస్సార్సీపీ పోరుబాట విజయవంతం
ఆర్థిక సంస్కరణల సారథి, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్సింగ్ అస్తమయం
ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో నేడో రేపో కేటీఆర్‌కు ఏసీబీ సమన్లు.. అర్వింద్‌కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలకు కూడా నోటీసులు ఇవ్వనున్న అధికారులు
క్రీడలు
BGT: మూడు ఐపీఎల్ సీజన్లకు సరిపడా ఓవర్లు ఒక్కడే వేశాడు!
జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)... ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. దిగ్గజ క్రికెటర్ల నుంచి అభిమానుల వరకు అందరూ ఇదే మాట చెబుతారనడంలో సందేహం లేదు. గత కొన్నేళ్లుగా టీమిండియా పేస్ దళ నాయకుడిగా కొనసాగుతున్న బుమ్రా.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) 2024-25 సిరీస్‌లోనూ భారమంతా తానే మోస్తున్నాడు. గట్టెక్కించగలిగే వీరుడు బుమ్రాఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో సారథిగా భారత్‌కు భారీ విజయం అందించిన బుమ్రా.. సిడ్నీ టెస్టు సందర్భంగా మరోసారి సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులంతా బుమ్రా నామసర్మణ చేస్తున్నారు. ఆసీస్‌తో ఆఖరి టెస్టు గండాన్ని గట్టెక్కించగలిగే వీరుడు బుమ్రా మాత్రమే అని విశ్వసిస్తున్నారు. నిజానికి.. స్వదేశంలో జరిగే సిరీస్‌లలో టీమిండియా స్పిన్నర్లదే పైచేయి గా నిలుస్తుంది. కానీ విదేశీ గడ్డపై జరిగే సిరీస్‌లలో అక్కడి పిచ్‌లకు అనుగుణంగా పేస్ బౌలర్లు ప్రధాన పాత్ర వహిస్తారు. అయితే ఇక్కడే టీమిండియా మేనేజ్మెంట్ ముందు చూపుతూ వ్యవహరించడంలో విఫలమైందని చెప్పవచ్చు.షమీ ఉంటే బుమ్రాపై భారం తగ్గేదిఆస్ట్రేలియా వంటి ఎంతో ప్రాముఖ్యం గల సిరీస్ ముందుగా పేస్ బౌలర్లని పదును పెట్టడంలో బోర్డు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీకి గాయంతో దూరం కావడం భారత్ జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. షమీ ఎంతో అనుభవజ్ఞుడు. పైగా ఆస్ట్రేలియాలో గతంలో రాణించి తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు. షమీ అండగా ఉన్నట్లయితే బుమ్రా పై ఇంతటి ఒత్తిడి ఉండేది కాదన్నది వాస్తవం.గతంలో బుమ్రాతో పాటు భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ వంటి బౌలర్లు జట్టులో ఉన్నప్పుడు భారత్ పేస్ బౌలింగ్ పటిష్టంగా ఉండేది. మహమ్మద్ సిరాజ్ చాల కాలంగా జట్టులో ఉన్నప్పటికీ, నిలకడగా రాణించడం లో విఫలమయ్యాడనే చెప్పాలి.యువ బౌలర్లకు సరైన మార్గదర్శకత్వం ఏది?ఈ నేపధ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఎంతోమంది యువ బౌలర్లు రంగ ప్రవేశం చేస్తున్నప్పటికీ వారికి సరైన తర్ఫీదు ఇవ్వడంలోనూ.. సీనియర్ బౌలర్లు గాయాల బారిన పడకుండా వారిని సరైన విధంగా మేనేజ్ చేయడంలో భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు విఫలమైంది. ఐపీఎల్ పుణ్యమా అని భారత్ క్రికెట్‌కు ప్రస్తుతం పేస్ బౌలర్ల కొరత లేదు. కానీ ఉన్నవారికి సరైన తర్ఫీదు ఇచ్చి వారు అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో రాణించే విధంగా తీర్చిదిద్దడం కచ్చితంగా బోర్డుదే బాధ్యత. ఇటీవల కాలంలో ఉమ్రాన్ మాలిక్, మయాంక్ యాదవ్, నవదీప్ సైనీ, శార్దూల ఠాకూర్, అర్షదీప్ సింగ్, వరుణ్ ఆరోన్, టి నటరాజన్ వంటి అనేక మంది యువ బౌలర్లు ఐపీఎల్ క్రికెట్ లో రాణిస్తున్నారు. వారికి భారత్ క్రికెట్ జట్టు అవసరాలకి అనుగుణంగా సరైన రీతిలో తర్ఫీదు ఇస్తే బాగుంటుంది.వాళ్లకు అనుభవం తక్కువఇక తాజా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌కు బుమ్రా, సిరాజ్‌లతో పాటు ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా కూడా ఎంపికయ్యారు. అయితే, ఈ ముగ్గురూ అదనపు పేసర్లుగా అందుబాటులో ఉన్నప్పటికీ బుమ్రా, సిరాజ్‌లపైనే భారం పడింది. అయితే, సిరాజ్ నిలకడలేమి కారణంగా బుమ్రా ఒక్కడే బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది.నిజానికి.. బుమ్రా ఈ సిరీస్ లో సంచలనం సృష్టించాడు. ఒంటి చేత్తో తొలి టెస్టులో భారత జట్టుకి విజయం చేకూర్చాడు. ఈ సిరీస్‌లో ఇంతవరకు 12.64 సగటుతో 32 వికెట్లు పడగొట్టి, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పాడు.మూడు మార్లు ఐదు కన్నా ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు. 1977-78 ఆస్ట్రేలియా పర్యటనలో బిషన్ సింగ్ బేడీ 31 వికెట్ల రికార్డును బుమ్రా ఈ టెస్ట్ మ్యాచ్‌లో అధిగమించడం విశేషం. అయితే, ఆఖరిదైన సిడ్నీ టెస్టులో భాగంగా శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా బుమ్రా గాయపడ్డాడు. అయితే, మైదానం నుంచి నిష్క్రమించే ముందు బుమ్రా కీలకమైన ఆస్ట్రేలియన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ని అవుట్ చేయడం ద్వారా ఈ రికార్డు నెలకొల్పాడు.చివరి ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌పై అనిశ్చితి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG)లో జరుగుతున్న ఐదవ మరియు చివరి టెస్టులో రెండో రోజు ఆటలో అసౌకర్యానికి గురైన బుమ్రా మ్యాచ్ మధ్యలో వైదొలిగాడు. బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. మ్యాచ్ అనంతరం పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ మాట్లాడుతూ బుమ్రా పరిస్థితిపై వివరణ ఇచ్చాడు. బుమ్రా పరిస్థితిని భారత వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొన్నాడు. "జస్ప్రీత్ బుమ్రాకు వెన్నునొప్పి ఉంది. వైద్య బృందం అతడిని పర్యవేక్షిస్తోంది" అని వ్యాఖ్యానించాడు.3 ఐపీఎల్ సీజన్లకు సరిపడా ఓవర్లు వేశాడునిజానికి 2024 నుంచి ఇప్పటి దాకా(జనవరి 4) టెస్టుల్లో అత్యధిక బంతులు బౌల్ చేసింది బుమ్రానే. ఏకంగా 367 ఓవర్లు అంటే.. 2202 బాల్స్ వేసింది అతడే!.. ఈ విషయంలో బుమ్రా తర్వాతి స్థానంలో ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్(1852 బాల్స్) ఉన్నాడు.ఇక బుమ్రా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఇప్పటి వరకు 908 బంతులు వేశాడు. అంటే 151.2 ఓవర్లు అన్నమాట. ఇది ఐపీఎల్ మూడు సీజన్లలో ఒక బౌలర్ వేసే ఓవర్లకు దాదాపు సమానం. ఐపీఎల్లో 14 లీగ్ మ్యాచ్‌లు ఆడి.. ప్రతి మ్యాచ్‌లోనూ నాలుగు ఓవర్ల కోటాను బౌలర్ పూర్తి చేశాడంటే.. అతడి ఖాతాలో 168 ఓవర్లు జమవుతాయి. అదే.. 13 మ్యాచ్‌లు ఆడితే 156 ఓవర్లు. అదీ సంగతి. ఇంతటి భారం పడితే ఏ పేసర్ అయినా గాయపడకుండా ఉంటాడా? ఇందుకు బోర్డు బాధ్యత వహించనక్కర్లేదా?!చదవండి: నిజమైన నాయకుడు.. అసలైన లెజెండ్: సురేశ్ రైనా
నిజమైన నాయకుడు.. అసలైన లెజెండ్: సురేశ్ రైనా
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా(Suresh Raina) ప్రశంసలు కురిపించాడు. నిజమైన, దిగ్గజ నాయకుడు అంటూ హిట్‌మ్యాన్‌ను కొనియాడాడు. జట్టు ప్రయోజనాల కోసం తనంతట తానుగా తప్పుకోగలిగిన నిస్వార్థపరుడంటూ రోహిత్ శర్మకు కితాబులిచ్చాడు.ఐదు టెస్టుల సిరీస్స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో 3-0తో వైట్‌వాష్‌కు గురైన రోహిత్ సేన.. తదుపరి ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా కంగారూ జట్టుతో ఐదు టెస్టులు ఆడుతోంది. అయితే, పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుకు పితృత్వ సెలవుల కారణంగా రోహిత్ శర్మ దూరం కాగా.. అతడి స్థానంలో జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) కెప్టెన్‌గా వ్యవహరించాడు.ఈ మ్యాచ్‌లో టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అయితే, రెండో టెస్టు నుంచి జట్టుతో చేరిన రోహిత్ శర్మ.. బ్యాటర్‌గా, సారథిగా విఫలమయ్యాడు. అడిలైడ్, బ్రిస్బేన్, మెల్బోర్న్ టెస్టుల్లో కలిపి కేవలం 31 పరుగులే చేసిన రోహిత్.. వీటిలో ఒక్క మ్యాచ్‌లోనూ టీమిండియాను గెలిపించలేకపోయాడు. ఫలితంగా సిరీస్‌లో భారత జట్టు 1-2తో వెనుకబడింది.చావో రేవో తేల్చుకునేందుకుఈ క్రమంలో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగే ఐదో టెస్టులో టీమిండియా తప్పక గెలవాల్సిన స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే సిరీస్‌ను డ్రా చేసుకోవడం సహా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2025 అవకాశాలను భారత్ సజీవం చేసుకోగలుగుతుంది.ఇంతటి కీలక మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సిడ్నీలో జరిగే ఆఖరి టెస్టులో బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఫామ్‌లేమి దృష్ట్యా స్వయంగా తుదిజట్టు నుంచి తప్పుకొని.. శుబ్‌మన్ గిల్‌కు లైన్ క్లియర్ చేశాడు. ఈ విషయం గురించి తాత్కాలిక కెప్టెన్ బుమ్రా మాట్లాడుతూ.. జట్టు ప్రయోజనాల కోసమే రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పాడు.డ్రింక్స్ బ్రేక్ సమయంలో ఇక జట్టులో స్థానం లేకపోయినా.. సిడ్నీ టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా రోహిత్ శర్మ డగౌట్లో చురుగ్గా కనిపించాడు. డ్రింక్స్ బ్రేక్ సమయంలో ఆటగాళ్ల దగ్గరికి వచ్చి వ్యూహాల గురించి చర్చించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను సురేశ్ రైనా షేర్ చేస్తూ.. రోహిత్ శర్మ వ్యక్తిత్వాన్ని కొనియాడాడు.నిజమైన నాయకుడు.. అసలైన లెజెండ్‘‘తన నిజాయితీ, నిస్వార్థగుణం ద్వారా నాయకుడంటే ఎలా ఉండాలో రోహిత్ శర్మ నిరూపిస్తున్నాడు. వ్యక్తిగతంగా కఠిన సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలోనూ.. జట్టు విజయానికే అతడు మొదటి ప్రాధాన్యం ఇచ్చాడు. అవసరమైన సమయంలో స్వయంగా తానే తప్పుకొన్నాడు.టీమిండియా జోరుఈ టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ భారత జట్టు సక్సెస్ కోసం కనబరుస్తున్న అంకిత భావం చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఆటలో అతడొక నిజమైన దిగ్గజం’’ అని సురేశ్ రైనా రోహిత్ శర్మను ప్రశంసించాడు. ఇదిలా ఉంటే.. సిడ్నీ టెస్టులో టీమిండియా జోరు కనబరుస్తోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బుమ్రా సేన.. తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌట్ అయింది.ఈ క్రమంలో ఆసీస్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే కట్టడి చేసింది. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, నితీశ్ రెడ్డి చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఇక శనివారం నాటి రెండో రోజు పూర్తయ్యేసరికి తమ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌తో కలిపి ఆసీస్ కంటే 145 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మూడో రోజు గనుక కాస్త ఓపికగా ఆడి.. కనీసం మరో వంద పరుగులు జమచేస్తే ఆతిథ్య జట్టు ముందు మెరుగైన లక్ష్యం ఉంచగలుగుతుంది. రెండో రోజు ఆట ముగిసేసరికి క్రీజులో ఉన్న స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా(8*), వాషింగ్టన్ సుందర్(6*)లపైనే టీమిండియా ఆశలు పెట్టుకుంది.చదవండి: IND Vs AUS: 'టెస్టు క్రికెట్ చరిత్రలోనే పంత్ ఒక అద్బుతం'Rohit Sharma exemplifies leadership through honesty and selflessness. Despite personal challenges, he prioritizes team success, stepping aside when necessary. His leadership in the current Test series reflects his unwavering dedication to India’s success. A true legend of the… pic.twitter.com/L3rPlMlRT6— Suresh Raina🇮🇳 (@ImRaina) January 4, 2025
SA Vs PAK: 2025లో తొలి డబుల్ సెంచరీ
2025లో తొలి టెస్ట్ డబుల్ సెంచరీ నమోదైంది. పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆటగాడు ర్యాన్ రికెల్టన్ ద్విశతకం బాదాడు. ఈ ఏడాది ఇదే మొట్టమొదటి డబుల్ సెంచరీ. ఈ ఏడాది తొలి టెస్ట్ సెంచరీని కూడా రికెల్టనే సాధించాడు. రికెల్టన్ కెరీర్లో తన తొలి డబుల్ సెంచరీని 266 బంతుల్లో సాధించాడు. ఇందులో 24 ఫోర్లు, ఓ సిక్సర్ ఉన్నాయి. పాక్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌ల్లో డబుల్ సెంచరీ సాధించిన నాలుగో సౌతాఫ్రికా క్రికెటర్‌గా రికెల్టన్ రికార్డుల్లోకెక్కాడు. రికెల్టన్కు ముందు ఏబీ డివిలియర్స్ (278 నాటౌట్), గ్రేమ్ స్మిత్ (234), హెర్షల్ గిబ్స్ (228) పాక్‌పై డబుల్ సెంచరీలు చేశారు.తొలిసారి ఓపెనర్‌గా వచ్చి డబుల్ సెంచరీలు బాదిన క్రికెటర్లు..ర్యాన్ రికెల్టన్ టెస్ట్‌ల్లో తొలిసారి ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. రికెల్టన్ ఓపెనర్‌గా దిగిన తొలి మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ సాధించాడు. తొలిసారి ఓపెనర్‌గా వచ్చి అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడు కూడా రికెల్టనే. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు నలుగురు ఆటగాళ్లు తొలిసారి ఓపెనర్‌గా వచ్చి డబుల్ సెంచరీలు బాదారు.ర్యాన్ రికెల్టన్ (సౌతాఫ్రికా)- 211 నాటౌట్బ్రెండన్ కురుప్పు (శ్రీలంక)- 201 నాటౌట్గ్రేమీ స్మిత్ (సౌతాఫ్రికా)- 200డెవాన్ కాన్వే (న్యూజిలాండ్)- 200నాలుగో వేగవంతమైన ద్విశతకంపాక్పై రికెల్టన్ చేసిన ద్విశతకం టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున నాలుగో వేగవంతమైన ద్విశతకం. రికెల్టన్ 266 బంతుల్లో డబుల్ బాదాడు. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున వేగవంతమైన డబుల్ సెంచరీని హెర్షల్ గిబ్స్ సాధించాడు. 2003లో పాక్‌పై గిబ్స్ 211 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేశాడు.టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున వేగవంతమైన డబుల్ సెంచరీలు..హెర్షల్ గిబ్స్- 211 బంతుల్లోగ్రేమీ స్మిత్- 238 బంతుల్లోగ్యారీ కిర్‌స్టన్- 251 బంతుల్లో రికెల్టన్- 266 బంతుల్లోజాక్ కల్లిస్- 267 బంతుల్లోశతక్కొట్టిన బవుమాపాక్తో రెండో టెస్ట్‌లో రికెల్టన్ డబుల్ సెంచరీ సాధించగా.. కెప్టెన్ టెంబా బవుమా సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో బవుమా 106 పరుగులు (9 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి ఔటయ్యాడు. టెస్ట్‌ల్లో బవుమాను ఇది నాలుగో శతకం. ఇటీవలి కాలంలో భీకర ఫామ్‌లో ఉన్న బవుమా.. గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు.భారీ స్కోర్ దిశగా సౌతాఫ్రికాపాక్తో మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా భారీ స్కోర్ దిశగా సాగుతుంది. ఆ జట్టు 102 ఓవర్లు పూర్తయ్యే సరికి 5 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. రికెల్టన్ (211), కైల్ వెర్రిన్ (53) క్రీజ్‌లో ఉన్నారు.సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఎయిడెన్ మార్క్రమ్ (17), వియాన్ ముల్దర్ (5), ట్రిస్టన్ స్టబ్స్ (0), బవుమా (106), డేవిడ్ బెడింగ్హమ్ (5) ఔటయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో సల్మాన్ అఘా , మొహమ్మద్ అబ్బాస్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఖుర్రమ్ షెహజాద్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో జయభేరి మోగించిన విషయం తెలిసిందే. తొలి టెస్ట్ విజయానంతరం సౌతాఫ్రికా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు క్వాలిఫై అయ్యింది.
దిగ్గజ క్రికెటర్ సరసన పంత్.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇద్దరు మాత్రమే..!
టీమిండియా డైనమిక్ బ్యాటర్ రిషబ్ పంత్ వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ సరసన చేరాడు. సిడ్నీ టెస్ట్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో అలరించిన పంత్.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో 160 ప్లస్ స్ట్రయిక్‌రేట్‌తో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. టెస్ట్‌ల్లో పంత్, రిచర్డ్స్ చెరో రెండు సార్లు 160 ప్లస్ స్ట్రయిక్‌రేట్‌తో హాఫ్ సెంచరీలు చేశారు. టెస్ట్ క్రికెట్లో మరే ఇతర బ్యాటర్ ఈ స్థాయి స్ట్రయిక్‌రేట్‌తో రెండు హాఫ్ సెంచరీలు చేయలేదు.మ్యాచ్ విషయానికొస్తే.. సిడ్నీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో పంత్ 33 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేశాడు. సహచర ఆటగాళ్లు ఒక్కో పరుగు రాబట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న చోట పంత్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో పంత్ రాణించకపోయుంటే టీమిండియా పరిస్థితి ఘోరంగా ఉండేది. పంత్ సునామీ ఇన్నింగ్స్ పుణ్యమా అని భారత్ ఓ మోస్తరు లక్ష్యాన్ని అయినా ఆసీస్ ముందుంచగలుగుతుంది.రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసి 145 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. భారత సెకెండ్ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (22), కేఎల్ రాహుల్ (13), శుభ్‌మన్ గిల్ (13), విరాట్ కోహ్లి (6), రిషబ్ పంత్ (61), నితీశ్ కుమార్ రెడ్డి (4) ఔట్ కాగా.. రవీంద్ర జడేజా (8), వాషింగ్టన్ సుందర్ (6) క్రీజ్‌లో ఉన్నారు. స్కాట్ బోలాండ్ నాలుగు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. పాట్ కమిన్స్, బ్యూ వెబ్‌స్టర్ తలో వికెట్ తీశారు.అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా భారత్‌కు నాలుగు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో అరంగేట్రం ప్లేయర్ బ్యూ వెబ్‌స్టర్ (57) అర్ద సెంచరీతో రాణించగా.. స్టీవ్ స్మిత్ (33), సామ్ కొన్‌స్టాస్ (22), అలెక్స్ క్యారీ (21), పాట్ కమిన్స్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. ఉస్మాన్ ఖ్వాజా (2), లబూషేన్ (2), ట్రవిస్ హెడ్ (4), మిచెల్ స్టార్క్ (1), బోలాండ్ (9) విఫలమయ్యారు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకు ఆలౌటైంది. పంత్ (40) మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఆఖర్లో బుమ్రా (22) కూడా బ్యాట్ ఝులిపించాడు. భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (20), యశస్వి జైస్వాల్ (10), విరాట్ కోహ్లి (17), రవీంద్ర జడేజా (26), వాషింగ్టన్ సుందర్ (14) రెండంకెల స్కోర్లు చేయగా.. కేఎల్ రాహుల్ (4), నితీశ్ కుమార్ రెడ్డి (0), ప్రసిద్ద్ కృష్ణ (3) సింగిల్ డిజిట్ స్కోర్లకే నిష్క్రమించారు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 4, ప్టార్క్ 3, కమిన్స్ 2, లియోన్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో ఆసీస్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది.
బిజినెస్
ప్రపంచంలో అధిక వేతనం ఈయనకే..!
ప్రముఖ కంపెనీ సీఈఓ వేతనం రూ.48 కోట్లు.. ‘ఇందులో ప్రత్యేకత ఏముంది.. ప్రస్తుతం చాలామంది ఈ రేంజ్ వేతనాన్ని అందుకుంటున్నారు కదా’ అంటారా.. అయితే కేవలం ఈ రూ.48 కోట్లు తన ఒకరోజు సంపాదనే! వేగంగా మారుతున్న టెక్ ప్రపంచంలో నైపుణ్యాలు కలిగిన వారికి కంపెనీలు ఎంతైనా చెల్లిస్తాయనడానికి ఇదో ఉదాహరణ మాత్రమే. రోజు రూ.48 కోట్ల చొప్పున జగ్దీప్సింగ్ వార్షికాదాయం ఏకంగా సుమారు రూ.17,500 కోట్లు. ఇంతకీ ఆయన ఏ కంపెనీలో పని చేస్తున్నారు.. ఎందుకు అంత వేతనం అందిస్తున్నారనే అంశాలను తెలుసుకుందాం.ప్రపంచంలోనే అత్యధిక వేతనం అందుకుంటున్న ఉద్యోగిగా జగ్దీప్ సింగ్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలాన్‌మస్క్ వంటి వ్యక్తుల వార్షిక ఆదాయం ఎక్కువే ఉంటుంది. కానీ వారికి వేతనం, షేర్లు, ఇతర అలవెన్స్‌ల రూపంలో చెల్లింపులు అధికంగా ఉంటాయి. సింగ్‌కు నేరుగా అధిక మొత్తంలో వేతనం అందిస్తున్నారు. జగ్దీప్ సింగ్ పెద్ద పారిశ్రామికవేత్త మాత్రమే కాదు, ప్రపంచంలో పెరుగుతున్న భారతీయ ప్రతిభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముఖ్యంగా టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ రంగాల్లో పరిశ్రమలు పెరుగుతున్న కొద్దీ ఇన్నోవేటివ్ కంపెనీల్లో లీడర్ల జీతభత్యాలు సైతం వేగంగా పెరుగుతున్నాయి. ‘క్వాంటమ్ స్కేప్’ కంపెనీకి సింగ్ నాయకత్వం(సీఈఓ) వహిస్తున్నారు.టెక్నాలజీలో వస్తోన్న పురోగతిజగ్దీప్ సింగ్ స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి బీటెక్ పూర్తి చేశారు. బెర్క్లీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి ఎంబీఏ పట్టా పొందారు. బీటెక్‌లో నేర్చుకున్న సాంకేతిక నైపుణ్యాలు, ఎంబీఏలో నేర్చుకున్న వ్యాపార మెలకువలు తాను ఎదిగేందుకు ఎంతో ఉపయోగపడ్డాయని ఆయన అన్నారు. ఆయన క్వాంటమ్ స్కేప్‌ను స్థాపించడానికి ముందు పదేళ్లకు పైగా వివిధ కంపెనీల్లో పనిచేశారు. బ్యాటరీ టెక్నాలజీలో వస్తోన్న విప్లవాత్మక పురోగతిని అర్థం చేసుకోవడానికి ఈ అనుభవం ఎంతో ఉపయోగపడిందని చెబుతున్నారు. ఈ అనుభవంతో 2010లో క్వాంటమ్‌స్కేప్ సంస్థను ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్‌లో అగ్రగామిగా నిలుస్తోంది.ఇదీ చదవండి: ఏథర్ కొత్త మోడళ్లు.. ధర ఎంతంటే..కంపెనీ ఏం చేస్తోందంటే..క్వాంటమ్ స్కేప్ ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే ఘనస్థితి(సాలిడ్ స్టేట్) బ్యాటరీలను అభివృద్ధి చేస్తోంది. సంప్రదాయ లిథియం-అయాన్ బ్యాటరీలతో పోలిస్తే ఇవి అధిక శక్తిని, వేగవంతమైన ఛార్జింగ్ సమయాన్ని, మెరుగైన భద్రతను అందిస్తున్నాయి. క్లీన్, గ్రీన్ ట్రాన్స్‌పోర్టేషన్ దిశగా సాగుతున్న పరిశోధనల్లో ఈ కంపెనీ టెక్నాలజీ ముందంజలో ఉంది. బిల్ గేట్స్, వోక్స్ వ్యాగన్ వంటి దిగ్గజాలు ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు క్లీన్ ఎనర్జీ స్పేస్‌లో కూడా ఇది కీలకంగా వ్యవహరిస్తోంది.
ఏథర్ కొత్త మోడళ్లు.. ధర ఎంతంటే..
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ 2025లో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. ఇందులో విభిన్న వేరియంట్లను ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది. స్కూటర్ బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి ధర నిర్ణయించినట్లు పేర్కొంది. ప్రతి వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే ప్రయాణించే దూరాల్లో మార్పు ఉంటుందని తెలిపింది.కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం మోడల్‌ను అనుసరించి ఎక్స్‌షోరూమ్ ధర కింది విధంగా ఉంది.ఏథర్ 450ఎస్ధర రూ.1,29,999 (ఎక్స్-షోరూమ్), ఐడీసీ రేంజ్ 122 కిమీ.ఏథర్ 450ఎక్స్ 2.9 కిలోవాట్2.9 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యం, ధర రూ.1,46,999(ఎక్స్-షోరూమ్), ఐడీసీ రేంజ్ 126 కిమీ.ఏథర్ 450ఎక్స్ 3.7 కిలోవాట్ 3.7 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యం, ఐడీసీ(ఇండియన్ డ్రైవింగ్ సైకిల్) రేంజ్ 161 కి.మీ, ధర రూ.1,56,999(ఎక్స్-షోరూమ్).ఏథర్ 450 అపెక్స్ధర రూ.1,99,999 (ఎక్స్-షోరూమ్), ఐడీసీ రేంజ్ 157 కి.మీ.ఇదీ చదవండి: మస్క్ మంచి మనసు.. భారీ విరాళంఏథర్ 450 ఎక్స్, 450 అపెక్స్ మోడళ్లు మల్టీ మోడ్ ట్రాక్షన్ కంట్రోల్‌ను కలిగి ఉన్నాయి. ఇది స్మూత్ సర్ఫేస్(తక్కువ ఘర్షణ కలిగిన ఉపరితలాలు)పై స్కూటర్ జారిపోకుండా నిరోధిస్తుంది. దాంతో రైడర్ భద్రతను పెంచినట్లు కంపెనీ తెలిపింది. రైడర్లు బైక్ నడుపుతున్న సమయంలో రెయిన్ మోడ్, రోడ్ మోడ్, ర్యాలీ మోడ్ అనే మూడు విభిన్న మోడ్‌లను ఎంచుకోవచ్చని పేర్కొంది.
ఈజ్‌మైట్రిప్ షేర్ల విక్రయం..
ఆన్లైన్ ట్రావెల్‌టెక్ అగ్రిగేటర్ ఈజ్‌మైట్రిప్ (EaseMyTrip ) సహ ప్రమోటర్ నిశాంత్ పిట్టీ తాజాగా కంపెనీలో మైనారిటీ వాటాను (Sold shares) విక్రయించారు. వ్యక్తిగత కారణాల రీత్యా 1.4 శాతం వాటాను ఓపెన్ మార్కెట్ ద్వారా అమ్మివేశారు. నిశాంత్ ఇటీవలే కంపెనీ సీఈవో పదవికి రాజీనామా చేశారు. దీంతో వాటా విక్రయం ప్రాధాన్యతను సంతరించుకుంది.నిశాంత్ సోదరుడు, కంపెనీ సహవ్యవస్థాపకుడు రికాంత్ పిట్టీ జనవరి 1 నుంచి ఈ బాధ్యతలు స్వీకరించినట్లు సోషల్ మీడియా ద్వారా ఈజ్‌మైట్రిప్ వెల్లడించింది. కంపెనీ పటిష్ట వృద్ధి బాటలో సాగుతున్నట్లు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. మరోపక్క నిశాంత్ సైతం ఇకపై తన వాటాను అమ్మబోనని పేర్కొన్నారు.ఇది కంపెనీపట్ల విశ్వాసం లేకపోవడంకాదని, వ్యక్తిగత అవసరాలరీత్యా మాత్రమే స్వల్ప వాటాను విక్రయించానని తెలియజేశారు. కంపెనీకి మంచి భవిష్యత్ ఉన్నదని అభిప్రాయపడ్డారు. కాగా.. 1.4 శాతం వాటాకు సమానమైన 4.99 కోట్ల షేర్ల విక్రయం ద్వారా నిశాంత్ రూ. 78 కోట్లు అందుకున్నారు. ఎన్ఎస్ఈలో కంపెనీ మాతృ సంస్థ ఈజీ ట్రిప్ ప్లానర్స్ షేరు 1 శాతం బలపడి రూ. 15.47 వద్ద ముగిసింది.
కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు..!
ఐటీ రంగంలో దాదాపు 80 శాతం వరకు హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్ ప్రాంతాల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. అక్కడకు సుమారు 10 కిలోమీటర్ల పరిధిలో నివాసం ఉండాలంటే.. కోకాపేట ప్రాంతం చూసుకుంటే అక్కడ చదరపు అడుగు ధర దాదాపు రూ.12–14 వేల వరకు ఉంటోంది. మిగిలిన ప్రాంతాలన్నీ ఇప్పటికే బాగా రద్దీగా ఉంటున్నాయి. దాంతో ఇప్పుడు చాలామంది బాలానగర్ వైపు చూస్తున్నారు. - సాక్షి, సిటీబ్యూరోఒకప్పుడు బాలానగర్ అంటే పారిశ్రామికవాడ అని, భూగర్భ జలాలు కలుషితం అయ్యాయని, గాలి కూడా కాలుష్యంతో ఉంటుందని అనుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి అభిప్రాయాలు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నవి.. కేవలం నైఫర్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ), సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు మాత్రమే.ఒకప్పుడు ఇక్కడ ఉండే ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ (ఐడీపీఎల్) వంటి కంపెనీలు కొన్ని వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించినా, అది చాలాకాలం క్రితమే మూతపడింది. పైపెచ్చు, ఈ కంపెనీకి చెందిన 100 ఎకరాల భూముల్లో పచ్చదనం విస్తరించింది. ఇంతకుముందు బాలానగర్ దాటి చింతల్, గుండ్లపోచంపల్లి ప్రాంతాల వరకు గేటెడ్ కమ్యూనిటీలు విస్తరించాయి గానీ, బాలానగర్‌లో ఇంతకుముందు రాలేదు.లగ్జరీ నిర్మాణాలు షురూ.. ఇప్పుడిప్పుడే బాలానగర్ వైపు కూడా లగ్జరీ నిర్మాణాలు మొదలవుతున్నాయి. కోకాపేటతో సహా ఇతర ప్రాంతాల్లో లభించే సదుపాయాలన్నీ ఇక్కడ కూడా లభిస్తున్నాయి. కానీ, కోకాపేటలో చదరపు అడుగు దాదాపు రూ.12–14 వేలు ఉండగా, ఇక్కడ దాదాపు రూ.6 నుంచి రూ.7 వేలకే లభ్యమవుతున్నాయి. అంటే ఇంచుమించు కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.హైటెక్ సిటీకి బాలానగర్ ప్రాంతం కూడా దాదాపు 12–13 కిలో మీటర్ల దూరంలోనే ఉంది. అయితే, ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు వంటి మౌలిక సదుపాయాలు రావడంతో అర గంటలోపే బాలానగర్ నుంచి హైటెక్ సిటీకి చేరుకోవచ్చు. పైగా ఈ ప్రాంతంలో మంచి పెద్ద పెద్ద స్కూళ్లు, ఇంజినీరింగ్ కాలేజీలు కూడా ఇక్కడ ఉండటంతో పిల్లల చదువుల గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. మాల్స్, మల్టీప్లెక్సులు కూడా ఉండటంతో వినోదం, విహారానికి కూడా మంచి అవకాశాలున్నాయి.బాలానగర్ వైపు.. మాదాపూర్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో లగ్జరీ ఫ్లాట్లు కావాలంటే ఎంత లేదన్నా కనీసం రూ.6 నుంచి రూ.7 కోట్లకుపైగా పెట్టాలి. అదే బాలానగర్‌లో లగ్జరీ ఫ్లాటు అంటే దాదాపు 2 వేల చ.అ. విస్తీర్ణం ఉండే ఫ్లాటు అన్ని సౌకర్యాలతో కలిపి కూడా సుమారు రూ.కోటిన్నర– రెండు కోట్లలోపే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైటెక్ సిటీకి సమీపంలో ఇంత తక్కువ ధరలో, అన్ని సదుపాయాలు ఉన్న ప్రాంతంలో దొరకడం దాదాపు ఇంకెక్కడా లేదు. కాబట్టి, ఐటీ జనాలు క్రమంగా ఇప్పుడు బాలానగర్ వైపు చూస్తున్నారు. గతంలో వేర్వేరు ప్రాంతాల్లో పనిచేసినా, చివరకు హైదరాబాద్ వచ్చి స్థిరపడాలని అనుకుంటున్నవారు కూడా బాలానగర్ ప్రాంతం వైపు మొగ్గు చూపుతున్నారు.
ఫ్యామిలీ
55 ఏళ్లు.. 150 కిలోమీటర్లు
కొందరు ఓటమి నుంచి విజయాలు అందుకుంటారు. మరికొందరు తమ జీవితంలో ఎదురైన ప్రతిబంధకాల నుంచి బయటపడేందుకు ఏదో సాధించాలనే తపనతో ముందుకు సాగుతారు. ఆ కోవకు చెందిన వారే స్విమ్మర్ గోలి శ్యామల. సామర్లకోటకు చెందిన శ్యామల భర్త మోహన్ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. కుమారుడితో కలిసి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో యానిమేషన్ స్టూడియో పెట్టుకుని పలు సీరియళ్లు, సినిమాలకు పనిచేశారు. దురదృష్టవశాత్తూ స్టూడియో ద్వారా తీవ్రంగా నష్టపోవడంతో మానసికంగా మనోవేదనకు గురయ్యారు. దాంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. 45 ఏళ్ళ వయసులో శరీరం సహకరించని స్థితిలో మనసును మళ్ళించేందుకు హైదరాబాద్‌లో స్విమ్మింగ్ నేర్చుకున్నారు. స్వతహాగా ఆమె స్విమ్మర్ కాదు... అయితేనేం, నాటి మనోవేదనకు ఉపశమనంగా ప్రారంభించిన స్విమ్మింగ్ నేడు ఐదు పదుల వయసులో ఆమెను సముద్రాలు దాటే సాహస యాత్రికురాలిగా తీర్చిదిద్దింది.150 కిలోమీటర్లు ఏడు రోజుల్లో అలవోకగా.. డిసెంబరు 28న విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద సముద్ర తీరంలో ఈత ప్రారంభించిన శ్యామల శుక్రవారం కాకినాడ తీరం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడుతూ యానిమేషన్ స్టూడియోలో నష్టం రావడంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన తాను మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు స్విమ్మింగ్ప్రారంభించాననీ, కోచ్ జాన్ సిద్ధిక్ సహకారంతో జీరో లెవెల్ నుంచి 150 కిలోమీటర్ల స్విమ్ చేసేలా తయారయ్యానని సగర్వంగా చెప్పారు. 2021లో శ్రీలంక నుంచి ఇండియా వరకు రామ్‌సేతు దాటానని, తాజాగా ఫిబ్రవరిలో లక్షద్వీప్‌లో స్విమ్ చేశానన్నారు. బంగాళాఖాతంలో 150 కిలోమీటర్లు ఈదడం ద్వారా ఆసియా స్థాయిలో ఘనత సాధించానన్నారు. విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు ఈదాలని రెండేళ్ళ కిందటే నిర్ణయించుకున్నానని, అయితే రెండుసార్లు వాతావరణం అనుకూలించలేదనీ, ఎట్టకేలకు డిసెంబర్ 28న చిన్న ఫిషింగ్ బోట్, ఇద్దరు స్క్రూపర్ డ్రైవర్స్తోప్రారంభించానన్నారు. ఆర్కే బీచ్‌లో సముద్రంలో ప్రవేశించాక మళ్ళీ కాకినాడలో నేలపైకి వచ్చామన్నారు. మొదటి రోజు 7 గంటల్లోనే 30 కిలోమీటర్ల దూరం ఈదానన్నారు. తరువాత నుంచి ఈరోజు వరకు అనేక ఒడుదొడుకులను అధిగమిస్తూ ఈదుకుంటూ వచ్చానన్నారు. తల వెంట్రుకల నుంచి కాలి గోళ్ల వరకు స్విమ్మింగ్ వల్లే ఆరోగ్యం కలుగుతుందని, స్విమ్మింగ్‌ను స్పోర్ట్‌గా కాకుండా సర్వైవల్ స్పోర్ట్‌గానే చెబుతానన్నారు. మహిళలు ఈత చేయడం వలన గైనిక్ సమస్యలు తగ్గుతాయన్నారు. హేళన చేసిన వారే పొగుడుతున్నారుసముద్రంలో ఈత కోసం తొలి ప్రయత్నం చేసినప్పుడు చాలామంది హేళన చేశారు. కొందరు యూ ట్యూబ్‌లో కామెంట్లు పెట్టారు. వాటిని పట్టించుకోలేదు. అరేబియా సముద్రం ఈదాను, శ్రీలంక నుంచి ఇండియా ఈత మరపురానిది, మేదీ స్ఫూర్తితో లక్షద్వీప్‌లో 18గంటల పాటు 48 కిలోమీటర్లు ఈదాను. వైజాగ్ నుంచి కాకినాడ 150 కిలోమీటర్లు ఈదగలిగినందుకు చాలా హ్యాపీగా ఉంది. – గోలి శ్యామల – స్విమ్మర్. – లక్కింశెట్టి శ్రీనివాసరావుసాక్షి ప్రతినిధి.. కాకినాడ.ఫోటోలు: విశ్వనాధుల రాజబాబు. కాకినాడ రూరల్
గ్రీన్ ఆర్మీ
ఉత్తరప్రదేశ్‌లో గతంలో ‘గులాబ్ గ్యాంగ్’ ఘనత విన్నాం. ఇప్పుడు ‘గ్రీన్ ఆర్మీ’. స్త్రీల మీద జరిగే దురాగతాలను స్త్రీలే ఉమ్మడిగా ఎదిరిస్తూ బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. వారణాసిలో క్రియాత్మకంగా ఉన్న ‘గ్రీన్ ఆర్మీ’ మహిళా బృందాన్ని ప్రధాని మోదీ ఇటీవలి మన్‌కీ బాత్‌లో ప్రశంసించారు.వాళ్లంతా ఒక 50 మంది ఉంటారు. ఆకుపచ్చ చీరలో, చేతి కర్రతో వరుసగా నడుస్తూ ఊళ్లోకి వస్తారు. ఇక ఊళ్లోని మగాళ్లకు గుండె దడే. భార్యలను కొట్టేవాళ్లు, తాగుబోతులు, పేకాట రాయుళ్లు, మత్తు పీల్చేవాళ్ళు, కట్నం కోసం వేధించేవాళ్లు... ఎక్కడికక్కడ సెట్‌రైట్ కావాల్సిందే. ఎందుకంటే వారు ‘గ్రీన్ ఆర్మీ’. అందరి స్క్రూలు టైట్ చేసే ఆర్మీ. అందుకే మొన్నటి ‘మన్ కీ బాత్’లో వీరి గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ‘వీరి ఆత్మనిర్భరతకు, కృషికి అభినందనలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని తెలిపారు. దాంతో గ్రీన్ ఆర్మీలో కొత్త జోష్ వచ్చింది.వారణాసి చుట్టుపక్కలగ్రీన్ ఆర్మీ 2014లో పుట్టింది. బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్న రవి మిశ్రా వారణాసి చుట్టుపక్కల పల్లెల్లో ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ ఉత్తర జిల్లాలలో గృహ హింస ఎక్కువగా ఉందని గమనించాడు. స్త్రీలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తే వారు ఆత్మరక్షణ చేసుకోగలరని అనుకున్నాడు. కొందరు విద్యార్థులతో కలిసి నిర్మలాదేవి అనే గృహిణిని గృహ హింసను ప్రతిఘటించమని కోరాడు. రైతు కూలీగా ఆమె సంపాదించేదంతా ఆమె భర్త లాక్కుని తాగేవాడు. కొట్టేవాడు. నిర్మాలా దేవి విద్యార్థుల స్ఫూర్తితో ఆత్మరక్షణ నేర్చుకుంది. అంతేకాదు గ్రామంలోని మరికొంతమందిని జమ చేసింది. అందరూ కలిసి ఇక గృహ హింసను ఏ మాత్రం సహించమని ఎలుగెత్తారు. అంతేకాదు.. కర్ర చేతబట్టి మాట వినని భర్తలకు బడితె పూజ చేశారు. నిర్మలాదేవి భర్త దారికొచ్చాడు. దాంతో గ్రీన్ ఆర్మీ పేరు వినపడసాగింది.270 పల్లెల్లో...వారణాసిలో, చుట్టుపక్కల జిల్లాల్లో ఇప్పుడు 270 గ్రామాల్లో గ్రీన్ ఆర్మీ ప్రతినిధులు ఉన్నారు. 2000 మంది స్త్రీలు ఇందులో భాగస్వాములు. ప్రతి ఊరిలో ఇరవై నుంచి యాభై మంది స్త్రీలు ఆకుపచ్చ చీరల్లో దళంగా మారి క్రమం తప్పక ఇంటింటికీ వెళ్లి సమస్యల ఆచూకీ తీస్తారు. వాటికి పరిష్కారాలు వెదుకుతారు. స్త్రీల మీద చెయ్యెత్తడం అనేది వీరు పూర్తిగా ఊళ్లల్లో నిర్మూలించారు. ఇక తాగుడు పరిష్కారం కోసం తాగుబోతులకు కౌన్సెలింగ్ ఇవ్వడంప్రారంభించారు. పేకాట, డ్రగ్స్కైతే స్థానమే లేదు. గ్రీన్ ఆర్మీతో స్థానిక పోలీస్ కాంటాక్ట్‌లో ఉంటుంది. ఎవరైనా గ్రీన్ ఆర్మీకి ఎదురు తిరిగితే పోలీసులు వచ్చి చేయవలసింది చేస్తారు. వరకట్న సమస్య ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా ఉంది. ‘మీకు కట్నం ఎందుకు ఇవ్వాలి... సరంజామా ఎందుకివ్వాలి’ అని గ్రీన్ ఆర్మీ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దాంతో గొంతెమ్మ కోరికలు పూర్తిగా తగ్గాయి. ఇచ్చింది పుచ్చుకుంటున్నారు.ఆడపిల్లే అదృష్టంకొన్ని జిల్లాల్లో ఇప్పటికీ ఆడపిల్ల పుడితే శోకం వ్యక్తం చేస్తారు. ఏడుస్తూ గుండెలు బాదుకుంటారు. కాని గ్రీన్ ఆర్మీ బయలుదేరి ఈ శోకానికి ముగింపు చెప్పింది.‘ఆడపిల్ల అంటే లక్ష్మీ అని ఇంటికి భాగ్యమనీ బాగా చదివిస్తే సరస్వతి అని, శక్తిలో దుర్గ అని... ఆడపిల్లను మగపిల్లాడితో సమానంగా చూడాల’ని ఇంటింటికి తిరిగి చైతన్యం కలిగించారు. ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లులకు రక్షణగా నిలబడ్డారు. ఇవన్నీ సాంఘికంగా చాలా మార్పు తెచ్చాయి. అందుకే ఒక్కరు కాకుండా సమష్టిగా ప్రయత్నిస్తే విజయాలు వస్తాయి. గ్రామీణ జీవితంలో స్త్రీలకు ఇంకా ఎన్నో ఆటంకాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. కర్రచేత బట్టి ఆర్మీగా మారకపోయినా స్త్రీలు సంఘాలు ఏర్పరుచుకుంటే సమస్యలు దూరం కాకపోవడం ఉండదు. గ్రీన్ ఆర్మీ ఇస్తున్న సందేశం అదే.
2024లో వార్తల్లో నిలిచిన 'సూపర్‌ఫుడ్స్' ఏంటో తెలుసా?
2024 ఏడాదికి బైబై చెప్పేసి2025 సంవత్సరానికి ఆహ్వానం పలికాం. అనేక రంగాల్లో ఎన్నో పరిశోధనలు, సరికొత్త అధ్యయనాలకు సాక్ష్యం 2024. ఈ క్రమంలో 2024లో సూపర్ ఫుడ్‌గా వార్తల్లో నిలిచిన ఆహారం గురించి తెలుసుకుందాం. గతంలో లాగానే 2024 కూడాసహజమైన ఆహారాలు , పదార్దాల ఆరోగ్య ప్రయోజనాలపై కొత్త పరిశోధనలకు బలమైన సంవత్సరంగా నిలిచింది వీటిలో కొన్ని శతాబ్దాలుగా సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించ బడుతున్నవే. బరువు తగ్గడం, కణాల మరమ్మత్తు, వాపు లేదా గుండె ఆరోగ్యం తదితర విషయాల్లో 'సూపర్‌ఫుడ్స్' అద్భుత నివారణలు కాకపోవచ్చు. కానీ కొన్ని మాత్రం ఆరోగ్య సంరక్షణ మించి ఉన్నాయని తేలింది. అలాగే చాలా మంచి ఫుడ్ కూడా కొంతమందికి ప్రాణాపాయంగా ఉండవచ్చిన నిపుణులు చెప్పారు.చీజ్‌తో మానసిక ఆరోగ్యం2.3 మిలియన్ల మంది వ్యక్తులపై జరిపిన ఒక అధ్యయనంలో, షాంఘై జియావో టోంగ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు చీజ్ వినియోగంతో మెరుగైన మానసిక ఆరోగ్యం ముఖ్యంగా వృద్ధుల్లో సామాజిక ఆర్థిక కారకాలతో సంబంధం లేకుండా ఎక్కువ ప్రభావం ఉంటుందని తేలింది. జన్యపరంగా వృద్ధాప్యం సహజమే అయినా, చీజ్ ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి ముఖ్యమైన సాంఘికీకరణ వంటి ఇతర కార్యకలాపాలతో ముడిపడి ఉందని పరిశోధన సూచించింది.నట్స్ - మెదడుగింజలు చిత్తవైకల్యం నుండి మెదడును రక్షించడంలో సహాయపడతాయి మెల్బోర్న్లోని మోనాష్ యూనివర్శిటీ పరిశోధకులు 49-ఐటమ్ ఫుడ్-ఫ్రీక్వెన్సీ సర్వేను పూర్తి చేసిన 70 ఏళ్లు పైబడిన 9,916 మంది వ్యక్తుల రికార్డులను పరిశీలించారు. ఇతర కారకాలను పరిశీలించిన తరువాత, తక్కువ నట్స్ తినే వారితో పోలిస్తే,తమ ఆహారంలోరోజుకు ఒకటి లేదా రెండుసార్లు నట్స్‌ను తీసుకునేవారిలో మంచి అభిజ్ఞా పనితీరు శారీరక ఆరోగ్యాన్ని నిలుపుకోవటానికి మంచి అవకాశం ఉందని గుర్తించింది. ఫాక్స్ నట్స్ఫాక్స్ నట్స్ ఆగ్నేయాసియాతోపాటు ఇండియాలో చాలాకాలంగా సంప్రదాయ వైద్యంలో వాడుతున్నారు. నీటి కలువ కుటుంబానికి చెందిన నీటి మొక్క (యురేల్ ఫెరోక్స్ ఫ్లవర్) గింజలే ఫాక్స్ నట్స్. వీటిల్లోని యాంటీ ఏజింగ్ లక్షణాలు ఈ ఏడాది పరిశోధకులకు ప్రత్యేక ఆసక్తిని కలిగించాయి. 2012, 2018, 2020లో అధ్యయనాలతో పాటు, ఇటీవల 2023లోని యాంటీఆక్సిడెంట్ల అధ్యయనాలను సమీక్షించారు. తద్వారా ఇవి కణాల ఆరోగ్యానికి, వాపును ఎదుర్కోవడానికి ముఖ్యమైన సమ్మేళనాలు అని గమనించారు. అంతేకాదు ప్రోటీన్- స్టార్చ్-రిచ్ సీడ్స్ పాప్‌కార్న్ లాగా చేసుకోవచ్చు. ఇవి ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ నివారణలో బాగా ఉపయోగడతాయని గుర్తించారు.గాలి నుండి తయారైసూపర్ ప్రోటీన్సొలీన్ ప్రొటీన్ ఉత్పత్తికి ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య-స్థాయిఫ్యాక్టరీ ఫిన్లాండ్లో ఏర్పాటైంది 2024లోనే. సోలిన్ ప్రొటీన్ (సోలెంట్ గ్రీన్ కాదు) శక్తి కోసం హైడ్రోజన్‌ను ఆక్సీకరణం చేసే రహస్య సింగిల్-సెల్ మట్టిలో ఉండే సూక్ష్మజీవి ద్వారా తయారు చేస్తారు. సోలిన్ అని పిలువబడే పొడి లాంటి పదార్ధంలో 65-70% ప్రోటీన్, 5-8% కొవ్వు, 10-15% డైటరీ ఫైబర్స్ , 3-5% ఖనిజ పోషకాలు ఉంటాయి కేవల ఐదో వంతు కర్బన ఉద్గారాలతో, 100 రెట్లు తక్కువ నీరు, 20 శాతం కంటే తక్కువ మొక్క ప్రోటీన్ ఉత్పత్తి. డయాబెటిస్‌కు డార్క్ చాక్లెట్డార్క్ చాక్లెట్ ఆరోగ్య ప్రయోజనాలపై పరిశోధనా ప్రపంచంలో చర్చనీయాంశంగా ఉన్నాయి. కానీ ఈ ఏడాది హార్వర్డ్ T.H. చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు వారానికి ఐదు సార్లు డార్క్ చాక్లెట్ వల్ల మంచిదని తేల్చారు. దీని వల్ల బరువు పెరగకుండానే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 21శాతం తగ్గుతుందని కనుగొన్నారు. అధిక-ఫ్లావనాల్ కోకో ఉత్పత్తులు ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తాయని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. ఇది ఇతర రకాల చాక్లెట్లలో కనిపించదు. ఫ్లేవనోల్స్, పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు మెరుగైన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చి, టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని అంచనా.తేనె- ప్రొబయాటిక్స్ఇల్లినాయిస్ యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా-ఛాంపెయిన్ పరిశోధకులు పెరుగులో ఒక టేబుల్ స్పూన్ తేనెను జోడించడం వల్ల జీర్ణకోశంలో ప్రోబయోటిక్ మనుగడను పెంచుతుందనికనుగొన్నారు. జీర్ణక్రియను పెంచడంలో సహాయ పడుతుంది. ముఖ్యంగా క్లోవర్ తేనె - మంచి బ్యాక్టీరియాను రక్షిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ఎగువ జీర్ణశయాంతర ప్రేగుల ద్వారా గట్ మైక్రోబయోమ్‌కు ప్రయాణిస్తుంది, అక్కడ మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.అలర్జీ నివారణలో స్ట్రాబెర్రీటోక్యో యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, స్ట్రాబెర్రీ అలర్జీల నివారణలో సాయపడతాయి. ఫ్లేవనాయిడ్ కెంప్ఫెరోల్ రోగనిరోధక వ్యవస్థపై దాని ప్రభావం ద్వారా ఆహార అలెర్జీలతో సహా,ఇతర శరీరం అలెర్జీలను ఇవి తగ్గిస్తాయి. కెంప్ఫెరోల్ టీ, బీన్స్, బ్రోకలీ, యాపిల్స్, స్ట్రాబెర్రీలలో పుష్కలంగా ఉంటుంది. ఈ నిర్దిష్ట ఫ్లేవనాయిడ్ మైక్రోబయోలాజికల్ యాంటీగ్గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
చైనాలో విజృంభిస్తోన్న హెచ్ఎంపీవీ : లక్షణాలు, నివారణ చర్యలు
China HMPV : కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన మహా విలయం తాలూకు గుర్తులు ఇంకా సమసి పోనేలేదు. ఇంతోనే చైనాలో మరో వైరస్ విజృంభణ ఆందోళన రేపుతోంది. కరోనా బీభత్సం జరిగిన ఐదేళ్ల తరువాత చైనాలో HMPV వేగంగా విస్తరిస్తోంది. ఈవైరస్ సోకిన రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసి పోయాయని, శ్మశాన వాటికల్లో స్థలంకూడా లేదంటూ , సోషల్ మీడియా వస్తున్న వీడియోలు, నివేదికలు మరోసారి ప్రపంచాన్ని వణికిస్తున్నాయి.ముఖ్యంగా చైనా ఉత్తర ప్రాంతంలోనే ప్రభావం అధికంగా ఉన్నట్టు సమాచారం. దీంతో పాటు ఇన్ఫ్లుఎంజా A, HMPV, మైకోప్లాస్మా న్యుమోనియా, కోవిడ్-19 లాంటివి వైరస్లు చైనాలో వ్యాపిస్తున్నాయని తెలుస్తోంది.అసలేంటీ హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్2001లోనే హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV) డ్రాగన్ దేశం గుర్తించింది. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం ఇది రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV)తో పాటు న్యుమోవిరిడే కుటుంబానికి చెందినది. చిన్నపిల్లలు, వృద్ధులలో ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి, వైరస్ తీవ్రత మరింతగా ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు.అనారోగ్యం తీవ్రతను బట్టి వ్యాధి తీవ్రత, వ్యవధి మారవచ్చు. సాధారణ ఈ వైరస్ పొదిగే కాలం 3 నుంచి 6 రోజులు ఉంటుంది. హెచ్ఎంపీవీ సంక్రమణ లక్షణాలు బ్రోన్కైటిస్ లేదా న్యుమోనియాకు దారితీస్తాయి. ఎగువ, దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ఇతర వైరస్ల మాదిరిగానే దీని లక్షణాలు ఉంటాయి.హెచ్ఎంపీవీ లక్షణాలుఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్, కొన్నిసార్లు న్యుమోనియా, ఆస్తమా వంటి ఇతర శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. లక్షణాలు మరింత ముదిరితే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)ని అధ్వాన్నంగా మారుస్తుంది. సాధారణ జలుబు మాదిరిగా లక్షణాలు కనిపిస్తాయి.దగ్గుజ్వరంజలుబు,గొంతు నొప్పిఊపిరి ఆడకపోవడంజాగ్రత్తలుహెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తికి నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స లేదు. వ్యాక్సిన్ కూడా ఇంతవరకూ అభివృద్ధి చేయలేదు. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు శానిటైజేషన్, హ్యాండ్ వాష్, సామాజికి దూరం చాలా ముఖ్యం. 20 సెకన్ల పాటు సబ్బు నీటితో తరచుగా చేతులు కడుక్కోవాలి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో దూరాన్ని పాటించాలి. వైరస్‌బారిన పడిన వారు సెల్ఫ్ ఐసోలేషన్ పాటించడం ఉత్తమం.
ఫొటోలు
గంటకు 360 కి.మీ వేగంతో దూసుకెళ్లే కారు (ఫోటోలు)
బాడ్మింటన్ థీమ్, మసాబా లెహంగా..మహారాణిలా పీవీ సింధు (ఫొటోలు)
‘గేమ్ ఛేంజర్’ ముంబై ఈవెంట్ (ఫొటోలు)
సందడిగా సాక్షి ముగ్గుల పోటీలు (ఫొటోలు)
ఘనంగా ప్రముఖ నటుడు చిన్నా రెండో కూతురి పెళ్లి (ఫోటోలు)
మేము.. మా రెండు హృదయాలు.. పీవీ సింధు పోస్ట్ వైరల్ (ఫోటోలు)
ప్రియుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్ (ఫోటోలు)
జగనన్న ఉండి ఉంటే.. ఈ కష్టాలు ఉండేనా? (ఫొటోలు)
గోల్కొండ కోటలో ఇండియన్ ఆర్మీ ‘నో యువర్ ఆర్మీ’ మేళా (ఫొటోలు)
మురిపించే ముగ్గులు..రత్నాల రంగవల్లులు (ఫొటోలు)
National View all
బడ్జెట్‌కు ముందు వ్యవసాయ మంత్రులతో సమీక్ష
కేంద్ర బడ్జెట్(Union Budget) ప్రవేశ పెట్టడానికి ముందు చేపడుతున్న సమీక్ష సమావేశాల్లో భాగంగా కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ
‘కేజ్రీవాల్.. అక్కడ నుంచి పారిపోరనే ఆశిస్తున్నా’
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi A
బుద్ధిమంతుడి ముసుగుతో అమ్మాయిలకు టోకరా
బుద్ధిమంతుడిలా నటించి..
లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. నలుగురు సైనికులు దుర్మరణం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది.
టఫ్ ఫైట్ తప్పదా?
న్యూఢిల్లీ: ఫిబ్రవరిలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర
International View all
ఏకంగా 174 కిలోల బరువు తగ్గాడు, చివరకు..
మనిషి కాస్త లావుగా ఉంటే.. బాడీ షేమింగ్ చేస్తూ హేళన చేసే సమాజం ఇది. అయితే తమ కొవ్వును కరిగించుకుని..
తడబడ్డ కమలాహారిస్..వీడియో వైరల్
వాషింగ్టన్:అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ తడబడ్డారు.
ప్రధానిపై విమర్శలు..మస్క్‌కు బ్రిటన్ కౌంటర్
లండన్:బ్రిటన్(Britain) ప్రధాని కీర్ స్టార్మర్(Keir Starm
మద్యపానం క్యాన్సర్‌కు కారకం: అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి హెచ్చరిక
ప్రపంచవ్యాప్తంగా మద్యపానం చేసేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
World Braille Day: బ్రెయిలీ లిపి అంటే ఏమిటి? ఎలా ఆవిష్కృతమయ్యింది?
అంధులు.. దృష్టిదోషమున్నా మనసుతో లోకాన్ని చూసేవారు.
NRI View all
భావ వైవిధ్యం.. అన్నమయ్య సంకీర్తనా గానంపై నాట్స్ వెబినార్
అమెరికాలోనూ ‘చాయ్.. సమోసా’
‘తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ’ అంటూ భారతీయ పర్యాటకులను మరింతగా ఆకట్టుకునేం
న్యూ ఇయర్ వేళ విషాదం : భారత సంతతి వైద్యుడు దుర్మరణం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) దేశంలో దుబాయ్ ఎమిరేట్, రాస్ అల్ ఖైమాలో జరిగిన చిన్న ప్రైవేట్ విమాన ప్రమ
మహిళా క్యాషియర్‌పై దాడి, అనుచిత వ్యాఖ్యలు, ఎన్ఆర్ఐకు జైలు, జరిమానా
మహిళా క్యాషియర్‌పై అనుచితంగా ప్రవర్థించిన భారత సంతతికి చెందిన 27 ఏళ్ల వ్యక్తికి సింగపూర్ కోర్టు జైలు
సుచీర్ బాలాజీ కేసులో షాకింగ్ ట్విస్ట్!
ఓపెన్ఏఐ విజిల్‌బ్లోయర్
క్రైమ్
కీచక భర్త హత్య .. ఆపై ముక్కలు
దొడ్డబళ్లాపురం: భార్యను పరుల పడకలోకి వెళ్లాలని వేధించడమే కాక.. కన్న కుమార్తెపై అత్యాచారయత్నం చేసిన ఓ కీచక భర్తను భార్యే హత్యచేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి మాయం చేసిన ఘటన కర్ణాటకలో తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా ఉమరాణి గ్రామ నివాసి శ్రీమంత ఇట్నాళ (35), భార్య సావిత్రి కూలి పనులు చేస్తూ జీవిస్తుంటారు. వారికి ఇద్దరు కుమార్తెలు. డబ్బుల కోసం సావిత్రిని పరాయి పురుషులతో పడుకోవాలని శ్రీమంత బలవంతం చేసేవాడు. దీంతో ఆమె భర్త దూరం పెట్టసాగింది.తనను నిత్యం అదే తరహాలో వేధించడమే కాకుండా.. ఇటీవల కన్న కూతురిపైనే శ్రీమంత అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సావిత్రి బండరాయితో బాది భర్తను హత్య చేసింది. తరువాత మృతదేహాన్ని ముక్కలుగా చేసి చిన్న డ్రమ్ములో వేసి ఊరి బయటకు తీసుకెళ్లి విసిరేసింది. ఇంట్లో రక్తపు మరకలను శుభ్రం చేసింది. భర్త దుస్తులను కాల్చివేసింది. హత్యకు ఉపయోగించిన బండరాయిని కడిగి షెడ్లో దాచిపెట్టింది. కాగా గురువారం శ్రీమంత మృతదేహం ముక్కలు లభించడంతో పోలీసులు దర్యాప్తు చేయగా విషయం బయటపడింది. తానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సావిత్రి ఒప్పుకుంది.
డామిట్.. కథ అడ్డం తిరిగింది..!
సాక్షి ప్రతినిధి, కడప: 2024 డిసెంబర్ 6వతేదీ సమయం అర్ధరాత్రి ఒంటిగంట. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో ఖాళీగా ఉన్న మంచంపై నిద్రిస్తున్న 75 ఏళ్ల వృద్ధుడిని టీడీపీ కార్యకర్తలైన ఇద్దరు యువకులు ఊపిరి ఆడకుండా తలపై దిండు అదిమిపెట్టి హత్య చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి జారుకున్నారు. వృద్ధుడు అనారోగ్యంతో చనిపోయాడని గ్రామస్తులు, బంధువులు భావించి, అంత్యక్రియలు చేశారు. ఆ తర్వాత సీసీ టీవీ ఫుటేజిలో ఆ యువకుల దాష్టీకం బయటపడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. వైఎస్సార్ జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలోని శెట్టివారిపల్లె గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో అల్లాడుపల్లె వీరారెడ్డి (75) డిసెంబర్ 6న మృతి చెందాడు. మరునాడు ఉదయం మంచంపైనే వీరారెడ్డి మరణించినట్లు గమనించిన భవనం యజమాని అతని బంధువులకు తెలిపారు. అనారోగ్యంతో చనిపోయినట్లు బంధువులు, గ్రామస్తులు భావించారు. అంత్యక్రియలు చేశారు. రెండు రోజుల క్రితం నిర్మాణంలో ఉన్న ఇంటి సీసీ కెమెరాల ఫుటేజిని పరిశీలించగా వీరారెడ్డిది సహజ మరణం కాదని, హత్య అన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువకులు వీరారెడ్డి మొఖంపై దిండు అదిమి పెట్టి, ఊపిరాడకుండా చేసినట్లు అందులో కనిపించింది. కొద్దిసేపు కాళ్లు కొట్టుకున్న వృద్ధుడు ఆ తర్వాత చలనం లేకుండా ఉండిపోయాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఆ యువకులిద్దరూ వెళ్లిపోయారు. ఈ విషయం పోలీసులకు చేరింది. అయితే, ఫిర్యాదు లేకపోవడంతో పోలీసులు మిన్నకుండిపోయారు. గ్రామస్తులంతా ఈ విషయాన్ని బాహాటంగా చర్చించుకోవడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అల్లాడుపల్లె హరినాథరెడ్డి, కాల్వపల్లె నరసింహాలు అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిలో హరినాథరెడ్డి వీరారెడ్డికి స్వయానా మనుమడు కావడం విశేషం. హత్యతో ఆగని ఆ యువకులు ఓ యువతిని చెరబట్టేందుకు ప్రయత్నించారు. దాంతో వ్యవహారం మరింతగా ప్రచారంలోకి వచ్చింది. వీరిద్దరూ టీడీపీ కార్యకర్తలు కావడం, ఫిర్యాదు లేకపోవడంతో పోలీసులు వారిపై చర్యలకు వెనక్కి తగ్గినట్లు సమాచారం. వృద్ధుడి హత్యకు కారణాలు తెలియరాలేదు.
గోవాలో తాడేపల్లిగూడెం యువకుడి హత్య
తాడేపల్లిగూడెం: నూతన సంవత్సర వేడుకలను మిత్రులతో సంతోషంగా జరుపుకుందామని గోవా వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం యువకుడు హత్యకు గురయ్యాడు. వివరాలు.. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన బొల్లా రవితేజ(28) హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రవితేజతో పాటు మరో నలుగురు యువకులు, ముగ్గురు యువతులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు శనివారం గోవా వెళ్లారు. రెండు రోజుల పాటు గోవాలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించి.. డిసెంబర్ 30వ తేదీ అర్ధరాత్రి నార్త్‌గోవా జిల్లా కలంగూట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక రెస్టారెంట్‌కు వెళ్లారు. అర్ధరాత్రి అయినందున బిల్లు మీద అధికంగా చెల్లించాలని రెస్టారెంట్ యజమాని డిమాండ్ చేయడంతో.. అక్కడి సిబ్బందికి, రవితేజ స్నేహితులకు మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలో తన స్నేహితురాలితో అక్కడి సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించడంతో రవితేజ జోక్యం చేసుకున్నాడు. వెంటనే రెస్టారెంట్ సిబ్బంది కర్రలతో రవితేజతో పాటు అతని స్నేహితులపై విచక్షణారహితంగా దాడి చేశారు. వెదురు కర్ర విరిగి గుచ్చుకోవడంతో రవితేజ తలకు తీవ్ర గాయమైంది. మిగిలినవారు స్వల్పంగా గాయపడ్డారు. రవితేజను ఆస్పత్రికి తరలిస్తుండగా.. ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. రవితేజ స్నేహితులను విచారించారు. దాడి చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
ఉద్యోగ పరుగులో ఆగిన ఊపిరి
కోనేరుసెంటర్(మచిలీపట్నం): ఉద్యోగ పరుగులో ఓ యువకుడి ఊపిరి ఆగిపోయింది. కానిస్టేబుల్ సెలక్షన్స్‌లో భాగంగా 1,600 పరుగులో పాల్గొన్న ఆ యువకుడు తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం జీలగొండి గ్రామానికి చెందిన దరావతు చంద్రశేఖరరావు (21) డిగ్రీ, డీఈడీ పూర్తి చేశాడు. నిరుపేద కుటుంబానికి చెందిన చంద్రశేఖరరావు తండ్రి చనిపోవటంతో తల్లి కష్టపడి చదివించింది. అతను ప్రభుత్వ ఉద్యోగం పొందాలనే లక్ష్యంతో డీఎస్సీ(పీఈటీ) కోసం శిక్షణ తీసుకుంటున్నాడు. గతంలోనే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష పాసయ్యాడు. ఈ క్రమంలో మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గురువారం నిర్వహించిన ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ)కు హాజరయ్యాడు. ఇందులో భాగంగా 1,600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని గ్రౌండ్లో మూడు రౌండ్లు పూర్తి చేసిన చంద్రశేఖరరావు... నాలుగో రౌండ్ పూర్తి చేయడానికి కొద్ది దూరంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురై పక్కకు పడిపోయాడు. పోలీసు అధికారులు వెంటనే అతన్ని పక్కకు తప్పించి అక్కడ ఉన్న వైద్య సిబ్బందితో ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే చంద్రశేఖరరావు మృతిచెందాడు. ఆస్పత్రిలో విగతజీవిగా ఉన్న కుమారుడిని చూసి ‘నాకింక దిక్కెవరయ్యా...’ అంటూ చంద్రశేఖరరావు తల్లి రోదిస్తున్న తీరు అక్కడ ఉన్న అందరినీ కలచివేసింది. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
వీడియోలు
డిసెంబర్ 31న ఎన్ని ఓయో రూమ్స్ బుక్ అయ్యాయో తెలిస్తే షాక్..!
బాబు వచ్చాడు.. జాబ్ తీశాడు.. వెనక్కి నడిచి వాలంటీర్ల నిరసన
ప్రజల ఆరోగ్యంతో బాబు చెలగాటం..
ముగిసిన రెండో రోజు ఆట.. రసవత్తరంగా సిడ్నీ టెస్ట్!
రోహిత్ శర్మకు మరో బిగ్ షాక్.. కొత్త వన్డే కెప్టెన్ ఎవరంటే?
తానిచ్చిన హామీలకు చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారు
విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి రూమర్స్ నిజమేనా..!
ఏకంగా కరణ్ జోహర్ బ్యానర్ లో సినిమా..
ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్.. బీజేపీ ఫస్ట్ లిస్ట్ ఇదే
బాక్సాఫీస్ వద్ద 'పుష్ప 2' జోరు.. 900 కోట్ల క్లబ్ లో పుష్ప రాజ్..