Top Stories
ప్రధాన వార్తలు

బాబుకు ఊడిగం చేసేవాళ్లకు ఇదే నా హెచ్చరిక: వైఎస్ జగన్
సత్యసాయి జిల్లా, సాక్షి: ఏపీలో ప్రభుత్వం, పోలీసులు కలిసి చేస్తున్న నేరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని.. లింగమయ్య ఘటనే అందుకు ఉదాహరణ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. మంగళవారం పాపిరెడ్డిపల్లిలో టీడీపీ ఫ్యాక్షన్ రాజకీయానికి బలైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘పిన్నెల్లి రామకృష్ణపై కుట్రపూరితంగా కేసులు పెట్టి వేధించారు. పోసాని కృష్ణమురళిపై 18 అక్రమ కేసులు బనాయించి తీవ్రంగా వేధించారు. నందిగం సురేష్‌పై తప్పుడు కేసులు పెట్టి 145 రోజులు జైల్లో ఉంచారు. ఇవన్నీ ప్రభుత్వం, పోలీసులు కలిసి చేస్తున్న నేరాలే... చంద్రబాబు మంచి అనేది నేర్చుకోవాలి. సూపర్ సిక్స్ హామీలపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు దౌర్జన్యకాండకు ప్రజలే బుద్ధి చెప్తారు. .. బాబు మెప్పుకోసం కొందరు పోలీసులు పని చేస్తున్నారు. టోపీలపై ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా బాబుకు వాచ్‌మెన్‌లా పని చేస్తున్న పోలీసులకు చెబుతున్నా. ఎల్లకాలం చంద్రబాబు పాలన కొనసాగదు. తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టం. బాబుకు ఊడిగం చేసేవారికి శిక్ష తప్పదు. యూనిఫాం తీయించి చట్టం ముందు నిలబెడతాం’’ అని వైఎస్ జగన్ ఘాటుగానే హెచ్చరించారు.ఇదీ చదవండి: ఏపీలో మరీ ఇంతటి ఘోరాలా? ప్రజల్లారా.. ఆలోచించుకోండి

మళ్లీ అదే నిర్లక్ష్యం.. జగన్ పర్యటనకు కనీస భద్రత కరువు
అమరావతి, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి భద్రత కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తాజాగా.. పాపిరెడ్డిపల్లి పర్యటనలో భద్రతా లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. జనం ఒక్కసారిగా ఎగబడగా.. నియంత్రించేందుకు సరైన పోలీసు సిబ్బంది లేకుండా పోయారు. హత్యా రాజకీయాలకు బలైన వైఎస్సార్సీపీ బీసీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని మంగళవారం వైఎస్ జగన్ పరామర్శించి.. ఓదార్చారు.ఈ క్రమంలో రామగిరి పర్యటనలో ఎక్కడా తగిన భద్రతా సిబ్బంది కనిపించలేదు. పైగా హెలిప్యాడ్ వద్ద సరిపడా బందోబస్తు లేకపోవడంతో.. ఆ జనం తాకిడితో హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింది. దీంతో భద్రతా కారణాల రీత్యా వీఐపీని తీసుకెళ్లలేమంటూ పైలట్లు చేతులెత్తేశారు.ఈ పరిణామంతో హెలికాఫ్టర్ నుంచి దిగిపోయి రోడ్డు మార్గం గుండా వెళ్లారు. ఈ ఘటనతో కూటమి ప్రభుత్వపెద్దల ఉద్దేశపూర్వక చర్యలు మరోసారి తేటతెల్లం అయ్యాయని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. జగన్ పర్యటనపై ముందస్తు సమాచారం ఉన్నా.. కనీస భద్రత కల్పించకపోవడంతో వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.గతంలో వైఎస్ జగన్ పర్యటనల సందర్భంగానూ కూటమి ప్రభుత్వం ఇదే తరహాలో వ్యవహరించింది. ఈ విషయమై రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసినా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు.

KKR VS LSG Updates: తొలి వికెట్ కోల్పోయిన లక్నో
తొలి వికెట్ కోల్పోయిన లక్నో10.2వ ఓవర్- 99 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది. 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి మార్క్రమ్ ఔటయ్యాడు. హర్షిత్ రాణా మార్క్రమ్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మిచెల్ మార్ష్ (34 బంతుల్లో 49; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. మార్ష్‌కు జతగా పూరన్ క్రీజ్‌లోకి వచ్చాడు. ధాటిగా ఆడుతున్న లక్నో ఓపెనర్లునిదానంగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన లక్నో ఓపెనర్లు ఆతర్వాత గేర్ మార్చారు. మార్క్రమ్ (19 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (23 బంతుల్లో 34; ఫోర్, 3 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో 7 ఓవర్ల అనంతరం లక్నో స్కోర్ 72/0గా ఉంది. గేర్ మార్చిన మార్క్రమ్‌ఇన్నింగ్స్ ప్రారంభంలో నిదానంగా ఆడిన మార్క్రమ్ స్పెన్సర్ జాన్సన్ వేసిన నాలుగో ఓవర్లో గేర్ మార్చాడు. ఆ ఓవర్లో అతను 2 బౌండరీలు, సిక్సర్ సహా 18 పరుగులు రాబట్టాడు. 5 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 43/0గా ఉంది. మార్క్రమ్తో పాటు (28) మార్ష్ (13) క్రీజ్‌లో ఉన్నాడు. ఆచితూచి ఆడుతున్న లక్నో ఓపెనర్లుటాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిదానంగా ఆడుతుంది. ఓపెనర్లు ఎయిడెన్ మార్క్రమ్ (9), మిచెల్ మార్ష్ (11) ఆచితూచి ఆడుతున్నారు. 3 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 20/0గా ఉంది. ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 8) కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. నేటి మ్యాచ్ కోసం కేకేఆర్ ఓ మార్పు చేసింది. మొయిన్ అలీ స్థానంలో స్పెన్సర్ జాన్సన్ తుది జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో లక్నో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. ప్రస్తుతం కేకేఆర్, లక్నో పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఇరు జట్లు ఇప్పటివరకు తలో 4 మ్యాచ్‌లు ఆడి రెండింట గెలిచి, రెండిట ఓడాయి. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరుకు ఐదు మ్యాచ్‌ల్లో తలపడగా.. లక్నో 3, కేకేఆర్ 2 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.తుది జట్లు..కేకేఆర్: క్వింటన్ డికాక్ (వికెట్‌కీపర్), సునీల్ నరైన్, అజింక్య రహానే (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరాలక్నో: మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్‌కీపర్), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, దిగ్వేష్ రాఠి

అమెరికాలో తానా స్కామ్.. విరాళాల మోసంపై దర్యాప్తు!
ఢిల్లీ: అమెరికాలో విరాళాల పేరుతో జరిగిన మోసంలో తానా పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. విరాళాల పేరుతో కంపెనీల నిధుల స్వాహా జరగడంతో ఎఫ్ బీఐ రంగంలోకి దిగింది. గత ఐదేళ్లుగా విరాళాల పేరు చెప్పి ఫ్యానీమే, యాపిల్ కంపెనీ నిధులు స్వాహా చేశారని, తెలుగు ఉద్యోగులు తానాతో కుమ్మక్కైనట్లు ఈ అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం.దీనికి గాను సుమారు 700 మంది ఉద్యోగులపై వేటు పడింది. తొలగించిన ఉద్యోగుల్లో తానా ఉపాధ్యాక్షుడు ఉన్నట్లు తెలిసింది. చారిటబుల్ డొనేషన్ మ్యాచింగ్ ప్రోగ్రాం ద్వారా నిధుల దోపిడీకి పాల్పడ్డారు ఉద్యోగులు. రాళాలిచ్చినట్లు పత్రాలు సృష్టించి...దానికి సమానమైన నిధులను కంపెనీ నుంచి కాజేశని,. ఎన్జీవోలతో కుమ్మక్కై నిధులను స్వాహా చేసినట్లు జాతీయ ఆంగ్ల పత్రిక టైమ్ ఆఫ్ ఇండియా పేర్కొంది.

ముద్రా యోజనకు పదేళ్లు: రూ.20 లక్షల వరకు ఈజీ లోన్స్
ప్రధాన మంత్రి ముద్రా యోజన (పీఎమ్ఎమ్వై) పథకం ఈ రోజుకు (ఏప్రిల్ 8) పదేళ్లను పూర్తిచేసుకుంది. 2015 ఏప్రిల్ 8న ఈ స్కీమ్ ప్రారంభమైనప్పటి నుంచి.. భారతదేశం అంతటా 52 కోట్లకు పైగా లబ్ధిదారులకు రూ. 33 లక్షల కోట్లకు పైగా పూచీకత్తు లేని రుణాలను పంపిణీ చేసింది.పీఎమ్‌ఎమ్‌వైస్క్రీన్ పదేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో, ముద్రా యోజన పథకం ఎంతో మందికి.. వ్యవస్థాపక నైపుణ్యాలను ప్రదర్శించడానికి అవకాశాలను కల్పించింది. ఈ పథకం ద్వారా మేలుపొందిన కొంతమందితో మాట్లాడాను. వారి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం.. అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.Mudra Yojana has given opportunities to countless people to showcase their entrepreneurial skills. Interacted with some of the beneficiaries of the scheme. Their journey is inspiring. #10YearsOfMUDRA https://t.co/QcoIK1VTki— Narendra Modi (@narendramodi) April 8, 2025ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY) పథకంవ్యాపారాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రారంభమైన ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకం.. ఎంతోమంది ఎగడానికి ఆర్థికంగా ఉపయోగపడింది. గతంలో ఈ స్కీమ్ ద్వారా రూ. 10 లక్షలు లోన్ ఇచ్చేవారు. అయితే 2024-25 కేంద్ర బడ్జెట్లో పరిమితిని రూ. 20 లక్షలకు పెంచారు. ఈ పథకం నాలుగు రకాలుగా ఉంటుంది. అవి శిశు, కిషోర్, తరుణ్, తరుణ్ ప్లస్.ఇదీ చదవండి: చైనా సుంకాల ప్రభావం: గోల్డ్ రేటు మరింత తగ్గుతుందా?శిశు: చిన్న వ్యాపారాలను ప్రారంభించాలనుకునే వారికి రూ. 50000 వరకు లోన్ అందిస్తారు.కిషోర్: వ్యాపారంలో కొంత స్థిరపడిన తరువాత.. దానిని మరికొంత విస్తరించుకోవడానికి రూ. 50వేలు నుంచి రూ. 5 లక్షల వరకు లోన్ లభిస్తుంది.తరుణ్ & తరుణ్ ప్లస్: వ్యాపారాలను మరింత విస్తరించాలనుకునేవారికి రూ. 5 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు లోన్ లభిస్తుంది.

తోడుగా, నీడగా.. ఐకాన్ స్టార్‌కు భార్య బర్త్‌డే విషెస్
విమర్శలు ఎక్కుపెట్టినవారితోనే శభాష్ అనిపించుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). గంగోత్రి నుంచి పుష్ప 2 వరకు.. అతడి ప్రయాణం చూసిన ఎవరైనా ఔరా అనాల్సిందే! ఈసారి పాన్ ఇండియాను కాకుండా పాన్ వరల్డ్ బాక్సాఫీస్‌కే ఎక్కుపెట్టాడు బన్నీ. అట్లీతో సినిమా.. దీనికి హాలీవుడ్ టెక్నీషియన్స్ వీఎఫ్ఎక్స్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.గడిచిన ఏడాది కష్టంగా..సాదాసీదా హీరో నుంచి ఐకాన్ స్టార్ వరకు సాగిన ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు బన్నీ. అయితే ఆయన సంతోషాన్నే కాకుండా కష్టాన్ని కూడా ఇష్టంగా పంచుకుంది భార్య అల్లు స్నేహా రెడ్డి (Allu Sneha Reddy). గడిచిన ఏడాది బన్నీ పుష్ప 2 హిట్‌తో భారీ విజయం అందుకున్నాడు. కానీ అతడు సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్‌కు వెళ్లినప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగి ఓ అభిమాని మృతి చెందడం.. ఆ కేసు తన మెడకు చుట్టుకోవడంతో ఆ సంతోషమే లేకుండా పోయింది. ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్టయి ఒక రాత్రి జైలులో గడపడం అతడి జీవితంలోనే మాయని మచ్చగా మిగిలిపోయింది.43వ బర్త్డేఅతడు జైలు నుంచి తిరిగి ఇంటికి చేరుకోగానే స్నేహ చంటిపిల్లలా అతడిని హత్తుకుంది. ఆ సమయంలో కుటుంబాన్ని తనే జాగ్రత్తగా చూసుకుంది. తాజాగా ఆమె అల్లు అర్జున్‌కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. నా జీవితంలో ప్రేమను పంచిన నీకు 43వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాదంతా నువ్వు సంతోషంగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ జీవితంలో నీతో కలిసి నడుస్తున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అంటూ ఓ వీడియో షేర్ చేసింది. అందులో ఫ్యామిలీ సంతోషంగా ఉన్న వీడియో క్లిప్పింగ్స్‌ను పొందుపరిచింది. అలాగే బన్నీతో కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఇది చూసిన అభిమానులు బన్నీకి మీరే బలం అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) చదవండి: పాపకు, నాకు డీఎన్ఏ టెస్టు చేయాలన్నారు: కీర్తి భావోద్వేగం

KTR: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్,సాక్షి: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ktr) సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న భారీ భూ కుంభకోణాన్ని బయటపెట్టనున్నట్లు తెలిపారు.వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే పార్టీ రజతోత్సవ సభ (BRS Silver Jubilee Celebrations) కోసం బీఆర్ఎస్ (brs) ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలు మేరకు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని జన సమీకరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నారు.ఈ తరుణంలో కేటీఆర్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ,హెచ్‌సీయూ భూముల వ్యవహారంతో పాటు రాష్ట్ర రాజకీయాలపై మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ‘25 ఏళ్లు పూర్తి చేసుకున్న రెండవ తెలుగు ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్. అందుకే భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేశాం. బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఇది అతిపెద్ద బహిరంగ సభ అవుతుంది. ఈ సారి డిజిటల్ మెంబర్షిప్ ప్రవేశపెడుతున్నాం. అన్ని జిల్లా కార్యాలయాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. సిల్వర్ జూబ్లీ సందర్భంగా నెలకో కార్యక్రమం జిల్లాల్లో నిర్వహిస్తాం.అమెరికా దుందుడుకు నిర్ణయాల వల్ల స్టాక్ మార్కెట్లో లక్షల కోట్లు నష్టపోయారు. మోదీ ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. ఇంత జరుగుతున్నా మౌనం ఎందుకు?. తర్వాత దెబ్బ తెలంగాణపై పడబోతుంది. తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున ఫార్మా ఎగుమతులు ఉంటాయి. వాటిపై ఎఫెక్ట్ ఉండబోతుంది. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.రాష్ట్రంలో నెగటివ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు BRS పార్టీ మొదలుపెట్టినవి కాదు. లగచర్ల,మూసీ పునరుజ్జీవనం, హెచ్‌సీయూ విషయంలో బాధితులే మా వద్దకు వచ్చారు. ఏఐ వీడియోలు అంటూ ప్రతిపక్షంపై కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ సంస్థ నెహ్రూ జూలాజికల్ పార్క్ నివేదికలోనే అక్కడ జింకలు, నెమళ్లు ఉన్నాయని చెప్పింది. జంతువుల వ్యధకు కారణమైన వారిపై కచ్చితంగా కేసులు పెట్టాల్సిందే. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉంది. ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే.. ఇంకొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తారు. బహిరంగ సభకు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళతాం. HCU విషయంలో ప్రభుత్వం న్యాయస్థానాలను కూడా తప్పుదోవ పట్టించింది. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్, సైఫ్ ఆలీ ఖాన్ లాంటి వాళ్లు జింకలను చంపితే జైలుకు వెళ్లారు. మరి ఇక్కడ జింకలను చంపిన వారిపై కేసులు పెట్టారా?ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న భారీ భూ కుంభకోణాన్ని బయటపెడతా. హెచ్‌సీయూలో 400 ఎకరాలు కాదు దాని వెనకాల వేల ఎకరాల భూముల వ్యవహారం ఉంది. ఈ కుంభకోణంలో ఓ బీజేపీ ఎంపీ కూడా ఉన్నారు. అన్ని ప్రజలకు వివరిస్తా. కాంగ్రెస్, బీజేపీలకు ఉమ్మడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.రేవంత్ రెడ్డిని కాపాడుతుంది బండి సంజయ్’ అని వ్యాఖ్యానించారు.

వెయిట్‌లాస్‌కి వ్యాయామం, యోగా కంటే మందులే మంచివా..?
ఆరోగ్యపరంగా భారంగా మారిన సమస్య అధిక బరువు(ఊబకాయం). ఇదే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడటానికి ప్రధాన కారణమని పదే పదే హెచ్చరిస్తున్నారు నిపుణులు. చెప్పాలంటే ఇదే సర్వత్రా హాట్‌టాపిక్‌గా మారింది. ఎందుకంటే బరువు తగ్గడం అంత ఈజీకాదు. పైగా ప్రస్తుత ప్రజల జీవన విధానం..అందుకు తగ్గట్టుగా ఉన్న ఒత్తిడులు, ఆందోళనలు వెరసీ బాడీపై ధ్యాస పెట్టే ఛాన్సే లేదు. అందువల్లే ఇది జఠిలమైన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ సైతం "బరువు తగ్గించుకుందాం..ఆరోగ్యంగా ఉందా" అని పిలుపునిస్తూ అవగాహన కల్పించే యత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆ కోవలోకి ప్రపంచ కుభేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కూడా చేరారు. ఏం చేస్తే బరువు తగ్గగలరు అనే అంశం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అవేంటో చూద్దామా..!.ఎంటర్ప్రెన్యూర్ రాజ్ షమానీ పాడ్‌కాస్ట్, ఫిగరింగ్ అవుట్లో బరువు తగ్గడం అనే అంశంపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. "ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య ఉంది. డబ్బుతో పరిష్కరించ లేని సమస్య ఇది. నేను ప్రధాని మోదీని కలసినప్పుడూ ఈ విషయం గురించే చర్చించాం. యోగా ఆధారిత ఆసనాలతో ఎలా తగ్గించుకోవచ్చో చెప్పారు మోదీ. కానీ ఆ దిశగా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం లేదని, ఇంకా ఏ దేశం కూడా పూర్తి స్థాయిలో మార్పుకి సిద్ధపడలేకపోతోందని చెప్పారాయన. అయితే నేను జీవశైలిలో మార్పులను విశ్వసించనప్పటకీ....వైద్య ఆవిష్కరణలే కీలకపాత్ర పోషిస్తాయని ప్రగాఢంగా నమ్ముతా. ప్రస్తుతానికి మధుమేహం కోసం అభివృద్ధి చేసిన మందులు అధిక బరువు సమస్యతో బాధపడుతున్న బాధితుల్లో ఓ ఆశను రేకెత్తిస్తోంది. ఈ జీఎల్పీ-1 అనే మధుమేహ మందులు ఈ సమస్యకు కొంతమేర శాస్త్రీయ పరిష్కారాన్ని అందించాయి. త్వరలో అందరికి అందుబాటులోకి వచ్చేలా చౌక ధరలలో లభించనున్నాయి. "అని అన్నారు బిల్‌గేట్స్. కాగా, ఈ డయాబెటిక్ మందులు ఓజెంపిక్, వెగోవీ, మౌంజారో, జెప్‌బౌండ్ వంటివి కడుపు నిండిన అనుభూతిని అందిస్తాయి, తినాలనే కోరికను నివారిస్తాయనేది పరిశోధుకుల వాదన. ఇక GLP-1 అనేది మన శరీరంలో జీర్ణక్రియ, ఆకలి నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ మందులు ఆకలని నిర్వహించడంలో చాలా బాగా హెల్పవుతాయని అంటున్నారు నిపుణులుఏదీఏమైనా జీవనశైలే ముఖ్యమైనది..వైద్య ఆవిష్కరణల కంటే దీర్ఘకాలిక బరువు నియంత్రణలో ప్రధానమైనది జీవనశైలేనని నొక్కి చెబుతున్నారు నిపుణులు. అయితే అందరూ లైఫ్‌స్టైల్ అనగానే భయపడిపోతున్నారని చెప్పారు. శరీరాన్ని మొత్త కష్టపెట్టకపోయినా..కనీసం కొద్దిపాటి కదలికలకు చోటు ఇస్తే మంచిదంటున్నారు. దీంతోపాటు కొద్దిపాటి ఆరోగ్య చిట్కాలు..పాటించాలి. నమలి నమిలి నెమ్మదిగా తినడం..శరీరానికి వేడి కలిగించేపదార్థాలు తీసుకోవడం.. తదితరాల ద్వారా బరువుని అదుపులో ఉంచుకోవచ్చని అన్నారు నిపుణులు. చివగా మోదీ, బిల్‌గేట్స్ ఇరువురు ఊబకాయం అనేది కేవలం వైద్యపరమైన సమస్య కాదని, వాళ్ల వాళ్ల సంస్కృతి ఆచారాలతో ముడిపడి ఉన్న లోతైన సమస్యగా అభివర్ణించారు. అయితే దీన్నుంచి బయటపడాలంటే మాత్రం రోజువారీ దినచర్య బ్రషింగ్‌లా జీవనశైలిలో మార్పులు కూడా భాగమైతేనే బరువు తగ్గడం సాధ్యమని నొక్కి చెప్పారు ఇరువురు. View this post on Instagram A post shared by Figuring Out with Raj Shamani (@figuringout.co) (చదవండి: Wedding Menu: ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..! క్రియేటివిటీ మాములుగా లేదుగా..)

సింగపూర్‌లో అగ్ని ప్రమాదం.. పవన్ కుమారుడికి గాయాలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సింగపూర్ వెళ్లనున్నారు. ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్‌ను వెంటనే స్కూల్ యాజమాన్యం ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే, బాబు ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలుస్తోంది.ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ ఉన్నారు. ఫోన్ కాల్ ద్వారా ఆయన సమాచారం తెలుసుకున్నారు. కానీ, ఇప్పటికే అక్కడ ఆయన పర్యటన షెడ్యూల్‌కు సంబంధించన ఏర్పాట్లు అన్నీ అధికారులు చేశారు. దీంతో అక్కిడి పర్యటన ముగించుకుని ఆయన సింగపూర్ వెళ్లనున్నారు.

సంపద సృష్టి.. సంపన్నులకు మాత్రమేనా బాబూ!
ఏ దేశమైనా అభివృద్ది చెందడం అంటే ఏమిటి? పేదరికం తగ్గడం.. పేదల ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడడం! కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కలిగిన వారికి మరింత సంపద సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. దీన్నే అభివృద్ధి అనుకోమంటున్నారు. విశాఖపట్నంలో ఒక మాల్ నిర్మాణానికి విలువైన ప్రభుత్వ భూమిని అప్పనంగా కట్టబెట్టడం చూస్తే ఈ ఆలోచనే వస్తుంది ఎవరికైనా. రాష్ట్రం ఎటు పోయినా ఫర్వాలేదు... అమరావతిని మాత్రం అప్పులు తెచ్చిమరీ నిర్మాణాలు చేపట్టి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరిన్ని డబ్బులు సంపాదించుకుంటే చాలన్నట్టుగా ఉండటం ఇంకో ఉదాహరణ.ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరుత పేదలను ఊరించి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ తరువాత వాటిని మూలన పడేశారు. బాబు గారికి వత్తాసు పలికి ఉప ముఖ్యమంత్రి హోదా దక్కించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు హామీల ఊసే ఎత్తడం లేదు. లేని వారికి పైసా విదల్చని వీరిద్దరూ లూలూ మాల్‌కు మాత్రం వేల కోట్లు దోచిపెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 2017లో చంద్రబాబు ప్రభుత్వం విశాఖ బీచ్ రోడ్డులోని హార్బర్ పార్కు వద్ద సుమారు 14 ఎకరాల భూమిని లూలూ మాల్‌కు కేటాయించింది. మాల్ నిర్మాణం, కన్వెన్షన్ సెంటర్, హైపర్ మార్కెట్ వంటివి ఏర్పాటు చేస్తామన్న ఈ సంస్థ ప్రతిపాదనలకు ఊ కొట్టింది. కానీ ఆరేళ్లపాటు ఎలాంటి నిర్మాణాలూ చేపట్టకపోవడంతో 2023లో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేటాయించిన భూములను రద్దు చేసింది.వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు సంస్థకు కేటాయించడంపై విమర్శలు కూడా వచ్చిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. అయితే 2024లో చంద్రబాబు ప్రభుత్వం తిరిగి రావడం... లూలూ గ్రూప్ తెరపైకి వచ్చింది. మళ్లీ భూముల పందేరం జరిగిపోయింది. మాల్స్ వచ్చిన కొత్తలోనైతే వాటిని ప్రోత్సహించేందుకు భూమి ఇచ్చారంటే ఒక అర్థముంది. విశాఖ, విజయవాడల్లో ఇప్పటికే బోలెడన్ని మాల్స్ ఉన్నాయి. అది కూడా నగరానికి దూరంగా పార్కింగ్ తదితర సౌకర్యాలు కల్పించిన ఓకే అనుకోవచ్చు కానీ.. విశాఖ బీచ్ రోడ్లో స్థలమివ్వడమంటే...??? ఈ 14 ఎకరాల స్థలం విలువ రూ.1500 కోట్ల నుంచి రూ. రెండు వేల కోట్ల వరకు ఉండవచ్చు. దీనిని ఏకంగా 99 ఏళ్లకు లీజ్ కు ఇవ్వడం కూడా ఆశ్చర్యమే మరి!వీటన్నింటికీ అదనంగా ఇంకో రూ.170 కోట్ల విలువైన రాయితీలు కూడా ఇచ్చేస్తున్నారు. ఈ మేళ్లన్నింటికీ లూలూ ప్రభుత్వానికి ఇచ్చేదెంత? నెలకు ముష్టి నాలుగు లక్షల చొప్పున ఏడాదికి రూ.50 లక్షలు మాత్రమే. ఇంకో విషయం.. లూలూ ఏమీ ఆషామాషీ కంపెనీ కాదు. కావాలనుకుంటే సొంతంగా భూములు కొనుక్కోగల ఆర్థిక స్థోమత ఉన్నదే. హైదరాబాద్‌లో ఎలాంటి ప్రభుత్వ సహకారం లేకుండానే ఈ సంస్థ భారీ మాల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదంతా లూలూ గ్రూపు సంపద మరింత పెంచేందుకే అన్నది లోగుట్టు!లూలూ ఏమీ పరిశ్రమ కాదు. కేవలం షాపింగ్ ఏరియాకు సదుపాయాలు కల్పించే సంస్థ. ఇలాంటి మాల్స్ వల్ల చిన్న, చిన్న వ్యాపారులంతా ఉపాధి కోల్పోయే అవకాశాలెక్కువ. పోనీ మాల్లో తక్కువ అద్దెకు షాపులిచ్చి సామాన్య దుకాణదారులను ఏదైనా ఆదుకుంటారా? అంటే అదీ లేదు. దుకాణాల అద్దెలపై ప్రభుత్వానికి నియంత్రణే లేదు. అందుకే శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. ఈ కంపెనీకి ఇచ్చే రాయితీల మొత్తం రూ.170 కోట్లతో ప్రభుత్వమే షాపింగ్ మాల్ నిర్మాణం చేపట్టవచ్చని అన్నారు.బీచ్ సమీపంలోని రిషికొండపై జగన్ సర్కార్ ప్రతిష్టాత్మక ప్రభుత్వ భవనాలను నిర్మిస్తే నానా రచ్చ చేసిన కూటమి పెద్దలు లూలూ గ్రూప్ కు ఇంత భారీ ఎత్తున విలువైన భూమిని ఎలా కేటాయిస్తారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వరు. అమరావతి విషయానికి వస్తే, గత ప్రభుత్వం అక్కడ పేదల కోసం ఇచ్చిన ఏభై వేల ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకుంటున్నామని మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ చాలా గట్టిగా చెబుతున్నారు. ప్రత్యామ్నాయ స్థలాలు ఇస్తామని అంటున్నారు కానీ అది ఎప్పటికి జరుగుతుందో తెలియదు. మరో వైపు సుమారు ఏభై వేల కోట్ల అప్పు తెచ్చి ఖర్చు పెడతామంటున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ నగరం అని ప్రచారం చేసిన పెద్దలు బడ్జెట్ ద్వారా రూ.ఆరు వేల కోట్లు కేటాయించడం ద్వారా వారు అసత్యాలు చెబుతున్న విషయం తేటతెల్లమైంది. ఇక్కడ పేదలకు స్థలాలు ఇవ్వకుండా, ధనికులు, బడా భూ స్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ది చేకూర్చి, వారి సంపద పెంచే దిశగా చంద్రబాబు సర్కార్ సన్నాహం చేస్తోంది.రాజధాని పనుల టెండర్లు తమకు కావల్సినవారికి కేటాయించడం, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడం, సిండికేట్ల ద్వారా కథ నడిపించడంపై విమర్శపూర్వక వార్తలు వస్తున్నా, ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. కనీసం అందులో వాస్తవం లేదని చెప్పే యత్నం చేయడం లేదంటే ఎంతగా తెగించారో అర్థం చేసుకోవచ్చు. అమరావతి గురించి మాత్రం ఎల్లో మీడియాలో నిత్యం ఊదరగొట్టి ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తున్నారు. ఉదాహరణకు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని, పది లక్షల కోట్ల పెట్టుబడులు అని, ఏడున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబితే దానిని బ్యానర్ కథనాలుగా వండి వార్చారు.ఇలాంటివన్నీ కేవలం ప్రజలను మభ్య పెట్టడానికే అన్న సంగతి అర్థమవుతూనే ఉంది. ఒక పక్క ఐఐటీ విద్యార్థులకే ఉద్యోగాలు దొరకడం కష్టమవుతోందని వార్తలు వస్తుంటే చంద్రబాబు మాత్రం లక్షల ఉద్యోగాలు అమరావతికి తరలి వస్తాయని అంటున్నారు. అమరావతి గ్రామాలలో రూ.138 కోట్లతో 14 స్కూళ్లు, 17 అంగన్ వాడీలు, 16 వెల్ నెస్ సెంటర్లను ఆధునికంగా తయారు చేస్తోందని ఎల్లో మీడియా బాకా ఊదింది. మరి ఇదే విధంగా మిగిలిన రాష్ట్రం అంతటా ఎందుకు ఏర్పాటు చేయరు? గత జగన్ ప్రభుత్వం పట్టణం, గ్రామం, ప్రాంతం అన్న తేడా లేకుండా స్కూళ్లను, ఆస్పత్రులను బాగు చేస్తే దానిపై విష ప్రచారం చేసిన ఈ మీడియాకు ఇప్పుడు అంతా అద్భుతంగానే కనిపిస్తోంది. కూటమి సర్కార్ సంపద సృష్టి అంటే బడాబాబులకే అన్న సంగతి పదే, పదే అర్థమవుతోందన్నమాట!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
గెట్ వెల్ సూన్ చిన్నబాబు.. పవన్ తనయుడికి ప్రమాదంపై రోజా స్పందన
‘రేవంత్, కేటీఆర్ జాన్ జబ్బలు’
ఆ సినిమాల్లో చెప్పాపెట్టకుండా తీసేశారు.. గ్యాప్ ఎందుకంటే?: టాక్సీవాలా హీరోయిన్
ఐపీఎల్ చరిత్రలో తొలి కెప్టెన్‌గా పాటిదార్ అరుదైన ఘనత
‘హెలీకాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతినడం పై అనుమానులున్నాయ్’
మీరూ టీచరేగా.. దయచేసి జోక్యం చేసుకోండి
భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
రాజకీయాల్లోకి టీమిండియా మాజీ క్రికెటర్
ప్రభాస్ ఫ్యాన్స్ ఫ్రస్టేషన్.. సందేహాలు తీర్చిన మారుతి
ముద్రా యోజనకు పదేళ్లు: రూ.20 లక్షల వరకు ఈజీ లోన్స్
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
15 ఏళ్ల ఏజ్ గ్యాప్.. మాకేలాంటి ఇబ్బంది లేదు: తమన్నా
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
మావోయిస్టుల శాంతి చర్చల ప్రకటన
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
ఈ రాశి వారికి ఇంటాబయటా అనుకూలం.. ఆస్తిలాభం
భర్త చనిపోయి బాధలో ఉన్న అత్తను ఓదార్చాల్సిందిపోయి ...
వరద రాజధానిలో ప్రజాధనం వృథా
AP: రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి
అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల..: హార్దిక్
ఖరీదైన కార్లు.. విలాసవంతమైన భవనం: శుభ్‌మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
EMIలు తగ్గుతాయ్.. లోన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్..
బీఆర్ఎస్ సభకు 3 వేల బస్సులు
సింగపూర్‌లో అగ్ని ప్రమాదం.. పవన్ కుమారుడికి గాయాలు
నీ చుట్టూ శత్రువులు.. 'కాంతార' హీరోపై పంజర్లి ఆగ్రహం
Chicken Price: కోడి కోయలేం.. తినలేం..!
ఓటీటీలోకి మలయాళ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ప్రాణాలు తీస్తున్న సరదా
బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్
ఇన్‌స్టాలో స్నేహారెడ్డి పోస్ట్.. అల్లు అభిమానుల్లో టెన్షన్!
సెంట్రల్ కాంట్రాక్ట్‌లను ప్రకటించిన సౌతాఫ్రికా.. క్లాసెన్‌కు భారీ షాక్
...సూపర్ సిక్స్ సార్!
సిద్ధార్థ్‌కు కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియల్లో సానియాను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు
కూనో చీతాలకు నీరు పోశాడు.. ఉద్యోగం నుంచి సస్పెండ్!
‘ట్రంప్’ అలజడికి తట్టుకున్న ఒకేఒక్క ఇన్వెస్టర్..
యూపీలో ఏం జరుగుతోంది?: సుప్రీంకోర్టు ఆగ్రహం
రా..రమ్మని ఆహ్వానించేలా ఇంటిని అలంకరించుకోండి ఇలా..!
గోల్డెన్ ఛాన్స్! తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..
వచ్చేస్తున్నాయి.. సరికొత్త స్మార్ట్ఫోన్లు
తెలుగబ్బాయికి నిరాశ.. 'ఇండియన్ ఐడల్' విజేతగా మానసి
చెప్పుకోవడానికే బలమైన దేశం.. చేతల్లో ఏమీ లేదు: జెలెన్ స్కీ
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నిరసన సెగ
పర్యటించడానికి సాధ్యం కాని దేశాలివే..!
ఏడు అడుగుల కండక్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్
తల్లి బదులు పది పరీక్షకు కూతురు!
ఈ పాపం.. ఎవరిది పవన్?
రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేసిన ధోని
కురుబ లింగమయ్య కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
Hyderabad: భార్య కడుపుతో ఉన్నా కనికరించని దుర్మార్గుడు..
SRH: వరుసగా నాలుగు ఓటములు!.. మా బ్యాటింగ్ శైలి మారదు: వెటోరి
'రామ్ చరణ్' రికార్డ్ దాటాలని ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఫ్యాన్స్
నువ్వు బెదిరిస్తే.. బెదిరిపోతామా?.. ట్రంప్ టారిఫ్ డెడ్‌లైన్‌పై చైనా
పాపకు, నాకు డీఎన్ఏ టెస్టు చేయాలన్నారు, ఎప్పుడూ అనుమానమే!: కీర్తి
మీడియాపై ఊగిపోయిన సీఎం చంద్రబాబు
‘నా అప్పు 6 వేల కోట్లు.. వసూలు చేసింది14 వేల కోట్లు’
HYD: మియాపూర్ మెట్రోస్టేషన్ వద్ద లారీ బీభత్సం
RCB Vs MI: ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌కు భారీ షాక్!
అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్
Rat Ronin: వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఎలుక.. దేశ ప్రజల ప్రాణాలను కాపాడిన హీరో
బెంగళూరులో దారుణం.. వాకింగ్ చేస్తున్న మహిళపై లైంగిక వేధింపులు
బంగారం కొనడానికి ఇదే మంచి సమయం: మరింత తగ్గిన రేటు
‘తోలు తీస్తా, తాట తీస్తా అంటాడు.. ఊళ్లో మాత్రం ఉండడు’
నేను సింగిల్.. రూ.50 కోట్లు తీసుకుంటే తప్పేంటి?: బాలీవుడ్ హీరో
ఎన్టీఆర్ నాకంటే 9 ఏళ్లు చిన్నోడు.. ‘ఒరేయ్’ అంటే షాకయ్యా: రాజీవ్
శ్రీరామనవమి స్పెషల్ లుక్.. తారల ఫెస్టివల్ వైబ్స్ చూశారా?
రోషన్ భయ్యా.. ఈ రోతేంటయ్యా!
బాబుకు ఊడిగం చేసేవాళ్లకు ఇదే నా హెచ్చరిక: వైఎస్ జగన్
ఓటీటీలో 'టైమ్ లూప్ హారర్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
పాకిస్తాన్‌కు గట్టి షాకిచ్చిన ఐసీసీ.. పది రోజుల్లో ఇది మూడోసారి
భారత్‌తో టెస్టుతో అరంగేట్రం.. ఆసీస్ యువ ఓపెనర్ సంచలన నిర్ణయం
విజయ్ దేవరకొండతో సినిమా.. వారం వరకు భయపడ్డా
2025 మార్చిలో ఎక్కువమంది కొన్న కారు ఇదే..
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
వాట్ ఏ వెడ్డింగ్ మెనూ..ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..!
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితులకు ఉరిశిక్ష
ఎన్టీఆర్ ఎందుకింత సన్నమైపోయాడు? కారణం అదేనా
విడిపోయిన ప్రముఖ బుల్లితెర జంట.. వెల్లడించిన భర్త!
ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన ఇంగ్లండ్ ఆటగాడు
మీరట్ హత్య కేసులో మరో ట్విస్ట్.. వెలుగులోకి మరో కీలక విషయం
డబ్బు, పేరున్నా సుఖం లేదు.. ఛీ, ఎందుకీ బతుకు?.. వర్ష ఎమోషనల్
ఏఐ కాద్సార్! నిజం జింకే!!
మళ్లీ అదే నిర్లక్ష్యం.. జగన్ పర్యటనకు కనీస భద్రత కరువు
ఓటీటీ/ థియేటర్లో ఈ వారం 10కి పైగా సినిమాలు విడుదల
దర్శకుడి భార్య బర్త్ డే పార్టీలో ఎన్టీఆర్
ఓవైపు ప్రపంచ మార్కెట్లు కుదేలు.. ట్రంప్ ఆసక్తికర ప్రకటన
శ్రీలంక- సౌతాఫ్రికాలతో వన్డే సిరీస్.. భారత జట్టు ప్రకటన
మొక్కజొన్న మెషీన్లో పడి మహిళ దుర్మరణం
జియో కొత్త రీచార్జ్ ప్లాన్: రోజుకు 2జీబీ డేటా
తల్లీకొడుకు... యాక్షన్
లవకుశ చిత్రంలో సాంగ్.. వాళ్లిద్దరు కాదు.. ధన్‌రాజ్ పోస్ట్ వైరల్!
IPL 2025: హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు.. తొలి భారత క్రికెటర్‌గా
ఆ ఫీలింగ్ ఉండకూడదు: బాలీవుడ్ హీరోయిన్
కల్లుతాగి 100 మందికి పైగా అస్వస్థత.. వింత ప్రవర్తన
KTR: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఇక్కడా తీసేశారు.. కాంట్రవర్సీ వీడియో సాంగ్ రిలీజ్
సొంతంగా పళ్లు తోముకోలేని దుస్థితి.. ఆయన మాటలు మంత్రంలా పనిచేశాయి
సినిమాల్లోకి స్టార్ హీరోయిన్ కూతురు.. ‘ఎంట్రీ’ కోసం ఎన్ని కష్టాలో..!
'యుగానికి ఒక్కడు' సీక్వెల్ ధనుష్‌తోనే.. కార్తీపై దర్శకుడి కామెంట్స్
Saudi Arabia: 14 దేశాలకు వీసాల జారీ నిలిపివేత.. జాబితాలో భారత్
ఆక్వా కుదేలు.. ఇక ప్రభుత్వం ఉండీ ఏం లాభం?: వైఎస్ జగన్
సమ్మె బాటలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు
RCB Vs MI: ఆర్సీబీ అదరహో
Saaree Review: ఆర్జీవీ ‘శారీ’ మూవీ రివ్యూ
అందుకే పంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి రాలేదు: సీఎం స్టాలిన్
ఇప్పుడు ఎలాంటి ఆదేశాలివ్వలేం
IPL 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
అనర్హులతో అడ్డగోలుగా మూల్యాంకనం!
ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన 'అషు రెడ్డి' రొమాంటిక్ మూవీ
వివాహేతర సంబంధం.. చిన్నారిపై తల్లి పైశాచికం
గెట్ వెల్ సూన్ చిన్నబాబు.. పవన్ తనయుడికి ప్రమాదంపై రోజా స్పందన
‘రేవంత్, కేటీఆర్ జాన్ జబ్బలు’
ఆ సినిమాల్లో చెప్పాపెట్టకుండా తీసేశారు.. గ్యాప్ ఎందుకంటే?: టాక్సీవాలా హీరోయిన్
ఐపీఎల్ చరిత్రలో తొలి కెప్టెన్‌గా పాటిదార్ అరుదైన ఘనత
‘హెలీకాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతినడం పై అనుమానులున్నాయ్’
మీరూ టీచరేగా.. దయచేసి జోక్యం చేసుకోండి
భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
రాజకీయాల్లోకి టీమిండియా మాజీ క్రికెటర్
ప్రభాస్ ఫ్యాన్స్ ఫ్రస్టేషన్.. సందేహాలు తీర్చిన మారుతి
ముద్రా యోజనకు పదేళ్లు: రూ.20 లక్షల వరకు ఈజీ లోన్స్
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
15 ఏళ్ల ఏజ్ గ్యాప్.. మాకేలాంటి ఇబ్బంది లేదు: తమన్నా
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
మావోయిస్టుల శాంతి చర్చల ప్రకటన
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
ఈ రాశి వారికి ఇంటాబయటా అనుకూలం.. ఆస్తిలాభం
భర్త చనిపోయి బాధలో ఉన్న అత్తను ఓదార్చాల్సిందిపోయి ...
వరద రాజధానిలో ప్రజాధనం వృథా
AP: రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి
అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల..: హార్దిక్
ఖరీదైన కార్లు.. విలాసవంతమైన భవనం: శుభ్‌మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
EMIలు తగ్గుతాయ్.. లోన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్..
బీఆర్ఎస్ సభకు 3 వేల బస్సులు
సింగపూర్‌లో అగ్ని ప్రమాదం.. పవన్ కుమారుడికి గాయాలు
నీ చుట్టూ శత్రువులు.. 'కాంతార' హీరోపై పంజర్లి ఆగ్రహం
Chicken Price: కోడి కోయలేం.. తినలేం..!
ఓటీటీలోకి మలయాళ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ప్రాణాలు తీస్తున్న సరదా
బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్
ఇన్‌స్టాలో స్నేహారెడ్డి పోస్ట్.. అల్లు అభిమానుల్లో టెన్షన్!
సెంట్రల్ కాంట్రాక్ట్‌లను ప్రకటించిన సౌతాఫ్రికా.. క్లాసెన్‌కు భారీ షాక్
...సూపర్ సిక్స్ సార్!
సిద్ధార్థ్‌కు కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియల్లో సానియాను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు
కూనో చీతాలకు నీరు పోశాడు.. ఉద్యోగం నుంచి సస్పెండ్!
‘ట్రంప్’ అలజడికి తట్టుకున్న ఒకేఒక్క ఇన్వెస్టర్..
యూపీలో ఏం జరుగుతోంది?: సుప్రీంకోర్టు ఆగ్రహం
రా..రమ్మని ఆహ్వానించేలా ఇంటిని అలంకరించుకోండి ఇలా..!
గోల్డెన్ ఛాన్స్! తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..
వచ్చేస్తున్నాయి.. సరికొత్త స్మార్ట్ఫోన్లు
తెలుగబ్బాయికి నిరాశ.. 'ఇండియన్ ఐడల్' విజేతగా మానసి
చెప్పుకోవడానికే బలమైన దేశం.. చేతల్లో ఏమీ లేదు: జెలెన్ స్కీ
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నిరసన సెగ
పర్యటించడానికి సాధ్యం కాని దేశాలివే..!
ఏడు అడుగుల కండక్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్
తల్లి బదులు పది పరీక్షకు కూతురు!
ఈ పాపం.. ఎవరిది పవన్?
రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేసిన ధోని
కురుబ లింగమయ్య కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
Hyderabad: భార్య కడుపుతో ఉన్నా కనికరించని దుర్మార్గుడు..
SRH: వరుసగా నాలుగు ఓటములు!.. మా బ్యాటింగ్ శైలి మారదు: వెటోరి
'రామ్ చరణ్' రికార్డ్ దాటాలని ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఫ్యాన్స్
నువ్వు బెదిరిస్తే.. బెదిరిపోతామా?.. ట్రంప్ టారిఫ్ డెడ్‌లైన్‌పై చైనా
పాపకు, నాకు డీఎన్ఏ టెస్టు చేయాలన్నారు, ఎప్పుడూ అనుమానమే!: కీర్తి
మీడియాపై ఊగిపోయిన సీఎం చంద్రబాబు
‘నా అప్పు 6 వేల కోట్లు.. వసూలు చేసింది14 వేల కోట్లు’
HYD: మియాపూర్ మెట్రోస్టేషన్ వద్ద లారీ బీభత్సం
RCB Vs MI: ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌కు భారీ షాక్!
అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్
Rat Ronin: వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఎలుక.. దేశ ప్రజల ప్రాణాలను కాపాడిన హీరో
బెంగళూరులో దారుణం.. వాకింగ్ చేస్తున్న మహిళపై లైంగిక వేధింపులు
బంగారం కొనడానికి ఇదే మంచి సమయం: మరింత తగ్గిన రేటు
‘తోలు తీస్తా, తాట తీస్తా అంటాడు.. ఊళ్లో మాత్రం ఉండడు’
నేను సింగిల్.. రూ.50 కోట్లు తీసుకుంటే తప్పేంటి?: బాలీవుడ్ హీరో
ఎన్టీఆర్ నాకంటే 9 ఏళ్లు చిన్నోడు.. ‘ఒరేయ్’ అంటే షాకయ్యా: రాజీవ్
శ్రీరామనవమి స్పెషల్ లుక్.. తారల ఫెస్టివల్ వైబ్స్ చూశారా?
రోషన్ భయ్యా.. ఈ రోతేంటయ్యా!
బాబుకు ఊడిగం చేసేవాళ్లకు ఇదే నా హెచ్చరిక: వైఎస్ జగన్
ఓటీటీలో 'టైమ్ లూప్ హారర్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
పాకిస్తాన్‌కు గట్టి షాకిచ్చిన ఐసీసీ.. పది రోజుల్లో ఇది మూడోసారి
భారత్‌తో టెస్టుతో అరంగేట్రం.. ఆసీస్ యువ ఓపెనర్ సంచలన నిర్ణయం
విజయ్ దేవరకొండతో సినిమా.. వారం వరకు భయపడ్డా
2025 మార్చిలో ఎక్కువమంది కొన్న కారు ఇదే..
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
వాట్ ఏ వెడ్డింగ్ మెనూ..ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..!
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితులకు ఉరిశిక్ష
ఎన్టీఆర్ ఎందుకింత సన్నమైపోయాడు? కారణం అదేనా
విడిపోయిన ప్రముఖ బుల్లితెర జంట.. వెల్లడించిన భర్త!
ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన ఇంగ్లండ్ ఆటగాడు
మీరట్ హత్య కేసులో మరో ట్విస్ట్.. వెలుగులోకి మరో కీలక విషయం
డబ్బు, పేరున్నా సుఖం లేదు.. ఛీ, ఎందుకీ బతుకు?.. వర్ష ఎమోషనల్
ఏఐ కాద్సార్! నిజం జింకే!!
మళ్లీ అదే నిర్లక్ష్యం.. జగన్ పర్యటనకు కనీస భద్రత కరువు
ఓటీటీ/ థియేటర్లో ఈ వారం 10కి పైగా సినిమాలు విడుదల
దర్శకుడి భార్య బర్త్ డే పార్టీలో ఎన్టీఆర్
ఓవైపు ప్రపంచ మార్కెట్లు కుదేలు.. ట్రంప్ ఆసక్తికర ప్రకటన
శ్రీలంక- సౌతాఫ్రికాలతో వన్డే సిరీస్.. భారత జట్టు ప్రకటన
మొక్కజొన్న మెషీన్లో పడి మహిళ దుర్మరణం
జియో కొత్త రీచార్జ్ ప్లాన్: రోజుకు 2జీబీ డేటా
తల్లీకొడుకు... యాక్షన్
లవకుశ చిత్రంలో సాంగ్.. వాళ్లిద్దరు కాదు.. ధన్‌రాజ్ పోస్ట్ వైరల్!
IPL 2025: హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు.. తొలి భారత క్రికెటర్‌గా
ఆ ఫీలింగ్ ఉండకూడదు: బాలీవుడ్ హీరోయిన్
కల్లుతాగి 100 మందికి పైగా అస్వస్థత.. వింత ప్రవర్తన
KTR: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఇక్కడా తీసేశారు.. కాంట్రవర్సీ వీడియో సాంగ్ రిలీజ్
సొంతంగా పళ్లు తోముకోలేని దుస్థితి.. ఆయన మాటలు మంత్రంలా పనిచేశాయి
సినిమాల్లోకి స్టార్ హీరోయిన్ కూతురు.. ‘ఎంట్రీ’ కోసం ఎన్ని కష్టాలో..!
'యుగానికి ఒక్కడు' సీక్వెల్ ధనుష్‌తోనే.. కార్తీపై దర్శకుడి కామెంట్స్
Saudi Arabia: 14 దేశాలకు వీసాల జారీ నిలిపివేత.. జాబితాలో భారత్
ఆక్వా కుదేలు.. ఇక ప్రభుత్వం ఉండీ ఏం లాభం?: వైఎస్ జగన్
సమ్మె బాటలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు
RCB Vs MI: ఆర్సీబీ అదరహో
Saaree Review: ఆర్జీవీ ‘శారీ’ మూవీ రివ్యూ
అందుకే పంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి రాలేదు: సీఎం స్టాలిన్
ఇప్పుడు ఎలాంటి ఆదేశాలివ్వలేం
IPL 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
అనర్హులతో అడ్డగోలుగా మూల్యాంకనం!
ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన 'అషు రెడ్డి' రొమాంటిక్ మూవీ
వివాహేతర సంబంధం.. చిన్నారిపై తల్లి పైశాచికం
సినిమా

పాపకు, నాకు డీఎన్ఏ టెస్టు చేయాలన్నారు, ఎప్పుడూ అనుమానమే!: కీర్తి
చిన్నవయసులోనే ఎన్నో కష్టాలు చూసింది కీర్తి భట్ (Keerthi Bhat). అయినవారిని పోగొట్టుకుంది, ప్రేమించినవాడి చేతిలో మోసపోయింది. పెంచుకున్న పాప దూరమై తల్లడిల్లింది. ఇలా నిత్యం కష్టాలతోనే సావాసం చేసిన కీర్తి సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్‌తో మరింత గుర్తింపు తెచ్చుకుంది. నటుడు విజయ్ కార్తీక్‌ను పెళ్లాడబోతున్న ఆమె అతడితో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. విజయ్ కంటే ముందు కీర్తి ఓ వ్యక్తిని ప్రేమించగా.. అతడి చేతిలో దారుణంగా మోసపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి.. మాజీ ప్రియుడి అరాచకాల్ని బయటపెట్టింది.నా వెంటపడ్డాడునాపాటికి నేను పని చేసుకుంటూ పోతున్న సమయంలో ఓ వ్యక్తి నా వెనకాల పడ్డాడు. ఒకే సెట్లో ఉండేసరికి అతడి లవ్ ప్రపోజల్‌కు నేనూ ఓకే చెప్పాను. తన ఇంటికి కూడా వెళ్లేదాన్ని. నాలుగు నెలలకు అతడి అనుమానపు బుద్ధి బయటపడింది. నేను చేస్తున్న సీరియల్ హీరోతో కలిసి ఏదైనా షోకు వెళ్లడానికి ఒప్పుకునేవాడు కాదు. వెళ్తే.. నాకు, అతడికి ఏదో ఎఫైర్ ఉందని అనుమానించేవాడు.బిగ్‌బాస్‌కు వెళ్లేముందే..ఫిలిం ఇండస్ట్రీ అంటేనే అందరితో కలిసి ఉండాలి. హీరో, హీరోయిన్ అన్నాక షోకు వెళ్లాలి, కలిసి డ్యాన్స్ చేయాలి, రీల్స్ చేయాలి. కానీ, నేను ఏదీ చేయకూడదని ఆంక్షలు పెట్టేవాడు. ఎక్కడికి వెళ్లినా అతడు, అతడి తల్లి డౌట్ పడేవారు. ఇదేంటి? ఇలా నరకంలో పడిపోయాను అనిపించింది. నేను దాచుకున్న డబ్బు అంతా వాళ్లకే ఖర్చు పెట్టాను. దానికి ప్రతిఫలంగా వాళ్లు సైకోలా ప్రవర్తించేవారు. బిగ్‌బాస్‌కు వెళ్లేముందు నేను దత్తత తీసుకున్న పాప చనిపోయింది. నా లవ్ బ్రేకప్ అయింది. అయితే పాప నా కూతురే కావొచ్చన్న అనుమానంతో డీఎన్ఏ టెస్ట్ చేయించాలనుకున్నారు. అక్కడే ఆగిపోయాడువాళ్లు డీఎన్ఏ టెస్ట్ అడిగినందుకు నేను భయంతో పాప చనిపోయిందని చెప్పానని నోటికొచ్చింది వాగుతున్నారు. అది విని నాకెంత బాధేసిందో! ఇంకా నేను ఆ అబ్బాయిని డబ్బులు అడిగానట.. నన్ను ఇంత చెడ్డదానిగా చిత్రీకరించాలా? ఇంతవరకు ఎన్నడూ అతడి గురించి చెడుగా మాట్లాడలేదు. అలాంటిది నేను ఎంత హర్ట్ అయి ఉంటే ఇప్పుడిదంతా చెప్తున్నాను. నాపై విషం కక్కిన ఆ వ్యక్తి జీవితంలో ఎదగకుండా అక్కడే ఆగిపోయాడు. కానీ నేను ఒక రేంజ్‌కు వచ్చాను అని కీర్తి భట్ భావోద్వేగానికి లోనైంది. ఇకపోతే కీర్తి భట్ రోడ్డు ప్రమాదంలో కుటుంబాన్ని కోల్పోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కీర్తికి పిల్లలు పుట్టరని వైద్యులు తేల్చేశారు.చదవండి: నేను సింగిల్.. రూ.50 కోట్లు తీసుకుంటే తప్పేంటి?: బాలీవుడ్ హీరో

పాత కేసు.. హీరోయిన్ కి మళ్లీ అరెస్ట్ వారెంట్
బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరాకు.. ముంబైకి చెందిన న్యాయస్థానం మరోసారి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దాదాపు 13 ఏళ్ల క్రితం జరిగిన గొడవకు సాక్ష్యంగా కోర్టులో హాజరు కావాలని పదేపదే చెబుతున్నా మలైకా రావట్లేదని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.ఏం జరిగిందంటే?2012 ఫిబ్రవరి 22న హీరో సైఫ్ అలీఖాన్, కరీన్ కపూర్, మలైకా అరోరాతో పాటు కొందరు ఫ్రెండ్స్.. ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ కి వెళ్లారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ బిజినెస్ మ్యాన్ తో గొడవ జరిగింది. దీంతో సైఫ్.. సదరు బిజినెస్ మ్యాన్ ముక్కుపై గట్టిగా గుద్దాడు. దీంతో విషయం పోలీసు కేసుల వరకు వెళ్లింది.(ఇదీ చదవండి: సింగపూర్‌లో అగ్ని ప్రమాదం.. పవన్ కుమారుడికి గాయాలు)ఈ గొడవకు కారణమైన సైఫ్ అలీఖాన్ తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేయగా.. వెంటనే బెయిల్ పై బయటకొచ్చేశారు. అయితే ఈ కేసులో సాక్ష్యం చెప్పేందుకు కోర్ట్ ఎదుట హాజరు కావాలని మలైకాకు ఈ ఏడాది ఫిబ్రవరి 15న నోటీసులు పంపించారు. కానీ రాలేదు. తాజాగా ఏప్రిల్ 7న హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించిన గైర్హాజరు అయింది.దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం మలైకాకు బెయిలబుల్ అరెస్ట్ వారీ జారీ చేసింది. కోర్టును అగౌరవ పరిచినందుకుగాను కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని సదరు న్యాయస్థానం పేర్కొంది. ఏప్రిల్ 29కి ఈ కేసు వాయిదా పడింది. ఇకపోతే తనతోపాటు వచ్చిన మహిళల్ని దూషించడం వల్లే సైఫ్ దాడి చేశాడని అంటున్నారు. మరి మలైకా నోరు విప్పితే గానీ అసలు నిజం బయటపడదు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ తండ్రికి క్యాన్సర్.. ఫొటో వైరల్)

'జాట్' థీమ్ సాంగ్ చూశారా..?
బాలీవుడ్ హీరో సన్నీ డియోల్(Sunny Deol) కొత్త సినిమా 'జాట్'(Jaat) నుంచి థీమ్ సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని(Gopichandh Malineni) తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ మూవీని భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్స్ ఇప్పటికే జరుగుతున్నాయి. అయితే, తెలుగు వర్షన్ సినిమా విడుదలకు ఇంకాస్త టైమ్ పడొచ్చని సమాచారం. టీజర్, ట్రైలర్, ఊర్వశి రౌతేలా ప్రత్యేకమైన సాంగ్ ప్రేక్షకులను మెప్పించాయి. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. జాట్ సినిమాలో రణదీప్ హుడా విలన్‌గా నటిస్తున్నారు. వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కీలకపాత్రల్లో మెప్పించనున్నారు.

టాలీవుడ్ హీరోయిన్ తండ్రికి క్యాన్సర్.. ఫొటో వైరల్
ఆర్ఎక్స్ 100, మంగళవారం లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన పాయల్ రాజ్ పుత్(Payal Rajput).. మొన్నీమధ్యే టాలీవుడ్ లో నెపోటిజం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు తన కుటుంబంలో జరిగిన బ్యాడ్ న్యూస్ గురించి బయటపెట్టింది.తన తండ్రి ఎసోఫెగల్ కార్సినోమా (క్యాన్సర్) బారిన పడ్డారని, ఇప్పుడు ట్రీట్ మెంట్ మొదలుపెట్టామని, తొలి కీమో థెరపీ సెషన్ లోనూ ఆయన పాల్గొన్నారని పాయల్ రాజ్ పుత్ చెప్పుకొచ్చింది. దీని వల్ల తనకు కాస్త భయంగా ఉందని పేర్కొంది. ఆయన త్వరలో కోలుకుంటారని, దానికి మీ ప్రేమ, సపోర్ట్ కావాలని రాసుకొచ్చింది. (ఇదీ చదవండి: సింగపూర్‌లో అగ్ని ప్రమాదం.. పవన్ కుమారుడికి గాయాలు)ఇంత బాధలోనూ తనని పనిచేసుకోమని, షూటింగ్ కి హాజరవ్వమని చెబుతున్నారని పాయల్ రాజ్ పుత్ చెప్పుకొచ్చింది. ఈ మేరకు తండ్రికి సెలైన్ ఎక్కిస్తున్న ఫొటోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో పలువురు నెటిజన్స్ పాయల్ తండ్రి త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు.పాయల్ తండ్రికి జీర్ణాశయ క్యాన్సర్ (Cancer) వచ్చింది. పాయల్ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం తమిళంలో రెండు, తెలుగులో ఓ మూవీ చేస్తోంది.(ఇదీ చదవండి: నీ చుట్టూ శత్రువులు.. 'కాంతార' హీరోపై పంజర్లి ఆగ్రహం) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal)
న్యూస్ పాడ్‌కాస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో ఆగిన ‘ఆరోగ్యశ్రీ’!. సమ్మెలో నెట్వర్క్ ఆస్పత్రులు

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల 500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించని ప్రభుత్వం... సమ్మె బాటలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు

ఏపీలో ఊరూ వాడా ఏరులై పారుతున్న వైనం. కూటమి నేతల సిండికేట్ కబంధ హస్తాల్లో మద్యం షాపులు.

వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లింలను దగా చేసిన ఏపీ సీఎం చంద్రబాబు... మూడు సవరణలు ప్రతిపాదించామంటూ తెలుగుదేశం పార్టీ గొప్పలు... అవి పసలేని సవరణలేనని మైనార్టీల ఆగ్రహం

తక్షణమే పనులు నిలిపివేయండి కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం... అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు... నేడు రాజ్యసభ ముందుకు బిల్లు

నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు... చర్చతోపాటు ఓటింగ్ జరిగే అవకాశం

శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

బడుగుల ఆలోచన ఆ పూట వరకే. ఎస్సీ, బీసీ వర్గాలపై చంద్రబాబు అక్కసు

ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్లను దగా చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... రోడ్డున పడిన 2 లక్షల 66 వేల కుటుంబాలు
క్రీడలు

PSL: జనాలు IPL వదిలేసి మమ్మల్నే చూస్తారు: పాక్ క్రికెటర్
ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన టీ20 లీగ్‌గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కొనసాగుతోంది. అంతేకాదు క్రికెట్ వరల్డ్ అత్యంత ఖరీదైన లీగ్ కూడా ఇదే. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2008లో ప్రతిష్టాత్మకంగా ఆరంభించిన ఈ పొట్టి లీగ్.. విజయవంతంగా పదిహేడేళ్లు పూర్తి చేసుకుంది.రాత్రికి రాత్రే కోటీశ్వరులుగాఐపీఎల్ ద్వారా ఎంతో మంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. దేశీ, విదేశీ క్రికెటర్లు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఇదొక ప్రధాన వేదికగా నిలుస్తోంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ ద్వారా ఎంతో మంది ఆటగాళ్లు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిపోయారు. ఇక ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా బోర్డులు కూడా ఇప్పటికే బిగ్‌బాష్, SAT20 లీగ్‌లు నిర్వహిస్తున్నాయి.మరోవైపు.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కూడా 2016లో పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) పేరిట టీ20 టోర్నీని ప్రవేశపెట్టింది. అయితే, ఆశించిన స్థాయిలో ఈ లీగ్ హిట్ కాలేదు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఐపీఎల్-2025 సీజన్ ఆరంభమైపోగా.. పీఎస్ఎల్ తాజా ఎడిషన్ ఏప్రిల్ 11న మొదలుకానుంది.అలా అయితే.. జనాలు IPL వదిలేసి మమ్మల్నే చూస్తారుఈ నేపథ్యంలో కరాచీ కింగ్స్ జట్టు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఈ సందర్భంగా పాక్ బౌలర్, కరాచీ కింగ్స్ పేసర్ హసన్ అలీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘మా దేశ ప్రజలకు క్రికెట్ అంటే పిచ్చి ప్రేమ. అభిమానులకు ఇదో భావోద్వేగం.వారిని సంతోషరిచేందుకు మేము అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంటాం. క్రికెట్ ప్రేమికులు వినోదం కోరుకుంటారు. ఆటగాళ్లు ఎక్కడైతే అద్బుతంగా ఆడుతారో.. వారి కన్ను అటువైపే ఉంటుంది.ఒకవేళ మేము గనుక పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో మరింత గొప్పగా ఆడితే.. ప్రేక్షకులంతా ఐపీఎల్ వదిలి మమ్మల్ని చూసేందుకు వస్తారు’’ అని హసన్ అలీ జియో న్యూస్‌తో పేర్కొన్నాడు. అతడి వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.టీమిండియా అభిమానులైతే.. ‘‘మీరెన్ని ప్రయత్నాలు చేసినా ఐపీఎల్ దరిదాపుల్లోకి కూడా రాలేరు. అసలు ఐపీఎల్‌తో, పీఎస్ఎల్కు పోలికే లేదు. ఏదేమైనా గొప్పగా ఆడాలన్న మీ సంకల్పం నెరవేరితే బాగుంటుంది’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.పునరాగమనమే లక్ష్యంఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025 మార్చి 22న మొదలై మే 25తో ముగియనుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో మొత్తం పదిజట్లు ఉన్నాయి. మరోవైపు.. పీఎస్ఎల్ ఏప్రిల్ 11 నుంచి మే 18 వరకు జరుగనుంది. ఇందులో ఆరుజట్లు పాల్గొంటున్నాయి.ఇక 30 ఏళ్ల హసన్ అలీ గతేడాది పది మ్యాచ్‌లు ఆడి పద్నాలుగు వికెట్లు తీశాడు. మరోవైపు.. అతడి జట్టు కరాచీ కింగ్స్ గతేడాది పదింట కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. ఇక ఈసారి సత్తా చాటేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్న హసన్ అలీ.. జాతీయ జట్టులో పునరాగమనం చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.చదవండి: Hardik Pandya: అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల..

MI VS RCB: కృనాల్ పాండ్యాకు అచ్చొచ్చిన ఏప్రిల్ 7
ఆర్సీబీ బౌలర్ కృనాల్ పాండ్యాకు ఏప్రిల్ 7 భలే అచ్చొచ్చే తేదీలా ఉంది. యాధృచ్చికమో ఏమో తెలీదు కానీ ఈ తేదీన కృనాల్ చెలరేగిపోతాడు. గత కొన్నేళ్లుగా ఈ తేదీలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. 2023 సీజన్ నుంచి ఏప్రిల్ 7న ఆడిన ప్రతి మ్యాచ్‌లో కృనాల్ సత్తా చాటాడు. 2023 సీజన్లో కృనాల్ లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడుతూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అదరగొట్టాడు. ఆ మ్యాచ్‌లో కృనాల్ తొలుత బంతితో చెలరేగి (4-0-18-3), ఆతర్వాత బ్యాట్‌తోనూ రాణించాడు (23 బంతుల్లో 34; 4 ఫోర్లు, సిక్స్). ఫలితంగా లక్నో సన్‌రైజర్స్‌పై ఘన విజయం సాధించింది. ఈ ప్రదర్శనకు గానూ కృనాల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కింది.2024 సీజన్లో ఏప్రిల్ 7న నాడు కృనాల్ ప్రాతినిథ్యం వహించిన లక్నో సూపర్ జెయింట్స్ గుజరాత్ టైటాన్స్‌తో తలపడింది. ఆ మ్యాచ్‌లో కృనాల్ బంతితో అదరగొట్టి (4-0-11-3) తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తాజాగా 2025 ఏప్రిల్ 7న కృనాల్ మరోసారి రెచ్చిపోయాడు. ఈ తేదీన ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 45 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో కృనాల్ చివరి ఓవర్ వేసి 6 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఫలితంగా అతను కొత్తగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్సీబీ ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. గత మూడేళ్లలో ఏప్రిల్ 7న ఆడిన మ్యాచ్‌ల్లో కృనాల్ రెచ్చిపోవడం చూస్తే ఈ తేదీ అతనికి అచ్చొచ్చిందిగా చెప్పవచ్చు. ఈ మూడు సందర్భాల్లో కృనాల్ రాణించడంతో పాటు అతని జట్టును కూడా గెలిపించాడు. ఓ సందర్భంలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా కూడా నిలిచాడు. 2016లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన కృనాల్ ఈ సీజన్లోనే ఆర్సీబీలో చేరాడు. మెగా వేలంలో ఆర్సీబీ కృనాల్‌ను రూ. 5.75 కోట్లకు కొనుగోలు చేసింది. అంతకుముందు కృనాల్ మూడేళ్లు (2022, 2023, 2024) లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడాడు. దానికి ముందు వరుసగా ఆరు సీజన్లు (2016, 17, 18, 19, 20, 21) ముంబై ఇండియన్స్‌కు ప్రాతనిథ్యం వహించాడు. కృనాల్ జట్టులో ఉండగా ముంబై ఇండియన్స్ మూడుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచింది.లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన 34 ఏళ్ల కృనాల్ ఇప్పటివరకు 131 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 1652 పరుగులు, 83 వికెట్లు తీశాడు.నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. ఆర్సీబీ ముంబై ఇండియన్స్‌ను వారి సొంత ఇలాకాలో దాదాపు పదేళ్ల తర్వాత ఓడించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.విరాట్ కోహ్లి (67), రజత్ పాటిదార్ (64), జితేశ్ శర్మ (40 నాటౌట్), పడిక్కల్ (37) సత్తా చాటారు. ముంబై బౌలర్లలో బౌల్ట్, హార్దిక్ తలో 2 వికెట్లు తీయగా.. విజ్ఞేశ్ పుతుర్ ఓ వికెట్ పడగొట్టాడు. ఛేదనలో ముంబై చివరి ఓవర్ వరకు పోరాడి 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. తిలక్ వర్మ (56), హార్దిక్ పాండ్యా (42) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ముంబైని గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ 4, హాజిల్‌వుడ్, యశ్ దయాల్ తలో 2, భువనేశ్వర్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు.

RCB Vs MI: ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌కు భారీ షాక్!
గెలుపు జోష్‌లో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్-2025లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా పాల్పడిన తప్పిదానికి గానూ ఐపీఎల్ పాలక మండలి అతడికి భారీ జరిమానా విధించింది. కాగా పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్సీబీ వాంఖడేలో తొలి విజయం నమోదు చేసి విషయం తెలిసిందే. పాటిదార్ కెప్టెన్సీలో సోమవారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన ఆర్సీబీ.. తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో ఫిల్ సాల్ట్ (4) విఫలం కాగా.. విరాట్ కోహ్లి (42 బంతుల్లో 67) మాత్రం రాణించాడు. ఆకాశమే హద్దుగా ఇక వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 22 బంతుల్లో 37 పరుగులు చేయగా.. పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. కేవలం 32 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో పాటిదార్ 64 పరుగులు సాధించాడు. ఇక వికెట్ కీపర్ జితేశ్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 19 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్స్‌లు బాది 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ ఐదు వికెట్ల నష్టానికి 221 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.ముంబై బౌలర్లలో పేసర్లు ట్రెంట్ బౌల్ట్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు తీయగా.. స్పిన్నర్ విఘ్నేశ్ పుతూర్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనలో ముంబై ఆరంభంలోనే తడబడింది. టాపార్డర్ రోహిత్ శర్మ (17), రియాన్ రికెల్టన్ (17), విల్ జాక్స్ (22)విఫలం కాగా.. సూర్యకుమార్ యాదవ్(28) కూడా నిరాశపరిచాడు.తిలక్, హార్దిక్ రాణించినా..ఈ క్రమంలో తిలక్ వర్మ (29 బంతుల్లో 56), హార్దిక్ పాండ్యా (15 బంతుల్లోనే 42) ధనాధన్ బ్యాటింగ్‌తో అదరగొట్టినా.. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయిన ముంబై 209 పరుగుల వద్ద నిలిచింది. దీంతో పన్నెండు పరుగుల తేడాతో ఆర్సీబీ ముంబైపై విజయం సాధించింది.రూ. 12 లక్షల జరిమానాఅయితే, రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఆర్సీబీ స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసింది. నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయలేకపోయింది. దీంతో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌కు ఐపీఎల్ పాలక మండలి రూ. 12 లక్షల జరిమానా విధించింది. ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం.. తొలి తప్పిదం కాబట్టి ఈసారి రూ. 12 లక్షల ఫైన్‌తో సరిపెట్టింది.కాగా ఐపీఎల్-2025 సందర్భంగా ఆర్సీబీ కెప్టెన్‌గా తొలిసారి పగ్గాలు చేపట్టిన రజత్ పాటిదార్ ఊహించని రీతిలో అదరగొడుతున్నాడు. ఇటు బ్యాటర్‌గా.. అటు సారథిగా దుమ్ములేపుతున్నాడు. ఇప్పటి వరకు అతడి సారథ్యంలో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు గెలిచి ఆరు పాయింట్లతో కొనసాగుతోంది. టోర్నీ ఆసాంతం ఇదే జోరు కనబరిస్తే ఈసారి కప్ కొట్టాలన్న ఆర్సీబీ చిరకాల కల నెరవేరే అవకాశాలు లేకపోలేదు.చదవండి: Hardik Pandya: అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల.. A #TATAIPL Classic in every sense 🔥#RCB hold their nerves to seal a win after 1️⃣0️⃣ years against #MI at Wankhede! Scorecard ▶️ https://t.co/ArsodkwOfO#TATAIPL | #MIvRCB | @RCBTweets pic.twitter.com/uu98T8NtWE— IndianPremierLeague (@IPL) April 7, 2025

ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 8) రెండు మ్యాచ్‌లు.. వారం మధ్యలో ఇలా ఎందుకంటే..?
ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 8) రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుండగా.. రాత్రి మ్యాచ్‌లో పంజాబ్, సీఎస్కే ఢీకొట్టనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్ కేకేఆర్ హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్‌లో జరుగనుండగా.. రాత్రి మ్యాచ్ పంజాబ్ హోం గ్రౌండ్ ముల్లన్పూర్ స్టేడియంలో జరుగనుంది.వారం మధ్యలో ఎందుకంటే..?తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్‌లు లేవు. అయితే ఏప్రిల్ 6న జరగాల్సిన కేకేఆర్, లక్నో మ్యాచ్‌ను నేటి మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఆ రోజు శ్రీరామనవమి కావడంతో కోల్‌కతా పోలీసులు మ్యాచ్‌కు భద్రతా ఏర్పాట్లు చేయలేమని చెప్పారు. దీంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ మ్యాచ్‌ను వాయిదా వేయాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మరియు బీసీసీఐని కోరింది. దీంతో కేకేఆర్, లక్నో మ్యాచ్ నేటి మధ్యాహ్నానికి వాయిదా పడింది.ప్రస్తుతం కేకేఆర్, లక్నో పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఇరు జట్లు ఇప్పటివరకు తలో 4 మ్యాచ్‌లు ఆడి రెండింట గెలిచి, రెండిట ఓడాయి. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరుకు ఐదు మ్యాచ్‌ల్లో తలపడగా.. లక్నో 3, కేకేఆర్ 2 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.తుది జట్లు (అంచనా)..కేకేఆర్: క్వింటన్ డికాక్/రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌కీపర్), సునీల్ నరైన్, అజింక్య రహానే (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మొయిన్ అలీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరాలక్నో: మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్‌కీపర్), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, దిగ్వేష్ రాఠి, రవి బిష్ణోయ్రాత్రి మ్యాచ్ విషయానికొస్తే.. ఈ సీజన్లో దుమ్మురేపుతున్న పంజాబ్ వరుస పరాజయాలతో చతికిలపడ్డ సీఎస్కేతో తలపడనుంది. పంజాబ్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండింట విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా.. సీఎస్కే నాలుగింట మూడు ఓడి చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 30 మ్యాచ్‌ల్లో తలపడగా.. సీఎస్కే 16, పంజాబ్ 14 మ్యాచ్‌ల్లో గెలిచాయి. 2022 సీజన్ నుంచి జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌లు పంజాబే గెలిచింది.తుది జట్లు (అంచనా)..పంజాబ్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్‌కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్వెల్, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, విజయ్ శంకర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ధోని (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి/అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, మతీష పతిరణ
బిజినెస్

త్వరలో ధరలు పెంపు.. యాపిల్ స్టోర్ల వద్ద రద్దీ
ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్న టారిఫ్‌లు టెక్ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రపంచ టాప్ టెక్ కంపెనీ యాపిల్‌పై ఈ సుంకాల ప్రభావం భారీగా ఉంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. దాంతో ఎలాగైనా కంపెనీ ఐఫోన్ ధరలు పెంచుందనే ఉద్దేశంతో వినియోగదారులు ముందుగానే కొనుగోలుకు సిద్ధపడుతున్నారు. ఐఫోన్లు అధికంగా తయారవుతున్న చైనాపై యూఎస్ ఏకంగా 54 శాతం ప్రతీకార సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీనివల్ల కంపెనీ షేర్లు ఇటీవల కాలంలో భారీగా తగ్గిపోయాయి. అదేసమయంలో త్వరలో ధరలు పెరుగుతాయని ఊహాగానాలతో ఐఫోన్లను కొనుగోలు చేసేందుకు యూజర్లు బారులు తీరుతున్నారు.టారిఫ్‌ల అమలు తర్వాత అనూహ్యంగా వ్యయ పెరుగుదల ఉంటుందని దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరల పెంపు అమల్లోకి రాకముందే ఐఫోన్లను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎగబడడంతో అమెరికా వ్యాప్తంగా యాపిల్ రిటైల్ స్టోర్ల వద్ద రద్దీ కనిపించింది. చైనా తయారీపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన ఈ సుంకాలు యాపిల్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.భారత్‌పైనా ప్రభావం..విదేశాలతోపాటు చైనా దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల కారణంగా యాపిల్ ఐఫోన్ ధరలు 40 శాతం వరకు పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వంటి ప్రీమియం మోడళ్ల ధరలు భారతదేశంలో రూ.2 లక్షలకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: సాఫ్ట్వేర్ సృష్టి కంటే నిర్వహణవైపే మొగ్గుఐఫోన్ రూ.రెండు లక్షలు!చైనాలో మౌలికసదుపాయాలు, ఉద్యోగులు అధికంగా ఉండడంతో అమెరికా కంపెనీలు తయారీ యూనిట్లను ప్రారంభించాయి. అందులో భాగంగా యాపిల్ సంస్థ కూడా చైనాలో తయారీని మొదలు పెట్టింది. ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేతపట్టిన తర్వాత చైనా వంటి దేశాల్లో తయారీని ప్రారంభించిన యూఎస్ కంపెనీలు స్వదేశంలో ప్లాంట్లు పెట్టేలా తాజా సుంకాలు విధిస్తున్నట్లు చెప్పారు. ఈ సుంకాలు యాపిల్‌ను ఇరకాటంలో పడేశాయి. కంపెనీ ఇప్పటికీ ఐఫోన్లను చైనాలో అసెంబుల్ చేస్తోంది. అమెరికా సుంకాలతో సంస్థ 54 శాతం క్యుములేటివ్ టారిఫ్ రేటును ఎదుర్కోనుంది. యాపిల్ ఈ ఖర్చులను వినియోగదారులకు బదిలీ చేయాలని నిర్ణయించుకుంటే ప్రస్తుతం 799 (సుమారు రూ.68,000) ధర ఉన్న ఎంట్రీ-లెవల్ ఐఫోన్ 16, 1,142 డాలర్లకు (సుమారు రూ.97,000) పెరుగుతుంది. ఇది 43 శాతం పెరిగే అవకాశం ఉంది. అధునాతన ఏఐ సామర్థ్యాలు, 1 టీబీ స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వంటి ప్రీమియం మోడళ్లు 2,300 డాలర్లు (సుమారు రూ.1.95 లక్షలు) చేరుకోవచ్చు.

సాఫ్ట్వేర్ సృష్టి కంటే నిర్వహణవైపే మొగ్గు
ప్రముఖ మెసేజింగ్ టూల్ హాట్ మెయిల్ సహ వ్యవస్థాపకుడు సబీర్ భాటియా ఇటీవల భారతదేశ ఇంజినీరింగ్ వ్యవస్థ గురించి, ఆవిష్కరణల సామర్థ్యం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సాంకేతికత ఆవిష్కరణలో చైనా సాధించిన విజయాలతో సరితూగే భారతదేశ సామర్థ్యానికి ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పారు. చాలా మంది భారతీయ ఇంజినీర్లు కొత్త సాంకేతికత సృష్టించడానికి బదులుగా వాటి నిర్వహణ వైపు మొగ్గు చూపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.99 శాతం భారతీయ ఇంజినీర్లు అపార జ్ఞానాన్ని కలిగి ఉన్నట్లు తెలిపారు. కానీ చాలావరకు స్పష్టమైన ఉత్పత్తులను సృష్టించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచించలేకపోతున్నట్లు చెప్పారు. ఈ మనస్తత్వం మెరుగైన ఆవిష్కరణలను ప్రోత్సహించే భారతదేశ సామర్థ్యాన్ని అణచివేస్తుందని అభిప్రాయపడ్డారు. ఒరిజినల్ సాఫ్ట్వేర్ సృష్టి కంటే ఔట్ సోర్సింగ్‌పై దృష్టి సారించే వ్యాపారవేత్తలపై భారత్ ప్రశంసలు కురిపించడం విడ్డూరంగా ఉందన్నారు. క్రిటికల్ థింకింగ్, ప్రాక్టికల్ స్కిల్స్‌ను ప్రోత్సహించేందుకు భారత్ తన విద్యావ్యవస్థను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని భాటియా వ్యాఖ్యానించారు. దీన్ని చైనా సమ్మిళిత విద్యా విధానాలతో పోల్చారు. ఇది సృజనాత్మకత, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో వారి విజయానికి దోహదపడిందని తెలిపారు.ఇదీ చదవండి: గోల్డెన్ ఛాన్స్! తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..ఇంజినీరింగ్ విద్య, వర్క్ కల్చర్ విషయంలో భారత్ పునరాలోచించుకోవాలని భాటియా పిలుపునిచ్చాయి. సాంకేతిక నైపుణ్యాలకు విలువనివ్వడం, సృజనాత్మకత వృద్ధి చెందేలా తగిన వాతావరణాన్ని పెంపొందించడంపై దృష్టి సారించాలని సూచించారు.

గోల్డెన్ ఛాన్స్! తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఇటీవలి కాలంలో క్రమంగా తగ్గుముఖం పడుతోంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం కొంత తగ్గి కొనుగోలుదారులకు మరింత ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.82,250 (22 క్యారెట్స్), రూ.89,730 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.600, రూ.650 తగ్గింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.600, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.650 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.82,250 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.89,730 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.600 దిగి రూ.82,400కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.650 తగ్గి రూ.89,880 వద్దకు చేరింది.ఇదీ చదవండి: ఎగుమతిదార్లకు బాసటగా కేంద్రం చర్యలువెండి ధరలుబంగారం ధరలు మంగళవారం తగ్గినా వెండి ధరలు(Silver Price) మాత్రం స్థిరంగానే ఉన్నాయి. సోమవారం ముగింపు ధరలతో పోలిస్తే ఏమాత్రం కదలాడకుండా నిలకడగా ఉన్నాయి. దాంతో కేజీ వెండి రేటు రూ.1,03,000 వద్ద స్థిరంగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

రిలీఫ్ ర్యాలీ.. 1100 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ(Nifty) 347 పాయింట్లు పెరిగి 22,511కు చేరింది. సెన్సెక్స్(Sensex) 1096 పాయింట్లు ఎగబాకి 74,235 వద్ద ట్రేడవుతోంది. నిన్న భారీగా పడిన మార్కెట్ల్లో ఈరోజు రిలీఫ్ ర్యాలీ కనిపిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 102.97 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 65.01 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.14 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.23 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.1 శాతం పుంజుకుంది.మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ నినాదంతో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలిచిన ట్రంప్.. ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో సృష్టిస్తున్న ప్రకంపనలు చల్లారడం లేదు. అమెరికాతో వ్యాపారం చేస్తున్న ప్రతి దేశాన్నీ కాళ్ల బేరానికి వచ్చేలా చేయడానికి ఆయన ఎంచుకున్న ప్రతీకార సుంకాలు అమెరికా సహా అన్ని స్టాక్ మార్కెట్లలోనూ కల్లోలాన్ని కొనసాగిస్తున్నాయి. కెనడా, జపాన్ సహా పలు దేశాల అధినేతలు ట్రంప్‌తో చర్చలకు వెళుతున్నట్లు ఇప్పటికే ప్రకటించగా చైనా మాత్రం దిగిరాలేదు. పైపెచ్చు ట్రంప్ టారిఫ్‌లకు జవాబుగా చైనా కూడా అమెరికా వస్తువులపై సుంకాలు పెంచటంతో ట్రంప్ బెదిరింపులకు దిగింది. చైనా వాటిని ఉపసంహరించుకోకపోతే మరో 50 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. మరోవైపు ట్రంప్ చర్యలతో ప్రపంచాన్ని మాంద్యం ముంచెత్తే అవకాశాలు 60 శాతానికి చేరినట్లు ఆర్థిక దిగ్గజాలు ప్రకటించాయి.అప్రమత్తత అవసరంతీవ్ర అనిశ్చితులతో ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లో భయాందోళనలు భారీగా పెరిగాయి. ట్రంప్ సుంకాల విధింపుతో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితులు ఎప్పుడు సద్దుమణుగుతాయో ఎవరికి సరైన స్పష్టత లేదు. అయినప్పటికీ ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే మన మార్కెట్లపై ప్రభావం తక్కువగానే ఉంది. క్షీణత వేళ అప్రమత్తతతో వ్యహరిస్తూ మంచి షేరు విలువ ఆకర్షణీయంగా కనిపిస్తే కొనుగోలు చేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇన్వెస్ట్ చేసేముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలని చెబుతున్నారు.గురువారం(10న) శ్రీ మహావీర్ జయంతి సందర్భంగా మార్కెట్లు పనిచేయవు.ఇదీ చదవండి: టాయ్ పరిశ్రమకు ‘టారిఫ్’ల ప్రయోజనం!(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఫ్యామిలీ

సచిన్ మెచ్చిన గుమ్మడికాయ చికెన్ కర్రీ..! ఉబ్బితబ్బిబైన మాస్టర్ చెఫ్
మనం ఎంతో ఇష్టపడే వ్యక్తులను కలిసినా..వారికి ఆతిథ్యం ఇచ్చే అవకాశం దొరికినా..ఎంతో ఖుషీగా ఫీలవుతాం. అలాంటిది మనం కలలో కూడా కలిసే అవకాశం లేని ఓ ప్రముఖ సెలబ్రిటీ లేదా క్రికెట్‌స్టార్ లాంటి వాళ్లైతే ఇక ఆ మధుర క్షణాలు జన్మలో మర్చిపోం. మళ్లీ మళ్లీ ఆ క్షణాలు కళ్లముందు కదలాడుతూనే ఉంటాయి. అలాంటి అరుదైన అనుభవమే ఈ మాస్టర్ చెఫ్‌కి ఎదురైంది. తనెంతో ఇష్టపడే ప్రముఖ క్రికెటర్ని కలిసే అవకాశం రావడమే కాదు, అతనికి తన ప్రాంతం వంటకాలను రుచి చూపించే ఛాన్స్‌కొట్టేసింది. అసలు తాను ఇలాంటి ఓ అద్భుతం జరుగుతుందని ఎన్నడు అనుకోలేదంటూ ఉబ్బితబ్బిబవుతోందామె. ఆ చెఫ్ మేఘాలయకి చెందిన నంబీ మారక్. ఆమె మాస్టర్ చెఫ్ రన్నరప్ కూడా. ఆమె షిల్లాంగ్‌లోని తన ఇంటి గోడలపై సచిన్ టెండూల్కర్ పోస్టర్లను చూస్తూ పెరింగింది. అలాంటి ఆమెకు అనుకోని అవకాశం వరంలా వచ్చిపడింది. తనెంతో ఇష్టపడే ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తమ రాష్ట్రాన్ని పర్యటించడానికి రావడం ఓ ఆశ్చర్యం అయితే..ఆయనకు స్వయంగా తన చేతి వంటే రుచిచూపించడం మరో విశేషం. చెఫ్ నంబీ సచిన్‌కి తన ప్రాంత గారో సంప్రదాయ వంటకాలతో ఆతిధ్యం అందించింది. తన క్రికెట్ హీరోకి వండిపెట్టే ఛాన్స్ దొరికిందన్న సంబరంతో..ఎంతో శ్రద్ధపెట్టి మరీ వెజ్, నాన్‌వెజ్ వంటకాలను తయారు చేసింది. అవన్నీ ఇంటి వంటను మరిపించేలా రుచికరంగా సర్వ్ చేసింది. ఆ రెసిపీలలో.. వెటెపా (అరటి ఆకులలో ఉడికించిన మృదువైన చేప), కపా అండ్ గారో, గుమ్మడికాయ చికెన్(డూ'ఓ గోమిండా)..పితా అనే స్టిక్కీ రైస్ తదితరాలను అమిత ఇష్టంగా ఆరగించాడు సచిన్. వాటిన్నింటిలో సచిన్ మనసును మెప్పించని వంటకం మాత్రం గుమ్మడికాయ చికెన్ కర్రీనే కావడం విశేషం. ఇక చివరగా చెఫ్ నంబీ మాట్లాడుతూ.."గారో వంటకాలు కేవలం ఆహారం మాత్రమే కాదు. ఇవి మా ప్రాంతంలోని ఒక్కో ఇంటి సంప్రదాయానికి సంబంధించిన ప్రసిద్ధ వంటకాలు. ఈ రెసిపీలని నిప్పుల మీద ఎంతో శ్రమ కోర్చి వండుతారు. అలాంటి అపురూపమైన వంటకాలను నా కిష్టమైన క్రికెటర్ సచిన్‌కి వండిపెట్టడం ఓ కలలా ఉంది. నిజంగా ఇది ఓ ట్రోఫీ గెలిచిన దానికంటే ఎక్కువ. "అని ఆనందపారవశ్యంతో తడిసిముద్దవుతోంది చెఫ్ నంబీ.(చదవండి: World Health Day: వ్యాధులకు చెక్‌పెట్టి.. ఆరోగ్యంగా జీవిద్దాం ఇలా..!)

WorldHealthDay ఇది రెండో రౌండ్, అయినా యుద్ధమే!
నటి, దర్శకురాలు తహిరా కశ్యప్ (Tahira Kashyap) ఆరోగ్యం మరోసారి ఇబ్బందుల్లో పడింది. గతంలో బ్రెస్ట్ కేన్సర్‌ను ఓడించిన ఈ యోధురాల్ని మహమ్మారి ఇంకా వదల్లేదు. మళ్లీ తాను బ్రెస్ట్ కేన్సర్ (Breast Cancer) బారిన పడినట్టు నటుడు ఆయుష్మాన్ ఖుర్రానా భార్య తహిరా కశ్యప్ వెల్లడించింది. రొమ్ము కేన్సర్ మళ్లీ వచ్చిందని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ద్వారా ప్రకటించింది. దీనిపై ఆమె భర్త ఆయుష్మాన్ ఖురానాతో సహా పలువురు స్పందించారు. ఈ సారి కూడా ఈ వ్యాధి నుంచి బైటపడతావంటూ ధైర్యం చెప్పారు.తనకు మళ్లీ కేన్సర్ సోకిందన్న విషయాన్ని ప్రపంచ ఆరోగ్యం దిన రోజున తన అభిమానులతో పంచుకుంది. ఆ పోస్ట్ కి తహిరా క్యాప్షన్ ఇచ్చింది:"ఏడేళ్ల బాధలు, రెగ్యులర్ చెకప్‌లు.. మామోగ్రామ్లు చేయించుకోవాలని ప్రతి ఒక్కరికీ అదే చెప్తూ ఉంటా... అయినా నాకు రౌండ్ 2...సోకింది అని తెలిపింది. అయినా తాను మరొక యుద్ధానికి సిద్ధంగా ఉన్నానని, ఈ వ్యాధితో పోరాడటానికి తాను నిశ్చయించుకున్నానని తెలిపింది. నాకు మళ్లీ కేన్సర్ వచ్చింది అని ప్రకటించడానికి మొహమాటం ఏమీ లేదు. ప్రపంచ ఆరోగ్య దినం రోజున ఇలా చెప్పడం బాధాకరమే. కానీ మన ఆరోగ్య సంరక్షణ గురించి మనం చేయ గలిగినంత చేద్దాం’ అంటూ పేర్కొంది. జీవితం నిమ్మకాయలు ఇచ్చినప్పుడు, నిమ్మరసమే తయారు చేసుకోవాలి. జీవితం గాడిన పడుతున్న సమయంలో మళ్లీ తిరగబెట్టినపుడు, దాన్ని కాలా ఖట్టా డ్రింక్‌లో దాన్ని పిండుకొని తాగడమే. ఎందుకంటే అది మంచి పానీయం. రెండోసారి కూడా నీకు కూడా మేలు జరుగుతుంది అంటూ రాసు కొచ్చింది"నా హీరో" అంటూ భార్య పోస్ట్‌పై ఆయుష్మాన్ ఖుర్రానా స్పందించగా, తాహిరా మరిది అపరశక్తి ఖురానా, "బిగ్ టైట్ హగ్ బాబీ! అని, మోర్ పవర్టూయూ అని మరొకరు, "నువ్వు దీన్ని కూడా గెలుస్తావు! మీ కోసం ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రార్థిస్తా.. నీకు మరింత శక్తి" అని మరో యూజర్ వ్యాఖ్యానించారు.ఈ వ్యాధి గురించి అవగాహన కలిగి ఉండటం దానిని ఎదుర్కోవడానికి ఉత్తమమైన మార్గాల్లోఒకటి అని తహిరా విశ్వాసం. ఇందులో భాగంగానే గత కొన్నేళ్లుగా తన పోరాటాలు ,చికిత్స ప్రయాణం గురించి సోషల్ మీడియాలో తన అభిమానులతో నిరంతరం మాట్లాడుతూ ఉంటుంది. 2025 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం రోజు కీమో థెరపీ దుష్ప్రభావంతో జుట్టు ఊడిపోయి గుండుగా మారిన పోటోతో మరో స్ఫూర్తిదాయకమైన పోస్ట్‌ను పంచుకుంది.‘టెన్ కమాండ్మెంట్స్ ఆఫ్ బీయింగ్ ఎ ఉమెన్ ’ సహా అనేక బెస్ట్ సెల్లింగ్ పుస్తకాల రచయిత్రి తహిరా కశ్యప్ .2018లో తహిరాకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. చికిత్స అనంతరం కోలుకుంది. కీమోథెరపీ సమయంలో తన అనుభవాలను, బాధలతోపాటు, ఈ ప్రయాణాన్ని సోషల్ మీడియాలో పంచు కుంది. ‘‘శర్మ జీ కి బేటి" తో బాలీవుడ్ దర్శకురాలిగా అరంగేట్రం చేసినటిగా తన ప్రతిభను చాటుకుంటోంది. ప్రకటించింది. ఇంతలోనే బ్రెస్ట్‌కేన్సర్ ఆమె సాహసానికి సవాల్ విసిరింది. యుద్ధంలో గెలవడానికి తాను సిద్ధంగా ఉన్నాననిగతంలో ప్రకటించిన మరీ కేన్సర్‌నుంచి బయటపడిన తహిరా ఇపుడు కూడా అదే నిబ్బరాన్ని ప్రకటించింది. దీంతో ఆమె స్నేహితులు, కుటుంబం స్నేహితులు అందరూ ఆమెకు అండగా నిలిచారు. అదే ధైర్యంతో ఈ వ్యాధినుంచి బైట పడి, విజేతగా నిలవాలని అందరూ కోరుకుంటున్నారు. View this post on Instagram A post shared by tahirakashyapkhurrana (@tahirakashyap)

వ్యాధులకు చెక్‌పెట్టి.. ఆరోగ్యంగా జీవిద్దాం ఇలా..!
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.. ఆరోగ్యం లేకపోతే కోట్లాది రూపాయలు ఉన్నా సుఖం లేనట్టే.. ప్రస్తుత జీవన శైలితో ప్రపంచ ఆరోగ్యం తిరోగమన బాట పడుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా రోగాలు పెరుగుతున్నాయని, ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948లోనే గుర్తించింది. తొలిసారిగా వరల్డ్ హెల్త్ అసెంబ్లీని ఏర్పాటు చేసింది. ఏటా ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించాలని ఈ అసెంబ్లీ 1950లో తీర్మానించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించి, అందరూ ఆరోగ్యంగా జీవించేలా చేయటమే దీని ముఖ్యఉద్దేశం. రోగాలు వచ్చిన తర్వాత వైద్యుల దగ్గరకు పరిగెట్టడం కంటే ముందు జాగ్రత్త చర్యలతో ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎన్సీడీ–3.0 ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై దృష్టిపెట్టింది. బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందించేందుకు గత ఏడాది నవంబరులో ఎన్సీడీ (నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ 3.0) కార్యక్రమం పేరుతో స్క్రీనింగ్ పరీక్షలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్‌తోపాటు, పలు రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ అయితే వైద్యం అందించేందుకు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. 8,75,977 మందికి స్క్రీనింగ్ పరీక్షలు గుంటూరు జిల్లాలో 18 ఏళ్లు దాటిన జనాభా 17,50,399 మంది ఉన్నారు. వీరిలో 8,75,977 మందికి వైద్యసిబ్బంది స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. వీరిలో మధుమేహం అనుమానితులు 23,103 మంది ఉండగా, 4,438 మందికి మధుమేహం ఉన్నట్లు నిర్ధారౖణెంది. ఇప్పటికే షుగర్‌తో 1,17,609 మంది చికిత్స పొందుతున్నారు. బీపీ అనుమానిత బాధితులు 23,294 మంది ఉండగా, 4,635 మందికి బీపీ ఉన్నట్లు నిర్ధారౖణెంది. ఇప్పటికే బీపీతో 1,33,419 మంది చికిత్స పొందుతున్నారు. క్యాన్సర్ అనుమానిత కేసులు 94 ఉండగా, క్యాన్సర్ ఉన్నట్టు ఆరుగురికి నిర్ధారౖణెంది. క్యాన్సర్ రోగులను గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్లో ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. గుండె ప్రధానం శరీరంలోని అన్ని అవయవాల్లో గుండె ప్రధానమైంది. లబ్‌డబ్‌మంటూ ప్రతి నిమిషం కొట్టుకుంటూ ఉంటేనే మనిషి ప్రాణాలతో ఉన్నట్లు లెక్క. గుండెకోసం తప్పని సరిగా రోజూ వ్యాయామం చేయాలి. మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలి. నూనె అధికంగా ఉండే పదార్థాలు , చికెన్, మాంసం లాంటి కొవ్వు అధికంగా ఉండే పదార్థాలను తినకూడదు. ఆకు, కాయగూరలు తీసుకోవాలి. ఉప్పును సాధ్యమైనంత తక్కువగా వినియోగించాలి. బీపీ, షుగర్లను నియంత్రణలో పెట్టుకోవాలి. ధూమపానం, మద్యపానం లాంటి వ్యసనాల జోలికి వెళ్ళకూడదు. ఒత్తిడి లేకుండా ఉండాలి. –డాక్టర్ పోలవరపు అనురాగ్, ఇంట్రవెన్షనల్ కార్డియాలజిస్టు, గుంటూరు.బీపీ, షుగర్లను అదుపులో పెట్టుకోవాలి... శరీరంలో వచ్చే అనేక శారీరక రుగ్మతలకు రక్తపోటు, మధుమేహం ప్రధాన కారణాలవుతున్నాయి, ఇవి అదుపులో లేకపోతే మూత్రపిండాలు, గుండె ఫెయిలవుతాయి. దృష్టిలోపాలు వస్తాయి. పక్షవాతం కూడా వస్తుంది. రోజూ ఉప్పు వాడకం 5 గ్రాముల కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. బీపీ వయస్సుతో సంబంధం లేకుండా, వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. అదుపులో పెట్టేందుకు రోజూ యోగా చేయాలి. పొటాషియం, క్యాల్షియం ఉండే పాలు, పండ్లు లాంటి ఆహారాన్ని తీసుకోవాలి. –డాక్టర్ రేవూరి హరికృష్ణ, ఇన్ఫెక్షన్స్ స్పెషలిస్టు, గుంటూరు.ఆరునెలలకోసారి కిడ్నీ పరీక్షలు అవసరం కాళ్లవాపులు, మూత్రం ఎక్కువసార్లు రావటం, మూత్రంలో మంట రావటం, రక్తం కారటం, ఆకలిలేకపోటం, వాంతులు కావడం వంటి లక్షణాలు కన్పిస్తే కిడ్నీలకు వ్యాధి సోకినట్లు అర్ధం చేసుకోవాలి. కుటుంబంలో ఒకరికి ఉంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ముందస్తుగా పరీక్షలు చేయించుకోవటం మంచిది. నొప్పి మాత్రలు ఎక్కువగా వాడటం, నాటు మందులు వాడటం, బీపీ, షుగర్లు అదుపులో లేకపోవటం వల్ల మూత్రపిండాలు పాడవుతాయి. బీపీ, ఘగర్‌లు ఉన్నవారు ప్రతి 6 నెలలకు ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. – డాక్టర్ చింతా రామక్రిష్ణ, సీనియర్ నెఫ్రాలజిస్ట్, గుంటూరు(చదవండి: రాజ వంశం కాదు..సంపదలో వారసత్వానికి నో ఛాన్స్! బిల్‌గేట్స్ బెస్ట్ పేరెంటింగ్ పాఠం)

పోస్ట్‌పార్టం సమస్యలతో శ్రద్ధా ఆర్య, ట్విన్స్ జిబ్లీ ఫోటోలు సూపర్ క్యూట్
నటి శ్రద్ధా ఆర్య ఇటీవల పండంటి కవలల పిల్లలకు జన్మనిచ్చింది. ముద్దుల మూటగట్టే తన కవలల సంరక్షణలో బిజీగా ఉంది. ఇటీవల, శ్రద్ధా తన పిల్లల పేర్లను గిబ్లి-శైలి చిత్రంతో ప్రకటించింది. మరోవైపు తొలి సారిగా ప్రతి స్త్రీ ఎదుర్కొనే ప్రసవానంతర సమస్యల గురించి (Postpartum Problem) మాట్లాడింది.వివాహం పిల్లలతో ప్రస్తుతం నటనకు దూరంగా ఉన్న శ్రద్ధా ఆర్య (Shraddha Arya) మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. అయితే ప్రసవానంతర సమస్యలు గురించి మాట్లాడింది. సాధారణంగా మాతృత్వం అనేది మహిళలకు వరం మాత్రమే కాదు.. అనేక సమస్యలకు మూలం కూడా. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ప్రసవానంతర సమస్యలతో మహిళలు చాలా ఇబ్బంది పడతారు. శారీరక సమస్యలతోపాటు,మానసిక ఒత్తిడితో మరికొన్ని ఇబ్బందు లొస్తాయి. దీనినే పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ (పీపీడీ)అని వ్యవహరిస్తారు. ఈ ఒత్తిడి కారణంగా, ఆత్మన్యూనతా భావంతో కుంగిపోవడం, తానే హాని చేసుకోవడం, శిశువును కూడా గాయ పరచడం వంటి స్థితికి వెళతారు. శరీరంలో మార్పులు, అధిక బరువు , మానసిక స్థితిలో మార్పులు, నిరాశ, తదితర ప్రసవానంతరం వచ్చే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రసవ సమయంలో బిడ్డను ఈ లోకంమీదికి తెచ్చేందుకు తల్లి పడే బాధ,ఆ వేదన వర్ణనాతీతం. వీటి గురించే ఆమె ఇన్‌స్టాలో ప్రస్తావించింది. ముఖ్యంగా జుట్టు రాలడం గురించి తన అభిప్రాయాలను షేర్ చేసింది. విపరీతంగా జుట్టురాలడంపై ఆవేదన వ్యక్తం చేసింది. కుచ్చులుగా రాలిపోతున్న వెంట్రుకల ఫోటోను పంచుకుంది. View this post on Instagram A post shared by Shraddha Arya (@sarya12)శ్రద్ధా ఆర్య, రాహుల్ నాగల్, జిబ్లి ఆర్ట్ ట్రెండ్టీవీ నటిగా అద్భుతమైన నటనతో పాపులర్ అయింది శ్రద్ధా ఆర్యా. 2004లో టీవీ రియాలిటీ షోలో పాల్గొన్న ఈమె.. 2006లో 'కలవనిన్ కదలై' అనే తమిళ సినిమాద్వారా హీరోయిన్గా బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. తరువాత తెలుగులో గొడవ, రోమియో, కోతిమూక తదితర సినిమాల్లో నటించింది. పాటు పలు సీరియల్స్‌లోనూ యాక్ట్ చేసిన శ్రద్ధా కుండలి భాగ్య సీరియల్‌తో మరింత పాపులర్ అయింది.ఏడాది పాటు డేటింగ్ చేసిన నేవీ ఆఫీసర్ రాహుల్ నగల్ని ,శ్రద్ధా ఆర్యా 2021, నవంబరులో పెళ్లాడింది. ఈ జంటకు 2024 నవంబరు 29న ట్విన్స్( పాప, బాబు) పుట్టారు. కుమారుడికి ‘శౌర్య' అని కుమార్తెకు 'సియా' అంటూ పూర్లు కూడా పెట్టేశారు. తాజాగా జిబ్లి తరహా క్యూట్ ఫోటోలను షేర్ చేయడంతో ఇవి సోషల్ మీడియా ప్రపంచాన్ని విపరీతంగా ఆకర్షించాయి.
ఫొటోలు


వైఎస్ జగన్ రాప్తాడు పర్యటన.. లింగమయ్య కుటుంబానికి పరామర్శ (చిత్రాలు)


తరగని అందం ప్రణీత సొంతం....కలర్ ఫుల్ డ్రెస్ లో ఆకట్టుకుంటున్న ప్రణీత సుభాష్ (ఫోటోలు)


పెళ్లి రోజు స్పెషల్.. భర్తతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న రంభ (ఫొటోలు)


వైభవంగా ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)


మ్యాడ్‌డాక్ ప్రొడక్షన్ 20 ఇయర్స్ సక్సెస్ పార్టీలో మెరిసిన తారలు (ఫొటోలు)


భీమవరం విష్ణు కాలేజీలో ‘జాక్’ మూవీ టీమ్ సందడి (ఫొటోలు)


Allu Arjun: ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్' పుట్టినరోజు.. మధురమైన జ్ఞాపకాలు (ఫోటోలు)


భద్రాచలం : వైభవోపేతంగా రామయ్యకు పట్టాభిషేకం (ఫొటోలు)


రోమ్ వెళ్లారు.. మహేశ్ ని మాత్రం దాచేశారు (ఫొటోలు)


నేచురల్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న నటి కాయాదు లోహర్ గ్లామరస్ (ఫొటోలు)
అంతర్జాతీయం

‘అసమానతలను అర్థం చేసుకోండి’: బిల్‌గేట్స్
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచంలోనే అత్యంత దానగుణం కలిగిన వ్యక్తిగా పేరొందిన బిల్ గేట్స్(Bill Gates) భారతీయ యువతకు అమూల్యమైన సలహా అందించారు. ‘ప్రయాణాలు చేయండి.. మీకు ఉన్నటువంటి అవకాశాలను పొందలేనివారిని చూసి, పరిస్థితులను అర్థం చేసుకోండి’ అని బిల్‌గేట్స్ అన్నారు. ఈ మాటను అనుసరించే యువతీయువకులు వారి దృక్పథాన్ని విస్తృతం చేసుకుంటుంటారని, ప్రపంచంలోని విభిన్న జీవన పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారనే భావనతో బిల్‌గేట్స్ ఈ సూచన చేశారు.భారతదేశంలోని యువతను ఉద్దేశిస్తూ బిల్‌గేట్స్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పినదాని ప్రకారం ప్రయాణం చేయడం ద్వారా యువత వివిధ సంస్కృతులను, ఆర్థిక పరిస్థితులు(Financial conditions), సామాజిక వాస్తవాలను దగ్గరగా చూడగలుగుతుంది. ఇది వారిలో సానుభూతి, అవగాహన, బాధ్యతను పెంపొందిస్తుందని బిల్‌గేట్స్ భావించారు. ప్రత్యేకించి అభివృద్ధి చెందుతున్న దేశమైన భారతదేశంలో యువతకు అవకాశాలు అసమానతలతో కూడి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అందుకే దానిని అర్థం చేసుకుంటే వారు జీవితంలో, సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావడానికి దోహదపడతారని ఆయన అభిప్రాయపడ్డారు.గేట్స్ ఈ సందర్భంగా భారతదేశం(India)లో జరుగుతున్న వేగవంతమైన ఆర్థిక పురోగతి, సాంకేతిక అభివృద్ధిని ప్రశంసించారు. అయితే ఈ పురోగతి సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా అందుబాటులో లేదని, యువత దానిని గుర్తించడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో ప్రయాణాలు సాగించడం ద్వారా యువత తమకంటే తక్కువ అవకాశాలు కలిగిన వారి జీవితాలను చూసి, వారికి సహాయం చేయడానికి లేదా సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రేరణ పొందుతుందని బిల్‌గేట్స్ పేర్కొన్నారు.గేట్స్ తరచూ విద్య, ఆరోగ్యంతో పాటు సమాజంలోని అసమానతలను తగ్గించడంపై దృష్టి సారిస్తుంటారు. భారతదేశంలోని యువత, దేశ భవిష్యత్తుకు కీలకమని, వారు సమాజంలోని సమస్యలను అర్థం చేసుకుని, వాటి పరిష్కారాల కోసం కృషి చేయాలని గేట్స్ సూచించారు. బిల్ గేట్స్ ఇచ్చిన ఈ సలహా భారతీయ యువత విజయం సాధించేందుకు, వారు సమాజంలోని ఇతరుల జీవన స్థితిగతులను అర్థం చేసుకునేందుకు దోహదపడుతుందనడంలో సందేహం లేదు.ఇది కూడా చదవండి: తరచూ బీహార్‌కు రాహుల్.. మహాకూటమి ప్లాన్ ఏమైనా..

Rat Ronin: వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఎలుక.. దేశ ప్రజల ప్రాణాలను కాపాడిన హీరో
ఓ మూషికం సరికొత్త రికార్డ్లను సృష్టించింది. బాంబుల నుంచి ఓ దేశాన్ని కాపాడడంలో పాత రికార్డ్లన్నీ తిరగ రాసింది. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా బాంబులు గుర్తించిన ఎలుకల జాబితాలో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కెక్కింది. కాంబోడియా దేశానికి చెందిన భూముల్లో ఉన్న బాంబులను గుర్తించడమే ఎలుక రోనిన్ పని. తాజాగా రోనిన్ బాంబుల వేటలో ప్రపంచంలోనే తొలిసారి వందకు పైగా ల్యాండ్మైన్లు, ఇతర యుద్ధ అవశేషాలను గుర్తించిన ఎలుకగా కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది.అఫ్రికన్ జెయింట్ పౌచ్డ్ రాట్ రోనిన్ 2021 నుండి ఇప్పటివరకు భూమిలో దాచిన 109 బాంబులు, 15 పేలని బాంబులను గుర్తించినట్లు జంతువులకు శిక్షణ ఇచ్చే ఏపోపో అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది. తద్వారా రోనిన్ ఇప్పుడు ఎలుకలలో అత్యధిక మైన్లు గుర్తించిన రికార్డును సొంతం చేసుకుందని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా, కాంబోడియా ప్రజల ప్రాణాల్ని కాపాడడంలో రొనిన్ బాధ్యతలు అత్యద్భుతమని కొనియాడింది. ఎలుక రోనిన్ గురించి పలు ఆసక్తిర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐదేళ్ల వయస్సున్న రోనిన్ మంచి పనిమంతుడు. అందరితో స్నేహంగా ఉండటమే కాదు..శాంతంగా ఉంటాడట. రోనిన్ విజయానికి కారణం ఏకాగ్రత, ఒత్తిడిలో ఎలాంటి ఆందోళన చెందకుండా ఎదురవుతున్న సమస్యల్ని పరిష్కరించడంలో సిద్ధహస్తుడు. అంతేకాదు, రోనిన్ తెలివితేటలు, సహజమైన ఆసక్తి నిత్యం చురుగ్గా ఉంచేందుకు దోహదం చేస్తున్నాయి. అందుకే కాబోలు భూమిలో బాంబులు గుర్తించడం రోనిన్కు ఒక ఆటలా ఉంటుంది’ అని ఏపోపో ప్రతినిధి లిల్లీ షాలోమ్ అన్నారు.రోనిన్ సంరక్షణ చూసుకునే ఫానీ మాట్లాడుతూ.. ‘రోనిన్ విజయాలు ఎలుకల అసాధారణ సామర్థ్యానికి నిదర్శనం. రోనిన్‌ను కేవలం బాంబుల్ని నిర్విర్యం చేసే ఎలుక అని అనుకోం. మేం అతన్నిఫ్రెండ్గా, సహచరుడిగా భావిస్తాం’ అని అన్నారు.ఏపోపో సంస్థ దాదాపు ముప్పై సంవత్సరాలుగా భూమిలోని బాంబులను గుర్తించేందుకు ఎలుకలకు శిక్షణ ఇస్తోంది. రోనిన్,అతని సహచరులు ప్రతి రోజూ మైన్లు ఉండే ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తారు. మైన్లు ఉన్నాయన్న అనుమానం ఉన్న ప్రదేశాల్లో వాటిని విడిచిపెడతారు. ఎలుక తమ అసాధారణమైన ప్రతిభతో మైన్లు ఉన్న ప్రదేశంపై ఉన్న మట్టిని కొరుకుతాయి. అలా ఓ నిర్ధిష్ట వయస్సు వచ్చిన తర్వాత విధుల నుంచి పదవీ విరమణ చేస్తాయి.కాంబోడియాలో ఇరవై ఏళ్లపాటు అంతర్యుద్ధాలు జరిగాయి. చివరికి యుద్ధాలు 1998లో ముగిశాయి. అయినప్పటికీ ఇంకా ప్రపంచంలో అత్యధికంగా ల్యాండ్ మైన్లు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒకటిగా ఉంది. ఇప్పటికీ 40 లక్షల నుంచి 60 లక్షల మధ్యలో కాంబోడియా భూముల్లో ల్యాండ్ మైన్లతో పాటు ఇంకా పేలని పేలుడు పదార్ధాలు ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అలాగే ఈ దేశంలో సగటున 40వేల మందికి పైగా ఈ ల్యాండ్ మైన్ల వల్ల కాళ్లను పోగొట్టుకున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. రోనిన్కు ముందు మగావా అనే ఎలుకనే అత్యధిక బాంబులు గుర్తించాడు. మగావా 2021లో పదవీ విరమణ చేసినప్పటికీ, అయిదేళ్ల కాలంలో 71 మైన్లు, 38 పేలని బాంబులను గుర్తించాడు. అతడికి సేవల గుర్తింపుగా పీడీఎస్ఏ అనే జంతు సంక్షేమ సంస్థ నుండి సాహస వీరుడి పతాకాన్ని అందుకున్నాడు. 2022 జనవరిలో వృద్ధాప్యంతో మగవా మరణించాడు.

Saudi Arabia: 14 దేశాలకు వీసాల జారీ నిలిపివేత.. జాబితాలో భారత్
రియాద్: హజ్ యాత్ర సమీపిస్తున్న తరుణంలో సౌదీ అరేబియా ప్రభుత్వం(Kingdom of Saudi Arabia) (KSA) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జరగబోయే హజ్ యాత్రకు ముందుగానే 14 దేశాల పౌరులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిషేధం ఉమ్రా, బిజినెస్, కుటుంబ సందర్శన తదితర వీసాలపై జూన్ మధ్యకాలం వరకు అంటే హజ్ సమయం ముగిసే వరకు అమలులో ఉండనుంది. హజ్ యాత్ర(Hajj pilgrimage) సమయంలో రద్దీని నియంత్రించేందుకు, సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ చేసేందుకు వచ్చేవారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకున్నదని సౌదీ అధికారులు తెలిపారు. గత ఏడాది హజ్ సమయంలో తీవ్రమైన వేడి వాతావరణం, రిజిస్ట్రర్డ్ కాని యాత్రికుల కారణంగా తొక్కిసలాట ఘటన చోటుచేసుకుంది. ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండేందుకే సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే వీసా నిబంధనలను మెరుగుపరచాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.సౌదీ అరేబియా సవరించిన నిబంధనల ప్రకారం ఈ ఏడాది ఉమ్రా వీసా(Umrah Visa) కోసం కేటాయించిన గడువు 2025, ఏప్రిల్ 13తో ముగియనుంది. అలాగే హజ్ ముగిసే వరకు కొత్త ఉమ్రా వీసాలు జారీ చేయరు. ఈ నిషేధం కారణంగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌తో సహా పలు దేశాల నుంచి సౌదీ వెళ్దాలనుకునేవారికి నిరాశ ఎదురయ్యింది.వీసాలు నిషేధించిన దేశాలివే..1. భారత్2. బంగ్లాదేశ్3. పాకిస్తాన్4. అల్జీరియా5. ఈజిప్ట్6. ఇథియోపియా7. ఇండోనేషియా8. ఇరాక్9. జోర్డాన్10. మొరాకో11. నైజీరియా12. సుడాన్13. ట్యూనిషియా14. యెమెన్నిషేధం వెనుక కారణాలివే..సౌదీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హజ్ సమయంలో భద్రత కల్పించేందుకు, రద్దీని నియంత్రించేందుకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 2024లో హజ్‌యాత్రలో పాల్గొన్న 1,200 మందికి పైగా యాత్రికులు వివిధ కారణాలతో మృతిచెందారు. రిజస్టర్డ్కాని యాత్రికుల కారణంగా హజ్లో తీవ్రమైన రద్దీ ఏర్పడిందని సౌదీ అరేబియా అధికారులు భావిస్తున్నారు. దీనిని నివారించేందుకే వివిధ రకాల వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, హజ్ యాత్ర కోసం ప్రత్యేకంగా నమోదైన యాత్రికులకు ఈ నిషేధం వర్తించదు. దౌత్య వీసాలు, నివాస అనుమతులు, హజ్-నిర్దిష్ట వీసాలు యథావిధిగా కొనసాగుతాయి.ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాలపై బీజేపీ గురి.. రంగంలోకి అమిత్ షా

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు.. ట్రంప్ రియాక్షన్ ఇదే..
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. దాడులు చేయకుండా తాము రష్యాను ఆపాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. యుద్ధం కారణంగా ప్రతీ వారం వేలాది మంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించారు. ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..‘ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తోంది. మేము రష్యాతో మాట్లాడుతున్నాం. దాడులను ఆపాలని మేము కోరుకుంటున్నాం. నిరంతరం రష్యా బాంబు దాడులు చేయడం సరికాదు. దాడుల కారణంగా ప్రతీ వారం వేలాది పౌరులు చనిపోతున్నారు. ఇలా జరగడం నాకు ఇష్టం లేదు. కాల్పులు విరమణపై చర్చలు జరుగుతున్నాయి. రష్యాను ఒప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాము’ అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. ఇటీవల పుతిన్‌తో ట్రంప్ ఫోన్లో మాట్లాడిన అనంతరం.. కాల్పుల విరమణ ఒప్పందానికి మాస్కో కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే, రష్యాపై పశ్చిమదేశాల ఆంక్షలు ఎత్తివేస్తేనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలుచేస్తామని పుతిన్ షరతు పెట్టినట్లు తెలుస్తోంది. అంతేగాక.. జపోరిజియా అణు విద్యుత్ ప్లాంట్‌ను ఉక్రెయిన్‌కు తిరిగిచ్చేందుకు కూడా రష్యా నిరాకరిస్తున్నట్లు సమాచారం. కీవ్‌తో కాల్పుల విరమణ అంశాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ కావాలనే సాగదీస్తున్నారని ట్రంప్ చెప్పుకొచ్చారు. వాషింగ్టన్ మధ్యవర్తిత్వాన్ని మాస్కో తారుమారు చేస్తోందని ఆరోపించారు.#WATCH | On the ongoing Russia-Ukraine war, and if any peace deal is expected, US President Donald Trump says, "We are talking to Russia, we would like them to stop. I don't like them bombing on and on, and every week thousands of young people being killed."(Source - US Network… pic.twitter.com/L15l0oECdw— ANI (@ANI) April 7, 2025ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సొంత నగరం క్రైవీరిపై శుక్రవారం రష్యా క్షిపణి దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో తొమ్మిది మంది చిన్నారులు సహా మొత్తం 18 మంది మరణించారు. ఈ ఘటనపై ఉక్రెయిన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం స్పందించిన తీరుపై జెలెన్స్కీ అసహనం వ్యక్తం చేశారు. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ భావోద్వేగ పోస్టు పెట్టారు. జెలెన్స్కీ మాట్లాడుతూ..‘క్రైవీరిపై జరిగిన దాడి విషయంలో అమెరికన్ ఎంబసీ స్పందన పేలవంగా ఉంది. అంత పెద్ద దేశం ఇలాంటి బలహీన ప్రకటన చేయడం ఆశ్చర్యంగా ఉంది. చిన్నారులను చంపిన క్షిపణి గురించి మాట్లాడేటప్పుడు వారు ‘రష్యన్’ అనే పదాన్ని చెప్పడానికి కూడా భయపడుతున్నారు. యుద్ధం ముగియాలి. అయితే ఈ ఉద్రిక్తతలను ముగించాలనే ఉద్దేశం రష్యాకు లేదు. కాల్పుల విరమణను కాకుండా చిన్నారుల ప్రాణాలు తీయడాన్ని మాస్కో ఎంచుకుంటోంది. అందుకే ఆ దేశంపై పూర్తిస్థాయి ఒత్తిడి తీసుకురావాలి’ అని కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో రష్యా దాడిపై జపాన్, స్విట్జర్లాండ్ దేశాల రాయబార కార్యాలయాలు స్పందించిన తీరును జెలెన్స్కీ ప్రశంసించారు.
జాతీయం

సరిహద్దుల్లో ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థ
జమ్మూ: దేశ సరిహద్దుల పరిరక్షణకు ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్ సిస్టమ్‌ను మోహరిస్తున్నట్లు హోం మంత్రి అమిత్ షా తెలిపారు. జమ్మూకశ్మీర్‌లోకి ఉగ్రవా దుల అక్రమచొరబాట్లను తిప్పికొట్టేందుకు, సరిహ ద్దుల్లో అండర్‌గ్రౌండ్ టన్నెళ్లను గుర్తించేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నామన్నారు. సరిహ ద్దుల కు ఆవలి వైపు ఎలాంటి అనుమా నాస్పద కదలి కలున్నా ఈ నిఘా వ్యవస్థ కనిపెట్టి తక్షణమే స్పందిస్తుందన్నారు. జమ్మూకశ్మీర్‌లో మూడు రోజుల పర్యటనకు సోమవారం ఇక్కడికి ఆయన చేరుకు న్నారు. ఈ సందర్భంగా కథువా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉన్న ‘వినయ్’ బోర్డర్ పో స్టును సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడున్న బీఎస్ఎఫ్ జవాన్లతో మాట్లాడారు. అత్యంత సవాళ్లతో కూడిన పరిస్థితుల మధ్య విధులను సమర్థమంతంగా నిర్వహిస్తున్న జవా న్లను ఆయన ప్రశంసించారు. వానలు, భీకరమైన చలి, ఎండలను సైతం లెక్కచేయకుండా 365 రోజు లూ బోర్డర్ పోస్టుల్లో విధులు కొనసాగిస్తూ శత్రువుల కదలికలపై ఓ కన్నేసి ఉంచుతున్నారంటూ ప్రశంసించారు. ఇక్కడికి వచ్చి చూసిన వారికే జవాన్ల కష్టం ఏమిటో తెలుస్తుందంటూ వ్యాఖ్యానించారు. అమరుల సంతానానికి ఉద్యోగాలుఅనంతరం మంత్రి అమిత్ షా రాజ్‌భవన్‌లో ఉగ్రవాదులతో పోరాటంలో నేలకొరిగిన 10 మంది పోలీసులు, ఒక ఇంజనీర్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కారుణ్య ప్రాతిపదికన మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఇటీవల కథువా జిల్లాలో పాక్ ఉగ్రవాదులతో జరిగిన పోరులో నేలకొరిగిన నలుగురు పోలీసు కుటుంబాల వారు కూడా వీరిలో ఉన్నారు. వీరమరణం పొందిన జశ్వంత్ సింగ్ కుమారుడు 12 ఏళ్ల యువరాజ్ సింగ్ కూడా కారుణ్య నియామక పత్రం అందుకున్నాడు. మేజర్ అయ్యాక ఇతడి నియామ కానికి అనుకూలమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి కోరారు.

వినియోగదారుల ఫోరం అరెస్ట్ వారెంట్ ఇవ్వజాలదు
కోల్‌కతా: వినియోగదారుల ఫోరంలకు అరెస్ట్ వారెంట్ జారీ చేసే అధికారం లేదని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. సాధారణ జైలులో నిర్బంధించాలంటూ ఉత్తర్వులు ఇచ్చేందుకు మాత్రమే అధికారముంటుందని పేర్కొంది. జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక ఇచ్చిన అరెస్ట్ వారెంట్‌ను సవాల్ చేస్తూ ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై ఈ మేరకు తీర్పు వెలువరించింది. తన ఆదేశాల అమలు కోసం సీపీసీ (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్)కింద వారెంట్ ఇచ్చేందుకు అధికారం లేదని పేర్కొంది. ఇటువంటి ఆదేశాలు వినియోగదారుల రక్షణ చట్టంలో నిర్దేశించిన నిబంధనల పరిధిని అతిక్రమించడమే అవుతుందని తెలిపింది. ఓ వ్యక్తి ట్రాక్టర్ కొనుగోలు కోసం 2013లో ఓ ఫైనాన్స్ కంపెనీ నుంచి రుణం తీసుకున్నాడు. అతడు రూ.25,716 బకాయి చెల్లించలేదంటూ ఫైనాన్స్ కంపెనీ ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుంది. దీంతో, బకాయిని పూర్తిగా చెల్లించిన ఆ వ్యక్తి ట్రాక్టర్‌ను, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను తనకు తిరిగి ఇప్పించాలంటూ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ఫోరం ఆదేశాలను ఫైనాన్స్ కంపెనీ యజమాని పట్టించుకోలేదు. దీంతో, ఫోరం అతడి అరెస్ట్‌కు వారెంట్ జారీ చేసింది. ఫోరం అధికారాలను సవాల్ చేస్తూ అతడు వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు పైవ్యాఖ్యలు చేసింది. ఫోరం వారెంట్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.

ఒమర్, రిజిజు భేటీపై రాజకీయ వివాదం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్లో కలుసుకోవడం రాజకీయ దుమారం రేపుతోంది. వక్ఫ్ చట్టం విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) సానుకూల వైఖరి అవలంబించిన నేపథ్యంలోనే వీరిద్దరు కలుసుకున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే, తన తండ్రి, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా కోరిక మేరకు తులిప్ గార్డెన్‌కు వెళ్లిన ఒమర్‌కు అనూహ్యంగా అదే రోజు ఉదయం గార్డెన్‌కు వచ్చిన మంత్రి రిజిజు కలిశారని అధికార నేషనల్ కాన్ఫరెన్స్ అంటోంది. యోగక్షేమాలు తెలుసుకున్న అనంతరం ఎవరికి వారు వెళ్లిపోయారని చెబుతోంది. ఇదంతా కేవలం అనుకోకుండా జరిగిన పరిణామమని, దీన్ని అనవసరంగా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించింది. అయితే, రిజిజు ‘ఎక్స్’లో అబ్దుల్లాలతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేయడం వివాదాన్ని రేపింది. వక్ఫ్ సవరణ చట్టంపై బీజేపీకి ఎన్సీకి లొంగిపోయిందని ప్రతిపక్ష పీడీపీ ఆరోపించింది. పార్లమెంట్లో వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి రిజిజుకు తులిప్ గార్డెన్లో ఎన్సీ ఎర్ర తివాచీ పరిచిందని మరో నేత అన్నారు. సీఎం ఒమర్ తులిప్ గార్డెన్లో తారసపడిన కేంద్ర మంత్రి రిజిజుకు కనీసం దూరంగా ఉండటం ద్వారా నిరసన తెలిపి ఉండాల్సిందని పీపుల్స్ కాన్ఫరెన్స్ చీఫ్ సజాద్ లోనె పేర్కొన్నారు.

తుదిశ్వాస వరకు పోరాడతాం
కోల్‌కతా: సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఉద్యోగాలు కోల్పోయిన వారిలో అర్హులైన అభ్యర్థులకు బాసటగా నిలుస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. తుదిశ్వాస వరకు పోరాటం సాగిస్తానని, జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లు, సిబ్బందితో సోమవారం నేతాజీ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటైన సమావేశంలో సీఎం మమత ఉద్వేగంతో మాట్లాడారు. తొలగింపు ఆదేశాలు ఇప్పటి వరకు అందనందున, ఎప్పటిమాదిరిగానే స్కూళ్లకు వెళ్లి తమ విధులను స్వచ్చందంగా కొనసాగించాలని వారిని కోరారు. 2016లో నియమించిన 25,753 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది ఎంపికలో తీవ్ర అవకతవకలు జరిగాయని గుర్తించిన కలకత్తా హైకోర్టు వారందరినీ తొలగించాలంటూ 2024లో తీర్పు వెలువరించడం..దానిని తాజాగా సుప్రీంకోర్టు సమర్థించడం తెల్సిందే. సుప్రీంకోర్టు ఆదేశాలను పూర్తిగా పరిశీలించాక అర్హులైన అభ్యర్థుల ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైతే రివ్యూ పిటిషన్ వేస్తామన్నారు. ఒక వేళ తీర్పు మనకు అనుకూలమని తేలితే రెండు నెలల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడతామని ప్రకటించారు. అర్హులెవరూ ఉద్యోగాలు కోల్పోరాదని ఆమె పేర్కొన్నారు. ఉన్న ఫళంగా ఉద్యోగులను తొలగిస్తే బడులు సాగేదెలా? ఉద్యోగాలు కల్పించలేని వారికి వారిని తొలగించే అధికారం కూడా ఉండరాదని వ్యాఖ్యానించారు. అయితే, అత్యున్నత న్యాయస్థానం తీర్పును తాము గౌరవిస్తామంటూ ఆమె.. తప్పులను సవరించే సమయాన్ని కూడా ప్రభుత్వానికి ఇవ్వలేదని పేర్కొన్నారు. సీనియర్ లాయర్లు అభిషేక్ సింఘ్వి, కపిల్ సిబాల్, రాకేశ్ ద్వివేది, కల్యాణ్ బెనర్జీ, ప్రశాంత్ భూషణ్‌లతో కూడిన బృందం ఉద్యోగాలు కోల్పోయిన వారి తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తారని ప్రకటించారు.
ఎన్ఆర్ఐ

సింగపూర్‌లో విశ్వావసు నామ ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్ లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో మార్చి 30న ఘనంగా జరిగాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో బాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. గంటల పంచాంగాన్ని ప్రముఖ పంచాంగ కర్తలు పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ (శ్ర శ్రీశైల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి)సిద్ధం చేయడం జరిగింది. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి తదితర ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గాప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి , ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము,కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలను భక్తులు కొనియాడారు.ఉగాది వేడుకల నిర్వహణ, దాతలకు, స్పాన్సర్లతోపాటు, సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి TCSS ధన్యవాదాలు తెలిపింది. ఈ వేడుకలలో పాల్గొన్న వై.ఎస్.వి.ఎస్.ఆర్.కృష్ణ (పాస్స్పోర్ట్ అటాచ్, ఇండియన్ హై కమిషన్, సింగపూర్) గారికి అధ్యక్షులు గడప రమేష్ బాబు, కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే మై హోమ్ బిల్డర్స్, సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, గారాంటో అకాడమీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, సౌజన్య డెకార్స్‌కు సొసైటీ కృతజ్ఞతలు తెలిపింది.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

అట్టహాసంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ మహాసభలు
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మొదటి జాతీయ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియ (Philadelphia) ఎక్స్ పో సెంటర్లో మార్చి 28న మొదటి రోజు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులతో మొదటిరోజు వేడుక ఎన్నారైలను ఆకట్టుకుంది. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు ఘనమైన స్వాగతసత్కారాన్ని నిర్వాహకులు అందించారు.కన్వెన్షన్ కన్వీనర్ సత్య విజ్జు, రవి చిక్కాల స్వాగతోపన్యాసం చేశారు. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (andhra pradesh american association) ఫౌండర్ హరి మోటుపల్లి AAA ముఖ్య నాయకులను వేదిక మీదకు ఆహ్వానించి, అభినందించారు. అనంతరం ఫౌండర్ హరి మోటుపల్లి AAA ఏర్పాటు, తదితర విషయాలపై క్లుప్తంగా వివరించారు. AAA అధ్యక్షులు బాలాజీ వీర్నాల సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఊహించిన దానికన్నా కన్వెన్షన్ విజయవంతం కావడం పట్ల ప్రెసిడెంట్ ఎలక్ట్ హరిబాబు తూబాటి హర్షం వ్యక్తం చేశారు. సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. దాతలు, వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు.కన్వెన్షన్‌ను పురస్కరించుకుని AAA నిర్వహించిన పోటీల్లో విజేతలకు హీరో, హీరోయిన్లు బహమతులు ప్రదానం చేశారు. హీరోలు సందీప్ కిషన్, ఆది, సుశాంత్, తరుణ్, విరాజ్.. హీరోయిన్స్ దక్ష, రుహాని శర్మ, అంకిత, కుషిత, ఆనంది ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ దర్శకులు సందీప్ వంగా, శ్రీనువైట్ల, వీరభద్రం, వెంకీ అట్లూరి మొదటిరోజు వేడుకల్లో మెరిశారు. డైరక్టర్ సందీప్ వంగాను స్టేజిమీదకు పిలిచినప్పుడు హాలంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ రుహాని శర్మ, సినీ దర్శకులు వెంకీ అట్లూరి మ్యూజిక్ అవార్డ్స్ విజేతలను ప్రకటించారు. తరుణ్ నటించిన సినిమాల పాటలతో చేసిన ట్రిబ్యూట్ డాన్స్ ఆకట్టుకుంది. తానా, నాట్స్ వంటి ఇతర సంస్థల నాయకులను కూడా వేదికపైకి ఆహ్వానించి సన్మానించారు. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన నిరవల్ బ్యాండ్ మ్యూజికల్ నైట్ అందరినీ అలరించింది. మహిళలు, పిల్లలు నిరవల్ బ్యాండ్ సింగర్స్ పాటలకు డాన్సులు చేసి ఆనందించారు. ఆంధ్ర వంటకాలతో వడ్డించిన బాంక్వెట్ డిన్నర్ అందరికీ ఎంతో నచ్చింది. బాంక్వెట్ డిన్నర్ నైట్‌కి సుప్రీమ్, ఎలైట్, ప్రీమియం అంటూ 3 రకాల సీటింగ్ ఏర్పాట్లు చేసి అందరి ప్రశంసలను నిర్వాహకులు అందుకున్నారు. సెలెబ్రిటీలు, స్టార్స్ అందరికీ అందుబాటులో ఉండేలా ఈ సీటింగ్ ఏర్పాట్లు చేయడం బాగుంది. ఆటపాటలతో ఆనందోత్సాహాలతో మొదటి రోజు కార్యక్రమం ముగిసింది.చదవండి: గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గల్ఫ్ కార్మికుల సాంఘిక భద్రత, సంక్షేమం, గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు గురించి ప్రవాసీ మిత్ర ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన 'రేవంత్ సర్కార్ - గల్ఫ్ భరోసా' అనే మినీ డాక్యుమెంటరీని శనివారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విడుదల చేశారు. చిత్ర బృందం ఇటీవల ఉత్తర తెలంగాణలోని పలు గ్రామాలలో పర్యటించి గల్ఫ్ మృతుల కుటుంబాలను, కొందరు ప్రవాసీ కార్మికులు, నాయకుల అభిప్రాయాలను చిత్రీకరించారు. రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఆర్థిక సహాయం పొందిన గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యుల అభిప్రాయాలను ఈ డాక్యుమెంటరీలో పొందుపర్చారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంటరీ నిర్మాత, గల్ఫ్ వలస వ్యవహారాల నిపుణుడు మంద భీంరెడ్డి, డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన ప్రముఖ చలనచిత్ర దర్శకులు పి. సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాణ సహకారం అందించిన రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి, గల్ఫ్ జెఏసి నాయకులు చెన్నమనేని శ్రీనివాస రావు, కెమెరామెన్ పి.ఎల్.కె. రెడ్డి, ఎడిటర్ వి. కళ్యాణ్ కుమార్, సౌదీ ఎన్నారై మహ్మద్ జబ్బార్‌లు పాల్గొన్నారు. చదవండి: విదేశీ విద్యార్థులపై అమెరికా మరో బాంబు

అయోవా నాట్స్ ఆరోగ్య అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా అయోవాలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖ వైద్యులు డాక్టర్ స్మిత కుర్రా, డాక్టర్ ప్రసూన మాధవరం, డాక్టర్ నిధి మదన్, డాక్టర్ విజయ్ గోగినేని వివిధ ఆరోగ్య అంశాలపై తెలుగువారికి అవగాహన కల్పించారు. భారత ఉపఖండంలో మధుమేహం వ్యాధి, ఆ వ్యాధి ప్రాబల్యంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.. మధుమేహం నివారించడానికి లేదా తొందరగా రాకుండా ఉండటానికి కొన్ని విలువైన చిట్కాలను తెలుగు వారికి వివరించారు. హృదయ సంబంధ వ్యాధులపై కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ నిధి మదన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గుండె జబ్బు అంశాలపై ప్రేక్షకుల నుండి వచ్చిన అనేక ప్రశ్నలకు విలువైన సమాధానమిచ్చారు. గుండె సమస్యలను నివారించడానికి ఉత్తమ జీవనశైలిని సూచించారు.అయోవా చాప్టర్ బృందంలో భాగమైన పల్మనాలజిస్ట్ డాక్టర్ విజయ్ గోగినేని నిద్ర, పరిశుభ్రత, స్లీప్ అప్నియాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నాణ్యమైన నిద్ర, స్లీప్ అప్నియా లక్షణాలను గుర్తించడం వల్ల కలిగే ప్రాముఖ్యత, వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను డాక్టర్లు చక్కగా వివరించారు. డాక్టర్ స్మిత కుర్రా నేతృత్వంలో ఏర్పాటైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో చొరవ తీసుకున్నారు, ఇతర వైద్యులతో సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమానికి అనుసంధాన కర్తగా వ్యవహరించారు.నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్(ఎలక్ట్) శ్రీహరి మందాడి, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి జమ్ముల ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించినందుకు అయోవా చాప్టర్ కో ఆర్డినేటర్ శివ రామకృష్ణారావు గోపాళం, నాట్స్ అయోవా టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమానికి ఆహారాన్ని స్పాన్సర్ చేసినందుకు అయోవాలోని సీడర్ రాపిడ్స్‌లో ఉన్న పారడైజ్ ఇండియన్ రెస్టారెంట్ యజమాని కృష్ణ మంగమూరి కి నాట్స్ అయోవా చాప్టర్ సభ్యుడు శ్రీనివాస్ వనవాసం కృతజ్ఞతలు తెలిపారు. నాట్స్ హెల్ప్‌లైన్ అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడుతుందని.. అత్యవసర పరిస్థితుల్లో నాట్స్ హెల్ప్ లైన్ సేవలు వినియోగించుకోవాలని నాట్స్ అయోవా చాప్టర్ సభ్యులలో ఒకరైన హొన్ను దొడ్డమనే తెలిపారు.జూలై4,5,6 తేదీల్లో అంగరంగవైభవంగా టంపాలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు రావాలని నాట్స్ అయోవా సభ్యులు నవీన్ ఇంటూరి తెలుగువారందరిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో,నాట్స్ అయోవా చాప్టర్ సలహాదారు జ్యోతి ఆకురాతి, ఈ సదస్సుకు వచ్చిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!
క్రైమ్

యానాం ఎమ్మెల్యే ఫొటోను పెళ్లి ప్రొఫైల్‌లో పెట్టి..
బంజారాహిల్స్ (హైదరాబాద్): వివాహ వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా పెళ్లిళ్ల పేరుతో యువతులను మోసగించిన ఘరానా మోసగాడు జోగడ వంశీకృష్ణ అలియాస్ చెరుకూరి హర్ష (33)ని కస్టడీకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు, తమ విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలను రాబట్టారు. తన కాలేజ్‌మేట్ అయిన యానాం ఎమ్మెల్యే ఫొటోలను పెళ్లి ప్రొఫైల్‌లో తన ఫొటోగా పెట్టి నాలుగు రాష్ట్రాల్లో.. పెళ్లిళ్ల పేరుతో 26 మంది యువతులను అతను మోసం చేసినట్లుగా గుర్తించారు. గత నెలలో నగరానికి చెందిన ఒక వైద్యురాలిని షాదీ డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా ఎన్ఆర్ఐగా పరిచయం చేసుకుని దాదాపు రూ.10 లక్షలకుపైగా మోసానికి పాల్పడ్డాడు. తన తల్లి అమెరికా నుంచి రాగానే వివాహం చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. మోసాన్ని గ్రహించిన వైద్యురాలు గత నెలలో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు హర్షని అరెస్టు చేశారు. నిందితుడిపై హైదరాబాద్, రాచకొండ, విజయవాడ, ఖమ్మం పట్టణాలతో పాటు పలు రాష్ట్రాల్లో 20కి పైగా కేసులు ఉన్నట్లు గుర్తించారు. హర్షను ఐదు రోజుల కస్టడీకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం అతన్ని తిరిగి కోర్టులో హాజరుపర్చి జైలుకు తరలించారు. విచారణలో భాగంగా హర్షపై మరో ఐదు కేసులు నమోదై ఉన్నట్లు తెలిసింది. పోలీసులకు పట్టుబడకుండా స్నేహితుల పేరు మీద మూడు సిమ్‌కార్డులు తీసుకుని పలు మోసాలకు పాల్పడినట్లు విచారణలో గుర్తించారు. ఎన్ఆర్ఐగా నటించి పెళ్లిళ్ల పేరుతో మోసం చేసి సంపాదించిన డబ్బులతో వంశీకృష్ణ బెట్టింగ్‌లకు పాల్పడటమే కాకుండా విదేశీ టూర్లు కూడా చేసినట్లు పోలీసులు తెలిపారు.

మియాపూర్‌లో షెల్టర్!
సాక్షి, సిటీబ్యూరో: కర్నాటకలోని బీదర్, నగరంలోని అఫ్జల్‌గంజ్‌లో తుపాకులతో విరుచుకుపడిన ఇద్దరు దుండగులు అమన్ కుమార్, అలోక్ కుమార్ ఈ నేరాలు చేయడానికి ముందు మియాపూర్‌లో బస చేసినట్లు వెలుగులోకి వచి్చంది. అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన హైదరాబాద్ పోలీసులు ఈ విషయం గుర్తించారు. దీనికి సంబంధించిన రికార్డులను సైతం స్వాధీనం చేసుకున్నారు. నగరంలో నేరం చేసిన తర్వాత దేశ సరిహద్దులు దాటి నేపాల్ పారిపోయినట్లు ఈ ద్వయం ప్రస్తుతం నేపాల్‌లో ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. జనవరి 12న నగరానికి రాక... బీహార్‌లోని వైశాలీ జిల్లా ఫతేపూర్ పుల్వారియాకు చెందిన అమన్ కుమార్, అలోక్ కుమార్ ఏటీఎం మిషన్లలో నగదు నింపే వాహనాలనే టార్గెట్‌గా చేసుకున్నారు. ఈ గ్యాంగ్ 2023 సెపె్టంబర్ 12న ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో సెక్యూరిటీ గార్డు జై సింగ్‌ను హత్య చేసి రూ.40 లక్షలు దోచుకుపోయింది. నేపాల్ పారిపోయిన ఈ గ్యాంగ్ యూపీ పోలీసుల హడావుడి తగ్గిన తర్వాత బీహార్ చేరుకుంది. అక్కడ నుంచి తమ స్వస్థలానికి వెళ్లి... ఈ ఏడాది జనవరిలో నగరానికి వచ్చింది. బీదర్‌ను టార్గెట్‌గా చేసుకున్న అమన్, అలోక్ ఆ నెల 12న మియాపూర్‌లోని శ్రీ సాయి గ్రాండ్ ఇన్ హోటల్లో బస చేసింది. అక్కడ నుంచి బీదర్‌కు రాకపోకలు సాగించడం తేలికనే ఉద్దేశంతోనే అక్కడ షెల్టర్ ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు. అమిత్ కుమార్, మహేష్ కుమార్ పేర్లతో నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసిన దుండగులు వాటి ఆధారంగానే రూమ్ తీసుకున్నారు. మూడు రోజుల పాటు రెక్కీ... బీదర్‌లో ఎస్బీఐ ఏటీఎం మిషన్లలో నగదు నింపే సీఎంఎస్ సంస్థ వ్యాన్‌ను దోచుకోవడానికి ముందు మూడు రోజుల పాటు పక్కాగా రెక్కీ చేసింది. తమ వెంట తెచ్చుకున్న ద్విచక్ర వాహనంపై జనవరి 13, 14, 15 తేదీల్లో అక్కడకు వెళ్లి వస్తూ ఈ పని పూర్తి చేసింది. చివరకు ఆ నెల 16న నేరం చేయడానికి బీదర్ వెళ్లిన ఈ ద్వయం సీఎంఎస్ సంస్థ ఉద్యోగుల్లో గిరి వెంకటే‹Ùను చంపి, శివకుమార్‌ను గాయపరిచి రూ.83 లక్షలు దోచుకుంది. అక్కడ నుంచి డబ్బు నింపిన బ్యాగ్‌లు తీసుకుని నేరుగా తాము బస చేసిన హోటల్‌కే వచ్చారు. రూమ్ ఖాళీ చేయడంతో పాటు తమ వస్తువుల్నీ తీసుకుని ద్విచక్ర వాహనంపై బయలుదేరి మియాపూర్ నుంచి ఎంజీబీఎస్‌కు వచ్చారు. నేరం చేయడానికి వాడిన ద్విచక్ర వాహనాన్ని ఎంజీబీఎస్ పార్కింగ్‌లో ఉంచారు. అఫ్జల్‌గంజ్‌లోని రోషన్ ట్రావెల్స్ నుంచి ప్రైవేట్ బస్సులో రాయ్‌పూర్ వెళ్లేందుకు అమిత్‌కుమార్ పేరుతో టిక్కెట్ బుక్ చేసుకున్నారు. నేపాల్‌లో ఉండటంతో పటిష్ట నిఘా... ఈ ట్రావెల్స్ వద్ద జరిగిన పరిణామాలతో మేనేజర్ జహంగీర్‌ను కాలి్చన ఇద్దరూ అక్కడ నుంచి పారిపోయారు. అఫ్జల్‌గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లిన వీళ్లు... అక్కడ నుంచి గజ్వేల్ వెళ్లడానికి మరో ఆటో మాట్లాడుకున్నారు. అనివార్య కారణాలతో తిరుమలగిరిలో దిగేసి... ఇంకో ఆటోలో మియాపూర్ వెళ్లారు. ఆపై తిరుపతి వెళ్లే ఏపీఎస్‌ఆరీ్టసీ ఎక్కి కడపలో దిగిపోయారు. మరో బస్సులో నెల్లూరు, అట్నుంచి చెన్నై వెళ్లారు. చెన్నై నుంచి రైలులో కోల్‌కతా చేరుకున్న ఈ ద్వయం పశి్చమ బెంగాల్‌లోని సిలిగురి ప్రాంతం నుంచి నేపాల్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మీర్జాపూర్ నేరం తర్వాత ఇలా వెళ్లిన ఈ ద్వయం కొన్నాళ్లకు తమ స్వస్థలాలకు తిరిగి వచి్చంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సిటీ పోలీసులు వారి కదలికలపై పటిష్ట నిఘా ఉంచారు.

కిడ్నాప్.. ఆపై గ్యాంగ్ రేప్..!
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిని కిడ్నాప్ చేసి, వారం రోజుల వ్యవధిలో 22 గ్యాంగ్ రేప్‌నకు పాల్పడ్డారు. వీరిలో ఆరుగురిని అరెస్ట్ చేశామని, మిగతా వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. నగరంలోని లాల్పూర్కు చెందిన 19 ఏళ్ల యువతి మార్చి 29వ తేదీన ఫ్రెండ్‌ను కలిసేందుకని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తరచూ ఆమె ఇలాగే బయటకు వెళ్లి వస్తూంటుంది. కానీ, ఈసారి అలా జరగలేదు. దీంతో, కుటుంబసభ్యులు ఏప్రిల్ 4వ తేదీన ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు, పోలీసులు పాండేపూర్ వద్ద డ్రగ్స్ మత్తులో ఉన్న ఆమెను కిడ్నాపర్ల చెర నుంచి విడిపించారు. అనంతరం ఆమెను దగ్గర్లోని ఫ్రెండ్ ఇంటి వద్ద వదిలి వెళ్లారు. ఆ తర్వాత సొంతింటికి చేరుకుని తనపై లైంగిక దాడి జరిగిన విషయాన్ని తండ్రికి తెలిపింది. ఈ నెల 6న తండ్రితో వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక హుక్కా సెంటర్, ఒక హోటల్, ఒక లాడ్జి, ఒక గెస్ట్ హౌస్‌లో తనపై మొత్తం 22 మంది అత్యాచారానికి ఒడిగట్టినట్లు అందులో ఆరోపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు హుకూల్ గంజ్, లాల్పూర్ ఏరియాలకు చెందిన కొందరు నిందితులను అదే రోజు రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అయితే, వీరిలో కొందరు మైనర్లు అయినందున పోలీసులు వీరి పూర్తి వివరాలను వెల్లడించడం లేదు. అయితే, బాధితురాలు కానీ, ఆమె కుటుంబం కానీ లైంగిక దాడి జరిగినట్లుగా ఏప్రిల్ 4న ఫిర్యాదు అందించలేదని డీసీపీ చంద్రకాంత్ మీనా తెలిపారు. అత్యాచారం జరిగిందంటూ వారు ఈ నెల 6వ తేదీన మాత్రమే ఫిర్యాదు చేశారని, దర్యాప్తు పురోగతిలో ఉందని ఆయన వివరించారు.

సహజీవనం చేసే వాడే చంపేశాడు
తిరుమలగిరి(జగ్గయ్యపేట): తనతో సహజీవనం చేస్తున్న మహిళను రోకలి బండతో మోది చంపిన ఘటన సోమవారం తెల్లవారుజామున ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపింది. జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన పసుపులేటి మురళీకృష్ణ అవివాహితుడు. లారీ క్లీనర్‌గా పని చేస్తుంటాడు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం తక్కెళ్ళ పాడుకు చెందిన వివాహిత కనపర్తి మంగమ్మ (44) తో పరిచయం ఏర్పడింది.ఆమె తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలి మురళీకృష్ణ దగ్గరికి రాగా ఇద్దరూ కలసి తిరుమలగిరిలోనే ఓ అద్దె ఇంట్లో గత 12 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో తరచూ గొడవలు పడుతుండేవారు. ఇంటి యజమాని, చుట్టుపక్కల వారు సర్ది చెబుతుండేవారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మురళీ కృష్ణ ఇంట్లో నిద్రిస్తున్న మంగమ్మ తలపై రోకలిబండతో బలంగా కొట్టి చంపి పరారయ్యాడు. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు చిల్లకల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ తోట సూర్య శ్రీనివాసులు ఘటనా స్థలానికి వచ్చి, వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్డం నిమిత్తం పేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆ తర్వాత నిందితుడు మురళీకృష్ణ పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు.
వీడియోలు


అమెరికాలో తానా కుంభకోణం 700 మంది ఉద్యోగులపై వేటు


YSR జిల్లా పులివెందులలో TDP నేతల బాహాబాహీ


మరో బీహార్ మాదిరిగా తయారైన ఏపీ రాష్ట్రం: YS Jagan


మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని YS జగన్ ట్వీట్


వడ్డీతో సహా తిరిగిస్తాం గుర్తుపెట్టుకోండి, ఏపీ పోలీసులకి జగన్ వార్నింగ్..


Raptadu Tour: వైఎస్ జగన్ హెలికాప్టర్ విజువల్స్


YS Jagan: లింగమయ్య హత్య కేసు నిందితులపై ఎందుకు కేసులు పెట్టలేదు


Thopudurthi Prakash: మీరు ఎన్ని కారులైనా ఆపుకోండి జగన్ అభిమానాన్ని ఆపడం మీ వల్లకాదు


YS Jagan: కురుబ లింగమయ్య కుటుంబానికి పరామర్శ


జన సందోహాన్ని చూసి చంద్రబాబు గుండె గుబేల్