Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

HCU Land Row: BJP Visit Protests Continue At University April 1st Updates1
HCUలో భూ రగడ.. ఓయూలో ఉద్రిక్తత

హైదరాబాద్‌, సాక్షి: హెచ్‌సీయూలో ఉద్రికత్త నెలకొంది. యూనివర్సిటీ ముట్టడికి సీపీఎం, బీజేవైఎం నేతలు ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ తరుణంలో హెచ్‌సీయూ భూములపై బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క ఇద్దరూ హెచ్‌సీయూ పూర్వ విద్యార్థులే. HCU వెళ్తే ఆ ఇద్దరు మంత్రులు ఏ ముఖం పెట్టుకొని వెళ్తారు? క్యాబినెన్‌లో మంత్రుల మధ్య ఏకాభిప్రాయం లేదని స్పష్టంగా తెలుస్తుంది. రాబర్ట్ వాద్రా కోసమే భూములు అమ్మకానికి పెడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్.. హెచ్‌సీయూ గురించి మాట్లాడుతున్నారు. BRS, కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం. BRS చేసిన మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. భూముల వేలం ఆపడానికి ఉద్యమిస్తాం.అభివృద్ధి అంటే భూముల అమ్మకమా?’ అని ప్రశ్నించారు.పార్లమెంట్‌కు చేరిన హెచ్‌సీయూ భూముల రగడ :రాజ్యసభ జీరో అవర్‌లో బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్హెచ్‌సీయూ భూముల వేలాన్ని వెంటనే ఆపివేయాలిపర్యావరణాన్ని కాపాడాలిఅరుదైన పక్షులు, వృక్షజాతులు అక్కడ ఉన్నాయిఉగాది పండుగ రోజున అర్ధరాత్రి హెచ్సీయూ భూముల్లో బుల్డోజర్లు నడిపించారుహెచ్సీయూ భూముల అమ్మకంపై పోరాడుతున్న బీజేపీ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశారుభూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ హెచ్‌సీయూ విద్యార్థులు ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారుఉచిత హామీల పథకం కోసం భూములను అమ్మవద్దు తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదురాహుల్, రేవంత్ రాజ్యాంగం నడుస్తుందిమంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం:కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్న 11మంది మంత్రులుసీఎం ఎందుకు మీటింగ్ పెట్టారనే దానిపై కొనసాగుతున్న సస్పెన్స్అధికారులపై విద్యార్థుల దాడి : డీసీపీ వినీత్‌హెచ్‌సీయూలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలుఇటు ఉస్మానియాలో ఆందోళన బాట పట్టిన విద్యార్థులు హెచ్‌సీయూ భూములపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని మాదాపూర్‌ డీసీపీ వినీత్‌ విజ్ఞప్తిప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం టీజీఐఐసీ ఆధ్వర్యంలో కంచ గచ్చిబౌలి సర్వే నెంబర్ 25లో అభివృద్ధి పనులు అభివృద్ధి పనులు అడ్డుకున్న విద్యార్థులు అధికారులు, కార్మికులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారని డీసీపీ వినీత్‌ వెల్లడిహెచ్‌సీయూ భూముల వివాదంపై హైకోర్టులో పిటిషన్‌ :కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన వట ఫౌండేషన్‌కంచ గచ్చిబౌలి భూములను జాతీయ ఉద్యానవంగా ప్రకటించాలని పిటిషన్‌అత్యవసర పిటిషన్‌గా విచారణకు స్వీకరించాలని కోరిన వట ఫౌండేషన్‌ లాయర్‌రేపు విచారణకు స్వీకరిస్తామని తెలిపిన హైకోర్టు యూనివర్సిటీ భూముల్ని పరిశీలించేందుకు బయల్దేరిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, ధన్‌పాల్‌ సూర్యనారయణతోపాటు ఇతర బీజేపీ నేతలు యూనివర్సిటీకి వెళ్లకుండా అడ్డుకున్నారు. హెచ్‌సీయూ భూమల వేలం వ్యవహారంపై ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. దీంతో నిరసనల్ని ఉద్ధృతం చేయాలని విద్యార్థులు నిర్ణయించారు. బీజేపీ విద్యార్థి యువజన విభాగం హెచ్‌సీయూని ముట్టడిస్తారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హెచ్‌సీయూ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద ఉద్రికత నెలకొంది. హెచ్‌సీయూ భూముల్ని పరిశీలించేందుకు వెళ్తున్న బీజేపీ శ్రేణుల్ని పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు. హెచ్‌సీయూ భూముల్ని పరిశీలించేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు బయల్దేరారు. భూముల వద్ద వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకోనున్నారు. ఈ తరుణంలో హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద బీజేపీ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై నెలకొన్న వివాదంతో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (HCU) క్యాంపస్‌ అట్టుడికిపోతోంది. ఇవాళ్టి నుంచి పోరాటం ఉధృతం చేయాలని విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. ఈ క్రమంలో తరగతుల్ని బహిష్కరించి ఆందోళనకు సిద్ధమయ్యాయి. ఒకవైపు.. బీజేపీ ఎమ్మెల్యేలు HCU సందర్శన వేళ.. హైదరగూడ MLA క్వార్టర్స్ వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో యూనివర్సిటీ వద్దకు వెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లో యూనివర్సిటీని సందర్శిస్తామని అంటోంది. ఇప్పటికే భూముల వేలం పై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని బీజేపీ నిర్ణయించింది. తద్వారా వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని భావిస్తోంది. ఇప్పటికే యువ మోర్చా ఆధ్వర్యంలో HCU భూముల వేలానికి వ్యతిరేకంగా పోరాటం నడుస్తోంది.మరోవైపు.. వామపక్ష పార్టీలు సైతం సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఆందోళనకు సిద్ధమైంది. సెంట్రల్ యూనివర్సిటీ భూమి అమ్మకాన్ని ప్రభుత్వ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌తో సీపీఐ, సీపీఎంలు నిరసన చేపట్టబోతున్నారు. హెచ్‌సీయూ భూముల పరిరక్షణ కోసం పాటుపడుతున్న విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైన అణచివేతకు పాల్పడుతోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపిస్తున్నారు. విద్యార్థుల పోరాటానికి బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో.. ఈ ఉదయం కేబీఆర్‌ పార్కు వద్ద బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. హెచ్‌సీయూ భూముల విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. ‘ప్రకృతిని కాపాడండి.. అది మనల్ని కాపాడుతుంది’.. ‘హెచ్‌సీయూ అడవి నరికితే.. హైదరాబాద్‌ ఊపిరి ఆగుతుంది‘ అంటూ ప్లకార్డుల ప్రదర్శనతో బీఆర్‌ఎస్‌వీ నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి, పలువురు ప్రకృతి ప్రేమికులు మద్దతు తెలిపారు.కంచె గచ్చిబౌలి భూములపై ఇప్పటికే టీజీఐఐసీ (TGIIC) కీలక ప్రకటన చేసింది. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ప్రాజెక్టులో సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)భూమి లేదని తెలిపింది. ఈ మేరకు టీజీఐఐసీ వెల్లడించింది. వేడెక్కిన క్యాంపస్‌ హెచ్‌సీయూలో 400 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం టీజీఐఐసీకి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ కొద్ది రోజులుగా క్యాంపస్‌లో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. సదరు స్థలాన్ని పొక్లెయిన్‌లతో చదును చేస్తున్న విషయం తెలుసుకున్న విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తు‍న్నారు. గత రెండురోజులుగా నెలకొన్న ఉద్రిక్తతలతో HCU మొత్తం ఇప్పుడు పోలీసు పహారాలో ఉంది.

Ration Rice Row: Perni Nani Challange Kutami Prabhutam2
వేధింపులకు భయపడేది లేదు.. వైఎస్సార్‌సీపీని వీడేది లేదు: పేర్ని నాని

కృష్ణా, సాక్షి: ఓటేసి గెలిపించిన ప్రజలకు మేలు చేయకుండా.. వ్యవస్థలను రాజకీయ వేధింపులకు వాడుకుంటోందని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) మండిపడ్డారు. రేషన్‌ బియ్యం వ్యవహారంలో కృష్ణా జిల్లా పోలీసులు హైకోర్టును సంప్రదించిన పరిణామంపై ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘మేం ఏపాపం చేయలేదని పోలీసు వ్యవస్థకు తెలుసు. ప్రభుత్వానికి జరిగిన నష్టానికి రెట్టింపు జమచేశాం. అయినా నా భార్య జయసుధ పై ఏడు సంవత్సరాల పైబడి శిక్ష పడే సెక్షను పెట్టి అరెస్టు చేయాలని చూశారు. ఆ సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని జిల్లా కోర్టు నా భార్యకు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు నా భార్యకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని హైకోర్టుకు వెళ్లారు.. మా కుటుంబంపై తప్ప సివిల్ సప్లై శాఖ(Civil Supply Ministry) ఇంతవరకూ ఎవరిపైనా ఒక్క క్రిమినల్ కేసు పెట్టలేదు. అసలు సివిల్‌ సప్లై శాఖ అనేది ఏర్పడిన తర్వాత ఇప్పటిదాకా ఇప్పటి వరకు ఎవరిపైనా క్రిమినల్‌ కేసులు లేవు. సాక్షాత్తూ సివిల్ సప్లై మంత్రి వెళ్లి 22 వేల టన్నుల బియ్యం పట్టుకున్నా కేసు లేదు. సీజ్ ద షిప్‌.. సీజ్‌ ద గోడౌన్ అన్నా.. ఎవరిపైనా క్రిమినల్ కేసు లేదు. వాళ్లపై పెట్టింది కేవలం 6A కేసు మాత్రమే. నాకు ముందు కానీ నా తర్వాత కానీ ఒక్కరి పైన కూడా క్రిమినల్ కేసులు పెట్టలేదు. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నాపై, నా భార్యపై క్రిమినల్‌ కేసులు పెట్టారు... ఎన్నో జరుగుతున్నా అన్నీ 6A కేసులే. ఈ పరిస్థితి చూస్తేనే వాళ్ల దిగజారుడుతనం తెలుస్తోంది. నన్ను, నా భార్యను, నా కొడుకును ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటాం. ఆఖరికి జైలుకు అయినా పోతాం. అంతేగానీ వైఎస్సార్‌సీపీ(YSRCP) నుంచి తప్పుకునేది లేదు. ఎల్లప్పుడూ జగన్ వెంటే ఉంటాం. కూటమి తప్పుల్ని ఎంగడుతూనే ఉంటాం’’ అని పేర్ని నాని అన్నారు.

Ksr Analysis On Pawan, Bjp Politics3
పవన్‌ను వాడుకోవడం.. ఇప్పుడు బీజేపీ వంతు!

అవసరమైతే తమిళనాడుకు కూడా పార్టీని విస్తరిస్తానంటున్నారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌! వినడానికి బాగానే అనిపించినా ఆయన చెప్పిందైతే వాస్తవం! ఎలాగంటారా? ఏపీలోనే సొంతబలం లేదు కదా? ఇతర రాష్ట్రాలలో ఏం చేయగలుగుతారని మీకు అనిపించవచ్చు. అదే తమాషా రాజకీయం! ఇదంతా భారతీయ జనతా పార్టీ ఆడుతున్న గేమ్ అని అందులో ఈయన ఒక పావుగా మారుతున్నారని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. వామపక్షాల వారైతే బహిరంగంగానే ఈ విమర్శలకు దిగుతున్నారు.రాజకీయాలలోకి వచ్చిన తర్వాత అనేక రూపాలు మార్చుకున్న పవన్ కళ్యాణ్ కొద్ది నెలల క్రితం దక్షిణాది రాష్ట్రాలలో దేవాలయాలను సందర్శించారు. అది కూడా బీజేపీ మాట మేరకే అని ఒక విశ్లేషణ. ఎందుకంటే వచ్చే ఏడాది తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ యోచిస్తోంది. ఇందుకోసం మళ్లీ అన్నా డీఎంకేతో జత కట్టడానికి పావులు కదుపుతోంది. అన్నాడీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా ఇందుకు దాదాపు సిద్దమవుతున్నట్లుగానే వార్తలు వస్తున్నాయి. డీఎంకే చేపట్టిన హిందీ వ్యతిరేక ఆందోళన, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి నష్టం కలుగుతున్న అంశాలపై ఆయన వ్యూహాత్మకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వినతిపత్రాలు సమర్పించడానికి ఢిల్లీ వళ్లారు. గతంలో బీజేపీతో పొత్తు ఉన్నా, లోక్‌సభ ఎన్నికల సమయంలో వేర్వేరుగా పోటీ చేశారు. కానీ డీఎంకే మొత్తం స్వీప్ చేసింది. ఆ పార్టీ తమిళనాడులో బలంగా వేళ్లూనుకుంది. జయలలిత మరణం తర్వాత అన్నా డీఎంకే బలహీనపడింది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే బెటర్ అన్న భావన అన్నాడీఎంకేలో ఏర్పడిందని చెబుతున్నారు.ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఈ కూటమిలో చేరతారా? లేదా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. తమ కూటమికి సినీ రంగు అద్దడానికి, తమిళనాడులోని తెలుగు వారిని కొంతమేర ఆకర్షించడానికి పవన్ కళ్యాణ్‌ను ప్రయోగించాలని బీజేపీ తలపెట్టిందని అంటున్నారు. ఒకప్పుడు కులం ఏమిటి? మతం ఏమిటి అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఏకంగా సనాతని వేషం కట్టి దక్షిణాది రాష్ట్రాలు తిరిగి వచ్చారు. ఒక ప్లాన్ ప్రకారం కొద్ది రోజుల క్రితం తమిళ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఏపీలో కేవలం ఆరు శాతం ఓట్లు మాత్రమే వచ్చినా, టీడీపీ పొత్తు కారణంగా జనసేనకు చెందిన 21 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. పవన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది. కాపు సామాజిక వర్గం వారు తమ నుంచి ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావాలని ఎప్పటినుంచో అభిలషిస్తున్నారు.పవన్ కళ్యాణ్ వారి ఆశలపై నీళ్లు జల్లుతూ చంద్రబాబుకు పూర్తిగా వత్తాసు పలుకుతున్నారు. పదిహేనేళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలని అంటున్నారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ సీఎం కాకుండా అడ్డుపడడానికే ఈ వాదన చేస్తున్నారన్న అభిప్రాయం ఉన్నా, అవసరమైతే తన పదవి కోసం లోకేశ్‌కు కూడా విధేయత ప్రదర్శించే అవకాశం ఉంటుందని కొందరి భావన.చంద్రబాబు ఎప్పుడైనా మళ్లీ బీజేపీని వ్యతిరేకించినా, లేక ఏదో ఒక అంశంపై విడిపోవాలని బీజేపీ అనుకున్నా, పవన్ కళ్యాణ్‌ను ప్రొజెక్టు చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్‌కు ఏపీలో పెద్దగా ఓట్లు రాకపోయినా లేకపోయినా, ఆయన సినిమా ఇమేజీని వాడుకుని ఇతర రాష్ట్రాలలో ప్రొజెక్టు చేస్తే దాని ప్రభావం ఏపీపై కూడా ఉండవచ్చన్నది ఒక అంచనా అట.తెలంగాణలో గతంలో బీజేపీ జనసేనతో కలిసి పోటీచేసినా ఫలితం పెద్దగా లేకుండా పోయింది. జనసేన ఒక్క చోట తప్ప పోటీ చేసిన అన్నిచోట్ల డిపాజిట్లు కోల్పోయింది. కాని సనాతని వేషం కట్టి ఇతర రాష్ట్రాలలో పర్యటించడం, ఇప్పుడు తమిళనాడుపై దృష్టి కేంద్రీకరించడం వంటి చర్యల ద్వారా చంద్రబాబుకు ఒక చెక్ గా పవన్ ఉండే అవకాశం ఉంటుంది. బీజేపీ వారు చెప్పినట్లు ప్రచారం చేసి వారితో ఆయన మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోగలిగితే సమీప భవిష్యత్తులో లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేయడం, లేదా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం చంద్రబాబు కుటుంబానికి కుదరకపోవచ్చు. అన్నాడీఎంకే, బీజేపీ కూటమిలో చేరినా తమిళనాడులో జనసేన ఎంతవరకు సఫలం అవుతుందన్నది సందేహమే. సినీ నటుడు కూడా కనుక ప్రచారానికి ఈయనను వాడుకోవచ్చు. అందుకే యథా ప్రకారం పవన్ కళ్యాణ్ ఏపీలో ఎలాంటి అబద్దాలు ఆడారో, అదే తరహాలో తమిళనాడులో కూడా ట్రయల్ ప్రారంభించినట్లు అనిపిస్తుంది.ఉదాహరణకు ఆయనకు తమిళ కవి భారతీయార్ పై అభిమానం ఉందని చెప్పడం, శివాజీ గణేశన్‌కు అభిమానినని, 1982 నుంచి 1995 వరకు చెన్నైలో ఉన్నానని చెప్పడం, మైలాపూర్ పాఠశాలలో చదువుకున్నానని అనడం, కూరగాయల మార్కెట్ కు వెళ్లి తమిళం నేర్చుకున్నానని వెల్లడించడం చూస్తే వీటిలో ఎన్ని నిజాలు ఉన్నాయో, ఎన్ని అబద్దాలు ఉన్నాయో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే పవన్ తన పుట్టిన స్థలం, చదువు గురించి మాత్రమే కాదు..అనేక అంశాలలో ఎన్ని రకాలుగా మాటలు మార్చింది ఏపీ ప్రజలకు తెలుసు. అన్నాడీఎంకే, బీజేపీ కలిస్తే తప్పులేదని, అన్నా డీఎంకేతో జనసేన పొత్తు పెట్టుకోవచ్చని ఆయన అన్నారు. ఇక పిఠాపురంలో హిందీకి అనుకూలంగా మాట్లాడి, తమిళ నేతలను పరోక్షంగా విమర్శించిన పవన్ కళ్యాణ్ అక్కడ మాత్రం మాట మార్చారు. భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తానని చెప్పారు. తద్వారా తమిళ సెంటిమెంట్‌కు అనుకూలంగా మాట్లాడినట్లు కనిపించే యత్నం చేశారన్న మాట.పిఠాపురంలో తమిళ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేసుకుని సొమ్ము చేసుకుంటున్నప్పుడు హిందీని వ్యతిరేకించడం ఏమిటని అన్నారు. హిందీని రుద్దవద్దన్నది మాత్రమే తమిళ పార్టీల డిమాండ్. ఇదే అంశంపై అన్నాడీఎంకే కూడా అమిత్‌షా కు విన్నవించింది. పవన్ కళ్యాణ్ మరో ఆశ్చర్యకరమైన అంశం చెప్పారు. 2014లో పార్టీని ప్రారంభించినప్పుడు కనుచూపు మేర చీకటి కనిపించిందని, ఎలా ముందుకు వెళ్లాలో తెలియలేదని, మనసులో ధైర్యం తప్ప మరేమీ లేవని ఆయన అన్నారు. ఇది సత్య దూరమైందో, కాదో ఆయనే ఆలోచించుకోవాలి. జనసేన పార్టీని స్థాపించడం, ఆ వెంటనే చంద్రబాబు కోరిక మేరకు మద్దతు ఇవ్వడం, కనీసం పోటీ కూడా చేయక పోవడం, తదుపరి టీడీసీ కూటమి ప్రభుత్వంతో సంబంధాలు పెట్టుకుని ఎంజాయ్ చేయడం జరిగాయి. చంద్రబాబుకు అవసరమైనప్పుడల్లా స్పెషల్ విమానాలు ఏర్పాటు చేస్తే హైదరాబాద్ నుంచి తరలి వెళ్లేవారు. మరి ఇందులో ఆయనకు చీకటి కనిపించడం ఏమిటో తెలియదు. కాకపోతే 2019లో బీఎస్పీ, వామపక్షాలతో పోటీచేసి ఓటమి చెందినప్పుడు చీకటి కనిపించి ఉండవచ్చు. తన పార్టీ ఒకే సీటు గెలవడం, తనే రెండు చోట్ల ఓడిపోయారప్పుడు. 2019లో కూడా చంద్రబాబుతో పరోక్ష పొత్తు ఉందన్న ఆరోపణలు లేకపోలేదు. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై మొదట పార్లమెంటులో మాట్లాడాలని, అలా కాకుండా ఒకేసారి రోడ్లపైకి వస్తే ఎలా అని ప్రశ్నించారు. అంతే తప్ప దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే తాను కూడా పోరాడతానని చెప్పలేక పోయారు. అదే టైమ్‌లో దక్షిణాదిలో లోక్ సభ సీట్లు తగ్గవని నమ్ముతున్నట్లు ఆయన చెబుతున్నారు.ఏపీలో పార్టీ విస్తరణకు ప్రత్యేకంగా ఎలాంటి అడుగులు వేయకపోయినా, జనసేన నేతలు, కార్యకర్తలు ఆయా నియోజకవర్గాలలో టీడీపీ వారి పెత్తనం కింద నలిగిపోతున్నా, పట్టించుకోని పవన్ కళ్యాణ్ ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తామని చెబుతున్నారు. చంద్రబాబుతో కలిసి చేసిన సూపర్ సిక్స్ అనే అబద్దాల వాగ్దానాలను తమిళనాడులో కూడా చెబుతారేమో తెలియదు. ఈ ఇంటర్వ్యూలలో ఆ జర్నలిస్టులు ఏపిలో ఎన్డీయే కూటమి హామీల అమలు తీరుతెన్నుల గురించి ఒక్క ప్రశ్న కూడా వేసినట్లు కనిపించదు. ముందస్తుగా మాట్లాడుకుని ఉంటే ఇబ్బంది లేని ప్రశ్నలే వేసే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ విప్లవవీరుడు చెగువెరా మొదలు టిడిపి అధినేత చంద్రబాబు వరకు, ప్రధాని మోడీ వరకు ఎన్ని రంగులు మార్చారో ,ఇప్పుడు తమిళనాడులో కూడా ఎన్ని రకాల విన్యాసాలు చేస్తారో, ఆయనను తమిళ ప్రజలు ఎంతవరకు నమ్ముతారో వేచి చూడాల్సిందే. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Are you trying Ghibli images How safe was it Check Details Here4
Ghibli ఫొటోలు ట్రై చేస్తున్నారా?.. ఇది మీకోసమే!

ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్, వాట్సాప్‌.. ఇలా ఏ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ ఓపెన్‌ చేసినా ఫీడ్‌ మొత్తం జిబ్లీ(Ghibli) ఫొటోలతో నిండిపోతోంది. సామాన్యులు, సినీ తారలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు, వ్యాపారవేత్తలు.. ఇలా అంతా కార్టూన్‌ తరహా ఫొటోలను పంచుకుంటూ మురిసిపోతున్నారు. ఎడాపెడా ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తుండడంతో.. నెట్టింట ఈ నయా ట్రెండ్ ఊపేస్తోంది. అయితే అలా అప్‌లోడ్‌ చేసే ముందు ఇది ఎంతవరకు సురక్షితం అనే ఆలోచన మీలో ఎంతమంది చేస్తున్నారు?.. ఏఐ బేస్డ్ చాట్‌బాట్‌ యూజర్లను ఆకర్షించేందుకు ఆయా కంపెనీలు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి‌. ఇందులో భాగంగానే.. ఓపెన్‌ ఏఐ సంస్థ ఇటీవల చాట్‌జీపీటీలో (ChatGPT) జిబ్లీ స్టూడియోను ప్రవేశపెట్టింది. తమకు కావాల్సిన ఫొటోను ఎంచుకుని.. ఫలానా స్టైల్‌లో కావాలని కోరితే చాలూ.. ఆకర్షనీయమైన యానిమేషన్‌ తరహా ఫొటోలను సృష్టించుకోవచ్చు. ఈ ట్రెండ్‌ విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావడంతో ఇతర ఏఐ ప్లాట్‌ఫామ్‌లు సైతం ఇవే సదుపాయాన్ని అందిస్తున్నాయి. అయితే ఆ వాడకం పరిధి దాటి శ్రుతిమించి పోతోంది. ఎంతవరకు సురక్షితం?ఏదైనా మనం ఉపయోగించినదాన్ని బట్టే ఉంటుంది. అది సాంకేతిక విషయంలో అయినా సరేనని నిఫుణులు తరచూ చెబుతుంటారు. అలాగే జిబ్లీ స్టైల్‌ ఏఐ ఇమేజ్‌ జనరేటర్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సృజనాత్మకత మరీ ఎక్కువైపోయినా.. భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. మరోవైపు వ్యక్తిగతమైన ఫొటోలను ఏఐ వ్యవస్థల్లోకి అడ్డగోలుగా అప్‌లోడ్‌ చేస్తే.. అవి ఫేషియల్‌ డాటాను సేకరించే ప్రమాదమూ లేకపోలేదని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. ఇలాగే కొన్ని కంపెనీలు వ్యక్తిగత డాటాను తమ అల్గారిథమ్‌లలో ఉపయోగించుకుంటున్న పరిస్థితులను నిపుణులు ఉదాహరిస్తున్నారు.అలాంటప్పుడు ఏం చేయాలంటే..వ్యక్తిగత ఫొటోలను అప్‌లోడ్‌ చేసేటప్పుడు.. ఆ జనరేటర్‌ను క్షుణ్ణంగా పరిశీలించండి. ప్రైవసీ పాలసీల విషయంలో నమ్మదగిందేనా? కాదా? అనే విషయాన్ని నిర్ధారించుకోండి. అందుకోసం సదరు జనరేటర్‌ గురించి నెట్‌లో క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దానికి యూజర్లు ఇచ్చే రివ్యూలను చదవాలి. అన్నికంటే ముఖ్యమైన విషయం.. సున్నితమైన అంశాల జోలికి పోకపోవడం. చిన్నపిల్లల ఫొటోలను ప్రయత్నించకపోవడమే మంచిది. మరీ ముఖ్యమంగా ప్రముఖుల ఫొటోలను ప్రయత్నించకపోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో ఇది చట్టపరమైన చర్యలకు అవకాశం కూడా ఇచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ప్రస్తుతానికి.. ఛాట్‌జీపీటీ, గూగుల్‌ జెమినీ, ఎక్స్‌ గ్రోక్, డీప్‌ఏఐ, ప్లేగ్రౌండ్‌ఏఐలు.. పరిమితిలో ఉచితంగా,అలాగే పెయిడ్‌ వెర్షన్‌లలోనూ రకరకాల ఎఫెక్ట్‌లతో ఈ తరహా ఎఫె​‍క్ట్‌లను యూజర్లకు అందిస్తున్నాయి. వీటితో పాటు జిబ్లీ ఏఐ కూడా స్టూడియో జిబ్లీస్టైల్‌ ఆర్ట్‌ వర్క్‌తో ఫొటోలను చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. నోట్‌: పర్సనల్‌ డాటా తస్కరణ.. సైబర్‌ నేరాలు పెరిగిపోతున్న రోజుల్లో ఏ టెక్నాలజీని అయినా.. అదీ సరదా కోణంలో అయినా ఆచితూచి.. అందునా పరిమితంగా వాడుకోవడం మంచిదనేది సైబర్‌ నిపుణుల సూచన.

Vizag Chodavaram Court Sensational Judgement in Vepadu Divya Case5
అనకాపల్లి: వేపాడు దివ్య కేసులో సంచలన తీర్పు

అనకాపల్లి, సాక్షి: పదేళ్ల కిందట తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిన్నారి వేపాడు దివ్య హత్య కేసులో సంచలన తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితుడు గుణశేఖర్‌ను దోషిగా ప్రకటించిన చోడవరం కోర్టు.. మరణశిక్షను ఖరారు చేసింది. దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. గుణశేఖర్‌కు దివ్య కుటుంబంతో గొడవలు ఉన్నాయి. ఇది మనసులో పెట్టుకుని.. స్కూల్‌కి వెళ్లి వస్తున్న ఆరేళ్ల చిన్నారి దివ్యను నిందితుడు తన వెంట తీసుకెళ్లాడు. బిళ్లలమెట్ల రిజర్వాయర్‌ వద్దకు తీసుకెళ్లి బీర్‌ బాటిల్‌తో గొంతు కోసి పైశాచికంగా హత్య చేశాడు. ఈ ఘటన అప్పట్లో కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా జరిపారు. చివరకు బంధువైన గుణ శేఖరే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారించుకుని అరెస్ట్‌ చేశారు. ఇన్నేళ్లపాటు విచారణ జరగ్గా.. చివరకు దివ్య కుటుంబానికి న్యాయం జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Payal Rajput Comments On movie Chance In Tollywood6
టాలెంట్‌తో పనిలేదు.. అలాంటి వాళ్లకే ఛాన్సులు ఇస్తున్నారు: పాయల్‌ రాజ్‌పుత్‌

టాలెంట్‌ ఎంత ఉన్నా సరే చిత్రపరిశ్రమలో రాణించడం చాలా కష్టమని ఢిల్లీ బ్యూటీ 'పాయల్‌ రాజ్‌పుత్‌'(Payal Rajput) అన్నారు. 'RX 100' ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్యూటీ హిట్‌ కొట్టింది. ఈ సినిమాతోనే ఆమె తెలుగు వారికి ద‌గ్గ‌రైంది. ఈ మూవీ త‌ర్వాత ఆమె వ‌రుస సినిమాలు చేసినప్పటికీ ఏదీ ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. అయితే, చాలారోజుల గ్యాప్‌ తర్వాత వచ్చిన 'మంగ‌ళ‌వారం' సినిమాలో తన నటనతో విశ్వరూపం చూపింది. ఈ సినిమా భారీ విజయం అందుకోవడమే కాకుండా ఒక నటిగా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. ‘మంగళవారం’లోని నటనకు గాను జైపుర్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఉత్తమ నటిగా పాయల్‌ అవార్డ్‌ అందుకుంది. అయితే, ఈ సినిమా తర్వాత ఆమెకు భారీ ఛాన్సులు వస్తాయని అందరూ ఆశించారు. కానీ, అలాంటిది ఏమీ జరగలేదు. ఈ క్రమంలో తాజాగా ఇండస్ట్రీపై పాయల్‌ ఒక పోస్ట్‌ చేసింది.ఒక నటిగా రాణించడం అనేది అన్నింటికంటే చాలా కష్టంతో కూడుకున్న విషయం. ప్రతిరోజు కూడా అనిశ్చిత భారంతోనే మొదలౌతుంది. ఎందుకంటే నేను ప్రతిరోజూ ప్రతిభను కప్పివేసే నెపోటిజం (బంధుప్రీతి ), పక్షపాతంతో నిండి ఉన్న ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాను. నాకొక సందేహం ఉంది. నేను అంకితభావంతో ఎంతో కష్టపడుతున్నప్పటికీ వెలుగులు కనిపించడం లేదు. ఆధిపత్యం చెలాయించే ఈ ప్రపంచంలో నిజంగానే రాణించగలనా అనే సందేహం వస్తుంది. అవకాశాలు వచ్చినట్టే వచ్చే చేయి జారిపోతున్నాయి. కొందరు తమ ఇంటిపేరు ఉపయోగించుకొని ఛాన్సులు తెచ్చుకుంటే మరికొందరు సరైన ఏజెంట్స్‌ ద్వారా దక్కించుకుంటున్నారు. ఇలాంటివి నేను చాలా గమనించాను. ఇలాంటి ప్రదేశంలో నేను రాణించగలనా అనే సందేహం వస్తుంటుంది.' అని పాయల్‌ అన్నారు. మంగళవారం (2023) తర్వాత పాయల్‌ రాజ్‌పూత్‌ మరో సినిమా నటించలేదు. అంతటి భారీ విజయాన్ని అందుకున్న ఆమెకు అవకాశాలు రాకపోవడం ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. కాస్త ఓపిక పడితే తప్పకుండా మంచి ఛాన్సులు వస్తాయని సోషల్‌మీడియా ద్వారా ఆమెకు చెబుతున్నారు. పాయల్‌ ట్వీట్‌ను తమ అభిమాన హీరోలు, దర్శకులకు ట్యాగ్‌ చేస్తూ ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి అంటూ రిక్వెస్ట్‌ చేయడం విశేషం. అలా పాయల్‌పై తమ అభిమానాన్ని చాటుతున్నారు. Being an actor is one of the toughest careers out there. Each day starts with the weight of uncertainty, as I step into a world where nepotism and favoritism often overshadow talent. #struggleisreal 🎞️— paayal rajput (@starlingpayal) April 1, 2025There are moments of doubt when I question whether my hard work and dedication can truly shine through in a landscape dominated by privilege. I watch as opportunities slip away to those with famous last names or a powerful agent, wondering if my talent is enough to break…— paayal rajput (@starlingpayal) April 1, 2025

Konstas Handed Cricket Australia Central Contract For 2025 267
బుమ్రాతో గొడవ పడ్డ ఆటగాడికి జాక్‌పాట్‌

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2024-25లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రాతో గొడవ పడ్డ ఆస్ట్రేలియా యువ ఆటగాడు సామ్‌ కొన్‌స్టాస్‌కు జాక్‌పాట్‌ తగిలింది. 2025-26 సంవత్సరానికి గానూ క్రికెట్‌ ఆస్ట్రేలియా కొన్‌స్టాస్‌కు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చింది. కొన్‌స్టాస్‌తో పాటు వివాదాస్పద బౌలింగ్‌ శైలి కలిగిన మాథ్యూ కుహ్నేమన్‌, ఆల్‌రౌండర్‌ బ్యూ వెబ్‌స్టర్‌ కూడా కొత్తగా క్రికెట్‌ ఆస్ట్రేలియా సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ పొందారు. ఈ ముగ్గురి చేరికతో క్రికెట్‌ ఆస్ట్రేలియా సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆటగాళ్ల సంఖ్య 23కు చేరింది. కొన్‌స్టాస్‌, కుహ్నేమన్‌, వెబ్‌స్టర్‌ ఇటీవల ఆస్ట్రేలియా తరఫున అద్భుత ప్రదర్శనలు చేశారు. ఈ కారణంగా వారు క్రికెట్‌ ఆస్ట్రేలియా వార్షిక కాంట్రాక్ట్‌ పొందారు. కొన్‌స్టాస్‌, వెబ్‌స్టర్‌ భారత్‌తో జరిగిన బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో సత్తా చాటగా.. కుహ్నేమన్‌ ఇటీవల జరిగిన శ్రీలంక సిరీస్‌లో చెలరేగిపోయాడు. ఆ సిరీస్‌లో కుహ్నేమన్‌ 2 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీశాడు. ఫలితంగా ఆసీస్‌ శ్రీలంకను వారి సొంతగడ్డపైఏ 2-0 తేడాతో ఓడించింది. కొన్‌స్టాస్‌ విషయానికొస్తే.. ఇతగాడు తన టెస్ట్‌ కెరీర్‌ను ఘనంగా ప్రారంభించాడు. అరంగేట్రం ఇన్నింగ్స్‌లోనే బుమ్రా లాంటి వరల్డ్‌ క్లాస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ను ఎదుర్కొని హాఫ్‌ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌ తర్వాత కొన్‌స్టాస్‌ చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ చేయనప్పటికీ.. బుమ్రాతో మాటల యుద్దం కారణంగా బాగా పాపులర్‌ అయ్యాడు.వెబ్‌స్టర్‌ విషయానికొస్తే.. ఇతగాడు కూడా బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2024-25లోనే అరంగేట్రం చేశాడు. వెబ్‌స్టర్‌ కూడా తన తొలి మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతను బంతితో కూడా రాణించాడు. మిచెల్‌ మార్ష్‌, కెమారూన్‌ గ్రీన్‌ గాయపడటంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన వెబ్‌స్టర్‌ తన తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటి క్రికెట్‌ ఆస్ట్రేలియా సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ పట్టాడు.2025-26 సంవత్సరానికి గానూ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ పొందిన ఆసీస్‌ ఆటగాళ్లు..పాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్, నాథన్ లియాన్, అలెక్స్ కారీ, సామ్ కొన్‌స్టాస్, జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, జై రిచర్డ్‌సన్, స్కాట్ బోలాండ్, లాన్స్ మోరిస్, మాథ్యూ కుహ్నేమన్, ఆడమ్ జంపా, ట్రావిస్ హెడ్, మాట్ షార్ట్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్నస్ లబూషేన్‌, ఉస్మాన్ ఖవాజా, మిచెల్ మార్ష్, బ్యూ వెబ్‌స్టర్, కామెరూన్ గ్రీన్, జేవియర్ బార్ట్‌లెట్

 Sriracha Is A Story Of Immigration David Tran Who Create Billion Dollars8
జస్ట్‌ చిల్లీసాస్‌తో రూ. 8 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం..!​

వంటగదిలో ఉండే ఎరుపు మిరపకాయలతో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాడు. అదికూడా ఓ శరణార్థిగా వేరొక దేశంలోకి వచ్చి అక్కడే కోట్లకు పడగలెత్తాడు. ఎవ్వరూ ఊహించని రీతిలో వంటల్లో ఘాటు కోసం ఉపయోగించే మిరపకాయలతో అద్భుతమైన సాస్‌ తయారు చేశాడు. చూస్తుండగానే అతితక్కువ కాలంలోనే వ్యాపారం విస్తరించి లాభాల బాటపట్టింది. ఎలాంటి ప్రకటన, ప్రముఖుల అడ్వర్టైస్‌మెంట్‌లు లేకుండా కేవలం నోటిమాటతో వ్యాపారం ఊపందుకునేలా చేశాడు. విచిత్రమైన లోగోతోనే ఆ ప్రొడక్ట్‌ నాణ్యత ఏంటో అర్థమయ్యేలా చేశాడు. అలా ఆ ప్రొడక్ట్‌ పేరే బ్రాండ్‌ నేమ్‌గా స్థిరపడిపోయేలా ప్రజాదరణ పొందింది. ఇంతకీ ఆ వ్యాపార సామ్రాజ్యం సృష్టికర్త ఎవరు..? ఎలా ఈ సాస్‌ని రూపొందించాడంటే..పాశ్చాత్య దేశాల్లో ఏ నాన్‌వెజ్‌ తినాలన్నా ఈ చిల్లీసాస్ జోడించి ఆస్వాదిస్తారు. అక్కడ ప్రజలకు ఇది లేనిదే వంట పూర్తికాదు అన్నంతగా దీనిపై ఆధారపడిపోయారు. అది కూడా పచ్చగా ఉండే పచ్చిమర్చిని కాదని పండు ఎరుపు మిర్చిలనే ఎంచుకోవడానికి ప్రధాన కారణం దాని స్పైసీనెస్‌ అని చెప్పొచ్చు. పచ్చిమిర్చిలోని ఘాటుకంటే పండిని పచ్చిమిర్చిలో కారం ఎక్కువ. శ్రీరాచా చిల్లీసాస్‌ పేరుతో డేవిడ్ ట్రాన్ అనే వియత్నాం శరణార్థి దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చాడు. అతడి ప్రస్థానం మొదలైందిలా..1945లో దక్షిణ వియత్నాంలో జన్మించిన డేవిడ్ ట్రాన్ సైగాన్‌కు వెళ్లాడు. అక్కడ అతను దక్షిణ వియత్నామీస్ సైన్యంలో చేరడానికి ముందు రసాయనాల వ్యాపారంలో మెళుకువలు నేర్చుకున్నాడు. అక్కడే అతను చెఫ్‌గా కూడా పనిచేసేవాడు. ఆ టైంలోనే ట్రాన్‌​ మిరపకాయలతో సాస్‌ తయారీ ప్రయోగాలు చేస్తుండేవాడు. వాటిని రీసైకిల్‌ చేసిన గెర్బర్ బేబీ ఫుడ్ జాడిలలో నిల్వ చేసేవాడు. అయితే ఇంతలో సైగాన్‌లో పరిస్థితి ఉద్రీక్తంగా మారిపోయింది. డిసెంబర్‌ 1978లో, కమ్యూనిస్ట్ వియత్నాం, చైనా మధ్య ఏర్పడిన శతృత్వం రీత్యా అక్కడ పరిస్థితి అధ్వాన్నంగా మారిపోయింది. దీంతో ట్రాన్‌కి మాతృభూమిని వీడక తప్పలేదు. అయితే అతడు అద్భుతమైన దూరదృష్టితో తన ఆస్తులను ఆ కాలంలోనే దాదాపు రూ. 85 లక్షల రూపాయలకుపైనే విక్రయించి, ఆ డబ్బుతో హుయ్ ఫాంగ్" అనే తైవానీస్ సరుకు రవాణా నౌకలో అమెరికాకు వలస వచ్చాడు. సాస్‌ వ్యాపారం ఆవిర్భావం..బోస్టన్‌లో కొంతకాలం పనిచేసిన తర్వాత, ట్రాన్ 1980లో లాస్ ఏంజిల్స్‌కు మకాం మార్చాడు. అక్కడే తన హాట్‌సాస్‌ తయారీ ప్రారంభించాడు. సాంప్రదాయ వియత్నాం మిరపకాయలకు బదులుగా స్థానికంగా లభించే జలపెనోల మిరపకాయలను ఉపయోగించి తయారు చేశాడు. వాటిని రీసైకిల్ చేసిన బేబీ ఫుడ్ జాడిలలో నింపి నీలిరండు వ్యాన్‌లో దక్షిణ కాలిఫోర్నియా అంతటా ఉన్న ఆసియా రెస్టారెంట్లకు ట్రాన్‌ స్వయంగా డెలివరీ చేవాడు. అలా మొదటి నెల రూ. 2 లక్షల లాభాన్ని ఆర్జించాడు దీనికి వెంచర్‌ క్యాపిటల​ నిధులు లేవు, మార్కెటింగ్‌ బృందం లేదు, ప్రకటను ప్రచారాలు కూడా లేవు. తన ప్రొడక్ట్‌కి ఉన్న శ్రీరాచా అనే పేరు, దాని లోగో..విలక్షణమైన గ్రీన్‌క్యాప్‌ అమ్మకాలను ఆకర్షించే ట్రేడ్‌మార్క్‌గా క్రియేట్‌ చేశాడు. ఎవ్వరైనా తన ప్రొడక్ట్‌ పేరుని వాడుకునే యత్నం చేస్తే..వారిని తన వ్యాపారానికి ఉచితంగా అడ్వర్టైస్‌మెంట్‌ చేసేవాళ్లుగా అభివర్ణించేవాడు. అంతేగాదు మా ప్రొడక్ట్‌ అత్యంత హాట్‌గా ఉంటుంది. ఒకవేళ వేడిచేస్తే తక్కువగా వినియోగించండి అని స్వయంగా చెప్పేవాడు. అలా అనాతికాలంలోనే లాస్ ఏంజిల్స్‌లోని చైనాటౌన్, రోజ్‌మీడ్, కాలిఫోర్నియా అంతటా వ్యాపారం జోరుగా ఊపందుకుంది. ఇక తన ప్రొడక్ట్‌కి డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో కాలిఫోర్నియాలో 650,000 చదరపు అడుగుల ఫ్యాక్టరీ పెట్టే స్థాయికి చేరుకున్నాడు. దానికి తాను అమెరికాకు వలస వచ్చిన నౌక పేరు మీదుగా హుయ్ ఫాంగ్ ఫుడ్స్‌ అని పేరు పెట్టాడు.అలా 2019 నాటికి, వార్షిక అమ్మకాలు రూ. 16 వందల కోట్లకు చేరుకుంది. అంతేగాదు అమెరికన్ హాట్ సాస్ మార్కెట్‌లో దాదాపు 10% వాటాని సొంతం చేసుకుంది. అంతేగాదు ఈ రెడ్‌చిల్లీ బాటిల్‌పై లేబుల్‌ వియత్నామీస్, ఇంగ్లీష్, చైనీస్, ఫ్రెంచ్ స్పానిష్ వంటి భాషలలో టెక్స్ట్‌ను కలిగి ఉండటం విశేషం. తన ప్రొడక్ట్‌ ఇలా లాభాలతో దూసుకుపోవడానికి కారణం కేవలం "పేదవాడి ధరకు ధనవంతుడి సరిపోయే నాణ్యతలో సాస్ తయారు చేయడం" అని అంటారు ట్రాన్‌. ఈ ఏడాదితో ఈ వ్యాపారం 80 ఏళ్లకు చేరుకుంటోంది. పరిశ్రమ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. అతడి వ్యాపార సామ్రాజ్యం రూ. 11 వేల కోట్లు టర్నోవర్‌ ఉంటుదని అంచనా. నాణ్యతలో రాజీ పడకుండా, ఎలాంటి లాభదాయకమైన కొనుగోళ్లకు కక్కుర్తిపడకుండా ప్రజల నమ్మకాన్ని చూరగొంటే ఏ వ్యాపారమైన విజయపథంలో దూసుకుపోతుందంటారు డేవిడ్‌ ట్రాన్‌. కేవలం పట్టుదల, కష్టపడేతత్వం తదితరాలే వ్యాపారానికి అసలైన పెట్టుబడులని నొక్కి చెబుతున్నాడు.(చదవండి: కష్టాలు మనిషిని కనివినీ ఎరుగని రేంజ్‌కి చేరుస్తాయంటే ఇదే..!)

Noida news fire in building in sector 189
Uttar Pradesh: భవనంలో అగ్ని ప్రమాదం.. కొనసాగుతున్న సహాయక చర్యలు

నోయిడా: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అగ్ని ప్రమాదాలు(Fire hazards) చోటుచేసుకుంటాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో గల సెక్టార్ 18లోని ఒక భవనంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అగ్ని కీలల నుంచి తప్పించుకునేందుకు కొందరు భవనంపై నుంచి దూకడాన్ని మనం వీడియోలో చూడవచ్చు नोएडा के सेक्‍टर 18 स्थित बिल्डिंग में आग लग गई। देखिए लोग कैसे कूदकर अपनी जान बचा रहे हैं: @NavbharatTimes pic.twitter.com/2I4LC0IVgF— NBT Uttar Pradesh (@UPNBT) April 1, 2025మీడియాకు అందిన వివరాల ‍ప్రకారం అట్టా మార్కెట్‌(Atta Market)లోని ఒక వాణిజ్య భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటల నుంచి తప్పించుకునేందుకు భవనంలోని వారు తొలుత భవనం పైభాగానికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. సెక్టార్ 18లోని కృష్ణ అపరా ప్లాజాలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కాగా ఈ ప్రమాదం ఎలా జరిగిందన్నదీ ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. తొలుత భవనం బేస్మెంట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి అగ్ని జ్వాలలు మొదటి అంతస్తుకు, తరువాత రెండవ అంతస్తుకు చేరుకున్నాయి. ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఉన్న అగ్నిమాపక సిబ్బంది భవనంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇది కూడా చదవండి: Rajasthan: లీకయిన విషవాయువు.. ఒకరు మృతి.. 40 మందికి అస్వస్థత

ChatGPT Adds Million Users in an Hour Ghibli AI Art effect10
60 నిమిషాల్లో కొత్తగా 10 లక్షల మంది యూజర్లు

ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీ కేవలం ఒకే గంటలో పది లక్షల మంది యూజర్లను సంపాదించినట్లు కంపెనీ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ తెలిపారు. కంపెనీ ఇటీవల ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ట్‌ స్టూడియో జీబ్లీకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఇలా చాట్‌జీపీటీకి వినియోగదారులు పెరుగుతున్నట్లు చెప్పారు. ఈమేరకు ఆల్ట్‌మన్‌ తన ఎక్స్‌(గతంలో ట్విట్టర్) ఖాతాలో ఈ విషయాన్ని పంచుకున్నారు.26 నెలల క్రితం చాట్‌జీపీటీ ప్రారంభించిన సమయంలో అత్యంత క్రేజ్‌తో క్షణాల్లో ఈ ప్లాట్‌ఫామ్‌ వైరల్‌ అయి ఐదు రోజుల్లో 10 లక్షల మంది యూజర్లను సంపాదించుకున్నట్లు ఆల్ట్‌మన్‌ చెప్పారు. కానీ కొత్తగా ప్రవేశపెట్టిన బీజ్లీ స్టూడియో ద్వారా చాట్‌జీపీటీ గతంలో కంటే మరింత వైరల్‌ అయి కేవలం గంటలోనే 10 లక్షల మంది యూజర్ల బేస్‌ను సంపాదించిందని వివరించారు. ప్రస్తుతానికి కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్యను విడుదల చేయలేదు. ఈ కొత్త ఫీచర్‌ను ఓపెన్‌ఏఐ గత వారం జీపీటీ-4ఓలో ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఎలాంటి ఎక్స్‌టర్నల్‌ టూల్స్ అవసరం లేకుండా నేరుగా చాట్‌జీపీటీలోనే టెక్ట్స్‌, యూజర్ ఫొటోలు అప్‌లోడ్‌ చేసి బీజ్లీ ఇమేజ్‌లను పొందవచ్చు.ఇదీ చదవండి: భగ్గుమన్న బంగారం.. ఒకేరోజు భారీగా పెరిగిన ధరఇప్పటికే చాలామంది యూజర్లు తమ సెల్ఫీలు, పెంపుడు జంతువులు, కుటుంబ చిత్రాలు.. చాట్‌జీపీటీలో అప్‌లోడ్‌ చేసి జీబ్లీ ఫొటోలను పొందుతున్నారు. వాటిని తమకు చెందిన వివిధ సామాజిక మాధ్యమ ఖాతాల్లో షేర్‌ చేస్తున్నారు. జీబ్లీ ఇమేజ్‌ క్రియేట్‌ చేసేందుకు అనువైన మౌలిక సదుపాయాలు కావాల్సి ఉంటుంది. దీనివల్ల భారీగా జీపీయూ(గ్రాఫిక్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌) కరిగిపోతుంది. దీనిపై కొంత ఆందోళనలు వ్యక్తమవుతున్నా కొత్త ఫీచర్‌ను సులభంగా ఉపయోగించాలని ఆల్ట్‌మన్‌ వినియోగదారులను కోరారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement