Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

India And Pakistan War Updates1
IndiavsPak: ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలి: కేంద్రం

ముందుజాగ్రత్తగా సరిహద్దు రాష్ట్రాల్లో పలుచోట్ల కరెంటు సరఫరా నిలిపేసి బ్లాకౌట్‌ పాటించారు. అయితే శనివారం అర్ధరాత్రికల్లా పాక్‌ వెనక్కు తగ్గిందని, నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు దాదాపుగా ఆగిపోయాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.పాకిస్తాన్‌ దుర్మార్గ వైఖరిపై భారత్‌ ఆ‍గ్రహం ⇒ పాకిస్తాన్‌ ఫేక్‌ ప్రచారం నమ్మొద్దు... భారత సైనిక స్థావరాలు, క్షిపణి ‍వ్యవస్థలు సురక్షితంగా ఉన్నాయి... విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ స్పష్టీకరణ ⇒ భారత్‌-పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఆగని కాల్పుల మోత... పాక్‌ సైన్యం దాడిలో జమ్మూకశ్మీర్‌లో ఆరుగురి మృతి ⇒ భారత సైన్యం దాడుల్లో ఐదుగురు మోస్ట్‌ వాంటెడ్‌ పాకిస్తాన్‌ ఉగ్రవాదులు హతంశనివారం రాత్రి శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌ ప్రాంతంలో పాకిస్తాన్‌ డ్రోన్లను నిర్వీర్యం చేస్తున్న భారత గగనతల రక్షణ వ్యవస్థ జమ్మూ బారాముల్లా, శ్రనగర్‌ టార్గెట్‌గా పాక్‌ డ్రోన్ల దాడులుపంజాబ్‌లోని పలు జిల్లాల్లో బ్లాకౌట్‌ ప్రకటించిన సైన్యంజమ్మూకశ్మీర్‌, రాజస్తాన్‌, గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో బ్లాకౌట్‌గుజరాత్‌లోని కచ్‌లో పూరిస్థాయిలో బ్లాకౌట్‌డ్రోన్లు కనిపిస్తే కూల్చేసేలా BSFకు ఆదేశాలుశ్రీనగర్‌లోని ఆర్మీ చినార్‌ కోర్స్‌లో హెడ్‌క్వార్టర్‌ లక్ష్యంగా పాక్‌ డ్రోన్‌ దాడులుతదుపరి ఆదేశాలు వచ్చేవరకు పలు ప్రాంతాల్లో బ్లాకౌట్‌ విదించాలని ఆదేశాలుపాక్‌ కవ్వింపు చర్యలకు దిగితే ధీటుగా బదులివ్వాలంటూ సైనికులకు విదేశాంగ శాఖ ఆదేశంఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలంటూ కేంద్రం ఆదేశించిందిపరిస్థితులను బట్టి రక్షణ బలగాలు ధీటుగా స్పందిస్తాయికాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో పాక్‌పై విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి ఫైర్‌ అయ్యారు. DGMOల స్థాయిలో జరిగిన కాల్పుల విరమణ అవగాహనను ఉల్లంఘిస్తున్నారు. దీన్ని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాకిస్తాన్‌దే పూర్తి బాధ్యత. ఈ ఉల్లంఘన పై తగిన దర్యాప్తు జరపాలి. ఈ అతిక్రమణ నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. పాక్‌ జరిపిన ఈ చర్యకు భారత్‌ గట్టి సమాదానం చెప్తుంది. సరిహద్దు పొడవునా పాక్‌ దాడులకు తెగబడింది. LOC దగ్గర పాక్‌ కాల్పులు జరిపింది. దాన్ని భారత ఆర్మీ తిప్పి కొడుతోంది. పాక్‌ సైనికులు కాల్పులు జరపకుండా పాకిస్తాన్‌ చర్యలు తీసుకోవాలి. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం అన్నారు విక్రమ్ మిస్త్రి.ఇండియా పాకిస్తాన్ DGMOల మధ్య చర్చలుకాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో చర్చిస్తున్న మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్సీజ్‌ఫైర్‌ ఇక లేనట్లే.. కశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లామళ్లీ పాక్ బరితెగించింది. ఒకవైపు కాల్పుల విరమణ అంటూనే మళ్లీ భారత్ పై కాల్పులకు తెగబడుతోంది. శ్రీనగర్ లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. మూడు గంటల్లోనే పాక్ కాల్పుల విరమణ అంశాన్ని పక్కన పెట్టింది. జమ్మూ కశ్మీర్ లో మళ్లీ భారీ శబ్దాలు వినబడుతున్నాయంటూ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేయడంతో పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించిన విషయం బహిర్గతమైంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ ఆర్మీ ధిక్కరించినట్లు కనబడుతోంది. పాక్‌ కాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ ఎస్‌ఐ ఇంతియాజ్‌ వీర మరణంమళ్లీ వక్రబుద్ధిని చూపించిన పాకిస్తాన్‌సరిహద్దు నగరాలపై పాక్ మళ్లీ కాల్పులుడ్రోన్లు కనిపిస్తే కూల్చేయాలని బీఎస్ఎఫ్ కు ఆదేశాలుజమ్మూ కశ్మీర్‌లో ఏం జరుగుతోందంటూ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ట్వీట్‌మళ్లీ కాల్పుల శబ్దాలు వినబడుతున్నాయిభారీ శబ్దాలు వినపడుతున్నాయని ఒమర్‌ అబ్దుల్లా ట్వీట్‌శ్రీనగర్ లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలుపాక్‌ కాల్పుల నేపథ్యంలో శ్రీనగర్ లో బ్లాక్‌ అవుట్‌3 గంట్లల్లోనే పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనభారత్ పై మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్‌శ్రీనగర్ లో నాలుగు ప్రాంతాల్లో కాల్పుల శబ్దాలుఅఖ్నూర్‌, రాజౌరి, పూంచ్‌ సెక్టార్‌ లో కాల్పులుపాక్‌ కాల్పులను తిప్పికొడుతున్న భారత సైన్యంరాజస్థాన్‌ సరిహద్దుల్లో కొన్ని ప్రాంతాల్లో బ్లాక్‌ అవుట్‌జమ్మూ కశ్మీర్‌ లో పలు ప్రాంతాల్లో బ్లాక్‌ అవుట్‌

TDP Coalition Govt Police Over Action On YSRCP Leader Vidadala Rajini2
రెడ్‌బుక్‌ అండతో ‘ఖాకీ’ కావరం.. 'కారు లోంచి లాగి.. తోసేసి'..

చిలకలూరిపేట: పాలకులు రెడ్‌బుక్‌ మంత్రం జపిస్తుంటే కొంత మంది పోలీసు అధికారులు అందుకు వంత పాడుతూ సభ్యత సంస్కారాలు మరచి నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి, బీసీ నేత, వైఎస్సార్‌సీపీ నాయకురాలు అని కూడా చూడకుండా విడదల రజిని పట్ల చిలకలూరిపేట రూరల్‌ సీఐ సుబ్బనాయుడు రెచ్చిపోయి అనుచితంగా ప్రవర్తించారు. ఎక్కువగా మాట్లాడితే నీపైనా కేసు పెడతానంటూ బెదిరించారు. చెబుతుంటే అర్థం కావడం లేదా.. పక్కకు తప్పుకోండంటూ హూంకరించారు. ఓ దశలో రజినిని కారులోంచి పక్కకు లాగి తోసేసి.. ఆయన కారు­లోకి ఎక్కారు. నడిరోడ్డుపై సీఐ బరితెగింపు చూసి ప్రజలు విస్తుపోయారు. చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం జంగాలపల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత, గ్రామ సర్పంచ్‌ బత్తుల సీతారామిరెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడితే ఆయనను పరామర్శించేందుకు శనివారం మధ్యాహ్నం విడదల రజిని ఆయన నివాసానికి వెళ్లారు. ఆయన ఇంట్లో నుంచి బయటకు రాగానే.. చిలకలూరిపేట రూరల్‌ సీఐ బి.సుబ్బానాయుడు, నాదెండ్ల ఎస్‌ఐ పుల్లారావు, పోలీసు సిబ్బంది ఆమె కారును చుట్టుముట్టారు. తన కారు వద్ద ఎందుకు హడావుడి చేస్తున్నారంటూ ఆమె రూరల్‌ సీఐని ప్రశ్నించారు. మీ అనుచరుడు మానుకొండ శ్రీకాంత్‌రెడ్డిపై కేసులు ఉన్నాయని, అతన్ని అరెస్టు చేయడానికి వచ్చామని సీఐ బదులిచ్చారు. ఎఫ్‌ఐఆర్‌ లేదా అరెస్టు వారంట్‌ను చూపాలని రజనీ కోరగా.. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ సీఐ దురుసుగా మాట్లాడారు. దీంతో ఆమె తన కారులోకి ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేయగా, సీఐ వెంటనే ఆమెను కారులో నుంచి దురుసుగా బయటకు లాగారు. కారులోకి ఎక్కి శ్రీకాంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో.. ‘సీఐ గారూ.. ఏమిటీ దురుసు ప్రవర్తన.. ఎఫ్‌ఐఆర్‌ లేదా ఇతర ఆధారాలు చూపి అరెస్టు చేయండి’ అని విడదల రజినీ కోరగా.. సీఐ మరింత రెచ్చిపోయి పక్కకు తప్పుకోవాలని హూంకరించారు. ‘చెబుతుంటే అర్థం కావడం లేదా.. ఎక్కువ మాట్లాడితే నా విధులకు ఆటంకం కల్పించినందుకు నీపై కూడా కేసు పెడతా’ అని బెదిరించారు. ఆమెను పక్కకు నెట్టివేసి శ్రీకాంత్‌రెడ్డిని తీసుకెళ్లిపోయారు. అనంతరం శ్రీకాంత్‌రెడ్డిని ప్రకాశం జిల్లా వైపు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ ఘటనపై రూరల్‌ సీఐ సుబ్బానాయడును వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు. న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా.. రాష్ట్రంలో మహిళ పట్ల టీడీపీ కూటమి ప్రభుత్వ అరాచకాలు శృతిమించుతున్నాయి. సభ్యతా సంస్కారాలు మరిచి పోలీసులు వారి పట్ల సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరులో రాత్రిపూట నైటీలో ఉన్న ఎస్సీ మహిళా ఎంపీటీసీ సభ్యురాలు వి.కల్పనను విచక్షణ మరచి అరెస్ట్‌ చేశారు. రెండు నిమిషాల్లో చీర కట్టుకుని వస్తానన్నా కూడా వినిపించుకోకుండా నైటీ మీదుగానే జీప్‌ ఎక్కించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇలాంటి ఘటనలు టీడీపీ కూటమి ప్రభుత్వ రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతున్న తీరుకు అద్దం పడుతున్నాయి. ఉన్నత న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా పోలీసుల తీరులో మార్పు రాకపోవడం దారుణం అని ప్రజలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వ పెద్దల అండ చూసుకుని రెచ్చిపోతే మునుముందు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయాన్ని కొందరు పోలీసులు మరచిపోయి వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.

Sakshi Editorial On India Pakistan3
విరమణ సరే, విధానం సంగతి!

భారత్‌ – పాకిస్తాన్‌ల మధ్య వివాదాలన్నీ ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలనేది చాలా కాలంగా భారత్‌ అనుసరిస్తున్న స్థిరమైన విధానం. కశ్మీర్‌ అంశాన్ని తొలి రోజుల్లో ఐక్యరాజ్యసమితి వద్దకు తీసుకుపోవడం వలన నష్టం జరిగిందనే అభిప్రాయం ఇండియాకు ఏర్పడింది. పాక్, భారత్‌ల మధ్య రెండు కీలకమైన ఒప్పందాలున్నాయి. 1972 నాటి సిమ్లా ఒప్పందం, 1999లో ప్రకటించిన లాహోర్‌ డిక్లరేషన్‌. రెండు దేశాల నడుమ ఏ వివాదం తలెత్తినా ఈ రెండు ఒప్పందాల పరిధిలో, ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్‌ చాలా కాలంగా దృఢమైన వైఖరితో ఉండేది. మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని భారత్‌ ఏనాడూ అంగీకరించలేదు.ఇందుకు భిన్నంగా రెండు దేశాల వివాదంలో ఇప్పుడు మూడో పక్షం తలదూర్చిందా? కాల్పుల విరమణకు భారత్, పాకిస్తాన్‌ దేశాలు అంగీకరించాయనీ, ఇది వెంటనే అమల్లోకి వస్తుందనీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సోషల్‌ మీడియా వేదికగా సాయంత్రం 5.30కి ప్రకటించారు. అమెరికా మధ్య వర్తిత్వం వహించి, రాత్రంతా చర్చలు జరిపిన ఫలితంగా ఈ ఒప్పందం సాధ్యమైందని కూడా ఆయన వెల్లడించారు. కామన్‌ సెన్స్‌నూ, తెలివిడినీ ఉపయోగించినందుకు రెండు దేశాలనూ ఆయన అభినందించారు.ఆ తర్వాత అరగంటకు విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ మీడియాతో మాట్లాడారు. కాల్పుల విరమణకు రెండు దేశాలూ అంగీకరించాయని ఆయన ధ్రువీకరించారు. సాయంత్రం ఐదు గంటలకే అమల్లోకి వచ్చినట్టు చెప్పారు. అయితే ఆయన ట్రంప్‌ ట్వీట్‌ ప్రస్తావన గానీ, అమెరికా మధ్యవర్తిత్వం గురించి గానీ మాట్లాడలేదు. ఈరోజు మధ్యాహ్నం 3:30కు పాకిస్తాన్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌ (డీజీఎంవో), ఇండియా డీజీఎంవోకు ఫోన్‌ చేశారు. కాల్పుల విరమణకు ప్రతిపాదించారు. ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిందని మిస్రీ చెప్పారు.మూడో పక్షం జోక్యం లేకుండానే ఇరు దేశాలూ ఒప్పందానికి వచ్చాయనే విధంగానే ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత ట్వీట్‌ చేసిన విదేశాంగ మంత్రి జైశంకర్‌ కూడా రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంగానే దీన్ని అభివర్ణించారు. రేపు సోమవారం నాడు రెండు దేశాల మధ్య చర్చలు జరగబోతు న్నాయని అధికారిక ప్రకటన వెలువడింది. రెండు దేశాల డీజీఎంవోలు మాట్లాడుకోవడానికి ముందు నుంచే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో రెండు దేశాల ముఖ్య నేతలతో మాట్లాడుతున్నట్టుగా వార్తలు వెలువడ్డాయి.ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా నిర్వహించిన పాత్రేమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉద్రిక్తతల సడలింపునకు కాల్పులు విరమణ పాటించాలని స్నేహపూర్వక సలహా మాత్రమే రెండు దేశాలకు ఇచ్చిందా? లేక చర్చల ప్రాతిపదికను తయారు చేసే మధ్యవర్తిత్వ పాత్ర పోషించిందా? ఒకవేళ మధ్యవర్తిగానే చర్చల ప్రాతిపదికను కూడా సిద్ధం చేసి ఉంటే దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో ఒక కీలకమైన మార్పు వచ్చినట్టే భావించాయుద్ధం అమానుషమై నది. అనాగరికమైనది. యుద్ధం కారణంగా దేశాలు, ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. యుద్ధ ప్రమాదాన్ని నివారించడం వివేకవంతమైన చర్యే! కాల్పుల విరమణ ఆహ్వానించదగ్గదే! అయితే ఈ విరమణ వల్ల దేశం సాధించేది ఏమిటి? పోగొట్టుకునేదేమిటనే విశ్లేషణ కూడా అవసరం. యుద్ధం భారత్‌ ప్రారంభించలేదు. ఉగ్రవాదాన్ని ప్రయోగించి పాకిస్తానే కయ్యానికి కాలు దువ్వింది. బదులుగా పాక్‌లోని ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే భారత్‌ దాడులు చేసింది. నూరు శాతం కచ్చితత్వంతో చేసిన ఈ దాడులు పదును దేలిన భారత రణ వ్యూహానికీ, అద్భుతమైన సైనిక పాటవానికీ అద్దం పట్టాయి.భారత దాడులకు పాక్‌ నివ్వెరపోయింది. అధీన రేఖ వెంబడి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడింది. జనావాసాలను టార్గెట్‌గా చేసుకొని దాడులకు దిగింది. ప్రాణనష్టం, ఆస్తి నష్టం భారీగానే జరిగినట్టు కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా పరోక్షంగా అంగీకరించారు. మిగిలిన సరిహద్దు రాష్ట్రాల కంటే జమ్మూకశ్మీర్‌ ఈ దారుణాన్ని ఎక్కువగా భరించవలసి వచ్చింది. పసిపిల్లలతో సహా సాధారణ ప్రజలను బలి తీసుకుంటున్న మహమ్మారి యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని కశ్మీర్‌ ప్రతిపక్ష నేత మెహబూబా ముఫ్తీ కన్నీళ్ళతో వేడుకున్నారు.యుద్ధాలను వేగిరపడి ప్రారంభించడం కాకుండా పూర్తి ప్రణాళికను రచించుకొని మొదలుపెట్టాలనీ, వీలైనంత వేగంగా ముగించాలనీ, శత్రువు ప్రతిఘటనా శక్తిని దెబ్బకొట్టి పోరాడకుండానే యుద్ధాలను గెలిచే మార్గాలను అన్వేషించాలనీ సన్‌షూ తన యుద్ధతంత్ర గ్రంథమైన ‘ఆర్ట్‌ ఆఫ్‌ వార్‌’లో చెబుతాడు. ఈ నాలుగు రోజుల భారత దాడుల్లో సన్‌షూ చెప్పిన ‘ఆర్ట్‌ ఆఫ్‌ వార్‌’ కనిపించింది. ఉగ్రవాద స్థావరాలపై గురి తప్పకుండా, సరిహద్దులు దాటకుండా దాడి చేయడం, పలువురిని మట్టు పెట్టడంతోనే భారత్‌ సగం యుద్ధాన్ని గెలిచింది. పాక్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ను ధ్వంసం చేయడం, ఎనిమిది కీలకమైన ఎయిర్‌ బేస్‌లను దెబ్బతీయటం, బాలిస్టిక్‌ మిసైల్‌ను గాల్లోనే పేల్చేయడంతో పాకిస్తాన్‌ దాదాపుగా చేతు లెత్తేసింది.ఈ దశలోనే పాక్‌ నేతలు అమెరికా శరణు కోరి ఉంటారనీ, అవమానకరమైన ఓటమి నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేసి ఉంటారనీ అంచనాలు వెలువడుతున్నాయి. అమెరికా జోక్యం చేసుకున్న విషయం యథార్థం. అది ఏ మేరకు అన్నది తేలవలసి ఉన్నది. సాధారణ ప్రజలపై మారణ హోమం చేయడం తప్ప పాకిస్తాన్‌ సాధించిందేమీ లేదు. భారత్‌ సాధించిన ఈ వేగవంతమైన విజయం రేపు జరిగే చర్చల్లో ప్రభావవంతమైన పాత్రను పోషించాలి. భారత్‌ కోరుతున్న విధంగా ఉగ్ర హంతకులకు స్థావరం లేకుండా చేస్తామని అంగీకరించాలి. భారత్‌లో నేరాలకు పాల్పడిన ఉగ్రవాదులను అప్పగించడానికి అంగీకరించాలి. భారత కశ్మీర్‌లో వేలు పెట్టబోమని అంగీ కరించే విధంగా పాక్‌పై ఒత్తిడి తేవాలి. సింధూనదీ జలాల ఒప్పందం నిలిపివేత విషయంలో పునఃసమీక్షకు అంగీకరించరాదు. అప్పుడే ఇది విజేత షరతుల మేరకు జరిగే ద్వైపాక్షిక చర్చలుగా పరిగణించవలసి ఉంటుంది. లేకుంటే మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోమన్న చారిత్రక విధానానికి వీడ్కోలు పలికినట్లవుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో కొసమెరుపు ఏమిటంటే... కాల్పుల విరమణ ప్రకటించిన మూడు గంటల తర్వాత సరిహద్దుల వెంబటి పాకిస్తాన్‌ ఆర్మీ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు వార్తలు వస్తున్నాయి. భారత భూభాగంపై కాల్పులు జరుపుతున్నాయి. ఇది పాకిస్తాన్‌ రాజకీయ నాయకత్వానికీ, ఆర్మీ నాయకత్వానికీ మధ్య సమన్వయ లోపమా? లేక రేపటి చర్చల్లో బేరమాడేందుకు తమ శక్తిని పెంచు కోవడానికి ఆ దేశం ఆడుతున్న నాటకమా? అదీ త్వరలోనే తేలుతుంది.వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com

Weekly Horoscope In Telugu From 11-05-2025 To 17-05-20254
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం...పనులలో ప్రతిష్ఠంభన తొలగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సమాజసేవలో భాగస్వాములవుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు కొంతమేర తీరతాయి. నిరుద్యోగుల ఎదురుచూపులు ఫలిస్తాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగి ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన ఆదాయం సమకూర్చుకుంటారు. రాజకీయవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. ఎరుపు, గులాబీ రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.వృషభం...చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలు తీరతాయి. ఆప్తుల సహాయసహకారాలు తీసుకుంటారు. మీ ఖ్యాతి మరింత పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగి ఊరట చెందుతారు. కొన్ని ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహ, ఉద్యోగయత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుని మిత్రులను ఆశ్చర్యపరుస్తారు. పారిశ్రామికవర్గాలకు భాగస్వాముల నుంచి సమస్యలు తీరతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. తెలుపు, ఆకుపచ్చ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.మిథునం...ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. కోర్టు వివాదాల నుంచి కొంత బయటపడతారు. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు,భూములు కొనుగోలు చేస్తారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఏ మాత్రం అలసత్వం చూపక బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవర్గాలకు ముఖ్య సమాచారం అందుతుంది. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. బంధువులతో విభేదాలు. గులాబీ, తెలుపు రంగులు. పంచముఖ ఆంజనేయ స్తోత్రాలు పఠించండి.కర్కాటకం...అనుకున్న పనులు తక్షణం పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు పరిష్కారమవుతాయి. ఆలోచనలు కలసివచ్చి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. వ్యాపారాలు మరింత సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు కొంత మేరకు తగ్గవచ్చు. రాజకీయవర్గాలకు ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువులతో విభేదాలు. ఎరుపు, నేరేడు రంగులు. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.సింహం....ఏ పని ప్రారంభించినా వెనుకడుగు వేయకుండా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసం, నమ్మకమే మీ ఆయుధాలుగా నిలుస్తాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. గతంలో చేజారిన కొన్ని డాక్యుమెంట్లు అనుకోని విధంగా లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మరింత ఆశాజనకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఆందోళన తొలగి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. పారిశ్రామికవర్గాలకు లక్ష్యాలు నెరవేరతాయి. వారం మధ్యలో ధనవ్యయం. బంధువులతో తగాదాలు. నీలం, నేరేడు రంగులు. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.కన్య...కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కొత్త వ్యక్తుల పరిచయం. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుకుని సఖ్యత నెలకొంటుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి.స్థిరాస్తి వివాదాల నుంచి కొంత గట్టెక్కుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. అనుకున్న పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు, సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. వ్యాపారాలు విస్తరించే దిశగా అడుగులు వేస్తారు. ఉద్యోగాలలో ప్రశాంతత చేకూరుతుంది. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. పసుపు, నేరేడు రంగులు. కాలభైరవాష్టకం పఠించండి.తుల....పనుల్లో అవాంతరాలు అధిగమించి పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆస్తుల వ్యవహారాలలో సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడి ఊరట చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఎటువంటి బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ధనవ్యయం. పసుపు, ఆకుపచ్చ రంగులు. దేవీస్తోత్రాలు పఠించండి.వృశ్చికం...నూతనోత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. ప్రత్యర్థులను అనుకూలురుగా మార్చుకుంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. ఒక సంఘటనకు ఆకర్షితులవుతారు. కొన్ని వివాదాలు సోదరుల సహాయంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు గతం కంటే కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకున్న పోస్టులు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు ఆశాజనకంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు.హయగ్రీవస్తోత్రాలు పఠించండి.ధనుస్సు...అనుకున్న పనులు కొంత నిదానంగా సాగినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రుల నుంచి శుభవర్తమానాలు అందుకుంటారు. స్థిరాస్తి విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు క్రమేపీ అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు పుంజుకుంటాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసే వీలుంది. విద్యార్థులకు కొంత అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారాలు ఆశించిరీతిలో కొనసాగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పరిస్థితులు చక్కబడతాయి. కళారంగం వారికి మరింత ఉత్సాహవంతంగా గడిచిపోతుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం.ఆరోగ్యం మందగిస్తుంది. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.మకరం...ఆర్థికంగా కొంత ఇబ్బంది పడతారు. అయితే ఏదోవిధంగా కొంత సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు. ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు తొలగి ముందడుగు వేస్తారు. స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు అధిగమిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. బంధువులు, మిత్రులతో స్వల్ప విభేదాలు నెలకొంటాయి. నిర్ణయాలు సైతం మార్చుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాజకీయవర్గాలకు కొంత నిరాశాజనకంగా ఉంటుంది. వారం చివరిలో శుభవార్తలు. ఆహ్వానాలు అందుతాయి. ఆకుపచ్చ, నీలం రంగులు. కనకధారాస్తోత్రాలు పఠించండి.కుంభం...కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. బంధువుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. సంఘ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలలో ముందడుగు వేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగి పెట్టుబడులు సైతం అందుకుంటారు. ఉద్యోగాలలో క్లిష్టసమస్యలు తీరి ఊరట లభిస్తుంది. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, పసుపు రంగులు. శివాష్టకం పఠించండి.మీనం...కొన్ని సమస్యలు ఎట్టకేలకు పరిష్కారమవుతాయి. అనుకున్న పనులు కొంత నిదానించినా పూర్తి చేస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణాలు తీరుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. స్వల్ప అనారోగ్యం. చివరి నిమిషంలో కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలబాటలో పయనిస్తారు. ఉద్యోగాలలో మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో కుటుంబసభ్యులతో విభేదాలు. ధనవ్యయం. గులాబీ, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి.

Pakistan air defence system destroyed by India5
పాక్‌ రెక్కలు కత్తిరించాం

యుద్ధ విరమణకు కొద్ది గంటల ముందు దాయాదికి మన సైన్యం ఘనంగా లాస్ట్‌ పంచ్‌ ఇచ్చింది. ఏకంగా ఆరు కీలక పాకిస్తానీ వైమానిక స్థావరాలను నేలమట్టం చేసింది. వాటితో పాటు మరో రెండుచోట్ల రాడార్‌ వ్యవస్థలను కూడా ధ్వంసం చేసింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక వాటిపై అత్యంత కచ్చితత్వంతో కూడిన వైమానిక దాడులతో పాక్‌కు కోలుకోలేని నష్టం మిగిల్చింది. అత్యాధునిక వైమానిక స్థావరాలతో సహా పాక్‌లో ఏ ప్రాంతమూ సురక్షితం కాదని మరోసారి రుజువు చేసింది. ఎనిమిది కీలక సైనిక స్థావరాలపై జరిగిన దాడుల్లో ఏ ఒక్కదాన్నీ పాక్‌ సైన్యం కనీస స్థాయిలో కూడా అడ్డుకోలేకపోయింది. దీనిపై సోషల్‌ మీడియాలో మీమ్స్‌ వెల్లువెత్తుతున్నాయి. తమ దేశ భద్రత అక్షరాలా గాల్లో దీపమేనని మరోసారి తేలిపోయిందని పాక్‌ పౌరులు కూడా వాపోతున్నారు. సామాన్యులను వేధించడానికే తప్ప యుద్ధానికి తమ సైన్యం పనికిరాదంటూ అక్కడి నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సైన్యం కదలికలను అడ్డుకునేందుకే?పాక్‌కు చెందిన కీలక వైమానిక స్థావరాలపై భారత్‌ భారీ స్థాయిలో దాడికి వెనక ప్రబల కారణాలే ఉన్నట్టు చెబుతున్నారు. శనివారం ఉదయం నుంచే తన సైన్యాన్ని వీలైనంతగా భారత సరిహద్దులకు తరలించేందుకు పాక్‌ సిద్ధమైందని నిఘా వర్గాలు కేంద్రానికి సమాచారమిచ్చాయి. దాంతో ఉద్రిక్తతలను మరింత పెంచేందుకే పాక్‌ నిర్ణయించుకుందని స్పష్టమైపోయింది. దాంతో సైనిక తరలింపులను అడ్డుకోవడమే లక్ష్యంగా అప్పటికప్పుడు వైమానిక స్థావరాలను మన బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయి. అత్యాధునిక దీర్ఘశ్రేణి క్షిపణులు వాటిని గురి తప్పకుండా ఢీకొట్టి శిథిలాల దిబ్బలుగా మార్చేశాయి. తద్వారా పదాతి దళానికి అతి కీలకమైన వైమానిక దన్ను అందకుండా చేశాయి. అంతేగాక పాక్‌ యుద్ధ సన్నద్ధతపైనే చావుదెబ్బ కొట్టాయి. ‘‘ఈ పరిణామం వల్లే మరో గత్యంతరం లేక పాక్‌ కాళ్ల బేరానికి వచ్చింది. సాయంత్రానికల్లా కాల్పుల విరమణకు ఒప్పుకుంది’’ అని రక్షణ నిపుణులు చెబుతున్నారు.వైమానిక స్థావరాలుచకాలానూర్‌ ఖాన్‌ ఎయిర్‌బేస్‌గా పిలుస్తారు. పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో రావల్పిండిలో ఆ దేశ సైనిక ప్రధాన కార్యాలయానికి ఆనుకుని ఉంటుంది. ఆ దేశానికి అత్యంత కీలకమైన వైమానిక స్థావరమిది. వాయుసేన కార్యకలాపాలతో పాటు వీఐపీల రవాణా తదితరాలు కూడా ఇక్కడినుంచే కొనసాగుతాయి. ప్రధాని తదితర అత్యున్నత స్థాయి రాజకీయ నాయకులు, అత్యున్నత సైనికాధికారుల ప్రయాణాలకు ఉపయోగించే ఆధునిక విమానాలకు ఇది విడిది కేంద్రం. సీ–130, ఐఎల్‌–78 విమానాలకు స్థావరం. పాక్‌ ఎయిర్‌ మొబిలిటీ కమాండ్‌కు ప్రధాన కేంద్రం కూడా. భారత్‌తో 1965, 1971 యుద్ధాల్లో ఈ బేస్‌ అత్యంత కీలక పాత్ర పోషించింది. భారత్‌పై జరిపిన డ్రోన్‌ దాడులను ఇక్కడినుంచే పర్యవేక్షించారు. సైనిక విమానాల ఏరియల్‌ రీ ఫ్యూయలింగ్, రవాణా తదితర కార్యకలాపాలకు ఇది ప్రధాన బేస్‌. పాక్‌ వైమానిక దళానికి చెందిన ఆరు అత్యాధునిక ట్రాన్స్‌పోర్ట్‌ స్క్వాడ్రన్లకు అడ్డా. అంతేగాక ఎయిర్‌ఫోర్స్‌లో చేరేవారికి పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చే పాక్‌ వైమానిక దళ (పీఏఎఫ్‌) కాలేజీ కూడా ఇక్కడే ఉంది. అంతేగాక పాక్‌ వైమానిక దళానికి అతి కీలకమైన ఎయిర్‌బార్న్‌ అర్లీ వార్నింగ్‌ అండ్‌ కంట్రోల్‌ (ఏఈడబ్ల్యూఈ) ‘సాబ్‌ ఎరీఐ’ వ్యవస్థకు కేంద్రం. కనుక చకాలా బేస్‌ అత్యాధునిక రక్షణ వలయం నడుమ ఉంటుంది. అంత కీలకమైన ఎయిర్‌బేస్‌పైనే మన వైమానిక దళం భారీ ఎత్తున దాడి చేసి ధ్వంసం చేసింది. తద్వారా పాక్‌లో ఏ సైనిక స్థావరం కూడా సురక్షితం కాదని దాయాదికి స్పష్టమైన సందేశమిచ్చింది.రఫీకీపంజాబ్‌ ప్రావిన్స్‌లో జాంగ్‌ జిల్లాలోని షోర్‌కోట్‌లో ఇస్లామాబాద్‌కు 330 కి.మీ. దూరంలో ఉంటుంది. తొలుత షోర్‌కోట్‌ బేస్‌గా పిలిచేవారు. తర్వాత 1965 యుద్ధంలో మరణించిన స్క్వాడ్రన్‌ లీడర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ రఫీకీ పేరు పెట్టారు. చైనా నుంచి పాక్‌ కొనుగోలు చేసిన జేఎఫ్‌–17, మిరాజ్‌ వంటి అత్యాధునిక ఫైటర్‌ జెట్లు ఉండేదిక్కడే. వీటితోపాటు రవాణా తదితర అవసరాలకు వాడే సైనిక హెలికాప్టర్లకు కూడా రఫీకీ ఎయిర్‌బేస్‌ ప్రధాన కేంద్రం. ఇది సెంట్రల్‌ పంజాబ్‌లో అత్యంత వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. 10 వేల అడుగుల పొడవైన రన్‌వే, దానికి సమాంతరంగా ట్యాక్సీవే దీని ప్రత్యేకతలు. దాంతో ఇక్కడి యుద్ధ విమానాలు భారత సరిహద్దులపై దాడులకు అతి తక్కువ సమయంలో సన్నద్ధం కాగలవు. పాకిస్తాన్‌ రక్షణ నెట్‌వర్క్‌లో అతి కీలకమైన భాగమిది.మురీద్‌చక్వాల్‌ జిల్లాలో ఉన్న వైమానిక స్థావరం. పలు వైమానిక స్క్వాడ్రన్లకు కూడా నిలయం. దేశీయ షాపర్‌–1, తుర్కియే నుంచి తెచ్చుకున్న బైరక్తర్‌ టీబీ2, అకిన్సీ డ్రోన్లతో పాటు మానవ రహిత విమానాలు/యుద్ధ విమానాలు (యూఏవీ/యూసీఏవీ) తదితరాలకు కూడా ఇదే కేంద్రం. మూడు రోజులుగా భారత్‌పై జరిగిన దాడుల్లో కీలక పాత్ర పోషించింది. మనపైకి దూసుకొచ్చిన డ్రోన్లను ఇక్కడినుంచే ప్రయోగించారు. పాక్‌ డ్రోన్‌ వార్‌ఫేర్‌కు చక్వాల్‌ ప్రధాన కేంద్రంగా మారింది. డ్రోన్ల పర్యవేక్షణ, నిఘా సమాచార సేకరణతో పాటు దాడుల వంటివాటికి కూడా బేస్‌ ఇదే. డ్రోన్ల వాడకంలో సైనిక శిక్షణ కూడా ఇక్కడే ఇస్తుంటారు. మనపై డ్రోన్‌ దాడులకు ప్రతి చర్యగా మురీద్‌ ఎయిర్‌ బేస్‌ను సైన్యం లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసింది. మతిలేని దాడులకు గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది.రహీం యార్‌ఖాన్‌దక్షిణ పంజాబ్‌లో రహీం యార్‌ఖాన్‌ నగరంలోని వైమానిక స్థావరం. రాజస్తాన్‌ సరిహద్దులకు సమీపంలో ఉంటుంది. తూర్పు పాకిస్తాన్‌ మీదుగా మన సరిహద్దులపై దాడులకు అత్యంత అనువుగా ఉంటుంది. రాజస్తాన్‌లోని శ్రీగంగానగర్, జైసల్మేర్‌ వంటి పట్టణాలపై వైమానిక దాడులు ఇక్కడినుంచే జరిగాయి. ఇక్కడినుంచి పౌర విమానాల రాకపోకలు కూడా జరుగుతుంటాయి. మన వైమానిక దాడులతో ఈ బేస్‌తో పాటు ఇక్కడి రన్‌వే కూడా పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది.సుక్కుర్‌భొలారీ ఎయిర్‌బేస్‌గా పిలుస్తారు. సింధ్‌ ప్రావిన్స్‌లో కరాచీ, హైదరాబాద్‌ నడుమ జంషోరో జిల్లాలో ఉంటుంది. పాక్‌కు జీవనాడి వంటి కరాచీ నగర రక్షణను కట్టుదిట్టం చేసే లక్ష్యంతో 2017లో ఈ ఎయిర్‌బేస్‌ను ఏర్పాటు చేశారు. సదరన్‌ ఎయిర్‌ కమాండ్‌ పరిధిలోకి వస్తుంది. ఆపరేషనల్‌ కన్వర్షన్‌ యూనిట్‌ తాలూకు 19 స్క్వాడ్రన్‌కు కేంద్రం. ఎఫ్‌–15ఏ, ఎఫ్‌–16, కొన్ని జేఎఫ్‌–17లతో పాటు ఏడీఎఫ్‌ యుద్ధ విమానాలకు విడిది కేంద్రం. పాక్‌ సైన్యం ఉపరితల ఆపరేషన్లకు అత్యవసరమైన లాజిస్టిక్‌ సపోర్ట్‌ తదితరాల్లో దీనిది కీలకపాత్ర. పాక్‌ వైమానిక స్థావరాలన్నింట్లోనూ అత్యాధునికమైనదిగా దీనికి పేరు. ఇక్కడ ఎస్‌ఏఏబీ 2000 ఎయిర్‌బార్న్‌ అర్లీ వార్నింగ్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టం (ఏఈడబ్ల్యూసీఎస్‌) ఉంది.రాడార్‌ కేంద్రాలుసియాల్‌కోట్‌పంజాబ్‌లోని సియాల్‌కోట్‌ వైమానిక కేంద్రంలో ఉంది. ఇక్కడ ఒక అంతర్జాతీయ విమా నాశ్రయం, మరో సైనిక విమానాశ్రయం ఉన్నాయి. ఇక్కడి రాడార్‌ కేంద్రం వైమానికంగా పాక్‌కు అతి కీలకమైనది. దాన్ని ధ్వంసం చేసిన నేపథ్యంలో ఇక్కడి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పౌర విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.పస్రూర్‌ఇది కూడా పంజాబ్‌లోనే సియాల్‌కోట్‌ జిల్లాలో ఉంది. ఇక్కడి రాడార్‌ కేంద్రాన్ని కూడా మన వైమానిక దళం నేలమట్టం చేసింది.చునియన్‌పంజాబ్‌ ప్రావిన్స్‌లో లాహోర్‌కు 70 కి.మీ. దూరంలో చునియన్‌ వద్ద ఉంటుంది. పాక్‌లోని ప్రాథమిక వైమానిక స్థావరాల్లో ఒకటి.– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Sakshi Guest Column On Fake News in Social Media6
ఫేక్‌ న్యూస్‌తో జాగ్రత్త సుమా!

దేశం యుద్ధ పరిస్థితుల్లో కూరుకుపోయిన సమయంలో శత్రువులు మన ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికీ, తమదే పైచేయి అని చెప్పడానికీ అనేక తప్పుడు వార్తలను ప్రచారం చేశారు. అదే సమయంలో కొందరు భారతీయులూ సోషల్‌ మీడియాలో నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఇష్టమొచ్చినట్లు రాశారు. ఇది మంచి పద్ధతి కాదు. రాజ్యాంగం ఇచ్చిన భావ వ్యక్తీకరణ హక్కును అనుసరించి ప్రతి పౌరుడు తన అభిప్రాయాలను, నమ్మకాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంది. కానీ దాన్ని దుర్వినియోగపరచడం క్షంతవ్యం కాదు. పహెల్‌గామ్‌లో పర్యాటకులను ఉగ్రవాదులు చంపిన నేపథ్యంలో భారత్‌ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్‌పై దౌత్యపరమైన చర్యలు తీసుకుంది. పాక్‌ ప్రభుత్వ అధికారిక ఎక్స్‌ అకౌంట్‌ను భారత్‌లో అందుబాటులో లేకుండా నిలిపి వేసింది. పలువురు పాక్‌ జర్నలిస్టులకు చెందిన ఎక్స్‌ ఖాతాలను కూడా నిషేధించింది. తప్పుడు, రెచ్చ గొట్టే, సున్నితమైన మతపరమైన అంశాల కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నాయని ఆరోపిస్తూ కేంద్రం 16 పాకిస్తాన్‌ యూట్యూబ్‌ చానళ్లపై కూడా నిషేధం విధించింది. ఇందులో పాక్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అఖ్తర్‌కు చెందిన యూట్యూబ్‌ చానల్‌ కూడా ఉంది. హోం శాఖ సిఫారసు మేరకు డాన్‌ న్యూస్, జియో న్యూస్, సమా టీవీ, సునో న్యూస్,ద పాకిస్తాన్‌ రిఫరెన్స్‌ తదితర యూ ట్యూబ్‌ చానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ఆ తర్వాత పాక్‌ రక్షణ మంత్రి ఎక్స్‌ ఖాతాను కూడా నిలిపివేసింది. అలాగే పాక్‌ సినిమాల ప్రదర్శనపైనా నిషే«దం అమలులోకి వచ్చింది. అలాగే భారత్‌లోని అనేక వెబ్‌సైట్లనూ, యూట్యూబ్‌ చానళ్లనూ ప్రభుత్వం బ్లాక్‌ చేసింది. అందులో ‘ద వైర్‌’ న్యూస్‌ పోర్టల్‌ ఒకటి. ఇటువంటి వెబ్‌సైట్‌ను నిషేధిత జాబితాలో చేర్చడం న్యాయం కాదని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా జనరల్‌ సెక్రెటరీ డి.రాజా ఖండించారు. ‘ద వైర్‌’ వంటి వెబ్‌సైట్‌ను నిషేధించవలసిన అవసరం లేదు. ఆ పేరుమీద పత్రికా స్వేచ్ఛను నిలిపివేయడం న్యాయం కాదు. జాతీయ సమగ్రత కోసం పహెల్‌గామ్‌లో ఉగ్రవాదుల చర్యను ఖండించడం మంచిదే కాని, వైర్‌ను నిషేధించడం న్యాయం కాదని ‘ఇంటర్నెట్‌ ఫ్రీడం ఫౌండేషన్‌’ న్యాయవాదీ, ఫౌండర్‌ డైరెక్టర్‌ అయిన అపర్‌ గుప్తా అన్నారు. ఫేక్‌ న్యూస్‌ను ప్రచారం చేయడం పరోక్ష యుద్ధంలో భాగం. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరిలో ఆర్మీ బ్రిగేడ్‌పై సూసైడ్‌ దాడి జరిగినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఏడు వీడియోలు పరిశీలించి అన్నీ అబద్ధాలే అని తేల్చింది. పంజాబ్‌లోని జలంధర్‌పై డ్రోన్‌ దాడి జరిగినట్లు వచ్చిన వార్త కూడా కల్పితమే అని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఓ పాత వీడియోపై కూడా ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) వివరణ ఇచ్చింది. వాస్తవానికి ఆ క్షిపణి దాడి 2020లో లెబనాన్‌లోని బీరూట్‌లో జరిగిన పేలుడు ఘటన అని ప్రభుత్వం పేర్కొన్నది. ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌... ఆర్మీ కంటోన్మెంట్‌పై ఫిదాయీ సూసైడ్‌ దాడి జరగ లేదని చాలా స్పష్టంగా వెల్లడించింది. ఇండియన్‌ ఆర్మీ పోస్టును పాకిస్తానీ దళాలు ధ్వంసం చేసినట్లు ప్రచారం అయిన మరో వీడియో కూడా ఫేక్‌ అని ప్రభుత్వం తేల్చింది. భారతీయ సైన్యంలో 20 రాజ్‌ బెటాలి యన్‌ అనే యూనిట్‌ లేనే లేదని ఫ్యాక్ట్‌ చెక్‌ పేర్కొన్నది. పాకిస్తాన్‌లోని ప్రధాన మీడియాతో పాటు కొందరు సోషల్‌ మీడియాలో భారత ప్రజల్లో భయాందోళనలు కలిగించే లక్ష్యంతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేశారు. ఏది వాస్తవమో, ఏదికాదో తేల్చుకోవలసింది మనమే!మాడభూషి శ్రీధర్‌ వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ‘స్కూల్‌ ఆఫ్‌ లా’ ప్రొఫెసర్‌

Central Govt brakes on Operation Kagar in Karrigutta7
వ్యూహాత్మకమా.. వెనకడుగా!

సాక్షి, హైదరాబాద్‌: ఆపరేషన్‌ కగార్‌ పేరుతో మావోయిస్టుల కీలక స్థావరాల్లోకి దూసుకెళ్లి, గత కొన్ని నెలలుగా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ ఇప్పటివరకు పదుల సంఖ్యలో మావోయిస్టులను మట్టుబెట్టిన కేంద్ర సాయుధ పోలీస్‌ బలగాలు ప్రస్తుతం వెనక్కి తగ్గాయి. తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని కర్రిగుట్టల్లో వేలాది మంది సాయుధ పోలీస్‌ బలగాలతో భారీ సెర్చ్‌ ఆపరేషన్లు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌కు బ్రేక్‌ వేసింది. సీఆర్‌పీఎఫ్‌ బలగాలు వెనక్కి రావాలని కేంద్ర హోంశాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఆదివారం సాయంత్రం (మే 11న)లోపు సరిహద్దు హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇది కేంద్ర బలగాల వ్యూహాత్మక ఎత్తుగడా? లేక మావోయిస్టులు ఇప్పటికే చర్చలకు సిద్ధమని ప్రకటించడం, శాంతి చర్చల కోసం పౌరహక్కుల నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేయడం, ఇందుకు రాజకీయ పార్టీల నుంచి మద్దతు క్రమంగా పెరుగుతుండటంతో కేంద్రం ‘కగార్‌’పై పునరాలోచనలో పడిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అడవుల్లో అణువణువూ గాలిస్తూ.. దేశంలో 2026 మార్చి నాటికి మావోయిస్టులను పూర్తిగా తొలగిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పలు సందర్భాల్లో ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఆపరేషన్‌ కగార్‌ పేరిట కేంద్ర సాయుధ, స్థానిక పోలీసు ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో తెలంగాణ వైపు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలు, ఛత్తీస్‌గఢ్‌ వైపు సుక్మా, బీజాపూర్‌ జిల్లాల్లోని కర్రిగుట్ట అడవులు మావోయిస్టులకు కీలక స్థావరంగా ఉన్నాయని గుర్తించాయి. సీఆర్‌పీఎఫ్, కోబ్రా (కమాండో బెటాలియన్‌ ఫర్‌ రిజల్యూట్‌ యాక్షన్‌), డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ (డీఆర్‌జీ), స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎస్‌టీఎఫ్‌), బస్తర్‌ ఫైటర్స్, ఛత్తీస్‌గఢ్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌ కలిపి సుమారు 24 వేలమంది భద్రతా బలగాలు ఈ ఏడాది ఏప్రిల్‌ నాలుగో వారంలో ఆ ప్రాంతంలో ఆపరేషన్‌ మొదలుపెట్టాయి. డ్రోన్‌ కెమెరాలు, హెలికాప్టర్లు, స్మోక్‌ బాంబులు, ఫ్లాష్‌ బాంబులను వినియోగిస్తూ లోనికి దూసుకెళ్లాయి. మావోయిస్టులు అమర్చిన ల్యాండ్‌మైన్‌లు, బీర్‌ బాటిల్‌ బాంబులు వంటి పేలుడు పదార్థాలను బాంబు స్క్వాడ్‌లు నిర్వీర్యం చేశాయి. ఈ క్రమంలోనే కర్రిగుట్టల్లో ఫార్వర్డ్‌ ఆపరేటింగ్‌ బేస్‌ (ఎఫ్‌ఓబీ) ఏర్పాటుతో పాటు ఐదు బేస్‌ క్యాంపులను స్థాపించారు. మావోయిస్టుల సొరంగాలు, గుహలు ఉన్నట్టుగా గుర్తించాయి. ఏప్రిల్‌ 24 నుంచి మే 7 మధ్య సుమారు 30 మంది మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మరణించారు. ఈ సందర్భంగా పెద్దయెత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను బలగాలు స్వా«దీనం చేసుకున్నాయి. కీలక నేతలు లక్ష్యంగా.. కర్రిగుట్టలు మావోయిస్టు కీలక నేత హిడ్మా ఆ«దీనంలోని మావోయిస్టు స్థావరాలకు కేంద్రంగా ఉన్నాయని భద్రతా బలగాలు గుర్తించాయి. హిడ్మాతో పాటు ఇతర మావోయిస్టు నాయకులైన గణపతి, బసవరాజు, ఆనంద్‌ వంటి వారిని కూడా ఈ ఆపరేషన్‌లో భాగంగా టార్గెట్‌ చేసినట్టు వార్తలు వచ్చాయి. భద్రతాబలగాలు అధికారికంగా ఈ విషయాలు చెప్పనప్పటికీ ఆదే దిశగా ముమ్మరంగా ఆపరేషన్‌ చేపట్టాయి. కానీ కర్రిగుట్టలపై మావోయిస్టులకు పూర్తి పట్టుండడంతో వారు కొన్ని సమయంల్లో బలగాల కంటే వేగంగా కదలగలిగారు. ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకున్నారు. ఈ క్రమంలోనే శాంతి చర్చలు తెరపైకి వచ్చాయి. మరోవైపు మావోయిస్టులను ఏరివేయాలన్న లక్ష్యంతో ముమ్మర ఆపరేషన్లు చేపట్టినా ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడం బలగాలను వెనక్కి రప్పించడానికి మరో కారణంగా చెబుతున్నారు. మావోయిస్టుల వ్యూహం ఫలించిందా? కేంద్ర సాయుధ బలగాలకు చిక్కకుండా మావోయిస్టు అగ్రనాయత్వం తప్పించుకుంటూ సేఫ్‌ షెల్టర్‌ జోన్లకు వెళ్లడంతో పాటు శాంతి చర్చల పేరిట మావోయిస్టులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. కర్రిగుట్టల చుట్టూ ఐఈడీ బాంబులు అమర్చినట్టు ముందుగానే పెద్దయెత్తున ప్రకటనలు జారీ చేసిన మావోయిస్టు పార్టీ.. సాయుధ బలగాల ఆపరేషన్‌ మొదలైన కొద్ది రోజుల్లోనే శాంతి చర్చలకు సిద్ధమంటూ లేఖ విడుదల చేసింది. ఇది రాజకీయంగా ఒత్తిడి తెచ్చేందుకు, మావోయిస్టు అగ్ర నాయత్వం తప్పించుకునిషెల్టర్‌ జోన్లకు వెళ్లేందుకు, ప్రజల మద్దతు పొందేందుకు ఎంచుకున్న ఒక వ్యూహంగా చెబుతున్నారు. శాంతిచర్చలకు వీలుగా తాము ఆరు నెలలపాటు కాల్పుల విరమణ పాటిస్తున్నామని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌ పేరిట ఉన్న ఒక లేఖ సోషల్‌ మీడియాలో విడుదల అయ్యింది. మరోవైపు సీపీఎం, బీఆర్‌ఎస్, తెలంగాణ జన సమితి వంటి పార్టీలు, పౌర హక్కుల సంఘాలు ఆపరేషన్‌ కగార్‌ను నిలిపివేయాలని, శాంతి చర్చలు జరపాలని డిమాండ్‌ చేశాయి. సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సైతం మావోయిస్టులతో చర్చలే ఉత్తమమన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనితో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఒత్తిడి సైతం కేంద్రం సాయుధ బలగాలను వెనక్కి రప్పించేలా చేసిందనే చర్చ జరుగుతోంది.

Chandrababu Govt twists in rationalization of Govt teachers8
మిగులుపై గుబులు!

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్దుబాటు గుబులు రేపుతోంది. పాఠశాలల పునర్‌ వ్యవస్థీకరణ మేరకు బదిలీల ప్రక్రి­య పూర్తి చేసేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. అయితే, గత ప్రభుత్వంలో చేసిన జీవో 117ను రద్దు చేసే ప్రయత్నంలో భాగంగా విడుదల చేసిన పాఠశాలల పునర్‌ వ్యవ­స్థీకరణ నిబంధనలతో రాష్ట్రంలో వేలాది మంది ఉపాధ్యాయులు మిగులు (సర్‌ప్లస్‌) ఏర్పడుతున్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. నిబంధనల మేరకు ప్రస్తుతం ఉపా­ధ్యాయులు పని చేస్తున్న పాఠశాలలోనే ఎని­మిదేళ్ల వరకు పనిచేసే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వ నిలకడలేని కొత్త నిబంధనల­తో మిగులు సమస్య ఏర్పడింది. 2023లో ఉపాధ్యాయ బదిలీల్లో ఈ సమస్య లేదని, జీవో నంబర్‌ 47 ప్రకారం మిగులు ఉపా­ధ్యా­యులకు పాయింట్ల కేటాయింపులో సమన్యాయం పాటించి న్యాయం చేశారని ఉపాధ్యాయులు గుర్తు చేస్తున్నారు. జీవో నంబర్‌ 117 అమల్లో భాగంగా మిగులు ఉపాధ్యాయులకు పాత పాఠశాలలో పనిచేసిన కాలాన్ని, కొత్త పాఠశాలలో పనిచేసిన కాలాన్ని పరిగణనలోకి తీసుకొని (పాత, కొత్త స్టేషన్‌) రేషనలైజేషన్‌ పాయింట్లు కేటాయించారు. కానీ, ఇటీవల విద్యా శాఖ విడుదల చేసిన ఉపాధ్యాయ బదిలీ చట్టం–2025లో అనేక లోపాలు ఉన్నాయని ఉపాధ్యాయులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులు పాత పాఠశాలలో పనిచేసిన కాలానికి ఇచ్చే పాయింట్లు కోరుకుంటే వారికి ప్రస్తుత రేషనలైజేషన్‌ పాయింట్లు ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఈ ప్రక్రియలో ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతున్నట్టు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో చేసిన బదిలీలలో మిగులు ఉపాధ్యాయులకు పాత, కొత్త స్టేషన్ల (పాఠశాల)లో పని చేసిన సర్వీసును పరిగణనలోకి తీసుకుని గరిష్టంగా ఎనిమిదేళ్ల వరకు సర్వీసు పాయింట్లు కేటాయించారు. దీనికి అదనంగా రేషనలైజేషన్‌ పాయింట్లు కూడా ఇచ్చి న్యాయం చేశారు. అంతేగాక సర్‌ప్లస్‌ ఉపాధ్యాయులకు స్పెషల్‌ పాయింట్లు (స్పౌజ్‌ వంటివి) ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో మిగులు ఉపాధ్యాయులకు నష్టం జరగలేదు.ఇప్పుడంతా గందరగోళంజీవో 117 రద్దులో భాగంగా చేపడుతున్న రేషనలైజేషన్‌ ప్రక్రియ తీవ్ర గందరగోళంగా మారింది. పాఠశాలల మెర్జింగ్, సబ్జెక్టు టీచర్ల తొలగింపుతో పాటు ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిని పెంచడంతో దాదాపు 10 వేల మంది స్కూల్‌ అసిస్టెంట్లు మిగులు (సర్‌ ప్లస్‌) ఏర్పడుతున్నారు. విద్యాశాఖ కొత్త నిబంధనలతో సర్‌ ప్లస్‌ అయిన ఈ ఉపాధ్యాయులకు న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఇందులో భాగంగా వారిని ప్రస్తుతం పని చేస్తున్న పాఠశాలల కంటే మెరుగైన స్థానాలకు బదిలీ చేయాలి. కానీ అందుకు విరుద్ధంగా ప్రక్రియ నడుస్తోందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత పాఠశాలలో పని చేసిన కాలానికి ఇచ్చే స్టేషన్‌ పాయింట్లను కోరుకునే వారికి రేషనలైజేషన్‌ పాయింట్లు ఇచ్చేది లేదని ఇప్పటికే విద్యాశాఖ ప్రకటించింది. కొత్త పాఠశాలలో పని చేసిన కాలానికి స్టేషన్‌ పాయింట్లు కోరుకున్న వారికి మాత్రమే రేషనలైజేషన్‌ పాయింట్లు ఇస్తామనడంతో మిగులు టీచర్లకు అన్యాయం జరుగుతోంది. ప్రస్తుతం కొత్త పాఠశాలల్లో రెండు నుంచి నాలుగేళ్ల సర్వీసు గలవారే మిగులుగా మారుతున్నారు. వీరు పాత పాఠశాలలో ఎనిమిది నుంచి పదేళ్ల కాలం పని చేశారు. ప్రస్తుత బదిలీల్లో వీరే నష్టపోతున్నట్టు తెలుస్తోంది. 2023లో ఇచ్చినట్టుగా పాత, కొత్త పాఠశాలల సర్వీసును పరిగణనలోకి తీసుకుని గరిష్టంగా ఎనిమిదేళ్లకు స్టేషన్‌ పాయింట్లు ఇవ్వాలని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్నారు. తమను ప్రభుత్వమే బలవంతంగా బదిలీ చేస్తున్నందున న్యాయం చేయాలని మిగులు ఉపాధ్యాయులు కోరుతున్నారు.ఉపాధ్యాయ చర్చల్లో కొందరికే ప్రాధాన్యంబదిలీలు, పాఠశాలల పునర్‌ వ్యవస్థీకరణపై విద్యా శాఖ గత ఎనిమిది నెలలుగా ప్రతివారం ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరుపుతోంది. అయితే, ఇందులో కేవలం 9 గుర్తింపు సంఘాలకే ప్రాతినిధ్యం కల్పించారు. కీలకమైన 34 రిజిస్టర్డ్‌ ఉపాధ్యాయ సంఘాలను దూరం పెట్టారు. దీంతో రిజిస్టర్డ్‌ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఉపాధ్యాయ సమస్యలపై నిర్వహించే సమావేశాల్లో అందరికీ ప్రాధాన్యం ఇవ్వాలేగానీ, కొందరికి మాత్రమే అవకాశం ఇవ్వడం ఏంటని ఆ సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం సమావేశాల్లో ఐదు నెలల క్రితం ఒకసారి అవకాశం కల్పించారు. తాజాగా శనివారం నిర్వహించిన సమావేశానికి మాత్రమే గుర్తింపు సంఘాల ప్రతినిధులను ఆహ్వానించారు. అయితే, అన్ని ప్రక్రియలూ పూర్తయ్యాక నిర్వహించిన ఈ సమావేశంపై విమర్శలు వెల్లువెత్తాయి.

Opening ceremonies of Miss World competitions were a huge success9
అందం.. ఆత్మవిశ్వాసం

సాక్షి, హైదరాబాద్‌: శనివారం సాయంత్రం.. భాగ్యనగరం గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం.. అందం.. ఆత్మవిశ్వాసం.. అభినయం.. కలిసి కవాతు చేశాయి..ప్రపంచ సుందరి పోటీల ప్రారంభ వేడుకలను సప్తవర్ణ శోభితం చేశాయి. మిస్‌ వరల్డ్‌ 72వ ఎడిషన్‌ పోటీలు హైదరాబాద్‌ కేంద్రంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచం నలుమూలల నుంచి 109 దేశాలకు ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన పోటీదారులైన అందగత్తెలు లయబద్ధమైన పాశ్చాత్య సంగీత హోరుకు తగ్గట్టుగా అభినయిస్తూ తమను తాము పరిచయం చేసుకోగా, ఆయా సుందరీమణుల బృందాన్ని తెలంగాణ సంప్రదాయ కళాకారుల బృందం నర్తిస్తూ వేదిక మీదకు స్వాగతించింది. ఒకవైపు పాశ్చాత్య సంగీతం.. మరోవైపు తెలంగాణ సంప్రదాయ కళా బృందాల విన్యాసం.. వెరసి ఓ జుగల్‌బందీగా ఆహూతులను మంత్ర ముగ్ధులను చేశాయి. దాదాపు రెండున్నర గంటల పాటు కొనసాగిన ప్రపంచ సుందరి పోటీల ప్రారంభ కార్యక్రమం ప్రేక్షకులను ఆసాంతం అలరించింది. జయ జయహే తెలంగాణ ఆలాపనతో.. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో పరిమిత సంఖ్యలో హాజరైన ప్రేక్షకుల మధ్య ప్రపంచ సుందరి పోటీల పరిచయ కార్యక్రమం కొనసాగింది. సాయంత్రం ఆరున్నరకు తెలంగాణ గీతం జయ జయహే తెలంగాణ ఆలాపనతో కార్యక్రమం మొదలైంది. గాయకుడు సంగీత శిక్షకుడు రామాచారి శిష్యులు 50 మంది ఈ గీతాన్ని అద్భుతంగా ఆలపించి ఆకట్టుకున్నారు. ఆ వెంటనే రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాలకు చెందిన సంగీత శిక్షణ కేంద్రాల కళాకారిణులు 250 మంది పేరిణి నృత్య రూపాన్ని ప్రదర్శించారు. ‘హంస నడకలతో అందమే సాగెనే... అరవిరిసిన..’ అంటూ ప్రపంచ సుందరి పోటీలకు సరిపోయే గీతాన్ని ఎంచుకున్న తీరు ఆకట్టుకుంది. దానికి తగ్గట్టుగా కళాకారిణులు నర్తించి పరవశింపజేశారు. అంత పెద్ద సంఖ్యలో కళాకారిణులు స్టేడియం మొత్తం కలిగి తిరుగుతూ నర్తించటం, మధ్యలో సీతాకోకచిలుక, నక్షత్రం, మిస్‌ వరల్డ్‌ లోగో ఆకృతిని ఆవిష్కరించడం అబ్బురపరిచింది. దాదాపు 10 నిమిషాల పాటు సాగిన ఈ నృత్య కార్యక్రమానికి పేరిణి సందీప్‌ నృత్య దర్శకత్వం వహించగా, ఫణి నారాయణ స్వరాలు సమకూర్చారు. ఖండాల వారీగా నాలుగు బృందాలుగా.. ప్రారంభ వేడుకల్లో 109 దేశాల సుందరీమణులు పాల్గొన్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. వీరిని ఖండాల వారీగా నాలుగు బృందాలుగా విభజించారు. తొలుత తెలంగాణకు చెందిన ఒక్కో సంప్రదాయ కళా బృందం ప్రదర్శన ఇవ్వగా, ఆ వెంటనే ఒక్కో బృందం చొప్పున సుందరీమణులు స్టేడియంలోకి వచ్చి పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా రామకృష్ణ ఆధ్వర్యంలో కొమ్ము కోయ బృందం కోయ డప్పు నృత్యం ప్రదర్శించారు. ఆ వెంటనే అమెరికా–కరేబియన్‌ దేశాలకు చెందిన తొలి సుందరీమణుల బృందం వచ్చింది. నిర్వాహకులు దేశాల వారీగా పిలవగానే ఆయా దేశాల ప్రతినిధులు ఒక్కొక్కరు పాశ్చాత్య బీట్‌కు తగ్గట్టుగా నర్తిస్తూ అభివాదం చేసుకుంటూ పరిచయం చేసుకున్నారు. తొలుత అర్జెంటీనా సుందరీమణి రాగా, చివరగా వెనిజువెలా అందెగత్తె వచ్చింది. అనంతరం గోండు గుస్సాడీ కళాకారులు శ్రీధర్‌ ఆధ్వర్యంలో నృత్యాన్ని ప్రదర్శించారు. ఆ వెంటనే ఆప్రికా ఖండానికి చెందిన దేశాల సుందరీమణులు వచ్చి పరిచయం చేసుకున్నారు. అంగోలా సుందరీమణి ముందు రాగా, చివరగా జింబాబ్వే దేశానికి చెందిన పోటీదారు వచ్చింది. అనంతరం 14 మంది లంబాడీ డప్పు కళాకారులు స్వప్న, అందె భాస్కర్‌ ఆధ్వర్యంలో నృత్యాన్ని ప్రదర్శించారు. ఆ వెంటనే యూరప్‌ ఖండానికి చెందిన దేశాల పోటీదారులు వచ్చి పరిచయం చేసుకున్నారు. చివరగా ఒగ్గు డోలు బృందం కళాకారులు 18 మంది ఒగ్గు రవికుమార్‌ ఆధ్వర్యంలో కళారూపాన్ని ప్రదర్శించారు. ఈ సందర్బంగా హ్యూమన్‌ పిరమిడ్‌ ఏర్పాటు చేసి పైకి ఎక్కిన కళాకారుడు జాతీయ జెండాను రెపరెపలాడేలా చేసిన తీరు ఆకట్టుకుంది. అనంతరం ఆసియా–ఓíÙయానా దేశాల ప్రతినిధులు స్టేడియంలోకి వచ్చి పరిచయం చేసుకున్నారు. మిస్‌ ఇండియా నందినీ గుప్తా రాగానే మార్మోగిన స్టేడియం.. చివరి బృందంలో భాగంగా మిస్‌ ఇండియా వరల్డ్‌ నందినీ గుప్తా వచ్చినప్పుడు స్డేడియం చప్పట్లు, ఈలలు, కేరింతలతో మార్మోగింది. గోకులంలో గోపిక వస్త్రధారణతో నందినీ గుప్తా స్టేడియంలోకి వచ్చారు. వేషధారణకు తగ్గట్టు తన పరిచయంలో భాగంగా ఆమె కవ్వంతో వెన్న చిలికే అభినయంతో రావటం విశేషం. నేపాల్‌కు చెందిన సుందరీమణి గులాబీ డిజైన్, అదే రంగు రవికతో తెలుపు రంగు చీరకట్టుతో రావటం ఆకట్టుకుంది. బంగ్లాదేశ్, టర్కీ దేశాల ప్రతినిధులు కూడా హాజరుకాగా.. థాయిలాండ్‌ సుందరీమణి చీరకట్టును పోలిన వస్త్రధారణతో వచ్చింది. శ్రీలంక యువతి నమస్కార ముద్రతో పరిచయం చేసుకుంది. చివరలో వచ్చిన వియత్నాం సుందరి వేగంగా నర్తిస్తూ ఆకట్టుకుంది. ఆ్రస్టేలియా యువతి కౌబాయ్‌ గెటప్‌లో వచ్చింది. పోటీలు ప్రారంభమైనట్టు ప్రకటించిన సీఎం పరిచయ కార్యక్రమం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. మిస్‌ వరల్డ్‌ లిమిటెడ్‌ చైర్‌పర్సన్‌ జూలియా మోర్లే, ప్రస్తుత మిస్‌ వరల్డ్‌ క్రిస్టీనా పిస్కోవాలు పరిచయం చేసుకుని కరచాలనం చేశారు. అనంతరం ఆ ఇద్దరితో కలిసి ప్రపంచ సుందరి 72వ ఎడిషన్‌ పోటీలు ప్రారంభమయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహూతులు, పోటీదారుల కరతాళధ్వనుల మధ్య ప్రకటించారు. పరిచయ కార్యక్రమం ముగిసిన తర్వాత పోటీదారులు అందరూ స్టేడియంలోకి వారివారి జాతీయ జెండాలు చేతపట్టుకుని ఊపుతూ వచ్చారు. చివరగా భారత పతాకాన్ని చేతబూని మిస్‌ ఇండియా వరల్డ్‌ నందినీ గుప్తా వచ్చారు. అప్పుడు స్టేడియంలోని ప్రేక్షకులు లేచి నిలబడి కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. అంతా ప్రపంచ శాంతిని కాంక్షించే మిస్‌ వరల్డ్‌ గీతాన్ని బృంద గానంగా ఆలపించారు. – భారత దేశ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో అసమాన ప్రదర్శన చాటిన సైనికులకు వందనం సమరి్పస్తున్నట్టు వ్యాఖ్యాత ప్రకటించినప్పుడు ‘జైహింద్‌’ నినాదాలతో స్టేడియం మార్మోగింది. చివరకు జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది. ప్రారంభ వేడుకల్లో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, నగర మేయర్‌ విజయలక్ష్మిమ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌ పటేల్‌ రమేశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్‌ తదితరులు పాల్గొన్నారు. గొప్ప నగరంలో ఉన్నందుకు పులకిస్తున్నాం: మిస్‌ వరల్డ్‌ క్రిస్టీనా పిస్కోవా ‘నమస్తే హైదరాబాద్‌.. నమస్తే తెలంగాణ. ఈ అద్భుతమైన నగరంలో 72వ మిస్‌ వరల్డ్‌ పోటీల ప్రారంభోత్సవంలో మీ అందరితో కలిసి పాల్గొనటం నాకు గర్వంగా ఉంది. ఈ అద్భుత దేశం, గొప్ప సాంస్కృతిక కేంద్రంలో మేము ‘బ్యూటీ విత్‌ పర్పస్‌’ అనే అద్భుత కార్యక్రమంలో ఐక్యతను చాటుతూ పాల్గొంటున్నాం. తెలంగాణ సంప్రదాయాలు, గొప్ప చరిత్ర, అద్భుత ఆతిథ్యం నన్ను ఎంతగానో ఆకర్షించాయి. మిస్‌ వరల్డ్‌ అనేది కేవలం అందం గురించి మాత్రమే కాదు. ఇది ప్రపంచంలో ఓ మార్పును తీసుకువచ్చే లక్ష్యంతో సాగుతుంది. విద్య, సాధికారత, సమాజ సేవ ద్వారా ప్రపంచాన్ని మెరుగుపరచడం ఇందులో భాగం. 109 దేశాల నుంచి వచ్చిన మహిళలు గొప్ప లక్ష్యంతో ఒక్కటిగా ఈ పోటీల్లో పాల్గొంటారు. ఈ సందేశాన్ని ప్రపంచానికి చాటేందుకు ఇప్పుడు హైదరాబాద్‌ సరైన వేదికగా నిలి చింది. ఈ నగరంలో సంప్రదాయం–ఆధునికత ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయి. ఇక్కడి ఆతిథ్యానికి, ,హృదయపూర్వక స్వాగతానికి ధన్యవాదాలు..’ అని మిస్‌ వరల్డ్‌ క్రిస్టీనా పిస్కోవా అన్నారు.

India Shuts Down Pakistan Fake Claims About Missile systems10
పాక్‌ ఫేక్‌ ప్రచారం నమ్మొద్దు

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్, పంజాబ్‌లో సాధారణ ప్రజలు, జనావాసాలు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్‌ సైన్యం శనివారం దాడులకు పాల్పడినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ చెప్పారు. భారత్‌లో పలు సైనిక స్థావరాలను, ఎస్‌–400 క్షిపణి వ్యవస్థలను ధ్వంసం చేశామంటూ పాకిస్తాన్‌ చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చిచెప్పారు. పాక్‌ తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. మిస్రీ శనివారం సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. తప్పుడు ప్రచారంతో ప్రజలను ఏమార్చడం పాక్‌ ప్రభుత్వానికి అలవాటేనని మండిపడ్డారు. ఇండియా వైమానిక, సైనిక స్థావరాలు సురక్షితంగా ఉన్నాయని, ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఉద్ఘాటించారు. దేశంలో కీలక మౌలిక సదుపాయాలు, విద్యుత్, సైబర్‌ వ్యవస్థలపై దాడి చేశామంటూ పాక్‌ చేస్తున్న ప్రచారాన్ని విక్రం మిస్రీ తిప్పికొట్టారు. వాటిపై దాడిచేసే సత్తా పాక్‌ సైన్యానికి లేదని పేర్కొన్నారు. దుష్ప్రచారంతో మతం పేరిట ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి కుట్రలు సాగిస్తోందని దాయాది దేశంపై ధ్వజమెత్తారు. అమృత్‌సర్‌ సాహిబ్‌ వైపు భారత సైన్యం క్షిపణులు ప్రయోగించిందని పాక్‌ ప్రకటించడం పట్ల మిస్రీ ఆగ్రహం వ్యక్తంచేశారు. భారతదేశాన్ని విభజించే కుట్రలు సాగవని తేల్చిచెప్పారు. భారత సైన్యం అఫ్గానిస్తాన్‌పై ఎలాంటి దాడి చేయలేదని అన్నారు. భారత ప్రభుత్వాన్ని సొంత ప్రజలే విమర్శిస్తున్నారంటూ పాక్‌ మరో తప్పుడు ప్రచారానికి తెరతీసిందని విమర్శించారు. పాక్‌ ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలే దూషిస్తున్న సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసని విక్రం మిస్రీ స్పష్టంచేశారు. జమ్మూకశ్మీర్‌లో పాక్‌ దాడుల్లో ఆరుగురు మరణించారని చెప్పారు. పాక్‌ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని వ్యాఖ్యానించారు. వాటిని సైన్యం ఎప్పటికప్పుడు దీటుగా ఎదుర్కొంటోదని వివరించారు. 26 ప్రాంతాలపై దాడులకు పాక్‌ యత్నం పాక్‌ సైన్యం శుక్రవారం రాత్రి ఎయిర్‌బేస్‌లు, రవాణా కేంద్రాలు సహా 26 కీలక ప్రాంతాలపై దాడులకు ప్రయత్నించిందని కల్నల్‌ సోఫియా ఖురేషీ తెలిపారు. పంజాబ్‌లోని ఎయిర్‌ బేస్‌పై హైస్పీడ్‌ మిస్సైల్‌ ప్రయోగించిందని అన్నారు. శ్రీనగర్, అవంతిపుర, ఉదంపూర్‌ సమీపంలో ఆసుపత్రులు, పాఠశాలల సమీపంలో దాడులు జరిగాయని తెలిపారు. పాక్‌ సైన్యం డ్రోన్లు, ఫైటర్‌ జెట్లు, లాంగ్‌ రేంజ్‌ మిస్సైళ్లు ప్రయోగించినట్లు వెల్లడించారు. భారత సైన్యం మాత్రం ముందుగా గుర్తించిన టార్గెట్లపైనే దాడికి దిగినట్లు స్పష్టంచేశారు. ప్రధానంగా పాక్‌ సైన్యానికి సంబంధించిన టెక్నికల్‌ సదుపాయాలు, కమాండ్, కంట్రోల్‌ సెంటర్లు, రాడార్‌ కేంద్రాలు, ఆయుధాగారాలపై దాడి చేసినట్లు వెల్లడించారు. భారత సైనిక దళాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నట్లు వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌ వివరించారు. పాక్‌ దాడులను గట్టిగా తిప్పికొట్టినట్లు స్పష్టంచేశారు. భారత్‌కు భారీ నష్టం కలిగించామంటూ పాక్‌ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. పాక్‌ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి, వాస్తవాలు బహిర్గతం చేయడానికి ప్రభుత్వం సిర్సా, సూరత్‌గఢ్, అజంగఢ్‌ ఎయిర్‌ బేస్‌ల ఫొటోలు, వీడియోలు విడుదల చేసింది. ఈ ఫొటోలపై తేదీ, సమయం స్పష్టంగా కనిపిస్తున్నాయి.8 పాక్‌ సైనిక స్థావరాలు ధ్వంసంనాలుగు భారత వైమానిక స్థావరాలపై దాడికి పాక్‌ విఫలయత్నం చేసినట్టు ఖురేషీ తెలిపారు. ‘‘ఉదంపూర్, పఠాన్‌కోట్, అదంపూర్, భుజ్‌ ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్లపై దాడులకు పాక్‌ ప్రయత్నించింది. క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్లకు స్వల్పనష్టం వాటిల్లింది. ఆ దాడులను మన సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. బదులుగా ఆరు పాక్‌ వైమానిక స్థావరాలు, రెండు రాడార్‌ కేంద్రాలపై దాడులు చేసింది. వాటిని చాలావరకు ధ్వంసం చేసి భారీ నష్టం మిగిల్చింది. కేవలం పాక్‌ ఎయిర్‌బేస్‌లపైనే దాడి చేశాం. సామాన్య జనావాసాలకు ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం’’ అని వివరించారు. హరియాణాలోని సిర్సాలో పాక్‌ క్షిపణి ఫతే–2ను భారత సైన్యం విజయవంతంగా నేలమట్టం చేసిందన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement