abd Abdul kalam
-
కలాం.. స్ఫూర్తి మంత్రం!
న్యూఢిల్లీ/రామేశ్వరం: మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 86వ జయంతి సందర్భంగా.. దేశానికి ఆయన చేసిన సేవలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలు గుర్తుచేసుకున్నారు. దేశ యువతను సృజనాత్మకతవైపు పురికొల్పిన మహానుభావుడు కలాం అని రాష్ట్రపతి కొనియాడారు. రామేశ్వరం నుంచి వచ్చిన కొందరు విద్యార్థులతో రాష్ట్రపతి భవన్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రామ్‌నాథ్ కోవింద్ పాల్గొన్నారు. ఓ శాస్త్రవేత్తగా, మేధావిగా, భారత రాష్ట్రపతిగా అన్ని పదవులకు కలాం న్యాయం చేశారని ప్రశంసించారు. కలాం జీవితం కోట్ల మందికి స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ తెలిపారు. కలాం బతికున్నప్పుడు ఆయన ఇచ్చిన సందేశాల వీడియోను ట్వీటర్ ద్వారా షేర్ చేశారు. అటు కలాం సొంతరాష్ట్రం తమిళనాడులోనూ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కలాంకు పుష్పాంజలి ఘటించారు. రామేశ్వరం సమీపంలోని కలాం స్మారకం వద్ద ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ప్రజలు భారీ సంఖ్యలో కలాంకు నివాళులర్పించారు. చాలాచోట్ల విద్యార్థులు, ప్రజలు మొక్కలు నాటి పుష్పాంజలి ఘటించారు. పలువురు సినీ కళాకారులు కూడా అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో పాల్గొని మొక్కలు నాటారు. 1931 అక్టోబర్ 15న రామేశ్వరంలో జన్మించిన కలాం 2002 నుంచి 2007 వరకు రాష్ట్రపతిగా ఉన్న విషయం తెలిసిందే. జూలై 27, 2015న కలాం గుండెపోటుతో కన్నుమూశారు. -
కలాంకు ఘనంగా నివాళులు
-
కలాంకు త్రివిధ దళాల గౌరవ వందనం
న్యూఢిల్లీ : భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం భౌతికకాయానికి త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పించాయి. వాయుసేన విమానంలో కలాం పార్థీవ దేహం మంగళవారం మధ్యాహ్నం పాలెం విమానాశ్రయం చేరుకుంది. ఈ సందర్భంగా ఆర్మీ, నేవీ, వాయు సేనల అధ్యక్షులు.. కలాం భౌతికకాయంపై జాతీయ పతాకం కప్పి ఘనంగా నివాళులు అర్పించారు. బుధవారం రామేశ్వరంలో కలాం అంత్యక్రియల జరగనున్నాయి. -
పాలెం విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు
న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం భౌతికకాయం కాసేపట్లో ఢిల్లీ చేరుకోనుంది. పాలెం విమానాశ్రయానికి కలాం పార్ధీవ దేహాన్ని తీసుకురానున్నారు. ఇందుకోసం పాలెం విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాధ్ సింగ్, రక్షణమంత్రి మనోహర్ పారీకర్ తదితరులు పాలం విమానాశ్రయానికి వెళ్లనున్నారు. పాలం విమానాశ్రయం నుంచి టెన్ రాజాజీ మార్గ్‌లోని అధికారిక నివాసానికి కలాం భౌతికకాయాన్ని తరలించనున్నారు. మరోవైపు కలాంకు ప్రజలు ఆయన నివాసంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి నివాళులు అర్పించవచ్చని రక్షణ శాఖ అధికారి ఒకరు ట్విట్ చేశారు. కాగా మంగళవారం ఉదయం ఐదున్నర గంటలకు వైమానిక దళ హెలికాప్టర్లో కలాం పార్థివదేహాన్ని గువాహటి వరకు.... అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకువచ్చారు. మరోవైపు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు గౌరవ సూచకంగా దేశవ్యాప్తంగా.... ఏడు రోజుల పాటు జులై 27 నుంచి ఆగస్ట్ 2 వరకు జాతీయ సంతాప దినాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ వారం రోజులు జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేస్తారు. మరోవైపు కేంద్ర మంత్రివర్గం సమావేశంలో కలాం అంత్యక్రియలపై నిర్ణయం తీసుకోనున్నారు.