accountant general
-
రూ. 245 కోట్లకు లెక్కేది?
నెలాఖరులోగా లెక్కలు చూపకుంటే జీతాలు నిలిపివేస్తాం అధికారులను హెచ్చరిస్తూ ఆర్థిక శాఖ జీవో జారీ సాక్షి, హైదరాబాద్: అత్యవసరాల కోసమంటూ లెక్కా పత్రం లేకుండా ఖజానా నుంచి నిధులను డ్రా చేసుకుని వివరాలు సమర్పించకపోవడం పట్ల అకౌంటెంట్ జనరల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసరాల పేరుతో తీసుకున్న డబ్బులకు లెక్కలు సమర్పించకుంటే నిధులను డ్రా చేసిన అధికారులకు జీతాలు నిలుపుదల చేస్తామని ఆర్థిక శాఖ కూడా పలుసార్లు జీవోలు ఇచ్చింది. అయినా సరే ఇంకా రూ. 245 కోట్లకు పలు శాఖల నుంచి లెక్కలు సమర్పించలేదని ఆర్థిక శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆ మొత్తానికి ఈ నెల 28వ తేదీలోగా వివరణాత్మక బిల్లులను ఓచర్లతో సహా సమర్పించాలని, లేదంటే వచ్చే నెల జీతాలను ఆయా అధికారులకు నిలుపుదల చేస్తామని ఆర్థిక శాఖ కార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖల నుంచి ఎక్కువగా లెక్కలు అందాల్సి ఉందని అధికార వర్గాలు తెలిపాయి. 2,805 సంక్షిప్త ఆకస్మిక బిల్లులకు సంబంధించిన రూ. 245 కోట్లకు ఈ నెల 28వ తేదీలోగా వివరణాత్మక బిల్లును ఎట్టిపరిస్థితుల్లోను సమర్పించేలా చర్యలను తీసుకోవాలని అకౌంటెంట్ జనరల్ గట్టిగా సూచించడంతో ఆర్థిక శాఖ జీవో జారీ చేసింది. రాష్ట్రం విడిపోవడానికి ఒక్క రోజు ముందు అంటే గత ఏడాది జూన్ 1వ తేదీ నాటికి 89,020 సంక్షిప్త ఆకస్మిక బిల్లులకు చెందిన రూ.1,051 కోట్లకు లెక్కల పత్రాలు సమర్పించాల్సి ఉంది. అయితే ఆర్థిక శాఖ తీసుకున్న చర్యల కారణంగా ఫిబ్రవరి నాటికి ఆ బిల్లుల సంఖ్య 2,805కి తగ్గింది. -
హైలెవల్ టెన్షన్
నగరపాలక సంస్థలో అవినీతిపై విచారణకు హైలెవల్ కమిటీ! ఇప్పటికే ఏజీ ఆడిట్ ప్రారంభం ఆడిట్‌కు సహకరించని కొన్ని శాఖల అధికారులు జేఎన్ఎన్యూఆర్ఎంలో అవినీతి బయటపడుతుందనే భయం ! అక్రమార్కుల్లో వణుకు ! విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో అవినీతిపై విచారణకు హైలెవల్ కమిటీని నియమించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. ఈ క్రమంలోనే అకౌంటెంట్ జనరల్ (ఏజీ) ఆడిట్ ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం. ఏజీ బృందం నివేదిక ఆధారంగా జనవరిలో హైలెవల్ కమిటీ విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్(జేఎన్ఎన్యూఆర్ఎం) పథకాల అమలులో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై హైలెవల్ కమిటీతో విచారణ చేయిస్తామని ఈ నెల 13న నగరానికి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అనంతరం 16న అకౌంటెంట్ జనరల్ (ఏజీ) ఆడిట్ బృందం నగరానికి చేరుకుంది. తమ అవినీతి బయటపడుతుందనే ఉద్దేశంతో కొన్ని శాఖల అధికారులు ఆడిట్ బృందానికి రికార్డులు ఇచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారు. హైలెవల్ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపడితే పెద్దలపైనే వేటు పడటం ఖాయమనే ప్రచారం సాగుతోంది. బిల్లుల చెల్లింపులో అత్యుత్సాహం ! జేఎన్ఎన్యూఆర్ఎం ద్వారా యూఐజీ పథకం కింద 11 ప్రాజెక్టులకు రూ.675.33 కోట్లు, 8 బీఎస్‌యూపీ ప్రాజెక్టులకు రూ.743.32 కోట్లు కలిపి 1,418.65 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో సుమారు రూ.1,100 కోట్లతో పనులు చేపట్టారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, తాగునీటి పథకాల పనులు 90 శాతం మేర పూర్తయ్యాయి. గృహ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. బీఆర్టీఎస్ ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. సకాలంలో పనులను పూర్తి చేయడంపై దృష్టిపెట్టని అధికారులు కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో మాత్రం అత్యుత్సాహం కనబరిచినట్లు రికార్డులు స్పష్టంచేస్తున్నాయి. కమీషన్ల కోసం కొందరు అధికారులు తమ ఇష్టానుసారం బిల్లులు చెల్లించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.100 కోట్ల మేర అవినీతి? జేఎన్ఎన్యూఆర్ఎం ముసుగులో సుమారు రూ.100 కోట్ల మేర అవినీతి జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేసిన పనికి సంబంధించిన ఓచర్లు సుమారు రూ.2 కోట్లు ఉంటే రూ.5 కోట్లు బిల్లులు చెల్లించినట్లు రికార్డుల్లో నమోదైనట్లు సమాచారం. మరోవైపు ఇందుకు సంబంధించి 600 ఓచర్లు కనిపించడం లేదని తెలిసింది. మెజర్మెంట్ బుక్స్ మాయమయ్యాయి. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు కొందరు బదిలీ అయ్యారు. ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులు కూడా పొంతన లేని లెక్కలు చెబుతున్నారు. రవిబాబు కమిషనర్‌గా పనిచేసిన కాలంలో పెద్దఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. నిధుల మళ్లింపు కారణంగా ఇప్పటికీ లెక్కలు తేలని పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి నగరపాలక సంస్థకు సుమారు రూ.55 కోట్లు రావాల్సి ఉంది. ఆడిట్ సక్రమంగా జరగని కారణంగా ఆ నిధులను నిలిపివేశారు. ముప్పేట దాడి నగరపాలక సంస్థపై ఆడిట్ బృందాలు ముప్పేట దాడికి దిగాయి. స్టేట్ ఆడిట్ ప్రక్రియ రెండు నెలల క్రితమే ప్రారం భమైంది. స్టేట్ ఆడిట్ అధికారులు 2009-10కి సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు పంపారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో అభ్యంతరాలు ఎక్కువగా తలెత్తినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. 2010-11కు సంబంధించి ఆడిట్‌ను నిర్వహిస్తున్నారు. ఏజీ ఆడిట్ అధికారులు 2009-10 నుంచి 2012-13 వరకు ఆడిట్ చేయాలని నిర్ణయించారు. దీంతో నగరపాలక సంస్థ అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
చిక్కుల చిట్టా తేలేనా!
నగరపాలక సంస్థలో 2009 నుంచి ఆడిట్ పెండింగ్ రంగంలోకి దిగిన ఏజీ బృందం సిబ్బంది సహాయ నిరాకరణ ఆందోళనలో అక్రమార్కులు విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ అధికారులను ఆడిట్ భయం వెంటాడుతోంది. హైదరాబాద్‌కు చెందిన అకౌంటెంట్ జనరల్ (ఏజీ) ఆడిట్ అధికారుల బృందం నగరానికి చేరుకుంది. రికార్డులు సిద్ధం చేయాలని వారం రోజుల క్రితమే అదనపు కమిషనర్‌కు ఏజీ అధికారులు సమాచారం అందించారు. ఈ మేరకు ఆయన అన్ని విభాగాధిపతులను ఆదేశించారు. అయితే ఏజీ బృందం వచ్చి రెండు రోజులైనా వారికి రికార్డులు అందలేదు. దీంతో వారు మంగళవారం కూడా కార్పొరేషన్ వరండాలో కబుర్లతో కాలక్షేపం చేయాల్సి వచ్చింది. ఎన్నికష్టాలు ఎదురైనా నగరపాలక సంస్థ చిక్కుల చిట్టా లెక్క తేల్చిన తర్వాతే వెళ్తామని ఏజీ బృందం స్పష్టంచేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం తాము రూపొందించిన ఫార్మాట్లో 2009 నుంచి 2013 వరకు జమా, ఖర్చుల వివరాలను అందజేయాలని కోరినట్లు సమాచారం. దీంతో కొన్ని శాఖల అధికారుల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది. గతంలోనూ సహాయ నిరాకరణ అడ్వాన్సుల్లో గోల్మాల్, నిధుల మళ్లింపు, రికార్డులు అప్డేట్గా లేకపోవడం, ఐటీ రిటర్న్స్‌లో పెండింగ్ వంటి లోపాలు నగరపాలక సంస్థలో ఉన్నాయి. దీంతో ఆడిట్ అనగానే అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీయూఎఫ్ఐడీసీ) అధికారుల బృందం గతేడాది జూన్‌లో ఆడిట్ చేపట్టింది. మూడు రోజులైనా రికార్డులు అందజేయకపోవడంతో వారు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి తిరిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత స్టేట్ ఆడిట్ అధికారులు వచ్చారు. కార్పొరేషన్ అధికారులు వారికి కూడా సహాయ నిరాకరణ చేశారు. పెండింగ్ నిధులు మంజూరు చేయాలంటే ఆడిట్ నివేదిక తప్పనిసరి అని ప్రభుత్వం హెచ్చరించడంతో కాస్త వెనక్కి తగ్గారు. 2009-10 సంవత్సరానికి సంబంధించిన రికార్డుల్ని అందజేశారు. రికార్డుల్లో తప్పులు ఉండటంతో జిల్లా ఆడిట్ అధికారులు కొర్రీ వేసి పంపారు. ప్రస్తుతం దాన్ని సరిచేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. నెల రోజుల క్రితమే ఆడిట్ ప్రక్రియ 2010-11 సంవత్సరానికి సంబంధించి ఆడిట్ ప్రారంభం కావాల్సి ఉంది. ఇంతవరకు జమా, ఖర్చుల వివరాలు అందజేయకపోవడంతో స్టేట్ ఆడిట్ బృందం ఖాళీగా ఉంది. ఈక్రమంలో ఏజీ అధికారులకు ఎంత వరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. అంతా ఓ ప్రహసనం నగరపాలక సంస్థలో ఆడిట్ ఒక ప్రహసనంలా మారింది. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఉద్యోగులకు 1994 నుంచి ఇచ్చిన అడ్వాన్సుల్లో రూ.2కోట్లకు సంబంధించి లెక్కలు లేవు. మొదటి అడ్వాన్స్ క్లీయర్ కాకుండా రెండో అడ్వాన్స్ ఇవ్వకూడదనే నిబంధన అమలు కావడంలేదు. అడ్వాన్స్ తీసుకున్న వారిలో కొందరు రిటైర్ కాగా, మరికొందరు మృతిచెందారు. ప్రస్తుతం ఉన్న అకౌంట్స్ అధికారులతో పాటు ఆడిట్ కోసం ప్రత్యేకంగా కన్సల్టెంట్‌ను నియమించారు. అయినప్పటికీ ఆడిట్ పెండింగ్‌లోనే ఉండటం విశేషం. ఐటీ రిటర్న్స్ దాఖల్లో లొసుగులు ఉండటంతో యూనియన్ నాయకులు లోకాయుక్తాను ఆశ్రయించారు. ఈ నెల 18న కేసు విచారణ జరగనుంది. 2012-13, 2013-14 సంవత్సరాలకు సంబంధించి కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగుల జీతాలు, కాంట్రాక్టర్ల బిల్లుల నుంచి రూ.2.24 శాతం చొప్పున కార్పొరేషన్ మినహాయించుకున్న రూ.7.30 కోట్లకు సంబంధించి ఐటీ రిటర్న్స్ పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. -
ఉమ్మడి బిల్లులు ఎవరు చెల్లించాలి?
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలోని పెండింగ్ బిల్లులతో పాటు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రం విడిపోయాక పలు శాఖలు సమర్పించిన బిల్లులను ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలనే దానిపై సందిగ్ధత నెలకొంది. దీంతో ఈ పంచాయతీని రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలోని అపెక్స్ కమిటీ ముందు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ నిర్ణయించింది. వాస్తవానికి ఇలాంటి సమస్యలు తలెత్తకూడదని, ఉమ్మడి రాష్ట్ర బిల్లులన్నింటినీ రాష్ట్ర విభజనకు వారం రోజుల ముందే అంటే మే 25నే చెల్లించేందుకు ఆర్ధిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. కొన్ని శాఖల్లో నిధులు అందుబాటులో లేని కారణంగా రూ.200 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కాగా, వీటిని తొలు త తెలంగాణ ఖజానా చెల్లించాలని, ఆ తర్వాత అకౌంటెంట్ జనరల్ ద్వారా అందులో 58% మేర నిధులను ఆంధ్రా ఖజానా నుంచి తెలంగాణకు బదిలీ చేయాలని ఏపీ ఆర్థిక శాఖ పేర్కొంది. రాష్ట్ర విభజన అనంతరం, విభజనకు ముందు నెలలకు సంబంధించి దాదాపు రూ.3,000 కోట్ల మేరకు బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బిల్లులన్నింటిపై నిర్ణయం తీసుకునేందుకు ఏపీ ఆర్థిక శాఖ సంబంధిత ఫైలును అపెక్స్ కమిటీకి పంపిం ది. ఏ జిల్లాల్లో పెండింగ్ బిల్లులు ఉంటే ఆ జిల్లాల రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని చెల్లించాలనే ప్రతిపాదన చేసింది. -
ఫీజు మింగేశారు!
-
ఫీజు మింగేశారు!
సర్కారుకు అకౌంటెంట్ జనరల్ నివేదిక సాక్షి, హైదరాబాద్: ఒకే మెయిల్ ఐడీ ఇచ్చిన 56,586 మంది విద్యార్థులకు, ఒకే మొబైల్ నంబర్ పేర్కొన్న 25 వేర్వేరు విద్యా సంస్థలకు చెందిన 2,000 మంది విద్యార్థులకు... అందరికీ అధికారులు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించారు. ఒకే మెయిల్ ఐడీతో, మొబైల్ నంబర్‌తో ఇంత మంది విద్యార్థులా..? అని ఆశ్చర్యపోతున్నారా!? ఇది కేవలం 60 కాలేజీలకు సంబంధించి చేసిన ఆడిట్ మాత్రమే. అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నిర్వహించిన ఈ తనిఖీలో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాల అమల్లో ఎన్నో అక్రమాలు, మరెన్నో లోపాలు బయటపడ్డాయి. లక్షలకు పైగా వార్షికాదాయం ఉండి, అనర్హులైన వేల మంది విద్యార్థులకు ఫీజుల చెల్లింపు.. స్పాట్ అడ్మిషన్లు, మేనేజ్మెంట్ కోటాలో ప్రవేశాలు పొందిన వారికీ అడ్డదారిలో పథకం వర్తింపు.. అర్హులైన వేలాది మంది విద్యార్థులకు మంజూరు చేయకపోవడం.. వంటి ఎన్నో బాగోతాలు వెల్లడయ్యాయి. ఈ లెక్కన మొత్తం కాలేజీల్లో ఆడిట్ జరిపితే.. మరెన్ని అక్రమాలు బయటపడతాయోననే అభిప్రాయాలు వస్తున్నాయి. 2009-10, 2010-11, 2011-12 విద్యా సంవత్సరాల్లో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల వ్యవహారంలో కొన్ని కాలేజీల యాజమాన్యాలు, అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు వెల్లడైంది. అధికారులు, యాజమాన్యాలు కుమ్మక్కై పెద్ద సంఖ్యలో విద్యార్థుల ఫీజులను మింగేసినట్లు తెలుస్తోంది. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ ఫీజులు, స్కాలర్షిప్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిబంధనలకు మంగళం పాడిన అధికారులు... దరఖాస్తు చేసుకున్నవారిలో 26 శాతం నుంచి 55 శాతం మందికే మంజూరు చేశారు. మరోవైపు పెద్ద సంఖ్యలో అనర్హులకు ఫీజులు ఇచ్చేశారు. అసలు ఒకే మెయిల్ ఐడీతో దరఖాస్తు చేసుకున్న 56,586 మందికి, ఒకే మొబైల్ నంబరుతో 25 వేర్వేరు విద్యా సంస్థల నుంచి దరఖాస్తు చేసుకున్న రెండు వేల మందికి ఫీజులు ఇచ్చారు. మరి ఈ ఫీజులన్నీ అసలైన విద్యార్థులకే చెల్లించారా? లేదా? అన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లపై అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నిర్వహించిన ఆడిట్లో ఇలాంటి ఎన్నో విస్మయం కలిగించే అంశాలు వెలుగుచూశాయి. 2010 నుంచి 2012 డిసెంబర్ వరకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల పథకంపై.. అది కూడా కేవలం 60 కాలేజీలకు సంబంధించిన ఆడిట్‌లోనే ఎన్నో అక్రమాలు, తప్పిదాలు బయటపడ్డాయి. ఏజీ కార్యాలయం ప్రభుత్వానికి అందజేసిన ఈ నివేదికలోని ముఖ్యాంశాలు.. - 2010 నవంబరు నుంచి 2011 డిసెంబరు వరకు 4,156 మంది విద్యార్థుల ఏటీఎం కార్డులు హైదరాబాద్ జిల్లాలోని నాలుగు డివిజన్లలో దొంగతనానికి గురయ్యాయి. - 471 బ్యాంకు అకౌంట్ల నుంచి రూ. 17.25 లక్షలను అక్రమంగా డ్రా చేశారు. బ్యాంకుల వారు ఏటీఎం కార్డులతోపాటు పిన్ నెంబర్లను కూడా ఒకే కవర్లో పెట్టి ఇవ్వడ ం, వాటిని అర్హులైన విద్యార్థులకు ఇవ్వకపోవడం ఇందుకు కారణం. అర్హులకు ఏటీఎం కార్డులు అందలేదనే సమాచారాన్ని సంక్షేమ శాఖ అధికారులు సకాలంలో బ్యాంకుల దృష్టికి తీసుకెళ్లలేదు. ఫలితంగా ఆ ఖాతాల్లోని సొమ్మును బ్లాక్ చేయడానికి వీల్లేకుండాపోయింది. ఆ విద్యార్థులు అందుబాటులో లేకపోవడం వల్ల కార్డులు పంపిణీ చేయలేకపోయామని 2012లో సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ వివరణ ఇచ్చారు. - ఒకే ఈ-మెయిల్ ఐడీతో 2010-11 విద్యా సంవత్సరంలో 56,586 మంది విద్యార్థులు, 2011-12లో 53,518 మంది విద్యార్థులు చేసుకున్న దరఖాస్తులకు ఫీజు మంజూరు చేశారు. - 25 వేర్వేరు విద్యా సంస్థలకు చెందిన 1,961 మంది విద్యార్థులు తమ దరఖాస్తుల్లో ఒకే మొబైల్ నంబరును పేర్కొన్నారు. వారికి ఫీజు మంజూరైంది. - 33,181 దరఖాస్తుల్లో ఎస్ఎస్సీ యూనిక్ ఐడీ నంబర్లను మళ్లీ మళ్లీ వాడారు. ఒక విద్యార్థికి ఉన్న యూనిక్ ఐడీ మరే విద్యార్థికి ఉండదు. - మేనేజ్మెంట్, స్పాట్ అడ్మిషన్ కోటాలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కూడా స్కాలర్ షిప్ మంజూరు చేశారు. 2009-10, 2010-11లో దాదాపు 6 వేల మందికి ఇలా ఇచ్చారు. ఒక 2010-11లోనే 152 మందికి రూ. 56.49 ల క్షలు చెల్లించారు. - రూ. లక్ష వార్షిక ఆదాయానికి మించి ఉన్న అనేక మంది విద్యార్థులకు ఫీజులు మంజూరు చేశారు. - కోర్సు కాలపరిమితిని పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల 73 మంది మెడికల్ విద్యార్థులకు రూ. 12 లక్షల వరకు మంజూరు చేశారు. - డాటా, దరఖాస్తు ఐడీ వివరాలు లేకపోయినా 374 మందికి స్కాలర్షిప్లు ఇచ్చారు. - మరో రకంగా ఆర్థిక సహాయం పొందే 176 మంది గేట్ క్వాలిఫైడ్ విద్యార్థులకు రూ. 76.82 లక్షలు స్కాలర్షిప్ ఇచ్చారు. విద్యార్థుల నుంచీ వసూళ్లు..! 2009-10, 2010-11, 2011-12 విద్యా సంవత్సరాల్లో దరఖాస్తు చేసుకున్న అందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. పోనీ స్కాలర్షిప్ ఇచ్చారా.. అంటే అదీ లేదు. ఆ మూడేళ్లలో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 26% నుంచి 55 శాతం మందికి మంజూరు చేయలేదు. దాంతో యాజమాన్యాలు ఫీజులను విద్యార్థుల నుంచే వసూలు చేశాయి. క్షేత్రస్థాయి ఆడిట్లో 14 శాతం మంది విద్యార్థులు తామే ఫీజులను చెల్లించామని వెల్లడించారు.