రూ.7 కోట్ల విజేతలను ప్రశంసించిన అమితాబ్!
ముంబై: ‘కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ)’టీవీ షోలో రూ. 7 కోట్లను గెలుచుకున్న అచిన్ నరులా, సార్థక్ నరులాలను బిగ్ బి అమితాబ్ ప్రశంసించాడు. తొలిసారి ఈ అన్నదమ్ములిద్దరూ భారీ మొత్తంలో ప్రైజ్ మనీ గెలుచుకోవడంపై అమితాబ్ అభినందనలు తెలియజేశారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నకేబీసీ 8వ సీజన్ సోనీ టీవీలో ప్రసారమవుతున్నసంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో తొలిసారి రూ. ఏడు కోట్ల ప్రై జ్ మనీని గెలుచుకుని ఈ నరూలా బ్రదర్స్ చరిత్ర సృష్టించారు.
ఢిల్లీకి చెందిన అన్నదమ్ములిద్దరూ నాలుగు లైఫ్ లైన్ల సాయంలో 14 ప్రశ్నలనూ కరెక్ట్‌గా చెప్పి రికార్డు స్థాయి ప్రైజ్‌మనీని సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని బిగ్ బీ అమితాబచ్చన్ తన బ్లాగ్, ట్విట్టర్లో వెల్లడించారు. ఈ ఇద్దరిలో అచిన్ మార్కెటింగ్ మేనేజర్ కాగా, సార్థక్ మాత్రం ఇంకా విద్యార్థి దశలోనే ఉండటం గమనార్హం. ఈ షోలో పాల్గొనడానికి గత 10 సంవత్సరాల నుంచి యత్నిస్తున్నట్లు విజేతల్లో ఒకరైన అచిన్ స్పష్టం చేశాడు.