Acknowledgment
-
ఐటీఆర్ దాఖలుతో పని పూర్తయినట్టు కాదు
ఆదాయపుపన్ను రిటర్నుల దాఖలు గడువు డిసెంబర్ 31 తో ముగిసింది. జూలైతోనే ముగిసిన గడువును.. కరోనా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ చివరి వరకు పొడిగించింది. దీంతో చాలా మంది డిసెంబర్లో రిటర్నులు దాఖలు చేశారు. రిటర్నులు దాఖలుతో బాధ్యత ముగిసిందని అనుకోవద్దు. ఆ తర్వాత తమ వైపు నుంచి దృష్టి పెట్టాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. చివరి నిమిషంలో వేయడం వల్ల అందులో తప్పులు దొర్లి ఉంటే వెంటనే రివైజ్డ్ రిటర్నులు వేసుకోవాలి. ఈ వెరిఫై చేస్తేనే వేసిన రిటర్నులు చెల్లుబాటు అవుతాయి. ఇలాంటి ముఖ్యమైన అంశాల గురించి వివరించే కథనమే ఇది.. ఈ ఫైలింగ్ పోర్టల్‌పై ఐటీఆర్ దాఖలు చేయడం ప్రాథమికంగా చేయాల్సిన పని. తర్వాత ఆ రిటర్నులను ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి మీరే దాఖలు చేశారనడానికి నిదర్శనం ఏమిటి? అందుకనే ధ్రువీకరణ ప్రక్రియ. దాంతో ఆ రిటర్నుల్లో పేర్కొన్న సమాచారానికి మీరు బాధ్యత వహిస్తున్నట్టు అవుతుంది. గతేడాది కొత్త ఈ ఫైలింగ్ పోర్టల్ తీసుకురావడం తెలిసిందే. ఎన్నో సాంకేతిక సమస్యలు వెక్కిరించడంతో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. డిసెంబర్ చివరి వారంలో హడావుడిగా రిటర్నులు వేసిన వారు కూడా ఉన్నారు. కనుక ఒకసారి రిటర్నులు ధ్రువీకరించినదీ, లేనిదీ చూసుకోవాలి. వెరిఫికేషన్ చేయని రిటర్నులు చెల్లవు. రిటర్నులు సమర్పించిన తేదీ నుంచి 120 రోజుల్లోపు ధ్రువీకరించేందుకు సమయం ఉంటుంది. అక్నాలెడ్జ్మెంట్ పత్రం లేదా ఫామ్–5 పత్రంపై (ఆదాయపన్ను శాఖ నుంచి డౌన్లోడ్ చేసుకుని) సంతకం చేసి ఆ కాపీని పోస్ట్ ద్వారా ఆదాయపన్ను శాఖ, బెంగళూరు కార్యాలయానికి పంపించాలి. కొరియర్ ద్వారా పంపకూడదు. భౌతికంగా చేసే ధ్రువీకరణ ఇది... ఇలా కాకుండా ఆన్లైన్లో ఈ వెరిఫై చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ నుంచి లేదంటే ఆధార్ ఓటీపీ ద్వారా, బ్యాంకు లేదా డీమ్యాట్ ఖాతా నంబర్ సాయంతోనూ వెరిఫై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. వీటిల్లో మీకు నచ్చిన ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. అప్పుడు యూజర్ మొబైల్‌కు వన్‌టైమ్ పాస్వర్డ్ వస్తుంది. ఈ కోడ్ లేదా ఓటీపిని ఈఫైలింగ్ పోర్టల్‌పై ఎంటర్ చేసి, సబ్మిట్ కొట్టడంతో ఈ వెరిఫికేషన్ పూర్తవుతుంది. వెరిఫై చేసినట్టు సమాచారం కూడా వస్తుంది. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలను ఉపయోగించుకుని ఓటీపీ జనరేట్ చేసుకోవడం ద్వారా ఈవెరిఫై చేయవచ్చు. సదరు బ్యాంకులో ఖాతా ఉండి, ఖాతాకు పాన్ నంబర్ అనుసంధానించి ఉంటే సరిపోతుంది. సెక్షన్ 44ఏబీ కింద ఖాతాలను ఆడిట్ చేయాల్సి అవసరం ఉన్న వారు తప్పనిసరిగా రిటర్నులు దాఖలు చేసిన వెంటనే.. తమ డిజిటల్ సిగ్నేచర్‌ను ఉపయోగించి ధ్రువీకరించాల్సి ఉంటుంది. పన్ను రిటర్నులు వేసిన 120 రోజులకీ వెరిఫై చేయకపోతే ముందు ఈఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అయ్యి సరైన కారణాన్ని తెలియజేస్తూ జరిగిన ఆలస్యానికి క్షమాపణ తెలియజేయాలి. మీ అభ్యర్థనను ఆదాయపన్ను శాఖ మన్నిస్తే.. అప్పుడు రిటర్నులు ఈ వెరిఫై చేసుకునేందుకు అవకాశం తిరిగి లభిస్తుంది. లేదంటే మీ రిటర్నులను దాఖలు చేయనట్టుగా ఐటీ శాఖ భావిస్తుంది. అప్పుడు సకాలంలో రిటర్నులు వేయనందుకు చట్టప్రకారం అన్ని చర్యలకు బాధ్యత వహించాలి. ఆలస్యపు ఫీజు, చెల్లించాల్సిన పన్ను ఉంటే ఆ మొ త్తంపై నిర్ణీత గడువు తేదీ నుంచి వడ్డీ చెల్లించాలి. రిటర్నుల్లో తప్పులను గుర్తిస్తే..? ఐటీఆర్ దాఖలు చేశారు. ధ్రువీకరించడం కూడా ముగిసింది. కానీ ఆదాయం, మినహాయింపులను పేర్కొనడం మర్చిపోయారనుకోండి. అప్పుడు సవరించిన రిటర్నులు దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉంది. అది కూడా రిటర్నులను ఆదాయపన్ను శాఖ ప్రాసెస్ చేయక ముందే చేసుకోవాలి. ఇందుకు ప్రత్యేకంగా వేరొక ఫామ్ ఉండదు. ఈ ఫైలింగ్ పోర్టల్‌పై ఒరిజినల్, రివైజ్డ్ అనే ఆప్షన్లు ఉంటాయి. ‘రివైజ్డ్ రిటర్న్’ ఆప్షన్ ఎంపిక చేసుకుని, ముందు దాఖలు చేసిన మాదిరే మొదటి నుంచి ప్రక్రియ అనుసరించాలి. ఒరిజినల్ ఐటీఆర్ ఈ ఫైలింగ్ దాఖలు చేసిన తేదీ, అక్నాలెడ్జ్మెంట్ నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. సంబంధిత అసెస్మెంట్ సంవత్సరం ముగియడానికి మూడు నెలల ముందుగానే రివైజ్డ్ రిటర్నుల ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. 2020–21 సంవత్సరానికి 2021–22 అసెస్మెంట్ సంవత్సరం అవుతుంది. కనుక 2021 డిసెంబర్ 31ని గడువుగా అర్థం చేసుకోవాలి. ఆలోపే ఐటీఆర్ అసెస్మెంట్ను ఆదాయపన్ను శాఖ పూర్తి చేస్తే గడువు ముగిసినట్టుగా అర్థం చేసుకోవాలి. ఈ రెండింటిలో ఏది ముందు అయితే అదే అమలవుతుంది. 2021–22 అసెస్మెంట్ సంవత్సరానికి సవరించిన రిటర్నుల దాఖలు గడువును ఆదాయపన్ను శాఖ 2022 మార్చి 31 వరకు పొడిగించిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఈ గడువులతో సంబంధం లేకుండా.. మీరు దాఖలు చేసిన రిటర్నులను ఐటీ శాఖ ప్రాసెస్ చేసి సెక్షన్ 143(1) కింద ఇంటిమేషన్ మెయిల్ పంపినట్టయితే గడువు ముగిసిపోయినట్టుగానే పరిగణించాలి. దాంతో రిటర్నులను సవరించుకోలేరు. సాధారణంగా రిటర్నులు దాఖలు చేసి, వెరిఫై చేసిన తర్వాత.. 10–30 రోజుల్లోపే ఆదాయపుపన్ను శాఖ ప్రాసెస్ చేసేస్తుంది. అందుకని రిటర్నులు దాఖలు చేసిన వారు ఆ తర్వాత వారం వ్యవధిలోపే మరొక్క సారి అన్నింటినీ క్షుణంగా సరిచూసుకోవడం మంచిది. రివైజ్డ్ రిటర్నులు వేసుకునేందుకు, ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేసుకునేందుకు సాధారణంగా డిసెంబర్ 31 గడువుగా ఉంటుంది. కనుక ఆలస్యంగా రిటర్నులు వేసే వారికి రివైజ్ చేసుకునేందుకు తగినంత వ్యవధి ఉండకపోవచ్చు. ఆదాయపన్ను శాఖ ప్రాసెస్ చేయక ముందు ఎన్ని సార్లు అయినా రివైజ్డ్ రిటర్నులు ఫైల్ చేసుకోవచ్చు. తాజాగా దాఖలు చేసిన ఐటీఆర్‌ను ఐటీ శాఖ పరిగణనలోకి తీసుకుంటుంది. అవకాశం ఉంది కదా అని చాలా సార్లు రివైజ్డ్ రిటర్నులు వేశారనుకోండి.. అప్పుడు ఆదాయపన్ను శాఖ సందేహంతో మీ ఐటీఆర్‌ను స్క్రూటినీ చేయవచ్చు. రిఫండ్ సంగతిదీ.. ఆదాయపుపన్ను రిటర్నులను దాఖలు తర్వాత, ఐటీ శాఖ వాటిని ప్రాసెస్ చేసి 143 (1) ఇంటిమేషన్ ఇవ్వడం పూర్తయి, అందులో ఏ తప్పులూ లేకపోతే రిటర్నుల ప్రక్రియ సంపూర్ణంగా ముగిసినట్టే. చివరిగా ఒకవేళ చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ పన్ను చెల్లించి ఉంటే రిఫండ్‌కు అర్హత ఉంటుంది. రిఫండ్ స్టేటస్ ఏంటన్నది ఐటీ శాఖ ఈ ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డుపై కనిపిస్తుంది. అదనంగా ఎన్ఎస్డీఎల్ పోర్టల్లోనూ చెక్ చేసుకోవచ్చు. https://tin.tin. nsdl.com/oltas/refund-status.html. ఈ లింక్‌ను ఓపెన్ చేసి పాన్ వివరాలు ఇవ్వడం ద్వారా తెలుసుకోవచ్చు. ఫేస్‌లెస్ ప్రాసెసింగ్ వచ్చిన తర్వాత రిఫండ్లు పన్ను చెల్లింపుదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. 143(1) ఇంటిమేషన్ వచ్చిన 15 రోజుల్లోపే రిఫండ్ కూడా వచ్చేస్తుంది. పలు కారణాల వల్ల ఆలస్యం అయితే, బ్యాంకు ఖాతా వివరాలు (అకౌంట్ నంబర్/ఐఎఫ్ఎస్ నంబర్ తదితర) సరిగా లేకపోవడం వల్ల పెండింగ్‌లో ఉంటే అప్పుడు నూతన ఈఫైలింగ్ పోర్టల్‌కు వెళ్లి సర్వీస్ రిక్వెస్ట్ ఆప్షన్ ద్వారా వివరాలను సరిచేసుకోవచ్చు. రిఫండ్లు ఆలస్యమైనా ఆందోళన చెందక్కర్లేదు. నిర్ణీత గడువు దాటిన తర్వాత నుంచి ఆ మొత్తంపై ప్రతీ నెలా 0.5 శాతం మేర వడ్డీని ఐటీ శాఖ చెల్లిస్తుంది. ఇలా అందుకునే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుందని మర్చిపోవద్దు. ఈ మొత్తాన్ని సంబంధిత ఆర్థిక సంవత్సరం ఆదాయం కింద రిటర్నుల్లో పేర్కొనాల్సి ఉంటుంది. పన్ను కోసం డిమాండ్ నోటీసు వస్తే? పన్ను రిటర్నుల్లో తప్పులు, పొరపాట్లు చేయవచ్చు. ఆదాయపన్ను శాఖ రిటర్నులను ప్రాసెస్ చేసే సమయంలో అందులోని సమాచారం మధ్య అంతరాలు, పోలికల్లేమిని గుర్తిస్తుంది. ఆ వివరాలను 143(1) ఇంటిమేషన్ నోటీసులో పేర్కొంటుంది. పన్ను చెల్లించాల్సి ఉంటే ఆ మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. ఐటీ శాఖ పేర్కొన్న సమాచారంతో మీరు ఏకీభవిస్తే ఆ మేరకు పన్ను చెల్లించేస్తే సరిపోతుంది. అలా కాకుండా మీరు ఏదైనా మినహాయింపును పేర్కొనడం మర్చిపోయిన కారణంగా ఆ అంతరం తలెత్తి ఉంటే? అప్పుడు రెక్టిఫికేషన్ రిక్వెస్ట్ దాఖలు చేయాలి. ఆదాయపన్ను శాఖ లెక్కలతో ఏకీభవించడం లేదని లేదా రిటర్నుల్లో పొరపాటు చేశానంటూ అందులో పేర్కొనాలి. పన్ను అధికారులు ఆరు నెలల్లోగా స్పందిస్తారు. నాలుగు రకాల రెక్టిఫికేషన్ రిక్వెస్ట్‌లు ఉన్నాయి. రిటర్నుల్లో సరిపోలని సమాచారం అసలు ఏంటన్న దాని ఆధారంగా వీటిల్లో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. -
జేఎన్టీయూహెచ్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ ఫలితాల్లో ర్యాంకులు రాని అభ్యర్థులు జేఎన్టీయూహెచ్ దగ్గర క్యూ కట్టారు. రేపటి నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం అవుతుండటంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళలో ఉన్నారు. టీఎస్ ఎంసెట్ కార్యాలయంలో విద్యార్థులు తమ ఫోటో కాపీలు సమర్పిస్తున్నారు. కౌన్సిలింగ్ ఉన్న నేపథ్యంలో రేపటి లోగా ర్యాంకు కేటాయించక పోతే ఎలా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అక్నాలెడ్జ్మెంట్ కాపీలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తుండటంతో జేఎన్టీయూహెచ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సెప్టెంబర్ 9,10,11,14 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు మొత్తం 1,43,330 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 1,19,187 మంది (83.16 శాతం) విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 9వ తేదీ నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ తరువాత రెండు మూడుల్లో వారి ఫలితాలను విడుదల చేయనుంది. ఇక గత నెల 28, 29 తేదీల్లో నిర్వహించిన అగ్రికల్చర్ ఎంసెట్ ఫలితాలను కూడా వచ్చే వారంలో విడుదల చేసేందుకు చర్యలు చేపట్టింది. -
‘సచివాలయ’ ఉద్యోగాలకు ఆన్లైన్ ఆమోదం
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు పొందిన వారు ఆన్లైన్లో ఆమోదం తెలపాలని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. ఉద్యోగ అంగీకార పత్రాన్ని గ్రామ సచివాలయ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు పొందిన వారు ఒక ఉద్యోగాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాలన్నారు. ఏ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకున్నారో ఆన్లైన్లో ఆప్షన్ ఇవ్వాలని సూచించారు. ఉద్యోగం పొందిన వారు ఏ మండలంలో పనిచేస్తారో కూడా వెబ్సైట్లో తెలపాలన్నారు. ఉద్యోగానికి ఎంపికయిన ప్రతిఒక్కరూ విధిగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. (చదవండి: ప్రతీ ఏటా ఉద్యోగ నోటిఫికేషన్: సీఎం జగన్) -
వినియోగదారులు హక్కులు తెలుసుకోవాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: వినియోగదారులు తమ హక్కులను తెలుసుకోకుంటే మోసపోయే ఆస్కారముందని జాయింట్ ఎస్.వెంకట్రావు అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక రెవెన్యూ సమావేశ మం దిరంలో ఏర్పాటు చేసిన సదస్సును జేసీ ప్రారంభించి మాట్లాడారు. డిజిటల్ చెల్లింపులతో వస్తు సేవలు, కొనుగోళ్ల సందర్భంగా నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వినియోగదారులు వస్తు సేవలు, కొనుగోలు వ్యవహారాల పై అవగాహన పెంచుకోవాలని, ప్రతీ వస్తువుకు రశీ దు తీసుకోవాలని సూచించారు. డీఎస్ ఓ శారదాప్రియదర్శిని మాట్లాడుతూ వినియోగదారులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా హక్కులు, బా ధ్యతలు తెలుసుకోవాలన్నారు. వినియోగదారుల వ్యవహారాల నిపుణు లు, ఎంవీఎస్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్ మాట్లాడు తూ వినియోగదారులు ప్రశ్నించే తత్వా న్ని అలవర్చుకోవాలని సూచించారు. సివిల్ సప్లయీస్ డీఎం బిక్షపతి, డ్రగ్ ఇన్స్పెక్టర్ దినేష్‌కుమార్, ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్, మున్సిపల్ కమీషనర్ సురేందర్, వినియోగదారుల క్లబ్ కన్వీ నర్ బాల్‌లింగయ్య పాల్గొనగా.. రెవె న్యూ సమావేశ మందిరం ఎదుట పలు శాఖల స్టాళ్లు ఏర్పాటుచేశారు. -
ఓటుకు రసీదు ఇవ్వాలి
హైకోర్టులో కాంగ్రెస్ నేతల పిటిషన్ సాక్షి, హైదరాబాద్: ఖమ్మం, వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్లకు వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వెంటనే దానికి రసీదు వచ్చే ఏర్పాట్లు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, గ్రేటర్ వరంగల్, గ్రేటర్ ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి, కేంద్ర ఎన్నికల కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈవీఎంల ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న వారు తమ ఓటు సరిగా నమోదైందో లేదో తెలుసుకునేందుకు వయబుల్ ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీపీఏటీ) విధానాన్ని అమలు చేయాలని, లేని పక్షంలో పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించేట్లు ఆదేశాలివ్వాలని కోరుతూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి డి.శ్రవణ్‌కుమార్, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు ఎన్.రాజేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వరంగల్ పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికలు జరిగిన 45 రోజులకు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయని, ఇందులో ఉపయోగించిన ఈవీఎంలలో నోటా లేదని పిటిషనర్లు తెలిపారు. నోటాను తప్పనిసరిగా అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా అధికారులు పట్టించుకోలేదన్నారు. ఓటు వినియోగించుకున్న వెంటనే రసీదు వచ్చేలా ఏర్పాటు చేయాలన్నారు. వీవీపీఏటీ విధానాన్ని అమలు చేయాలని 2013లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందన్నారు. ఖమ్మం, వరంగల్ మునిసిపల్ ఎన్నికల్లో నోటా లేదా వీవీపీఏటీ విధానాన్ని అమలు చేయడం లేదన్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని నోటా లేదా వీవీపీఏటీ విధానాన్ని అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని, మధ్యంతర అభ్యర్థన, ప్రధాన అభ్యర్థన ఒకే రకంగా ఉన్నందున తుది విచారణ జరిపిన తరువాతనే తగిన ఉత్తర్వులు జారీ చేస్తానని స్పష్టం చేశారు. -
మిల్లర్లదే రాజ్యం..!
ధాన్యం బిల్లులకు అడ్డంకులు సృష్టిస్తున్న మిల్లర్లు వారు కొన్న ధాన్యానికే ఎకనాలెడ్జ్మెంట్లు కొనుగోలు కేంద్రాల ద్వారా పంపిస్తే ఎకనాలెడ్జ్మెంట్లు ఇవ్వని వైనం విజయనగరం కంటోన్మెంట్: ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏ ముహూర్తాన మిల్లర్లకు అడ్వాన్సు సీఎంఆర్ పేరిట ధాన్యం కొనుగోలుకు కలెక్టర్ అనుమతులిచ్చారో గానీ అప్పటి నుంచి మిల్లర్లు ధాన్యం కొనుగోలుపైనే దృష్టి కేంద్రీకరించారు. ఆ ప్రకారమే ఇంకా ధాన్యం కొనుగోలు చేస్తూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యానికి ఎకనాలెడ్జ్మెంట్లు మిల్లర్లదే రాజ్యం..! ఇవ్వడం లేదు. దీంతో అస లు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ఈ ఏడాది ఆలస్యంగా ప్రారంభించారు. ప్రభుత్వం కొత్త విధానం ప్రకారం ఈ ఏడాది మిల్లర్లంతా వారి మిల్లుల సామర్థ్యాన్ని బట్టి ఎంత ధాన్యం తీసుకుంటే దాని విలువను డిపాజిట్ గానీ, బ్యాంకు గ్యారెంటీ కానీ ఇవ్వాలని ఉత్తర్వులు విడుదల చేయడంతో మిల్లర్లు బేరసారాలకు దిగారు. చివరకు కలెక్టర్ ఎంఎం నాయక్ కూడా వారి ఒత్తిళ్లకు తలొగ్గి ఒక వంతుకు మూడు రెట్ల ధాన్యం తీసుకెళ్లండని వరాన్నిచ్చారు. అయితే డిపాజిట్లు పూర్తిగా చెల్లించని వారికి అడ్వాన్సు సీఎంఆర్ ఇస్తే డిపాజిట్‌గా ఉంచుకుని దానిపై ధాన్యం ఇస్తామని చెప్పారు. అడ్వాన్సు సీఎంఆర్ ఎలా అంటే మిల్లర్లు కూడా దానికి సరిపడా ధాన్యం కొనుగోలు చేసుకోవచ్చని తేల్చేయడంతో ఇక మిల్లర్ల పంట పండినట్లయింది. ఇదే అదనుగా ఇప్పటికీ ధాన్యం కొనుగోలు చేస్తూనే ఉన్నారు. అక్కడితో ఆగలేదు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం కన్నా మిల్లర్లు బి రిజిస్టర్ ప్రకారం కొనుగోలు చేసిన ధాన్యానికే ఎకనాలెడ్జ్మెంట్లు ఇవ్వడంతో వాటికి మాత్రమే చెల్లింపులు అవుతున్నాయి. మరో పక్క ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యానికి మిల్లర్లు ఎకనాలెడ్జ్మెంట్లు ఇవ్వకపోవడంతో బిల్లులు అవడం లేదు. జిల్లా వ్యాప్తంగా సుమారు 4,800 మంది రైతులు బిల్లులకు ఎదురు చూస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిల్లర్లు తాము కొనుగోలు చేసిన ధాన్యానికి ఎకనాలెడ్జ్మెంట్లు ఇచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లిన ధాన్యానికి ఇవ్వడం లేదనీ, అందుకే బిల్లులు నిలిచిపోతున్నాయనీ రైతులు వాపోతున్నారు. మరో పక్క ఇటీవల బిల్లుల చెల్లింపు జాప్యం కూడా ఒక కారణం. ఎటు నుంచి ఎటు వచ్చినా మొత్తంగా రైతులే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అక్రమానికి ఆనవాళ్లు.. బాడంగి మండలం తెంటు వలసకు చెందిన గుంప సింహాచలమమ్మ గత నెలలో 148 ధాన్యం బస్తాలను డొంకిన వలస కొనుగోలు కేంద్రంలో ఇచ్చింది. ఇందుకు గాను రూ.83,472ల బిల్లు అందాల్సి ఉంది. కానీ ఇప్పటివరకూ బిల్లులు అందలేదు. ప్రతి రోజూ బిల్లుల గూర్చి అడుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. దత్తిరాజేరు మండలం పప్పల లింగాలవలసకు చెందిన పప్పల సత్యం 170 ధాన్యం బస్తాలు ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలిస్తే ఇప్పటివరకూ బిల్లులు అవలేదు. ఇతనికి రూ.95,880లు బిల్లు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికీ చేయలేదు. ఇదే గ్రామానికి చెందిన మోసూరు సత్యనారాయణ ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రానికి 150 బస్తాలు విక్రయించారు. ఇతనికి రూ.84,600లు రావాల్సి ఉంది. కానీ నిత్యం తిరుగుతున్నా బిల్లులు రావడం లేదని వాపోతున్నారు. -
రసీదు
వెంగళ్రావ్ పెట్టె సర్దుకుంటుంటే అడుగున ఒక స్లిప్పు కనిపించింది. అది ఐదు సంవత్సరాల క్రితం టైలరింగ్ షాపులో బట్టలు కుట్టడానికి ఇచ్చిన బట్టల తాలూకు రసీదు. ఆ స్లిప్పు తీసుకుని టైలర్ దగ్గరకు వెళ్లి, తన బట్టలు ఇమ్మని అడిగాడు వెంగళ్రావ్. టైలర్ ఆ స్లిప్పు పట్టుకుని లోపలికి వెళ్లి, అరగంట తర్వాత తిరిగొచ్చి చెప్పాడు... ‘‘సార్.. మీ బట్టలకు ఇంకా చిన్న చిన్న పనులున్నాయి. రెండ్రోజుల్లో రండి’’.