
రసీదు
వెంగళ్రావ్ పెట్టె సర్దుకుంటుంటే అడుగున ఒక స్లిప్పు కనిపించింది. అది ఐదు సంవత్సరాల క్రితం టైలరింగ్ షాపులో బట్టలు కుట్టడానికి ఇచ్చిన బట్టల తాలూకు రసీదు.
ఆ స్లిప్పు తీసుకుని టైలర్ దగ్గరకు వెళ్లి, తన బట్టలు ఇమ్మని అడిగాడు వెంగళ్రావ్. టైలర్ ఆ స్లిప్పు పట్టుకుని లోపలికి వెళ్లి, అరగంట తర్వాత తిరిగొచ్చి చెప్పాడు... ‘‘సార్.. మీ బట్టలకు ఇంకా చిన్న చిన్న పనులున్నాయి. రెండ్రోజుల్లో రండి’’.