Additional forces
-
వాట్సాప్ గ్రూపులతో బందోబస్తు!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచార పర్వంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అనుసరించిన వాట్సాప్ గ్రూపుల విధానాన్ని.. ఇప్పుడు పోలీసులు ఎన్నికల బందోబస్తు, నిఘా కోసం అవలంబిస్తున్నారు. ఇతర రాష్ట్రాలు, కేంద్రం నుంచి వచ్చిన అదనపు బలగాలతోపాటు స్థానిక సిబ్బంది పనిని ఈ గ్రూపులతో పర్యవేక్షిస్తున్నారు. పాయింట్ డ్యూటీలు, రూట్లలో ఉన్న సిబ్బంది తమ లొకేషన్, సెల్ఫీ ఫొటోలను గ్రూపుల్లో షేర్ చేయడాన్ని తప్పనిసరి చేశారు. ఇక బందోబస్తు, భద్రత విధుల్లో ఉన్న సిబ్బందికి ఇబ్బంది రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వారికి బస, రవాణా, ఆహారం తదితరాల కోసం ఏర్పాట్లు చేశారు. ఇన్స్పెక్టర్ల నేతృత్వంలో.. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ తరఫున ప్రచారం చేయడానికి, కాలనీలు, బస్తీల్లో జెండాలతో సంచరించడానికి చాలా మందిని నియమించుకున్నారు. వారికి రోజులు, వారాల లెక్కన చెల్లింపులు చేశారు. బృందాలుగా చేసి ప్రాంతాల్లో తిప్పారు. వారు తాము చెప్పిన చోటుకే వెళ్తున్నారా? స్థానికులను కలుస్తున్నారా? ప్రచారం చేస్తున్నారా? అన్నది పరిశీలించేందుకు వాట్సాప్ గ్రూపులను వాడారు. క్షేత్రస్థాయిలో ఉన్నవారు ఎప్పటికప్పుడు తమ లొకేషన్లు షేర్ చేసేలా, ప్రజలతో సెల్ఫీలు దిగిపోస్ట్ చేసేలా చర్యలు చేపట్టారు. ఇదే వ్యూహాన్ని బందోబస్తు, భద్రత చర్యల కోసం వచ్చి న అదనపు బలగాలను పర్యవేక్షించడానికి పోలీసు ఇన్స్పెక్టర్లు వాడుతున్నారు. కేంద్రం నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రత్యేక, సాయుధ బలగాలను పోలీసుస్టేషన్ల వారీగా కేటాయించారు. ఆయా పోలీస్స్టేషన్ల ఇన్స్సెక్టర్లే వారి విధులను పర్యవేక్షించాలి. ఎవరెవరు ఏ విధుల్లో ఉన్నారు? ఎక్కడ ఉన్నారన్నది సులువుగా తెలుసుకుని, పర్యవేక్షించేలా ఇన్స్పెక్టర్లు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. రూట్ పార్టీ ల్లో తిరుగుతున్న, పాయింట్ డ్యూటీల్లో ఉన్న సిబ్బంది కచ్చి తంగా తమ ఫొటోలు, లొకేషన్లను అందులో షేర్ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. సిబ్బందికి ఇబ్బందులు లేకుండా.. బందోబస్తు విధులంటే పోలీసులకు ఇబ్బందే. తాగడానికి నీళ్లుండవు, ఆహారం ఉండదు. కేటాయించిన ప్రాంతాన్ని వదిలి కదలడానికి లేదు. రిపోర్ట్ చేసిన అధికారి కార్యాలయం నుంచి డ్యూటీ పాయింట్‌కు వెళ్లేందుకూ ఇబ్బందే. ఈసారి ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సిబ్బంది రిపోర్ట్ చేసిన ప్రాంతం నుంచి పాయింట్‌కు చేరడం కోసం, అవసరమైన పక్షంలో ప్రత్యేక గస్తీలు నిర్వహించడం కోసం వాహనాలు అద్దెకు తీసుకున్నారు. భోజనం, టీ, మంచినీళ్లుఅందేలా ఏర్పాట్లు చేశారు. -
అమలాపురానికి అదనపు బలగాలు
-
అమలాపురానికి అదనపు బలగాలు.. నిలిచిపోయిన బస్సులు
సాక్షి, కోనసీమ జిల్లా: అమలాపురంలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అదనపు బలగాలను పోలీసులు మోహరించారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల నుంచి ప్రత్యేక దళాలను అధికారులు తరలించారు. అమలాపురంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. కాకినాడ, రాజమండ్రి నుంచి కోనసీమ బస్సు సర్వీసులను రద్దు చేశారు. అమలాపురంలో పరిస్థితి అదుపులోకి తెచ్చామని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. డీఐజీ, ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నారన్నారు. ఆందోళనలపై విచారణ చేపడతామని డీజీపీ పేర్కొన్నారు. చదవండి: అంబేడ్కర్ పేరుపై అగ్గి రాజేసిన 'కుట్ర'! ‘సాక్షి’తో ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు మాట్లాడుతూ, అమలాపురంలో ఆందోళనల్లో పాల్గొని విధ్వంసం సృష్టించిన వారిని గుర్తిస్తున్నామని, ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలగకూడదని అమలాపురంలో కర్ఫ్యూ విధించడం లేదన్నారు. కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికంగా ఉన్న కొన్ని వర్గాలు మంగళవారం రెచ్చిపోయాయి. పక్కా స్కెచ్‌తో జిల్లాలోని దళిత, బీసీ నేతలను టార్గెట్ చేసుకుంటూ పెట్రేగిపోయాయి. ఇది కొన్ని కులాలు, వర్గాలకు సంబంధించిన సున్నితమైన అంశం కావటంతో పోలీసులు పూర్తిస్థాయిలో సంయమనం పాటించగా... దాన్ని అలుసుగా తీసుకున్న ఆ వర్గాలు విచ్చలవిడిగా ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తుల్ని ధ్వంసం చేశాయి. -
వ్యూహాత్మక మోహరింపు
న్యూఢిల్లీ: అదనపు బలగాలను తరలించడం ద్వారా తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు దక్షిణతీరంలో మూడు వ్యూహాత్మక పర్వత ప్రాంతాలపై భారత్ పట్టుబిగించింది. ఈ ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా దుస్సాహం చేయగా... భారత్ సమర్థంగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద భారత భూభాగంలో పాంగాంగ్ సరస్సుకు ఉత్తరవైపు కూడా బలగాల మోహరింపులో వ్యూహాత్మక మార్పులు చేసినట్లు రక్షణశాఖ వర్గాలు బుధవారం తెలిపాయి. తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడిన నేపథ్యంలో ఉద్రిక్తతలను చల్లార్చేందుకు భారత్, చైనా చూశుల్లో వరుసగా మూడోరోజు బుధవారం మిలిటరీ కమాండర్ స్థాయి చర్చలు జరిపినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. భారత బలగాలు కొన్ని కీలక పర్వత ప్రాంతాలపై మోహరించడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఈ ప్రాంతాలన్నీ తమ భూభాగంలోనే ఉన్నాయని, బలగాలను ఉపసంహరించే ప్రసక్తే లేదని భారత్ తేల్చిచెప్పింది. చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకునేందుకు సిద్ధమని, ఒకవేళ చైనా వాస్తవాధీన రేఖ వద్ద ఎలాంటి అతిక్రమణలకు పాల్పడినా దీటుగా బదులిస్తామని రక్షణవర్గాలు పేర్కొన్నాయి. గత కొద్ది రోజుల్లో భారత్ తూర్పు లద్దాఖ్‌లోని కొన్ని కీలక పర్వత ప్రాంతాల్లో బలగాలను మోహరించి వ్యూహాత్మక ఫలితాలు సాధించిందని చెప్పాయి. 3,400 కిలోమీటర్ల పొడవున్న వాస్తవధీన రేఖ వెంబడి 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని భారత బలగాలను ఆదేశాలు వెళ్లాయి. కాగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం అత్యున్నత సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద సున్నిత ప్రాంతాల్లో చైనా దుస్సాహసానికి పాల్పడితే భారత్ దూకుడుగానే స్పందించాలని ఈ భేటీలో నిర్ణయించారు. పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలో మరిన్ని బలగాలను మోహరించడంతోపాటు, క్షిపణి నిరోధక ట్యాంకులను, ఇతర ఆయుధాలను తరలించాలని నిర్ణయించారని సంబంధిత వర్గాలు చెప్పాయి. స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్ బెటాలియన్ కూడా ఇప్పటికే రంగంలోకి దిగింది. తూర్పువైపు బలగాలు సరిహద్దులో డ్రాగన్ దేశం కవ్వింపునకు పాల్పడుతుండటంతో భారత్ అప్రమత్తమైంది. పశ్చిమ హిమాలయాల వైపు చైనా బలగాలు దురాక్రమణకు యత్నించి ఉద్రిక్తత సృష్టించిన నేపథ్యంలో తూర్పు వైపు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కింలలో సరిహద్దు వెంబడి భద్రతను మరింత పెంచింది. పెద్ద ఎత్తున బలగాలను తరలించింది. సరిహద్దులో అరుణాచల్‌ప్రదేశ్‌లోని అంజా జిల్లాలో భారత బలగాలు కదలికలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతం తనదేనని చైనా చెప్పుకుంటుండటంతో ఇరుదేశాల బలగాల మధ్య ఘర్షణ చెలరేగుతుందనే ఆందోళనలు మొదలయ్యాయి. అయితే బలగాల బాహాబాహీకి ఎంతమాత్రం అవకాశం లేదంటూ ప్రభుత్వ, మిలిటరీ వర్గాలు దీన్ని కొట్టిపారేస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ జరగని రీతిలో గత జూన్‌లో లద్దాఖ్‌లో ఘర్షణ జరిగింది. ఇప్పడిప్పడే పరిస్థితులు కుదుటపడుతున్నాయనుకుంటున్న సమయంలో చైనా బలగాలు మరోసారి పాంగాంగ్ దక్షిణ తీరంలో దురాక్రమణకు యత్నించి మరింత అగ్గిని రాజేశాయి. దీంతో చైనా సరిహద్దులో తూర్పువైపునకు భారత్ బలగాలను తరలించిందని ఓ అధికారి చెప్పారు. పెద్ద ఎత్తున ఆర్మీ బెటాలియన్లు మోహరించాయి. అయితే దాడులకు సంబంధించి ఎలాంటి నిర్దేశిత ఆధారాలు లేవు అని అంజా జిల్లా సీనియర్ అధికారి ఆయుషి సుడాన్ చెప్పారు. జూన్‌లో గల్వాన్‌లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన తర్వాత భారత బలగాల మోహరింపు మాత్రం చాలా పెరిగిందన్న విషయాన్ని ఆమె స్పష్టంచేశారు. ఆయా గ్రామాల్లోని వారికి మరిన్ని సదుపాయాలు, అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు. ఆందోళన అక్కర్లేదు 1962లో అరుణాచల్‌ప్రదేశ్ (ఈ ప్రాంతాన్ని చైనా దక్షిణ టిబెట్ అని పిలుస్తుంది) లో భారత్, చైనా మధ్య యుద్ధం జరిగిందని, ఇక్కడ మళ్లీ ఇరు దేశాల మధ్య ఘర్షణ జరగవచ్చని భద్రతారంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత బలగాల పెంపు ప్రాధాన్యం సంతరించుకుంది. తూర్పు వైపు భద్రంగా ఉంచేందుకే ఈ చర్య అని భావిస్తున్నారు. భారత మిలటరీ అధికార ప్రతినిధి లెఫ్ట్‌నెంట్ కల్నల్ హర్షవర్దన్ పాండే మాత్రం బలగాల మోహరింపు సాధారణంగా జరిగే రొటేషన్ ప్రక్రియ అని అన్నారు. దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. సాధారణంగా ఆర్మీ యూనిట్లు మారుతుంటాయి. ఇది నిరంతం జరిగే ప్రక్రియ అని పేర్కొన్నారు. చైనా బలగాలు మాత్రం భారత్‌లోకి చొరబడుతూనే ఉన్నాయని అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ తపిర్ గవో అన్నారు. అంజా జిల్లాలోని వలోంగ్, ఛగ్లాగామ్లు చాలా సున్నితమైన ప్రాంతాలని పేర్కొన్నారు. -
చైనా సరిహద్దులకు మరిన్ని బలగాలు
న్యూఢిల్లీ: చైనాతో ఉన్న సరిహద్దుల వెంబడి అదనంగా మరో 35 వేల మందిని నియమించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. తూర్పు లద్దాఖ్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో చైనా తరచూ సరిహద్దు వివాదాలు సృష్టిస్తూండటం, ఇటీవల గల్వాన్ లోయలో పొరుగుదేశపు సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది జవాన్లు వీరమరణం పొందడం ఈ నిర్ణయానికి కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. గల్వాన్ ఘటన తరువాత ఇరుదేశాల మధ్య జరుగుతున్న చర్చలు ఇప్పట్లో ఫలితమిచ్చే అవకాశం లేకపోవడం ఇంకో కారణం. భారత్ చైనా సరిహద్దులు 3,488 కిలోమీటర్ల పొడవు ఉండగా వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దులను కాపాడుకునేందుకు భారత్ ఇప్పటికే భారీగా ఖర్చు పెడుతోంది. ‘‘వాస్తవాధీన రేఖ వెంబడి మరీ ముఖ్యంగా లద్దాఖ్ ప్రాంతంలో పూర్తిగా మారిపోయింది. రెండువైపులా అదనపు బలగాలను మోహరిస్తున్నారు. అత్యున్నత స్థాయి రాజకీయ నిర్ణయం జరిగితే మినహా ఏ పక్షమూ తన బలగాలను వెనక్కు తీసుకోదు’’అని ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ‘ద యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్’డైరెక్టర్ విశ్రాంత మేజర్ జనరల్ బి.కె.శర్మ తెలిపారు. సరిహద్దు సమస్యపై కమాండర్ల స్థాయిలో ఇంకోసారి చర్చలు జరగనున్నాయని, సమస్య పరిష్కారానికి భారత్ తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ వ్యాఖ్యానించారు. సైన్యం ఉపసంహరణ పూర్తి కాలేదు తూర్పు లద్దాఖ్‌లోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి చైనా దళాల ఉపసంహరణ ఇంకా పూర్తి కాలేదని భారత్ గురువారం స్పష్టం చేసింది. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. దళాల ఉపసంహరణ అన్ని వివాదాస్పద ప్రాంతాల నుంచి దాదాపు పూర్తయిందని చైనా రెండు రోజుల క్రితం ప్రకటించిన నేపథ్యంలో భారత్ ఈ స్పష్టత ఇచ్చింది. ‘బలగాల ఉపసంహరణకు సంబంధించి కొంత పురోగతి ఉంది. కానీ, పూర్తిగా ఉపసంహరణ జరగలేదు’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. వాస్తవాధీన రేఖ వెంట ఘర్షణ కేంద్రాల్లో పూర్తి స్థాయి బలగాల ఉపసంహరణ, సరిహద్దుల్లో శాంతి.. విషయాల్లో చైనా నిజాయతీగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నామన్నారు. రెండు దేశాల మధ్య మరో విడత మిలటరీ కమాండర్ స్థాయి చర్చలు మరో రెండు రోజుల్లో జరగనున్నాయని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. స్మారకంపై గల్వాన్ అమరులు తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో చైనా సైన్యంతో పోరాడి, వీరమరణం పొందిన 20 మంది అమరజవాన్ల పేర్లను ఢిల్లీలోని నేషనల్ వార్‌మెమొరియల్‌పై లిఖించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పేర్లు చేర్చడానికి కొద్ది నెలల సమయం పట్టనున్నట్టు తెలిపారు. ఐదు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా జూన్ 15వ తేదీన గల్వాన్ లోయలో చైనా సైనికులతో భీకర పోరాటం జరిగింది. ఈ పోరాటంలో 16 బిహార్ రెజిమెంట్‌కి చెందిన కల్నల్ బి.సంతోష్ బాబుతో పాటు, 20 మంది సైనికులు అసువులు బాశారు. చైనా వైపు ఈ ఘర్షణలో ఎంత మంది చనిపోయారనేది ప్రకటించలేదు. అమెరికా నిఘా వర్గాల ప్రకారం 35 మంది చైనా సైనికులు చనిపోయినట్టు తెలుస్తోంది. -
పోలవరం ముంపు ప్రాంతాల్లో అదనపు బలగాలు
కాకినాడ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సమస్యలు సృష్టించేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ పేర్కొన్నారు. వారి దుశ్చర్యలతో అమాయకులైన గిరిజనులను రెచ్చగొడుతున్నారని తెలిపారు. పోలవరం నిర్మాణ ప్రాంతం, ముంపు ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలు అదుపుచేసేందుకు అదనపు బలగాలు మోహరించామన్నారు. పోలవరం లాంటి గొప్ప ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించే అవకాశం పోలీసులకు ఇన్నాళ్లకు వచ్చినందుకు అందరూ సంతోషించాలన్నారు. ఈ సందర్భంగా ఆయన 2015 పోలీస్ డైరీని ఆవిష్కరించారు. -
సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు బలగాలు..
సంగారెడ్డి అర్బన్: సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు బలగాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పాత డీఆర్డీఏ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేసే ఎన్నికల సామగ్రిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తనిఖీ చేసి సంబంధిత అధికారులకు అందించినట్టు తెలిపారు. ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సకాలంలో తరలివెళ్లి అక్కడి ఏర్పాట్లను వెంటనే పూర్తి చేసుకోవాలన్నారు. పాటు మైక్రో అబ్జర్వర్లు, వెబ్‌కాస్టింగ్ సిబ్బంది కూడా వెళ్లారని, శనివారం ఉదయం 6 గంటలకు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించాలన్నారు. అనంతరం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఉప ఎన్నిక నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించామని, సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఓటరు స్లిప్‌లను ఓటర్లందరికీ అందించామని, ఇంకా ఎవరికైనా ఓటరు స్లిప్ అందని పక్షంలో పోలింగ్ కేంద్రం దగ్గర్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రం నుంచి పొందవచ్చన్నారు. ఫొటో ఓటరు స్లిప్ లేనిపక్షంలో ఎన్నికల సంఘం సూచించిన ఏదేని ఒక కార్డును ఎన్నికల అధికారికి చూపించి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చన్నారు. -
నేడో రేపో అదనపు బలగాలు
{పశాంతంగా ముగిసిన నామినేషన్ల ఘట్టం తొలి విడత బందోబస్తు విజయవంతం ఇక ఎన్నికల ప్రచారం... పోలింగ్‌పై దృష్టి సాక్షి, సిటీబ్యూరో: సార్వత్రిక ఎన్నికల బందోబస్తు కోసం కేంద్ర బలగాలు నేడో రేపో జంట కమిషనరేట్లకు చేరుకోనున్నాయి. గతనెల మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అప్పటి నుం చి బుధవారంతో ముగిసిన నామినేషన్ల పర్వం వరకు ఎన్నిక మొదటి ఘట్టం బందోబస్తును జంట కమిషనరేట్ల పోలీసు విజ యవంతంగా పూర్తి చేశారు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించిన అన్ని రాజకీయ పార్టీల నేతలపై సుమారు 187 కేసులు నమోదు చేశారు. కొంత మంది నేతలను ఏకంగా అరెస్టు చేసి.. సొంత పూచికత్తుపై విడుదల చేశారు. ఎన్నికల నిబంధనల మేరకు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో ఇప్పటి వరకు సుమారు రూ. 27 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి రూ.10 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆత్మరక్షణార్థం తీసుకున్న 6వేల లెసైన్స్డ్ఆయుధాలను (తుపాకులు, రివాల్వర్లు) ప్రజల నుంచి వెనక్కి తీసుకొని తమ వద్ద డిపాజిట్ చేసుకున్నారు. వివిధ కేసుల్లో నిం దితులుగా ఉండి పరారీలో ఉన్న 900 మందిని అరెస్టు చేసి కోర్టు లో హాజరుపర్చారు. వీరిలో కొం దరు రౌడీషీటర్లు కూడా ఉన్నారు. చివరి రోజు ఉక్కిరిబిక్కిరి... నామినేషన్ల దాఖలకు బుధవారం చివరి రోజు కావడంతో నామినేషన్ల సెంటర్ వద్ద కోలాహలం నెలకొంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు, వారి మద్దతుదారులు పెద్ద సంఖ్యలో నామినేషన్ల సెంటర్ల వద్దకు ర్యాలీగా రావడంతో పోలీసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. నిబంధనలు ఉల్లంఘించిన నేతలపై కేసులు నమోదు చేశారు. మొత్తానికి నామినేషన్ల ఘట్టం ప్రశాంతంగా ముగియడంతో ఇక అభ్యర్థుల ప్రచారం, ఎన్నికల పోలింగ్ బందోబస్తుపై దృష్టి పెట్టారు. నగర కమిషనరేట్ పరిధిలో... నగర కమిషనరేట్ పరిధిలోని 15 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలలో మొత్తం 35,98,152 మంది ఓటర్లు 3091 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కేంద్రం నుంచి అదనపు బలగాలను రప్పిస్తున్నారు. నేడో రేపో ఇవి నగరానికి చేరుకుంటాయని తెలుస్తోంది. సైబరాబాద్‌లో... సార్వత్రిక ఎన్నికల కోసం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 4372 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో నక్సల్స్ ప్రభావితం ఉన్నవి 32, అత్యంత సమస్యాత్మకమైనవి 56, సమస్యాత్మకమైనవి 294 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మల్కాజిగిరి, చేవేళ్ల, భువనగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలు ఈ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి. అలాగే, మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి అసెంబ్లీ స్థానాలు పూర్తిగా, చేవేళ్ల, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, యాకుత్‌పురా అసెంబ్లీ స్థానాలు పాక్షికంగా ఈ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి.