Adele
-
గ్రామీ అవార్డుల్లో అడెలె హవా
లాస్ఏంజిల్స్: సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘గ్రామీ’ పురస్కారాల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. 59వ ‘గ్రామీ’ అవార్డుల్లో పాప్ సింగర్ అడెలె ఐదు అవార్డులు గెలుపొంది సత్తాచాటారు. ఆమెకు ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్(25), రికార్డ్ ఆఫ్ ద ఇయర్(హలో), సాంగ్ ఆఫ్ ద ఇయర్(హలో) అవార్డులతో పాటు.. బెస్ట్ పాప్ సోలో పర్ఫామెన్స్, బెస్ట్ పాప్ ఓకల్ ఆల్బమ్ అవార్డులను సొంతం చేసుకున్నారు. 9 విభాగాల్లో నామినేషన్ పొందిన బియోన్స్.. బెస్ట్ మ్యూజిక్ వీడియో, కాంటెంపరరీ ఆల్బమ్ అవార్డులను గెలుచుకున్నారు. డేవిడ్ బొవీకి నాలుగు పురస్కారాలు దక్కాయి. ఉత్తమ రాక్ సాంగ్(బ్లాక్‌స్టార్), ఉత్తమ రాక్ పర్ఫామెన్స్(బ్లాక్‌స్టార్) అవార్డులు డేవిడ్ బొవీకి దక్కాయి. -
'వైఫై మనల్ని చంపేస్తుంది'
లండన్: టెక్నాలజీ డెవలప్మెంట్ మన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆస్కార్ విన్నింగ్ సింగర్ అడెలె ఆందోళన చెందుతోంది. మరో 25 ఏళ్లలో వైర్లెస్ ఇంటర్నెట్ టెక్నాలజీ అందరి మరణానికి కారణమౌతుందని అంచనావెస్తుంది. టెక్నాలజీ మనుషుల జీవితాలను డామినేట్ చేస్తుందని ఇది అంత మంచిది కాదని ఫీమేల్ ఫస్ట్‌తో మాట్లాడుతూ అడెలె వెల్లడించింది. ప్రజలు నిజానికి వారి ముందున్న క్షణాన్ని ఆస్వాదించకుండా.. ఫోటోలపైనే దృష్టి పెడుతున్నారని అంది. 'గతంలో నేను షో చేస్తున్న సమయంలో ఎవరివద్దా ఎక్కువగా మొబైల్ ఫోన్స్ ఉండేవి కావు. కాబట్టి నేను జనాల కోసం స్టేజిపైకి వెళ్లేదాన్ని. ఇప్పుడు మాత్రం ఫోన్ల కోసం వెళ్తున్నట్లుగా ఉంది' అని అడెలె అసహనం వ్యక్తం చేసింది. ఇప్పుడు వాస్తవ ప్రపంచంలోకి ఎవరూ చూడటం లేదని.. అందరూ ఫోన్లలోనే ఉంటున్నారని అంది. రాబోయే కాలంలో వైఫై మూలంగా తీవ్ర పరిణామాలు తప్పవని చెప్పుకొచ్చింది. -
'సారీ ఆగలేకపోయాను..!'
గోవా బ్యూటీ ఇలియానా.., సినిమా అవకాశాలు లేకపోయినా అభిమానులు మాత్రం మరిచిపోకుండా ఏదో ఒక విధంగా అలరిస్తూనే ఉంది. బాలీవుడ్ ఆశలతో సౌత్ సినిమాకు టాటా చెప్పిన ఈ సుందరి, తరువాత అక్కడ కూడా సరైన అవకాశాలు రాకపోవటంతో మరోసారి దక్షిణాది వైపు చూస్తోంది. అయితే ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్‌లలో స్టార్ హీరోయిన్లకు భారీ పోటీ ఉండటంతో ఇలియానా వైపు చూసేవారే కరువయ్యారు. దీంతో అభిమానులు మర్చిపోకుండా ఫొటో షూట్లు, పబ్లిక్ ఫంక్షన్లతో పాటు, సోషల్ నెట్వర్కింగ్ సైట్లతో ఏదో ఒక వార్త క్రియేట్ చేస్తూనే ఉంది ఇల్లీ బేబీ. తాజాగా ల్యాండ్ లైన్ ఫోన్ పట్టుకుని దిగిన ఓ హాట్ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ట్విట్టర్ పేజ్‌లపై షేర్ చేసిన ఇలియానా, ' హలో ఇది నేనే.. సారీ ఆదిల్.. ఆగలేకపోయాను' అంటూ ట్వీట్ చేసింది. Hello...it's me.. Sorry adele cldnt resist! #hello #adele #morningmuses #yepivehadcoffee https://t.co/Y1W7rMgGmH — Ileana D'Cruz (@Ileana_Official) December 1, 2015