adi narayanareddy
-
ఆది అత్యుత్సాహం.. డీఎస్పీ ఓవర్ యాక్షన్
సాక్షి, చాపాడు: రాష్ట్ర మంత్రి, టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి మండలంలోని చిన్నగురువళూరు పోలింగ్ కేంద్రం వద్ద అత్యుత్సాహం ప్రదర్శించగా.. ప్రొద్దుటూరు డీఎస్పీ శ్రీనివాసరావు ఓవర్ యాక్షన్ చేశారు. వివరాల్లోకి వెళితే.. చాపాడు మండలంలోని నక్కలదిన్నె, అనంతపురం, తిప్పిరెడ్డిపల్లె, చిన్నగురువళూరు గ్రామాల్లో ఏజెంట్లను మంత్రి ఆదినారాయణరెడ్డి, మైదుకూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్ స్వయంగా తన కార్లలో తీసుకువచ్చి కూర్చోబెట్టారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి అత్తగారి ఊరైన చిన్నగురువళూరు గ్రామంలో కూర్చోబెట్టేందుకు ఇద్దరు మహిళా ఏజెంట్లను తీసుకొచ్చారు. నిబంధనల ప్రకారం పోలింగ్‌ముందు రోజే ఏజెంట్లు వివరాలు ఇవ్వాల్సి ఉండగా టీడీపీ వర్గీయులు ఇవ్వలేదు. ఈ నేపథ్యం లో ఆది, పుట్టా తీసుకువచ్చిన సదరు ఏజెంట్లను కూర్చోడానికి పోలింగ్ ఆఫీసరు నిరాకరించారు. దీంతో మంత్రి ఆది అత్యుత్సాహం ప్రదర్శించారు. కలెక్టర్‌తో, రిటర్నింగ్ అధికారితో మాట్లాడమని తన ఫోను ఇవ్వగా పోలింగ్ సిబ్బంది నిరాకరించారు. నిబంధనలకు వ్యతిరేకంగా చేయలేమని చెప్పిన పోలింగ్ అధికారులు గంట సేపటి తర్వాత రిటర్నింగ్ అధికారి చెప్పారనే సాకుతో ఏజెంట్లను నియమించారు. అప్పటికే పోలింగ్ కేంద్రం వద్ద మంత్రి ఆది అధికారులపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో రంగ ప్రవేశం చేసిన స్పెషల్ పార్టీ పోలీసులు కలుగజేసుకుని మంత్రి ఆది, అభ్యర్థి పుట్టాలను పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లాలని హుకూం జారీ చేశారు. దీంతో మంత్రి ఆది పోలీసు సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. ఇదే క్రమంలో ప్రొద్దుటూరు డీఎస్పీ శ్రీనివాసరావు సైతం చిన్నగురువళూరు పోలింగ్ కేంద్రానికి చేరుకుని అక్కడి స్పెషల్ పోలీసులపై నోరు పారేసుకున్నారు. తెలుగు రాని వారిని పెడితే ఇదే ఇబ్బందన్నారు. దీనిపై అక్కడున్న స్థానిక సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రంలో ఇబ్బంది కలిగిస్తున్నారనే బయటికి పంపించాల్సి వచ్చిందన్నారు. అనంతరం దీంతో ఖంగుతున్న మంత్రి ఆది, అభ్యర్థి పుట్టా కాసేపటికి వెనుదిరిగి వెళ్లిపోయారు. -
ప్రజాపక్షమా..అవకాశవాదమా..
సాక్షి ప్రతినిధి, కడప : ప్రజల కోసం...ప్రాంతం కోసం...పదవీ త్యాగం చేసినవారు ఒకరైతే.., అధికారం కోసం పార్టీ ఫిరాయించి, ఆదరించిన వారినే దూషిస్తూ, అనూహ్యంగా అమాత్య పదవి దక్కించుకున్న వారు మరొకరు. ఆ ఇద్దరే కడప గడ్డపై లోక్‌సభ అభ్యర్థులుగా ఈసారి తలపడుతున్నారు. ప్రజల పక్షానే నిరంతరం నిలుస్తూ సేవే పరమావధిగా భావిస్తూ ఒకరు జోరుగా ప్రచారంలో దూసుకుపోతుండగా .. ఎత్తులు, పైఎత్తులు వేస్తూ, కుయుక్తులు పన్నుతూ అవకాశవాద రాజకీయాలకు చిరునామాగా నిలిచే మరొకరు ప్రజల ముందుకు వస్తున్నారు. పరస్పర విరుద్ధ భావాలున్న ఇద్దరు అభ్యర్థుల నడుమ కడప ఎంపీ పోరు నడుస్తోంది. కడప లోక్‌సభ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్‌రెడ్డి పోటీలో ఉన్నారు. 2014లో కడప ఎంపీగా ఈయనే ఎన్నికయ్యారు. తనపై విశ్వాసంతో పట్టం కట్టిన ప్రజలకు వెన్నుదన్నుగా నిరంతరం నిలవడం ఆయనకున్న అనుకూలాంశం. విశాల హితంతో ప్రత్యేక హోదా మనకు సంజీవనిగా భావించి ఎంపీగా పార్లమెంట్లో పోరాడారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపర్చిన ఉక్కుఫ్యాక్టరీ నిర్మించాలని చట్టసభలో నినదించారు. పార్లమెంటు సాక్షిగా చేసిన చట్టానికే విలువ లేకపోతే చట్టసభలపై ప్రజలకు నమ్మకం పోతుందని విరుచుకు పడ్డారు. విభజనలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారని, ప్రత్యేకహోదా ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఉద్యమంలో బలంగా నిలిచారు. తుదకు ఎంపీ పదవిని ఇందుకోసం తృణప్రాయంగా వదులుకున్నారు. కడప, రాజంపేట ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. ప్రజల కంటే పదవులు ముఖ్యం కాదని రుజువు చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పదవీ త్యాగం చేసిన ఆ ఇద్దరూ వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా ఈసారి కూడా ఎంపీ బరిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థులుగా మంత్రి ఆదినారాయణరెడ్డి, డీఏ సత్యప్రభ పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ పార్లమెంటు బరిలో తొలిసారిగా నిలిచారు. అవకాశవాదిగా ముద్రవేసుకున్న ఆది... జమ్మలమడుగు నుంచి వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందిన ఆదినారాయణరెడ్డి తర్వాత టీడీపీలో చేరారు. అధికారం కోసం అనైతిక చర్యలకు పాల్పడ్డారు. తనను ఆదిరించి అక్కున చేర్చుకున్న పార్టీని, వైఎస్ కుటుంబాన్ని దూషిస్తూ వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తూ, సీఎం చంద్రబాబు దృష్టిని ఆకర్షించారు. ఆపై టీడీపీ నేతల్ని కాదని ..ఫిరాయించిన ఎమ్మెల్యేగా అనూహ్యంగా మంత్రి పదవిని చేజెక్కించుకున్నారు. నడిమంత్రపు సిరిలా మంత్రి హోదా దక్కడంతో ఆదినారాయణరెడ్డి విచ్చలవిడిగా వైఎస్ఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వచ్చారని పరిశీలకులు భావిస్తున్నారు. రాజకీయాల్లో తనంత తెలివితేటలు ఉన్న నాయకుడు లేరన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉంటాయని ఆయన సన్నిహితులే వ్యాఖ్యానిస్తుంటారు. ఈనేపథ్యంలో కడప పార్లమెంటు గడపలో అనేక కుయుక్తులు పన్నుతూ రాజకీయ సారథ్యం చేస్తున్నారు. జమ్మలమడుగులో చేజారుతున్న ఆశలు.... వైఎస్సార్సీపీని కట్టడి చేస్తామని, ఎంపీకి గణనీయంగా మెజార్టీ తగ్గిస్తామని ఆదినారాయణరెడ్డి తమ అధినేత చంద్రబాబు ఎదుట గట్టిగా హామీ ఇచ్చినట్లు సమాచారం. ఆ మాట నిలుపుకుంటే టీడీపీలో తనకు భవిష్యత్ ఉంటుందనే దిశగా వ్యూహాత్మక ఎత్తుగడలను వేస్తున్నారు. పులివెందులలో వైఎస్సార్సీపీ మెజార్టీ తగ్గించి, జమ్మలమడుగులో టీడీపీ మెజార్టీ పెంచుకోవాలనే దిశగా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ‘టార్గెట్ పులివెందుల’ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల్ని రంగప్రవేశం చేయించి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారనే పేరున్న వైఎస్ అవినాష్‌రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణ ముందు టీడీపీ అభ్యర్థి పాచికలు పారవని స్థానికులంటున్నారు. టీడీపీకి అండగా నిలుస్తుందనుకున్న జమ్మలమడుగులోనే ఈసారి ప్రజావ్యతిరేకత బహిర్గతం కానుందని ఎన్నికల విశ్లేషకుల అంచనా. జమ్మలమడుగు చరిత్రలో మునుపెన్నడూ ఏ ఒక్క నాయకుడి సమావేశానికి రానంతగా ప్రజలు శుక్రవారం ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశానికి హాజరైయ్యారు. టీడీపీకి అండగా నిలుస్తోందని భావించిన జమ్మలమడుగులోనే ప్రతికూల పరిస్థితి ఏర్పడిందని వైఎస్సార్సీపీ ఎన్నికల సభ చెప్పకనే చెప్పింది. తక్కిన 6 నియోజకవర్గాలల్లో ఏ ఒక్క చోట కూడా అధికార పార్టీ పుంజుకునే పరిస్థితి లేదని తెలుస్తోంది. పులివెందుల, కడప, మైదుకూరు, బద్వేల్, ప్రొద్దుటూరు, కమలాపురం నియోజకవర్గాలల్లో ఎంపీ పదవీ త్యాగం చేసిన వైఎస్ అవినాష్‌రెడ్డి ఎదుట అవకాశవాదిగా ముద్రపడ్డ ఆదినారాయణరెడ్డి ఎత్తులు పారడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం ఓటర్లు : 15,68,388 పురుషులు : 7,72,685 మహిళలు : 7,95,469 ఇతరులు : 234 -
మంత్రి హోదాలో ప్రజలకు ఏం చేశారు?
సాక్షి, మైలవరం : ఆదినారాయణరెడ్డి మంత్రి హోదా లో ఉండి ప్రజలకు ఏం చేశారని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వేపరాల సీతారాముల కళ్యాణ మండపంలో మండల వైఎస్సార్సీపీ కార్యకర్తల, బూత్‌లెవల్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మండలంలో గొల్లపల్లె దగ్గర నెలకొల్పాల్సిన ఏసీసీ సిమెంటు కార్మాగారం ఏమైందని ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో సోలార్కు డీకేటీ భూములను ఇచ్చిన రైతులకు పరిహారం అందిందన్నారు. మండలంలో సోలార్ కోసం డీకేటి భూములు ఇచ్చిన రైతులకు పరిహారం ఇప్పించడంలో మంత్రి ఆదినారాయణరెడ్డి విఫలయయ్యారన్నారు. మంత్రి, ఎమ్మెల్సీ ఉన్నా ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. చేనేత సొసైటీల ద్వారా చేనేత కార్మికుల అభ్యున్నతికి నవరత్నాల్లాంటి పధకాలతో పాటు మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు రూ.2 వేలు అందిస్తామన్నారు. సు«ధీర్‌రెడ్డి మాట్లాడుతూ నీతి, నిజాయితీలు కోల్పోయిన నాయకులిద్దరు ప్రజల్లోకి రావా లంటే జంకుతున్నారన్నారు. సోలార్‌లో భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. జగన్ సీఎంం అయితే బ్రా హ్మని స్టీల్ ప్లాంటును పునరుద్ధరించి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగవకాశాలు కల్పిస్తామన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా మహిళ అధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి, మండల కన్వీనర్ చంద్రహాసరెడ్డి, లాయర్లు మునిసుబ్బారెడ్డి, సూర్యపెద్దిరాజు, లక్ష్మిదేవి, సింగిల్‌విండో అధ్యక్షుడు శివగురివిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, కొండప్ప తదితరులు ప్రసంగించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ధన్నవాడ మహేశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతరెడ్డి, చరితా బిల్డర్స్ అధినేత చెన్నకేశవరెడ్డి, బీసీసెల్ కన్వీనర్ రామాజంనేయులు యాదవ్, రామలింగారెడ్డి, నాగేంద్ర పాల్గొన్నారు. నా కుటుంబం రోడ్డుపాలైంది నా కుటుంబం ఫ్యాక్షన్‌కు కక్ష్యల్లో రోడ్డుపాలైందని కొండాపురం మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన లక్ష్మిదేవి అనే మహిళ వాపోయింది. వేపరాలలో సోమవారం సాయంత్రం జరిగిన కార్యకర్తల, బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తన భర్త ఫ్యాక్షన్ కక్ష్యల్లో హత్యకు గురయ్యాడని ఆవేదనతో తెలిపింది. తాము టీడీపీ ఉన్నా న్యాయం జరగకపోవడంతో చాలా కష్టాలు ఎదుర్కొన్నామని ఆవేదన వ్యక్తం చేసింది. -
అమాత్యా..! ఏమిటిది!!
సాక్షి ప్రతినిధి కడప: ఆ రెండు కుటుంబాలు నియోజకవర్గ ఫ్యాక్షన్ రాజకీయాలకు మూలం. మూడున్నర దశాబ్దాలు పైచేయి సాధించేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ వచ్చారు. ఈక్రమంలో ఎందరోమృత్యువాత పడ్డారు. మరెందరో అవిటివారు అయ్యారు. ఇంకెందరో జైల్లో ఖైదీలుగా మగ్గుతున్నారు. ఈపరిస్థితుల్లో అధికారం, ఆదాయం వారిని ఏకం చేశాయి. కాంట్రాక్టు పనులు, రాజకీయ పదవుల్లో భాగస్వాములు అయ్యారు. ఎన్నికల్లో తలపడడమే తరువాయి కాగా, అనుచరులు ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. మీకోసం పనిచేస్తాం. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి విజయానికి కృషి చేయలేమని మంత్రి ఆదికి తెగేసి చెబుతున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో గుండ్లకుంట, దేవగుడి గ్రామాలు కేంద్రంగా ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచాయి. ఆ వారసత్వం రెండేళ్ల క్రితం వరకు కొనసాగింది. ఎప్పుడు ‘ఉప్పు–నిప్పు’లా ఉండే ఆ రెండు కుటుంబాలు ఏకమయ్యాయి. తమ వెంటే మీరంతా ఉండాలని, ఎన్నికల్లో తమ విజయానికి కృషి చేయాలని ఫ్యాక్షన్ నడిపిన వారే ఇప్పుడు కోరుతున్నారు. మీరూ–మీరూ ఒక్కటయ్యారా...ఇంతకాలం ఎలా ఫ్యాక్షన్ పెంచి పోషించారని ప్రత్యక్షంగా నిగ్గదీయకుండానే అనుచరులు అంతపని చేసేస్తున్నారు. మీ కుటుంబం కోసం పనిచేయమంటే చేస్తాం రామసుబ్బారెడ్డి కోసం పనిచేయమని మంత్రికి తెగేసి చెబుతున్న ఘటనలు తెరపైకి వచ్చాయి. అచ్చం అలాగే రామసుబ్బారెడ్డి వర్గీయుల కూడా ప్రతిస్పందిస్తున్నారు. నిన్న పెద్దముడియం... నేడు కొండాపురం... శుక్రవారం రాత్రి పెద్దముడియం మండల నేతలతో మంత్రి ఆదినారాయణరెడ్డి సమావేశం నిర్వహించారు. ఎప్పటిలాగా ఈమారు కూడా ఎన్నికల్లో సహకరించాలని, ఎమ్మెల్యేగా రామసుబ్బారెడ్డి మనమే గెలిపించుకోవాలని సూచించారు. దానికి అక్కడి వారు వ్యతిరేకించారు. తాము దేవగుడి కుటుంబం కోసం పనిచేస్తాం..కానీ, రామసుబ్బారెడ్డి కోసం పనిచేసేదీ లేదని మంత్రికి స్పష్టం చేసినట్లు సమాచారం. శనివారం కొండాపురం మండల నాయకులతో మంత్రి ఆది సమావేశం ఏర్పాటు చేశారు. మనమంతా కలిసికట్టుగా ఎన్నికల్లో పనిచేయాలని మంత్రి కోరితే, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జగదేగకరెడ్డి తాము కలిసికట్టుగా పనిచేసేదీ లేదని తేల్చి చెప్పారు. రామసుబ్బారెడ్డి వర్గంతో ఫ్యాక్షన్ ఎదుర్కొన్నాం, అనేక ఇబ్బందులు చవిచూశాం, పరస్పర కేసులు నమోదయ్యాయి. వారితో కలిసి పనిచేసేదీ లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈపరిస్థితిని మంత్రి ఆది సవరించుకుంటూ వేర్వేరుగా ప్రచారం చేసినా రెండు ఓట్లు వేయించాల్సిన బాధ్యత ఉందని సర్ధిచెప్పారు. పాల్గోన్న వారిలో అనేక మంది ఇలాంటి తీరుతోనే ఉండగా ఒకరిద్దరు మాత్రమే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం. కాగా మూడున్నర్ర దశాబ్దాల పాటు వర్గరాజకీయాలను ప్రోత్సహించిన ఫలితమే తాజా ఘటనలకు తాత్కారణమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. నియంతృత్వంపై ధిక్కారం.... ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో దేవగుడి పరిసర గ్రామాలైన సుగుమంచిపల్లె, పెద్దదండ్లూరు, గొరిగేనూరు, దానవులపాడు, సున్నపురాళ్లపల్లి, సలివేందుల,ధర్మాపురం గ్రామాల్లో నియంతృత్వం రాజ్యమేలుతుండేది. ఏ ఎన్నికలు వచ్చినా ఈ గ్రామాల్లో దేవగుడి కుటుంబాన్ని కాదని ఎవరు ఏజెంట్లుగా కూర్చోనే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే ఆది ఎప్పుడైతే వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచి రెండేళ్లు కూడా గడవకముందే, స్వలాభంకోసం టీడీపీ పంచన చేరాడో అప్పటినుంచి తన సొంత గ్రామాల్లో సైతం వ్యతిరేకత వ్యక్తవవుతోందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. వైఎస్సార్సీపీని ఆదరించేందుకు ఆయా గ్రామాల ప్రజలు సిద్ధమైనా ఆ పార్టీ నేతలు వెళ్లకుండా అడ్డుతగులుతూ వచ్చారు. పట్టువదలని విక్రమార్కుడిలా మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, అభ్యర్థి డాక్టర్ సుధీర్‌రెడ్డి ఇప్పటి వరకు పెద్దదండ్లూరు, గొరిగేనూరు, సున్నపురాళ్లపల్లె గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారికి అపూర్వ ఆదరణ లభించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నీడనపెరిగి ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించడాన్ని సొంత గ్రామాల ప్రజల సైతం హర్షించడంలేదు. దాంతో ఇంటా బయట మంత్రి ఆది శైలి పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. -
మంత్రిది నియంతృత్వ వైఖరి
ఎర్రగుంట్ల : జమ్మలమడుగు నియోజకవర్గంలో మంత్రి ఆదినారాయణరెడ్డి నియంతృత్వ పాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టరు సుధీర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం నిడుజివ్వి గ్రామంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎం హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. దేవగుడి పల్లెలకు మేం పోతే ఎందుకు వెళ్లారని పోలీసులు ప్రశ్నిస్తున్నారన్నారు. మా పల్లెలకు కూడా మంత్రి ఆది వస్తే ఎందుకు ప్రశ్నించరు. ఇదేనా ప్రజాస్వామం అని అన్నారు.మంత్రి మా గ్రామాలకు వస్తే మేమే తిప్పుతాం..మేం వెళ్లినపుడు ఆయన ఇదేవిధంగా చేయగలరా అని అన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తగా జమ్మలమడుగు డీఎస్పీకి నేను ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదన్నారు. ఈయన సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తారని పేర్కొన్నారు. జమ్మలమడుగు పోలీసులు వారు తెలుగుదేశం చొక్కాలు వేసుకొని విధులు చేస్తున్నారని విమర్శించారు. మంత్రి ఆదినారాయణరెడ్డి వస్తుంటే మా గ్రామాలకు పోకుండా అడ్డుకుంటున్నారే.. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు.రంగసాయిపురంలో టీడీపీనుంచి టీడీపీలోకి మారుతున్నారన్నారు. టీడీపీలో పార్టీలో రెండు సార్లు కండువాలు వేస్తారు. వైఎస్సార్ సీపీలో ఒక్కసారి మాత్రమే వేస్తారని చెప్పారు. -
ఆది అనుచరులకు భోజ్యం!
సాక్షి ప్రతినిధి కడప: ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే బహిరంగ మార్కెట్లో తక్కువ రేటుకు కందులు లభిస్తున్నాయి. కాగా కందుల కొనుగోలు గడువు ముగిసింది. నిల్వ ఉన్నవి ప్రభుత్వం కొనుగోలు చేస్తే అధిక ఆదాయం గడించవచ్చు. అదే ఆలోచన మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరులకు తట్టింది. మార్క్‌ఫెడ్ ద్వారా కందులు కొనుగోలు చేయాలని ఒత్తిడి పెంచారు.అమరావతి స్థాయిలో చినబాబు నుంచి పైరవీలు చేయించారు. మే 19కే గడువు ముగిసినా జమ్మలమడుగు నియోజకవర్గంలో మాత్రమే 1500 క్వింటాళ్లు కొనుగోలు చేసేందుకు అనుమతులిచ్చారు. వెరసి దాదాపు రూ.30లక్షలు ప్రజాధనం దోపిడీ చేసిన వైనమిది. జిల్లాలో 22,120 ఎకరాలల్లో కందిపంట సాగుచేశారు. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 77,420 క్వింటాళ్ల దిగుబడి ఉన్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కందులు క్వింటా రూ.5,450లతో తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి19 నుంచి మే19వరకు మూడునెలలు పాటు సేకరించింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 60,131 క్వింటాళ్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. తక్కినవి రైతుల అవసరాల రీత్యా కొన్ని, నిల్వ రూపంలో మరికొన్ని ఉండిపోయాయి. కాగా ప్రస్తుతం కందులు క్వింటా ధర రూ.3600 మాత్రమే బహిరంగ మార్కెట్లో పలుకుతోంది. ప్రభుత్వం రూ.5,450తో కొనుగోలు చేసిన నేపథ్యంలో రూ.1850 క్వింటాపై తేడా ఉంది. ఈనేపథ్యంలో మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరులు దళారుల అవతారమెత్తారు. గడువు ముగిసినా తాము ప్రభుత్వంతో కొనుగోలు చేయించే చర్యలు చేపడతాం, క్వింటాకు రూ.1000కి మేము తీసుకుంటాం, తక్కిన మొత్తం మీకు అప్పగిస్తాం, మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామనే తెరవెనుక ఒప్పందానికి వచ్చారు. ముందుగా 6వేల క్వింటాళ్లు సమీకరించినట్లు సమాచారం. వీటిని మునపటి తేదీలతో కొనుగోలు చేసినట్లు రికార్డులు సవరించాలనే స్థానిక అధికార యంత్రాంగంపై ఒత్తిడి తీసుకవచ్చారు. ఇప్పట్లో తాము ఇలాంటి సాహసం చేయలేమని ఉన్నతస్థాయిలో ఏమైనా చేసుకోండి, మావల్ల కాదంటూ అధికారులు చేతులెత్తేశారు. చినబాబు డైరెక్షన్..కొనుగోలుకు శ్రీకారం.. గడువు ముగిసిన తర్వాత కందులు కొనుగోలు చేయడం సాధ్యపడదని మార్క్‌ఫెడ్ జిల్లాస్థాయి అధికారులు వెల్లండిచిన తర్వాత వ్యవహారం రాజధానికి చేరింది. కమిషనర్ స్థాయిలో నిబంధనలు అడ్డువస్తాయని వివరించడంతో ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారాలోకేష్ జోక్యం అనివార్యమైనట్లు సమాచారం. కమిషనర్‌పై మంత్రి లోకేష్ ఒత్తిడి పెంచి ఒప్పించినట్లు తెలుస్తోంది. మంత్రి ఆది సూచించిన రైతులు (మంత్రి అనుచరులు) కందులు కొనుగోలు చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. సీఎం తర్వాత స్థానంలో ఉన్న లోకేష్ ఆదేశాలతో మార్క్‌ఫెడ్ అధికారులు నిబంధనలు విరుద్ధమైనప్పటికీ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. జమ్మలమడుగు, పెద్దముడియం మండలాలకు చెందిన రైతుల పేరిట కొనుగోలు చేపట్టారు. ప్రస్తుతం 1500 క్వింటాళ్లు కొనుగోలుకు అనుమతులు ఇచ్చారు. ఆమేరకు జమ్మలమడుగు మార్కెట్ యార్డులో సోమవారం అధికార యంత్రాంగం కందులు సేకరించింది. మంత్రి ఆది అనుచరులను సంతృప్తి పర్చేందుకు ప్రజాధనానికి కన్నం వేశారని పలువురు ఆరోపిస్తున్నారు. దాదాపు రూ.30లక్షలు అనుచరులకు దోచిపెట్టే చర్యలకు పాల్పడ్డారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఎండీ నుంచి అనుమతులు తీసుకున్నాం మార్క్ఫెడ్శాఖ రాష్ట్ర మేనేజింగ్ డైరక్టర్ మ«ధుసూదన్రెడ్డి నుంచి అనుమతులు తీసుకున్నాం. జమ్మలమడుగు ఏరియాలో ఈ ఏడాది మార్చి నెలలో రైతులు కందులు విక్రయించుకోలేకపోయారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం నిలిపి వేసే సమయంలో వారు మార్క్‌ఫెడ్ సంస్థకు అమ్ముకోలేకపోయారు. అందువల్ల అనుమతులు తీసుకుని తూకాలు వేస్తున్నాం. –రమేష్, జిల్లా మేనేజర్, మార్క్పెఢ్ సంస్థ, కడప -
సిగ్గూ, శరం ఉంటే రాజీనామా చెయ్
కడప కార్పొరేషన్ : మంత్రి ఆదినారాయణరెడ్డికి సిగ్గూ, శరం, చీము, నెత్తురు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. టీడీపీ తరఫున పోటీ చేసి గెలవాలని వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా సవాల్ విసిరారు. శుక్రవారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డితో కలిసి వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్న చిత్రావతి కుడికాల్వకు నీటిని విడుదల చేసిన మంత్రులు వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడం దారుణమన్నారు. ఆదినారాయణరెడ్డి కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ రాజశేఖరరెడ్డేనన్నారు. ఆనాడు వారి కుటుంబంలో చీలిక తేవడం ఇష్టం లేక.. వైఎస్ అందరినీ కూర్చొబెట్టి ఆదిని ఎమ్మెల్యే చేశారని గుర్తు చేశారు. ఈనాడు కూతురు, అల్లుడి కోసం కేశవరెడ్డి ఆస్తులు కాపాడాలని, పేకాట డబ్బుల కోసమే పార్టీ ఫిరాయించాడన్నారు. ఇప్పుడు కాంట్రాక్టులు, చిన్న చిన్న పనుల కోసం పబ్బం గడుపుకొనే మాటలు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. విజయమ్మను, వైఎస్ వివేకాను ఓడించాం, వైఎస్ జగన్‌ను కూడా ఓడిస్తామని మంత్రి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. పులివెందులలో గెలవాలంటే నీ తరం కాదు గదా చంద్రబాబు తరం కూడా కాదని హెచ్చరించారు. మంత్రి ఆది లాగే ఎంతో మంది నాయకులు వైఎస్‌ను, వైఎస్ జగన్‌ను విమర్శించారని, వారందరి గతి ఏమైందో ప్రజలకు తెలుసన్నారు. రాబోయే ఎన్నికల్లో మంత్రి ఆదికి కూడా అదే గతి పడుతుందని, ఆయనకు డిపాజిట్లు కూడా రావన్నారు. మంత్రి అయినప్పటి నుంచి జిల్లాకు ఎన్ని నిధులు తెచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఓడిపోయిన చరిత్ర వారిది మంత్రి సోమిరెడ్డి ఐదు సార్లు ఓడిపోయారని, సతీష్‌రెడ్డి మూడు సార్లు ఓడిపోయారని, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వాసు 2 లక్షల పైచిలుకు ఓట్లతో ఓడిపోయాడని ఎద్దేవా చేశారు. ఇలాంటి వారికి వైఎస్ కుటుంబం గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా అని సూటిగా ప్రశ్నించారు. సర్పంచ్‌గా కూడా గెలవని సీఎం రమేష్ ముఖ్యమంత్రికి బినామీగా మారి వేలకోట్లు వెదజల్లి ఎంపీ పదవి కొనుక్కున్నాడని ఎద్దేవా చేశారు. 2004కు ముందు రాయలసీమకు చుక్క నీరు వచ్చేవి కావని, ఇప్పుడు నీళ్లు ఎలా వచ్చాయో మంత్రులు చెప్పాలన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచడం వల్లే రాయలసీమ ప్రాజెక్టులకు నీరు వస్తున్నాయన్నారు. గండికోట, అవుకు, చిత్రావతి ప్రాజెక్టు పనులు 85 శాతం పూర్తి చేసిన ఘనత కూడా వైఎస్ఆర్దేనని తెలిపారు. ఆయనకు పేరు వస్తుందనే గత ప్రభుత్వాలు వాటిని పూర్తి చేయలేదని విమర్శించారు. కుప్పం కంటే ముందు పులివెందులకు నీళ్లిచ్చామని మంత్రులు చెప్పడం హాస్యాస్పదమన్నారు. పులివెందులకు నీళ్లు ఇవ్వకుండా కుప్పంకు నీళ్లు తీసుకెళ్లడం సాధ్యం కాదు కాబట్టే ఇలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో మంత్రులు చెప్పాలని డిమాండ్ చేశారు. గేట్లు ఎత్తే లష్కర్ పని చేస్తూ వైఎస్ కుటుంబాన్ని విమర్శించడం తగదని హితవు పలికారు. కాంగ్రెస్‌నే ఎదిరించిన వైఎస్ జగన్‌కు బీజేపీని ఎదిరించడం ఒక లెక్కకాదన్నారు. -
బాబు వద్దకు జమ్మలమడుగు పంచాయితీ
విజయవాడ: జమ్మలమడుగులో టీడీపీ పార్టీ నివురుగప్పిన నిప్పును తలపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్దకు ఆదినారాయణ రెడ్డి, రామ సుబ్బారెడ్డి పంచాయతీ చేరింది. ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరినప్పటి నుంచి రామ సుబ్బారెడ్డి ఆయనను వ్యతిరేకిస్తున్నారు. ఆదినారాయణ వల్ల ఫ్యాక్షనిజం మళ్లీ పెరిగిందని కొద్ది రోజుల కిందట రామసుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో రామసుబ్బారెడ్డి వర్గీయులపై ఆదినారాయణ రెడ్డ వర్గీయులు దాడి చేశారు. దీంతో వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలో ఇద్దరినీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిచి మాట్లాడారు.