మాట్లాడుతున్న వైఎస్ అవినాష్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, సమావేశానికి హాజరైన కార్యకర్తలు
సాక్షి, మైలవరం : ఆదినారాయణరెడ్డి మంత్రి హోదా లో ఉండి ప్రజలకు ఏం చేశారని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వేపరాల సీతారాముల కళ్యాణ మండపంలో మండల వైఎస్సార్‌సీపీ కార్యకర్తల, బూత్‌లెవల్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మండలంలో గొల్లపల్లె దగ్గర నెలకొల్పాల్సిన ఏసీసీ సిమెంటు కార్మాగారం ఏమైందని ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో సోలార్‌కు డీకేటీ భూములను ఇచ్చిన రైతులకు పరిహారం అందిందన్నారు.
మండలంలో సోలార్ కోసం డీకేటి భూములు ఇచ్చిన రైతులకు పరిహారం ఇప్పించడంలో మంత్రి ఆదినారాయణరెడ్డి విఫలయయ్యారన్నారు. మంత్రి, ఎమ్మెల్సీ ఉన్నా ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. చేనేత సొసైటీల ద్వారా చేనేత కార్మికుల అభ్యున్నతికి నవరత్నాల్లాంటి పధకాలతో పాటు మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు రూ.2 వేలు అందిస్తామన్నారు. సు«ధీర్‌రెడ్డి మాట్లాడుతూ నీతి, నిజాయితీలు కోల్పోయిన నాయకులిద్దరు ప్రజల్లోకి రావా లంటే జంకుతున్నారన్నారు.
సోలార్‌లో భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. జగన్ సీఎంం అయితే బ్రా హ్మని స్టీల్ ప్లాంటును పునరుద్ధరించి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగవకాశాలు కల్పిస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళ అధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి, మండల కన్వీనర్ చంద్రహాసరెడ్డి, లాయర్లు మునిసుబ్బారెడ్డి, సూర్యపెద్దిరాజు, లక్ష్మిదేవి, సింగిల్‌విండో అధ్యక్షుడు శివగురివిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, కొండప్ప తదితరులు ప్రసంగించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ధన్నవాడ మహేశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతరెడ్డి, చరితా బిల్డర్స్ అధినేత చెన్నకేశవరెడ్డి, బీసీసెల్ కన్వీనర్ రామాజంనేయులు యాదవ్, రామలింగారెడ్డి, నాగేంద్ర పాల్గొన్నారు.
నా కుటుంబం రోడ్డుపాలైంది
నా కుటుంబం ఫ్యాక్షన్‌కు కక్ష్యల్లో రోడ్డుపాలైందని కొండాపురం మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన లక్ష్మిదేవి అనే మహిళ వాపోయింది. వేపరాలలో సోమవారం సాయంత్రం జరిగిన కార్యకర్తల, బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తన భర్త ఫ్యాక్షన్ కక్ష్యల్లో హత్యకు గురయ్యాడని ఆవేదనతో తెలిపింది. తాము టీడీపీ ఉన్నా న్యాయం జరగకపోవడంతో చాలా కష్టాలు ఎదుర్కొన్నామని ఆవేదన వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment