Aditya Housing
-
ఆదిత్య బిల్డర్స్ కోటారెడ్డిపై కేసు
సాక్షి, హైదరాబాద్: ఆదిత్య బిల్డర్స్ అధినేత వీరపరెడ్డి కోటారెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. ఆదిత్య బిల్డర్స్‌తో కలిసి తాము ఏర్పాటు చేసిన ‘శ్రీ ఆదిత్య వంశీరామ్ హోమ్స్ ఎల్ఎల్పీ జాయింట్ వెంచర్లో చేసుకున్న ఒప్పందానికి విరుద్ధంగా మోసపూరితంగా వ్యవహరిస్తూ అక్రమంగా విల్లాలు విక్రయిస్తుస్తున్న ఆదిత్య అధినేత వీరపరెడ్డి కోటారెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వంశీరామ్ అధినేత సుబ్బారెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. (నేను ‘బావ’ బాధితుడిని : సుధీర్‌రెడ్డి) ఈ మేరకు పోలీసులు కోటారెడ్డిపై 420, 406 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే నందగిరి హిల్స్‌లో నివసించే సుబ్బారెడ్డి నార్సింగిలోని సర్వే నంబర్ 155, 156లో ఉన్న 16 ఎకరాల 24 గుంటల స్ధలంలో విల్లాల నిర్మాణానికి ఆదిత్య హోమ్స్ సంస్థతో 2014లో డెవలప్మెంట్ ఒప్పందం కుదుర్చుకున్నారు. నిర్మాణ బాధ్యతలు స్వీకరించిన ఆదిత్య సంస్థ అధినేత కోటారెడ్డి ఉద్దేశ పూర్వకంగా 23 విల్లాల విక్రయంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ కారణంగా తనకు రూ. 79.36 కోట్ల మేర నష్టం వచ్చిందని సుబ్బారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (100 కోట్ల డాక్యుమెంట్ల చోరీ కేసులో కొత్త కోణం) యువతి హత్యకేసులో నిందితుడి అరెస్ట్ నాగోలు: ఎల్బీనగర్ పరిధిలోని ధనాపూర్ జనప్రియ కాలనీలో ఉన్న ఫ్యామిలీ కేర్ సర్వీస్ సెంటర్లో పనిచేసే యువతిని హత్య చేసి పారిపోయిన మరో ఉద్యోగిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నూజివీడు మండలం కొత్తపేట గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావుకు వివాహం అయ్యింది. అతనిపై భార్య వేధింపుల కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఆయన మూడు నెలల క్రితమే స్థానికంగా ఈ ఉద్యోగంలో చేశాడు. ఓ రోజు వెంకటేశ్వరావు మద్యం సేవించి వచ్చి యువతితో కలసి గదిలో వంటచేశాడు. యువతి ఒక్కతే ఉండటంతో ఆమెను లోబరుచుకోవాలని ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్వరరావు తన గురించి బయట చెబుతుందోమోననే భయంతో ఆమెపై దాడి చేసి నోరు గట్టిగా మూసి చున్నీని మెడకు బిగించి హత్య చేశాడు. అనంతరం ఓ ప్రైవేట్ వాహనాన్ని బుక్ చేసుకుని పారిపోతుండగా సెంటర్ నిర్వాహకుడు చంద్రశేఖర్‌రెడ్డి నిందితుడిని గుర్తించి ఎల్బీనగర్ పోలీసులకు సమచారం ఇచ్చారు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో తాను చేసిన నిర్వాకాన్ని ఆ యువతి ఎవరితోనైనా చెబుతుందేమోననే భయంతో మద్యం మత్తులో హత్య చేసినట్లు వెంకటేశ్వరరావు అంగీకరించాడని సమాచారం. (ఎల్బీ నగర్లో యువతి దారుణ హత్య) -
చంపేస్తాడనే భయంతో డీజీపీకి ఫిర్యాదు చేశా
-
నేను ‘బావ’ బాధితుడిని : సుధీర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ఆదిత్యా హోమ్స్ డైరెక్టర్, చైర్మన్ మధ్య నెలకొన్న వివాదం తారా స్థాయికి చేరింది. ఇంటి సమస్య కాస్తా తీవ్ర విభేదాలతో రచ్చకెక్కింది. 100 కోట్ల రూపాయలు విలువచేసే డాక్యుమెంట్ల చోరీతో మొదలైన వివాదం మరింత ముదిరింది. తన బావ కోటారెడ్డి తనను జైలుకు పంపేందుకు కుట్రలు పన్నుతున్నారని సుధీర్‌రెడ్డి ఆరోపించారు. వ్యాపారం పేరుతో తన కుటుంబాన్ని నిలువునా మోసం చేశారని, కంపెనీ లాభాలు తీసుకుని తమను దోచుకున్నారని వాపోయారు. కొడుకుతో తనకు ప్రాణహాని ఉందని సుధీర్‌రెడ్డి తల్లి అజంతా సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు వచ్చారు. (ఆ చోరీ చేసింది నా కొడుకే.. ప్రాణాహాని ఉంది) ‘15 ఏళ్లుగా కోటారెడ్డి కుటుంబంతో మాకు మాటల్లేవు. 1995లో నేను అమెరికా వెళ్లాను. నేను, నా భార్య కలిసి డబ్బు సంపాదించి తిరిగి ఇండియా వచ్చాం. మా నాన్న చనిపోతూ కుటుంబమంతా కలిసి ఉండాలని కోరుకున్నారు. 2016లో నేను ఆదిత్యా హోమ్స్‌లో డైరెక్టర్‌గా చేరాను. అప్పటి నుంచి అమ్మ, అక్క.. నన్ను వేధించడం మొదలుపెట్టారు. ఇంటిని మా అమ్మకు ఇచ్చేందుకు అక్కా,బావ ప్లాన్ వేశారు. 2014లో వంశీరామ్ బిల్డర్స్‌తో కలిసి.. గండిపేట్‌లో మా బావ కోటారెడ్డి విల్లా ప్రాజెక్ట్ ప్రారంభించారు. అందులో 25 విల్లాలకు నా ద్వారానే రిజిస్ట్రేషన్లు జరిగాయి. రిజిస్ట్రేషన్లు చేసే అధికారం ఎవరిచ్చారంటూ.. వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డి నన్ను ప్రశ్నించారు. సుబ్బారెడ్డికి తెలియకుండా విల్లాల రిజిస్ట్రేషన్లు చేసే అధికారం మా బావ కోటారెడ్డే నాకు ఇచ్చారు. ఈ విషయంలో కోటారెడ్డి నన్ను మోసం చేశారు. సుబ్బారెడ్డి అనుమతి లేకుండా నేను సేల్ డీల్స్ చేయడం తెలీకుండా చేసిన తప్పు. (100 కోట్ల విలువైన డాక్యుమెంట్లు అపహరణ) ఆదిత్యా హోమ్స్‌పై కేసులు పెడతానని ఆనాడే సుబ్బారెడ్డి హెచ్చరించారు. వాళ్లు చేసిన తప్పులను నాపై నెట్టేశారు. నేను సుబ్బారెడ్డితో కుమ్మక్కయ్యాననేది మా బావ అపోహ.. నా ఇంటిని కాజేయాలని, నన్ను ఇంటి నుంచి గెంటేసే కుట్ర చేశారు. పోలీసుల పేరుతో నా ఇంట్లో సోదాలు చేసేందుకు కోటారెడ్డి కొందరు మనుషుల్ని పంపించారు. నాకు, మా బావకు వ్యక్తిగతంగా గన్ లైసెన్స్‌లు ఉన్నాయి. ఎన్నికల సమయంలో తన గన్ సరెండర్ చేయడానికి మా బావే నాకు ఆథరైజేషన్ ఇచ్చారు. 2019 ఎన్నికల సమయంలో ఇద్దరి గన్స్ సరెండర్ చేస్తే పోలీసులు మా బావ గన్ మాత్రమే తిరిగి ఇచ్చారు. ఇదంతా కుట్రలో భాగంగానే సాగుతోంది. నేను బావ బాధితుడిని’ అని తెలిపారు. -
ఆ కంపెనీలకు అనుమతినివ్వం
హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు పనులకు సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు ఆదిత్య హౌసింగ్, ఎన్వీయన్ ఇంజనీర్స్ కంపెనీలకు అనుమతినివ్వడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. స్టార్టప్ ఏరియా అభివృద్ధి పనులు చేపట్టే అర్హత, సామర్థ్యం ఈ రెండు కంపెనీలకు ఎంత మాత్రం లేదని స్పష్టం చేసింది. ప్రాజెక్టు బిడ్డింగ్ ప్రక్రియను నిలిపేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై తాము దాఖలు చేసిన అప్పీల్‌పై త్వరగా విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని కోరింది. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.