ADMK
-
చిన్నమ్మ రీఎంట్రీ.. ఆమె వెనుక ఎవరున్నారు?
శశికళ మరోసారి శపథం చేశారు. రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నానంటూ సంచలన ప్రకటన చేశారు. అన్నాడీఎంకేలో చేరి మళ్లీ అమ్మ పాలన తెస్తానంటూ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో తమిళనాట కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేచింది. అసలు.. శశికళ ఎంట్రీ వెనుక కారణమేంటి..? ఇది ఆమె సొంత నిర్ణయమా.? లేక ఆమె వెనుక ఎవరైనా ఉన్నారా..? తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ మళ్లీ యాక్టివ్ అయ్యారు. రాజకీయాల్లో రీఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తన మద్దతుదారులతో సమావేశమైన శశికళ కీలక ప్రకటన చేశారు. అన్నాడీఎంకే పార్టీలోకి తన రీఎంట్రీకి సమయం ఆసన్నమైందంటూ హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలోకి తన పున:ప్రవేశం మొదలైందని చెప్పారు. ఇటీవలే వెలువడిన లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాజయంతో ఏఐఏడీఎంకే పతనమవుతుందని భావించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసిన ఆమె.. తిరిగి అమ్మ పాలనకు నాంది పలుకుతామని వెల్లడించారు. ఇదే క్రమంలో అన్నాడీఎంకే నేత పళనిస్వామిపై విమర్శలు గుప్పించారు శశికళ. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ నేతగా తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానంటూ తేల్చిచెప్పారు. ఇక.. తమిళనాడు ప్రజలు తమవైపే ఉన్నారని తెలిపారు శశికళ. అన్నాడీఎంకే కథ ముగిసిపోలేదని.. తన రీ ఎంట్రీతో ఇప్పుడే ప్రారంభమయ్యిందంటూ తన మద్దతుదారుల్లో ఆమె ఉత్సాహం నింపారు. ఎంజీఆర్, జయలలిత హయాంలో అన్నాడీఎంకే చెక్కుచెదరలేదని స్పష్టం చేశారు. కానీ.. ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. పార్టీలో కుల రాజకీయాలను కార్యకర్తలు సహించరంటూ ఇండైరెక్ట్‌గా పళనిస్వామిని టార్గెట్ చేశారు శశికళ. జయలలిత కుల ప్రాతిపదికన రాజకీయాలు చేసి ఉంటే 2017లో పళనిస్వామి సీఎం అయి ఉండేవారు కాదని విమర్శించారు. అయినా.. ఇప్పుడు పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు శశికళ. దీని కోసం ప్రయత్నాలను మొదలు పెట్టానని వివరించారు.ఇప్పుడు.. శశికళ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యే అవకాశం ఉంది. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్లడంపై వ్యూహాలు రచిస్తున్నాయి. డీఎంకేను గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. నిజానికి.. లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఒక్క సీటూ గెలవలేదు. చాలా చోట్ల మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి డీఎంకేకు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఇదే ఫలితం అసెంబ్లీ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతుందంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో శశికళ ఎంట్రీ హాట్ టాపిక్‌గా మారింది. అన్నాడీఎంకే విజయంతో మళ్లీ అమ్మ పాలన తీసుకొస్తానంటూ ప్రకటించడం సంచలనంగా మారింది.శశికళ ఎంట్రీని పళనిస్వామి ఒప్పుకుంటారా..? అంటే కష్టమే అని చెప్పాలి. గతంలోనూ అన్నాడీఎంకేలో ఎంట్రీకోసం ప్రయత్నాలు చేసి ఆమె విఫలమయ్యారు. అప్పుడు పన్నీరు సెల్వం.. పళనిస్వామి ఒక్కటిగా ఉండి శశికళకు ఎంట్రీ లేకుండా చేశారు. ఆ తర్వాత పార్టీపై పట్టుపెంచుకున్న పళనిస్వామి.. పన్నీరు సెల్వంను సైతం బయటకునెట్టారు. కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నా.. ఇప్పటికిప్పుడు పళనిస్వామిని కాదని.. శశికళకు పార్టీ నేతలు పగ్గాలు అప్పగించే పరిస్థితి కూడా లేదు. మరికొందరు పన్నీరుసెల్వంను తిరిగి పార్టీలో చేర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఫలితంగా పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో శశికళ ఎంట్రీతో సీన్ ఎలా మారుతుందనేది ఆసక్తిగా మారింది.మరోవైపు.. అన్నాడీఎంకేతో పాటు తమిళనాడులో బీజేపీ పరిస్థితి కూడా అంతంతమాత్రమే. లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి బొక్కాబోర్లా పడింది బీజేపీ. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై గెలుస్తారంటూ విపరీతంగా పబ్లిసిటీ చేసినా.. చివరికి ఆ సీటును కూడా గెలుచుకోలేకపోయింది కమలం పార్టీ. అటు.. పార్టీలోని కీలక నేతల మధ్య కూడా సమన్వయ లోపం ఉంది. బీజేపీ కీలక నేత తమిళి సై, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు అన్నామలై మధ్య విభేదాలు ఉన్నట్లు పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఈ మధ్యే అమిత్ షా బహిరంగంగా తమిళి సైని వారించింది కూడా ఇదే విషయంపై అని ప్రచారం జరిగింది. అది నిజమో కాదో తెలియదు కానీ.. అమిత్ షా మాట్లాడిన తర్వాత.. అన్నామలై, తమిళి సై భేటీ అయ్యారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకునే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలోనే శశికళ ఎంట్రీ ఇవ్వడం యాథృచ్చికం కాదంటున్నారు విశ్లేషకులు. శశికళ ఎంట్రీ వెనుక బీజేపీ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో టీటీవీ దినకరన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీతో కూటమిగా ఏర్పడి దినకరన్ పార్టీ పోటీ చేసింది. దీంతో దినకరన్ ద్వారానే ఇప్పుడు శశికళను బీజేపీ రంగంలోకి దింపిందని అంతా భావిస్తున్నారు. పన్నీరుసెల్వం, దినకరన్, శశికళ చేరిన అన్నాడీఎంకే తో తమ పార్టీ పొత్తు పెట్టుకుంటే.. డీఎంకేను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదన్నది బీజేపీ భావనగా తెలుస్తోంది. మరి నిజంగానే శశికళ అన్నాడీఎంకేలోకి ఎంట్రీ ఇస్తుందా..? ఇచ్చినా ఆమె బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా.? ఈలోపు తమిళ రాజకీయాల్లో ఇంకెన్ని మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. -
వారసత్వ వ్యాఖ్యలపై బీజేపీకి ఉదయనిధి కౌంటర్
చెన్నై: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ బీజేపీ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ చేసిన వారసత్వ, కుటుంబ రాజకీయలకు సంబంధించిన వ్యాఖ్యలపై ఉదయనిధి ఆదివారం స్పందిస్తూ ఎదురుదాడి చేశారు. ‘బీజేపీ వాళ్లు విమర్శంచినట్లు.. డీఎంకే పార్టీ కుటుంబ వారసత్వ పార్టీనే. నేను కూడా అంగీకరిస్తాను. అయితే తమిళనాడు ప్రజలు మొత్తం కరుణానిధి కుటుంబం’ అని మంత్రి ఉదయనిధి అన్నారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నై ర్యాలీలో పాల్గొని ఎంకే స్టాలిన్ డీఎంకే పార్టీ వారసత్వం కుటంబ పార్టీ అని విమర్శలు చేశారు. కుటుంబ పార్టీలు కేవలం తమ భవిష్యత్తు మాత్రమే చూసుకుంటాయని అన్నారు. కానీ, నేను దేశంలో ప్రతి ఒక్కరి భవిష్యత్తు కోసం కృషి చేస్తానని మోదీ తెలిపారు. డీఎంకే, కాంగ్రెస్ పార్టీలకు మొదట ప్రాధాన్యం కుటుంబం.. తర్వాతే దేశం అని అన్నారు. అదే విధంగా ఇండియా కూటమి మొత్తం ఇదే విధానాన్ని పెంచి పోషిస్తోందని విమర్శలు చేశారు. ఇక.. తమిళనాడు మొత్తం 39 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 2019లో డీఎంకే నేతృత్వంలోని కూటమి మొత్తం 38 స్థానాల్లో విజయం సాధించింది. డీఎంకే సొంతంగా 23 స్థానాల్లో గెలుపొంది.. 33.2 శాతం ఓట్ షేర్‌ను సంపాధించుకుంది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో మొదటి విడతలోనే ఏప్రిల్ 19న తమిళనాడులో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. -
ఒక్క సీటుతో కింగ్‌మేకర్.. కూటమిలతో తగ్గిన విజయకాంత్ క్రేజ్
కోలీవుడ్ ప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ (71) అనారోగ్యంతో చికిత్స పొందుతూ... నేడు (డిసెంబర్ 28) తుది శ్వాస విడిచారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. విజయకాంత్ మృతి పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. విజయకాంత్ జననం: విజయకాంత్ 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మధురైలో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అలగరస్వామి. సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత తన పేరును విజయకాంత్‌గా మార్చుకున్నారు. విజయకాంత్‌కు భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. సినిమా ఎంట్రీ: విజయకాంత్ 27 ఏళ్ల వయసులో సినీ రంగ ప్రవేశం చేశారు. 1979లో 'ఇనిక్కుం ఇలామై' చిత్రంతో విలన్‌గా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి 2015 వరకు 150కి పైగా చిత్రాల్లో నటించారు. రోజుకు మూడు షిఫ్టులు పనిచేశారు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నప్పటికీ. ఆ తర్వాత ఆయన నుంచి ఎన్నో మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 1984లో విజయకాంత్ నుంచి 18 సినిమాలు విడుదలయ్యాయి. 20కి పైగా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. విజయకాంత్ తమిళ చిత్రాల్లో మాత్రమే నటించారు. ఇతర భాషల్లో నటించలేదు. కానీ ఆయన సినిమాలు చాలా భాషల్లో డబ్బ్ అయ్యాయి. సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ లకు విజయకాంత్ ఒకప్పుడు గట్టి పోటీ ఇచ్చారు. విజయకాంత్ మెసేజ్ బేస్డ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. దేశభక్తి చిత్రాలైనా, గ్రామీణ నేపథ్య సినిమాలైనా, ద్విపాత్రాభినయాలైనా నటించేందుకు విజయకాంత్ ఎప్పుడూ ముందుండేవారు. వాటితో పాటు కమర్షియల్ సినిమాల్లోనూ సందడి చేసేవారు. అయితే ఆయన ఏ నిర్మాత వద్ద కూడా ముందుగా డబ్బు తీసుకోడని కోలీవుడ్ పరిశ్రమలో గుర్తింపు ఉంది. కోలీవుడ్ నిర్మాతలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే వారి నుంచి రెమ్యూనరేషన్ తీసుకోకుండానే సినిమా అవకాశం ఇస్తారని సమాచారం. ఒక్క సీటుతో రాజకీయ ప్రయాణం 2005లో దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం (డీఎండీకే) అనే పార్టీని సినీ నటుడు విజయకాంత్ ఏర్పాటు చేశారు. తొలిసారిగా 2006 ఎన్నికల సమయంలో తన పార్టీ నుంచి తానొక్కడే గెలిచాడు.. కానీ ఆయన పార్టీ 10 శాతం ఓట్లు సాధించి తమిళ రాజకీయాలలో విజయకాంత్‌ను ప్రత్యామ్నాయ శక్తిగా మార్చింది. 2011 అసెంబ్లీ ఎన్నికలలో జయలలిత (అన్నాడీఎంకే)తో చేతులు కలిపి 41 సీట్లలో 29 స్థానాలను గెలుచుకున్నారు. ఆ సమయంలో ఎం.కరుణానిధి (డీఎంకే) పార్టీని చిత్తు చేసిన విజయకాంత్ ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించారు. ఆ తదుపరి అన్నాడీఎంకేతో వైరం వంటి పరిణామాలు విజయకాంత్ పార్టీకి గడ్డు పరిస్థితులను సృష్టించాయి. దీంతో జయలలిత, విజయకాంత్ పార్టీల మధ్య విభేదాలు వచ్చాయి. కూటమిల పేరుతో నష్టం 2014 లోక్‌సభ ఎన్నికలలో ఆయన ఎన్డీఏతో వెళ్లి ఓటమిని చవి చూశారు. కానీ ఓటు బ్యాంక్ శాతం పెంచుకోవడం ఆయనకు కలిసి వచ్చిన అంశంగా మారింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే నేతృత్వంలో రాష్ట్రంలో మూడో కూటమి అవతరించినా, ఫలితం శూన్యం. ఆ ఎన్నికల్లో అన్నిచోట్ల విజయకాంత్ కూటమి పార్టీ డిపాజిట్లను కోల్పోయింది. ఆ ఎన్నికల్లో విజయకాంత్ కూడా సుమారు 50 వేలకు పైగా ఓట్లతో ఓటమి చెందారు. ఆ తర్వాత వరుస ఓటములు ఎదురైనా ఏ మాత్రం డీలా పడకుండా కేడర్ మద్దతు, సినీ అభిమానుల అండతో ఒంటరిగానే పార్టీని నడిపిస్తూ వచ్చారు. కానీ కూటమిల పేరుతో ఆయన ఇతర పార్టీలకు అనుకూలంగా పనిచేయడం, ఇతర పార్టీలకు చెందిన అధినేతల సలహాలతో డీఎండీకేను ముందుకు నడపడం వంటి కారణాలతో ఆయన ఇమేజ్ క్రమేపి తగ్గుతూ వచ్చింది. ఇంతలో ఆయన తరుచుగా అనారోగ్యంతో ఇబ్బందులు పడటం కూడా పార్టీకి నష్టం వాటిల్లింది. చివరకు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా, పార్టీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షించ లేని పరిస్థితి నెలకొంది పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కూడా ఆయన సతీమణి ప్రేమలతకు ఆయన అప్పచెప్పారు. తాజాగా ఆయన మరణం డీఎండీకే పార్టీకి తీరని లోటు అని చెప్పవచ్చు. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలలో ఆయన సతీమణి ప్రేమలత ఒంటరిగానే బరిలోకి దిగుతారా..? మరేదైనా పార్టీకి మద్ధతు ఇస్తారా..? అనేది తేలాల్సి ఉంది. -
జెండా వివాదం: చిన్నమ్మకు చెక్
సాక్షి, చెన్నై: తమ జెండా ఉపయోగించకుండా చిన్నమ్మ శశికళకు చెక్ పెట్టేందుకు అన్నాడీఎంకే నిర్ణయించింది. దీనిని అడ్డుకోవాలని కోరుతూ డీజీపీ త్రిపాఠికి అన్నాడీఎంకే నేతలు, మంత్రులు గురువారం ఫిర్యాదు చేశారు. ఇక చిన్నమ్మను ఆహ్వానించేందుకు భారీ ఏర్పాట్లపై అమ్మ మక్కల్ మున్నేట్ర కళం నిమ్నగమైంది. వేలూరులో అయితే, హెలికాప్టర్ ద్వారా పువ్వుల వర్షం కురిపించేందుకు ఏకంగా కలెక్టర్ అనుమతి కోరడం గమనార్హం. అక్రమాస్తుల కేసు నుంచి విడుదలైన శశికళ ఈనెల 8న చెన్నైకి రానున్నారు. ఆమెకు ఆహ్వానం పలికేందుకు అమముక వర్గాలు భారీగానే ఏర్పాట్లపై దృష్టిపెట్టాయి. వేలూరులో అయితే, జిల్లా సరిహద్దు మాదనూరు నుంచి హెలికాప్టర్ ద్వారా పువ్వులవర్షం కురిపించేందుకు ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. ఇందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆ కళగం జిల్లా కార్యదర్శి జిల్లా కార్యదర్శి జయంతి పద్మనాభన్ కలెక్టర్ షణ్ముగసుందరానికి గురువారం విన్నవించుకున్నారు. (చదవండి: రాళ్లు వేయించాడు.. కాళ్లు పట్టుకుంటున్నాడు..) జెండాకు చెక్.. ఆహ్వాన ఏర్పాట్లు ఓ వైపు సాగుతుంటే, ఎక్కడ అన్నాడీఎంకే జెండాలతో చిన్నమ్మ దూసుకొస్తుందో అన్న బెంగ ఆ పార్టీ వర్గాల్లో నెలకొన్నట్టుంది. జైలు నుంచి బయటకు వచ్చిన సమయంలో అన్నాడీఎంకే జెండా ఉన్న కారులో చిన్నమ్మ పయనించడం వివాదానికి దారి తీసింది. దీనిపై ఫిర్యాదులు కూడా హోరెత్తాయి. ఈ పరిస్థితుల్లో చిన్నమ్మ తమ పార్టీ జెండా ఊపయోగించకుండా చెక్ పెట్టేందుకు అన్నాడీఎంకే నిర్ణయించింది. ఆ పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, సంయుక్త కన్వీనర్లు కేపీ మునుస్వామి, వైద్యలింగం, మంత్రులు సీవీ షణ్ముగం, జయకుమార్, తంగమణి, వేలుమణి గురువారం సాయంత్రం డీజీపీ త్రిపాఠిని కలిసి ఫిర్యాదు చేశారు.(చదవండి: షాకిచ్చిన ఎమ్మెల్యేలు.. యడ్డీ కుర్చీకి ఎసరు!) తమ పార్టీకి సంబంధం లేని వ్యక్తి పార్టీ జెండాను ఉపయోగిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని కోరారు. కేపీ మునుస్వామి మీడియాతో మాట్లాడుతూ అ న్నాడీఎంకే జెండాను ఉపయోగించే అర్హత పార్టీ కార్యకర్తలు, నాయకులకు మాత్రమే ఉందన్నారు. అయితే, తమ పార్టీకి సంబంధం లేని వ్యక్తి జెండాను ఉపయోగించే అర్హత లేదని, అందుకే డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. మంత్రి సీవీ షణ్ముగం మాట్లాడుతూ అన్నాడిఎంకే పార్టీ పన్నీరు సెల్వం, పళని స్వామి నేతృత్వంలోని సమన్వయ కమిటీకే చెందుతుందని, ఇప్పటికే ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిందని, కోర్టులు సైతం స్పందించాయని గుర్తు చేశారు. ఇప్పటికే జయలలిత సమాధి వద్దకు చిన్నమ్మ వెళ్లకుండా పనుల పేరిట అడ్డుకట్ట వేసిన పాలకులు, తాజాగా జెండా వాడకానికి చెక్ పెట్టే పనిలో పడడం గమనార్హం. నేడు వదినమ్మ విడుదల.. శశికళతో పాటు ఆమె వదినమ్మ ఇలవరసి, అక్కకుమారుడు సుధాకరన్ జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే. శిక్షా కాలం ముగియడంతో వదినమ్మ శుక్రవారం ఉదయం జైలు నుంచి బయటకు రానున్నారు. నేరుగా ఆమె చిన్నమ్మ బస చేసి ఉన్న ఫామ్ హౌస్‌కు వెళ్లనున్నారు. ఈ ఇద్దరు విడుదలైనా, సుధాకరన్ విడుదలలో జాప్యం తప్పడం లేదు. ఇందుకు కారణం, ఆయన చెల్లించాల్సిన జరిమానా ఇంకా కోర్టుకు చేరలేదు. -
'అమ్మ' జయంతి సందర్భంగా బంగారు ఉంగరాల పంపిణీ
సాక్షి, చెన్నై: తమిళనాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ రోజు జన్మించిన శిశువులకు బంగారు ఉంగరాలను బహుకరించారు. వివరాల ప్రకారం.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత 72వ జయంతి సందర్భంగా రోయపురం ఆర్ఎస్ఆర్ఎం ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ రోజు జన్మించిన శిశువులకు రాష్ట్ర మంత్రి డి. జయకుమార్ బంగారు ఉంగరాలు బహుమతిగా ఇచ్చారు. జయలలిత జయంతి సందర్భంగా తమ కార్యకర్తలంతా పేదలకు సాయం చేయడంతో పాటు, మెడికల్ క్యాంపులు నిర్వహించాలని అన్నాడీఎంకే పార్టీ పిలుపునిచ్చింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా పలువురు నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున జయలలితకు నివాళులర్పించారు. అలాగే తలైవికి నివాళిగా ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వం రాష్ట్ర సచివాలయం వద్ద మొక్కలు నాటి ఘనంగా నివాళులు అర్పించారు. జయలలిత జయంతి రోజైన ఫిబ్రవరి 24ను మహిళలు, చిన్నారుల భద్రతా దినోత్సవంగా నిర్వహిస్తామంటూ ముఖ్యమంత్రి పళనిస్వామి ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు. చదవండి: ఆమె ఆదర్శమైన ముఖ్యమంత్రి : కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి -
ఎవరి పదవులు పోతాయో.. ఎవరిని వరిస్తాయో..?
అన్నాడీఎంకే పార్టీలో మూడేళ్ల తర్వాత కీలక మార్పులు చేర్పులు జరగనున్నాయి. ఇందుకు తగ్గ సంకేతాన్ని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ నేతలు పన్నీరు, పళని ఇవ్వడంతో నేతల్లో కలవరం నెలకొంది. మార్పు అనివార్యం అని స్వయంగా పళని, పన్నీరు ప్రకటించారు. ఈ నెల 24న అమ్మ జయంతి రోజున ఆయా ప్రాంతాల్లో నేతలు సేవా కార్యక్రమాలు చేయాలని మంగళవారం పిలుపునిచ్చారు. సాక్షి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి అమ్మ జయలలిత మరణం తదుపరి పరిణామాలతో అన్నాడీఎంకేను రక్షించుకునేందుకు సీఎం పళనిస్వామి తీవ్రంగానే ప్రయత్నించారు. బయటకు వెళ్లిన పన్నీరుసెల్వంను మళ్లీ పార్టీలోకి రప్పించారు. అధికారంలో, పార్టీలో ఇద్దరు సమం అన్నట్టుగా సీఎంగా, అన్నాడీఎంకే సమన్వయ కమిటీ ఉపాధ్యక్షుడిగా పళనిస్వామి, డిప్యూటీ సీఎంగా, అన్నాడీఎంకే సమన్వయ కమిటీ అధ్యక్షుడిగా పన్నీరు సెల్వం ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ పాలన మూడేళ్లు విజయవంతం కావడంతో నాలుగో వసంతంలోకి అడుగు పెట్టిన పళనిస్వామి ఇక మార్పులు చేర్పులపై దృష్టి పెట్టడం అన్నాడీఎంకే నేతల్లో కలవరం రేపుతున్నాయి. చదవండి: ‘బ్రదర్ ఇదంతా రాజకీయ కక్ష.. నాకేం తెలియదు' మార్పులు చేర్పుల దిశగా.. తొలుత పన్నీరు రూపంలో ఆ తర్వాత అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం దినకరన్ రూపంలో అన్నాడీఎంకేలో చీలికలు వచ్చాయి. అయినా అందరినీ కలుపుకుని వెళ్లడంతో చాలా మంది మళ్లీ మాతృగూటికి వస్తున్నారు. ప్రజల్లో తనకు చరిష్మా ఉందని ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పళనిస్వామి చాటుకున్నారు. అదే ఊపుతో పురపాలక, కార్పొరేషన్లు, పట్టణ పంచాయతీలు, వాయిదా పడ్డ తొమ్మిది జిల్లాల్లోని స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడం లక్ష్యంగా దూకుడు పెంచారు. ఈ పరిస్థితుల్లో నాలుగు రోజుల పాటుగా జిల్లాల వారీగా పార్టీ వర్గాలతో పన్నీరు, పళని భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా అనేక జిల్లాల కీలక నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులపై జిల్లాల నుంచి వచ్చిన నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న పళని, పన్నీరు మార్పు అనివార్యం అని ప్రకటించడం గమనార్హం. చదవండి: శోకసంద్రంలో దర్శకుడు రాజ్‌కపూర్ కుటుంబం ప్రకటనతో కలవరం.. మంగళవారం పన్నీరు, పళని ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో నాలుగైదు రోజుల పాటుగా సాగిన జిల్లాల నేతల సమావేశం గురించి వివరించారు. ఇందులో అనేక అంశాలను తమ దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. బలోపేతం, రానున్న స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగేందుకు ప్రతిజ్ఞ చేద్దామని, అంకిత భావంతో, ఐక్యతతో పనిచేద్దామని కేడర్‌కు పిలుపునిచ్చారు. తాము ఇచ్చిన సూచనలు, సలహా పాటించే దిశగా ప్రతి ఒక్కరూ హామీలు ఇచ్చారని పేర్కొంటూ, అదే సమయంలో తమ దృష్టికి తెచ్చిన అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా మార్పులు చేర్పుల దిశగా ముందుకు సాగబోతున్నామన్నారు. ఎంజీఆర్, అమ్మ ఆశయ సాధన దిశగా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని అన్నారు. కాగా అనేక మంది మంత్రులు, జిల్లా నేతలపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఎవరి పదవులు ఊడుతాయో? ఎవరికి పదవులు వరిస్తాయో? అన్న చర్చ అన్నాడీఎంకేలో జరుగుతోంది. సేవల్లో.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత 72వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ నిర్ణయించింది. హంగు ఆర్భాటాలను పక్కన పెట్టి ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగాలని కేడర్‌కు పిలుపునిచ్చింది. అలాగే జయంతి రోజున రాయపేటలోని పార్టీ కార్యాలయంలో వేడుకలకు ఏర్పాట్లు చేశారు. -
మిస్టర్ స్టాలిన్ దమ్ముందా?
- స్టాలిన్‌కు వైగో సవాల్ సాక్షి, చెన్నై 'మిస్టర్ స్టాలిన్ దమ్ముందా....' తాను సంధించే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తావో, కేసులే వేసుకుంటావో, అంటూ ఎండీఎంకే నేత వైగో విరుచుకు పడ్డారు. ఎండీఎంకే నేత వైగో, డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ల మధ్య వారం రోజులుగా మాటల సమరం సాగుతున్న విషయం తెలిసిందే. డీఎంకేను టార్గెట్ చేసి వైగో స్పందిస్తున్న తీరుపై దళపతి స్టాలిన్ తీవ్రంగానే ఎ దురు దాడి చేస్తున్నారు. తన మీద ఆధార రహిత ఆరోపణలు చేసినందుకుగాను ఏకంగా లీగల్ నోటీసుల్ని సైతం వైగోకు స్టాలిన్ పంపించి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం వైగో మీడియాతో మాట్లాడుతూ స్టాలిన్‌పై కొత్త ఆరోపణలతో పాటుగా మిస్టర్..మిస్టర్ స్టాలిన్ దమ్ముందా...సవాల్ అంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అన్నాడీఎంకే నోట్లతో ఓట్లను రాబట్టే యత్నం చేస్తున్నదని వైగో విమర్శించారు. సిరుదావూర్ బంగళాలో ఉన్న నగదు ఆంధ్రాకు తరలి వెళ్లినట్టుగా, అధికారుల అండతోనే అన్నాడీఎంకే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నదంటూ ఆరోపణలు గుప్పించారు. ఇక, డీఎంకే దళపతి స్టాలిన్ తనను టార్గెట్ చేసి నోటీసులు పంపిస్తాడా.? అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాను సంధించే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేని పరిస్థితుల్లో స్టాలిన్ ఉన్నారని ఎద్దేవా చేశారు. మిథైన్ తవ్వకాల అనుమతి డీఎంకే హయంలో సాగిందని, ఆ సమయంలో స్టాలిన్‌కు ఎన్ని కోట్లు ముట్టిందో బహిర్గతం చేస్తానంటూ వ్యాఖ్యానించారు. కోట్లు దండుకుని అన్నదాతల్ని కడుపు కొట్టిన ఘనత డీఎంకేకు దక్కుతుందని ఆరోపించారు. మిస్టర్ స్టాలిన్ దమ్ముందా..? ఉంటే, మిథైన్ అనుమతుల్లో ఎంత ముట్టిందో ప్రకటిస్తావా, ఆ ఒప్పందాల వెనుక ఉన్న ఆంతర్యానికి సమాధానం ఇస్తావో ఏమోగానీ, కేసులు వేసినా భయ పడను అంటూ తీవ్రంగా వైగో స్పందించారు. -
అమ్మ ఇంటర్వ్యూలు
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకేలో సీటు ఆశిస్తున్న ఆశావహులకు ఆదివారం ఇంటర్వ్యూలు జరిగాయి. ఆశావహుల్ని సీఎం, పార్టీ అధినేత్రి జయలలిత ఇంటర్వ్యూలు చేశారు. ఐటీ విభాగానికి కొత్త కార్యవర్గంతో పాటు, కొన్ని చోట్ల పార్టీ పదవుల్లో ఉన్న వారికి ఉద్వాసన, కొత్త వారికి అవకాశం కల్పిస్తూ చర్యలు తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల పనులకు అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత నెలన్నర క్రితం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఓ వైపు పార్టీ వర్గాలు ప్రజాకర్షణ దిశగా పయనించే పనిలో పడ్డారు. మరో వైపు తమకు సీటు దక్కుతుందా..? అన్న ఆశతో నాయకులు ఎదురు చూపుల్లో పడ్డారు. ప్రతి ఏటా ఎన్నికల్లో కొత్త ముఖాలకు అమ్మ అవకాశం కల్పిస్తుండడంతో, ఈ సారి ఆశావహుల సంఖ్య పెరిగిందని చెప్పవచ్చు. అన్నాడీఎంకే దరఖాస్తుల స్వీకరణకు లభించిన స్పందనే ఇందుకు కారణం. తమ అమ్మ తమ నియోజకవర్గంలో అంటే, తమ నియోజకవర్గం బరిలో దిగాలంటూ మార్కులు కొట్టేయడానికి ఐదు వేల మందికి పైగా దరఖాస్తులు సమర్పించారు. మొత్తంగా 28 వేలకు పైగా దరఖాస్తులు రావడంతో వాటిని పరి శీలించి, జాబితా సిద్ధం చేసే పనిలో అన్నాడీఎంకే కార్యాలయ వర్గాలు నిమగ్నమయ్యారు. అభ్యర్థుల ఎంపిక పూర్తి అధికారం జయలలితకే ఉంది. ఆమె ఎవర్ని ఎంపిక చేస్తే అతడే అభ్యర్థి. అయి తే, ఈ దరఖాస్తుల పర్వం ఓ లాంచనమే. అలాగే, ఇంటర్వ్యూలు మరో లాంఛనమే. ఆ దిశగా ఆదివారం అభ్యర్థుల ఎంపికకు ఇంటర్వ్యూల్లో జయలలిత నిమగ్నమయ్యారు. చెన్నైలో అభ్యర్థుల ఎంపికకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఓ వైపు ఇంటర్వ్యూల బిజీలో ఉంటూ , మరో వైపు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారి భరతం పట్టే దిశగా కొరడా ఝుళిపించారు. కొన్ని చోట్ల పదవుల్లో ఉన్న వారికి ఉద్వాసన పలుకుతూ, వారి స్థానాల్లో కొత్త వారిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక, పార్టీ అనుబంధ ఐటీ విభాగానికి పార్టీ పరంగా ఉన్న యాభై జిల్లాలకు కమిటీల్ని ప్రకటించారు. ఇక, పుదుచ్చేరి మాజీ మంత్రి కన్నన్‌కు అందలం ఎక్కిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి పార్టీలోకి వచ్చిన కన్నన్ను ప్రస్తుతం పార్టీ పుదుచ్చేరి ఎన్నికల వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా నియమిస్తూ ప్రకటించారు. -
టైటిల్ వివాదానికి తెర దించాడు
మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే, కోలీవుడ్‌లో సినీ రంగానికి, రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంది. అందుకే అక్కడి సినిమాలు, సినీ నటులు ఎప్పుడు వివాదాస్పదం అవుతూనే ఉంటారు. ఇలా వివాదాల్లో ఇరుక్కున్న ఓ సినిమా ఇప్పుడు బయటపడింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బెంగళూర్ డేస్' తమిళ రీమేక్, టైటిల్ వివాదం సద్దుమణిగింది. రానా, ఆర్య, శ్రీ దివ్య, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ రీమేక్ సినిమాకు ముందుగా 'అర్జున్ దివ్య మీనాక్షి కార్తీక్' అనే పేరు పెట్టారు. అభిమానులకు ఈ పేరును షార్ట్ కట్లో ఏడీఎంకే అని అలవాటు చేశారు. దీంతో వివాదం మొదలైంది. తమిళనాట ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ పేరు అన్నాడీఎంకే కావటంతో సినిమా విడుదల నిలిపివేయాలంటూ ఆందోళనలు మొదలయ్యాయి. గతంలో విశాల్ హీరోగా తెరకెక్కిన సినిమాకు మదగజ రాజా అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ సినిమాను షార్ట్ ఫాంలో ఎమ్జిఆర్ అని పిలవటంతో ఆ సినిమా ఇప్పటివరకు విడుదల కాలేదు. దీంతో తమ సినిమా విషయంలో కూడా అలాంటి పరిస్థితి ఎదురవుతుందేమో అన్న ఆలోచనతో భాస్కర్ తన సినిమా టైటిల్‌ను మార్చేశాడు. ఇప్పటివరకు ఏడియంకేగా ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు 'బెంగళూరు నాట్గల్' అనే పేరును ఫైనల్ చేశారు. దీంతో చాలా రోజులుగా నలుగుతున్న టైటిల్ వివాదానికి తెరపడింది. -
ఏడీఎంకేలో సమంత?
క్రేజీ బ్యూటీస్‌లో నటి సమంత ఒకరని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంతకుముందు టాలీవుడ్లో ఏలిన ఈ చెన్నై చిన్నది ఇప్పుడు పూర్తిగా కోలీవుడ్‌పైనే దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం తమిళ టాప్ హీరోలందరితోను వరుసగా జత కట్టేస్తున్న సమంత తాజాగా ఏడీఎంకేలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏడీఎంకే అనగానే రాజకీయాలు గుర్తు కొస్తున్నాయా? అలాంటి ఆలోచన రావడంతో తప్పులేదు. ఎందుకంటే ఇటీవల నటి త్రిష అన్నాడీఎంకేలో చేరబోతున్నారనే ప్రచారం హల్చల్ చేసింది. ఆ ప్రచారాన్ని నేనా? రాజకీయాల్లోనా? అంటూ ఖండించిన త్రిష ఆ తరువాత అతి కొద్ది రోజుల్లోనే మరో 15 ఏళ్ల తరువాత రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేకపోలేదంటూ చెన్నైలో ఒక సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా అన్నారు. క్షణ క్షణం బుల్ జవరాలి చిత్తముల్ అన్నట్లు ఈ హీరోయిన్లు ఎప్పుడు? ఎలా? మాట్లాడుతారో తెలియదు. ఇకపోతే ఏడీఎంకేలో సమంత చేరనున్నారా? అనగానే ఈ అమ్మడికి రాజకీయ ఆశా? అనే ఆసక్తి కలగక మానదు. అయితే ప్రస్తుతానికి ఈ బ్యూటీ న్యూస్ రాజకీయాలకు సంబంధించి కాదు. ఆర్య, బాబిసింహా, రానా, శ్రీదివ్య, పార్వతి మీనన్ నటిస్తున్న చిత్రం అర్జున్ దివ్య మట్రుమ్ కార్తీక్. దీన్ని షార్ట్‌కట్‌లో ఏడీఎంకే అంటున్నారు. మలయాళం మాతృక అయిన ఈ చిత్రాన్ని తమిళంలో పీవీపీ సినిమా సంస్థ నిర్మిస్తోంది. కాగా మలయాళంలో నటి నిత్యామీనన్ పోషించిన అతిథి పాత్రను తమిళంలో సమంత నటించనున్నారన్నది తాజా సమాచారం. -
'రాజకీయ చదరంగం' ఎంతటి వారినైనా...