adulterous relationship
-
'వల'పుబాణంతో.. 'వెబ్'చారం
నాగరికత పెరుగుతున్న కొద్దీ.. విశృంఖల పోకడలు కూడా దానితో పాటు పోటీపడుతున్నాయి. టెక్నాలజీని తప్పుదారి పట్టించడంలో వ్యభిచార ముఠాలు ముందుంటున్నాయి. ఇటీవల కాలంలో ఏది కొనాలన్నా.. తినాలన్నా.. చూడాలన్నా అంతా ఆన్లైన్లోనే జరిగిపోతోంది. సరిగ్గా దీనినే కొందరు ఆసరాగా తీసుకుని హైటెక్ వ్యభిచారానికి తెరతీస్తున్నారు. వెబ్సైట్లు క్రియేట్ చేసుకుని వ్యాపార ప్రముఖుల పిల్లలు, పెద్దింటి యువకులే లక్ష్యంగా సొషల్ మీడియాను అస్త్రంగా మార్చుకుని దందా సాగిస్తున్నారు. ముంబాయి, ఢిల్లీ, హైదరాబాద్ తదితర మెట్రో నగరాలకే పరిమితమైన ఈ తరహా వ్యవహారం విజయవాడలోనూ కొరలు చాచుతోంది. వీటిపై పోలీసుల నిఘా కొరవడటంతో యువత తప్పుదారి పడుతోంది. సాక్షి, అమరావతిబ్యూరో : బెజవాడ నగరంలో వ్యభిచార ముఠాలు బరితెగిస్తున్నాయి. అందివచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ.. ఇంటర్నెట్ ద్వారా యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నాయి. ఆన్లైన్ ద్వారా విటులను ఆకర్షిస్తూ పబ్బం గడుపుకుంటున్నాయి. చిన్న సెర్చ్ చాలు.. గూగుల్‌లో ఒక్కసారి సెర్చ్‌చేస్తే పదుల సంఖ్యలో వ్యభిచార వెబ్సైట్లు మహిళల చిత్రాలు, చిరునామాలతో సహా దర్శమిస్తాయి. నచ్చితే ఫొన్ నంబర్లలో సంప్రదించాలని మెసేజ్‌లు కనిపిస్తాయి. అంతే కాక ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపులను కూడా ముఠాలు ఉపయోగిస్తున్నారని సమాచారం. ఆ గ్రూపుల్లో అమ్మాయిల ఫొటోలు పెడుతూ.. నచ్చితే సంప్రదించమని కోరుతుంటారని తెలుస్తోంది. దీనికోసం వారు కుటుంబం, వ్యాపారం, కన్సల్టెన్సీ తదితర పేర్లతో అపార్ట్మెంట్లు, వ్యక్తిగత నివాస గృహాలను అద్దెకు తీసుకుంటూ.. విటుల్ని, అమ్మాయిల్ని అక్కడికే పిలిపిస్తుంటారు. నగరంలో నున్న, సింగ్‌నగర్, కృష్ణలంక, రామవరప్పాడు తదితర ప్రాంతాల్లో పట్టపగలే వ్యభిచార ముఠాలు విజృంభిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదిగో ఇలా వల.. హైటెక్ వ్యభిచార ముఠాలు తమ వ్యవహారాల్ని పగడ్బందీగా నిర్వహిస్తున్నాయి. ముందుగా వెబ్సైట్లో దరఖాస్తును ఉంచుతారు. ఆసక్తిగలవారు దాన్ని పూర్తి చేయాలి. ఫోన్ నంబర్లు ఇతరత్రా పూర్తిగా సేకరించిన సమాచారంతో దరఖాస్తుదారుడి గురించి ముఠా సభ్యులు విచారణ చేస్తారు. అనుమానాస్పద వ్యక్తులు కాదని నిర్థారించుకున్న తర్వాత అతన్ని కలుసుకుంటారు. అప్పటికీ అతన్ని పూర్తిగా నమ్మరు. ఒకట్రెండు చోట్లకు తిప్పుతారు. అవతలి వ్యక్తిపై పూర్తిగా నమ్మకం కలిగిన పిమ్మటే ఇంటికి తీసుకెళతారు. 20 నుంచి 25 ఏళ్ల యువకులే ఈ ముఠాల వలలో చిక్కుతున్నారు. విటులకు ఇల్లుతో సహా సకల సౌకర్యాలు కల్పిస్తారు. స్నేహహస్తమంటూ ఉచ్చు.. ఇంటర్నెట్లో కొందరు మహిళల స్నేం చేస్తామంటూ ఫొటోలు, వివరాలు ఉంచుతున్నారు. యువకులు కదా అని వారికి ఫోన్ చేస్తే వారి ఉచ్చులో చిక్కుకున్నట్లే. ముందుగా స్నేహం, ఆ తర్వాత సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఇక కాల్‌గరల్స్ అంటూ వెబ్సైట్లలో ఉంచుతున్న ఫొటోలు చాలామటుకు తప్పుడివే ఉంటాయి. అందమైన అమ్మాయిల ఫొటోలు ఉంచి యువతను మోసం చేస్తున్నాయని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. దాడులు మానేసిన పోలీసులు.. నగరంలో వ్యభిచార ముఠాల ఆగడాలపై పోలీసులు నోరుమెదపడం లేదు. నిత్య వ్యభిచార గృహాలపై దాడులు చేస్తున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఇతర ముఖ్యమైన పనులు అప్పగించారు. ఇది చాలా చిన్న వ్యవహరమంటూ వ్యభిచార గృహాలపై దాడులు చేసే పనిని స్థానిక పోలీసులకే అప్పజెప్పారు. అప్పటి నుంచి వ్యభిచార ముఠాల జోరుకు పగ్గాల్లేకుండా పోయాయన్న ఆరోపణలు వస్తున్నాయి. స్థానిక పోలీసులకు తమ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో క్షుణ్ణంగా తెలుసన్న వాదన వినిపిస్తోంది. కానీ ఎప్పుడూ దాడులు చేసింది లేదు. పోలీసుల నిర్లిప్తత వల్ల వేలాది మంది బాలికలు, మహిళల జీవితం నరకకూపంలో మగ్గిపోతున్నాయి. అయితే ఇంటర్నెట్ వ్యభిచార గుట్టును రట్టు చేసినా నిర్వాహకులు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉండటం వల్ల వారిపై చర్యలు తీసుకోవడం కష్టమే అవుతోందంటున్నారు ఓ సీనియర్ పోలీసు అధికారి. ఇలాంటి కేసులను దర్యాప్తు చేయడానికే ప్రత్యేకంగా ‘సైబర్‌సెల్’ను ఏర్పాటు చేశారు. ఖరీదైన కాలనీల్లో తిష్టవేసే ఈ ముఠాలు అపార్టుమెంట్ల కన్నా వ్యక్తిగత నివాసాలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. -
సరుగుడు తోటలో జంట ఆత్మహత్య
* వివాహేతర బంధాన్ని వీడలేకనే.. * పది రోజుల తర్వాత వెలుగులోకి.. * మృతదేహాలను గుర్తించిన బంధువులు సఖినేటిపల్లి : కొద్ది రోజుల క్రితం కనిపించకుండా పోయిన జంట.. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలుగా కనిపించింది. వివాహేతర బంధాన్ని వీడలేక.. వీరు ఇంటికి సమీపంలో ఉన్న సరుగుడు తోటలోకి వెళ్లి, పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పది రోజుల తర్వాత దుర్వాసన వెదజల్లుతూ, కుళ్లిపోయిన పరిస్థితుల్లో వారి మృతదేహాలు వ్యవసాయ కూలీలకు కనిపించాయి. అంతర్వేదికర గ్రామంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై కృష్ణభగవాన్, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బెల్లంకొండ నర్సింహమూర్తి(34)కి సుమారు 11 ఏళ్ల క్రితం మహాలక్ష్మితో వివాహమైంది. వీరికి చాలాకాలంగా సంతానం లేదు. కొంతకాలం క్రితం నర్సింహమూర్తి గల్ఫ్ వెళ్లి, ఆరు నెలలు క్రితం స్వగ్రామానికి తిరిగొచ్చాడు. అతడి ఇంటి సమీపంలోని కొబ్బరితోటలో నివసిస్తున్న నాగులపల్లి రుక్మిణి(24)తో అతడికి పరిచయం ఏర్పడింది. అదికాస్తా వివాహేదర బంధానికి దారితీసింది. రుక్మిణికి గతంలో రెండు పెళ్లిళ్లయ్యాయి. వివిధ కారణాల వల్ల విడిపోయిన ఆమె తల్లితోనే ఒంటరిగా ఉంటోంది. వేర్వేరు సందర్భాల్లో రుక్మిణి, మహాలక్ష్మి మధ్య గొడవలు జరిగాయి. అలాగే నర్సింహమూర్తి ఇంట్లో కూడా గొడవలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 4 నుంచి నర్సింహమూర్తి, రుక్మిణి కనిపించకుండా పోయారు. ఈ మేరకు నర్సింహమూర్తి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరికోసం గాలిస్తుండగా.. శుక్రవారం ఉదయం పొలం పనుల కోసం సముద్ర తీరానికి సమీపంలోని సరుగుడు తోటల్లోకి వెళ్లిన వారు.. అక్కడ వస్తున్న దుర్వాసనను గమనించారు. అటువైపు వెళ్లిచూడగా.. రెండు కుళ్లిపోయిన మృతదేహాలు కనిపించాయి. ఈ విషయాన్ని స్థానికులకు, వీఆర్ఓ గుండాబత్తుల మురళికి తెలిపారు. వీఆర్ఓ ఫిర్యాదుతో ఎస్సై కృష్ణభగవాన్ తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అక్కడ లభ్యమైన ఆధారాల మేరకు నర్సింహమూర్తి కుటుంబ సభ్యులను ఆరాతీశారు. మృతదేహాల వద్ద ఉన్న దుస్తులు, చెప్పులు, సెల్‌ఫోన్ నర్సింహమూర్తికి చెందినవిగా వారు గుర్తుపట్టారు. అలాగే మరో సెల్‌ఫోన్, చిరిగిన నైటీని కూడా పోలీసులు కనుగొన్నారు. వీటి ఆధారంగా ఆ రెండు మృతదేహాలు నర్సింహమూర్తి, రుక్మిణివిగా పోలీసులు నిర్థారించారు. మృతుల ఇళ్లకు సుమారు అర కి.మీ.దూరంలో మృతదేహాలు పడి ఉన్నాయి. కొద్దిరోజులుగా మృతదేహాలు అక్కడే ఉండడంతో, కుక్కలు, నక్కలు పీక్కుతిన్న ఆనవాళ్లున్నాయి. మృతదేహాలను లాక్కుని వెళ్లడంతో.. అవి రెండూ కొద్దిదూరంలో పడి ఉన్నాయి. దుస్తులు కూడా చిరిగిపోయి, ఎముకలు బయటపడ్డాయి. మృతదేహాల వద్ద కూల్‌డ్రింక్, పురుగు మందు సీసా, స్టీల్ గ్లాసులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
భార్యను కడతేర్చిన భర్త
కాకినాడ రూరల్ : వివాహేతర బంధానికి అడ్డొస్తుందన్న నెపంతో భార్యను కడతేర్చాడు భర్త. కాకినాడ విద్యుత్‌నగర్‌లో జరిగిన ఈ సంఘటనలో కిలిం నూకరత్నం దేవి( 27) బలైంది. సర్పవరం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ప్రతాప్‌నగర్‌కు చెందిన పచ్చిపాల సత్యనారాయణకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె నూకరత్నందేవి విజయవాడ గవర్నర్‌పేటలో సెంట్రల్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్‌గా పనిచేస్తోంది. రమణయ్యపేటకు చెందిన కిలిమ్ శ్రీనివాసరావు కాకినాడ కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఆరేళ్ల క్రితం వివాహం కాగా, ఏడాదిన్నర బాబు ఉన్నాడు. విద్యుత్‌నగర్‌లోని నాన్సిస్ట్రీట్‌లో ఉన్న ఓ అపార్టమెంట్లో శ్రీనివాసరావు, నూకరత్నందేవి ఉంటున్నారు. ఉద్యోగరీత్యా నూకరత్నందేవి వారానికి ఒకసారే కాకినాడకు వచ్చేది. దీనిని ఆసరాగా తీసుకున్న శ్రీనివాసరావు మరో మహిళతో వివాహేతర బంధం పెట్టుకున్నాడు. అనుమానం వచ్చిన నూకరత్నం దేవి అప్పుడప్పుడూ భర్తను నిలదీసేది. ఆదివారం రాత్రి ఓ ఫంక్షన్‌కు వెళ్లొచ్చాక వీరిమధ్య వాగ్వాదం జరిగింది. సోమవారం ఉదయం కూడా గొడవ జరగడంతో శ్రీనివాసరావు తన భార్యను కొట్టి, తువాలును ఆమె మెడకు బిగించి చంపేశాడు. అనంతరం ప్రతాప్‌నగర్‌లో ఉంటున్న నూకరత్నందేవి తండ్రి సత్యనారాయణకు ఫోన్ చేసి, ‘మీ అమ్మాయికి దెబ్బ తగిలింది, ఆస్పత్రిలో చేర్చాం’ అని చెప్పాడు. తండ్రి, బంధువులు ఆస్పత్రికి వెళ్లగా, నూకరత్నందేవి చనిపోయి ఉంది. గొంతు నుమిలినట్టు ఉండడం, అపార్టమెంట్లో తువాలు చుట్టి ఉండడంతో.. ఆమెను హతమార్చారని నిర్ధారణకు వచ్చిన సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ మురళీకృష్ణారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డు అయ్యాడని భర్తనే చంపించింది!
గరివిడి , న్యూస్‌లైన్ : వివాహేతర సంబంధానికి అడ్డు అవుతున్నాడని అగ్ని సాక్షిగా మనువాడిన భర్తనే చంపించింది ఆ ఇల్లాలు. ప్రియునితో కలసి ఘాతుకానికి ఒడిగట్టింది. తీరా ఏమీ తెలియనట్లు భర్త మృతదేహం వద్దే భోరుమని రోదించి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. చివరికి గుట్టు రట్టయింది. గత నెల 26న ఎం.దుగ్గివలస-గదబవలస గ్రామాల మధ్య వ్యక్తి మృతి చెందిన విషయం విదితమే. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. స్వల్ప కాలంలోనే ఈ కేసు మిస్టరీ వీడింది. అనుమానాస్పద మృతి కాదు.. హత్యగా పోలీసులు నిర్ధారించారు. నిందితులను చీపురుపల్లి సీఐ ఎస్.వాసుదేవ్ శనివారం గరివిడి పోలీసుస్టేష న్లో విలేకరుల ముందు ప్రవేశపెట్టారు. హత్యకు దారి తీసిన కారణాలను వెల్లడించారు. మృతుడు బుక్కిరి గొల్ల, భార్య గౌరితో కలసి కొన్ని సంవత్సరాలుగా చెన్నైలో ఉంటున్నాడు. కూలి పనుల కోసం ఇక్కడ నుంచి వలస వెళ్లి అక్కడ నివసిస్తున్నారు. వీరితో పాటు సమీప బంధువులైన రాజాం మండలం అమరం గ్రామానికి చెందిన బుక్కిరి ఆనంద్, దోసరి గ్రామానికి చెందిన దమరసింగి నరేష్‌లు కూడా చెన్నైకు వలస వెళ్లారు. బుక్కిరి ఆనంద్‌కు, మృతుడు భార్య గౌరికి కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన గొల్ల చాలాసార్లు భార్య గౌరిని మందలించాడు. దీంతో ఎలాగైనా గొల్ల అడ్డును తొలగించుకోవాలని ఆనంద్, గౌరి పథకం పన్నారు. చెన్నైలోనే అతనిని హత్య చేయాలని తొలుత భావించారు. అయితే ఈలోపు పంచాయతీ ఎన్నికలు రావడంతో అంతా కలసి స్వగ్రామానికి చేరుకున్నారు. ముందుగా పథకం ప్రకారం.. గత నెల 26న గొల్లకు ఆనంద్ రాజాం నుంచి ఫోన్ చేశాడు. సినిమాకు రావాల్సిందిగా కోరాడు. భార్య గౌరి కూడా గొల్లను సినిమాకి వెళ్లాలని ప్రోత్సహించింది. ఇవేమీ తెలియని గొల్ల.. రాజాం సినిమాకి వెళ్లాడు. ఆనంద్‌తోపాటు అతని బావ దమరసింగి నరే ష్ కూడా రాజాం చేరుకున్నారు. గొల్ల రాజాం వచ్చిన వెంటనే నరేష్‌తో అతనిని ఆనంద్ సినిమాకి పంపించాడు. వారి మేనత్తకు కూరగాయలు కొనాలని ఆనంద్ బజారుకు వెళ్లాడు. సినిమా అయిన వెంటనే ముగ్గురూ కలుసుకున్నారు. రాజాంలోనే వైన్‌షాప్‌నకు వెళ్లి పూటుగా మద్యం సేవించారు. అనంతరం క్రికెట్ బ్యాట్ కొనుగోలు చేశారు. అక్కడ నుంచి గొల్లను ఇంటి వద్ద దించేస్తామని ద్విచక్ర వాహనం ఎక్కించారు. గదబవలస-ఎం.దుగ్గివలస గ్రామాల మధ్య నిర్మానుష్యంగా ఉన్న కల్వర్టు వద్ద మూత్రం పోసేందుకని ద్విచక్ర వాహనాన్ని ఆపారు. కల్వర్టు పైన కూర్చొన్న గొల్లపై ఒక్కసారిగా ఇద్దరూ కలిసి క్రికె ట్ బ్యాట్‌తో దాడి చేశారు. తలభాగంపై బలంగా బాదారు. దీంతో గొల్ల కుప్పకూలిపోయాడు. సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. అనంతరం ఏమీ తెలియనట్లుగా ఇళ్లకు చేరుకున్నారు. ఇదంతా తెలిసి కూడా.. ఉదయాన్నే మృతుని భార్య గౌరి సంఘటన స్థలానికి చేరుకుని రోదించింది. తమకు ఎవరూ శత్రువులు లేరని, ఎలా చనిపోయాడో తెలియదంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దర్యాప్తును వేగవంతం చేశారు. పోలీసులు దర్యాప్తు చురుగ్గా చేయడంతో.. నిందితులకు భయం పట్టుకుంది. దొరికిపోతామేమోనని ఆందోళనకు గురై.. అమరం వీఆర్ఒ ఎ.సాయిశంకర్ వద్ద లొంగిపోయారు. దీంతో నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు. హత్యకు సహకరించిన మృతుడు భార్య గౌరిపై కూడా చ ట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.