Adventure Awards
-
రాష్ట్రపతి భవన్ లో క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం
-
నిరాలాకు ‘అశోక్ చక్ర’
న్యూఢిల్లీ: ఉగ్రవాదులతో జరిగిన పోరులో అమరుడైన వైమానిక దళం గరుడ్ కమాండో జ్యోతి ప్రకాశ్ నిరాలాకు కేంద్రం ‘అశోక్ చక్ర’ పురస్కారాన్ని ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 390 మందికి రాష్ట్రపతి సాహస పురస్కారాలను ప్రకటించారు. వీటిలో ఒక కీర్తి చక్ర, 14 శౌర్య చక్ర, 28 పరమ్ విశిష్ట సేవా పతకాలు, 4 ఉత్తమ్ యుద్ధ్ సేవా పతకాలు ఉన్నాయి. ఉత్తమ సేవలు అందించిన 27 మంది సీబీఐ అధికారులకు రాష్ట్రపతి పురస్కారాలు ప్రకటించారు. 2017 నవంబరులో కశ్మీర్‌లోని బందిపొర జిల్లా చందర్గెర్లోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాగున్నారన్న సమాచారం మేరకు గరుడ్ ప్రత్యేక దళానికి చెందిన ప్రకాశ్‌తోపాటు మరికొందరు రంగంలోకి దిగారు. ఉగ్రవాదులు దాగున్న సంగతి తెలిసిన గరుడ్ దళం ఆ ప్రాంతాన్ని చుట్టు ముట్టింది. కార్పొరల్ ప్రకాశ్ మాత్రం ప్రమాదాన్ని లెక్కచేయకుండా స్థావరం అతి సమీపంలోకి వెళ్లి ఉగ్రవాదులపైకి కాల్పులు జరిపి ఇద్దరిని మట్టుబెట్టారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిరాలా తుదిశ్వాస విడిచారు. కాగా, సీఆర్పీఎఫ్కు చెందిన ఇద్దరు కమాండోలకు కేంద్రం శౌర్యచక్ర పురస్కారం ప్రకటించింది. జార్ఖండ్‌లోని లతేహార్లో ఆరుగురు మావోయిస్టులను మట్టుబెట్టటంతోపాటు ఆయుధాలు, మందుగుండు స్వాధీనం చేసుకోవటంలో అసిస్టెంట్ కమాండెంట్ జఖార్తోపాటు ఆయన బృందంలోని సబ్ ఇన్స్పెక్టర్ రియాజ్ ఆలం కీలకంగా వ్యవహరించారు. -
18 మంది బాలలకు సాహస అవార్డులు
న్యూఢిల్లీ: గ్యాంబ్లింగ్, బెట్టింగ్ దందా నడుపుతున్న ముఠాను పట్టుకోవటంలో పోలీసులకు సహకరించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన నజియా(18)తోపాటు 18 మంది బాలలు ఈ ఏడాది సాహస అవార్డులకు ఎంపికయ్యారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్(ఐసీసీడబ్ల్యూ) ఇచ్చే ఈ అవార్డులకు ఐదు విభాగాల కింద బాలలను ఎంపిక చేస్తారు. వీటిలో అత్యున్నతమైన ‘భారత్ అవార్డు’కు నజియా ఎంపికైంది. ఈమెకు దుండగుల నుంచి ఎన్నో బెదిరింపులు వచ్చాయి. అయినా లక్ష్యపెట్టకుండా తమ ప్రాంతంలోని గ్యాంబ్లింగ్, బెట్టింగ్ ముఠా ఆటకట్టించగలిగింది. కర్ణాటకకు చెందిన నేత్రావతి ఎం.చవాన్ నీటిలో మునిగిపోతున్న ఇద్దరు బాలురను రక్షించే క్రమంలో నీట మునిగి చనిపోయింది. ఈమెకు మరణానంతరం ఈ అవార్డు ప్రకటించారు. కాల్వలో పడి పోయిన స్కూల్ బస్సు నుంచి 15 మంది బాలలను కాపాడిన అదే బస్సులో ఉన్న పంజాబ్‌నకు చెందిన విద్యార్థి కరణ్‌బీర్ సింగ్(17) కూడా ఎంపికయ్యాడు. ఈనెల 24వ తేదీన ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో వీరంతా ప్రధాని చేతుల మీదుగా పతకాలు అందుకోనున్నారు. జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న అనంతరం వీరందరికీ రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ విందు ఇవ్వనున్నారు. -
సాహస అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం
ఎల్బీ స్టేడియం, టెన్జింగ్ నార్గే జాతీయ సాహస అవార్డులకు అర్హులైన అభ్యర్థుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. రాష్ట్రంలో 31 డిసెంబరు 2012 నుంచి సాహస క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులతోపాటు వికలాంగులైన క్రీడాకారుల కూడా ఈ అవార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చునని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాప్) ఒక ప్రకటనలో తెలిపింది. ఆస్తకిగల అభ్యర్థులు తమ వివరాలతో ఈనెల 10వ తేదీలోగా ఎల్బీ స్టేడియంలోని శాప్ కార్యాలయానికి తమ దరఖాస్తులను పంపించాలి. ఇతర వివరాలకు శాప్ పీఆర్ఓ (98666-94536)ను సంప్రదించవచ్చు