agiriculture
-
మార్క్‌ఫెడ్ ‘ఔట్’!
సాక్షి, హైదరాబాద్: రైతు సమన్వయ సమితిలో మార్క్‌ఫెడ్‌ను విలీనం చేస్తున్నారా? తద్వారా రైతు సమన్వయ సమితిని బలోపేతం చేస్తారా? ఇక నుంచి పంట ఉత్పత్తుల సేకరణ, ఎరువుల సరఫరా బాధ్యత రైతు సమితే తీసుకుం టుందా? అంటే అవుననే అంటు న్నాయి వ్యవసాయ శాఖ వర్గాలు. ఆ దిశగా కీలక అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది. రెండ్రోజుల కిందట వ్యవ సాయ శాఖకు చెందిన ఇద్దరు కీలక ప్రజా ప్రతినిధుల మధ్య ఈ అంశంపై సీరియస్‌గా చర్చలు జరిగాయని, ఈ చర్చల అనంతరం ఒక ప్రజాప్రతినిధి ‘విలీనం జరిగే అవకాశాలు మెం డుగా కనిపిస్తున్నాయ’ని తమ వద్ద ప్రస్తావించినట్లు మార్క్‌ఫెడ్ ఉద్యోగులు చెబుతున్నారు. అంతేకాదు ‘మార్క్‌ఫెడ్ గత ఖరీఫ్‌లో యూరియా సరఫరాలో ఘోరంగా విఫలమైంది. పంట ఉత్పత్తుల కొను గోలులోనూ అనేక అవకతవకలు జరుగు తున్నాయి. మొక్కజొన్న విక్రయాల పైనా విమర్శలు వచ్చాయి. దీంతో మార్క్‌ఫెడ్‌పై ఉన్నత స్థాయి వర్గాలు గుర్రుగా ఉన్నాయ’ని ఆయన ప్రస్తా వించారని తెలిసింది. దీంతో మార్క్ ఫెడ్లో పనిచేసే ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇక మార్క్‌ఫెడ్ ఎరువులను సరఫరా చేస్తుండగా, తాజాగా ఆగ్రోస్‌ను కూడా అడిషనల్ నోడల్ ఏజెన్సీగా నియమించారు. అంటే ఇక నుంచి ఆగ్రోస్ కూడా తమ ఆగ్రో రైతు సేవా కేంద్రాల ద్వారా కంపెనీల నుంచే నేరుగా ఎరువులను సరఫరా చేయనుంది. ఇప్పటికే దానికి సంబం ధించి తాజాగా వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇలా మార్క్ ఫెడ్‌ను రోజురోజుకూ నిర్వీర్యం చేస్తున్నారని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. రైతు సమితిలో మార్క్‌ఫెడ్‌ను విలీనం చేస్తే దానిలో ఉన్న సమితి సభ్యులతో తాము పనిచేయడం కష్టంగా మారుతుందని అంటున్నారు. ఏది చేయాలన్నా సమస్యలు వచ్చే అవకాశం ఉందన్న భావన ఉద్యోగుల్లో నెలకొంది. పరిపాలనా విభాగం ఏర్పాటే లక్ష్యం.. రైతు సమన్వయసమితి ఏర్పాటై ఇన్నాళ్లయినా దానికి సంబంధించి పూర్తిస్థాయి కార్యక్రమాలు ప్రారంభంకాలేదు. గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రస్థాయిలో రైతు సమన్వయ సమితుల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం లక్షలన్నర మందికిపైగా కిందినుంచి పైస్థాయి వరకు సభ్యులున్నారు. దానికి చైర్మన్ గా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని సర్కారు నియమించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు దానికి గుత్తా సుఖేందర్‌రెడ్డి చైర్మన్‌గా వ్యవహరించారు. రైతు దుక్కి దున్ని పంట పండించి, మార్కెట్‌కు తీసుకెళ్లే వరకూ సమితి సభ్యులు అండగా ఉండాలనేది సర్కారు ఉద్దే శం. రైతుబంధు నిధులు అందేలా చేయడం, బ్యాంకుల్లో పంట రుణాలు ఇప్పించేలా కృషి చేయడం, పంట పండించాక దాన్ని మద్దతు ధరకు విక్రయించే ఏర్పాట్లు చేయడం, దేశంలో ఎక్కడెక్కడ ఏ స్థాయిలో మంచి ధరలున్నాయో గుర్తించి అక్కడికి పంట ఉత్పత్తులు తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవడం వంటి అనేక కీలకమైన బాధ్యతలు సమన్వయ సమితి చేయాలనేది సర్కారు లక్ష్యం. అంతేకాదు ఎరువులు, విత్త నాలు సకాలంలో రైతులకు అందించేలా చేయ డం, నాసిరకం విత్తనాలు అమ్మకుండా అడ్డుకో వడం, పంట పండించాక మార్కెట్లో ఇబ్బందు లు తలెత్తకుండా సమితి సభ్యులు కృషి చేయా లని కూడా సీఎం కేసీఆర్ వారికి అప్పట్లో దిశానిర్దేశం చేశారు. అయితే రైతు సమన్వయ సమితికి ఇవన్నీ చేసే పరిపాలనా విభాగం లేదు. అధికారులు, ఉద్యోగులు, ఇతరత్రా వ్యవస్థ ఏర్పాటు కాలేదు. కేవలం చైర్మన్లు, సభ్యులు మాత్రమే ఉన్నారు. దీనికి ఎటువంటి అధికారాలు, పరిపాలనా యంత్రాంగం, చెక్ పవర్ వంటివేవీ లేవు. ఈ పరిస్థితిని మార్చాల నేది సర్కారు ఉద్దేశం. ఇటు రైతు సమన్వయ సమితి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రకా రమే మార్క్‌ఫెడ్ రైతులకు యూరియా, ఇతర ఎరువులను సరఫరా చేస్తుంది. పంట ఉత్ప త్తులను కొనుగోలు చేస్తుంది. కాబట్టి మార్క్ ఫెడ్‌ను విలీనం చేస్తే, ఆ పరిపాలనా యం త్రాంగం మొత్తం రైతు సమితిలోకి వచ్చి పరి పుష్టిగా ఉంటుందనేది ఆ ఇద్దరు కీలక ప్రజా ప్రతినిధులు భావించినట్లు సమాచారం. మార్క్‌ఫెడ్‌లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 150 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో పటిష్టమైన యంత్రాంగం, విభాగం ఉంది. దానికి చైర్మన్, ఎండీ, జనరల్ మేనేజర్ కూడా ఉన్నారు. కానీ దాన్ని సక్రమంగా నడిపించడం లేదన్న ఆరోపణలు న్నాయి. రైతు సమన్వయ సమితిలో మార్క్‌ఫెడ్ విలీనంపై వివరణ ఇవ్వడానికి అటు అధికారులు, ఇటు సంబంధిత ప్రజాప్రతినిధులు సుముఖంగా లేరు. -
43 లక్షల మందికి ‘వైఎస్సార్ రైతు భరోసా’
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా 43 లక్షల మందికి సాయం అందించామని అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతు భరోసా పథకానికి కౌలు రైతులు దరఖాస్తు చేసుకోవడానికి మరో నెల పొడిగించామని చెప్పారు. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకానికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. మార్కెటింగ్ సీజన్ ప్రారంభం అయ్యిందని, పత్తి కొనుగోలుకు సీసీఏ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. వేరుశనగకు కూడా త్వరలో ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ధరల స్థిరీకరణ విషయంలో నిరంతరం సమీక్ష చేస్తున్నామన్నారు. పొలంబడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామన్నారు. అపరాల బోర్డు ఏర్పాటు చేయబోతున్నామని.. వాటికి కూడా గిట్టుబాటు ధర కల్పిస్తామని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకానికి నాణ్యమైన గుడ్లు సరఫరా చేయాలని సీఎం ఆదేశించారని.. దానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియలో నేరుగా రైతులే పాల్గొనేందుకు చర్యలు చేపడతామన్నారు. బయో ప్రొడక్ట్స్ పేరుతో మోసాలు జరుగుతున్నాయని రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, దానిపై కూడా చర్యలు చేపట్టేందుకు చర్చిస్తామన్నారు. కౌలు రైతుల విషయంలో రికార్డుల సమస్యలు ఉన్నాయని..వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నామని ఎంవీఎస్ నాగిరెడ్డి వెల్లడించారు. -
కలసిసాగారు... నీరు పారించారు...
కాలువలు శుభ్రంగా ఉంటేనే పంట పొలాలకు సాగునీరందేది. ఏటా వాటి నిర్వహణ కోసం కొంత బడ్జెట్ కేటాయించడం పరిపాటి. ఆ నిధులు వెచ్చిస్తున్నట్టు రికార్డుల్లో కనిపిస్తున్నాయి. కానీ వెంగళరాయ సాగర్ పరిధిలోని 12 ఎల్, 10 ఆర్ కాలువల దుస్థితి మాత్రం అసలు వాస్తవాన్ని బయటపెడుతున్నాయి. కాలువలన్నీ తుప్పలతో పూడుకుపోయాయి. సాగునీరు సక్రమంగా అందక 2500 ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకమైంది. చేసేది లేక నాలుగేళ్లుగా అక్కడి రైతులే వాటిని శ్రమదానంతో శుభ్రపరచుకుని నీరు పారించుకుంటున్నారు. మక్కువ: వెంగళరాయసాగర్ ప్రాజెక్ట్ కాలువల ఆధునికీకరణకు కోట్లాది రూపాయిలు ఖర్చుచేశామని గత పాలకులు గొప్పగా చెప్పుకున్నారు. కానీ శివారు గ్రామాల ప్రజలకు మాత్రం సాగు నీటి కష్టాలు తీరలేదు. గడచిన నాలుగేళ్లు ఈ కాలువలను అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో మక్కువ మండలంలోని వెంక ట భైరిపురం గ్రామానికి చెందిన రైతులు గ్రామంలో కమీషన్ పాట(ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారులు అందించాల్సిన సొమ్ము) ద్వారా కొంతమొత్తం, రైతులు చందాలు ఎత్తుకొని మరికొంత వెచ్చించి, ఏటా ఖరీఫ్ సీజన్లో కాలువల్లో పేరుకుపోయిన పూడికలు తొలగించుకొని పంటలు సాగుచేసుకుంటున్నారు. 9 గ్రామాలకు అందని సాగునీరు... వెంగళరాయసాగర్ ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ పరిధిలోని 12ఎల్ కాలువ మండలంలోని చప్పబుచ్చమ్మపేట, మేళాపువలస, ములక్కాయవలస, పాపయ్యవలస, కాశీపట్నం, వెంకటభైరిపురం, కొయ్యానపేట, కొండరేజేరు గ్రామాల రైతులకు చెందిన సుమారు 2500 ఎకరాలున్నాయి. నాలుగేళ్లనుంచి కాలువల నిర్వహణ చేపట్టకపోవడంతో ఈ కాలువల ద్వారా పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా కావడంలేదు. కాలువల్లో తూటికాడలు, నాచు, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగిపోయి నీరు పారడంలేదు. మండలంలోని కాశీపట్నం గ్రామం సమీపంలోని 10ఆర్ కాలువ వద్ద గతంలో ఏర్పాటుచేసిన మదుము, యూటీ శిథిలావస్థకు చేరుకోవడంతో కాలువ మధ్యలో పెద్దగొయ్యి ఏర్పడి నీరు పంటపొలాల మీదుగా సీతానగరం మండలం తామరఖండి గెడ్డలోకి వృథాగా పోతోంది. దిగువనున్న పాపయ్యవలస, కొయ్యానపేట, కొండరేజేరు, వెంకటభైరిపురం గ్రామాల పరిధిలోని కాలువలకు సాగునీరు అందట్లేదు. అయినా వాటిని చక్కదిద్దేందుకు ఇరిగేషన్ అధికారులు చొరవ చూపలేదు. శ్రమదానంతో కాలువల నిర్వహణ.. అధికారులు కాలువల నిర్వహణ సరిగ్గా చేపట్టకపోవడంతో రైతులు శ్రమదానంతో ఈ నెల 14వ తేదీ నుంచి కొండరేజేరు గ్రామానికి చెందిన రైతులు కన్నంపేట గ్రామం నుంచి కొండరేజేరు వరకు కాలువలో ఉన్న పూడికలను తొలగించుకున్నారు. కొయ్యానపేట గ్రామానికి చెందిన రైతులు 12ఎల్, ఆర్ కాలువలో పేరుకుపోయిన పూడికలను మూడురోజులపాటు తొలగించుకొని పంటపొలాలకు సాగునీరు సమకూర్చుకుంటున్నారు. శనివారం వెంకటభైరిపురం గ్రామానికి చెందిన సుమారు 150మంది పురుషులు, మహిళలు కలసికట్టుగా కాలువల్లో పేరుకుపోయిన పూడికలు, తూటికాడలు తొలగిస్తున్నారు. సుమారు 7కిలోమీటర్ల పొడవునా తుప్పలు తొలగిస్తున్నారు. వెంకటభైరిపురం గ్రామానికి చెందిన రైతులు ఏటా రూ. లక్ష వరకు వెచ్చించి, కాలువలు నిర్వహించుకుంటున్నారు. ఎల్బీసీ పరిధిలోని 12ఎల్ కాలువ మొత్తం పూడికలతో నిండిపోవడంతో సరాయివలస, కొండబుచ్చమ్మపేట గ్రామాలకు చెందిన పంటపొలాలకు సాగునీరు అందకపోవడంతో, చందాలు ఎత్తుకొని పూడికలు తొలగించుకునేందుకు సమాయత్తమవుతున్నారు. అదును దాటిపోతున్నా... జరగని ఉభాలు.. శివారు గ్రామాలైన వెంకటభైరిపురం, కొండరేజేరు, కొయ్యానపేట, సరాయివలస, గోపాలపురం గ్రామాల పంటపొలాలకు కాలువల ద్వారా సాగునీరు అందకపోవడంతో ఖరీఫ్‌సీజన్ సగం పూర్తయినా పంటపొలాలకు సాగునీరు అందకపోవడంతో రైతులు ఉభాలు జరిపించలేకపోతున్నారు. దీనివల్ల నారుమడులు ముదిరిపోతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో సొంతంగా కాలువలు శుభ్రం చేసి నీటిని సమకూర్చుకుంటున్నారు. అధికారులు ఇప్పటికైనా వారి సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాల్సిందే. సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం.. నాలుగేళ్లుగా కాలువల నిర్వహణ చేపట్టకపోవడంతో సాగునీటికోసం అనేక అవస్థలు పడుతున్నాం. ఏటా రైతులు చందాలు ఎత్తుకొని, కాలువల్లో పూడికలు తొలగించుకుంటున్నాం. ఏటా ఖరీ ఫ్ సీజన్ ముగిసిన సమయంలో ఉభాలు జరి పిస్తుండటంతో దిగుబడులు రావడం లేదు. సాగు చేసినప్పటికి వచ్చిన దిగుబడులు పెట్టుబడులకే సరిపోతున్నాయి. ఏటా మేమే కాలు వ శుభ్రపరచుకుంటున్నా... ఇరిగేషన్ అధికా రులు పట్టించుకోవడం లేదు. – రెడ్డి శ్రీరాము, వెంకటభైరిపురం, రైతు సీజన్ పూర్తవుతున్నా ఉభాలు జరగలేదు.. నాకు పదెకరాల పొలం ఉంది. అదంతా కాలువ పరిధిలోనే ఉన్నందున కాలువ ద్వారా నీరురాకపోవడంతో ఇంతవరకు ఉభా లు జరిపించలేకపోయాం. ఖరీఫ్‌సీజన్ ముగుస్తుండటంతో నారుమడులు ముదిరిపోతున్నా యి. ముదిరిన నారు నాటినా ప్రయోజనం ఉండదు. దిగుబడి శాతం తగ్గిపోతుంది. ప్రతి ఏటా ఇదేతంతు జరుగుతుంది. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. – జాగాన తిరుపతినాయుడు, రైతు, వెంకటభైరిపురం -
ఆశలు ఆ‘వరి’ !
ఖరీఫ్ సీజన్లో అప్పుడే రెండున్నర నెలలు గడచిపోయాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. సిద్ధం చేసుకున్న నారుమడులు ఎండిపోతున్నాయి. నీటితడులున్న ప్రాంతాల్లో వరినాట్లు వేసినా... మండుతున్న ఎండలు రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రాజెక్టుల ఎగువప్రాంతాల్లో అరకొరగా కురిసిన వర్షాలవల్ల నీటిమట్టాలు పెరగడం లేదు. మరో నెల రోజుల్లో విస్తారంగా వర్షాలు కురవని పక్షంలో ఇక కరువు పరిస్థితులు తలెత్తకమానవని రైతాంగం ఆందోళన చెందుతోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో కరువు ఛాయలు కనిపిస్తున్నా యి. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారా యి. జిల్లాలో శుక్రవారం 3.1మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జలాశయాల్లో 70 శాతానికి మించి నీటి మట్టం లేదు. దీనివల్ల సాగు అవసరాలకు నీటిని విడుదల చేయలేకపోతున్నారు. ఇప్పటికే నాట్లు వేయడం ఆలస్యమైంది. వాటికి ఆశించిన మేర నీరు అందకపోవడంతో ఎండిపోతున్నాయి. నీరు లేక ఇంకా కొన్నిచోట్ల నాట్లు పడనేలేదు. ఈ వారం దాటిపోతే ఇక నాట్లు వేసినా ప్రయోజనం ఉండదని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. జిల్లాలో వరి పంట సాధారణ విస్తీర్ణం 1,22,977 హెక్టార్లు కాగా ఇంతవరకూ 35,519 హెక్టార్లలో మాత్రమే సాగైంది. ఇందులో 22,875 హెక్టార్లలో వెదజల్లే పద్ధతిని అనుసరించారు. 12,644 హెక్టార్లలో వరి నాట్లు వేశా రు. నాట్లు వేసిన చోట వరి పంట ఎండిపోతోం ది. దత్తిరాజేరు మండలంలో కొన్ని చోట్ల నారు ఎండుతున్నట్టు వ్యవసాయ అధికారుల దృష్టికి కూడా వచ్చింది. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడానికి ఈ నెల 15వ తేదీ వరకు చూడాలని వ్యవసాయశాఖ కమిషనర్ చెప్పినట్టు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఆందోళనకరంగా జలాశయాలు.. జిల్లాలో జలాశయాలున్నప్పటికీ వాటిలో సరిపడా నీరులేదు. పెద్ద గెడ్డ నీటిని నేటికీ విడుదల చేయలేదు. వెంగళరాయ సాగర్ నీటిని విడుదల చేసినా తక్కువ స్థాయిలో ఆరుతడి పంటలకు పనికివచ్చేలా విడుదల చేస్తున్నారు. వీఆర్ఎస్ కాలువలు 23 కిలోమీటర్ల పొడవయితే వారం రోజుల క్రితం విడుదల చేసిన సాగునీరు బొబ్బిలి మండలానికి శుక్రవారమే చేరింది. 12వ కిలోమీటర్ వద్దే సాగునీరు ఇంకా ఉండటంతో వర్షాలు పడకుంటే జలాశయంలో ఉన్న కొద్ది పాటి నీరు కూడా అయిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. కంటితుడుపు వానలు.. జిల్లాలో కురుస్తున్న వర్షాలు కేవలం కంటి తుడుపుగానే ఉన్నాయి. శుక్రవారం నమోదైన వర్షపాతం వివరాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలోని 19 మండలాల్లో చుక్క రాలలేదు. కురిసిన చోట కూడా మెంటాడలో 32.2 మిల్లీమీటర్లు, పాచిపెంటలో 21.4 మిల్లీమీటర్లు, బొండపల్లిలో 18.2 మిల్లీమీటర్లు మినహా మిగిలిని అన్ని మండలాల్లో 1.2 మిల్లీమీటర్లు నుంచి 8.2 మిల్లీమీటర్ల వరకే నమోదైంది. వర్షాల కోసం ఎదురు చూస్తున్నాం.. జిల్లాలో వర్షాలు లేకపోవడం వల్ల రిజర్వాయర్లలోని నీటిని కూడా విడిచిపెట్టే సాహసం చేయలేకపోతున్నాం. పెద్ద గెడ్డ నీటిని నేటికీ విడిచిపెట్టలేకపోయాం. జిల్లాలో ఉన్న మొత్తం రిజర్వాయర్లన్నిటిలో 70 శాతం లోపే నీటి నిల్వలున్నాయి. వర్షాలు పడుతూ తెరిపి ఇ చ్చినప్పుడు వినియోగించే ప్రాజెక్టులే మనవి. పూర్తిగా రిజర్వాయర్ల నీటిని వినియోగించుకునే అవకాశం లేదు. వర్షాలు కురుస్తాయని ఎదురు చూస్తున్నాం. – కె.రాంబాబు, ఎస్ఈ, బొబ్బిలి ఇరిగేషన్ సర్కిల్. -
వ్యవసాయ శాఖ కేంద్రంగా చల్గల్
అనుబంధశాఖల విలీనం కొత్తజిల్లాలో రైతు సేవలన్ని ఒకే చోట? జగిత్యాల అగ్రికల్చర్ : జగిత్యాల జిల్లాలో చల్గల్ వ్యవసాయ క్షేత్రం అత్యంత ప్రాధాన్యం సంతరించుకోనుంది. ఇప్పటికే కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల ఏర్పాటుకు, సిబ్బంది నియామకానికి ప్రయత్నాలు ప్రారంభించిన అధికారులు ఇతర శాఖల కార్యాలయాల ఏర్పాటు కోసం కూడా అన్వేషిస్తున్నారు. ముఖ్యమైన శాఖల అనుబంధ శాఖలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయడంతో శాఖల విలీనం దాదాపు ఖాయమైనట్లే భావిస్తున్నారు. చల్గల్ కేంద్రంగా వ్యవసాయ అనుబంధ శాఖల విలీనం? వ్యవసాయ శాఖతో పాటు ఉద్యానవన, మత్స్య , సూక్ష్మ సేద్య విభాగం, పట్టుపరిశ్రమ, పశుసంవర్ధక శాఖ, అగ్రో ఇండస్ట్రీస్, సీడ్ కార్పొరేషన్, భూసార పరీక్ష కేంద్రాలను ఒకే గొడుగు కిందకు తేవాలని భావిస్తున్నారు. అలా జరిగితే ఇవన్నీ జిల్లాలో ఒకే అధికారి అధీనంలో పనిచేయనున్నాయి. దీంతో రైతులకు మేలు జరుగుతుందని, కార్యాలయాల చుట్టూ తిరిగే కష్టం తప్పుతుందని ప్రభుత్వం భావిస్తోంది. జగిత్యాల జిల్లాలో వ్యవసాయ అనుబంధ శాఖల కేంద్రంగా చల్గల్ వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాన్ని మార్చనున్నారు. దాదాపు వంద ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ క్షేత్రంలో భవనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. జగిత్యాల పట్టణానికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో నిజామాబాద్ దారిలో ఉన్న ఈ క్షేత్రంలోని భవనాలను ఇప్పటికే జిల్లా వ్యవసాయాధికారులు సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త జిల్లాలో వ్యవసాయ అనుబంధ శాఖలను ఒకేచోట చేరిస్తే దాదాపు 100 నుంచి 150 మంది ఉద్యోగులు ఒకేచోట పనిచేసే అవకాశముంది. విశాలమైన భవనాలు ఉండడంతో ఎరువులు, విత్తన పరీక్ష కేంద్రాలు, బయోలాజికల్ ల్యాబ్‌ల ఏర్పాటుకు కూడా అవకాశముంది. వ్యవసాయ క్షేత్రం పక్కనే ఉన్న మార్కెట్ కార్యాలయం, మామిడి మార్కెట్‌తో రైతులకు మరింత మేలు జరుగుతుంది.