aijayya
-
చిత్తశుద్ధి ఉంటే టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలి
మిడుతూరు (కర్నూలు): ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధి ఉంటే టీడీపీ ఎంపీలు రాజీనామాచేసి... వైఎస్సార్సీపీతో కలిసి రావాలని ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. సోమవారం తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం రాష్ట్రబంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా వద్దు ప్రాత్యేక ప్యాకేజీ ముద్దు అని చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు యూ టర్న్ తీసుకున్నారన్నారు. నాలుగు సంవత్సరాల్లో కేంద్రం వేల కోట్ల రూపాయలు ఇచ్చినా ఇప్పటివరకు అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణం కూడా కట్టలేదన్నారు. ప్రజలను మోసగిస్తున్న చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. పోలవరం పూనాది వేసి కుడి, ఎడమ కాలువలను పూర్తిచేసిన ఘనత దివంగతనేత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కే దక్కిందన్నారు. ఆ ప్రాజెక్టును పూర్తిచేయని ఘనత చంద్రబాబు దక్కుతుందని విమర్శించారు. నాలుగేళ్ల నుంచి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి..యువభేరీలు, బంద్‌లు, రాస్తారోకోలు, నిరహారదీక్షలు చేస్తు ప్రత్యేక హోదాను సజీవంగా ఉంచారన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, పట్టణ కౌన్సిలర్ శ్రీనివాసరెడ్డి, మిడుతూరు మండల కన్వీనర్ లోకేశ్వరరెడ్డి, యువజన నాయకుడు ఏసన్న, వైఎస్సార్సీపీ నాయకులు సల్కోటి గోవర్దన్‌రెడ్డి, కాంతారెడ్డి, నాగభూషణ్ రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, వెంకటనాయుడు, రవి, తదితరులు పాల్గొన్నారు. -
నందికొట్కూరులో వీస్తున్న ఫ్యాన్ గాలి
మెరవని ‘రత్నం’ లబ్బీకి అసంతృప్తుల సెగ ప్రచారంలో దూసుకుపోతున్న ఐజయ్య సాక్షి, కర్నూలు: అరుదైన ‘బట్టమేక ’ పక్షికి స్థావరమైన నందికొట్కూరు నియోజకవర్గం 1952లో ఏర్పడింది. పునర్విభజనలో భాగంగా 2009లో ఎస్సీ రిజర్వుడ్‌గా మారింది. ఇక్కడ అంతర్గత కుమ్ములాటలతో తెలుగుదేశం సతమతమవుతోంది. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది. ఉద్యమాలతో ప్రజల్లోకి దూసుకెళ్లిన వైఎస్సార్సీపీ బలంగా కనిపిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై అభిమానం, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకం వైఎస్సార్సీపీ గెలుపునకు దోహదపడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలో(1955) నందికొట్కూరు ద్విసభ్య నియోజకవర్గంగా కొనసాగింది. ఈ సమయంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన అయ్యపురెడ్డి, ఎన్‌కె.లింగం విజయం సాధించారు. అంతకుముందు 1952లో కమ్యూనిస్టు పార్టీ నేత చండ్ర పుల్లారెడ్డి ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. నందికొట్కూరు శాసనసభకు 13 సార్లు ఎన్నికలు జరగ్గా మొత్తం 8 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు ఇక్కడ విజయం సాధించారు. మరో మూడు సార్లు తెలుగుదేశం, రెండు సార్లు ఇండిపెండెంట్లు, ఒకసారి సీపీఐ గెలుపొందింది. 1972లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మద్దూరు సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా గెలుపొందడం విశేషం. నందికొట్కూరు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వై. ఐజయ్య బరిలో ఉన్నారు. ఈయన పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో ఎక్కువగా ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీలున్నారు. దివంగత నేత వైఎస్. రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108, ఇందిరమ్మ గృహాలు, పింఛన్లు వంటి సంక్షేమ పథకాలతో చాలా మంది లబ్ధిపొందారు. వీరంతా వైఎస్సార్సీపీ వైపు ఉన్నారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఎన్నికల మేనిఫేస్టోను నమ్ముతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో వైఎస్సార్సీపీ క్రీయాశీలక పాత్రను ప్రశంసిస్తూ ఆ పార్టీవెంటే తామంతా అంటూ నడుస్తున్నారు. ఐజయ్యకు అండగా నిలుస్తున్నారు. దీంతో ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. -
మాట తప్పినవారికి ఓటుతో బుద్ధి చెప్పండి
ప్రజలకు గౌరు వెంకటరెడ్డి పిలుపు వైఎస్సార్సీపీని ఆదరించాలని విజ్ఞప్తి నందికొట్కూరు, న్యూస్‌లైన్: కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు అన్నదమ్ముల్లా ఉండే తెలుగువారిని నిలువునా విభజించాయని, మాట తప్పి ప్రవ ర్తించిన ఆ పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించి రాష్ట్రంలో రైతు రాజ్యాన్ని తెస్తుందని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి అన్నారు. ఐజయ్య వైఎస్సార్సీపీ నందికొట్కూరు అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమానికి గౌరు వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులనుద్దేశించి ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమం జగనన్నతోనే సాధ్యమవుతుందన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో గౌరు చరితారెడ్డి పాలనలో ఎత్తిపోతల పథకాలు మంజూరయ్యాయని ఆయన గుర్తుచేశారు. ఆ పథకాలను లబ్బి వెంకటస్వామి పూర్తి చేయలేక బురదజల్లే మాట లు మాట్లాడడం హస్యాస్పదంగా ఉందన్నారు. అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసే రకమని లబ్బిని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులతో జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేగా పదవులను అలంకరించిన లబ్బికి సార్వత్రిక ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి బలపరిచిన అభ్యర్థి ఐజయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. వైఎస్సార్ ఆశయ సాధనకు కృషి చేస్తా : ఐజయ్య వైఎస్సార్ ఆశయ సాధనకు కృషి చేస్తానని వైఎస్సార్సీపీ అభ్యర్థి ఐజయ్య అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి పెండింగ్ ప్రాజెక్ట్‌లు, పనులు పూర్తి చేయిస్తామన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఐజయ్యను అఖండ మెజార్టీతో గెలిపించాలని పార్టీ నాయకుడు మాండ్ర శివానందరెడ్డి పిలుపునిచ్చారు. బ్రాహ్మణకొట్కూరు గ్రామానికి చెందిన లబ్బి వెంకటస్వామి ముఖ్య అనుచరుడు మద్దూరు నరహరిరెడ్డి గౌరు వెంకటరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు.కార్యక్రమానికి పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కస్వా శంకర్‌రెడ్డి, శ్రీనాథరెడ్డి, జిల్లా నాయకులు గౌరు మురళీధర్‌రెడ్డి, మాండ్ర ఉమ, నందికొట్కూరు, మిడుతూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా, పాములపాడు, కొత్తపల్లి మండలాల కన్వీనర్లు అబ్దుల్ మునాఫ్, ఓబుల్‌రెడ్డి, పలుచాని మహేశ్వరరెడ్డి, పురుషోత్తంరెడ్డి, కాతా రమేష్‌రెడ్డి, గోవిందగౌడ్, పల్లె శివానందరెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన్ మురళీమోహన్‌రెడ్డి, నాయకులు ఎల్.నరసింహారెడ్డి, శెట్టి వీరన్న, జయసింహారెడ్డి, తిమ్మారెడ్డి, లింగస్వామిగౌడ్, జయరామిరెడ్డి, బుడగజంగాల మధు తదితరులున్నారు. నామినేషన్ వేసిన ఐజయ్య నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఐజయ్య గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన జనసందోహం మధ్య ఆయన ర్యాలీగా తరలివచ్చి తహశీల్దార్ కార్యాలయంలో 11.40గంటలకు తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి జయకుమార్‌కు అందజేశారు. ఆయనతో పాటు పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, నాయకులు మాండ్ర శివానందరెడ్డి తదితరులు ఉన్నారు.