మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఐజయ్య
మిడుతూరు (కర్నూలు): ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధి ఉంటే టీడీపీ ఎంపీలు రాజీనామాచేసి... వైఎస్సార్‌సీపీతో కలిసి రావాలని ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. సోమవారం తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం రాష్ట్రబంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా వద్దు ప్రాత్యేక ప్యాకేజీ ముద్దు అని చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు యూ టర్న్ తీసుకున్నారన్నారు. నాలుగు సంవత్సరాల్లో కేంద్రం వేల కోట్ల రూపాయలు ఇచ్చినా ఇప్పటివరకు అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణం కూడా కట్టలేదన్నారు. ప్రజలను మోసగిస్తున్న చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధిచెబుతారన్నారు.
పోలవరం పూనాది వేసి కుడి, ఎడమ కాలువలను పూర్తిచేసిన ఘనత దివంగతనేత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కే దక్కిందన్నారు. ఆ ప్రాజెక్టును పూర్తిచేయని ఘనత చంద్రబాబు దక్కుతుందని విమర్శించారు. నాలుగేళ్ల నుంచి ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి..యువభేరీలు, బంద్‌లు, రాస్తారోకోలు, నిరహారదీక్షలు చేస్తు ప్రత్యేక హోదాను సజీవంగా ఉంచారన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, పట్టణ కౌన్సిలర్ శ్రీనివాసరెడ్డి, మిడుతూరు మండల కన్వీనర్ లోకేశ్వరరెడ్డి, యువజన నాయకుడు ఏసన్న, వైఎస్సార్‌సీపీ నాయకులు సల్కోటి గోవర్దన్‌రెడ్డి, కాంతారెడ్డి, నాగభూషణ్ రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, వెంకటనాయుడు, రవి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment