Akila Dananjaya
-
ఒకే ఓవర్లో 6,6,6,6,6,6
కూలిడ్జ్: వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్‌మన్ కీరన్ పొలార్డ్ అరుదైన ఘనతలో భాగమయ్యాడు. శ్రీలంకతో జరిగిన తొలి టి20లో ఒకే ఓవర్లోని 6 బంతుల్లో వరుసగా 6 సిక్సర్లు బాది... గిబ్స్ (దక్షిణాఫ్రికా–2007 వన్డే వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్స్‌పై వాన్ డాన్ బంజ్ బౌలింగ్‌లో), యువరాజ్ (భారత్– 2007 టి20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో) తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. పొలార్డ్ దెబ్బకు 36 పరుగులు సమర్పించుకున్న బాధిత బౌలర్ గా స్పిన్నర్ అకిల ధనంజయ నిలిచాడు. పొలార్డ్ సిక్సర్లు కొట్టాడిలా... తొలి బంతి (లెంగ్త్ బాల్): మోకాలిపై కూర్చొ ని స్లాగ్ షాట్. లాంగాన్ మీదుగా సిక్సర్. రెండో బంతి (ఫుల్ బాల్): నేరుగా సైట్ స్క్రీన్ వైపు సిక్సర్. మూడో బంతి (వికెట్‌కు కొంత దూరంగా ఫుల్లర్ బాల్): వైడ్ లాంగాఫ్ దిశగా సిక్సర్. నాలుగో బంతి (లెంగ్త్ బాల్): స్లాగ్ షాట్. డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్. ఐదో బంతి (ఆఫ్ స్టంప్‌పై లెంగ్త్ బాల్): బౌలర్ తల మీదుగా భారీ సిక్సర్. ఆరో బంతి (రౌండ్ ద వికెట్ ప్యాడ్లపైకి): అలవోకగా డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్. ‘హ్యాట్రిక్’ తర్వాత... పొలార్డ్ బాదుడుకు ముందు వేసిన ఓవర్లో ధనంజయ ఒక్కసారిగా హీరోలా కనిపించగా, తర్వాతి ఓవర్‌కే పరిస్థితి తలకిందులైంది. మ్యాచ్‌లో ముందుగా లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు చేసింది. చూస్తే చిన్న లక్ష్యంగానే కనిపించింది కానీ ధనంజయ వరుస బంతుల్లో లూయిస్ (28), గేల్ (0), పూరన్ (0)లను అవుట్ చేసి ‘హ్యాట్రిక్’ నమోదు చేయడంతో మ్యాచ్ లంక వైపు తిరిగింది. అంతర్జాతీయ టి20ల్లో హ్యాట్రిక్ సాధించిన 13వ బౌలర్‌గా అకిల నిలిచాడు. అయితే చివరకు 13.1 ఓవర్లలో 6 వికెట్లకు 134 పరుగులు చేసిన విండీస్ 4 వికెట్లతో మ్యాచ్ గెలిచింది. -
పొలార్డ్.. హ్యాట్రిక్ సంతోషం లేకుండా చేశావ్
ఆంటిగ్వా: వెస్టిండీస్, శ్రీలంక మధ్య గురువారం తొలి టీ20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే లో స్కోరింగ్ మ్యాచ్‌లో రెండు అరుదైన రికార్డులు నమోదయ్యాయి. అయితే పొలార్డ్ రికార్డు ముందు రెండో రికార్డ్ పాపులర్ అవలేదు. అసలు విషయంలోకి వెళితే.. విండీస్ ఇన్నింగ్స్ సమయంలో శ్రీలంక స్పిన్నర్ అఖిల ధనుంజయ హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. ఇన్నింగ్స్ 3వ ఓవర్ వేసిన ధనుంజయ మూడు వరుస బంతుల్లో ఓపెనర్ ఎవిన్ లూయిస్(28 పరుగులు), క్రిస్ గేల్( 0 పరుగులు), నికోలస్ పూరన్(0 పరుగులు)లను ఔట్ చేసి ఈ ఫీట్ సాధించాడు. తద్వారా లంక తరపున హ్యాట్రిక్ సాధించిన మూడో బౌలర్‌గా ..ఓవరాల్‌గా 13వ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇంతకముందు లంక నుంచి లసిత్ మలింగ రెండుసార్లు(2017,2019), తిసారా పెరీరా( 2016) హ్యాట్రిక్‌ను నమోదు చేశారు. అయితే హ్యాట్రిక్ తీసిన ఆనందం ధనుంజయకు ఎంతోసేపు నిలవలేదు. విండీస్ విధ్వంసం కీరన్ పొలార్డ్ ధనుంజయ బౌలింగ్‌లోనే ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన మూడో క్రికెటర్‌గా.. అదే విధంగా టీ20ల్లో ఈ రికార్డు నమోదు చేసిన రెండో ఆటగాడిగా పొలార్డ్ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన విండీస్ పొలార్డ విధ్వంసంతో 13.1 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. తద్వారా మూడు టీ20ల సిరీస్‌లో విండీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మార్చి 5న ఆంటిగ్వా వేదికలోనే జరగనుంది. చదవండి: రెచ్చిపోయిన పొలార్డ్.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు -
ధనంజయపై నిషేధం
దుబాయ్: శ్రీలంక ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ అకిల ధనంజయపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఏడాది నిషేధం విధించింది. అనుమానాస్పద బౌలింగ్ శైలే దీనికి కారణమని పేర్కొంది. స్వతంత్ర విచారణ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది. గత నెలలో న్యూజిలాండ్‌తో తొలి టెస్టు అనంతరం సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆగస్టు 29న చెన్నైలో విచారణకు హాజరయ్యాడు. అందులోనూ సందేహాస్పదంగా తేలడంతో నిషేధం తప్పలేదు. గతేడాది నవంబర్లోనే ధనంజయ సస్పెన్షన్‌ను ఎదుర్కొన్నాడు. లోపాలను దిద్దుకోవడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో దానిని ఎత్తివేశారు. రెండేళ్ల వ్యవధిలో యాక్షన్‌పై రెండుసార్లు సందేహాలు రావడంతో నిషేధం తప్పనిసరైంది. ఈ గడువు తర్వాత తన బౌలింగ్ శైలి పరిశీలనపై ధనంజయ ఐసీసీని ఆశ్రయించవచ్చు. -
ధనంజయ మాయాజాలం
కొలంబో: దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదో వన్డేలో శ్రీలంక 178 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. ఆతిథ్య స్పిన్నర్ అఖిల ధనంజయ (6/29) సఫారీని తిప్పేశాడు. ఆదివారం జరిగిన ఆఖరి పోరులో మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగుల భారీస్కోరు చేసింది. కెప్టెన్ మాథ్యూస్ (97 బంతుల్లో 97 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. సెంచరీకి మూడు పరుగుల దూరంలో అజేయంగా నిలిచాడు. మిగతా వారిలో ఓపెనర్ డిక్వెలా (65 బంతుల్లో 43; 5 ఫోర్లు), మెండిస్ (38), డిసిల్వా (30) మెరుగ్గా ఆడారు. సఫారీ బౌలర్లలో మల్డర్, ఫెలుక్వాయో చెరో 2 వికెట్లు పడగొట్టారు. రబడ, డాలా, కేశవ్ మహరాజ్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా ధనంజయ ఆఫ్‌స్పిన్ సుడిలో చిక్కుకుంది. సగం ఓవర్లయినా పూర్తిగా ఆడలేకపోయింది. 24.4 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ డికాక్ (57 బంతుల్లో 54; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయారు. లహిరు కుమారకు 2 వికెట్లు దక్కాయి. ధనంజయ తన కెరీర్లో రెండోసారి ఒకే మ్యాచ్‌లో ఆరు వికెట్లను చేజిక్కించుకున్నాడు. అజంత మెండిస్ (శ్రీలంక), షాహిద్ ఆఫ్రిది (పాకిస్తాన్), రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్) తర్వాత వన్డే క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. మరోవైపు దక్షిణాఫ్రికా మూడో భారీ పరాభవాన్ని చవిచూసింది. అయితే ఐదు వన్డేల సిరీస్‌ను ఇదివరకే నెగ్గిన దక్షిణాఫ్రికా సిరీస్‌ను 3–2తో ముగించింది. -
ఓటమి దిశగా దక్షిణాఫ్రికా
కొలంబో: శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో దక్షిణాఫ్రికా ఆటతీరులో ఎలాంటి మార్పులేదు. లంక స్పిన్నర్ల ధాటికి తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైన సఫారీ జట్టు రెండో టెస్టులోనూ ఓటమి దిశగా పయనిస్తోంది. 490 పరుగుల భారీ విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆ జట్టు ఆదివారం ఆట ముగిసే సమయానికి 41 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. డి బ్రుయెన్ (97 బంతుల్లో 45 బ్యాటింగ్; 7 ఫోర్లు), ఎల్గర్ (37) ఫర్వాలేదనిపించారు. మార్క్రమ్ (14), ఆమ్లా (6), డు ప్లెసిస్ (7) విఫలమయ్యారు. లంక బౌలర్లలో అఖిల ధనంజయ, హెరాత్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు చేతిలో ఉన్న సఫారీ జట్టు విజయానికి ఇంకా 351 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 151/3తో మూడో రోజు ఆట కొనసాగించిన శ్రీలంక 81 ఓవర్లలో 275/5 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. మ్యాథ్యూస్ (71; 7 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. మరోవైపు ఇటీవల తరచుగా జట్టు క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు బ్యాట్స్‌మన్ ధనుష్క గుణ తిలకపై లంక క్రికెట్‌బోర్డు మూడు ఫార్మాట్లలో కూడా పాల్గొనకుండా నిషేధం విధించింది. -
హనీమూన్ మానుకుని.. హీరో అయ్యాడు!
ప్రస్తుతం శ్రీలంకతో పాటు భారత క్రికెట్ అభిమానులు చర్చించుకుంటోన్న లంక యువ సంచలనం అఖిల ధనంజయ. సరిగ్గా 24 ఏళ్లు కూడా లేని స్పిన్నర్ గురువారం జరిగిన రెండో వన్డేలో భారత స్టార్ ఆటగాళ్లకు ముచ్చెమటలు పట్టించాడు. అయితే మరో విషయంలోనూ అతడిని లంక క్రికెటర్లు, ప్రజలు గుర్తుంచుకుంటారనడంలో సందేహమే లేదు. హనీమూన్ కు వెళ్లాల్సిన స్పిన్నర్ పెళ్లి జరిగిన రోజు రాత్రే లంక జట్టుతో కలిశాడు. అదేనండీ.. రెండో వన్డేకు ముందురోజు (బుధవారం) తన సొంతూరు మోరత్వాలో చిన్ననాటి స్నేహితురాలు నెతాలి టెక్షిణిని వివాహం చేసుకున్నాడు. అందరిలాగే తాను మరుసటి రోజు తన భార్యతో కలిసి హనీమూన్‌కు వెళ్లాలి, కానీ లంక టీమ్ మేనేజ్మెంట్ నుంచి పిలుపు రావడంతో రాత్రికి రాత్రే క్యాండీలోని హోటల్లో బసచేస్తున్న లంక జట్టుతో చేరాడు. జట్టు కోసం వ్యక్తిగత విషయాన్ని పక్కనపెట్టిన ధనుంజయ పటిష్టస్థితిలో ఉన్న సమయంలో టీమిండియాను దారుణంగా దెబ్బతీశాడు. 108/0 తో ఉన్న భారత్ ధనుంజయ బౌలింగ్ దాడితో 22 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయింది. కెరీర్ ల్ నాల్గో వన్డే ఆడుతున్నా వరుస విరామాల్లో వికెట్లు తీసి (6/54) టీమిండియాకు పెద్ద పరీక్ష పెట్టాడు. అయితే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రాణించడంతో పాటు కెరీర్ లో తొలి వన్డే హాఫ్ సెంచరీతో భువనేశ్వర్ కదం తొక్కడంతో భారత్ విజయం సాధించినా.. సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న ధనంజయనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. నెతాలి వెరీ వెరీ హ్యాపీ.. తన భర్త ఆటను ఆస్వాదించేందుకు భార్య నెతాలి పల్లెకెలె గ్యాలరీలో ప్రత్యక్షమైంది. భర్త ఆటను ప్రత్యక్షంగా చూసి ఎంజాయ్ చేసింది నెతాలి. పటిష్ట భారత జట్టు బ్యాట్స్ మెన్లపై బౌలింగ్ దాడిలో ధనంజయ విజయం సాధించడాన్ని వీక్షించింది. లంక ఓటమి ఆమెను నిరాశ పరిచినా.. తన భర్త వన్ మ్యాన్ షో చేయడం కొత్త పెళ్లికూతురు జీవితంలో మరపురాని ఘటనగా నిలిచిపోతుంది.