Ambani brothers
-
India Wedding Industry: పెళ్లి.. యమా కాస్ట్లీ!
అంబానీల పెళ్లిసందడి దేశంతో పాటు ప్రపంచమంతటి దృష్టినీ తెగ ఆకర్షిస్తోంది. అంగరంగ వైభవంగా జరుగుతున్న పెళ్లి వేడుకలు, అందుకు జరుగుతున్న ఖర్చు అందరినీ అబ్బురపరుస్తున్నాయి. ఈ సంరంభానికి అంబానీలు దాదాపు రూ.5,000 కోట్ల దాకా వెచ్చిస్తున్నారన్న వార్తలతో అంతా ముక్కు మీద వేలేసుకుంటున్నారు. అయితే పెళ్లి ఖర్చు విషయంలో భారతీయులెవరూ తక్కువ తినలేదు. మన దేశంలో పెళ్లంటే మూడు ముళ్లు, ఏడడుగులు మాత్రమే కాదు. బోలెడంత ఖర్చు కూడా. ప్రపంచంలో మరే ఇతర దేశంతో పోల్చినా భారత్‌లో పెళ్లి బాగా ఖరీదైన వ్యవహారం. పిల్లల మొత్తం చదువు ఖర్చుతో పోలిస్తే పెళ్లికి హీనపక్షం నాలుగు రెట్లు ఎక్కువ వెచ్చించాల్సిన పరిస్థితి. సగటు కుటుంబంలో పెళ్లి ఖర్చు వార్షికాదాయం కంటే కనీసం మూడు రెట్లు ఎక్కువగా ఉంటోంది. అందులో ఎక్కువ మొత్తం నగానట్రాకే అవుతుండటం మరో విశేషం. పెళ్లి దెబ్బకు చాలా కుటుంబాలు ఆర్థికంగా తలకిందులవుతున్న ఉదంతాలెన్నో. అయినా సరే, పెళ్లి ఖర్చు విషయంలో మాత్రం మనోళ్లు తగ్గేదే లేదంటున్నారు...! భారత రిటైల్ మార్కెట్ పరిమాణం 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.94.3 లక్ష కోట్లకు చేరింది. అంటే 1.1 ట్రిలియన్ డాలర్లన్నమాట! ఇందులో రూ.56.9 లక్షల కోట్లతో ఫుడ్ అండ్ గ్రోసరీస్ విభాగం తొలి స్థానంలో ఉంటే రెండో స్థానం పెళ్లిళ్లదే కావడం విశేషం. భారత వెడ్డింగ్ మార్కెట్ విలువ ఎంతో తెలుసా? అక్షరాలా 10.9 లక్షల కోట్ల రూపాయలు! ఇందులో దాదాపు మూడో వంతు వాటా, అంటే రూ.3.1 లక్షల కోట్లు ఆభరణాల ఖర్చుదే కావడం విశేషం! తర్వాత విందు భోజనాలపై రూ.2.1 లక్షల కోట్లు వెచి్చస్తున్నారు. సంగీత్, హల్దీ వంటి పెళ్లి వేడుకలకు రూ.1.6 లక్షల కోట్లు ఖర్చవుతోంది. ఇక పెళ్లి ఫొటోగ్రఫీ వాటా 0.9 లక్షల కోట్లు. పెళ్లికూతురు, పెళ్లి కొడుకు దుస్తులకు, పెళ్లి డెకరేషన్‌కు చెరో రూ.0.8 లక్షల కోట్ల చొప్పున ఖర్చవుతోంది. మద్యం, కానుకలు, ఇతర పెళ్లి ఖర్చులు కలిపి రూ.1.9 లక్షల కోట్ల దాకా అవుతున్నాయి.చదువును మించి... భారత్‌లో చదువుకు, పెళ్లికి అయ్యే ఖర్చుల మధ్య ఆశ్చర్యకరమైన తేడా కనిపిస్తోంది. సాదాసీదా కుటుంబం ఒక్క సంతానం చదువుకు కేజీ నుంచి పీజీ దాకా పెట్టే మొత్తం ఖర్చు సగటున రూ.3.3 లక్షలు. కాగా అదే కుటుంబం ఒక్క పెళ్లిపై వెచ్చిస్తున్నదేమో ఏకంగా రూ.12.5 లక్షలు! ఇంట్లో ఇద్దరు పిల్లలున్నారనుకున్నా వారి చదువు ఖర్చుకు రెట్టింపు మొత్తం ఒక్క పెళ్లిపై పెట్టాల్సి వస్తోంది. భారతీయుల తలసరి జీడీపీ (రూ.2.4 లక్షల)తో పోలిస్తే పెళ్లి ఖర్చు ఏకంగా ఐదు రెట్లు ఎక్కువగా ఉంటోంది. అమెరికా, బ్రిటన్, కెనడా వంటి ఏ సంపన్న దేశంలో చూసినా పెళ్లి ఖర్చు పౌరుల తలసరి జీడీపీతో పోలిస్తే సగం కంటే తక్కువ (0.4 రెట్లు)గానే ఉంది. మరో విషయం. మన దగ్గర ఒక కుటుంబం పెళ్లి కోసం తమ సగటు వార్షికాదాయానికి కనీసం మూడు రెట్లు వెచి్చస్తోంది!మన దేశంలో పెళ్లి ఖర్చు కుటుంబం ఖర్చు పేద రూ.3 లక్షలు దిగువ మధ్య తరగతి రూ.6 లక్షలు మధ్య తరగతి రూ.10–25 లక్షలు ఓ మాదిరి సంపన్నులు రూ.50 లక్షలు సంపన్నులు రూ.కోటి, ఆ పైన – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంబానీ సోదరి రూ.68 వేల కోట్ల కంపెనీకి అధిపతి.. ఈమె గురించి తెలుసా?
అంబానీ కుటుంబం గురించి అందరికీ తెలుసు. దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం కలిగిన కుటుంబం వారిది. దివంగత ధీరూభాయ్ అంబానీ స్థాపించిన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన కుమారులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు మరింత విస్తరించారు. వివిధ వ్యాపారాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ ప్రసిద్ధి చెందారు. అయితే వారి సోదరీమణుల గురించి ఎక్కువ మందికి తెలియదు. ధీరూభాయ్ అంబానీకి ముఖేష్, అనిల్‌లతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరి పేర్లు నీనా కొఠారి, దీప్తి సల్గావ్కర్. వీరిలో నీనా కొఠారి రూ.68 వేల కోట్ల విలువైన కొఠారి షుగర్స్ అండ్ కెమికల్స్ కంపెనీకి అధిపతి. 2003లో ఆమె జావగ్రీన్ అనే కాఫీ, ఫుడ్ చైన్‌ని స్థాపించారు. నీనా కొఠారి 1986లో వ్యాపారవేత్త భద్రశ్యామ్ కొఠారిని వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు అర్జున్ కొఠారి, కుమార్తె నయనతార కొఠారి ఉన్నారు. అనారోగ్య కారణాలతో శ్యామ్ కొఠారి 2015లో మరణించారు. ఆ తర్వాత నీనా కొఠారి వారి కుటుంబ వ్యాపారమైన కొఠారి షుగర్స్ అండ్ కెమికల్స్ బాధ్యతలను తీసుకున్నారు. 2015లో ఆమె కంపెనీ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. కార్పొరేట్ షేర్‌హోల్డింగ్స్ ప్రకారం.. నీనా భద్రశ్యామ్ కొఠారి పబ్లిక్‌గా రెండు స్టాక్లను కలిగి ఉన్నారు. వాటి నికర విలువ రూ. 52.4 కోట్లకు పైగానే. -
అంబానీ బ్రదర్స్‌కు రూ. 25 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: రెండు దశాబ్దాలకు పూర్వం జరిగిన ఒక కేసులో ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీతోపాటు మరికొంతమందికి కలిపి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ. 25 కోట్ల జరిమానా విధించింది. 2000వ సంవత్సరంలో 5 శాతానికిపైగా వాటా కొనుగోలుకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమోటర్లు, పీఏసీ.. వివరాలు అందించడంలో విఫలమైనట్లు సెబీ తాజాగా పేర్కొంది. దీంతో టేకోవర్ నిబంధనల ఉల్లంఘన కేసులో అంబానీ బ్రదర్స్‌తోపాటు.. ముకేశ్ భార్య నీతా అంబానీ, అనిల్ భార్య టీనా అంబానీ, మరికొన్ని సంస్థలపై జరిమానా విధించింది. వారంట్లతో కూడిన రీడీమబుల్ డిబెంచర్ల ద్వారా ఆర్ఐఎల్ ప్రమోటర్లు, పీఏసీ.. 6.83 శాతం ఈక్విటీకి సమానమైన షేర్లను సొంతం చేసుకున్నాయి. 5 శాతం వాటాకు మించిన ఈ లావాదేవీని టేకోవర్ నిబంధనల ప్రకారం 2000 జనవరి 7న కంపెనీ పబ్లిక్‌గా ప్రకటించవలసి ఉన్నట్లు సెబీ పేర్కొంది. అయితే ప్రమోటర్లు, పీఏసీ ఎలాంటి ప్రకటననూ విడుదల చేయలేదని తెలియజేసింది. వెరసి టేకోవర్ నిబంధనలను ఉల్లంఘించారని సెబీ ఆరోపించింది. కాగా.. పెనాల్టీని సంయుక్తంగా లేదా విడిగా చెల్లించవచ్చని సెబీ తెలియజేసింది. తండ్రి ధీరూభాయ్ అంబానీ నిర్మించిన వ్యాపార సామ్రాజ్యాన్ని విభజించుకోవడం ద్వారా 2005లో ముకేశ్, అనిల్ విడివడిన సంగతి తెలిసిందే. -
వినోద రంగంలో అంబానీ బ్రదర్స్ హవా
న్యూయార్క్: అంతర్జాతీయంగా వినోద రంగాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న ప్రముఖుల్లో భారత్ నుంచి 12 మంది చోటు దక్కించుకున్నారు. ఇందులో అంబానీ సోదరులతో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్స్ సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రా తదితరులు ఉన్నారు. దాదాపు 2 లక్షల కోట్ల డాలర్ల వినోద రంగాన్ని ప్రభావితం చేస్తున్న 500 మంది ప్రముఖులతో వెరైటీ మ్యాగజైన్ ఈ జాబితా రూపొందించింది. దర్శకుడు కరణ్ జోహార్, స్టార్ ఇండియా సీఈవో ఉదయ్ శంకర్, ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర, యశ్‌రాజ్ ఫిలిమ్స్ చైర్మన్ ఆదిత్య చోప్రా, బాలాజీ టెలీఫిలిమ్స్ జేఎండీ ఏక్తా కపూర్, జీ ఎంటర్టైన్మెంట్ సీఈవో పునీత్ గోయెంకా, ది ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సిద్ధార్థ్ కపూర్ ఈ లిస్టులో ఉన్నారు. వాల్ట్‌డిస్నీ కంపెనీ చైర్మన్ రాబర్ట్ ఐగర్ ఇందులో అగ్రస్థానం దక్కించుకున్నారు. రిలయన్స్ జియో ద్వారా డిజిటల్ విభాగంలో ముకేశ్ అంబానీ 30 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నా రని వెరైటీ పేర్కొంది. అనిల్ అంబానీకి చెందిన అడాగ్ గ్రూప్ క్రమంగా మీడియా నుంచి తప్పుకుంటుండగా.. ముకేశ్ మాత్రం మరింత భారీగా కార్యకలాపాలు విస్తరిస్తున్నారని వివరించింది. -
వీవీఐపీల ఫోన్ ట్యాపింగ్ సంచలనం
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తల దగ్గర్నుంచి, న్యాయవాదుల వరకు ఫోన్ల ట్యాపింగ్ జరిగిందనే వార్త ఇపుడు సంచలనం మారింది. ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థ 2001-06 మధ్య కాలంలో ఈ ట్యాపింగ్ కు పాల్పడిందని ఓ సుప్రీంకోర్టు న్యాయవాది వాదిస్తున్నారు. ఈ మేరకు ఆయన పిల్ కూడా దాఖలు చేశారు. క్యాబినెట్ మంత్రులు, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ లాంటి కార్పొరేట్ వేత్తలు, ప్రముఖ న్యాయవాదుల ఫోన్ల ను ఎస్సార్ సంస్థ ట్యాప్ చేసిందని ఆరోపిస్తున్నారు. ఈ నెల 1న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఢిల్లీకి చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది సురేన్ ఉప్పల్ దీనిపై 29 పేజీల పిర్యాదు చేశారని కథనాలు తెలుపుతున్నాయి. ఈ ఫిర్యాదు మేరకు ఎస్సార్ మాజీ ఉద్యోగి అల్ బాసిత్ ఖాన్ ఈ ట్యాపింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎస్సార్ సంస్థలో భద్రతా అధిపతిగా చేసే కాలంలో ఖాన్ ప్రముఖుల ఫోన్లకు అంతరాయం కలిగిస్తూ వారి సంభాషణలను రికార్డు చేసేవాడని, మేనేజ్ మెంట్ ఆదేశాల మేరకు అతను ఈ చర్యలకు పాల్పడినట్టు న్యాయవాది పేర్కొన్నారు. కొన్నేళ్లపాటు యథేచ్చగా సాగిన ఈ వ్యవహారం, 2011 మేలో తేడా వచ్చి, ఖాన్ ను సంస్థ నుంచి బయటికి పంపేశారని ఫిర్యాదులో చెప్పారు. ఈ పరిమాణానికి షాకైన ఖాన్ తన దగ్గరున్న టేపులను బయటపెట్టాలనుకున్నాడని, తనను కలిసేందుకు కూడా ప్రయత్నించాడని న్యాయవాది పేర్కొన్నారు. అయితే దీనిపై స్పందించడానికి ప్రస్తుతం ఖాన్ అందుబాటులో లేనట్టు తెలుస్తోంది. ఫోన్లకు, మెసేజ్ లకు అతను అందుబాటులో లేడని ఇండియన్ ఎక్స్ ప్రెస్ రిపోర్టు చేసింది. ఈ విషయాలపై మరిన్ని నిజనిజాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ ఫోన్ల ట్యాపింగ్ ను ఎస్సార్ సంస్థ ఖండిస్తోంది. న్యాయవాది స్టేట్ మెంట్ పూర్తిగా తప్పుడు సమాచారమని, అసలు దీనికి ఆధారాలే లేవని ఎస్సార్ సంస్థ పేర్కొంది. అతని డిమాండ్లను సంస్థ నెరవేర్చకపోవడం వల్లే, ఇలా నిందలు వేస్తున్నారని మండిపడింది. అసలు ఎస్సార్ సంస్థ ఎవరి పోన్లపై ఎప్పుడు నిఘా ఉంచలేదని, దీనికోసం అసలు వ్యక్తులనే నియమించలేదని తెలిపింది. ప్రస్తుత రైల్వే మంత్రి సురేశ్ ప్రభు, మాజీ మంత్రి ప్రఫూల్ పటేల్, రామ్ నాయక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ, ఏడీఏజీ చైర్మన్ అనిల్ అంబానీ, అతని భార్య టీనా అంబానీ, కంపెనీల్లోని వివిధ ప్రముఖ అధికారులు, మాజీ కేబినెట్ మంత్రి ప్రమోద్ మహాజన్, ఎంపీ అమర్ సింగ్ ల ఫోన్లు ట్యాపింగ్ గురయ్యాని తెలుస్తోంది. ఈ లిస్టులో ఇంకా చాలామందే ప్రముఖులున్నట్టు సమాచారం.ఈ ట్యాపింగ్ వ్యవహరంపై రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి. దీనిపై కేంద్రం వెంటనే విచారణ చేపట్టాలని, వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇది ఓ దిగ్భ్రాంతికరమైన వ్యవహారమని, ప్రైవేట్ సర్వీసు ప్రొవేడర్లు చేసే ఈ చర్యలు దేశ రక్షణకు, భద్రతకు హానికరమని జేడీయూ అగ్రనేత శరద్ యాదవ్ అన్నారు. -
మిత్సుయీ సంస్థలతో అంబానీల ఒప్పందాలు
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ దిగ్గజాలైన అంబానీ బ్రదర్స్ జపాన్‌కు చెందిన రెండు సంస్థలతో విడిగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కొన్ని గంటల తేడాలో కుదిరిన ఈ రెండు ఒప్పందాలూ మిత్సుయీ పేరుతో ఉన్న రెండు జపనీస్ కంపెనీలు కావడం విశేషం. అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ క్యాపిటల్ జపాన్‌లోని అతిపెద్ద ఫైనాన్షియల్ సంస్థ సుమితోమో మిత్సుయీ ట్రస్ట్ బ్యాంక్(ఎస్‌ఎంటీబీ)తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎస్ఎం టీబీని వ్యూహాత్మక భాగస్వామిగా చేసుకోవడంద్వారా బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించే ప్రతిపాదనలతోపాటు ఇతర బిజినెస్‌లకు ఊపు తీసుకురానుంది. ఇక మరోవైపు ముకేశ్ అంబానీ గ్రూప్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) జపాన్‌లోని అతిపెద్ద షిప్పింగ్ కంపెనీ మిత్సుయీ ఓఎస్‌కే లైన్స్(ఎంవోఎల్)తో దీర్ఘకాలిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తద్వారా ఉత్తర అమెరికా నుంచి ద్రవరూప(లిక్విఫైడ్) ఇథేన్‌ను దేశానికి రవాణా చేసుకోనుంది. రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలను పటిష్టపరచుకునే బాటలో సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో రెండు దేశాల సంస్థలూ ఒప్పందాలు కుదుర్చుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రిలయన్స్ పేరుతో ఉన్న అంబానీ బ్రదర్స్‌కు చెందిన సంస్థలను పోలి ఎస్‌ఎంటీబీ, ఎంవోఎల్ రెండూ మిత్సుయీ పేరు కలిగి ఉన్నప్పటికీ ప్రత్యేక సంస్థలు కావడం గమనార్హం. రూ. 371 కోట్ల ఇన్వెస్ట్మెంట్: రిలయన్స్ క్యాపిటల్‌లో తొలి దశకింద ఎస్‌ఎంటీబీ 2.77% వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు షేరుకి రూ. 530 ధరలో రూ. 371 కోట్లను ఇన్వెస్ట్ చేస్తుంది. ఆర్బీఐ నిబంధనలు అనుమితిస్తే ఎస్‌ఎంటీబీ సహకారంతో కొత్తగా బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని రిల యన్స్ క్యాపిటల్ భావిస్తోంది. కాగా, ఇథేన్ రవాణాకు ఎంవోఎల్‌తో కుదుర్చుకున్న డీల్ ఆర్థిక వివరాలను ఆర్ఐఎల్ వెల్లడించలేదు.