Amrit Singh
-
పంజాబ్ వదిలి పారిపోయిన అమృత్‌పాల్ సింగ్?
ఖలిస్థాన్ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ అధినేత అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకునేందుకు గత నాలుగు రోజులుగా భారీ స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నా. నేటీకి అతని ఆచూకీ లభించడం లేదు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో పంజాబ్ వ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతోంది. తాజాగా అమృత్‌పాల్ సింగ్ పంజాబ్ సరిహద్దులు దాటి పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సోమవారం ఓ పాడుబడ్డ కారులో అతని దుస్తులు లభించడంతో పోలీసులు ఈ విధంగా భావిస్తున్నారు. అమృత్‌పాల్ సింగ్ మెర్సిడెస్ నుంచి దిగి బ్రెజా కారులో షాకోట్‌కు పారిపోయాడని పోలీసులు తెలిపారు. అనతరం ఖలీస్తానీ వేర్పాటువాదీ తన బట్టలు మార్చుకొని తన మద్దతుదారులకు చెందిన బైక్‌పై పంజాబ్ వదిలి వెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ మేరకు అమృతపాల్ సింగ్ దుస్తులు, బ్రెజ్జా కారు, మరికొన్ని కొన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా ఖలిస్తానీ వేర్పాటువాదులు పారిపోవడానికి సహకరించిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు వందమందికి పైగా అతని సహచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి ‘ఆనంద్‌పూర్ ఖల్సా ఫోర్స్’ (ఏకెఎఫ్) కోసం ఉపయోగిస్తున్న అక్రమ ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. చదవండి: కోర్టులో పారదర్శకత ముఖ్యం.. ఏమిటీ సీల్డ్ కవర్ సంస్కృతి?: సుప్రీం కోర్టు అలాగే అమృత్‌పాల్ మామ హర్జీత్ సింగ్, డ్రైవర్ హర్‌ప్రీత్ సింగ్ జలంధర్‌లో పోలీసులకు లొంగిపోయారు. వీరి కారును పోలీసులు సీజ్ చేశారు. ఈ ఖలిస్తాన్ అనుకూల ఉద్యమం వెనుక పాకిస్తానీ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ప్రమేయం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. మరోవైపు పంజాబ్‌లో శనివారం నుంచి మూతపడిన ఇంటర్నెట్ సేవలు నేడు(మంగళవారం)పాక్షింగా పునరుద్ధరించనున్నారు. కాగా సిక్కులకు ప్రత్యేక దేశం కావాలన్న ఖలిస్తానీ జెండాను భుజానికెత్తుకున్న యువనేత అమృత్‌పాల్, కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన అత్యంత సన్నిహతుడిని విడిపించుకునేందుకు తన మద్దతుతారులతో కలిసి అమృత్‌సర్‌లో పోలీస్‌స్టేషన్‌పై ఫిబ్రవరి 23న దాడి చేసినప్పటి నుంచి ఈ పరిణామం తీవ్రరూపం దాల్చింది. డీ–ఎడిక్షన్ కేంద్రాలనూ, అలాగే ఓ గురుద్వారానూ అమృత్‌పాల్ తన అడ్డాగా చేసుకొని కత్తులు, తుపాకీలు, తూటాలు... పోగేసి, ఆత్మాహుతి దాడులకు యువతరాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఖలిస్తాన్ 2.0 -
ఖలిస్తాన్ 2.0
శనివారం నుంచి మూడు రోజులుగా నిరంతర గాలింపు. అయినా దొరకలేదు. ఇప్పటికి వందమందికిపైగా అతని సహచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం పొద్దుగూకాక కూడా నిందితుడు పోలీసుల గస్తీ కళ్ళ నుంచి తప్పించుకొని, తిరుగుతూనే ఉన్నాడు. ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ అధినేత అమృత్‌పాల్ సింగ్ పరారీ, అందుకు దారి తీసిన పరిస్థితులు చూస్తే, నలభై ఏళ్ళ నాటి తీవ్రవాద సంక్షుభిత పంజాబ్ పరిస్థితులు పునరావృతమవుతున్నాయన్న ఆందో ళన కలుగుతోంది. సిక్కులకు సార్వభౌమాధికార దేశం కావాలన్న ఖలిస్తానీ జెండాను భుజానికెత్తుకున్న యువనేత అమృత్‌పాల్ ముఠా బలప్రదర్శన చేసి,అమృత్‌సర్‌లో పోలీస్‌స్టేషన్‌పై ఫిబ్రవరి 23న దాడి చేసి నెలవుతున్నా, నిన్నటి దాకా కళ్ళు తెరవని ‘ఆప్’ సర్కార్ వైఫల్యం వెక్కిరిస్తోంది. గాలివార్తలు సుడిగాలిలా వైరల్ అవుతున్న వేళ శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇంటర్నెట్ సేవల్ని మంగళవారం మధ్యాహ్నం దాకా పాలకులు నిలిపివేయాల్సి వచ్చిందంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. రూపం మార్చుకున్న సరికొత్త ఖలిస్తాన్ 2.0 విజృంభిస్తోందా? 1980–90ల్లోలా పంజాబ్ మళ్ళీ అగ్నిగుండం కానుందా? హత్యానేరం, పోలీసులపై దాడి సహా కనీసం 7 క్రిమినల్ నేరారోపణలున్న అమృత్‌పాల్ ఇప్పుడు పంజాబ్‌లో మళ్ళీ పుంజుకుంటున్న వేర్పాటువాదానికి కేంద్రబిందువయ్యాడు. మాదక ద్రవ్యాల అలవాటును మాన్పించడానికి పనిచేసే డీ–ఎడిక్షన్ కేంద్రాలనూ, అలాగే ఓ గురుద్వారానూ అమృత్‌పాల్ తన అడ్డాగా చేసుకున్నాడట. ఆ స్థావరాల్లో కత్తులు, తుపాకీలు, తూటాలు... పోగేసి, ఆత్మాహుతి దాడులకు యువతరాన్ని సిద్ధం చేస్తున్నాడని గూఢచారి వర్గాల సమాచారం. ఆయుధాలు – బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు దొరకడం, సాయుధ పోరాటం ఇష్టం లేదంటూనే ‘ఆనంద్‌పూర్ ఖల్సా ఫోర్స్’ (ఏకెఎఫ్) పేరును ప్రాచుర్యంలో పెట్టడం లాంటి అమృత్‌పాల్ సమాచారంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. బంధువుల సాయంతో 20 ఏళ్ళ వయసులో దుబాయ్ వెళ్ళి, భారీ వాహనాల డ్రైవర్‌గా పని చేసి, నిరుడు భారత్‌కు తిరిగొచ్చిన ఓ యువకుడు అనూహ్యంగా ఈ స్థాయికి చేరడం చిత్రమే. నిన్నటి దాకా ఆధునిక వేషభాషల్లో ఉన్న 30 ఏళ్ళ అమృత్‌పాల్ ఇవాళ సాంప్రదాయిక సిక్కు వస్త్రధారణలో, చేతిలో కృపాణంతో, ఖలిస్తానీ ఉద్యమానికి వేగుచుక్క కావడం సహజ పరిణామం అనుకోలేం. ఈ ఖలిస్తాన్ అనుకూల ఉద్యమం వెనుక పాకిస్తానీ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ప్రమేయం ఉందన్న అనుమానం బలపడుతున్నది అందుకే. అతనికి నిధులెక్కడివన్నదీ ఆరా తీయాల్సిందే! ఇక, పలాయితుడిపై జాతీయ భద్రతా చట్టం విధిస్తారన్న వార్త పరిస్థితి తీవ్రతకు ఉదాహరణ. 1980లు, 90లలో అకాలీలు తీవ్రవాద ఆరోపణలతో అరెస్టయిన తమ అనుయాయుల విడుదల కోసం వీధికెక్కినట్టే, ఈ 2023లో అమృత్‌పాల్, ఆయన తోటి ఖలిస్తానీ మద్దతుదారులు తమ సహచరుడి విడుదల కోసం గత నెలలో వీధికెక్కారు. ఏడేళ్ళ వయసు నుంచే సాంప్రదాయిక సిక్కు ధార్మిక శిక్షణ పొందిన ఒకప్పటి ఖలిస్తానీ నేత జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేకు భిన్నంగా,అలాంటి శిక్షణేమీ లేకుండా ఉన్నట్టుండి అలాగే వేషం కట్టి, మాట్లాడుతున్నాడు అమృత్‌పాల్. స్వీయ ప్రచారం మాటెలా ఉన్నా అతనిని ‘భింద్రన్‌వాలే 2.0’ అనలేం. సాయుధ అంగరక్షకుల నడుమ ఊరూరా తిరుగుతూ, రెచ్చగొడుతున్నాడు. 1984లో అమృత్సర్ స్వర్ణాలయంలో ఆపరేషన్ బ్లూస్టార్‌లో భింద్రన్‌వాలేను హతమార్చిన తర్వాత నాటి ప్రధాని ఇందిర, పంజాబ్ సీఎం బియాంత్ సింగ్‌లకు పట్టిన గతి నేటి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పంజాబ్ సీఎం మాన్లకు పడుతుందని తొడకొడుతున్నాడు. మానిన పాత గాయాల్ని మళ్ళీ కెలుకుతున్నాడు. భారత్ పట్ల ఖలిస్తానీల విద్వేషం బ్రిటన్, ఆస్ట్రేలియా సహా వివిధ దేశాల్లో ఉన్నట్టుండి వెల్లువె త్తడం మరింత ఆందోళనకరం. బరి తెగించిన ఖలిస్తానీ దుండగులు లండన్ తదితర ప్రాంతాల్లో భారత రాయబార కార్యాలయాలపై దాడి చేయడం, జాతీయ జెండాను తొలగించడం దుస్సహం. రాయబార కార్యాలయానికి కాపుండాల్సిన ఆయా దేశాల ఉదాసీన వైఖరీ ముమ్మాటికీ తప్పే. అసలు మన బంగారం మంచిదైతేగా! పంజాబ్ సంపన్న రాష్ట్రమే కానీ, గత పదిహేనేళ్ళలో తీవ్రనిరుద్యోగంతో యువత తప్పుదోవ పడుతోంది. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలకు వ్యతిరే కంగా 2020 – 21లో పంజాబీ సోదరులు పోరాటం సాగిస్తున్నప్పుడు దాన్ని సుదీర్ఘంగా సాగదీసిన కేంద్ర ప్రభుత్వ ఉదాసీనత సైతం అసంతృప్తి ప్రబలడానికి ఓ కారణం. హిందూ రాష్ట్రమనే భావనను పైకి తెస్తున్న పిడి వాదులూ, పరోక్షంగా ఖలిస్తానీల సిక్కురాజ్య వాదనకు ప్రేరేపకులే! నిరుద్యోగ యువత అసంతృప్తి, రైతుల ఆగ్రహం, ‘ఉఢ్తా పంజాబ్’గా మారిన రాష్ట్రంలో ఇట్టే దొరుకుతున్న మాదక ద్రవ్యాలు, పాక్ సరిహద్దుల నుంచి ఆయుధ ప్రవాహం, పాలకుల నిస్తేజం... అన్నీ కలసిన పంచకూట కషాయమే – పంజాబ్‌లో ప్రబలుతున్న దేశవ్యతిరేక కార్యకలాపాలు. జనబాహుళ్య అసంతృప్తిని తెలివిగా వాడుకుంటూ తన పునాదిని విస్తరించుకుంటున్న అమృత్ పాల్‌కు పాక్ అండతో సాగుతున్న విదేశీ ఖలిస్తానీ మద్దతుదారులు తోడవడం అగ్నికి ఆజ్యమే. తనను తాను అతిగా ఊహించుకుంటున్న ఈ వేర్పాటువాదిని ఆదిలోనే అడ్డుకోవాలి. మొగ్గలోనే తుంచకపోతే విభజనవాదం బ్రహ్మరాక్షసిగా మారి మింగేస్తుంది. కదం తొక్కాల్సిన పాలకులు కాలహరణం చేస్తే పంజాబ్‌లో మళ్ళీ పాత చీకటి రోజులు ముందుకొస్తాయి. పారా హుషార్! -
పంజాబ్‌లో పొంచి ఉన్న ముప్పు
‘రాడికల్ మతబోధకుడు’ అమృత్‌పాల్ సింగ్ గత సంవత్సరం దాకా నీట్‌గా షేవ్ చేసుకున్నాడు. తనలోని సహజ ప్రతిభలకు అవకాశం లభించనుందని గ్రహించి గడ్డం పెంచడం ప్రారంభించాడు. పోలీసులు చర్య తీసుకోవడాన్ని అడ్డుకునేందుకు గురు గ్రంథ్ సాహిబ్‌ను తన అనుచరులు నిత్యం వెంట ఉంచుకునేలా చేశాడు. ఇప్పుడు సమస్యల్లా పంజాబ్‌లో ఉగ్రవాదం తిరిగి పొడసూపే అవకాశం ఉండటమే. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన మన పొరుగుదేశం మళ్లీ సరిహద్దు పొడవునా ఘర్షణలు రేపడానికి ప్రయత్నించవచ్చు. అందుకే ఆప్ సర్కారు వైఫల్యం పేరుతో తనకు స్వాగతం పలకని రాష్ట్రంలో ప్రయోజనాలు పొందడానికి కేంద్రం ప్రయత్నించకూడదు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి ద్విముఖ వ్యూహం అవసరం. ‘రాడికల్ మతబోధకుడి’గా అభివర్ణిస్తున్న అమృత్‌పాల్ సింగ్ మరో భిండ్రాన్వాలే కావాలని ఆశ పడుతున్నాడు. అయితే, ఈ లక్ష్యాన్ని సాధించడం అంత సులభం కాదు. తప్పుదోవ పట్టిన రాజకీయ తంత్రాల ఉత్పత్తి –భిండ్రాన్వాలే. నిరుద్యోగం, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, తీవ్రరూపం దాల్చిన రష్యా–ఉక్రెయిన్ ఘర్షణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కలిగించిన ప్రభావాలు వంటి వాటి కారణంగా పంజాబ్ యువతలో ఏర్పడిన ప్రస్తుత నిస్పృహ స్థితిని వాడుకోవాలని అమృత్‌పాల్ స్పష్టంగా కోరుకుంటున్నాడు. మీడియా నివేదికల ప్రకారం, అమృత్‌పాల్ అనుయాయుల్లో ఒకరైన లవ్ ప్రీత్ సింగ్ ‘తూఫాన్’ను పోలీసులు అదుపులోకి తీసు కున్నారు. చామ్‌కౌర్ సాహిబ్‌కు చెందిన వరీందర్ సింగ్‌ను అపహరించి, దాడి చేశారనే ఆరోపణలపై అతడిని అరెస్టు చేశారు. దీనిపై అజ్నాలా పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్లో అమృత్‌పాల్ పేరు కూడా జోడించారు. లవ్‌ప్రీత్ విడుదలకు డిమాండ్ చేస్తూ పోలీసు స్టేషన్ వరకు మార్చ్ చేయాలని అమృత్‌పాల్ ప్రకటించాడు. సమస్య తీవ్రతను గ్రహించడంతో చుట్టుపక్కల పోలీసు స్టేషన్ల నుంచి పోలీసు బలగాలను రప్పించి అజ్నాలా వద్ద మోహరించారు. అమృత్‌పాల్, అతడి ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థకు చెందిన మద్దతు దారులు భారీస్థాయిలో కత్తులు, కొందరు తుపాకులు కూడా ధరించి బారికేడ్లను ఛేదించుకుని పోలీసు స్టేషన్ లో ప్రవేశించారు. ప్రభుత్వ ఆస్తికి భారీ నష్టం కలిగించారు. గుంపు తమపై దాడిచేస్తే ఏం చేయాలనే విషయమై వందమంది శిక్షణ పొందిన పోలీసులకు కచ్చితమైన ఆదేశాలు ఇచ్చివుంటే సాధారణ పరిస్థితుల్లో వీరు గుంపుతో సమర్థంగా వ్యవహరించి వారిని చెదరగొట్టి ఉండేవారు. అయితే మూకహింసను ఎదుర్కోవడానికి ఎంతమేరకు బలాన్ని ప్రయోగించవచ్చో స్పష్టంగా వారికి చెప్పనట్లయితే, పరిస్థితి అదుపు తప్పడానికే ఆస్కార ముంటుంది. అదే జరిగింది కూడా. సదరు పోలీసు స్టేషన్లో జరిగిన ఘటన పోలీసు నాయకత్వం, రాష్ట్ర రాజ కీయ నాయకత్వం వైఫల్య మేనని నేను కచ్చితంగా చెబుతాను. వార్తల ప్రకారం సీనియర్ ఐపీఎస్ అధికారులు తర్వాత స్పందించి, అమృత్‌పాల్‌తో మాట్లాడారు. వరీందర్ కిడ్నాప్ వ్యవ హారంలో లవ్‌ప్రీత్ పాత్ర లేదని అమృత్సర్ పోలీస్ కమిషనర్, అజ్నాలా ఎస్ఎస్పీకి అమృత్‌పాల్ నచ్చజెప్పినట్లు కనబడుతోంది. దాంతో లవ్ప్రీత్ను విడుదల చేయడానికి సీనియర్ అధికారులు అంగీ కరించారు. ఇలా లొంగిపోవడం ఇకనుంచీ పోలీసు, రాజకీయ నాయ కత్వానికి సమస్యలు తీసుకొస్తుంది. తన ప్రాథమిక ఫిర్యాదులో లవ్‌ప్రీత్ పేరును వరీందర్ బయట పెట్టారు. అలాంటప్పుడు నిజంగా కిడ్నాప్ ఘటన జరిగిందా అని పోలీసులు తనిఖీ చేసివుండవలసింది. వరీందర్‌ను కొట్టిందెవరు? అమృత్‌పాల్ వ్యాఖ్యలను అతడు వ్యతిరేకించినట్లు చెబుతున్నారు. అదే నిజమైతే, దాడి వెనుక ఉద్దేశం అర్థమవుతోంది. ఇలాంటి ముఖ్యమైన రాజకీయ పరిణామం పట్ల అజ్నాలా పోలీసులు తమ పైఅధికార్లను లూపులో పెట్టివుండవచ్చు. అయిదు పోలీసు స్టేషన్లపై అధికారం కలిగిన ఆఫీసర్ మాత్రమే సమీప పోలీసు స్టేషన్ల నుంచి అదనపు బలగాల మోహరింపునకు ఆదేశాలు ఇవ్వ గలడు. ఒకవేళ సాయుధ బటాలియన్ నుంచి రిజర్వ్ బలగాలను తరలించి ఉంటే, అలాంటి ఆదేశం రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి మాత్రమే వచ్చి ఉంటుంది. అలాంటప్పుడు ఎఫ్ఐఆర్లో పొందు పర్చిన వ్యక్తిని అరెస్టు చేయాలనే నిర్ణయం గురించి తమకు తెలీదని సీనియర్లు చెప్పుకొనే అవకాశమే లేదు. చట్టవిరుద్ధమైన డిమాండ్లకు లొంగిపోవడంలో రాజకీయ నాయకత్వం పాత్రను నేను చూస్తున్నాను. ఈ విషయాలన్నీ ముఖ్య మంత్రికి తెలీకుండా పోయే ప్రశ్నే లేదు. భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఇంకా భద్రతా రంగంపై పట్టు సాధించవలసే ఉంది. లేదంటే ఇది ‘ఆప్’ ప్రభుత్వ ఆయువు పట్టును దెబ్బకొడుతుంది. ఇప్పుడు ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే, అతి సున్నిత మైన ఈ సరిహద్దు రాష్ట్రంలో ఉగ్రవాదం తిరిగి పొడసూపే అవకాశం ఉండటమే. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన మన పొరుగుదేశం మళ్లీ సరిహద్దు పొడవునా ఘర్షణలు రేపడానికి ప్రయత్నించవచ్చు. 1980లలో మన పొరుగు దేశమే ఖాలిస్తానీ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి ఆశ్రయం కల్పించింది. పైగా సరిహద్దు పొడవునా ఆయుధాలను సర ఫరా చేసింది. అమృత్‌పాల్‌తో కూడా మన పొరుగు దేశం సంబంధాలు పెట్టుకోవచ్చు. ఇప్పటికే ఆ ప్రయత్నం జరిగిందో! ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి తగిన వ్యక్తి– జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోబాల్. ఏం చేయాలో ఆయనకు తెలుసు. ఇదంతా ఎలా జరిగింది, దీన్ని పరిష్కరించడానికి ఎవరిపై విశ్వాసం ఉంచాలి వంటి వివరాలు ఆయనకు తెలుసు. అమృత్ పాల్‌కు అసమంజసమైన ఆకర్షణ రావడాన్ని అనుమతించకూడదు. జయింపశక్యం కాని వలయం అతడి చుట్టూ ఏర్పడకముందే అతడిని అదుపు చేయాలి. అజ్నాలాలో అతడు విజయాన్ని రుచిచూశాడు. దానికి అనుగుణంగా పంజాబ్‌లో అతడికి మద్దతు పెరుగుతుంది. బీజేపీకి స్వాగతం పలకని రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనం పొందడానికి అజ్నాలాలో పంజాబ్ ప్రభుత్వ వైఫల్యాన్ని ముందు పీటికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించవచ్చు. అలా చేస్తే అది కూడా తప్పిదమే అవుతుంది. అప్ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఆప్ సిక్కు ముఖచిత్రంగా మాన్‌ను ముఖ్య మంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. బీజేపీ కూడా కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను తన పార్టీ సిక్కు ముఖంగా తీసుకొచ్చింది. కానీ అతడి బలం పనిచేయలేదు. మోదీ ప్రభుత్వం ముందున్న తెలివైన ఎంపిక ఏమిటంటే, పంజాబ్‌ను దాని మానాన దాన్ని వదిలేయడమే. లేకుంటే తన చేతులను తానే కాల్చుకోవలసి వస్తుంది. దీనికంటే మించిన చెత్త ఎంపిక ఏమిటంటే, రాజకీయాలు ఆడటమే. ఎందుకంటే మాన్, ఆయన పార్టీని ఒక పిల్లకాకి విపత్కర పరిస్థితుల్లోకి నెట్టేశాడు. ఇతగాడు గత సంవత్సరం దాకా నీట్‌గా షేవ్ చేసుకుని దుబాయ్‌లో ఇదమిత్థం కాని జీవితం గడుపుతుండేవాడు. తనలోని సహజ ప్రతిభలకు అవకాశం లభించనుందని గ్రహించిన అమృత్‌పాల్ అప్పటినుంచి గడ్డం పెంచడమే కాకుండా, భిండ్రాన్ వాలేను అనుకరిస్తూ దుస్తులను ధరించడం ప్రారంభించాడు. పోలీ సులు చర్య తీసుకోవడాన్ని అడ్డుకునేందుకు గురు గ్రంథ్ సాహిబ్‌ను తన అనుచరులు నిత్యం వెంట ఉంచుకునేలా చేశాడు. సమస్యను మొగ్గలోనే తుంచేసే అవకాశం లేకుండా పోయింది. రాజకీయ, పోలీసు నాయకత్వం చేయవలసిన పని కష్టతరమైంది. ఆప్ ప్రభుత్వం డోబాల్ సహాయం తీసుకోవాలి. సలహాదారుగా తన పాత్రను ప్రకటించకుండానే తెర వెనుక ఆయన చాలా చేయగలడు. ఈ సమస్యకు ద్విముఖ వ్యూహం అవసరం. పంజాబ్ జనాభాలో చాలా భాగం, ముఖ్యంగా గ్రామాల్లోని జాట్ సిక్కు రైతులు 1980, 90ల మొదట్లో ఉగ్రవాదం బీభత్సంతో తీవ్ర బాధలకు గురయ్యారు. ప్రజారాశులతో కమ్యూనికేషన్ మార్గాలు పెరిగినందున, అమృత్ పాల్, అతడి అనుయాయులను అదుపులోకి తీసుకోవాలి. రాజకీయ ప్రతిపక్షాలు, విమర్శకులకు వ్యతిరేకంగా అన్ని చట్టాలను ఉపయోగి స్తున్న బీజేపీ... రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని కాటు వేయడానికి ముందే ఉగ్రవాదంపై ఆ చట్టాలను ఉపయోగించాలి. జూలియో రిబేరో వ్యాసకర్త పోలీస్ మాజీ ఉన్నతాధికారి, ‘పద్మభూషణ్’ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఏసీలో పడుకోవాలని.. కారులో తిరగాలని..
ఏసీ గదిలో పడుకోవాలని అతడికి కల.. కానీ ఇంట్లో ఏసీ లేదు. మంచి పడవలాంటి పెద్ద కారులో షికారుకు వెళ్లాలని ఆశ.. కానీ కొనేంత స్థోమత లేదు. దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టడంతో ఢిల్లీకి చెందిన అమృత్ సింగ్ (19) తన కలలు నెరవేర్చుకోలేకపోయాడు. ఎలాగైనా వాటిని అనుభవించాలని మొదట్లో కారు బ్యాటరీలు, ఇతర విడి భాగాలు చోరీ చేయడం మొదలుపెట్టాడు. చివరకు ఏకంగా ఓ హోండా సిటీ కారు కొట్టేశాడు. తనను తాను 'డాన్' అని పిలుచుకునే అమృత్ సింగ్ తూర్పు ఢిల్లీలోని గాంధీనగర్ ప్రాంతంలో కారు దొంగతనం చేస్తుండగా సీసీటీవీ ఫుటేజిలో దొరికిపోయాడు. దాంతో పోలీసులు సదరు 'సరదా' దొంగను అరెస్టు చేశారు. రాత్రిపూట విలాసవంతమైన కారులో తిరగాలన్న తన సరదా తీర్చుకోడానికే కారు చోరీచేసినట్లు తర్వాత పోలీసు విచారణలో అతడు తెలిపాడు. అతడి వద్ద ఆరు కార్లతో పాటు ఒక స్కూటర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఐదో తరగతి వరకు బాగా తెలివైన విద్యార్థిగా ఉండే అమృత్.. ఆ తర్వాత చెడు స్నేహాలతో పాడైపోయాడు. ఖరీదైన కార్లు నడపాలంటే అతడికి సరదా అని, కానీ తమ ఇంట్లోకి 5 రూపాయలు పెట్టి వాషింగ్ పౌడర్ కొనమన్నా ఇబ్బందిపెట్టేవాడని అతడి తల్లి హర్జీందర్ కౌర్ చెప్పారు. చోరీచేసిన స్కూటర్లు అమ్మితే వచ్చిన డబ్బుతో కారులోకి పెట్రోలు పోయించేవాడు. ఏదైనా కారు మీద అతడికి విసుగు పుడితే, దాన్ని పక్కన పడేసి మరో కారు చోరీచేసేవాడని డీసీసీ రిషిపాల్ తెలిపారు. రాత్రంతా ఏసీ వేసుకుని కారులోనే పడుకునేవాడని.. అలా ఏసీ సరదా, కారు సరదా రెండూ తీర్చుకునేవాడని చెప్పారు. అతడి పేరు మీద ఇప్పటివరకు 16 చోరీ కేసులు ఢిల్లీలో నమోదయ్యాయి.