Amritha
-
మ్యూజిక్ డైరెక్టర్‌ను పెళ్లాడిన సింగర్?
కోలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ అమృతా సురేశ్, మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ ఎంతోకాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే ఇటీవల వీరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. అమృత తన బర్త్‌డే రోజు కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోలకు ఇచ్చిన క్యాప్షన్‌లో గోపీ సుందర్‌ను భర్తగా అభివర్ణించింది. దీంతో వీరికి పెళ్లైపోయిందని అభిమానులు భావిస్తున్నారు. ఇకపోతే గోపీసుందర్ గతంలో ప్రియ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి మాధవ్, యాధవ్ అని ఇద్దరు పిల్లలు. కానీ తర్వాత పలు కారణాలతో వీరు విడిపోయారు. ఆ తర్వాత సింగర్ అభయతో ప్రేమలో పడిన గోపీ 2008 నుంచి ఆమెతో సహజీవనం చేస్తూ వచ్చాడు. ఇటీవలే వీరిమధ్య పొరపచ్చాలు రావడంతో బ్రేకప్ చెప్పుకున్నారు. మరోవైపు అమృతా సురేశ్ గతంలో నటుడు బాలాను పెళ్లాడింది. వీరికి కూతురు కూడా ఉంది. కొన్నేళ్లకు వారు విడిపోయారు. రీసెంట్గా జరిగిన బర్త్‌డే వేడుకలను సైతం అమృత తన కూతురు, ప్రియుడు సుందర్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. View this post on Instagram A post shared by AMRITHA SURESSH (@amruthasuresh) View this post on Instagram A post shared by AMRITHA SURESSH (@amruthasuresh) చదవండి: ఆమిర్ ఖానా? ఆయనెవరు? నాకైతే తెలీదబ్బా.. షెడ్యూల్స్ కారణంగా విడిపోయిన ప్రేమజంట!.. -
డ్రెస్ ఫర్ సక్సెస్..: విజయానికి కావాలి ఓ డ్రెస్!
వివిధ రంగాలలో ‘ఆమె’ స్థానం మహోన్నతంగా ఎదుగుతోంది. దానికి తగినట్టు ‘ఆమె’ ఆహార్యం మారుతోంది. స్థానిక, భాష, సంస్కృతులకు భిన్నంగా ఉద్యోగిగా ‘ఆమె’కు సరైన డ్రెస్ ఉండాలి. అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వృత్తిపరమైన వస్త్రధారణ ‘ఆమె’కు తప్పనిసరి అవసరం అంటోంది ‘డ్రెస్ ఫర్ సక్సెస్’. లాభాపేక్షలేని ఈ సంస్థ పుట్టింది అమెరికాలోనే అయినా ప్రపంచంలోని పాతిక దేశాలకుపైగా విస్తరించింది. ఎదుగుతున్న మహిళకు ‘డ్రెస్’ అవసరం కొత్తగా పరిచయం చేస్తోంది. వృత్తి, ఉద్యోగాలలో సరైన వస్త్రధారణ మహిల ఆత్మగౌరవాన్ని పెంపొందించడంలో మహత్తరంగా పనిచేస్తుంది. ‘ఇంటర్వ్యూల సమయంలో వస్త్రధారణ కారణంగా పెరిగే ఆత్మవిశ్వాసాన్ని మేం ప్రత్యక్షంగా చూశాం. పనికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని మన ఆహార్యం ద్వారా తెలిజేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆఫీసు పనిలో మరిన్ని విజయాలు, అవకాశాలను సొంతం చేసుకోగలరు’ అంటున్నారు ‘డ్రెస్ ఫర్ సక్సెస్’ నిర్వాహకులు. మిలియన్లకు పైగా మహిళలు డ్రెస్ ఫర్ సక్సెస్ సంస్థ కార్యకలాపాలను న్యూయార్క్ నగరంలో 1997లో ప్రారంభించారు. ఆస్త్రేలియా, ఇటలీ, మెక్సికో, నెదర్లాండ్స్, పోర్చుగల్, కెనడా, న్యూజిలాండ్, నేపాల్, నైజీరియా, సింగపూర్... మొదలైన 25 దేశాలలో దాదాపు 150 నగరాలకు విస్తరించి, 1.2 మిలియన్లకు పైగా మహిళలు స్వయం సమృద్ధి సాధించడంలో సహాయపడింది. ‘మీ దుస్తులు ఎలా విరాళంగా ఇవ్వచ్చు. సంస్థకు ఎలా మద్దతు ఇవ్వవచ్చు, వాలంటీర్‌గా పాల్గొనడం లేదా ఇతర మార్గాల్లో సహాయం ఇవ్వచ్చు’ అనే విషయాల్లోనూ సంస్థ వెబ్సైట్ ద్వారానూ స్పష్టం చేస్తుంది. ఘన చరిత్ర ప్రపంచవ్యాప్తంగా మహిళ విజయం కోసం పనిచేసే ‘డ్రెస్ ఫర్ సక్సెస్’ ప్రధాన కేంద్రం న్యూయార్క్‌లో ఉంది. ఇది గ్లోబల్ అనుబంధ నెట్‌వర్క్‌ను పర్యవేక్షిస్తుంది. నాన్సీ లుబ్లిన్ అనే న్యాయశాస్త్ర విద్యార్థిని 1996లో తన ముత్తాత నుంచి వారసత్వంగా వచ్చిన 5 వేల డాలర్లను వేలాది మందికి ఉపయోగపడేలా చేయాలనుకుంది. మన్‌హట్టన్‌లోని ఒక చర్చి నేలమాళిగలో ‘డ్రెస్ ఫర్ సక్సెస్’ని స్థాపించింది. ఆ బేస్మెంట్ బోటిక్ నుంచి ‘డ్రెస్ ఫర్ సక్సెస్’ మిషన్ ఉత్తర అమెరికా అంతటా కొద్ది కాలంలోనే వ్యాపించి, ఆపై ప్రపంచమంతటా విస్తరించింది. ఆర్థిక స్వాతంత్య్రం సాధించడంలో మహిళలందరూ వారి స్థానం, భాష, ఆచారాలు లేదా సంస్కృతితో సంబంధం లేకుండా ఎదుర్కొనే సవాలు ఇది అని డ్రెస్ ఫర్ సక్సెస్ నిరూపిస్తుంది. ‘ప్రతి యేటా 14,000 మంది కంటే ఎక్కువ మంది మహిళలు, పురుషులు తమ సమయాన్ని, ప్రతిభను మా అనుబంధ సంస్థలకు ఉదారంగా విరాళంగా ఇస్తున్నారు’ అంటున్నారు నిర్వాహకులు. రెజ్యూమ్లతోనూ సాయం చాలా మంది మహిళలు పేదరిక స్థాయి లేదా దిగువ స్థాయిలోనే జీవిస్తున్నారు. ‘ఆమె’ తన జీవితంలో కొత్త పునాదిని నిర్మించుకోవడానికి సంస్థ చేదోడుగా ఉంటుంది. బాధిత మనస్తత్వాన్ని విజయంగా మార్చడంలో సహాయపడుతుంది. రెజ్యూమ్‌ను ఎలా తయారు చేసుకోవాలో, ఇంటర్వ్యూలలో ఎలా పాల్గొనాలో కూడా సహాయం చేస్తుంది. ‘నా జీవితం నిజంగా అద్భుతమైనది. వాళ్లు నా కోసం చాలా చేశారు. సక్సెస్ కోసం డ్రెస్, షూస్, మంచి సూట్ ధరిస్తే నేను చాలా అందంగా కనిపిస్తానని తెలియజేశారు. ఇంటర్వ్యూకి సిద్ధంగా ఉన్నాననే నమ్మకం నాకు కలిగింది. ఇది చాలా అద్భుతంగా ఉంది’ అంటారు ఈ సంస్థ నుంచి సాయం పొందిన మహిళ సోని. ప్రపంచంపై మీదైన ముద్ర వేయడానికి ఒక కొత్త అవకాశాన్ని జోడిస్తుంది డ్రెస్ ఫర్ సక్సెస్. ‘యువర్ అవర్, హర్ పవర్’ క్యాంపెయిన్‌తో ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవడానికి వేతనంలో ఒక గంట లేదా అంత కంటే ఎక్కువ సమయంలో పొందే మొత్తాన్ని విరాళంగా ఇవ్వచ్చని కూడా సూచిస్తోంది. మీరు కనిపించే తీరును బట్టి ప్రజలు మీకు ప్రతిస్పందిస్తారు అనే ఆలోచనతో అన్ని దేశాల్లోనూ మహిళలకు ప్రియమైన నేస్తంగా మారుతోంది డ్రెస్ ఫర్ సక్సెస్. మహిళాభ్యుదయానికి పాటు పడే ఇలాంటి సంస్థలు మన ముంగిట్లోకీ రావాలని కోరుకుందాం. మతాలకు అతీతంగా ‘బొటిక్కు వచ్చిన క్లయింట్ తన వృత్తికి తగిన దుస్తులను ఎంచుకోవడం అనేది కష్టమైన ప్రక్రియ. ఆమె అభిరుచికి అనుగుణంగా సరైన ఎంపిక ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం’ అని చెబుతున్నారు వాలంటీర్ జైనాబ్. ‘ఆన్లైన్ ద్వారాను వారికి సరైన గైడెన్స్ ఇస్తుంటాం. ఇంటర్వ్యూ లేదా కొత్త ఉద్యోగానికి తగిన దుస్తులను ఎంచుకోవడంలో మహిళలకు సహాయం చేస్తుంటాను. మా అనుబంధ సంస్థల ఈవెంట్లలో కూడా పాల్గొంటుంటాను’ అని వివరిస్తారు జైనాబ్. గృహహింస కారణంగా బాధపడుతున్న మహిళల పరిస్థితిని అర్థం చేసుకొని, వారు కొత్త జీవితాన్ని పొందడానికి సహాయం చేయడంలోనూ, వారి విజయానికి పాటు పడటంలోనూ ఈ ప్రోగ్రామ్‌లు ఉపయోగపడతాయని వివరిస్తారామె. లాభాపేక్షలేకుండా.. పురుషాధిక్యత అధికంగా ఉన్న దేశాలపైన దృష్టి పెట్టింది డ్రెస్ ఫర్ సక్సెస్. అక్కడి అనుబంధ సంస్థల ద్వారా నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించడానికి, ఇమిగ్రేషన్ సేవలు, ఉద్యోగ శిక్షణ కార్యక్రమాలు, విద్యా సంస్థలు, గృహ హింసతో బాధపడేవారికి షెల్టర్లతో సహా అనేక ఇతర లాభాపేక్షలేని సంస్థలతో కలిసి పని చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 5,000 కంటే ఎక్కువ సంస్థలతో కలిసి పనిచేస్తున్న ఘనతను సొంతం చేసుకుంది డ్రెస్ ఫర్ సక్సెస్. ‘మహిళలందరూ ఉన్నతంగా మారడానికి పెద్ద కలలు కనాలని కోరుకుంటున్నాను. ఒకరినుంచి ఒకరు స్ఫూర్తి పొందాలి. మా ప్రాథమిక దృష్టి మహిళలకు శిక్షణ ఇవ్వడం మీదనే. దాని వల్ల వారిలో విశ్వాసాన్ని పెంపొందించడం’ అంటున్నారు ఖాట్మండూలోని డ్రెస్ ఫర్ సక్సెస్ ఫౌండర్ అమృత. -
వర్మ ‘మర్డర్’కు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కిస్తున్న మర్డర్ చిత్రం విడుదలకు తెలంగాణ హైకోర్టు శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా విడుదలను నిలిపివేయాలంటూ నల్గొండ కోర్టు ఇచ్చిన స్టేను హైకోర్టు కొట్టివేసింది. గతంలో సంచలనం సృష్టించిన ప్రణయ్, అమృతల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పరువు కోసం అమృత తండ్రి మారుతీ రావు ప్రణయ్‌ను హత్య చేయించారు. ఇదే కథాంశంగా సినిమాను తెరకెక్కించాలని రామ్ గోపాల్‌వర్మ నిర్ణయించుకున్నారు. తమ అనుమతి లేకుండా రామ్‌గోపాల్‌వర్మ సినిమాను తీస్తున్నారంటూ అమృత కోర్టును ఆశ్రయించింది. అమృత మొదట నల్గొండ కోర్టును ఆశ్రయించగా చిత్ర విడుదలను నిలుపుదల చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ విషయంపై వర్మ హైకోర్టును ఆశ్రయించగా సినిమాలో ప్రణయ్, అమృత పేర్లు, ఫోటోలు, వీడియోలు వాడకూడదని షరతు విధించింది. వారి పేర్లు వాడబోమని చిత్ర యూనిట్ హామీ ఇవ్వడంతో ఇక ఏ అడ్డంకులు లేకుండా విడుదల కానుంది. అనంతరం రామ్‌గోపాల్‌వర్మ ట్విటర్ వేదికగా దీనిపై హర్షం వ్యక్తం చేశారు. మర్డర్ చిత్రం తెరకెక్కడం వెనుక ఉన్న మా మంచి ఉద్దేశాన్ని కోర్టు అర్థం చేసుకుంది. అన్ని విషయాలను కోర్టు ఆర్డర్ వచ్చిన తరువాత వెల్లడిస్తాను అంటూ వర్మ ట్వీట్ చేశారు. VERY HAPPY to inform that our good intentions of making the film MURDER has been rightly understood by the honourable COURT ..Details will be given once the order is with us ..THANKING EVERYONE 🙏🙏🙏💐💐💐 pic.twitter.com/lmdD4mOWVd — Ram Gopal Varma (@RGVzoomin) November 6, 2020 ఇదిలావుండగా రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కిస్తున్న మరో చిత్రం దిశ ఎన్కౌంటర్. ఈ చిత్రాన్ని నిలిపివేయాలంటూ దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కు అసభ్యకరంగా మెసేజ్‌లు పెడుతున్నారని వాటిని తొలగించాలని సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పకే ఈ చిత్రం విడుదలను ఆపివేయాలని నిందితులు కుటుంబ సభ్యులు సుప్రీం జ్యుడీషియల్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి మరో మారు హైకోర్టులో శుక్రవారం విచారణ జరగనుంది. ఈ నెల 26న దిశ ఎన్కౌంటర్ చిత్రం విడుదల కానుంది. చదవండి: ‘ఇది దిశ బయోపిక్ కాదు.. నిజాలు చెప్తున్నాం’ -
బిగ్‌బాస్‌లోకి ప్రదీప్ హీరోయిన్!
తెలుగులో ప్రారంభమైన బిగ్‌బాస్ నాల్గవ సీజన్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. అటు తమిళ, హిందీలో మాత్రం ఈ షో ఇంకా ప్రారంభం అవనేలేదు. దీంతో అక్కడి బిగ్‌బాస్ ప్రేమికులు ప్రోమోలతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇదిలా వుంటే తమిళ బిగ్‌బాస్ నాల్గవ సీజన్లో 'బిగిల్' హీరోయిన్ అమృతా అయ్యర్ పాల్గొంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఓ అభిమాని ఈ డౌటానుమానాన్ని అమృత దగ్గర ప్రస్తావించాడు. మీరు నిజంగానే బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెడుతున్నారా? అని ప్రశ్నించాడు. అందుకు సదరు హీరోయిన్ ఏం సమాధానం చెప్పాలో తెలీక ఇరకాటంలో పడ్డారు. (చదవండి: తీవ్ర అనారోగ్యం.. సర్జరీకి సిద్ధమైన నటి) ఓ క్షణమాగి.. "తెలీదు... దీన్ని సస్పెన్స్‌గానే ఉంచుదాం" అని చెప్పుకొచ్చారు. ఈ సమాధానంతో ఆమె బిగ్‌బాస్ ఎంట్రీ ఖాయమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కాగా అమృతా విజయ్ బిగిల్ సినిమాలో ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా కనిపించారు. ప్రదీప్ హీరోగా నటిస్తున్న "30 రోజుల్లో ప్రేమించడం ఎలా?" సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఈ సినిమా విడుదల అవకముందే హీరో రామ్ "రెడ్" చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ఇంకా రిలీజ్ కాకపోయినప్పటికీ "30 రోజుల్లో ఎలా?" సినిమా నుంచి విడుదలైన "నీలి నీలి ఆకాశం" పాటతో ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. (చదవండి: ప్రేయసిని పెళ్లాడిన బిగ్‌బాస్ విన్నర్!) -
హీరోయిన్ అమృత అయ్యర్ బ్యూటిపుల్ ఫోటోస్
-
అమృతతో నటుడు రాజా వివాహం