AMRPcanal
-
విషాదం: కారు ముందు టైర్ పగలడంతో..
సాక్షి, నల్లగొండ : జిల్లాలోని పీఏపల్లి మండలం దుగ్యాల వద్ద గురువారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపుతప్పి ఏఎంఆర్పీ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, కార్తీక్ అనే బాలుడిని స్థానికులు రక్షించారు. కారు ముందు టైరు పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులంతా పీఏపల్లి మండలం వడ్డెరిగూడెం గ్రామానికి చెందిన ఒర్సు రంగయ్య(45), అలివేలు(38), కీర్తి(18)గా గుర్తించారు. వీరంతా ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. -
ఏఎమ్మార్పీ కెనాల్లో గల్లంతైన వ్యక్తి మృతి
పెద్దఅడిశర్లపల్లి ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వలో ఈత కొట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతైన తిప్పని శ్రీనివాస్‌రెడ్డి (50) మృతిచెందాడు. అతడి మృతదేహం మంగళవారం లభ్యమైంది. సోమవారం సాయంత్రం మండల పరిధిలోని ఘణపురం స్టేజీ సమీపంలో తన స్నేహితులతో కలిసి స్నానం చేసేందుకు కాల్వలోకి దిగిన శ్రీనివాస్‌రెడ్డి నీటి ప్రవాహానికి కొట్టుకుని పోయాడు. గమనించిన స్థానికులు, స్నేహితులు నీటిలోకి దిగి గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వెంటనే హుటాహుటీనా గుడిపల్లి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఏఎమ్మార్పీ గేట్లు తాత్కాలికంగా మూసివేయించారు. అనంతరం గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి గాలించగా మృతదేహం లభ్యమైంది. గ పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు గుడిపల్లి ఎస్ఐ భోజ్యానాయక్ తెలిపారు. కాగా మృతుడు శ్రీనివాస్‌రెడ్డికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.