Anarchy
-
ఆంధ్రప్రదేశ్‌లో యథేచ్ఛగా అక్రమ కేసులు, నిర్బంధాలు, చిత్రహింసలు... ప్రభుత్వ అరాచకాలపై ప్రజల ఆగ్రహం
-
Haiti crisis: నేర ముఠాల గుప్పిట్లో హైతీ!
ఒక నేర ముఠా ఒక ప్రాంతాన్ని తన అధీనంలోకి తీసుకుని అరాచకం సృష్టిస్తే భద్రతాబలగాలు రంగంలోకి దిగి ఉక్కుపాదంతో అణచేయడం చాలా దేశాల్లో చూశాం. కానీ ఒక దేశం మొత్తమే నేర ముఠాల గుప్పెట్లోకి జారిపోతే ఎలా? హైతీ దేశ దుస్థితి చూస్తూంటే యావత్ ప్రపంచమే అయ్యో పాపం అంటోంది. పోర్ట్ ఎ ప్రిన్స్ రాజధానిసహా దేశాన్నే గడగడలాడిస్తున్న గ్యాంగ్‌లకు అసలేం కావాలి?. కెన్యా సాయం కోసం వెళ్లి రాజధాని ఎయిర్పోర్ట్ నేరముఠాలవశం కావడంతో స్వదేశం తిరిగిరాలేక అమెరికాలో చిక్కుకుపోయిన దేశ ప్రధాని ఏరియల్ హెన్రీ చివరకు పదవికి రాజీనామా చేశారు. దీంతో దేశ ప్రజల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. ఇళ్ల నుంచి బయటకురావడానికే జనం భయపడుతున్నారు. హైతీలో ప్రధాన గ్యాంగ్‌లు ఎన్ని? హైతీలో దాదాపు 200 వరకు నేరముఠాలు ఉన్నాయి. అయితే మాజీ పోలీస్ అధికారి జిమ్మీ ‘బార్బెక్యూ’ చెరీజియర్ నేతృత్వంలోని జీ9 ఫ్యామిలీ అండ్ అలీస్ అలయన్స్, గేబ్రియల్ జీన్ పెర్రీ నేతృత్వంలోని జీపెప్ నేరముఠాలు ప్రధానమైనవి. ఇవి ప్రజలను హింసిస్తూ దేశాన్ని నరకానికి నకళ్లుగా మార్చేశాయి. రాజధాని సమీప ప్రాంతాలపై పట్టుకోసం చాన్నాళ్లుగా ఈ రెండు వైరి వర్గముఠాలు ప్రయత్నిస్తున్నాయి. ఎంతో మందిని సజీవ దహనం చేశాడని జిమ్మీని స్థానికంగా బార్బెక్యూ అని పిలుస్తుంటారు. నరమేధం, దోపిడీ, ఆస్తుల ధ్వంసం, లైంగిక హింసకు జీ9, జీపెప్ నేరముఠాలు పాల్పడ్డాయి. దీంతో ఈ ముఠా లీడర్ల లావాదేవీలు, కార్యకలాపాలపై ఐరాస, అమెరికా ఆంక్షలు విధించాయి. దీంతో రెండు గ్యాంగ్‌లు ఉమ్మడిగా ఒక ఒప్పందం చేసుకున్నాయి. కలిసి పనిచేసి ప్రధానిని గద్దెదింపేందుకు కుట్ర పన్నాయి. అసలు ఇవి ఎలా పుట్టుకొచ్చాయి? మురికివాడల్లో దారుణాలు చేశాడన్న ఆరోపణలపై జిమ్మీని పోలీస్ ఉద్యోగం నుంచి తీసేశాక నేరసామ్రాజ్యంలో అడుగు పెట్టాడు. దేశంలోని రాజకీయ పార్టీలు, నేతలు, పారిశ్రామికవేత్తలు తమ అనైతిక పనులకు అండగా ఉంటారని ఇలాంటి చిన్న చిన్న నేరగాళ్లను అక్కున చేర్చుకుని పెద్ద ముఠా స్థాయికి ఎదిగేలా చేశారు. 2021 జులైలో హత్యకు గురైన హైతీ మాజీ అధ్యక్షుడు జొవెనెల్ మొయిసెకు చెందిన పార్టీ హైతియన్ టెట్ కాలే(పీహెచ్‌టీకే)తో జిమ్మీకి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఒకానొక దశలో జిమ్మీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలని మొయిసె భావించారు. జీపెప్ ముఠా సైతం విపక్ష పార్టీలతో అంటకాగింది. దీంతో ఆర్థికంగా, ఆయుధపరంగా రెండు ముఠాలు బలీయమయ్యాయి. హింస ఎప్పుడు మొదలైంది? హైతీ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ ‘పాపా డాక్’ డ్యువేలియర్, అతని కుమారుడు జీన్‌క్లాడ్ డ్యువేలియర్‌ల 29 ఏళ్ల నియంతృత్వ పాలనాకాలంలోనే ఈ గ్యాంగ్‌లు పురుడుపో సుకున్నాయి. డ్యువేరియర్లు ఒక సమాంతర మిలటరీ(టోంటోన్స్ మకౌటీస్)ని ఏర్పాటు చేసి వైరి పార్టీల నేతలు, వేలాది మంది సామాన్య ప్రజానీకాన్ని అంతమొందించారు. ‘హైతీలో నేరముఠాలకు దశాబ్దాల చరిత్ర ఉంది. కానీ ఇప్పుడున్న నేరముఠాల వైఖరి గతంతో పోలిస్తే దారుణం’ అని వర్జీనియా విశ్వవిద్యాలయ అధ్యాపకుడు, హైతీ వ్యవహారాల నిపుణుడు రాబర్ట్ ఫాటన్ విశ్లేషించారు. నేతలనూ శాసిస్తారు బెదిరింపులు, కిడ్నాప్‌లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా లతో నేరముఠాలు ఆర్థికంగా బలపడ్డాయి. ఆయుధాలను సమకూర్చుకున్నారు. గత వారం రాజధానిలోని రెండు జైళ్లపై అధునాతన డ్రోన్లతో దాడికి తెగబడ్డాయి. శిక్ష అనుభవిస్తున్న వేలాది మంది కరడుగట్టిన నేరగాళ్లను విడిపించుకు పోయారు. సాయుధముఠాలు ఇప్పుడు ఏకంగా రాజకీయపార్టీలు, నేతలనే శాసిస్తున్నాయి. పరిపాలన వాంఛ అక్రమ మార్గాల్లో సంపదను మూటగట్టుకున్న నేర ముఠాలు ఇప్పుడు రాజ్యాధికారంపై కన్నేశాయి. 2021లో దేశాధ్యక్షుడు మొయిసె హత్యానంతరం వీటి రాజకీయ డిమాండ్లు ఎక్కువయ్యాయి. ముఠాలు ప్రధాని హెన్రీని గద్దె దింపాయి. దేశాన్ని పాలిస్తానని బార్బెక్యూ జిమ్మీ పరోక్షంగా చెప్పాడు. అంతర్జాతీయంగా తన పేరు మార్మోగాలని విదేశీ మీడియాకు ఇంటర్వ్యూలిచ్చాడు. విదేశీ జోక్యం వద్దని, విదేశీ బలగాలు రావద్దని హుకుం జారీచేశాడు. ప్రస్తుత సంక్షోభాన్ని ఒంటిచేత్తో పరిష్కరిస్తానని ప్రకటించాడు. రాజకీయ శక్తులుగా ఎదిగితేనే తమ మనుగడ సాధ్యమని ముఠాలు భావిస్తున్నాయి. సంకీర్ణ బలగాలు వస్తున్నాయా? కెన్యా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలను హైతీకి పంపించి సంక్షోభానికి ఫుల్స్టాప్ పెట్టాలని అమెరికాసహా పలుదేశాలు నిర్ణయించాయి. ఐరాస ఇందుకు అంగీకారం తెలిపింది. అయితే కెన్యా కోర్టుల జోక్యంతో ప్రస్తుతానికి ఆ బలగాల ఆగమనం ఆగింది. హైతీ ప్రధాని రాజీనామా నేపథ్యంలో నూతన ప్రభుత్వ కొలువు కోసం కౌన్సిల్ ఏర్పాటు, అన్ని భాగస్వామ్యపక్షాల సంప్రతింపుల ప్రక్రియ ముగిసేదాకా వేచిచూసే ధోరణిని అవలంబిస్తామని కెన్యా అధ్యక్షుడు విలియం రూటో చెప్పారు. మరి కొద్దిరోజుల్లోనే ఎన్నికల కోసం కౌన్సిల్ ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చెప్పారు. మన వాళ్లను వెనక్కి రప్పిస్తాం: భారత విదేశాంగ శాఖ హైతీలో దాదాపు 90 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. వీరిలో డాక్టర్లు, ఇంజనీర్లు, టెక్నీషియన్లు ఉన్నారు. 60 మంది ఇప్పటికే హైతీకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. హైతీలో భారతీయ రాయబార కార్యాలయం, కాన్సులేట్ లేవు. దీంతో సమీపాన ఉన్న డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమినిగోలోని ఇండియన్ మిషన్ ద్వారా హైతీలోని భారతీయులతో మోదీ సర్కార్ సంప్రతింపులు జరుపుతోంది. వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకొస్తామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ శుక్రవారం ఢిల్లీలో చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టీడీపీ నాయకుల అరాచకం
ఆత్మకూరు: టీడీపీ నాయకులు అరాచకం సృష్టించారు. సంక్రాంతి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అడ్డుకుని మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని చేజర్ల మండలం మడపల్లి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు మడపల్లి గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఆదివారం సంక్రాంతి సంబరాలు జరిగాయి. స్థానిక రామాలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో టీడీపీకి చెందిన పెద్దిరెడ్డి కిరణ్, కిషోర్, నవీన్, వినయ్, పూర్ణచంద్ర తదితరులు అడ్డుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గ్రామస్తులందరూ కలిసి ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని, నిలిపివేయమనడం సరికాదని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చెప్పారు. దీంతో చెలరేగిపోయిన టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. ఫలితంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. గ్రామపెద్దలు ఇరువర్గాలకు సర్దిచెప్పి పంపారు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో టీడీపీకి చెందిన కిరణ్, కిషోర్ తదితరులు వైఎస్సార్ సీపీకి చెందిన ఇనకల్లు ప్రసాద్‌రెడ్డి, పెంచలరెడ్డి, మాజీ సర్పంచ్ గుండుబోయిన నారాయణయాదవ్ ఇళ్లపై రాళ్లు, కర్రలు, కొడవలి తదితర మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. దాడిలో ప్రసాద్‌రెడ్డికి గాయాలు కాగా, పైదంతాలు రెండు ఊడిపోయాయి. పెంచలరెడ్డి, నారాయణయాదవ్లకూ గాయాలయ్యాయి. స్థానికులు గట్టిగా కేకలు వేయడంతో టీడీపీ నాయకులు పరారయ్యారు. గాయపడిన వారిని తొలుత చేజర్ల పీహెచ్‌సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎస్సై ప్రభాకర్ సిబ్బందితో కలిసి ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. -
Afghanistan: ఏడాదిగా అరాచకమే
సరిగ్గా ఏడాది క్రితం.. అమెరికా రక్షణ ఛత్రం కింద ఉన్న అఫ్గానిస్తాన్ మళ్లీ తాలిబన్ల చెరలో చిక్కుకుంది. 20 ఏళ్ల యుద్ధాన్ని విరమించి, అమెరికాతోపాటు పశ్చిమ దేశాల సైన్యం వెనక్కి తరలిపోవడం ప్రారంభమైన కొద్ది రోజుల వ్యవధిలోనే దేశంలో తాలిబన్లు పాగా వేశారు. వారి అరాచక పాలనకు ఏడాది నిండింది. తాలిబన్లు అఫ్గాన్ ప్రజలకు నరకం చూపుతూనే ఉన్నారు. విద్య, వైద్యం, కనీస వసతులు అందని ద్రాక్షగా మారాయి. మానవ హక్కుల జాడే లేదు. పేదరికం, కరువు ప్రధాన శత్రువులుగా మారిపోయి పీడిస్తున్నాయని అఫ్గాన్ పౌరులు ఆవేదన చెందుతున్నారు. ఎవరిని కదిలించినా కన్నీళ్లే ఉబికి వస్తున్నాయి. పిడివాద పాలనను పరిశీలిస్తే నిర్వేదమే మిగులుతుంది. ఆహార సంక్షోభం ప్రపంచంలో తాలిబన్ పాలకులు ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయారు. అఫ్గాన్ ప్రభుత్వాన్ని చాలా దేశాలు అధికారికంగా గుర్తించడం లేదు. విదేశీ సాయం నిలిచిపోయింది. 2020–21లో అఫ్రాఫ్ ఘనీ ప్రభుత్వ హయాంలో 5.5 బలియన్ డాలర్ల వార్షిక బడ్జెట్ ప్రకటించారు. ఇందులో 75 శాతం నిధులు విదేశాల నుంచి సాయం రూపంలో అందినవే కావడం గమనార్హం. తాలిబన్ల రాకతో ఈ సాయమంతా హఠాత్తుగా ఆగిపోయింది. అఫ్గాన్‌కు చెందిన 7 బిలియన్ డాలర్ల నిధులను అమెరికా స్తంభింపజేసింది. ఆర్థిక ఇబ్బందులు కుంగదీస్తున్నాయి. ఉద్యోగాలు లేవు, ఉపాధి మార్గాలు మూసుకుపోయాయి. అఫ్గాన్ పేదలు ఉపాధి కోసం పొరుగుదేశం ఇరాన్‌కు వలసవెళ్తున్నారు. అక్కడా పనులు దొరక్క ఉత్త చేతులతో తిరిగి వస్తున్నారు. లక్షలాది మంది జనం పేదరికంలోకి జారిపోతున్నారు. ఈ రోజు తినడానికి తిండి దొరికితే అదే గొప్ప అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఎక్కడ చూసినా ఆకలి కేకలే వినిపిస్తున్నాయి. అఫ్గాన్ జనాభా 4.07 కోట్లు కాగా, సగానికి పైగా ప్రజలు ఆహార కొరత ఎదుర్కొంటున్నారు. సమీప భవిష్యత్తులోనూ బతుకులు మారుతాయన్న సూచనలు కనిపించడం లేదు. ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన శిక్షలు: అఫ్గాన్‌లో మహిళలపై వివక్ష యథావిధిగా కొనసాగుతోంది. తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే మహిళలను ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగించారు. మీరు ఇక ఇళ్లకే పరిమితం కావాలి, మీ కుటుంబాల్లోని పురుషులకు ఉద్యోగాలు ఇస్తాం అంటూ తేల్చిచెప్పేశారు. వారికి ఉన్నత విద్యను సైతం దూరం చేస్తున్నారు. బాలికలు పాఠశాలల్లో ఆరో గ్రేడ్‌కు మించి చదువుకోవడానికి వీల్లేదు. టీనేజీ బాలికలకు పాఠశాలల్లో ప్రవేశం లేదు. అంతోఇంతో స్తోమత కలిగిన కొందరు ఇళ్లల్లో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. మహిళలు ఇళ్ల నుంచి బయటకు వస్తే శరీరమంతా కప్పేసేలా దుస్తులు ధరించాలి. ఆంక్షలను అతిక్రమిస్తే శిక్షలుంటాయి. వ్యవసాయ కూలీలుగా విద్యావంతులు దేశంలో ఈ ఏడాది కరువు తీవ్రత పెరిగింది. పంటల సాగు విస్తీర్ణం పడిపోయింది. ప్రధాన పంట గోధుమల ఉత్పత్తి తగ్గింది. ఉన్నత చదువులు చదువుకున్న యువత కూడా ఉపాధి కోసం చేలల్లో పనిచేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వారికి రోజువారీ కూలీ 2 డాలర్ల లోపే లభిస్తోంది. జనం ఆవేదన ఇలా ఉండగా, తాలిబన్ల వాదన మరోలా ఉంది. దేశంలో అవినీతిని అంతం చేశామని, దురాక్రమణదారులను తరిమికొట్టి ప్రజలకు భద్రత కల్పిస్తున్నామని చెబుతున్నారు. షరియా చట్టం పరిధిలోనే మహిళలకు హక్కులు కల్పిస్తున్నామనిఅంటున్నారు. బొగ్గు, పండ్లను పాకిస్తాన్‌కు ఎగుమతి చేయడంతోపాటు కస్టమ్స్ రెవెన్యూ వసూళ్ల ద్వారా తాలిబన్లు ఆదాయం సంపాదిస్తున్నారు. 2021 డిసెంబర్ నుంచి 2022 జూన్ మధ్య 840 మిలియన్ డాలర్లు ఆర్జించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో అఫ్గానిస్తాన్ బడ్జెట్ 2.6 బిలియన్ డాలర్లుగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
తాలిబన్ల అరాచకం
-
అబ్బాయిల వేషం కట్టి... తప్పించుకుంది
తాలిబన్లు చెప్పే మాటలు న మ్మకండి. వాళ్లు చేసే ప్రమాణాలు ఎప్పుడైనా మారిపోవచ్చు. మీరు మీ కుంటుంబాలతోపాటు స్నేహితులను అఫ్గానిస్తాన్ నుంచి తరలించండి అని హెచ్చరిస్తోంది స్పెయిన్‌లో నివసిస్తోన్న అఫ్గాన్ మహిళా కార్యకర్త, రచయిత నదియా గులామ్. ప్రస్తుతం నదియా అఫ్గాన్‌లో లేనప్పటికీ తన కుటుంబం మాత్రం ఇంకా అక్కడే ఉండడంతో ఆమె తీవ్ర ఆందోళన చెందుతోంది. ‘‘నా కుటుంబమే కాదు, అక్కడ ఉన్న వేలమంది కూడా నా కుటుంబ సభ్యులే. తాలిబన్లు తమ మాతృదేశాన్ని ఆక్రమించుకున్నప్పటి నుంచి నా కంటనీరు ఆగడం లేదు.గతంలో కంటే తాలిబన్లు ఇప్పుడు మరింత తెగబడతారు. గత ప్రభుత్వంలో పనిచేసిన ఉద్యోగులు ఒక్కొక్కరుగా కనపడకుండా పోతారు’’ అని వణికిపోతోంది. నదియా ఇంతగా భయపడడానికి... గతంలో తాలిబన్ల అరాచకాల వల్ల తను అనుభవించిన నరకయాతనలే. తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ను పరిపాలిస్తున్న రోజులవి. అప్పుడు నదియాకు పదకొండేళ్లు ఉంటాయి. ఒకరోజు నదియా వాళ్ల ఇంటిపై బాంబు పడింది. ఇంట్లో ఉన్న అమ్మానాన్నలు తీవ్రంగా గాయపడ్డారు. నదియా వాళ్ల అన్నయ్య ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలపాలై ప్రాణాలతో బయట పడిన నదియాకు రూపురేఖలు వికృతంగా మారిపోయాయి. ఒక బాంబు దాడి కుటుంబాన్నే నాశనం చేసింది. ఇది ఇలా ఉండగా... అదే సమయంలో ‘‘మహిళలు చదువుకోకూడదు, ఉద్యోగాలు చేయకూడదు, ఇల్లు విడిచి బయటకు రాకూడదు’’ అని తాలిబన్లు హుకుం జారీ చేశారు. ఒకపక్క అన్నయ్య లేడు, నాన్న ఉన్నప్పటికీ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబానికి తనే ఆధారం కావాల్సి వచ్చింది. అడపిల్లలు బయటకు వెళ్లకూడదు. వెళ్లకపోతే ఇల్లు గడిచే పరిస్థితి లేదు. ఇంతటి క్లిష్టసమయంలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది నదియా. అమ్మాయిగా బయటకు వెళ్తే తప్పు గానీ, అబ్బాయిగా కాదు కదా! అనుకుని బయటకు వెళ్లేటప్పుడు అబ్బాయిలా బట్టలు వేసుకుని, అబ్బాయిలా తిరుగుతూ మగవాళ్లలా పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేది. ఇలా పదేళ్ల పాటు తన బాల్యాన్ని, గుర్తింపును కోల్పోయి బతికింది. పదేళ్ల తరవాత ఓ ఎన్జీవో సాయంతో స్పెయిన్‌కు శరణార్థిగా వెళ్లింది. స్పెయిన్ వచ్చాక మళ్లీ పుట్టినట్లు అనిపించింది తనకు. కొత్త జీవితాన్ని ప్రారంభించే క్రమంలో ముఖానికి సర్జరీ చేయించుకుని వికృతంగా ఉన్న రూపాన్ని కాస్త మార్చుకుంది. అలాగే తనలా శరణార్థులుగా వస్తోన్న నిరాశ్రయుల కోసం ‘‘పాంట్స్ పర్ లా పావ్’’ను స్థాపించి, శరణార్థులకు వివిధ రకాల భాషలు, వృత్తిపరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తూ వారికి బతుకుదెరువు చూపిస్తోంది. అంతేగాక చిన్నతనంలోనే అనేక కష్టాలను ప్రత్యక్షంగా అనుభవించిన నదియా అనుభవాలతో ‘‘ద సీక్రెట్ ఆఫ్ మై టర్బన్’’, టేల్స్ దట్ హీల్డ్ మీ’’, ‘‘ద ఫస్ట్ స్టార్ ఆఫ్ ది నైట్’’ పుస్తకాలను రాసి రచయిత్రిగా గుర్తింపు తెచ్చుకుంది. తనలా ఇంకెంతమందో... ఇన్ని కష్టాలు పడిన నదియా ఇప్పటికీ ఆ చీకటిరోజులను మర్చిపోలేక పోతోంది. తాజాగా తాలిబన్లు మరోసారి పిల్లలు, అమ్మాయిలు, మహిళలపై ఎంతటిదారుణమైన చర్యలకు పాల్పడతారోనని వణికి పోతుంది. తనలాగా ఇంకెంతమంది అమ్మాయిలు తమ జీవితాలను కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేస్తోంది.‘‘ప్లీజ్ మా దేశానికి గన్స్ సరఫరా చేయకండి. నా దేశం గత యాభై ఏళ్లుగా యుద్ధంలో పోరాడుతూనే ఉంది. అఫ్గాన్‌లో 85 శాతం మంది ప్రజలు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. నిజంగా మీరు మాకు సాయం చేయాలంటే మానసిక ధైర్యాన్ని ఇవ్వండి. మహిళలు చదువుకునేందుకు సహకరించండి’’ అని అంతర్జాతీయ సమాజాన్ని అర్థిస్తోంది. అంతేగాదు, గత పదిరోజులుగా అఫ్గాన్ నుంచి ప్రజలను తరలించేందుకు శాయశక్తులా కృషిచేస్తోంది. నిజంగా కష్టాలు పడిన వారికే ఆ బాధ తెలుస్తుంది అనడానికి నదియా నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. నదియా గులామ్ -
ఆరెస్సెస్ వల్లే అరాచకత్వం
భువనేశ్వర్: దేశంలోని అన్ని రాజ్యాంగ వ్యవస్థల్లో చొచ్చుకునిపోయేందుకు, వాటిని నియంత్రించేందుకు ఆర్ఎస్ఎస్ యత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ ఆరోపించారు. అందువల్లే న్యాయవ్యవస్థ, న్యాయవ్యవస్థ సహా దేశంలో గందరగోళం, అరాచకత్వం రాజ్యమేలుతోందని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నవేళ ప్రజలను కలుసుకోవడంలో భాగంగా ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ పలువురు మేధావులతో ముచ్చటించారు. ‘1991లో, 2004–14 మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపట్టిన సరళీకరణ విధానాలతోనే దేశంలో మధ్యతరగతి అవతరించింది’ అని రాహుల్ తెలిపారు. ‘బీజేపీ, ఆరెస్సెస్ నేతలు నన్ను తరచుగా దూషిస్తూ ఉంటారు. వాటిని నేను బహుమానంగా స్వీకరిస్తా. ఎందుకంటే ఆ విమర్శలు నన్ను మరింత రాటుదేలేలా చేశాయి’ అని అన్నారు. ప్రియాంక రాకపై గతంలోనే నిర్ణయం సోదరి ప్రియాంకా గాంధీ రాజకీయాల్లోకి రావాలని కొన్నేళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నట్లు రాహుల్ స్పష్టంచేశారు. మిరాయా, రైహాన్ వాద్రాలు చిన్నపిల్లలు కావడంతో ప్రియాంక రాజకీయాలకు దూరంగా ఉన్నారన్నారు. ప్రస్తుతానికి యూపీలో కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించడమే ప్రియాంక లక్ష్యమనీ, ఎలాంటి ఇతర బాధ్యతలు ఆమెకు అప్పగించలేదని స్పష్టం చేశారు. తామిద్దరి మధ్య మంచి అనుబంధం ఉందనీ, నానమ్మ ఇందిర, తండ్రి రాజీవ్‌ల హత్యల తర్వాత అది మరింత దృఢపడిందని రాహుల్ పేర్కొన్నారు. తనను, ప్రియాంక పక్కపక్క గదుల్లో కూర్చోబెట్టి ప్రశ్నలు అడిగితే దాదాపు 80 శాతం ఒకేరకమైన సమాధానం వస్తుందని తెలిపారు.బీజేపీ నేత, సుల్తాన్పూర్ ఎంపీ వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. అలాంటి ఊహాగానాలు వస్తున్నట్లు తనకు తెలియదన్నారు. -
దళిత రైతుపై అటవీశాఖ అరాచకం
అర్ధరాత్రి మామిడి తోట నరికివేత టీడీపీ నాయకులు చెప్పారని వెల్లడి రేంజర్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ నేతల ఆగ్రహం బత్తులవారిగూడెం(నూజివీడురూరల్) : అధికార పార్టీ నాయకులు చెప్పారని అటవీశాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి దళితరైతుకు చెందిన భూమిలోని మామిడి చెట్లను రాత్రిపూట దొంగచాటుగా కొట్టేశారు. మండలంలోని బత్తులవారిగూడెంకి చెందిన కోలగంటి సుబాకర్రావు తన రెండెకరాల భూమిలో పదేళ్ళక్రితం మామిడి చెట్లను వేశారు. శనివారం రాత్రి అటవీశాఖ సిబ్బంది ఆ తోటలోకి అక్రమంగా ప్రవేశించి 25 మామిడి చెట్లను నరికేశారు. ఆదివారం తోటకెళ్లిన బాధితుడు నరికేసిన చెట్లను చూసి హతాశుడయ్యాడు. అక్కడ పలువురి మామిడి తోటలు ఉన్నా ఆయన తోటనే టార్గెట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు మందాడ నాగేశ్వరరావు, వైఎస్సార్సీపి నాయకుడు బత్తుల మాధవరావు, జెడ్పీటీసి బాణావతు రాజు దృష్టికి తేగా వారు తోటను పరిశీలించారు. నిలదీసిన వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు నూజివీడు అటవీశాఖ కార్యాలయంలో రేంజర్ బీ శ్రీరామారావును సోమవారం ఉదయం కలిసి ఇదేం దౌర్జన్యం అని నిలదీశారు. కొంతమంది గ్రామస్తులు ఫిర్యాదు చేయడం వల్లే నరికి వేశామని రేంజర్ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. మేము ఫిర్యాదు చేస్తే అలాగే నరికేస్తారా? అని నిలదీశారు. ఐదేళ్ళ క్రితం ఇదే రైతు భూమిలోని మామిడి చెట్లను ఇలాగే కొట్టేస్తే కోర్టు కేసులో బాధితుడికి అనుకూలంగా తీర్పు వచ్చిందని రేంజర్ దృష్టికి తెచ్చారు. ఎవరో టీడీపీ నాయకులు చెప్పారని రాత్రిపూట దొంగల్లాగా తోటలోకి చొరబడి అరాచకం చేయడం ఏమిటని వైఎస్సార్సీపీ నాయకులు ధ్వజమెత్తారు. మంగళవారం ఉదయం నిరికివేసిన మామిడి తోటను పరిశిలించి భాధిత రైతుకు తగు న్యాయం చేస్తానని రేంజర్ తెలపడంతో నేతలు కొంత శాంతించారు. ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అటవీశాఖ అధికారుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
బరితెగింపు
ధర్మవరం అర్బన్ : ధర్మవరం నియోజకవర్గంలో అరాచకం రాజ్యమేలుతోంది. రేషన్ డీలర్‌షిప్‌ను దక్కించుకోవడానికి ఓ డీలర్ భర్తను కొందరు కిడ్నాప్ చేశారు. రాజీనామా చేయకపోతే చంపేస్తామని బెదిరించి పోలీస్‌స్టేషన్ వద్ద వదిలేసి వెళ్లారు. పట్టణంలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. బాధితుల కథనం మేరకు.. ధర్మవరం పట్టణంలోని కేతిరెడ్డి కాలనీలో రేషన్ షాపు నెంబర్ 112ను నారాయణరెడ్డి భార్య శకుంతల నడుపుతున్నారు. స్టాక్ వచ్చిందని గోడౌన్లో పనిచేసే వ్యక్తితో నారాయణరెడ్డికి ఫోన్ చేరుుంచారు. ఉదయం 11 గంటలకు మార్కెట్ యార్డ్ వద్దకు వచ్చి స్టాక్ లారీలో పంపించి, వెనుక మోటార్ సైకిల్లో బయలుదేరాడు. గేటు వద్ద నారాయణరెడ్డిని సుమారు 10 మంది చుట్టుముట్టి చేరుు చేసుకున్నారు. తమ వెంట రాకపోతే ఇక్కడే ఏమైనా చేసేస్తామని హెచ్చరించి ఆయన బండ్లో మరో ఇద్దరు కూర్చొని బత్తలపల్లి వైపు తీసుకెళ్లారు. సంజీవపురం సమీపంలో వాహనం ఆపి తీవ్రంగా కొట్టారు. భార్య శకుంతలకు ఫోన్ చేయించి నీ వద్దకు నరసింహులు భార్య వస్తుందని తెల్లకాగితంపై సంతకం చేయాలని సూచించారు. అయితే భర్త గొంతులో తడబాటును గమనించిన శకుంతల ఏమి జరిగిందని ప్రశ్నించేలోగా.. రామకృష్ణ అనే వ్యక్తి ఫోన్ తీసుకుని తెల్లకాగితంపై సంతకం చేయకపోతే నీ భర్తను చంపుతామని బెదిరించారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన శకుంతల పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా, నరసింహులు భార్యతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు వచ్చి తెల్ల కాగితంపై సంతకం చేయాలని ఒత్తిడి చేశారు. శకుంతల వారి నుంచి తప్పించుకుని ఏఎస్పీ అబిషేక్ మహంతి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఏఎస్పీ వద్ద శకుంతల ఉండగానే కిడ్నాపర్లు మరోసారి ఆమెకు ఫోన్ చేసి హెచ్చరించారు. నిందితులను పట్టుకుని విచారిస్తామని ఏఎస్పీ హామీ ఇచ్చారు. అప్పటికే ఈ విషయం బయటకు పొక్కడంతో కిడ్నాపర్లు నారాయణరెడ్డిని పట్టణ పోలీస్‌స్టేషన్ వద్ద సాయంత్రం 5 గంటలకు వదిలిపెట్టి వెళ్లారు. స్టాక్‌ను కూడా కేతిరెడ్డికాలనీలో నరసింహులు బంధువుల ఇంటిలో దింపుకున్నారు. ఆరుగంటల పాటు కిడ్నాపర్లు నారాయణరెడ్డిని వారి అదుపులో ఉంచుకున్నారు. పక్కా వ్యూహంతో ముందుగా కాపుకాచి ఈ వ్యవహారం నడిపించినట్లు తెలుస్తోంది. కాగా, కిడ్నాప్‌కు గురైన బాధితుడితో మాట్లాడించాలని విలేకరులు కోరగా.. సీఐ భాస్కర్‌గౌడ్ అందుకు సమ్మతించ లేదు. బాధితుడిని విచారిస్తున్నామని, ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని చెప్పారు. ధర్మవరం నియోజకవర్గం, రేషన్ డీలర్షిప్, అరాచకం, Dharmavaram constituency, the ration dealers, anarchy -
చంద్రబాబుకు అభద్రత ఎందుకు?
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అభద్రతా భావం ఎందుకని రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ ప్రశ్నించారు. మీ కుర్చీకి అయిదేళ్ల వరకు ముప్పు ఏమీ లేనప్పుడు ఎందుకింత అరాచకంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబుని ఉద్దేశించి ఆయన అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రక్రియ మంచిదికాదని ఆయన సలహా ఇచ్చారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పే చంద్రబాబు ప్రతిపక్షమే లేకుండా ఉండాలన్న దురాలోనతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో ఇటువంటి దౌర్భాగ్యపరిస్థితిని చూడలేదన్నారు. అధికారం ఉందిగదా అని టిడిపి నేతలు తెగ రెచ్చిపోతున్నారన్నారు. అధికార అహంకారంతో వ్యవహరిస్తున్నారు. ప్రజలు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. కార్యకర్తలకు పోలీస్ దుస్తులు వేసి కూర్చోబెట్టండి. ఇక ఈ అయిదేళ్లు ప్రభుత్వం లేదనుకుందాం అని అన్నారు. శాసనసభాపతి నియోజకవర్గంలోనే ఇటువంటి దాడులా? అని ఆయన అడిగారు. టిడిపి నేతలు పద్దతి మార్చుకోవాలని కొణతాల సలహా ఇచ్చారు. పూర్తి మెజార్టీ ఉన్నప్పుడు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన చంద్రబాబుని ప్రశ్నించారు. In English 'Why is Chandrababu feeling insecure?'