Ancient times
-
అమెజాన్ అడువుల్లో అలనాటి పురాతన నగరాలు!
అమెజాన్ అడవి ప్రపంచంలోనే అతిపెద్ద అడవి. దక్షిణ అమెరికాలోని తొమ్మిది దేశాల పరిధిలో విస్తరించిన మహారణ్యం ఇది. కొద్ది సహస్రాబ్దాల కిందట ఇక్కడ పురాతన నాగరికతలు వర్ధిల్లేవి. ఆనాటి ప్రజలు ఇక్కడ తమ ఆవాసం కోసం కొన్ని నగరాలను నిర్మించుకున్నారు. దట్టమైన అడవిలో ఇన్నాళ్లూ మరుగునపడిన ఆ నగరాలు ఇప్పుడిప్పుడే శాస్త్రవేత్తల చొరవతో వెలుగు చూస్తున్నాయి. ఈ ఫొటోలు ఇటీవల అమెజాన్ అడవిలో బయటపడిన ఒక పురాతన నగరానికి చెందినవి. ఈక్వడార్లోని అమెజాన్ అటవీ ప్రాంతంలో పరిశోధనలు సాగిస్తున్న శాస్త్రవేత్తలు డ్రోన్ ద్వారా తీసిన ఫొటోల్లో ఈ పురాతన నగరం బయటపడింది. ఆండెస్ పర్వతాలకు దిగువన ఉపానో లోయలో బయటపడిన ఈ నగరంలోని శిథిల అవశేషాలపై శాస్త్రవేత్తలు లేజర్ సెన్సరీ టెక్నాలజీని ఉపయోగించి పరిశోధనలు జరిపారు. ఈ నగరం పరిధిలో మట్టి, రాళ్లు ఉపయోగించి నిర్మించిన దాదాపు ఆరువేల కట్టడాలను, వ్యవసాయ క్షేత్రాలను, పంట కాలువలను, ఇళ్లు ఉండే వీథుల్లో ముగురునీటి కాలువలను, నగరంలో సంచరించడానికి వీలుగా ముప్పయి మూడు అడుగుల వెడల్పున నిర్మించుకున్న విశాలమైన రహదారులను గుర్తించారు. ఇక్కడి కట్టడాల్లో నివాస గృహాలు మాత్రమే కాకుండా, ఊరంతా ఉమ్మడిగా ఉపయోగించుకునే సమావేశ మందిరాలు, పిరమిడ్లతో కూడిన శ్మశాన వాటికలు వంటి నిర్మాణాలను గుర్తించారు. చాలా కట్టడాలు నేలకు మూడు మీటర్ల లోతున మట్టిలో కప్పెట్టుకుపోవడంతో శాస్త్రవేత్తలు తవ్వకాలను జరిపి, వాటిని పరిశీలించారు. దాదాపు రెండువేల ఏళ్ల కిందట ఈ నగరంలో పదివేల మంది నుంచి ముప్పయి వేల మంది వరకు నివాసం ఉండేవారని, ఇక్కడి ప్రజలు ఏ పరిస్థితుల్లో అంతరించిపోయి ఉంటారో తెలుసుకోవడానికి మరింత లోతుగా పరిశోధనలు సాగించాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. (చదవండి: 93 ఏళ్ల వృద్ధుడు 40 ఏళ్ల వ్యక్తిలా.. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు!) -
ఆ నటరాజ ప్రతిమ... మన ప్రతిభకు తార్కాణం: మోదీ
న్యూఢిల్లీ: జీ 20 సదస్సుకు వేదిక అయిన భారత్ మండపం వద్ద ఏర్పాటు చేసిన భారీ నటరాజ ప్రతిమ ప్రాచీన కాలం నుంచీ వస్తున్న భారతీయ కళా నైపుణ్యానికి, ప్రతిభకు నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు బుధవారం ఎక్స్లో ఆయన కామెంట్ చేశారు. అనంత విశ్వ శక్తికి సంకేతమైన నటరాజ విగ్రహం జీ 20 సదస్సు వేదిక వద్ద ప్రధాన ఆకర్షణగా నిలవనుందన్నారు. అష్ట ధాతుమయమైన 27 అడుగుల ఎత్తు, 18 వేల కిలోల ఎత్తుతో నటరాజ ప్రతిమ అందరినీ ఆకట్టుకుంటోంది. దీన్ని తమిళనాడుకు చెందిన ప్రఖ్యాత శిల్పి రాధాకృష్ణన్ బృందం రికార్డు స్థాయిలో కేవలం 7 నెలల్లో రూపొందించింది. ఆయన కుటుంబీకులు చోళుల హయాం నుంచీ, అంటే ఏకంగా 34 తరాలుగా శిల్పులుగా ఉంటూ వస్తున్నారు. -
ఆ పురాతన గోడ ధర వింటే..కళ్లు బైర్లు కమ్మడం ఖాయం!
పురాతన వస్తువులను వేలం పాటల్లో అత్యధిక ధరలకు కొనుగోలు చేయడం మామూలే ! కానీ, ఒక సాధారణమైన గోడ అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయి వార్తలకెక్కింది. వాషింగ్టన్ డీసీలోని ఈ గోడ యజమాని పేరు అలెన్ బర్గ్. ఒకసారి ఈ గోడ పక్కన ఉన్న ఇంటికి నీరు లీక్ అవుతున్నట్లు ఆ ఇంటి యజమాని గమనించాడు. దక్షిణంవైపు గోడకు సరైన నిర్వహణ లేకపోవడం వల్ల దూలాలు తడిసి శిథిలావస్థకు చేరుకున్నాయని ఇంజినీర్ చెప్పడంతో, ఆ యజమాని అలెన్ను తన గోడ భాగాన్ని సరిచేయాలని కోరాడు. అతడు అందుకు నిరాకరించడమే కాకుండా, ఆ యజమానితో గొడవ పడ్డాడు. గొడవ పెద్దది కావడంతో ఆ ఇంటి యజమాని సమస్య పరిష్కారం కోసం కోర్టును ఆశ్రయించాడు. కోర్టు అలెన్కు కోటిన్నర రూపాయలు జరిమానా విధించింది. దీంతో ఇప్పుడు అలెన్ తనకున్న ఆ ఒక్క ఆస్తి, ఈ గోడను రూ.నలభై లక్షలకు అమ్మకానికి పెట్టాడు. దాదాపు నాలుగేళ్ల పాటు ఎవరూ కొనక పోవడంతో, తన ఇంటిని కాపాడుకోవడం కోసం ఆ పొరుగింటి యజమానే దీనిని కొన్నాడు. ఏది ఏమైనా ఆలెన్కు వాళ్ల తాత ఇచ్చిన ఆ ఒక్క గోడ అతన్ని కోటీశ్వరుడుని చేసింది. (చదవండి: అతిపెద్ద పిల్లి..అచ్చం మనిషిలా..) -
ప్రపంచంలోని వింతైన, అద్భుతాలను చూశారా?
-
విశ్వవినాయకుడు
విఘ్నాలను తొలగించే వినాయకుడిని ఆరాధించే ఆచారం అనాదిగా వస్తోంది. లంబోదరుడిగా, హేరంబుడిగా, గజాననుడిగా, ఏకదంతుడిగా, గణాధిపతిగా, మూషికవాహనుడిగా, మోదకప్రియుడిగా వినాయకుడిని పూజిస్తూ ఉంటారు. ఏ పూజలోనైనా, ఏ వ్రతంలోనైనా, క్రతువులోనైనా, యజ్ఞయాగాదికాలలోనైనా తొలిపూజలు అందుకునేది వినాయకుడే! ముక్కోటి దేవతలలో వినాయకుడికి మాత్రమే దక్కే అరుదైన గౌరవం ఇది. బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం గణపతి గాథలను విపులంగా ప్రస్తావించాయి. ప్రాచీన గ్రంథాలను పరిశీలిస్తే, రుగ్వేదంలో గణపతి గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. ఇది క్రీస్తుపూర్వం రెండువేల సంవత్సరాల నాటిదని చరిత్రకారుల అంచనా. మన దేశంలో గుప్తుల కాలం నాటికి... అంటే, క్రీస్తుశకం నాలుగు, ఐదో శతాబ్దాల నాటికి వినాయకుడి ఆరాధన ప్రాచుర్యంలోకి వచ్చింది. క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్ది నాటికి ప్రత్యేకంగా గాణపత్య మతమే ఏర్పడింది. షణ్మతాలలో ఒకటిగా పేరుపొందింది. మన దేశంలో శైవ, వైష్ణవ, సౌర, శాక్తేయ, గాణపత్య, కౌమార మతాలు ఉండేవి. గాణపత్య మతస్థులు గణపతిని ప్రత్యేకంగా ఆరాధించేవారు. అయితే ఇతర మతాలలోనూ వినాయకుడిని ఆరాధించే సంప్రదాయం ఉంది. బౌద్ధ, జైన మతస్థులు కూడా గణపతిని ఆరాధించేవారు. గణపతి ఆరాధాన మన దేశానికి మాత్రమే పరిమితం కాదు, నేపాల్, భూటాన్, టిబెట్, చైనా, కంబోడియా, జపాన్, ఇండోనేసియా, సింగపూర్ వంటి దేశాలలోనూ ప్రాచీనకాలం నుంచే గణపతి ఆరాధన ఉండేది. పలు దేశాల్లో గణపతి ఆరాధన ఇప్పటికీ కొనసాగుతోంది. విదేశాలలో వినాయకుడు మన దేశానికి చెందిన వర్తకులు ప్రాచీన కాలంలోనే వివిధ దేశాలతో నౌకా వాణిజ్యం సాగించేవారు. వారి ద్వారా అప్పట్లోనే వినాయకుడు విదేశాలకూ వ్యాపించాడు. క్రీస్తుశకం పదో శతాబ్ది కాలంలో మన వర్తకులు దక్షిణాసియా ప్రాంతంలోని పలు దేశాలతో వర్తక వాణిజ్యాలు సాగించేవారు. జావా, బాలి, బోర్నియో, బర్మా, కంబోడియా, జపాన్, థాయ్లాండ్, టిబెట్, చైనా, సింగపూర్ వంటి తూర్పు, ఆగ్నేయాసియా దేశాలలో పురాతన కాలం నాటి గణపతి విగ్రహాలు ఇప్పటికీ దర్శనమిస్తాయి. ఇండోనేసియా కరెన్సీ నోటుపై కూడా గణపతి బొమ్మ కనిపిస్తుంది. మన దేశంపై ముస్లిం దండయాత్రలకు మునుపు అఫ్ఘానిస్థాన్ ప్రాంతంలో సైతం గణపతి ఆరాధన ఉండేది. బౌద్ధ, జైనాలలో వినాయకుడు గణపతి ఆరాధన హిందూమతానికి మాత్రమే పరిమితం కాలేదు. జైన, బౌద్ధమతాలు కూడా తమదైన రీతిలో గణపతిని ఆరాధించుకుంటాయి. జైనమతం కుబేరుడికి చెందిన కొన్ని కీలకమైన విధులను గణపతికి కేటాయించింది. ‘అభిదానచింతామణి’ అనే జైనగ్రంథంలో వినాయకుడి ప్రస్తావన కనిపిస్తుంది. ఆ గ్రంథం వినాయకుడిని హేరంబుడిగా, గణవిఘ్నేశుడిగా, వినాయకుడిగా ప్రస్తుతించింది. గుప్తుల కాలంలో బౌద్ధులు కూడా వినాయకుడిని ఆరాధించడం మొదలైనట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. తాంత్రిక బౌద్ధంలో మహారక్త గణపతిని పూజించేవారు. షడ్భుజాలు గల మహాకాలుడి రూపంలో బౌద్ధ తాంత్రికులు మహారక్త గణపతిని ఆరాధించేవారు. చైనా, జపాన్ ప్రాంతాల్లో బౌద్ధులు క్రీస్తుశకం ఏడు, ఎనిమిది శతాబ్దాల కాలంలోనే వినాయకుడిని ఆరాధించేవారు. ఇక ‘గణపతి పురాణం’ ప్రకారం బుద్ధుడిని గణపతి అవతారంగానే భావిస్తారు. గణేశ సహస్రనామాల ప్రకారం బుద్ధుడు సాక్షాత్తు గణపతి అవతారమేనని పదిహేడో శతాబ్దికి చెందిన పండితుడు భాస్కరరాయలు అభిప్రాయపడ్డారు. థాయ్లాండ్, కంబోడియా వంటి దేశాలలో వినాయకుడిని విజయానికి, అదృష్టానికి కారకుడిగా ఆరాధిస్తారు. వినాయకుడు బుద్ధిబలాన్ని అనుగ్రహించడమే కాకుండా, అదృష్టాన్ని కలిగిస్తాడని పలు దేశాలలో నమ్ముతారు. వినాయకుడు..వాహనాలు అత్యంత పురాతన కాలంలో వినాయకుడి విగ్రహాలు ఎలాంటి వాహనం లేకుండానే కనిపించేవి. వినాయకుడు మూషిక వాహనుడిగా ప్రసిద్ధి పొందినా, పలు ప్రాచీన విగ్రహాలలో వినాయకుడు వేర్వేరు వాహనాలపై కనిపిస్తాడు. వినాయకుడికి ఎనిమిది అవతారాలు ఉన్నట్లు ‘ముద్గల పురాణం’ వివరిస్తుంది. వాటిలోని ఐదు అవతారాలలో వినాయకుడు మూషికాన్నే వాహనంగా చేసుకున్నట్లు ఉంది. అయితే, మహోత్కటావతారంలో సింహాన్ని, మయూరేశ్వరావతారంలో నెమలిని, ధూమకేతు అవతారంలో అశ్వాన్ని వాహనంగా ఉపయోగించినట్లు ‘ముద్గల పురాణం’ చెబుతోంది. గణపతిని విఘ్నేశ్వరుడిగా పురాణాలు ప్రస్తుతించాయి. వినాయకుడు ఐహిక, ఆముష్మిక విఘ్నాలన్నింటినీ దూరం చేస్తాడని ప్రతీతి. విద్యలకు కూడా అధిపతి అయిన వినాయకుడు బుద్ధిని అనుగ్రహిస్తాడని ప్రతీతి.