Andala chandamama
-
సీబీఐ వలలో ’సెన్సార్’ చేప
-
అన్యాయాన్ని ఎలా ఎదుర్కొంది?
ఓ మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని ఎలా ఎదుర్కొంది? తనకు ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించుకుంది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘అందాల చందమామ’. మధులగ్న దాస్, ఐశ్వర్య, రమన్లాల్ ముఖ్యతారలుగా పీడిఆర్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి కేఎస్. మూర్తి దర్శకుడు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘లేడీ ఓరియెంటడ్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: టి. రమేశ్, సంగీతం: వై. సునీల్. -
వినూత్న కథాంశంతో...
మధులగ్నదాస్, ఐశ్వర్య, సూర్యతేజ, రమణలాల్ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘అందాల చందమామ’. కేయస్ మూర్తి దర్శకత్వంలో పీడీఆర్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి వై. సునీల్ పాటలు స్వరపరిచారు. ఆడియో సీడీని చిన్ని చరణ్, ప్రచార చిత్రాన్ని మల్టీడైమన్షన్ వాసు ఆవిష్కరించారు. ఇది థ్రిల్లర్ మూవీ అనీ, సునీల్ స్వరపరచిన పాటలు హైలైట్గా నిలుస్తాయనీ దర్శకుడు తెలిపారు. ఓ వినూత్న కథాంశంతో రూపొందించిన ఈ చిత్రంలో అన్ని వర్గాలవారినీ ఆకటుకునే అంశాలున్నాయని నిర్మాత చెప్పారు.