మాకెందుకీ శాపం
అబ్బాయిలను పోలిన మాట, ముఖం అనుభవిస్తోంది అమ్మాయి జీవితం
పూర్తిస్థారుులో అమ్మాయిలుగా మార్చే చికిత్సకు రూ.6లక్షలు
మందులకూ ఖర్చుచేయలేని దైన్యం
టీబీతో మంచం పట్టిన తండ్రి
కూలీకి వెళ్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తల్లి
పరకాల : ముఖ లక్షణాలు, మాటలు వింటే వారిద్దరిని మగపిల్లలనే అందరూ అనుకుంటారు. కానీ సమాజంలో అనుభవించేది మాత్రం ఆడపిల్లల జీవితం. వారు అటు ఆడ ఇటు మగ లక్షణాలు పూర్తిస్థాయిలో లేకుండా జన్మించారు. వారిద్దరి వేదనను చూస్తూ నిత్యం తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. ఈ చిన్నారుల అవస్థలు చూసిన ప్రతి ఒక్కరూ అయ్యో అనక తప్పని పరిస్థితి. పిల్లలను పూర్తిస్థాయిలో అమ్మాయిలుగా మార్చడానికి చికిత్స చేయించడానికి రూ.6 లక్షలు కావాలి. నెలనెలా మందుల కోసం రూ.3వేలు కూడా లేని దీనస్థితిలో ఆ తల్లిదండ్రులు.. దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
పరకాల మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన జన్నాజి రఘుణాచారి-రాజనీల దంపతులకు అంజలి(11), రవళి(8) ఇద్దరు కూతుళ్లు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో అంజలి ఆరో తరగతి చదువుతుండగా.. రవళి నాలుగో తరగతి చదువుతున్నది. రఘుణాచారి కులవృత్తి కమ్మరి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా కొద్దికాలంగా టీబీ కారణంగా మంచానికే పరిమితమయ్యూరు. ప్రభుత్వం నుంచి మందులు సరిగ్గా అందకపోవడంతో రోజురోజుకు ఆరోగ్యం క్షీణిస్తోంది.
ఇక చారి దంపతులకు మొదటి, రెండో సంతానంగా కుమారులే జన్మించినా వివిధ కారణాలతో మృతి చెందారు. ఆ తర్వాత అంజలి, రవళి జన్మించగా.. చిన్నతనంలో అబ్బారుులుగా భావించినప్పటికీ మర్మాంగాలు లేవని గుర్తించిన తల్లిదండ్రులు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. హన్మకొండలోని వివిధ ఆస్పత్రుల్లో చూపించిన వారు చివరకు హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రిలో చూపించారు. అక్కడ వైద్యులు పరీక్షించి పిల్లలకు ఎక్కువగా ఆడ లక్షణాలే ఉన్నందున శస్త్రచికిత్స చేస్తే ఆడవారిగా మారిపోతారని చెప్పారు. అయితే, శస్త్రచికిత్సకు రూ.3లక్షలు వెచ్చించాల్సి వస్తుందని చెప్పడంతో అప్పటి నుంచి చారి దంపతులు డబ్బుల కోసం నానా తంటాలు పడుతున్నారు. పొద్దంతా పని చేస్తేనే రెండు పూటల తినడమే కష్టంగా ఉన్న ఆ పేద కుటుంబానికి ఈ డబ్బు వెచ్చించడం అంతు లేని సమస్యగా పరిణమించింది.
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు
అంజలి, రవళి శస్త్రచికిత్స కోసం డబ్బు లేకపోగా.. నెలనెలా మందుల కోసం రూ.3వేల చొప్పున వెచ్చించాల్సి వస్తోంది. ఓ పూట తిండి పెట్టకున్నా పర్వాలేదు కానీ మందులు మాత్రం తప్పక వాడాలన్న వైద్యుల సూచనతో నెలకు రూ.3వేలు వెచ్చించేందుకు రఘుణాచారి దంపతులు నానా తిప్పలు పడుతున్నారు. అటు చారితో పాటు ఆయన భార్య రాజనీల కూలికి వెళ్తూ వచ్చే డబ్బుతో మందులు కొనుగోలు చేస్తున్నారు. ఆ దంపతులకు వ్యవసాయ భూమి లేకపోగా కనీసం ఉండేందుకు ఇల్లు కూడా సరిగ్గా లేని దుస్థితి. ఈ మేరకు అటు ప్రభుత్వంతో పాటు ఇటు దాతలు తమకు చేయూతనివ్వాలని రఘుణాచారి దంపతులు చేతులు జోడించి కోరుతున్నారు.
సాయం చేయాలనుకుంటే...
అంజలి, రవళి చికిత్స కోసం ఆర్థిక సాయం చేయూలనుకునే వారు 96182 95958, 98482 32520 నంబర్ల లో సంద్రిం చొచ్చు. లేదంటే ఆంధ్రాబ్యాంకు పరకాల బ్రాంచి లోని ఏడీబీ ఏ/సీ 138510100060498 ఖాతాలో జమ చేయాలని చేయొచ్చు.