Anshul Kamboj
-
భారత క్రికెట్లో సంచలనం.. ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు! 39 ఏళ్ల తర్వాత
రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో హర్యానా పేసర్ అన్షుల్ కాంబోజ్ చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో భాగంగా రోహ్తక్ వేదికగా కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కాంబోజ్ 10 వికెట్లతో చెలరేగాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 30.1 ఓవర్లు బౌలింగ్ చేసిన కాంబోజ్.. 49 పరుగులిచ్చి మొత్తం 10 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.తొలి రోజు ఆటలో రెండు వికెట్లు పడగొట్టిన అన్షుల్.. రెండో రోజులో మిగితా 8 వికెట్లను నేలకూల్చాడు. తద్వారా రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో మొత్తం వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా అన్షుల్ రికార్డులకెక్కాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో కాంబోజ్ కంటే ముందు బెంగాల్ దిగ్గజం ప్రేమాంగ్షు ఛటర్జీ, రాజస్థాన్ మాజీ ప్లేయర్ ప్రదీప్ సుందరం ఉన్నారు. 1956-57 సీజన్లో అస్సాంపై ప్రేమాంగ్షు ఛటర్జీ ఈ ఫీట్ సాధించగా.. 1985-86 సీజన్లో విదర్భపై ప్రదీప్ సుందరం 10 వికెట్లు పడగొట్టాడు. మళ్లీ ఇప్పుడు 39 సంవత్సరాల తర్వాత అన్షుల్ కాంబోజ్ ఈ ఎలైట్ జాబితాలో చేరాడు. కాంబోజ్ బౌలింగ్ మ్యాజిక్ ఫలితంగా కేరళ తమ తొలి ఇన్నింగ్స్‌లో 291 పరుగులకు ఆలౌటైంది. ఇప్పటివరకు 19 ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన కాంబోజ్.. 57 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అదేవిధంగా కాంబోజ్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు కూడా ప్రాతినిథ్యం వహించాడు.ఎవరీ అన్షుల్ కాంబోజ్..?23 ఏళ్ల అన్షుల్ కాంబోజ్ హర్యానా తరపున 2022 రంజీ సీజన్లో త్రిపురాపై ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేశాడు. కాంబోజ్‌కు అద్బుతమైన ఫాస్ట్ బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఇప్పటివరకు 19 ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన కాంబోజ్.. 57 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.కాంబోజ్ ఐపీఎల్లో కూడా ఆడాడు. దేశీవాళీ టోర్నీల్లో సంచలన ప్రదర్శన కనబరుస్తుండడంతో ఐపీఎల్-2024 మినీ వేలంలో ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. అయితే ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు అతడిని ముంబై రిటైన్ చేసుకోలేదు. ఈ నెల 24, 25 తేదీల్లో జెడ్డా వేదికగా జరగనున్న మెగా వేలంలో ఈ హర్యానా పేసర్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశముంది.చదవండి: IND Vs AUS: 'కింగ్ తన రాజ్యానికి తిరిగొచ్చాడు'.. ఆసీస్‌ను హెచ్చరించిన రవిశాస్త్రి -
Asia Cup: పాక్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన భారత్.. తుదిజట్లు ఇవే
ఏసీసీ మెన్స్ టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్-2024లో భాగంగా భారత్- ‘ఎ’ జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్-‘ఎ’తో తలపడుతోంది. దాయాదుల మధ్య పోరుకు ఒమన్‌లోని అల్ అమెరట్ స్టేడియం వేదికగా నిలిచింది. భారతకాలమానం ప్రకారం శనివారం రాత్రి ఏడు గంటలకు మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత యువ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.అభిషేక్ జోడీగా ప్రభ్సిమ్రన్సింగ్ఇక పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆడే భారత తుదిజట్టులో టీమిండియా టీ20 నయా ఓపెనర్ అభిషేక్ శర్మ చోటు దక్కించుకున్నాడు. వికెట్ కీపర్ ప్రభ్సిమ్రన్సింగ్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. కాగా ఒమన్‌లో జరుగుతున్న ఈ ఆసియా టీ20 టోర్నీలో బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ జట్లు ఇప్పటికే శుభారంభం చేశాయి.అంచనాలు రెట్టింపుహాంకాంగ్పై బంగ్లా యువ జట్టు 5 వికెట్లు, శ్రీలంక-ఎ జట్టుపై అఫ్గన్ జట్టు 11 పరుగుల తేడాతో విజయం సాధించాయి. మరోవైపు.. మూడో మ్యాచ్‌లో భాగంగా యూఏఈతో తలపడ్డ ఆతిథ్య ఒమన్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ టోర్నీలో నాలుగో మ్యాచ్‌లో భారత్- పాక్ తలపడటం.. అందులోనూ టీమిండియా స్టార్లు తిలక్ వర్మ(కెప్టెన్‌గా), అభిషేక్ శర్మ ఈ జట్టులో ఉండటంతో అంచనాలు రెట్టింపయ్యాయి.భారత్- ‘ఎ’ వర్సెస్ పాకిస్తాన్- ‘ఎ’ తుదిజట్లుయువ భారత తుదిజట్టుఅభిషేక్ శర్మ, ప్రభ్ సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), రమణ్‌దీప్ సింగ్, అన్షుల్ కాంబోజ్, తిలక్ వర్మ(కెప్టెన్), ఆయుష్ బదోని, నేహాల్ వధేరా, నిశాంత్ సింధు, రాహుల్ చాహర్, రసిక్ దార్ సలామ్, వైభవ్ అరోరా.పాక్ యువ జట్టుహైదర్ అలీ, మహ్మద్ హారిస్(కెప్టెన్), యాసిర్ ఖాన్, ఒమైర్ యూసుఫ్, ఖాసీం అక్రమ్, అబ్దుల్ సమద్, అరాఫత్ మిన్హాస్, అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ ఇమ్రాన్, జమాన్ ఖాన్, సూఫియాన్ ముకీమ్.చదవండి: Rohit- Kohli: అంపైర్లతో గొడవ.. రోహిత్ ఆగ్రహం.. కోహ్లి ఆన్ ఫైర్! -
అన్షుల్ కాంబోజ్ సరికొత్త చరిత్ర.. అగ్రస్థానంలోకి ‘సి’ జట్టు
దులిప్ ట్రోఫీ-2024 సందర్భంగా ఇండియా-‘సి’ బౌలర్ అన్షుల్ కాంబోజ్ చరిత్ర సృష్టించాడు. ఈ రెడ్‌బాల్ టోర్నీ చరిత్రలో రెండో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేసిన పేసర్‌గా నిలిచాడు. ఇండియా-‘బి’తో మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఇంతకు ముందు దేబాశీష్ మొహంతి (10/46) ఈ టోర్నమెంట్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేశాడు. కాగా దులీప్ ట్రోఫీ తాజా ఎడిషన్.. తొలి రెండు రౌండ్లలో కలిపి జరిగిన నాలుగు మ్యాచ్‌లలో మూడింటిలో ఫలితం తేలగా మరో మ్యాచ్ మాత్రం పేలవమైన ‘డ్రా’గా ముగిసింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అనంతపురం వేదికగా ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో ఇండియా-‘బి’, ఇండియా-‘సి’ జట్లు సమంగా నిలిచాయి. ఆట నాలుగో రోజు ఉదయం వరకు కూడా ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్ పూర్తి కాకపోవడంతో ఫలితానికి అవకాశం లేకుండా పోయింది. ఓవర్‌నైట్ స్కోరు 309/7తో ఆట కొనసాగించిన ‘బి’ తమ తొలి ఇన్నింగ్స్‌లో 332 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అన్షుల్ కాంబోజ్ (8/69) ప్రత్యర్థిని పడగొట్టాడు.అనంతరం మ్యాచ్ ముగిసే సమయానికి ‘సి’ తమ రెండో ఇన్నింగ్స్‌ను 37 ఓవర్లలో 4 వికెట్లకు 128 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ దశలో ఇరు జట్ల కెప్టెన్లు ‘డ్రా’కు అంగీకరించారు. మొదటి ఇన్నింగ్స్‌లో 193 పరుగుల ఆధిక్యం సాధించిన ‘సి’ టీమ్‌కు 3 పాయింట్లు, ‘బి’ టీమ్‌కు 1 పాయింట్ లభించాయి. ఇక ఈ మ్యాచ్ తర్వాత ఓవరాల్‌గా తొమ్మిది పాయింట్లతో ఇండియా-‘సి’ ప్రస్తుతం పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అర్ధ శతకంతో మెరిసిన రుతురాజ్ఆదివారం భారత్ ‘బి’ తొలి ఇన్నింగ్స్ ముగిసేందుకు 7 ఓవర్లు సరిపోయాయి. తమ స్కోరుకు మరో 23 పరుగులు జోడించి జట్టు మిగిలిన 3 వికెట్లు కోల్పోయింది. ఈ మూడూ పేస్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ ఖాతాలోకే వెళ్లగా... కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (286 బంతుల్లో 157 నాటౌట్; 14 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత ఏకంగా 193 పరుగుల ఆధిక్యం ఉండి కాస్త దూకుడుగా ఆడి విజయం కోసం సవాల్ విసిరే స్థితిలో ఉన్న ‘సి’ టీమ్ అలాంటి ప్రయత్నం ఏమీ చేయలేదు. సాయి సుదర్శన్ (11) విఫలం కాగా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (93 బంతుల్లో 62; 8 ఫోర్లు, 1 సిక్స్) రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ధ సెంచరీ చేశాడు. రుతురాజ్, రజత్ పటిదార్ (84 బంతుల్లో 42; 5 ఫోర్లు) రెండో వికెట్‌కు 96 పరుగులు జత చేశారు.ఇండియా-‘బి’ వర్సెస్ ఇండియా-‘సి’ స్కోర్లుఇండియా-‘బి’- 332 ఇండియా-‘సి’- 525 & 128/4 డిక్లేర్డ్ఫలితం తేలకుండానే ముగిసిన మ్యాచ్రెండో రౌండ్ ముగిసిన దులిప్ ట్రోఫీ-2024 పాయింట్ల పట్టిక ఇలా..👉ఇండియా- ‘సి’- 2(ఆడినవి)- గెలిచినవి(1)- డ్రా(1)- ఓడినవి(0)- పాయింట్లు 9👉ఇండియా- ‘బి’- 2(ఆడినవి)- గెలిచినవి(1)- డ్రా(1)- ఓడినవి(0)- పాయింట్లు 7👉ఇండియా- ‘ఎ’- 2(ఆడినవి)- గెలిచినవి(1)- డ్రా(0)-ఓడినవి(1)- పాయింట్లు 7👉ఇండియా- ‘డి’- 2(ఆడినవి)- గెలిచినవి(0)- డ్రా(0)- ఓడినవి(2)- పాయింట్లు 0.చదవండి: మూడు వందల వికెట్ల క్లబ్‌కు చేరువలో కుల్దీప్