'స్పీకర్ ప్రతిపక్షాన్ని ఆదరించాల్సిందే'
ప్రతిపక్షం లేకుండా చట్టసభను నిర్వహించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలను పరోక్షంగా ప్రస్తావించిన ఆయన.. స్పీకర్ దృష్టి ఎల్లప్పుడూ ప్రతిపక్షం వైపే ఉండాలని, వారు లేవనెత్తే సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఉదయం రాజేంద్రనగర్లోని పోలింగ్ కేంద్రంలో స్వామిగౌడ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీ శాసన సభలో అధికార పక్షంవారే ప్రశ్నించి, మళ్లీ అధికార పక్షం వారే సమాధానాలు చెప్పడం వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరగదని ఆయన వ్యాఖ్యానించారు.