aplastic anemia
-
పిల్లాడి పెద్దమనసు..మేక్ ఎ విష్
భరించలేని బాధ, కష్టం కలిగినప్పుడు చుట్టపక్కల ఏం జరుగుతున్నా పట్టించుకోము. ఆ పరిస్థితిని అర్థం చేసుకుని, బయటపడే ఆలోచనల్లో మునిగిపోతాం. అటువంటిది ఓ చిన్నపిల్లాడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ, ఎన్నాళ్లు జీవించి ఉంటాడో తెలియనప్పటికీ ... కూడు, గూడు లేనివాళ్ల ఆకలి తీర్చండి అని చెబుతూ, నిరాశ్రయుల ఆకలి తీరుస్తున్నాడు. అమెరికాలోని మిస్సిసీపికి చెందిన పదమూడేళ్ల అబ్రహం ఒలెబెగికి గతేడాది ‘అప్లాస్టిక్ ఎనీమియా’ ఉన్నట్టు తెలిసింది. అరుదైన అప్లాస్టిక్ ఎనీమియా కారణంగా..శరీరంలో సరిపడినంతగా కొత్త రక్తకణాలు ఉత్పత్తి కావు. దీని వల్ల క్రమంగా ఆరోగ్యం క్షీణించి ప్రాణాంతకంగా మారుతుంది. ఈ విషయం తెలిసినప్పుడు అబ్రహం ఏ మాత్రం భయపడలేదు. రెగ్యులర్‌గా డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స తీసుకుంటున్నాడు. ఇటువంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతోన్న పిల్లల కోరికలను తీర్చే ‘మేక్ ఏ విష్’ ఫౌండేషన్ అబ్రహం గురించి తెలిసి అతని విష్ను తీర్చేందుకు సంప్రదించింది. అందరు పిల్లలు కోరుకున్నట్లే తన జీవిత లక్ష్యాన్ని కోరుకుంటాడని ఫౌండేషన్ అనుకుంది. కానీ అందరికంటే భిన్నంగా ‘‘ఇల్లు లేని వారికి ఏడాది పాటు ఆకలి తీర్చండి, అదే నా మేక్ ఏ విష్’’ అని కోరాడు. అబ్రహం కోరిక నచ్చిన మేక్ ఏ విష్ అతని కోరిక మన్నించడంతోపాటు, మరికొన్ని బహుమతులు కూడా ఇచ్చింది. పౌండేషన్ సాయంతో గూడులేని నిరాశ్రయులకు ఆహారం అందించి, ఆకలి తీరుస్తున్నాడు అబ్రహాం. తన తల్లితో కలిసి వందమంది ఆకలిని తీర్చాడు. అబ్రహం పెట్టే ఫుడ్ తిన్న వారంతా థ్యాంక్స్ బాబు అంటూ అబ్రహంకు కృతజ్ఞతలు చెబుతూ ..ఆయుష్షు పెరగాలని దీవిస్తున్నారు. ఈ కార్యక్రమం ఫౌండేషన్ సాయంతో 2022 ఆగస్టు వరకు కొనసాగనుంది. అబ్రహం టేబుల్.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటూనే..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం అబ్రహం ఎదురుచూస్తున్నాడు. ఎవరైనా దాత దొరికితే అతని సమస్య దాదాపు తీరుతుంది. ఫౌండేషన్ సాయంతో నిరాశ్రయుల ఆకలి తీరుస్తూ ఎంతో సంతోషంగా ఉన్న అబ్రహం భవిష్యత్‌లో ‘‘అబ్రహం టేబుల్’’ పేరు మీద ఓ ఎన్జీవోని ప్రారంభించి ఈ సేవలను మరింతగా విస్తరించాలనుకుంటున్నాడు. ఈ విషయం తెలిసిన ప్రపంచ వ్యాప్త నెటిజన్లు అబ్రహంను మెచ్చుకోవడమేగాక, అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. -
సాక్షి కథనానికి విశేష స్పందన
-
సరస్వతీ పుత్రుడికి ‘రక్త’ పరీక్ష
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): సాఫీగా సాగిపోతున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా పెద్ద కుదుపు. పిల్లలను మంచిగా చదివించాలని పట్టుదలతో శ్రమిస్తున్న ఆ తల్లిదండ్రులకు తీరని కష్టం. ఉద్యోగం కోల్పోయినా కుల వృత్తి చేసుకుంటూ అతడు, కూలీ పనికి వెళ్తూ ఆమె కుటుంబాన్ని పోషిస్తున్నారు. కష్టపడి పిల్లలను చదివిస్తున్నారు. తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా కొడుకు సరస్వతీ పుత్రుడు. చదువులో రాణిస్తూ పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ సరస్వతీ పుత్రుడికి విధి ‘రక్త’ పరీక్ష పెట్టింది. కొడుకు ప్రాణాలకు ముప్పుండడంతో తల్లిదండ్రులు చికిత్స కోసం సర్వం ధారపోశారు. అయినా సరిపోకపోవడంతో దాతల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ కుటుంబ దీనగాథ ఇదీ... ప్రకాశం జిల్లా కారంచేడుకు చెందిన జరుగుమల్లి రంగయ్య, అంజన దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొడుకు రాజేశ్బాబును విజయవాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చేర్పించారు. తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా రాజేశ్ ఇంటర్ ఫస్టియర్‌లో అత్యధిక మార్కులు సాధించి టాపర్‌గా నిలిచాడు. ఇంతలో ఊహించని విధంగా రాజేశ్ అనారోగ్యానికి గురయ్యాడు. స్థానిక ఆస్పత్రుల చుట్టూ తిప్పినా జబ్బును కనిపెట్టలేకపోయారు. చివరకు నిమ్స్‌కు తీసుకురగా, అతడికి ‘అప్లాస్టిక్ అనీమియా’ ఉందని డాక్టర్లు నిర్ధారించారు. చికిత్సకు రూ.25 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలపడంతో రంగయ్య హతాశుడయ్యాడు. క్షౌ రవృత్తి చేసుకుంటూ సంసారాన్ని నెట్టుకొస్తున్న అతడు వైద్య పరీక్షల కోసమే రూ.8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. తనకున్న కొద్దిపాటి పొలం, బంగారం అమ్మేసి కొడుక్కి వైద్యం చేయించాడు. డబ్బులు సరిపోకపోవడంతో దొరికిన చోటల్లా అప్పులు చేశాడు. మొత్తం ఇప్పటివరకు రూ.12 లక్షల వరకు ఖర్చుచేశారు. ఎన్ని మందులు వాడినా వ్యాధి నయం కాకపోవడంతో మూల కణాల మార్పిడి (స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్) చేయాలని నిమ్స్ వైద్యులు నిర్ణయించారు. వంద శాతం మూల కణాలు సరిపోలిన వ్యక్తి నుంచి రాజేశ్‌కు స్టెమ్ సెల్స్ ఎక్కిస్తే అతడికి వ్యాధి నయమవుతుందని నిమ్స్ హెమటాలజీ నిపుణురాలు డాక్టర్ రాధిక చెప్పారు. ధాత్రి ఫౌండేషన్ ద్వారా మూలకణ దాత దొరికాడు. చికిత్సకు మొత్తం రూ.25 లక్షలు ఖర్చవుతుంది. అయితే ఈ చికిత్స అందించే నిపుణులు అందుబాటులో లేకపోవడంతో వేలూరు(తమిళనాడు)లోని సీఎంసీకి సిఫార్స్ చేశారు. నిమ్స్ వైద్యుల సహాయంతో సీఎంసీలో అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఏం చేయాలో తెలియక తండ్రి రంగయ్య సతమతమవుతున్నాడు. మరోవైపు కుమారుడి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండటంతో ఆందోళన చెందుతున్నాడు. దాతలు స్పందించి ఆర్థిక సాయం అందించాలని వేడుకుంటున్నాడు. సహాయం చేయాలనుకునేవారు 92473 56545 నంబర్లో రంగయ్యతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకోవచ్చు. బ్యాంకు వివరాలు.. పేరు: జరుగుమల్లి రంగయ్య ఆంధ్రాబ్యాంక్, కారంచేడు బ్రాంచ్ అకౌంట్ నంబర్: 033210100033069 ఐఎఫ్ఎస్సీ కోడ్: ఏఎన్‌డీబీ 0000332 అప్లాస్టిక్ అనీమియా అంటే? మన శరీరంలో తగినన్ని కొత్త రక్త కణాలు తయారు కాకపోవడాన్ని అప్లాస్టిక్ అనీమియాగా పేర్కొంటారు. దీని బారినపడితే తరచూ ఆయాసం వస్తుంది. ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉంటాయి. రక్తస్రావం అధికంగా ఉంటుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. చర్మం పాలిపోయి స్కిన్‌పై రాషెష్ వస్తాయి. కళ్లు తిరగటం, తలపోటు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి ముక్కు, చిగుళ్ల నుంచి కూడా రక్తం రావొచ్చు. వ్యాధి ముదిరిన వారికి మూలకణ మార్పిడి చేయాల్సిందే. ఇది చాలా సుదీర్ఘమైన, క్లిష్టమైన చికిత్స. తేడా వస్తే ప్రాణాలే పోవచ్చు. -
లైఫ్‌లైన్: మాయదారి జబ్బు
-
పాపకు ప్రాణదానం చేయరూ
కొత్తపేట, న్యూస్‌లైన్: అల్లారుముద్దుగా పెరుగుతున్న ఆ చిన్నారిపై విధి పగ పట్టిందో ఏమో! ఆడుతూ పాడుతూ గడపాల్సిన ఆ పాపను అప్లాస్టిక్ ఎనీమియా అనే అరుదైన వ్యాధి పట్టిపీడిస్తోంది. కంటి వెలుగుగా తిరుగాడుతున్న కూతురు ఆస్పత్రి పాలై.. బాధ పడుతుండడం చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. రెక్కాడితేగాని డొక్కాడని పేద కుటుంబమైనా బిడ్డ ప్రాణాలను కాపాడుకోవాలని చేయని ప్రయత్నం లేదు. మరో శస్త్రచికిత్స చేయిస్తే బిడ్డకు నయమవుతుందని డాక్టర్లు చెప్పడంతో దాతల సాయాన్ని అర్థిస్తున్నారు. బరువు పెరిగి.. ఆహారం ఒంటబట్టక.. తరచూ వచ్చే జ్వరంతో బాధపడుతున్న ఆ చిన్నారి ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కొత్తపేట మండలం వాడపాలెంకు చెందిన శ్రీకూర్మం సత్యనారాయణ బట్టల దుకాణంలో రోజు కూలీగా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె విజయదుర్గకు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన తాపీమేస్త్రి పెరంబదూరి దుర్గాప్రసాద్‌తో వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు. దివ్య అక్షర (5), నాగవైష్ణవి (3). అక్షర వాడపాలెంలోని అమ్మమ్మ ఇంట్లో పెరుగుతోంది. కొంతకాలం క్రితం అక్షర శరీరం ఉబ్బి అనారోగ్యానికి గురైంది. ఆమెకు స్థానికంగా ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించారు. అక్కడ నయం కాకపోవడంతో నరసాపురం, భీమవరం ఆస్పత్రుల్లో వైద్యం చేయించారు. రూ.60 వేలు పైబడి ఖర్చయినా ఏమాత్రం నయం కాకపోవడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని రెయిన్బో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్షరకు సోకింది అప్లాస్టిక్ ఎనీమియా (ఎముకల్లోని మూలుగులో రక్తం తయారుకాకపోవడం) వ్యాధి అని అక్కడ నిర్థారించారు. బంధువులు, దాతలు సమకూర్చిన సుమారు రూ.4 లక్షలతో అక్కడ వైద్యం చేయించారు. అయినప్పటికీ నయం కాకపోవడంతో అక్షర సోదరి వైష్ణవి మూలుగు ఎక్కిస్తే నయమవుతుందని రెయిన్బో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆ మేరకు రూ.12 వేలు వెచ్చించి వైష్ణవికి మూలుగు పరీక్ష చేయించగా ఇద్దరి గ్రూపు కలవలేదు. దాంతో అక్షరకు సరిపోయే దాతలు ఎవరి మూలుగునైనా ఎక్కించవచ్చని, దానికి సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని, ఆ శస్త్రచికిత్సను తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేస్తారని తెలిపారు. అంత సొమ్ము వెచ్చించి వైద్యం చేయించే స్థోమత లేకపోవడంతో దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దయార్ద్ర హృదయులు సాయం చేయాల్సిందిగా తాత శ్రీ కూర్మం సత్యనారాయణ, తండ్రి పెదంబదూరి దుర్గావరప్రసాద్ కోరుతున్నారు. దాతలు పెదంబదూరి దుర్గావరప్రసాద్ ఆంధ్రాబ్యాంక్ ఎకౌంట్ నంబరు 110510100085813 కు జమచేయవచ్చని, వివరాలకు అతని సెల్ నం 9666504852ను సంప్రదించాలని శ్రీకూర్మం సత్యనారాయణ కోరారు. -
పాపకు ప్రాణదానం చేయరూ
కొత్తపేట, న్యూస్‌లైన్: అల్లారుముద్దుగా పెరుగుతున్న ఆ చిన్నారిపై విధి పగ పట్టిందో ఏమో! ఆడుతూ పాడుతూ గడపాల్సిన ఆ పాపను అప్లాస్టిక్ ఎనీమియా అనే అరుదైన వ్యాధి పట్టిపీడిస్తోంది. కంటి వెలుగుగా తిరుగాడుతున్న కూతురు ఆస్పత్రి పాలై.. బాధ పడుతుండడం చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. రెక్కాడితేగాని డొక్కాడని పేద కుటుంబమైనా బిడ్డ ప్రాణాలను కాపాడుకోవాలని చేయని ప్రయత్నం లేదు. మరో శస్త్రచికిత్స చేయిస్తే బిడ్డకు నయమవుతుందని డాక్టర్లు చెప్పడంతో దాతల సాయాన్ని అర్థిస్తున్నారు. బరువు పెరిగి.. ఆహారం ఒంటబట్టక.. తరచూ వచ్చే జ్వరంతో బాధపడుతున్న ఆ చిన్నారి ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కొత్తపేట మండలం వాడపాలెంకు చెందిన శ్రీకూర్మం సత్యనారాయణ బట్టల దుకాణంలో రోజు కూలీగా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె విజయదుర్గకు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన తాపీమేస్త్రి పెరంబదూరి దుర్గాప్రసాద్‌తో వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు. దివ్య అక్షర (5), నాగవైష్ణవి (3). అక్షర వాడపాలెంలోని అమ్మమ్మ ఇంట్లో పెరుగుతోంది. కొంతకాలం క్రితం అక్షర శరీరం ఉబ్బి అనారోగ్యానికి గురైంది. ఆమెకు స్థానికంగా ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించారు. అక్కడ నయం కాకపోవడంతో నరసాపురం, భీమవరం ఆస్పత్రుల్లో వైద్యం చేయించారు. రూ.60 వేలు పైబడి ఖర్చయినా ఏమాత్రం నయం కాకపోవడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని రెయిన్బో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్షరకు సోకింది అప్లాస్టిక్ ఎనీమియా (ఎముకల్లోని మూలుగులో రక్తం తయారుకాకపోవడం) వ్యాధి అని అక్కడ నిర్థారించారు. బంధువులు, దాతలు సమకూర్చిన సుమారు రూ.4 లక్షలతో అక్కడ వైద్యం చేయించారు. అయినప్పటికీ నయం కాకపోవడంతో అక్షర సోదరి వైష్ణవి మూలుగు ఎక్కిస్తే నయమవుతుందని రెయిన్బో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆ మేరకు రూ.12 వేలు వెచ్చించి వైష్ణవికి మూలుగు పరీక్ష చేయించగా ఇద్దరి గ్రూపు కలవలేదు. దాంతో అక్షరకు సరిపోయే దాతలు ఎవరి మూలుగునైనా ఎక్కించవచ్చని, దానికి సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని, ఆ శస్త్రచికిత్సను తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేస్తారని తెలిపారు. అంత సొమ్ము వెచ్చించి వైద్యం చేయించే స్థోమత లేకపోవడంతో దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దయార్ద్ర హృదయులు సాయం చేయాల్సిందిగా తాత శ్రీ కూర్మం సత్యనారాయణ, తండ్రి పెదంబదూరి దుర్గావరప్రసాద్ కోరుతున్నారు. దాతలు పెదంబదూరి దుర్గావరప్రసాద్ ఆంధ్రాబ్యాంక్ ఎకౌంట్ నంబరు 110510100085813 కు జమచేయవచ్చని, వివరాలకు అతని సెల్ నం 9666504852ను సంప్రదించాలని శ్రీకూర్మం సత్యనారాయణ కోరారు.