archestra
-
లతా మంగేష్కర్‌కు ఆ విధంగా నివాళి అర్పించిన రెహమాన్ కుమార్తె
వారంతా స్త్రీలే. 26 దేశాల మహిళలు కలిసి దుబయ్‌లో ‘ఫిర్దౌస్ ఆర్కెస్ట్రా’గా ఏర్పడ్డారు. తమ ప్రదర్శనలతో అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా లతా మంగేష్కర్‌కు నివాళిగా ఆమె పాడిన ఐదు పాటలను ‘కుహు కుహు’ పేరుతో ఆల్బమ్‌గా విడుదల చేశారు. ఏ.ఆర్. రెహమాన్ కుమార్తె ఖతిజా రెహమాన్ ఈ ఐదు పాటలు పాడింది. ‘లతా ఒక శక్తి. మేమందరం ఈ ఆల్బమ్ ద్వారా స్త్రీ శక్తిని చాటాం’ అని తెలిపింది ఖతిజా.శ్రోతలకు ఇదో శ్రావ్యమైన కానుక. ‘ఆర్కెస్ట్రా అనగానే రికార్డింగ్ స్టుడియోలో, స్టేజ్ మీద మగవారు నిండిపోయి ఉంటారు. కండక్టర్‌గా ఎప్పుడూ సూట్ వేసుకున్న మగవాడే కనిపిస్తాడు. ఈ స్టీరియోటైప్ మారాలి. ప్రపంచంలో ఉత్తమమైన మ్యుజీషియన్స్‌గా స్త్రీలు ఉన్నారు. వారంతా తమ ప్రతిభను చూపాలి. మేమంతా అందుకే ఒక వేదిక మీదకు వచ్చి పెర్ఫామ్ చేస్తున్నాం’ అంటారు దుబయ్‌లోని ‘ఫిర్దౌస్ ఆర్కెస్ట్రా’ సభ్యులు. 26 దేశాల నుంచి 51 మంది మహిళా సంగీతకారులు ఇక్కడ తమ సంగీతాన్ని వినిపిస్తున్నారు. ప్రోగ్రామ్‌లు ఇస్తున్నారు. వీరికి ఇక్కడ రికార్డింగ్ స్టుడియో ఉంది. ఇందులో సినిమాలకూ పని చేస్తున్నారు. ఎమిరేట్స్ మహిళా మంత్రి రీమ్ అల్ హష్మి ఏ.ఆర్.రెహమాన్‌ను మహిళలను ప్రోత్సహించే ఆర్కెస్ట్రాను దుబాయ్‌లో ఏర్పాటు చేయమని కోరారు. రెహమాన్ ‘ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాను ఏర్పాటు చేయడంలో సాయపడి పర్యవేక్షిస్తున్నారు. వారితో రికార్డింగ్స్ కూడా చేస్తున్నారు. పొన్నియన్ సెల్వమ్ 2’ రీ రికార్డింగ్ ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాలోని మహిళలే చేశారు. అరెబిక్ సౌందర్యం ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాలో వివిధ దేశాల మహిళా సంగీతకారులు పని చేస్తున్నా ఈ ఆర్కెస్ట్రా ముఖ్య ఉద్దేశం అరబిక్ సంగీతాన్ని పాశ్చాత్య సంగీతంతో మిళితం చేసి కొత్త అందాన్ని తీసుకురావడమే. ఫిర్దౌస్ ఆర్కెస్ట్రా లో తమతమ దేశాలకు చెందిన నేటివ్ ఇన్స్ట్రుమెంట్స్తో పాటు అరేబియాలో ఉపయోగించే సంగీత పరికరాలు కూడా వాడి గొప్ప మిళిత సంగీతాన్ని సృష్టిస్తున్నారు. ‘మేమంతా వేరువేరు జీవితాలు, వేరు వేరు సంగీత ధోరణుల నుంచి వచ్చాం. కాని రికార్డింగ్ థియేటర్లో అడుగుపెట్టి ఒక్కటిగా మారి సమష్టిగా సంగీతాన్ని సృష్టిస్తాం. ఈ అనుభూతి అద్భుతంగా ఉంటుంది’ అంటారు ఫిర్దౌస్ ఆర్కెస్ట్రా సభ్యులు. వీరికి కండెక్టర్‌గా మోనికా ఉమ్మెన్ అనే మహిళ పని చేస్తోంది. లతాకు నివాళి తండ్రి పర్యవేక్షణలో సాగుతున్న ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాతో కలిసి పని చేయడానికి ముందుకొచ్చింది ఖతిజా రెహమాన్. ‘నేను వారితో పని చేసినప్పుడు వారు చూపిన ప్రేమ చాలా నచ్చింది’ అంటుందామె. గాయని అయిన ఖతిజా ఇటీవల తమిళ సినిమాలకు సంగీతం కూడా అందిస్తోంది. లతా మంగేష్కర్‌కు నివాళిగా ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాతో కలిసి ‘కుహు కుహు’ ఆల్బమ్ తయారు చేసింది. ‘మేమందరం లతా పాటలను పునఃసృష్టించాలనుకున్నాం’ అంది ఖతీజా. లతా పాడిన ఐదు పాటలను ఎంపిక చేసుకుని ఖతీజా ఈ ఆల్బమ్‌లో పాడింది. అవి 1. పియా తోసే నైనా లాగేరే (గైడ్), 2.ఆప్ కీ నజరోనే సంఝా (అన్పడ్), 3. ఓ సజ్నా బర్ఖా బహార్ ఆయీ (పరఖ్), 4. కుహు కుహు బోలే కోయలియా (సువర్ణ సుందరి), 5. బేకస్ పె కరమ్ కీజియే (మొఘల్ ఏ ఆజమ్). ఈ ఐదు పాటలకు ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాలోని మహిళలు సంగీతం అందించారు. బాణీలు యధాతథంగా ఉన్నా ఆర్కెస్ట్రయిజేషన్లో తమ సృజనను ప్రదర్శించారు. సాధారణంగా పాత పాటలు కొత్త తరహాగా పాడితే నచ్చవు. కాని ఖతీజా గళం, ఫిర్దౌస్ సంగీతం శ్రోతలకు శ్రావ్యమైన అనుభూతిని ఇచ్చాయి. గొప్ప గాయని లతా మంగేష్కర్‌కు ఇది ఒక మంచి నివాళిగా నిలిచిపోతుంది. -
పెళ్లి రోజునే..హంతకుడిగా మారిన పెళ్లికొడుకు
సాక్షి, ఆదిలాబాద్ (నిర్మల్ రూరల్): ఇరువురి మధ్య పాతకక్షలు పెళ్లిరోజున పెళ్లికొడుకును హంతకుడిగా మార్చాయి. ఆనందంగా సాగాల్సిన వివాహ బారాత్ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. అప్పటి వరకు రెండు పెళ్లిళ్లతో సందడిగా ఉన్న ఆ గ్రామం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఇదంతా.. ఈనెల 23న రాత్రి దిలావర్పూర్ మండలం కాల్వతండాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు కారకులైన వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈమేరకు శనివారం జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో డీఎస్పీ ఉపేంద్రరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. ఆ రోజు ఏం జరిగిందంటే.. ఈనెల 23న కాల్వతాండకు చెందిన బానావత్ సాయికుమార్ వివాహం లోకేశ్వరం మండలం పుస్పూర్‌లో జరిగింది. అదే తండాకు చెందిన మెగావత్ రాజు పెళ్లి లోకేశ్వరం మండలంలోని నగర్తండాలో నిర్వహించారు. వివాహాల అనంతరం అదేరోజు రాత్రి కాల్వతండాలో రెండు పెళ్లిళ్లకు సంబంధించిన బారాత్‌లను వేర్వేరుగా నిర్వహించారు. బానావత్ సాయికుమార్, మెగావత్ రాజు కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా భూతగాదాలు ఉన్నాయి. ఈక్రమంలో రాజు వాళ్ల కంటే తన బారాత్ బాగా జరగాలని సాయికుమార్ తన పదోతరగతి మిత్రులను పిలిపించుకున్నాడు. వారికి మద్యం తాగించాడు. రాత్రి 11గంటల సమయంలో బారాత్ అనంతరం సాయికుమార్ ఇంటికి చేరుకున్నాడు. రాజు బారాత్ తనకంటే బాగా జరగడంతో ఆగ్రహానికి లోనయ్యాడు. అప్పటికే వెళ్లిపోయిన తన డీజే వాహానాన్ని వెనక్కి రప్పించాడు. కావాలని రాజు వాళ్ల దగ్గరికి తీసుకువెళ్లి, సౌండ్ ఎక్కువ పెట్టి తన స్నేహితులతో డ్యాన్స్ చేశాడు. మధ్యలో వచ్చి ప్రాణాలు కోల్పోయి.. సాయికుమార్ విపరీతంగా డీజేసౌండ్ పెట్టడంతో కొంచెం తగ్గించుకోవాలని రాజు బంధువైన మెగావత్ నవీన్(26) వాళ్ల దగ్గరికి వచ్చి కోరాడు. అప్పటికే రాజుపై ఆగ్రహంతో ఉన్న సాయికుమార్ పాతకక్షలనూ దృష్టిలో ఉంచుకుని మధ్యలో వచ్చిన నవీన్‌తో గొడవపడ్డాడు. తన స్నేహితులతో కలిసి ఆయనను కిందపడేసి, కాళ్లతో తొక్కారు. దీంతో స్పహతప్పిన నవీన్‌ను కుటుంబసభ్యులు వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి, అప్పటికే నవీన్ చనిపోయాడని ధ్రువీకరించారు. మృతి చెందిన నవీన్‌కు భార్య, మూడేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు కుటుంబాల మధ్యలో ఉన్న పాతకక్షలు అమాయకుడైన నవీన్‌ను బలిగొన్నాయి. సీసీ కెమెరాల ఆధారంగా.. జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు డీఎస్పీ వివరించారు. గ్రామంలోని సీసీకెమెరాల ఆధారంగా దర్యాప్తు చేశారు. ఈమేరకు నవీన్ మరణానికి కారకులైన బానావత్ సాయికుమార్, అతడి స్నేహితులైన పడిగెల భూమేష్, చినీట్ల దిలీప్, తుమ్మ సాయికుమార్, గాంధారి రాకేష్, చాçకపురం లక్ష్మణ్, నూక మహేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వివరించారు. సుప్రీంకోర్టు నిబంధనలు పాటించాలి.. డీజే నిర్వాహకులు సుప్రీంకోర్టు నిబంధనలు తప్పకుండా పాటించాలని డీఎస్పీ తెలిపారు. ఉదయం 6నుంచి రాత్రి 10గంటల వరకు మాత్రమే డీజేలకు అనుమతి ఇస్తామన్నారు. డీజే ఏర్పాటు చేసుకునే నిర్వాహకులు తప్పకుండా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. యువత క్షణికావేశంతో భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. కాల్వతండా ఘటనలో డీజేలను బైండోవర్ చేసి, కేసు నమోదు చేశామన్నారు. సమావేశంలో రూరల్ సీఐ వెంకటేశ్, దిలావర్పూర్, సారంగాపూర్ ఎస్సైలు పాల్గొన్నారు. -
ఆర్కెస్ట్రా నిర్వాహకుడి దారుణ హత్య
నరసరావుపేట టౌన్: ఆర్కెస్ట్రా నిర్వాహకుడు దారుణహత్యకు గురైన ఘటన ఆదివారం అర్ధరాత్రి పట్టణంలో చోటు చేసుకుంది. వన్‌టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. శ్రీరాంపురానికి చెందిన గడ్డం బాజి(39) వరవకట్ట వద్ద సోని ఆర్కెస్ట్రా నిర్వహిస్తుంటాడు. మొదటి భార్య విడిచి వెళ్లడంతో రమాదేవి అనే మహిళతో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. రమాదేవి కుమార్తె విజయలక్ష్మీకి క్రిస్టియన్ పాలేనికి చెందిన చల్లా సురేష్‌కు మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతుండటంతో విషయం తెలుసుకున్న బాజి ఇద్దరినీ మందలించాడు. అయిన వినకుండా యువతి వెంట పడుతుండటంతో సురేష్‌ను ఇటీవల బాజీ బెదిరించాడు. దీంతో పాటు గతంలో ఓ బార్ అండ్ రెస్టారెంట్లో చోటు చేసుకున్న ఘర్షణలో సురేష్‌తో పాటు అతని స్నేహితులు గోరంట్ల వీరేంద్రనాథ్, చాకలి ఏడుకొండలు, ఉదయగిరి కృష్ణాలు ముద్దాయిలుగా ఉన్నారు. ఆ కేసులో వీరికి వ్యతిరేకంగా బాజీ సాక్ష్యం చెప్పాడు. దీనిపై కక్ష పెంచుకున్న నలుగురు బాజీని ఎలాగైనా అంతమొందించాలని పన్నాగం పన్నారు. ఇంటి ఆరుబయట బాజీ నిద్రిస్తుండటాన్ని గమనించి హత్యకు వ్యూహ రచన చేశారు. రోజు మాదిరిగానే ఆదివారం రాత్రి కూడా ఆరుబయట బాజి నిద్రిస్తుండగా అర్ధరాత్రి వచ్చిన పై నలుగురు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యారు. సోమవారం తెల్లవారుజామున అటుగా వెళుతున్న పాదచారులు మంచంపై రక్తపు మడుగులో విగతజీవిగా పడివున్న బాజీ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ షేక్ బిలాలుద్దీన్ ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలను కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పోలీసుల అదుపులో నిందితులు హత్య జరిగిన వెంటనే వన్‌టౌన్ పోలీసులు స్పందించటంతో గంటల వ్యవధిలో నిందితుల్ని పట్టుకోగలిగారు. ఘటన స్థలానికి చేరుకొన్న సీఐ బిలాలుద్దీన్ సత్వరమే అక్కడకు పోలీస్ జాగిలాలను రప్పించారు. అవి వాసన పసిగడుతూ నిందితులు ఉన్న సమీప ప్రాంతానికి తీసుకువెళ్లాయి. ఆ సమీపంలో గాలించగా మొదట ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు. వారిని విచారించి హత్యతో సంబందం ఉన్న మరో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాదీనం చేసుకున్నట్లు సమాచారం. -
మట్టిలో ‘మణి’క్యం
కడు పేద కుటుంబంలో పుట్టింది. చదువును మధ్యలోనే ఆపేసినా యాంకర్‌గా ఎదిగింది. స్టేజి షోలు ఇస్తూ సొంతంగా ఓ ఆర్కెస్ట్రాను ఆర్గనైజ్ చేస్తోంది. ఇలా పదిమందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలిచారు యాంకర్ మణి. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. వీరవాసరం: ‘మా స్వగ్రామం తణుకు. భాష్యం స్కూల్ పక్కన చిన్న ఇంట్లో పుట్టాను. అమ్మ ఇండ్ల తులసి, నాన్న సత్యనారాయణ, అక్క శివ. చిన్నచిన్న పనులు చేస్తూ అమ్మానాన్న కుటుంబ పోషణ చేసేవారు. నేను మూడో తరగతి చదువుకునే సమయంలో అమ్మానాన్నల మధ్య కొద్దిపాటి వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో అమ్మ వేరు పడింది. అప్పటి నుంచి అమ్మ దగ్గరే పెరుగుతూ డ్యాన్స్‌పై ఇష్టం ఏర్పరచుకున్నాను. నా 12వ ఏటనే స్టేజీలపై స్టెప్పులేశాను. డ్యాన్స్ ట్రూపులతోనూ, సినీ సంగీత విభావరిలోనూ యాంకర్‌గా చేయడం ప్రారంభించాను. టీవీల్లో వస్తున్న పాటలను చూసి.. ఎవరి దగ్గర శిష్యరికం చేయకుండానే టీవీల్లో వస్తున్న పాటలను చూసి ఇంట్లోనే రిహార్సల్ చేసుకునేదాన్ని. ఏ స్టెప్పు చూసినా వెంటనే స్టేజిపై చేయడం నాకు ఛాలెంజింగ్‌గా ఉండేది. మావయ్య మూర్తి, అత్తయ్య ఆదిలక్ష్మి ప్రోత్సాహంతో డ్యాన్సర్‌తో పాటు యాంకర్‌గాను ప్రావీణ్యం సంపాదించాను. పదేళ్ల క్రితం భీమవరానికి చెందిన మధును వివాహం చేసుకున్నాను. సరిగమ ఆర్కెస్ట్రా ప్రారంభించాం సరిగమ ఆర్కెస్ట్రాను ప్రారంభించి డ్యాన్సర్గాను, యాంకర్‌గాను, డ్యాన్స్ బేబి డ్యాన్స్‌ల ప్రదర్శనలు ప్రారంభించాం. మా ఆయన మధు సహకారంతో భీమవరం, తణుకు, ఏలూరు, విజయవాడ, శ్రీకాకుళం, విజయవాడ, హైదరాబాద్‌లతో పాటు బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబైలోనూ ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాం. మా సరిగమ ఆర్కెస్ట్రాలోకి జబర్దస్త్ టీం ఆది, భాస్కర్, సుధాకర్, రాజు, నరేష్ తదితరులతో పాటు సినీ సింగర్లు సునీత, గీతామాధురి, మాళవిక, ఝాన్సీలతోను ప్రదర్శనలు ఇప్పించడం విశేషం. టీవీల్లో జరిగే సూపర్ డూప్స్ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నాను. నాతో పాటు మరో 10 మందికి అవకాశాలు చూపించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. డ్యాన్సర్‌గా, యాంకర్‌గా రాణిస్తుండడం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. -
ఆ‘పాత’మధురం.. నేటికీ మరువం
రాజమహేంద్రవరం కల్చరల్ : నటుడు, గాయకుడు శ్రీపాద జిత్ మోహ¯ŒS మిత్రా ఆర్కెస్ట్రా 47వ వార్షికోత్సవం ఆదివారం ఆనం రోటరీహాలులో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిత్ మోహ¯ŒSమిత్రా, ఇతర గాయనీగాయకులు 1957లో విడుదలైన 17 హిందీ, తెలుగు సినిమాల్లోని గీతాలను ఆలపించారు. సినీవిజ్ఞాన విశారద ఎస్వీ రామారావు గీతాలనేపథ్యాన్ని వివరించారు. ‘మాయాబజారు, పాండురంగమహాత్మ్యం, సువర్ణసుందరి, తోడికోడళ్లు, సారంగధర, భాగ్యరేఖ, వినాయకచవితి, దొంగల్లో దొర, ఎమ్మెల్యే తెలుగు సినిమాలతో పాటు హిందీగీతాలను వినిపించారు. 15సార్లు మాయాబజార్ నిర్మాణం.. భారతీయ భాషల్లో 15 సార్లు మాయాబజారు నిర్మించారని సినీ విజ్ఞాన విశారద ఎస్వీ రామారావు తెలిపారు. ‘‘మహాభారతంలో మాయాబజారు కథ ఎక్కడా లేదు. ఇది పూర్తిగా కల్పితగాథ. ఈ సినిమాలో పాండవులు ఎక్కడా కనపడకపోయినా వారి ప్రస్తావన అడుగడునా వినవస్తుంది. మహానటి సావిత్రి శశిరేఖ పాత్ర కోసం, ఎస్వీఆర్ ఘటోత్కచుడి పాత్రకోసమే పుట్టారా అనిపిస్తారు. ఇప్పటివరకు ఓ సర్వే భారతదేశంలో 60 వేల సినిమాలు నిర్మాణమయ్యాయని తేల్చింది. అధిక సంఖ్యాకులు వీటిలో మాయాబజారు ఉత్తమ చిత్రమని పేర్కొన్నారు.’’ -
జిత్ మధుర గీతాల మకరందం
రాజమహేంద్రవరం కల్చరల్ : తెలుగు, హిందీభాషల జోడుగుర్రాలపై సినీపాటల నందనవనంలో 75 వసంతాల శ్రీపాద జిత్ మోహ¯ŒS మిత్రా అడ్డూ ఆపూ లేకుండా విహరించారు. జిత్ 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జిత్ మోహ¯ŒS మిత్రా మిత్రబృందం ఆధ్వర్యంలో గురువారం ఆనం కళాకేంద్రంలో జిత్తోపాటు భవ్య సినీగీతాలను ఆలపించారు. ‘కల ఇదనీ, నిజమిదనీ తెలియదులే’, ‘పెళ్ళి చేసుకుని, ఇల్లు కట్టుకుని హాయిగ జీవించాలోయ్’ మొదలయిన తెలుగుపాటలతో పాటు ‘ఓ దునియాకే రఖ్వాలే’, ‘జో వాదా కియా వో’ మొదలయిన హిందీపాటలను పాడుతూ జిత్ హుషారుగా స్టెప్పులేశారు. జిత్‌కు కొన్ని పాటలలో భవ్య గళం కలిపింది. జిత్ పాటలలోని రాగాలను, సంగీతవిశేషాలను శాస్త్రీయ సంగీత విద్వాంసుడు త్యాగరాజు వివరించారు. జిత్ క్లాస్మేట్ డీవీ హనుమంతరావు, మరో నేస్తం మహమ్మద్ ఖాదర్‌ఖా¯ŒS జిత్‌తో తమ చిన్ననాటి ముచ్చట్లను వివరించారు.