జిత్‌ మధుర గీతాల మకరందం | jit mohanmitra archestra | Sakshi
Sakshi News home page

జిత్‌ మధుర గీతాల మకరందం

Published Thu, Mar 30 2017 11:33 PM | Last Updated on Tue, Sep 5 2017 7:30 AM

jit mohanmitra archestra

రాజమహేంద్రవరం కల్చరల్‌ : 
తెలుగు, హిందీభాషల జోడుగుర్రాలపై సినీపాటల నందనవనంలో 75 వసంతాల శ్రీపాద జిత్‌ మోహ¯ŒS మిత్రా అడ్డూ ఆపూ లేకుండా విహరించారు. జిత్‌ 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జిత్‌ మోహ¯ŒS మిత్రా మిత్రబృందం ఆధ్వర్యంలో గురువారం ఆనం కళాకేంద్రంలో జిత్‌తోపాటు భవ్య సినీగీతాలను ఆలపించారు. ‘కల ఇదనీ, నిజమిదనీ తెలియదులే’, ‘పెళ్ళి చేసుకుని, ఇల్లు కట్టుకుని హాయిగ జీవించాలోయ్‌’ మొదలయిన తెలుగుపాటలతో పాటు ‘ఓ దునియాకే రఖ్‌వాలే’, ‘జో వాదా కియా వో’ మొదలయిన హిందీపాటలను పాడుతూ జిత్‌ హుషారుగా స్టెప్పులేశారు. జిత్‌కు కొన్ని పాటలలో భవ్య గళం కలిపింది. జిత్‌ పాటలలోని రాగాలను, సంగీతవిశేషాలను  శాస్త్రీయ సంగీత విద్వాంసుడు త్యాగరాజు వివరించారు. జిత్‌ క్లాస్‌మేట్‌ డీవీ హనుమంతరావు, మరో నేస్తం మహమ్మద్‌ ఖాదర్‌ఖా¯ŒS జిత్‌తో తమ చిన్ననాటి ముచ్చట్లను వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement