Ashrams
-
ఆశ్రమాలలో చట్టవిరుద్ధ కార్యకలాపాలు: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని దొంగ బాబాల ఆశ్రమాలపై వేసిన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దేశంలో అక్రమ డబ్బుతో బోగస్ ఆశ్రమాలు నడుస్తున్నాయని హైదరాబాద్‌కు చెందిన దుంపల రాంరెడ్డి ఆశారమ్ బాపు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వియం తెలిసింది. ఈ సందర్భంగా 17 ఆశ్రమాలలో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని.. దేశంలో బోగస్ బాబాలు నిర్వహిస్తున్న బోగస్ ఆశ్రమాలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో రెండు వారాల్లో తెలపాలని సొలిసిటర్ జనరల్‌ను కోర్టు ఆదేశించింది. వీరేంద్ర దీక్షిత్ వంటి వివిధ బాబాలు నడుపుతున్న 17 ఆశ్రమాలను అఖిల భారత అఖాదా పరిషత్ బోగస్ ఆశ్రమాలుగా ప్రకటించాలని, వాటిపై నియంత్రణ ఉండాలని ఆశారమ్ పటిషన్లో పేర్కొన్నారు. అత్యాచార కేసుల్లో నిందితుడు వీరేంద్ర దీక్షిత్ స్థాపించిన ఢిల్లీ రోహిణిలోని ఆధ్యాత్మిక విద్యాలయంలో తన కుమార్తె సంతోషి చిక్కుకున్నట్లు ఆయన కోర్టుకు తెలిపారు. అత్యాచార కేసులో నిందితుడైన వీరేంద్ర దీక్షిత్ 3 సంవత్సరాలు పరారీలో ఉన్నప్పటికీ ఆయన ఆశ్రమం యథావిధిగా నడుస్తుందని పిటినర్ కోర్టుకు తెలిపారు. దొంగ బాబాల ఆశ్రమాలలో పరిశుభ్రమైన పరిస్థితులు లేవని, జైళ్లను తలపించేలా ఉన్నాయని ఆశారమ్ పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషనర్ లేవనెత్తిన సమస్య నిజమైనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆశ్రమాలు నియంత్రణ లేకుండా నడుస్తున్నాయని, అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. -
ఆశ్రమ భూములపై కన్నేశారు!
నరసన్నపేట మేజర్ పంచాయతీలో భూబకాసురులు రెచ్చిపోతున్నారు. ఖాళీగా జాగా కనిపిస్తే చాలు పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న కొంతమంది టీడీపీ మద్దతుదారుల కన్ను తాజాగా ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న శివరామ దీక్షిత అచల గురు ఆశ్రమం ఆస్తులపై పడింది. దీన్ని ఆక్రమించేందుకు పావులు కదుపుతున్నారు. నరసన్నపేట: నరసన్నపేటలో గడిచిన నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ ఆస్తులకు రెక్కలొచ్చాయి. అధికార పార్టీ నాయకుల అండతో విలువైన స్థలాలు పలువురి చేతిల్లోకి వెళ్లిపోయాయి. కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయి. కొన్ని స్థలాలు కుల సంఘాలకు కట్టబెట్టగా.. మరికొన్ని అధికార పార్టీ కార్యకర్తలకు ఇచ్చేశారు. తాజాగా టీడీపీ మద్దతుదారుల కళ్లు ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న శివరామ దీక్షిత అచల గురు ఆశ్రమం ఆస్తులపై పడింది. దీనికి ఆనుకొని ఉత్తర భాగము స్థలాన్ని కాజేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తప్పుడు రికార్డులు సృష్టించి నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రెవెన్యూ రికార్డులను మార్చేసినట్టు తెలిసింది. దీనిని పసి గట్టిన ఆశ్రమం వంశ పారంపర్య ధర్మకర్తలు ఈ స్థలం చేతులు మారకుండా ఆశ్రమం ఆధీనంలో ఉంచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అధికార పార్టీ నాయకులు కొందరు వీరి చర్యలకు ఆటంకాలు సృష్టిస్తూ తమకే ఆ స్థలం చెందాలని అధికారులపై వత్తిడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం పట్టణంలో చర్చనీయాంశమైంది. రికార్డులు తారుమారు విషయం ఇలా.. గొట్టిపల్లి సర్వేనంబర్ 99/7లో ఉన్న 36 సెంట్ల భూమిని ఆశ్రమ అవసరాలకు శ్రీ శివరామ దీక్షిత కార్య ఆశ్రమ ధనులు పేరున 1966 ఆగస్టు తొమ్మితో తేదీన 3265 డాక్యుమెంట్ ద్వారా పొట్నూరు రాజులు, రమణయ్యల నుంచి కొనుగోలు చేశారు. అప్పటి నుంచి 2017 వరకూ ఈ భూమి ఆశ్రమం పేరునే రికార్డుల్లో ఉండగా 29–07–2017 నుంచి మారింది. ప్రభుత్వ పెద్దలు మద్దతుతో కొందరు ఈ స్థలాన్ని గిఫ్టు డీడ్ కింద రికార్డులు వారికి అనుకూలంగా మార్పు చేశారని శివరామ దీక్షితల వంశపారంపర్య ధర్మకర్త ముద్దాడ రఘుపతి నాయుడుతో పాటు ఆశ్రమానికి చెందిన శిష్యులు ఆరోపిస్తున్నారు. సుమారు మూడు కోట్ల రూపాయల విలువైన ఈ స్థలాన్ని ఆనుకొని ఉన్న రాజేశ్వరి మహాల్‌కు చెందిన సర్వేనంబర్ ఆధారంగా ఆశ్రమ భూముల హద్దులను మార్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 2017 జూన్ వరకూ మీసేవలో అడంగల్, వన్–బీ లు తీస్తున్నప్పుడు ఆశ్రమం పేరునే వచ్చేవి. తరువాత పేర్లు మారడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇతరులకు బదలాయించడం కుదరదు... నిబంధనల ప్రకారం ఆశ్రమం పేరున ఉన్న భూములు ఇతరులకు హక్కులు కల్పించేందుకు, బదలాయించేందుకు వీల్లేదు. అయినా కొందరు ఈ భూమిని కాజేసేందుకు రెవెన్యూ రికార్డులను మార్పులు చేసినట్లు తెలిసింది. అయితే ధర్మాన ఎర్రన్నాయుడు అనుయూయులు ఈ స్థలం వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకొనేందుకు తహసీల్దార్ కార్యాలయంలో నాలా కట్టారు. దీని ప్రకారం ఈ భూమిని కన్వర్షన్ చేయడానికి టీడీపీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి రెవెన్యూ అధికారులు ససేమిరా అంటున్నారు. వారిపై వత్తిడులు వస్తున్నట్లు తెలుస్తోంది. పరిశీలించి చర్యలు తీసుకుంటాం ఈ వివాద స్థలం గురించి రెండు వర్గాల వారూ ఫిర్యాదులు చేశారు. రికార్డులు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం. దీని విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – జె.రామారావు, తహసీల్దార్ రంగనాథ స్వామి వీలునామా రాశారు ఆశ్రమం నిర్వహకుల్లో ఒకరైన కూరాకుల రంగనాథ స్వామి మా నాన్న ధర్మాన చిట్టెన్న పేరున ఈస్థలాన్ని వీలునామా రాశారు. చాల్లా ఏళ్లు నుంచి ఈ వివాద స్థలం నా స్వాధీనంలో ఉంది. మా నాన్న పేరున ఉన్న ఈ స్థలాన్ని నా భార్య పేరున మార్చాను. ఇప్పుడు దీని విలువ పెరగడంతో కొందరు వివాదం సృష్టిస్తున్నారు. – ధర్మాన ఎర్రన్నాయుడు -
సేవా భోజ్ యోజన పథకం: జీఎస్టీ రిఫండ్
-
అన్నదానం చేస్తే జీఎస్టీ రిఫండ్
న్యూఢిల్లీ: అన్నదానం చేస్తున్న ఆధ్యాత్మిక, దాతృత్వ సంస్థలపై ఆర్థిక భారం తగ్గించేందుకు కేంద్రం సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘సేవా భోజ్ యోజన’గా పిలిచే ఈ పథకం ద్వారా ఆ సంస్థలకు కేంద్ర జీఎస్టీ(సీజీఎస్టీ), సమీకృత జీఎస్టీ(ఐజీఎస్టీ) మొత్తాలను తిరిగి చెల్లిస్తారు. రెండేళ్ల పాటు రూ.325 కోట్ల వ్యయంతో సాంస్కృతిక శాఖ ఈ కార్యక్రమాన్ని అమలుచేయనుంది. కనీసం ఐదేళ్లుగా పనిచేస్తూ నెలకు కనీసం 5 వేల మందికి అన్నదానం చేస్తున్న ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు, ధార్మిక ఆశ్రమాలు, దర్గాలు, మఠాలు తదితరాలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హమైన సంస్థలు సాంస్కృతిక శాఖ వద్ద నమోదుచేసుకోవాలి. దర్పన్ పోర్టల్‌లో సమర్పించే దరఖాస్తులను సాంస్కృతిక శాఖ నియమించిన కమిటీ పరిశీలించి 4 వారాల్లో నిర్ణయం తీసుకుంటుంది. వాటి పనితీరుపై సంతృప్తి చెందితే గడువు ముగిశాక రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరిస్తారు. పాలక మండలి సభ్యులు, ధర్మకర్తలు, చైర్మన్లలో ఎవరైనా వైదొలగినా, కొత్తవారు నియమితులైన సంగతిని, అన్నదానం చేస్తున్న ప్రాంతాలలో మార్పు తదితర సమాచారాన్ని సాంస్కృతిక శాఖకు ఎప్పటికప్పుడు తెలియజేసే బాధ్యత ఆ సంస్థపైనే ఉంటుంది. -
దాన,ధర్మాలు చేసి ఆశ్రమాల్లో గడుపుతున్నారు
-
ఆగని మరణ మృదంగం
రెండు నెలల్లో పదిమంది మృతి ఆశ్రమాల్లో మెరుగుపడని వైద్యసేవలు రక్తహీనతతో చిన్నారుల విలవిల ఏటేటా కబళిస్తున్న వ్యాధులు నిన్న మజ్జివలస గిరిజన సంక్షేమ పాఠశాలలో..నేడు జోలాపుట్టు బాలుర ఆశ్రమ వసతి గృహంలో.. ఇలా ఏజెన్సీలోని సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. రెండు నెలల్లో పదిమంది చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పిట్టల్లారాలిపోతున్నా ఐటీడీఏ, గిరిజన సంక్షేమ అధికారుల చర్యలు కానరావడం లేదన్న ఆందోళన తల్లిదండ్రులు, గిరిజన, ప్రజాసంఘాల నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లలో 1649 మంది చిన్నారులు చనిపోయారు. పౌష్టికాహార లోపంతో విద్యార్థులు రక్తహీనతకు గురవుతున్నారు. వ్యాధి నిరోధకశక్తి తగ్గి వ్యాధుల బారినపడుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే కడుపునొప్పి, వాంతులు వంటి లక్షణాలతో అనారోగ్యానికి గురయి ప్రాణాలు కోల్పోతున్నారు. ఐటీడీఏ గతేడాది నుంచి నిర్వహిస్తున్న హెచ్‌బీ పరీక్షల్లో ఇది నిర్ధారణ అయింది. పాడేరు/ముంచంగిపుట్టు: ఆశ్రమ విద్యార్థులకు వైద్య సేవలు అందనంత దూరంలో ఉంటున్నాయి. ఇటీవ చోటుచేసుకుంటున్న సంఘటనలు దీనికి అద్దం పడుతున్నాయి. గురువారం హుకుంపేట మండలం మారుమూల బూరుగుపుట్టు పంచాయతీ మజ్జివలస గిరిజన సంక్షేమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న కొర్రా శంకరరావు అనే విద్యార్థి మృతి చెందాడు. దీనిని మరిచిపోకముందే ముంచంగిపుట్టు మండలం జోలాపుట్టు గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ వసతి గృహాం విద్యార్థి డురు సోమరాజు(9) శుక్రవారం ఇదే పరిస్థితుల్లో ఆకస్మికంగా మృతి చెందాడు. జోలాపుట్టు పంచాయతీ గొడ్డిపుట్టుకు చెందిన సోమరాజు ఆశ్రమంలో ఉంటూ అదే గ్రామంలోని ఎంపీపీఏస్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం స్వగ్రామంలో జరిగిన పెళ్లికి వెళ్లి వచ్చాడు. శుక్రవారం ఉదయం కడుపు, తలనోప్పిగా ఉందంటూ హాస్టల్ గదిలో పడుకున్నాడు. కొద్దిసేపటి తరువాత తోటి విద్యార్థులు చూడగా చనిపోయి ఉన్నాడు. సమాచారం మేరకు ఆశ్రమానికి వచ్చిన బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ మృతదేహంతో తండ్రి ధనుర్జయ్, బంధువులు, గిరిజన సంఘం నాయకులు కె.అప్పల నర్సయ్య, కె.త్రినాధ్, పి.శాస్త్రిబాబులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. నష్టపరిహారం కోసం డిమాండ్ చేశారు. తహసీల్దార్ ఎం.శ్యాంబాబు, ఏటీడబ్ల్యూవో వై.శాంతకుమారి వచ్చి విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించి న్యాయం చేస్తామని చెప్పినప్పటికీ ఆందోళన విరమించలేదు. పరిస్థితి గిరిజన సంక్షేమశాఖ డీడీ కమల దృష్టికి వెళ్లింది. ఆమె ఏటీడబ్ల్యూవోతో ఫోన్లో మాట్లాడారు. రూ.2లక్షలు పరిహారం పరిహారం ఇస్తామని అధికారులు లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పోస్టుమార్టానికి విద్యార్థి మృతదేహన్ని పాడేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.