బీహార్లో విషాదం.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
నవాడా: బీహార్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. 'స్వాతంత్ర్య వేడుకల్లో నాటు బాంబులు శనివారం కలకలం రేపాయి. నవాదాలోని ఓ పాఠశాలపై శనివారం దుండగులు నాటు బాంబులు విసిరారు. స్థానిక సెంట్ జోసెఫ్ స్కూల్లో పిల్లలందరూ ఉత్సవాల్లో మునిగి తేలుతుండగా, బాంబు దాడులు జరిగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఒక్కసారిగా అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.