Assembly approval
-
కేటాయించినవి ఖర్చు చేయలేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తప్పు పట్టింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను తన నివేదికలో అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. కేటాయింపులు, ఖర్చులు ఇష్టారాజ్యంగా జరిగాయని, కొన్ని పద్దుల్లో కేటాయించిన నిధులు ఖర్చు చేయలేదని, కొన్ని పద్దుల్లో మాత్రం అసెంబ్లీ ఆమోదం పొందకుండానే ఇష్టమొచ్చినట్టు ఖర్చు పెట్టిందని ఆక్షేపించింది.డబుల్‌బెడ్ రూం ఇళ్లకు రూ.11వేల కోట్లు, గొర్రెలు, మేకల కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు, ఆయిల్‌పామ్ పెంపకానికి రూ.1000 కోట్లు, దళిత బంధు కింద రూ. 15,700 కోట్లు, రైతులకు రుణమాఫీ కింద కేటాయించిన రూ.3,964 కోట్లు ఖర్చు చేయకపోవడాన్ని తప్పు పట్టింది. 2014–21 వరకు రూ.2,89,115 కోట్ల అధిక వ్యయం జరిగిందని కూడా వెల్లడించింది. గత మూడేళ్ల పన్నేతర రాబడుల అంచనాలను భారీగా వేశారని, కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయక గ్రాంట్లు రాకపోయినా అవే అంచనాలను రూపొందించారని తెలిపింది.సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.2,06,977 కోట్లు ఎక్కువగా పెరిగిందని, పాలమూరు–రంగారెడ్డికి రూ.12,937 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.11,370 కోట్ల మూలధన వ్యయం ఎక్కువగా జరిగిందని వెల్లడించింది. ద్రవ్యలోటును ఆ ఆర్థిక ఏడాదిలో రూ.2,749 కోట్లు తక్కువగా చూపెట్టారని తెలిపింది.2022–23 ఆర్థిక సంవత్సరంలో అనివార్య ఖర్చులు 43 శాతానికి చేరాయని, రుణాలు, అడ్వాన్సులు 150 శాతం పెరిగి మొత్తం బడ్జెట్లో 11 శాతానికి చేరాయని వెల్లడించింది. బడ్జెట్ వెలుపలి రుణాల విషయంలో స్పష్టత లేదని, డిస్కంల అప్పులను రూ.16వేల కోట్ల మేర తక్కువగా చూపెట్టారని కూడా కాగ్ ఆక్షేపించింది. ఈ మేరకు రెవెన్యూ, ఆర్థిక రంగాల కాగ్ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. పురపాలకశాఖ ఖర్చు చేసింది రూ. 7,990 కోట్లుపురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు 2022–23 సంవత్సరంలో కేటాయించిన రూ.10,591 కోట్లలో ఖర్చు చేసిన మొత్తం రూ. 7,990 కోట్లు మాత్రమే. ఈ విషయాన్ని కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. గ్రాంట్ కింద కేటాయించిన ఈ మొత్తంలో రూ. 3,832 కోట్లు సరెండర్ చేసిన మొత్తంగా పేర్కొంది. ఇందులో మెట్రో కనెక్టివిటీకి కేటాయించిన రూ. 500 కోట్లు పనులు ప్రారంభించనందున ఖర్చు కాలేదు.ఎయిర్‌పోర్టు మెట్రో కనెక్టివిటీకి కేటాయించిన రూ.378 కోట్లు కూడా అదే పరిస్థితిలో ఖర్చు కాలేదు. ఓఆర్ఆర్కు కేటాయించిన రూ.200 కోట్లు విడుదల కాలేదు. హైదరాబాద్ పట్టణ సముదాయం కోసం కేటాయించిన రూ.151 కోట్లు, భూముల సేకరణకు కేటాయించిన రూ.100 కోట్లు కూడా వెనక్కి వెళ్లాయి. మూలధన విభాగం కింద రూ.151 కోట్లలో కేవలం రూ. 20,000 మాత్రమే వినియోగించబడినట్టు తెలిపింది.కాంపాలో మిగిలిన రూ.1,114 కోట్ల బ్యాలెన్స్2022–23 ఆర్థిక సంవత్సరం చివర్లో రాష్ట్ర ప్రత్యామ్నాయ అటవీకరణ నిధిలో (కాంపా) రూ.1,114 కోట్ల మొత్తం మేర బ్యాలెన్స్ మిగిలిపోయిందని కాగ్ పేర్కొంది. ఈ ఏడాది సందర్భంగా రూ.68 కోట్లు ఈ నిధిలోకి జమచేసి, మొత్తంగా ఈ నిధినుంచి రూ.404 కోట్లు కేటాయించిందని తెలిపింది. 2019 ఫిబ్రవరిలో తెలంగాణ ప్రభుత్వం ‘స్టేట్ కాంపన్సెటరీ అఫారెస్టెషన్ ఫండ్’ను ఏర్పాటు చేసిందని వెల్లడించింది. -
Rajasthan: ఇక మృతదేహాలతో నిరసన కుదరదు
మనుషులు ఎలా బతికినా మరణానంతరం కాస్తయినా మర్యాద ఉండాలి. అంతిమ సంస్కారం గౌరవప్రదంగా సాగాలి. కానీ ఈ విషయంలోనూ కొన్నిచోట్ల పెడ ధోరణులు కనిపిస్తున్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం మృతదేహాలతో కూర్చొని నిరసన ప్రదర్శనలకు దిగడం మనం చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది విషయంలో ఈ అంతిమయాత్ర సవ్యంగా జరగడం లేదు. రాజస్తాన్‌లో మృతదేహాలతో ధర్నాలు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ రకమైన ట్రెండ్‌కు అడ్డుకట్ట వేయడానికి రాజస్తాన్‌లోని అశోక్ గెహ్లోత్ ప్రభుత్వం ఏకంగా ఒక చట్టాన్నే తీసుకొచి్చంది. ‘ది రాజస్థాన్ ఆనర్ ఆఫ్ డెడ్ బాడీ బిల్లు, 2023’కు గత వారమే అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. చట్టంలో ఉన్నదిదీ...! మరణానంతరం హక్కులుంటాయ్! ఎవరైనా వ్యక్తి మరణించిన తర్వాత కూడా వారికి హక్కులుంటాయి. వారి అంతిమ సంస్కారం గౌరవప్రదంగా వారి వారి మతాచారాలు, సంప్రదాయాలకనుగుణంగా నిర్వహించాలి. వ్యక్తి ప్రాణం పోయిన తర్వాత వీలైనంత త్వరగా వారి అంత్యక్రియలు పూర్తి చేయాలి. చనిపోయిన వారి కుమారులు, కూతుళ్లు దూర ప్రాంతం నుంచి రావల్సి ఉంటే తప్ప వెంటనే అంత్యక్రియలు ముగించాలి. ఒక వేళ కుటుంబ సభ్యులు అలా అంత్యక్రియలు పూర్తి చేయకపోతే ప్రభుత్వ అధికారులే ఆ బాధ్యత తీసుకుంటారు. మృతదేహాలతో నిరసన కుదరదు ఈ చట్ట ప్రకారం మృతదేహాలతో కుటుంబ సభ్యులు నిరసన ప్రదర్శనలు చేయకూడదు. ఏదైనా కారణంగా వాళ్లు అలా నిరసనలకు దిగితే చర్యలు తీసుకునే అధికారం జిల్లా యంత్రాంగానికి ఉంటుంది. వెంటనే ఆ మృత దేహాన్ని స్వా«దీనం చేసుకొని అధికారులు తామే అంతిమ సంస్కారం నిర్వహిస్తారు. అంతేకాదు బహిరంగ ప్రదేశాల్లో మృతదేహంతో నిరసనకు దిగినందుకుగాను ఆ కుటుంబసభ్యులకు ఏడాది వరకు జైలు శిక్ష లేదంటే జరిమానా, రెండూ కూడా విధించవచ్చు. ఎందుకీ చట్టం? రాజస్తాన్‌లో మృతదేహాలతో నిరసనలకు దిగడం సర్వసాధారణంగా మారిపోయింది. ప్రాణాలు కోల్పోయి వారం రోజులు గడిచినా దహన సంస్కారాలు నిర్వహించకుండా ఉద్యోగం కోసమో, డబ్బుల కోసమో ఆస్పత్రులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలకు దిగుతున్నారు. 2014–2018 మధ్య బీజేపీ హయాంలో ఇలాంటి ధర్నాలు 82 వరకు జరిగాయి. 30 వరకు కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచి్చన తర్వాత 2019–2023 మధ్య కాలంలో మృతదేహాలతో ధర్నా కేసులు 306కి పెరిగాయి. అందుకే ఈ చట్టాన్ని తీసుకువచి్చనట్టుగా రాజస్తాన్ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శాంతి ధారివాల్ చెప్పారు. మరోవైపు ప్రతిపక్ష బీజేపీ దీనిని వ్యతిరేకించింది. మృతదేహాలతో ధర్నాకు దిగారంటే వారిలో ఎంతటి ఆక్రోశం ఉందో అర్థం చేసుకోవాలే తప్ప వారి ఆగ్రహ ప్రదర్శనని అడ్డుకోవడం సరికాదని వ్యాఖ్యానించింది. రాజస్తాన్‌లో కాంగ్రెస్ సర్కార్‌కు ఇక ప్రజలే అంతిమ సంస్కారం నిర్వహిస్తారంటూ బీజేపీ నేతలు వ్యంగ్యా్రస్తాలు సంధిస్తున్నారు. అయితే ఈ తరహా ఒక చట్టాన్ని చేసిన తొలి రాష్ట్రంగా రాజస్తాన్ చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. ఆ మృతదేహాలు పదిలం ప్రమాదాలు, ఘర్షణలు ఇతర విపత్కర పరిస్థితుల్లో ఎవరైనా మరణించి వారి మృత దేహాన్ని ఎవరూ క్లెయిమ్ చేసుకోని పక్షంలో ఆస్పత్రులు, జిల్లా యంత్రాంగం ఆ మృతదేహం కుళ్లిపోకుండా, దెబ్బ తినకుండా సకల జాగ్రత్తలతో ఫ్రీజర్‌లో భద్రపరచాలి. పెనాల్టీ మృతదేహాల మర్యాదకి ఏ మాత్రం భంగం కలిగిందని భావించినా వివిధ రకాల నేరాలకు వివిధ రకాల శిక్షలూ ఉంటాయి. కుటుంబసభ్యులు మృతదేహాన్ని స్వా«దీనం చేసుకోవడానికి నిరాకరించడం, మృతదేహాలతో నిరసన ప్రదర్శనలకి దిగడం, అలాంటి ప్రదర్శనలకు అనుమతులివ్వడం వంటివి నేరాల కిందకే వస్తాయి. ఆ నేరాలకు ఆరు నెలలు, ఏడాది, రెండేళ్లు, అయిదేళ్లు ఇలా జైలు శిక్ష పడుతుంది డేటా బ్యాంకు ఈ బిల్లులో అన్నింటికంటే ముఖ్యమైన ది ఎవరూ గుర్తుపట్టని మృతదేహాల డేటా. ఎవరూ గుర్తు పట్టకుండా ఉన్న మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు జరిపించి జన్యుపరమైన వారి డేటాను ప్రభుత్వం భద్రపరచాలి. అలా గుర్తు పట్టని శవాలకు శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలు నిర్వహించినప్పటికీ వారి అస్తికలు, జన్యుపరమైన వివరాలను ఒక డేటా బ్యాంకు ఏర్పాటు చేసి భద్రపరుస్తారు. జిల్లాల వారీగా డిజిటల్ డేటా బ్యాంకుల్ని ఏర్పాటు చేసి అందులో మృతి చెందిన వారి వివరాలు ఉంచుతారు. పోలీసు స్టేషన్లలో వచ్చే మిస్సింగ్ కేసులతో ఆ డేటాను పోల్చడం ద్వారా కనిపించకుండా వెళ్లిన వారు ఏమయ్యారో అన్నదానిపై ఒక క్లారిటీ వస్తుంది. ఇక ఈ డేటాను అధికారులెవరైనా బయటపెడితే మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రెండో అధికారిక భాషగా ఉర్దూ
సాక్షి, అమరావతి: మైనార్టీల సంక్షేమం, ఉర్దూ భాషాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు కీలక బిల్లులకు రాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఉర్దూను రెండో అధికారిక భాషగా గుర్తిస్తూ అధికార భాషల చట్ట సవరణ–2022 బిల్లును, కొత్తగా మైనార్టీల ప్రత్యేక అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ మైనార్టీస్ కాంపోనెంట్, ఆర్థిక వనరులు, వ్యయ కేటాయింపులు, వినియోగ చట్టం–2022 బిల్లును డిప్యూటీ సీఎం అంజాద్ బాష ప్రతిపాదించారు. ఈ బిల్లులను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాష మాట్లాడుతూ.. ఉర్దూ ఒక మతానికి సంబంధించిన భాష కాదని, నిఖార్సయిన భారతీయ భాష అని చెప్పారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఉర్దూకు తెలుగుతో సమాన హోదాను కల్పించడంతో ప్రతి మైనార్టీ ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ‘ఆంధ్రప్రదేశ్ మైనార్టీస్ కాంపోనెంట్ మరియు ఆర్థిక వనరులు, వ్యయ కేటాయింపులు మరియు వినియోగ చట్టం–2022’ బిల్లుతో వచ్చే 10 ఏళ్లలో అల్ప సంఖ్యాక వర్గాలకు భద్రత, సామాజిక హోదాతో పాటు సమధర్మాన్ని పాటించేందుకు వీలుంటుందని అంజాద్ బాషా చెప్పారు. ఆర్థిక, విద్య, మానవ వనరుల అభివృద్ధి విషయాల్లో ఆయా వర్గాలు మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఈ మూడేళ్లలో ఇది చారిత్రక సెషన్ అని కర్నూలు ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ చెప్పారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతు తెలుపుతూ ఆయన మాట్లాడారు. ఉర్దూకు అరుదైన గౌరవం రాష్ట్రంలో రెండో అధికారిక భాషగా ఉర్దూకు అరుదైన గౌవరం లభించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 15 జిల్లాల్లో ఉర్దూ రెండో అధికారిక భాషగా కొనసాగింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఉర్దూకు రెండో అధికారిక భాషగా చట్టబద్ధత కల్పించింది. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లూ దానిని పూర్తిగా విస్మరించింది. మైనార్టీలు, ఉర్దూ ప్రేమికుల ఆవేదనను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రెండో అధికార భాషగా ఉర్దూకు స్థానం కల్పించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అధికార కార్యకలాపాలు, ఉత్తర ప్రత్యుత్తరాలను తెలుగుతో పాటు ఉర్దూలోనూ సాగించేలా సమాన హోదా కల్పించినట్టయింది. రాష్ట్రంలో 32.45 లక్షల మందికి ఉర్దూ మాతృభాషగా ఉంది. ఉర్దూ మాట్లాడే ప్రజలు వైఎస్సార్ కడపలో 19 శాతం, గుంటూరులో 15.55 శాతం, చిత్తూరు 13.16 శాతం, అనంతపురంలో 12.91, కర్నూలు 11.55, కృష్ణాలో 8.42 శాతం, ప్రకాశంలో 5.65 శాతం, నెల్లూరులో 7.84 శాతం ఉన్నారు. మిగిలిన జిల్లాల్లోనూ సుమరు రెండు శాతం ఉర్దూ మాట్లాడే ప్రజలున్నారు. -
మైనర్‌ను రేప్ చేస్తే మరణశిక్షే
ఇటానగర్: అరుణాచల్‌ప్రదేశ్‌లో మహిళలపై నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడే మృగాళ్లకు మరణశిక్ష లేదా 14 ఏళ్ల కఠిన కారాగారశిక్ష విధించేలా రూపొందించిన బిల్లుకు అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ శుక్రవారం ఆమోదముద్ర తెలిపింది. క్రిమినల్ లాస్(అరుణాచల్ ప్రదేశ్) సవరణ బిల్లు–2018ను రాష్ట్ర హోంమంత్రి కుమార్ వాయి సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం 12 ఏళ్లలోపు బాలికల(మైనర్)పై అత్యాచారానికి పాల్పడే వ్యక్తులకు మరణశిక్ష లేదా 14 ఏళ్లకు తగ్గకుండా కఠిన కారాగారశిక్ష విధిస్తారు. ఈ శిక్షను యావజ్జీవశిక్షగా కూడా మార్చవచ్చు. వీటితో పాటు దోషులకు జరిమానా కూడా విధించవచ్చు. 2015 నుంచి 2017 నవంబర్ వరకూ రాష్ట్రంలో 225 రేప్ కేసులు నమోదుకాగా.. ఒక్క 2016లోనే 91 అత్యాచార కేసులు నమోదయ్యాయి. దీంతో మహిళలకు తగిన రక్షణ కల్పించడంలో భాగంగా పలువురు సభ్యుల సిఫార్సుతో అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టానికి రూపకల్పన చేసింది. -
రెండో అధికార భాషగా ఉర్దూ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా ఇకపై రెండో అధికార భాషగా ఉర్దూ చలామణిలోకి రానుంది. ఈ మేరకు తెలంగాణ అధికార భాషల చట్ట సవరణకు శాసనసభ గురువారం ఆమోదముద్ర వేసింది. 1966లోనే ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించినా అప్పట్లో ఇది జిల్లా యూనిట్‌గా అమలైంది. పూర్వపు ఖమ్మం జిల్లా పరిధిలో ఉర్దూ మాట్లాడే వారి సంఖ్య తక్కువగా ఉండటంతో అక్కడ దాన్ని అమల్లోకి తీసుకురాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం మొత్తం ఉర్దూకు రెండో అధికార భాష హోదా దక్కాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇటీవల 31 జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో జిల్లా యూనిట్ గా కాకుండా రాష్ట్రం యూనిట్‌గా ఉర్దూను రెండో అధికార భాషగా చేయాలని నిర్ణయిం చిన ప్రభుత్వం ఈ మేరకు గురువారం సభలో బిల్లు ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి తరఫున మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి, బీజేపీ సభ్యుడు కిషన్‌రెడ్డి, మంత్రి హరీశ్‌రావు ఉర్దూ పదాలతో కూడిన హిందీలో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. మంత్రి తుమ్మల మాట్లాడేటప్పుడు ఉర్దూలో మాట్లాడాలని కొందరు కోరగా త్వరలో తాను ఉర్దూ నేర్చుకుంటాననడంతో సభలో నవ్వులు విరిశాయి. ఢిల్లీ తర్వాత తెలంగాణలోనే: అక్బర్ దేశంలో ఢిల్లీ తర్వాత ఉర్దూను రెండో అధికార భాషగా చేసిన రాష్ట్రం తెలంగాణనేనని ఎంఐ ఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉర్దూ అర్జీలు తీసుకోవడంతోపాటు సంబంధిత వ్యవహారాలు చూసేందుకు ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో 66 పోస్టులు మంజూరు చేయడంతో ఉర్దూ భాష ఉన్నంతకాలం కేసీఆర్ పేరు సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందన్నారు. తెలుగును పట్టించుకోండి: కిషన్‌రెడ్డి ఉర్దూకు రెండో అధికార భాష హోదా ఆహ్వానించదగ్గ పరిణామమేనని, కానీ అసలు అధికార భాష తెలుగుకే ఆదరణ లేనప్పుడు ఇక ఉర్దూ గురించి చెప్పేదేముందని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలుగు భాష పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక చర్చ జరపాలన్నారు. కాగా, ఉర్దూను రెండో అధికార భాషగా ఖమ్మంలో కూడా అమలు చేయడం సంతోషమని కాం గ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి విమర్శించారు. అర్చకుల వేతన సవరణకు ఆమోదం దేవాలయ ఉద్యోగులు, అర్చకుల వేతన సవరణకు సభ పచ్చజెండా ఊపింది. సెక్షన్ 65–ఏ ప్రకారం దేవాలయాల నుంచి వసూలు చేసే మొత్తం, ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్‌తో అర్చకులు, ఆలయ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వేతనాలు చెల్లించనున్నారు. డిసెంబర్ నుంచే ఇది అమలు కానుంది. ఇం దుకు సంబంధించి ధార్మిక, హిందూ మత సంస్థ, ధర్మాదాయాల చట్టం–1987కు సవరణను ప్రతిపాదిస్తూ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రవేశపెట్టిన బిల్లుకు సభ ఆమోదముద్ర వేసింది. కాగా, తెలంగాణ లోకాయుక్త చట్టం– 1983కి సవరణ ప్రతిపాదిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు కూడా సభ ఆమోదం తెలిపింది. -
పదోన్నతుల్లో బీసీలకు రిజర్వేషన్లు
బీసీ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం - అసెంబ్లీ ఆమోదం హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న బీసీ (వెనుకబడిన తరగతుల) ఉద్యోగుల కు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం చంద్రబాబు శాసనసభలో ప్రకటించారు. మరీ వెనకబడిన కులాల(ఎంబీసీల)కు ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం కల్పిస్తామని, పరోక్ష ఎన్నికల్లో నిలబెట్టి గెలిపిస్తామని పేర్కొన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు బీసీలకు రాయితీలు కల్పిస్తామని చెప్పారు. శనివారం అసెంబ్లీలో బీసీ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం మాట్లాడారు. ఎంబీసీలకు రిజర్వేషన్ల శాతం పెరిగే విధంగా కేటగిరీల్లో మార్పులు చేస్తామని, వాల్మీకి లాంటి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ. 5 లక్షలు, గాయపడితే రూ. లక్ష సహాయం అందిస్తామని ప్రకటించారు. చేతివృత్తుల వారికి ఇంటితో పాటు వర్క్‌షెడ్‌ను నిర్మించి ఇచ్చే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పా రు. వారికి ఆరోగ్యబీమా కల్పించడంతో పాటు వృద్ధాప్య పింఛను రూ. 1,000 ఇస్తామన్నారు. బీసీలు తీసుకున్న రుణాలు, చేనేత రుణాలూ మాఫీ చేస్తానన్నారు. జరీపై వ్యాట్ రద్దు చేస్తామని, మూతపడిన చేనేత సంఘాలను తెరిపిస్తామని, వాటి బకాయిలు రద్దు చేస్తామని చెప్పా రు. చీర, ధోవతి పథకానికి సబ్సిడీ పునరుద్ధరిస్తామన్నారు. చేపల వేటపై నిషేధం ఉన్న సమయంలో మత్స్యకారులకు ఉచితంగా బియ్యం ఇస్తామని, వేటకు వెళ్లి చనిపోతే రెండేళ్ల తర్వాత రూ. 5 లక్షలు చెల్లిస్తామని ప్రకటించారు. గొర్రెలకు మొబైల్ క్లినిక్‌ల ద్వారా మందులు పంపిణీ చేస్తామని, అన్ని జిల్లాల్లో జీవాల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు బీమా పథకం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గందరగోళంలోనే బిల్లుకు ఆమోదం అయితే.. ఈ తీర్మానంపై చర్చలో మాట్లాడేందుకు ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి అవకాశం ఇవ్వకుండానే.. మూజువాణి ఓటుతో అసెంబ్లీలో ఆమోదించారు. తాను మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నా అవకాశం ఇవ్వకుండా తీర్మానం ఆమోదించటం పట్ల విపక్ష నేత, ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలుపుతుండగానే.. ద్రవ్య వినిమయ బిల్లుకు కూడా శాసనసభ ఏ చర్చా లేకుండానే ఆమోదం తెలిపింది. ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించాలని మంత్రి యనమల ప్రతిపాదిం చారు. ఆ వెంటనే మూజువాణి ఓటులో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందిందని స్పీకర్ ప్రకటించడం జరిగిపోయింది. అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేశారు. కొత్త పన్నులుండవు: మండలిలో యనమల ప్రజల మీద కొత్త పన్నుల భారం వేయబోమని మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. దేశంలో అత్యధికంగా విలువ ఆధారిత పన్ను (వ్యాట్) వసూలు చేస్తున్నామని.. ఈ వ్యాట్‌ను పెంచడానికి అవకాశం లేదని చెప్పారు. ద్రవ్య వినిమయ బిల్లుపై శనివారం శాసనమండలిలో నామమాత్రంగా జరిగిన చర్చకు ఆయన సమాధానం ఇస్తూ.. పన్నుల సంస్కరణల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏకరూప పన్నుల విధానం, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తీసుకురావడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలకు తోడ్పాటును అందిస్తున్నామని తెలిపారు. తర్వాత ద్రవ్య వినిమయ బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది. అనంతరం మండలిని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ చక్రపాణి ప్రకటించారు. చర్చలో సభ్యులు ఏమన్నారంటే.. వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలి వాల్మీకులు శ్రీకాకుళం జిల్లాలో ఎస్టీ లు. కానీ రాయలసీమలో బీసీలు. కాపులను బీసీల్లో చేర్చడానికి రూ. 40కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం.. వాల్మీకులకు కనీసం ఒక్కపైసా అయినా ఖర్చు పెట్టిందా? వాల్మీకులను ఎస్టీ ల్లో చేర్చడానికి వెంటనే చర్యలు చేపట్టాలి. - వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జయరాం బీసీలకోసం పాటు పడిందిఎన్టీఆర్, వైఎస్లే బీసీలపై ప్రేమ చూపిస్తున్న చంద్రబాబు వారి కోసం ఎన్టీఆర్ ప్రారంభించిన రూ. 2 కిలో బియ్యం ధరను రూ.5.25 చేసింది మరిచారా?. ఎన్టీఆర్ సంపూర్ణ మద్యనిషేధం విధించగా, దాన్ని రద్దుచేసిన ఘనత బాబుదే. బీసీలందరికీ ఇళ్లు ఇచ్చి గూడు కల్పించింది వైఎస్‌దే. ఆరోగ్యశ్రీతో బీసీలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించిన నాయకుడు వైఎస్. - వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ముత్యాలనాయుడు రాజ్యాధికారం ఎన్టీఆర్ భిక్ష ఎన్టీఆర్ పార్టీ పెట్టకుంటే ఇప్పటికీ బీసీలకు రాజ్యాధికారం దక్కేది కాదు. ఎన్టీఆర్ ప్రారంభించిన టీడీపీ వల్లే బీసీ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. బీసీల జన గణన ఇప్పటి వరకు చేపట్టకపోవడానికి కాంగ్రెస్ కుట్రే కారణం. - చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు తీర్మానం ఇదీ.. ‘‘బీసీలకు చట్టసభల్లో (శాసనసభ, పార్లమెం టులో) 33.33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. బీసీల అభ్యున్నతికి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. మొత్తం బడ్జెట్లో 25 శాతం నిధులతో బీసీ సబ్‌ప్లాన్ తీసుకురావాలి. జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించాలి. బీసీ జనగణన చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీసీ ఉద్యోగులకు పదోన్నతు ల్లో రిజర్వేషన్లు కల్పించాలి. బీసీలకు న్యాయం గా రావాల్సిన రాజ్యాంగ, ఆర్థిక, రాజకీయ, విద్యాపరమైన హక్కులు కల్పించడానికి చర్యలు తీసుకోవాలి’’ అని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి తీర్మానం ప్రవేశపెట్టారు.