assembly website
-
రేపు శాసన సభ వెబ్సైట్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసన సభ తెలుగు, ఉర్దూ వెర్షన్లలో ఒక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించనుంది. దీనిని అసెంబ్లీ కమిటీ హాలులో స్పీకర్ మధుసూదనాచారి సోమవారం ఉదయం 10.30కి ప్రారంభిస్తారని శాసన సభ కార్యదర్శి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఇంగ్లిష్ వెర్షన్లో మాత్రమే వెబ్సైట్ పనిచేస్తోంది. శాసన సభ ఉద్యోగులకు, శాసన సభ, మండలి సభ్యులకు ఉపయోగపడేలా కొత్త వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసన సభా వ్యవహారాల శాఖా మంత్రి హరీశ్‌రావు, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొంటారు. -
అసెంబ్లీ వెబ్సైట్లో జయ చిత్రాల తొలగింపు
టీనగర్: అసెంబ్లీ వెబ్సైట్లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పేరును, చిత్రాలను తొలగించారు. ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం పేరు చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు విధించిన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రిగా ఓ. పన్నీర్ సెల్వం బాధ్యతలు చేపట్టారు. అయితే నెలరోజులు కావస్తున్నా అసెంబ్లీ వెబ్సైట్లో జయ చిత్రాలను, పేర్లను తొలగించలేదు. గత వారం శ్రీరంగం అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయినట్లు అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ ప్రకటించారు. దీన్ని గెజిట్లోనూ విడుదల చేశారు. ఇలావుండగా అసెంబ్లీ వెబ్సైట్లో జయ చిత్రాలను, పేర్లను మంగళవారం అధికారులు తొలగించారు. ఆ వెబ్సైట్లో జయకు సంబంధించిన వివరాలు కనుమరుగయ్యాయి.