
రేపు శాసన సభ వెబ్‌సైట్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసన సభ తెలుగు, ఉర్దూ వెర్షన్లలో ఒక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించనుంది. దీనిని అసెంబ్లీ కమిటీ హాలులో స్పీకర్ మధుసూదనాచారి సోమవారం ఉదయం 10.30కి ప్రారంభిస్తారని శాసన సభ కార్యదర్శి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం ఇంగ్లిష్ వెర్షన్‌లో మాత్రమే వెబ్‌సైట్ పనిచేస్తోంది. శాసన సభ ఉద్యోగులకు, శాసన సభ, మండలి సభ్యులకు ఉపయోగపడేలా కొత్త వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసన సభా వ్యవహారాల శాఖా మంత్రి హరీశ్‌రావు, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొంటారు.