విశ్వబ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి
Published Mon, Oct 3 2016 8:38 PM | Last Updated on Mon, Aug 20 2018 6:47 PM
సుల్తాన్‌బజార్: విశ్వ బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. విశ్వకర్మ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సోమవారం బొగ్గులకుంట విశ్వకర్మ బాయ్స్ హాస్టల్‌లో ఏర్పాటు చేసిన వంటశాల, గ్రంథాలయం భవనాలకు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వచ్చే బడ్జెట్ సమావేశాల్లో విశ్వ బ్రాహ్మణుల అభివృద్ధికి నిధులు కేటాయించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విశ్వకర్మల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. సంఘం అధ్యక్షులు వేణుగోపాల్ బృందం చేపడుతున్న కార్యక్రమాలకు తన సహకారం ఉంటుందన్నారు. అనంతరం స్పీకర్‌ను సంఘం ప్రతినిధులు ఎం. సంఘమేశ్వర్, వేణుగోపాల్ ఘనంగా సన్మానించారు.
Advertisement
Advertisement