Viswa Brahmin
-
సాయికుమారి అనే మహిళతో ఎలాంటి సంబంధం లేదు: తోలేటి శ్రీకాంత్
-
తనతో ఎలాంటి సంబంధం లేదు.. ఇది వారి కుట్రే: తోలేటి శ్రీకాంత్
సాక్షి, విజయవాడ: తనను పెళ్లి చేసుకొని మోసం చేశారంటూ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ తోలేటి శ్రీకాంత్‌పై సాయికుమారి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై శ్రీకాంత్ స్పందిస్తూ.. తనపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. సాయికుమారి అనే మహిళతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. గతంలో ఆమె చాలా మందిని ఇలానే బెదిరించి, డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలిందన్నారు. సాయికుమారి వెనుక ప్రతిపక్షాల రాజకీయ కుట్ర ఉందని అన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో అన్ని విషయాలను ఆధారాలతో సహా బయటపెడతానని శ్రీకాంత్ మీడియాకు వివరించారు. చదవండి: (శ్రీసత్యసాయి జిల్లా కదిరి ఎన్జీవో కాలనీలో ఉద్రిక్తత) -
విశ్వబ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి
సుల్తాన్‌బజార్: విశ్వ బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. విశ్వకర్మ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సోమవారం బొగ్గులకుంట విశ్వకర్మ బాయ్స్ హాస్టల్లో ఏర్పాటు చేసిన వంటశాల, గ్రంథాలయం భవనాలకు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వచ్చే బడ్జెట్ సమావేశాల్లో విశ్వ బ్రాహ్మణుల అభివృద్ధికి నిధులు కేటాయించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విశ్వకర్మల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. సంఘం అధ్యక్షులు వేణుగోపాల్ బృందం చేపడుతున్న కార్యక్రమాలకు తన సహకారం ఉంటుందన్నారు. అనంతరం స్పీకర్‌ను సంఘం ప్రతినిధులు ఎం. సంఘమేశ్వర్, వేణుగోపాల్ ఘనంగా సన్మానించారు.