అసెంబ్లీ వెబ్‌సైట్‌లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పేరును, చిత్రాలను తొలగించారు. ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం పేరు చోటుచేసుకుంది.
టీనగర్: అసెంబ్లీ వెబ్‌సైట్‌లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పేరును, చిత్రాలను తొలగించారు. ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం పేరు చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు విధించిన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రిగా ఓ. పన్నీర్ సెల్వం బాధ్యతలు చేపట్టారు. అయితే నెలరోజులు కావస్తున్నా అసెంబ్లీ వెబ్‌సైట్‌లో జయ చిత్రాలను, పేర్లను తొలగించలేదు. గత వారం శ్రీరంగం అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయినట్లు అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ ప్రకటించారు. దీన్ని గెజిట్‌లోనూ విడుదల చేశారు. ఇలావుండగా అసెంబ్లీ వెబ్‌సైట్‌లో జయ చిత్రాలను, పేర్లను మంగళవారం అధికారులు తొలగించారు. ఆ వెబ్‌సైట్‌లో జయకు సంబంధించిన వివరాలు కనుమరుగయ్యాయి.